Venice Grand Canal water turns green near Rialto Bridge: Viral Video - Sakshi
Sakshi News home page

వీడియో: వెనిస్‌ మిస్టరీ.. రాత్రికి రాత్రే రంగు మారిపోయింది!

Published Mon, May 29 2023 11:54 AM | Last Updated on Mon, May 29 2023 12:23 PM

Venice Grand Canal Colour Changed To Green Viral - Sakshi

వైరల్‌ న్యూస్‌: ఇటలీ నీటి నగరం వెనిస్‌లో ఆసక్తికర ఘటన ఒకటి జరిగింది. తేట నీరుతో టూరిస్టులను ఆకట్టుకునే అక్కడి గ్రాండ్‌ కెనాల్‌ నీటి రంగు.. రాత్రికి రాత్రే మొత్తం ఆకుపచ్చగా మారింది. ఆదివారం ఉదయం కాలువ రంగు మారిపోవడంతో అక్కడి ప్రజలంతా ఆశ్చర్యానికి గురయ్యారు. 

వెనెటో  రీజియన్‌ రాజధాని వెనిస్‌లో Grand Canal నీరు అసాధారణ రీతిలో ఆకుపచ్చ రంగులోకి మారిపోయింది. తెల్లవారు జామున రియాల్టో బ్రిడ్జి వద్ద తొలుత అది గమనించిన కొందరు స్థానికులు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని పోలీసులకు వెనెటో రీజియన్‌ ప్రెసిడెంట్‌ లూకా జాయియా ఆదేశించారు. మరోవైపు సోషల్‌ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి.

ఇక నీరు రంగు మారిన పరిణామం రకరకాల ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి. ఇది ఆల్గే(నాచు) వల్ల సంతరించుకుంది కాదని పరిశోధకులు ప్రకటించారు. దీంతో.. బహుశా ఎవరైనా నిరసకారులు లేదంటే ఆకతాయిలు ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా వాళ్లను కనిపెట్టే పనిలో పోలీసులు ఉన్నారు.

ఇదిలా ఉంటే.. వెనిస్‌ గ్రాండ్‌ కెనాల్‌ ఇలా రంగు మారడం ఇదే తొలిసారి కాదు. గతంలో.. 1968లో అర్జెంటీనా ఆర్టిస్ట్‌ నికోలస్‌ గార్సియా ఉద్దేశపూర్వకంగానే గ్రాండ్‌ కెనాల్‌లో ఫ్లూరెసెయిన్‌ అనే డైని కలిపారు. ఆ టైంలో వెనిస్‌ ఇంటర్నేషనల్‌ థియేటర్‌ ఫెస్టివల్‌ జరగాల్సి ఉండగా.. పర్యావరణ సమస్యలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో ఆ టైంలో ఆయన ఆ పని చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement