ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నకిలీ ట్వీట్ ఆరోపణలపై తృణమాల్ కాంగ్రెస్ అధికారి ప్రతినిధి సాకేత్ గోఖలే అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సాకేత్ భారతీయ జనతాపార్టీ ఆదేశాల మేరకే తనను అరెస్టు చేసినట్లు ఈ రోజు ప్రకటించారు. ఐతే మోదీ తనను ఒక ట్వీట్ బాధించింది కానీ మోర్బీ బ్రిడ్జి ఘటనలో135 మంది అమాయకుల మృతి గురించి కాదని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
బీజేపీ ఆదేశాలతో మొదటి సారి అరెస్టు చేసినప్పుడు బెయిల్ పొందాను. ఆ తర్వాత మళ్లీ ఎన్నికల కమీషన్ కేసు దాఖలు చేసింది. అయినా మళ్లీ బెయిల్ పొంగలిగాను. అని చెప్పారు సాకేత్. ఎన్నికల కమిషన్ బీజేపీ మిత్రపక్షం అంటూ సాకేత్ విరుచుకుపడ్డారు. బీజేపీ యధేచ్ఛగా తప్పులు చేసుకుంటూ పోతోందని, అయినప్పటికీ తాను మరింత గట్టిగా బయటకు వస్తాను అని నొక్కి చెప్పారు. అలాగే అహ్మదాబాద్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైవ్వడానికి ముందుగా తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని అన్నారు. ఇంటిలిజెన్సీ బ్యూరో తనను ట్రాక్ చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
ఆ తర్వాత జైపూర్ విమానాశ్రయంలో అడ్డగించి సీఐఎస్‌ఎఫ్‌కి అరెస్టు చేయమని చెప్పారు. వేరే కేసు నిమిత్తం ఢిల్లీలో ఉన్న అహ్మదాబాద్ పోలీసులును జైపూర్‌కి తరలించి తనను అరెస్టు చేయమని చెప్పారని అన్నారు. తనను ఇబ్బందులకు గురిచేసిన ట్వీట్ గురించి ప్రస్తావిస్తూ...ఎవరో చేసిన ట్వీట్‌ను పంచుకున్నందుకు పెట్టిన పనికిమాలిన కేసు అని అన్నారు. ఇంతకీ ఆ షేర్ చేసిన ట్వీట్ పెట్టిన వ్యక్తి ఎవరో పోలీసులకు ఎలాంటి క్యూ దొరకలేదన్నారు.
తృణమాల్ నేత మళ్లీ మోర్బి ఘటన తెరపైకి తీసుకువచ్చారు. ఆ వంతెనను నిర్మించిన ఒరెవా కంపెనీ యజమానుల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో ఉండవు, అరెస్టులు చేయరు. కానీ తనను మాత్ర లక్ష్యంగా చేసుకుని జైలులో ఉంచేందుకు యత్నిస్తోందని ఆరోపణలు చేశారు సాకేత్. గుజరాత్, యూపీలు మోదీ అమిత్‌షాల డైరెక్షన్‌లో వ్యవహారిస్తాయంటూ విరుచుకుపడ్డారు. వాస్తవానికి గురువారం సాకేత్ బెయిల్ పొందిన కొన్ని గంటల తర్వాత గుజరాత్ పోలీసులు మళ్లీ సాకేత్‌ని మోర్బి పట్టణంలోని వంతెన కూలిపోవడానికి సంబంధించిన ట్వీట్ గురించి అరెస్టు చేయడం గమనార్హం.
(చదవండి: పోలీస్ స్టేషన్‌పై రాకెట్ లాంచర్ తరహా ఆయుధంతో దాడి..)
Comments
Please login to add a commentAdd a comment