![Bengal Chief Minister Mamata Banerjee Scathing Attack Warning To BJP - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/26/TMC.jpg.webp?itok=NmkVdWuI)
కోల్‌కతా: బెంగాల్ టీచర్ల రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో మంత్రి పార్థ చటర్జీని ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ... బీజేపీని ఉద్దేశిస్తూ...మహారాష్ట్రలో పాగా వేసింది. ఇక చత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ పై దృష్టి సారించి అధికారం చేజక్కించుకోవాలని ప్రయత్నిస్తోందంటూ బీజేపీపై ఆరోపణలు చేశారు.
అయినా మీరు ఇక్కడకు రావాలంటే... బంగాళాఖాతం దాటి రావాలి. మీరు ఇక్కడకు వచ్చేలోపే మొసళ్లు కొరుక్కుతినేస్తాయ్, సుందరబన్స్‌లోని రాయల్ బెంగాల్ టైగర్లు, ఏనుగులు మీపై దాడి చేస్తాయ్ అంటూ తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్థ ఛటర్జీ అడ్మిట్ అయిన ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రి దేశంలోనే నెంబర్ వన్ హస్పటల్ అయినప్పటికీ ఎందుకు అభ్యంతరం చెప్పారు.
పైగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్పత్రి (భువనేశ్వర్‌లోని ఆల్-ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)కే ఆయన్ను ఎందుకు తరలించారు?. అసలు మీ ఉద్దేశం ఏమిటని నిలదీశారు. ఇది ముమ్మాటికీ బెంగాల్ ప్రజలను అవమానపరచటేమే అంటు ఆక్రోశించారు. కేంద్రం మాత్రమే మంచిది రాష్ట్రాలన్నీ దొంగలా? అంటూ బీజీపీని ప్రశ్నించారు. రాష్ట్రాల వల్లే మీరు అక్కడ ఉన్నారు అంటూ మమతా గట్టి వార్నింగ్ ఇచ్చారు.
(చదవండి: బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు కరోనా.. ఐసోలేషన్‌కు తరలింపు)
Comments
Please login to add a commentAdd a comment