
వెనీస్: ఇటలీలోని వెనీస్ నగర సమీపంలో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న బస్సు అదుపు తప్పి, 50 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయింది. అనంతరం బస్సులో మంటలు చెలరేగడంతో 21 మంది ప్రయాణికులు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. వీరిలో 9 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
బాధితుల్లో ఎక్కువ మంది విదేశీ పర్యాటకులే. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలు ఆర్పేశారు. సహాయక చర్యలు ప్రారంభించారు. బస్సు ప్రమాదంలో 21 మంది మృతిచెందడం పట్ల వెనీస్ సిటీ మేయర్ బ్రుగ్నారో సంతాపం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment