టీఎంసీ యువనేతపై కాల్పులు.. బైక్‌పై వచ్చి క్షణాల్లో.. | Miscreants Shot TMC Youth Leader West Bengal | Sakshi
Sakshi News home page

టీఎంసీ యువనేతపై కాల్పులు.. బైక్‌పై వచ్చి క్షణాల్లో..

Published Tue, Oct 25 2022 1:43 PM | Last Updated on Tue, Oct 25 2022 1:48 PM

Miscreants Shot TMC Youth Leader West Bengal - Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగణాలు జిల్లా భాట్‌పాడాలో మరోసారి హింస చెలరేగింది. టీఎంసీ యువనేత రాజ్‌ పాండేపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. అతను కాళీమాత పండల్‌లో పూజ ఏర్పాట్లు చేస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి ఈ దాడి చేశారు. ఆరు రౌండ్ల కాల్పులు జరిపి అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. 

రాజ్ పాండే చెతిలోకి ఓ బుల్లెట్ దూసుకెళ్లింది. స్థానికులు వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దుండగులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు.

దీపావళికి ముందు రోజు ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. అనంతరం ఈ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భాట్‌పాడాలో ఇటీవల తరచూ హింస చోటుచేసుకుంటోంది. ఈ ఘటనకు రెండు రోజుల ముందే మరో టీఎంసీ నేతపై దుండగులు తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. అతని శరీరంలోకి కూడా బుల్లెట్ దూసుకెళ్లింది.
చదవండి: ఓడలో భారీ అగ్నిప్రమాదం.. 14 మంది సజీవదహనం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement