కలకత్తా: పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ కేసుల్లో ప్రధాన నిందితుడు తృణమూల్ మాజీ నేత షేక్ షాజాహన్‌ను మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం(మార్చ్ 30) అరెస్టు చేసింది. సందేశ్‌ఖాలీలో భూములు కబ్జాలకు పాల్పడి మహిళలపై లైంగిక దాడులు చేసిన కేసులో షాజాహాన్‌ను సీబీఐ ఇప్పటికే అరెస్టు చేసింది.
ప్రస్తుతం బసిర్‌హట్ జైలులో ఉన్న షాజాహాన్‌ను మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ శనివారం జైలులోనే ప్రశ్నించింది. అనంతరం అరెస్టు చేసింది. షాజాహాన్‌ను కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఈడీ బసిర్‌హట్ కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
సందేశ్‌ఖాలీ ఆందోళనలకు కారణమయ్యారన్న కారణంతో టీఎంసీ షాజహాన్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. సందేశ్ ఖాలీలో షేక్ షాజహాన్ ఆగడాలకు వ్యతిరేకంగా ఉద్యమించన రేఖా పత్ర అనే మహిళకు బీజేపీ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ కూడా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment