ముంబై: ‘ఫూల్ (పువ్వులు) పడిపోయాయి’ అన్న మాటలను ‘పూల్(వంతెన) పడిపోయింది’ అన్నట్లుగా అర్థం చేసుకోవడంతో ఎల్ఫిన్‌స్టన్ రైల్వే స్టేషన్‌లోని వంతెనపై పెను ప్రమాదం చోటు చేసుకుందని ప్రాణాలతో బయటపడ్డ ఓ యువతి వెల్లడించింది. బ్రిడ్జి పక్కన ఉన్న ఓ విక్రయదారుడు పూలు పడిపోయాయని ఏడుస్తుండటాన్ని ప్రయాణికులు తప్పుగా అర్థం చేసుకోవడంతో అక్కడ గందరగోళం నెలకొని తీవ్ర తొక్కిసలాట జరిగిందని చెప్పింది.
ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు నియమించిన విచారణ కమిటీకి బాధితురాలు ఈ మేరకు వెల్లడించింది. ఇటీవల ముంబైలోని ఎల్ఫిన్‌స్టన్ స్టేషన్‌లో ఫుట్‌ఓవర్ బ్రిడ్జిపై తొక్కిసలాట జరిగి 23 మంది మరణించిన సంగతి తెలిసిందే. అలాగే ప్రమాదంలో గాయపడిన మరో విద్యార్థిని కూడా ఫూల్‌ను పూల్‌గా అనుకోవడంతోనే తొక్కిసలాట జరిగిందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment