కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సందేశ్‌ఖాలీ నిరసనలకు కారణమైన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత షేక్ షాజాహాన్‌పై కోల్‌కతా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. షాజహాన్ అరెస్టుపై ఎలాంటి తాము ఎలాంటి స్టే ఇవ్వలేదని స్పష్టం చేసింది. సుమోటోగా స్వీకరించిన ఈ కేసులో ఇంప్లీడ్ అవ్వాల్సిందిగా ఈడీ, సీబీఐ, పశ్చిమ బెంగాల్ హోం శాఖ కార్యదర్శిలను కోర్టు ఆదేశించింది.
రేషన్ స్కామ్‌లో షాజహాన్ ఇంట్లో సోదాల కోసం వచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)అధికారులపై జనవరి 5న దాడులు జరిగాయి. దాడులు జరిగినప్పటి నుంచి అతడు పరారీలోనే ఉన్నాడు. కాగా, షాజాహాన్ అరెస్టు హైకోర్టు పరిధిలో ఉందని, పోలీసుల చేతులను హైకోర్టు కట్టేసిందని టీఎంసీ ప్రధానకార్యదర్శి అభిషేక్ బెనర్జీ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో హైకోర్టు క్లారిటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment