bridge accident
-
ఇటలీలో బ్రిడ్జిపై నుంచి పడిన బస్సు..
వెనీస్: ఇటలీలోని వెనీస్ నగర సమీపంలో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న బస్సు అదుపు తప్పి, 50 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయింది. అనంతరం బస్సులో మంటలు చెలరేగడంతో 21 మంది ప్రయాణికులు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. వీరిలో 9 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల్లో ఎక్కువ మంది విదేశీ పర్యాటకులే. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలు ఆర్పేశారు. సహాయక చర్యలు ప్రారంభించారు. బస్సు ప్రమాదంలో 21 మంది మృతిచెందడం పట్ల వెనీస్ సిటీ మేయర్ బ్రుగ్నారో సంతాపం ప్రకటించారు. -
Russia-Ukraine War: క్రిమియా బ్రిడ్జిపై భారీ పేలుడు.. ఇద్దరి మృతి
క్యివ్: గతేడాది అక్టోబర్ నెలల్లో ట్రక్కు బాంబు పేలిన అదే బ్రిడ్జి మీద మరోసారి పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో ఒక జంట మృతి చెందగా వారి బిడ్డ మమ్మీ, డాడీ అంటూ రోదిస్తూ హృదయాలను ద్రవింపజేసింది. క్రిమియా నుండి రష్యాకు కనెక్టివిటీగా ఉన్న ఈ బ్రిడ్జి రష్యా యుద్ధం చేయడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించింది. 12 కిలోమీటర్ల పొడవున్న ఈ రోడ్డు కమ్ రైలు వంతెన రష్యా దళాలు వస్తూ పోతూ ఉండడానికి బాగా ఉపయోగపడింది. గత ఏడాది అక్టోబర్ నెలలో ఇదే బ్రిడ్జిపై ట్రక్కు బాంబు పేలిన విషయం తెలిసిందే. దీన్ని మరమ్మతులు చేసి పునరుద్ధరించడానికి నెలల సమయం పట్టింది. ఎట్టకేలకు రవాణా యధాతధంగా సాగుతున్న ఈ బ్రిడ్జి మీద మళ్ళీ పేలుడు సంభవించడం సంచలనంగా మారింది. ఈ ప్రమాదంలో ఒక జంట మృతి చెందారని వారి చిన్నారి మాత్రం చిన్న చిన్న గాయాలతో బయటపడిందని తెలిపారు పశ్చిమ రష్యాలోని బెల్గోరోడ్ గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్. బెల్గోరోడ్ నెంబర్ ప్లేటు ఉన్న వాహనం ఒకటి ఈ పేలుడుకు ప్రధాన కారణమని అన్నారు. రష్యా రవాణా మంత్రిత్వ శాఖ ఇది ముమ్మాటికీ ఉక్రెయిన్ చర్యేనని ఆరోపిస్తూ పేలుడుకి గల కారణాలను విచారిస్తున్నట్లు తెలిపింది. క్రిమియా గవర్నర్ సెర్జీ ఆక్సియోనోవ్ ఈ విషయాన్ని టెలిగ్రామ్ ద్వారా ధృవీకరించి రక్షణ చర్యలు చేపట్టామని తెలిపారు. బ్రిడ్జి 145 పిల్లర్ వద్ద పేలుడు సంభవించిందని, బ్రిడ్జి రహదారిపై విపత్తు నిర్వహణ సంస్థల వారు రక్షణ చర్యలు చేపట్టారని. వీలైనంత తొందరగా ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చేస్తామని తెలిపారు. ఇది కూడా చదవండి: పసిఫిక్ సముద్రంలో చిక్కుకుని.. 60 రోజుల పాటు ఒక్కడే.. -
పేకమేడలా కూలిన తీగల వంతెన.. వీడియో వైరల్
బిహార్:బిహార్‌లో నిర్మాణంలో ఉన్న అగువాని-సుల్తాన్ గంజ్ తీగల వంతెన పేకమేడలా కుప్పకూలిపోయింది. బాగల్‌పురాలో సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై సీఎం నితీష్ కుమార్ దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దాదాపు 3,160 మీటర్ల పొడవు ఉన్న నాలుగ లైన్ల తీగల వంతెనను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇందుకు రూ.1,710కోట్లను కేటాయించింది. 2014 ఫిబ్రవరి 23న నితీష్ కుమార్ దీనికి శంకుస్థాపన చేశారు. ఈ వంతెన రెండో సారి కూలిపోవడం గమనార్హం. ఎలాంటి మరణాలు సంభవించలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వాన్ని విమర్శించారు. నితీష్ నేతృత్వంలోని ప్రభుత్వం అవనీతిమయమైందని ఆరోపించారు. స్థానికంగా పాలన క్షీణిస్తున్నా.. ప్రతిపక్ష ఐక్యత గురించి సీఎం నితీష్ మాట్లాడుతారని ఆరోపించారు. ఘటనపై కమిషన్ నియమించడం రాజకీయ సంప్రదాయంగా మారిందని విమర్శించారు. Meanwhile in Bihar: The under-construction bridge collapsed. Total cost: ₹1750 crore pic.twitter.com/y4FPFsei5p — BALA (@erbmjha) June 4, 2023 ఈ బ్రిడ్జ్ సుల్తాన్ గంజ్, ఖగారియా, సహర్ష, మాదెపుర జిల్లాల మీదుగా ఎన్‌హెచ్-31, ఎన్‌హెచ్ 107కు కలపబడుతుంది. ఇదీ చదవండి:హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ నేతృత్వంలో మణిపూర్ అల్లర్లపై విచారణకు హోంశాఖ ఆదేశం -
ఆ ట్వీట్ గురించి కాదు..తృణమాల్ నేత బీజేపీపై ఫైర్
ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నకిలీ ట్వీట్ ఆరోపణలపై తృణమాల్ కాంగ్రెస్ అధికారి ప్రతినిధి సాకేత్ గోఖలే అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సాకేత్ భారతీయ జనతాపార్టీ ఆదేశాల మేరకే తనను అరెస్టు చేసినట్లు ఈ రోజు ప్రకటించారు. ఐతే మోదీ తనను ఒక ట్వీట్ బాధించింది కానీ మోర్బీ బ్రిడ్జి ఘటనలో135 మంది అమాయకుల మృతి గురించి కాదని ట్విట్టర్లో పేర్కొన్నారు. బీజేపీ ఆదేశాలతో మొదటి సారి అరెస్టు చేసినప్పుడు బెయిల్ పొందాను. ఆ తర్వాత మళ్లీ ఎన్నికల కమీషన్ కేసు దాఖలు చేసింది. అయినా మళ్లీ బెయిల్ పొంగలిగాను. అని చెప్పారు సాకేత్. ఎన్నికల కమిషన్ బీజేపీ మిత్రపక్షం అంటూ సాకేత్ విరుచుకుపడ్డారు. బీజేపీ యధేచ్ఛగా తప్పులు చేసుకుంటూ పోతోందని, అయినప్పటికీ తాను మరింత గట్టిగా బయటకు వస్తాను అని నొక్కి చెప్పారు. అలాగే అహ్మదాబాద్‌లో ఎఫ్ఐఆర్ నమోదైవ్వడానికి ముందుగా తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని అన్నారు. ఇంటిలిజెన్సీ బ్యూరో తనను ట్రాక్ చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఆ తర్వాత జైపూర్ విమానాశ్రయంలో అడ్డగించి సీఐఎస్ఎఫ్కి అరెస్టు చేయమని చెప్పారు. వేరే కేసు నిమిత్తం ఢిల్లీలో ఉన్న అహ్మదాబాద్ పోలీసులును జైపూర్‌కి తరలించి తనను అరెస్టు చేయమని చెప్పారని అన్నారు. తనను ఇబ్బందులకు గురిచేసిన ట్వీట్ గురించి ప్రస్తావిస్తూ...ఎవరో చేసిన ట్వీట్‌ను పంచుకున్నందుకు పెట్టిన పనికిమాలిన కేసు అని అన్నారు. ఇంతకీ ఆ షేర్ చేసిన ట్వీట్ పెట్టిన వ్యక్తి ఎవరో పోలీసులకు ఎలాంటి క్యూ దొరకలేదన్నారు. తృణమాల్ నేత మళ్లీ మోర్బి ఘటన తెరపైకి తీసుకువచ్చారు. ఆ వంతెనను నిర్మించిన ఒరెవా కంపెనీ యజమానుల పేర్లు ఎఫ్ఐఆర్లో ఉండవు, అరెస్టులు చేయరు. కానీ తనను మాత్ర లక్ష్యంగా చేసుకుని జైలులో ఉంచేందుకు యత్నిస్తోందని ఆరోపణలు చేశారు సాకేత్. గుజరాత్, యూపీలు మోదీ అమిత్‌షాల డైరెక్షన్లో వ్యవహారిస్తాయంటూ విరుచుకుపడ్డారు. వాస్తవానికి గురువారం సాకేత్ బెయిల్ పొందిన కొన్ని గంటల తర్వాత గుజరాత్ పోలీసులు మళ్లీ సాకేత్‌ని మోర్బి పట్టణంలోని వంతెన కూలిపోవడానికి సంబంధించిన ట్వీట్ గురించి అరెస్టు చేయడం గమనార్హం. (చదవండి: పోలీస్ స్టేషన్‌పై రాకెట్ లాంచర్ తరహా ఆయుధంతో దాడి..) -
వంతెన పైనుంచి పడ్డ ట్రక్కు
భావ్‌నగర్: పెళ్లి వేడుకలకు వెళ్తున్న ట్రక్కును మృత్యువు వెంటాడింది. అప్పటివరకు పెళ్లి కబుర్లతో ఆహ్లాదంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా భీతావహంగా మారింది. రక్తసిక్తమైన మృతదేహాలతో, క్షతగాత్రుల ఆర్తనాదాలతో మారుమోగింది. గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో ఓ వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి.. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ట్రక్కు బ్రిడ్జి నుంచి కిందికి పడిపోయింది. దీంతో 30 మందికిపైగా చనిపోయారు. మరో 30 మంది గాయాలపాలయ్యారు. అందులో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో నలుగురు చిన్నారులు, 8 మంది మహిళలు ఉన్నారు. 26 మంది ఘటనా స్థలిలోనే చనిపోయారని, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని రాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రదీప్ సింగ్ జడేజా తెలిపారు. ఉదయం 7:30–7:45 గంటల మధ్య ప్రమాదం జరిగిందని, జిల్లా అధికారులు, స్థానిక గ్రామాల ప్రజలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని చెప్పారు.‘బోతాడ్ జిల్లాలోని టోటమ్ గ్రామంలో పెళ్లికి హాజరయ్యేందుకు దాదాపు 60 మందితో అనిదా గ్రామం నుంచి ట్రక్కు బయలుదేరింది. భావ్‌నగర్–రాజ్‌కోట్ రహదారిపై రంగోలా వద్ద బ్రిడ్జిపై ముందు వెళ్తున్న వాహనాన్ని దాటబోయి.. అదుపుతప్పి కింద పడిపోయింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది’ అని జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ ఐఎం సయ్యద్ తెలిపారు. మరోవైపు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. -
చెరువులోకి దూసుకెళ్లిన కారు..8 మంది మృతి
జార్ఖండ్: ప్రయాణికులతో వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి బ్రిడ్జి రెయిలింగ్‌ని ఢీకొట్టి చెరువులోకి పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సడార్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం డంకా జిల్లాలోని లాగ్లా గ్రామ సమీపంలో జరిగింది. ప్రమాదానికి గురైన కారు రోజూ న్యూస్‌పేపర్లు తీసుకెళ్లే కారుగా గుర్తించారు. కారు బాగల్పూర్ నుంచి డంకా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. -
‘ఫూల్’ను ‘పూల్’లా అనుకోవడం వల్లే...
ముంబై: ‘ఫూల్ (పువ్వులు) పడిపోయాయి’ అన్న మాటలను ‘పూల్(వంతెన) పడిపోయింది’ అన్నట్లుగా అర్థం చేసుకోవడంతో ఎల్ఫిన్స్టన్ రైల్వే స్టేషన్‌లోని వంతెనపై పెను ప్రమాదం చోటు చేసుకుందని ప్రాణాలతో బయటపడ్డ ఓ యువతి వెల్లడించింది. బ్రిడ్జి పక్కన ఉన్న ఓ విక్రయదారుడు పూలు పడిపోయాయని ఏడుస్తుండటాన్ని ప్రయాణికులు తప్పుగా అర్థం చేసుకోవడంతో అక్కడ గందరగోళం నెలకొని తీవ్ర తొక్కిసలాట జరిగిందని చెప్పింది. ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు నియమించిన విచారణ కమిటీకి బాధితురాలు ఈ మేరకు వెల్లడించింది. ఇటీవల ముంబైలోని ఎల్ఫిన్స్టన్ స్టేషన్లో ఫుట్ఓవర్ బ్రిడ్జిపై తొక్కిసలాట జరిగి 23 మంది మరణించిన సంగతి తెలిసిందే. అలాగే ప్రమాదంలో గాయపడిన మరో విద్యార్థిని కూడా ఫూల్‌ను పూల్‌గా అనుకోవడంతోనే తొక్కిసలాట జరిగిందని తెలిపింది. -
మరో మూడు మృతదేహాల గుర్తింపు
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా మహద్ వద్ద సావిత్రి నదిపై ఉన్న వంతెన కొట్టుకుపోయిన ఘటనలో గాలింపుబృందాలు శుక్రవారం మరో మూడు మృతదేహాలను వెలికితీశాయి. దీంతో ఇంతవరకు లభించిన మృతదేహాల సంఖ్య 17కు చేరింది. బ్రిటిష్ కాలం నాటి ఈ వంతెన వరద ధాటికి కొట్టుకు పోవడంతో రెండు ఆర్టీసీ బస్సులతో పాటు అనేక ప్రైవేటు వాహనాలు నదిలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. వెలికి తీసిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి పంపించినట్లు అదనపు పోలీస్ సూపరింటెండెంట్ సంజయ్ పాటిల్ తెలిపారు. 20 బోట్లు, 160 మంది కోస్టుగార్డ్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చేపడుతున్నాయని పాటిల్ చెప్పారు. గాలింపు చర్యల్లో నది భౌగోళిక పరిస్థితులపై అవగాహన ఉన్న స్థానిక మత్స్యకారుల సహాయాన్ని కూడా తీసుకుంటున్నామన్నారు. ఘటనా స్థలానికి 120 కిలోమీటర్ల దూరంలో కొన్ని మృతదేహాలు లభ్యమైనట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు.