Mamata Banerjee Says Draupadi Murmu Is Next President Of India - Sakshi
Sakshi News home page

Mamata Banerjee: ద్రౌపది ముర్ము గెలుపు ఖాయమే...ముందుగా తెలిసి ఉంటే వేరుగా ఉండేది

Published Sat, Jul 2 2022 2:16 PM | Last Updated on Sat, Jul 2 2022 4:09 PM

Mamata Banerjee Says Droupadi Murmu Is Next President Of India  - Sakshi

న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపు ఖాయమని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అన్నారు. బహుశా ఆమె అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయ అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉండొచ్చు అని అన్నారు. అయినా బీజేపీ కూడా రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టే ముందు ప్రతి పక్షాలతో కూడా చర్చించి ఉండాల్సిందన్నారు. బీజేపీ ఈ విషయమై తనను సంప్రందించింది కానీ ఎవర్నీ నిలబెడుతున్నామనేది తనకు చెప్పలేదన్నారు. ఎన్డీఏ ఒక మైనారిటీ కమ్యూనిటీకి చెందిన గిరిజన మహిళను నామినేట్‌ చేస్తున్నారని తెలిసి ఉంటే తాను ఏకాభిప్రాయం గురించి ఆలోచించేదాన్ని అన్నారు.

తనకు గిరిజన మహిళల పట్ల గౌరవం ఉందన్నారు. అయితే బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్ అమిత్ మాల్వియా మాత్రం మమతా బెనర్జీ వైఖరి పై మండిపడుతున్నారు. ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి పోటీ చేస్తున్నారనిగా తెలిసే తృణమాల్‌ కాంగ్రెస్‌ విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హాను బరిలోకి దింపిందా? అని ప్రశ్నించారు. మమతా ముమ్మాటికి గిరిజన వ్యతిరేకి అని, సమర్థించుకోవడానికి ప్రయత్నించకండి అంటూ ట్విట్టర్‌ వేదికగా దీదీ పై ఆరోపణలు చేశారు.

యాదృచికంగా సిన్హా  జూన్‌21న తృణమూల్ కాంగ్రెస్‌కి రాజీనామా చేసి రాష్ట్రపతి ఎన్నికల కోసం ప్రతిపక్షాల అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ఆయన గతేడాది మార్చిలో టీఎంసీలో చేరారు. అదే రోజు తర్వాత బీజేపీ నేతృత్వంలోని అధికార ఎన్డీఏ రాష్ట్రపతి అత్యున్నతి పదవికి ద్రౌపది ముర్ముని నామినేట్‌ చేసింది. అదీగాక ఇప్పటికే జేడీయు, వైకాపా ముర్ముకి మద్దతు ప్రకటించాయి. దీంతో ద్రౌపది ముర్ముకి రోజురోజుకి మద్దతు పెరిగిపోతుంది. తాజాగా అకాలీదళ్ కూడా తన మద్దతు ముర్ముకేనని పేర్కొంది.

దీంతో మమతా రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్ము గెలిచే అవకాశాలే ఎక్కువుగా ఉన్నాయనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అయినప్పటికీ మమతా ప్రతిపక్షాల నిర్ణయం ప్రకారమే నడుచుకుంటానని స్పష్టం చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆమె పేరును ప్రకటిస్తున్నట్లు చెప్పి ఉంటే కచ్చితంగా ఆలోచించి ఉండేదాన్ని అని చెప్పారు. ఏదీఏమైన అందరీ ఏకాభిప్రాయంతో ఎన్నికైన వ్యక్తి రాష్ట్రపతి అభ్యర్థిగా ఉండటం మంచిదని మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు. విచిత్రమేమిటంటే.. పోటీలో ఉన్న ఇద్దరూ బీజేపీ పార్టీకి చెందిన మాజీ సభ్యులే కావడం విశేషం.

(చదవండి: యశ్వంత్‌ గెలుస్తారనే ఆశాభావం ఉంది.. మోదీపై సీఎం కేసీఆర్‌ ఫైర్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement