green
-
ఏఎమ్ గ్రీన్‌తో డీపీ వరల్డ్ భాగస్వామ్యం
గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియాను ఉత్పత్తి చేస్తున్న ఏఎమ్ గ్రీన్(AM Green) సుస్థిర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. గ్రీన్ ఇంధనాలు, రసాయనాల కోసం స్థిరమైన సరఫరా అందించేందుకు డీపీ వరల్డ్(DP World)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సహకారంతో డీకార్బనైజేషన్‌కు ప్రయత్నాలు జరుగుతాయని కంపెనీ తెలిపింది.ఇటీవల కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం రెండు కంపెనీలు తాజాగా భాగస్వామ్య పత్రాలపై సంతకాలు చేశాయి. ఏఎమ్ గ్రీన్, డీపీ వరల్డ్ సంయుక్తంగా ఈ పరిశ్రమలో లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నాయి. సంవత్సరానికి 1 మిలియన్ టన్నుల(MTPA) గ్రీన్ అమ్మోనియా, 1 ఎంటీపీఏ గ్రీన్ మిథనాల్‌ను ఎగుమతి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాయి. జీరో-కార్బన్ ఉద్గారాల కోసం యూరోపియన్ యూనియన్, యూఏఈలో అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయబోతున్నట్లు కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: మొబైల్ రీఛార్జ్ మరింత భారం కానుందా..?గ్రీన్ కో గ్రూప్ & ఏఎమ్ గ్రీన్ వ్యవస్థాపకుడు మహేష్ కొల్లి మాట్లాడుతూ..‘గ్రీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా ఎదగాలనే భారతదేశ ఆశయానికి కంపెనీ కట్టుబడి ఉంది. గ్రీన్ మాలిక్యూల్స్‌తో వాతావరణ కాలుష్యాన్ని కట్టడి చేయవచ్చు. ఈ పరిశ్రమలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించడానికి డీపీ వరల్డ్‌లో భాగస్వామ్యం కావడం సంతోషకరం. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మిథనాల్, ఇతర సుస్థిర ఇంధనాలను సమర్థవంతంగా ఎగుమతి చేయడానికి తోడ్పడుతుంది’ అన్నారు. డీపీ వరల్డ్ గ్రూప్ డిప్యూటీ సీఈఓ యువరాజ్ నారాయణ్ మాట్లాడుతూ..‘స్వచ్ఛమైన ఇంధనాలు, రసాయన ఉత్పత్తుల ఎగుమతిని సులభతరం చేయడానికి ఏఎమ్ గ్రీన్‌తో భాగస్వామ్యం కీలకం కానుంది’ అన్నారు. -
గ్రీన్ ఆర్మీ
ఉత్తరప్రదేశ్‌లో గతంలో ‘గులాబ్ గ్యాంగ్’ ఘనత విన్నాం. ఇప్పుడు ‘గ్రీన్ ఆర్మీ’. స్త్రీల మీద జరిగే దురాగతాలను స్త్రీలే ఉమ్మడిగా ఎదిరిస్తూ బాధితులకు బాసటగా నిలుస్తున్నారు. వారణాసిలో క్రియాత్మకంగా ఉన్న ‘గ్రీన్ ఆర్మీ’ మహిళా బృందాన్ని ప్రధాని మోదీ ఇటీవలి మన్‌కీ బాత్‌లో ప్రశంసించారు.వాళ్లంతా ఒక 50 మంది ఉంటారు. ఆకుపచ్చ చీరలో, చేతి కర్రతో వరుసగా నడుస్తూ ఊళ్లోకి వస్తారు. ఇక ఊళ్లోని మగాళ్లకు గుండె దడే. భార్యలను కొట్టేవాళ్లు, తాగుబోతులు, పేకాట రాయుళ్లు, మత్తు పీల్చేవాళ్ళు, కట్నం కోసం వేధించేవాళ్లు... ఎక్కడికక్కడ సెట్‌రైట్ కావాల్సిందే. ఎందుకంటే వారు ‘గ్రీన్ ఆర్మీ’. అందరి స్క్రూలు టైట్ చేసే ఆర్మీ. అందుకే మొన్నటి ‘మన్ కీ బాత్’లో వీరి గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ‘వీరి ఆత్మనిర్భరతకు, కృషికి అభినందనలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని తెలిపారు. దాంతో గ్రీన్ ఆర్మీలో కొత్త జోష్ వచ్చింది.వారణాసి చుట్టుపక్కలగ్రీన్ ఆర్మీ 2014లో పుట్టింది. బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్న రవి మిశ్రా వారణాసి చుట్టుపక్కల పల్లెల్లో ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ ఉత్తర జిల్లాలలో గృహ హింస ఎక్కువగా ఉందని గమనించాడు. స్త్రీలకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తే వారు ఆత్మరక్షణ చేసుకోగలరని అనుకున్నాడు. కొందరు విద్యార్థులతో కలిసి నిర్మలాదేవి అనే గృహిణిని గృహ హింసను ప్రతిఘటించమని కోరాడు. రైతు కూలీగా ఆమె సంపాదించేదంతా ఆమె భర్త లాక్కుని తాగేవాడు. కొట్టేవాడు. నిర్మాలా దేవి విద్యార్థుల స్ఫూర్తితో ఆత్మరక్షణ నేర్చుకుంది. అంతేకాదు గ్రామంలోని మరికొంతమందిని జమ చేసింది. అందరూ కలిసి ఇక గృహ హింసను ఏ మాత్రం సహించమని ఎలుగెత్తారు. అంతేకాదు.. కర్ర చేతబట్టి మాట వినని భర్తలకు బడితె పూజ చేశారు. నిర్మలాదేవి భర్త దారికొచ్చాడు. దాంతో గ్రీన్ ఆర్మీ పేరు వినపడసాగింది.270 పల్లెల్లో...వారణాసిలో, చుట్టుపక్కల జిల్లాల్లో ఇప్పుడు 270 గ్రామాల్లో గ్రీన్ ఆర్మీ ప్రతినిధులు ఉన్నారు. 2000 మంది స్త్రీలు ఇందులో భాగస్వాములు. ప్రతి ఊరిలో ఇరవై నుంచి యాభై మంది స్త్రీలు ఆకుపచ్చ చీరల్లో దళంగా మారి క్రమం తప్పక ఇంటింటికీ వెళ్లి సమస్యల ఆచూకీ తీస్తారు. వాటికి పరిష్కారాలు వెదుకుతారు. స్త్రీల మీద చెయ్యెత్తడం అనేది వీరు పూర్తిగా ఊళ్లల్లో నిర్మూలించారు. ఇక తాగుడు పరిష్కారం కోసం తాగుబోతులకు కౌన్సెలింగ్ ఇవ్వడంప్రారంభించారు. పేకాట, డ్రగ్స్కైతే స్థానమే లేదు. గ్రీన్ ఆర్మీతో స్థానిక పోలీస్ కాంటాక్ట్‌లో ఉంటుంది. ఎవరైనా గ్రీన్ ఆర్మీకి ఎదురు తిరిగితే పోలీసులు వచ్చి చేయవలసింది చేస్తారు. వరకట్న సమస్య ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా ఉంది. ‘మీకు కట్నం ఎందుకు ఇవ్వాలి... సరంజామా ఎందుకివ్వాలి’ అని గ్రీన్ ఆర్మీ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దాంతో గొంతెమ్మ కోరికలు పూర్తిగా తగ్గాయి. ఇచ్చింది పుచ్చుకుంటున్నారు.ఆడపిల్లే అదృష్టంకొన్ని జిల్లాల్లో ఇప్పటికీ ఆడపిల్ల పుడితే శోకం వ్యక్తం చేస్తారు. ఏడుస్తూ గుండెలు బాదుకుంటారు. కాని గ్రీన్ ఆర్మీ బయలుదేరి ఈ శోకానికి ముగింపు చెప్పింది.‘ఆడపిల్ల అంటే లక్ష్మీ అని ఇంటికి భాగ్యమనీ బాగా చదివిస్తే సరస్వతి అని, శక్తిలో దుర్గ అని... ఆడపిల్లను మగపిల్లాడితో సమానంగా చూడాల’ని ఇంటింటికి తిరిగి చైతన్యం కలిగించారు. ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లులకు రక్షణగా నిలబడ్డారు. ఇవన్నీ సాంఘికంగా చాలా మార్పు తెచ్చాయి. అందుకే ఒక్కరు కాకుండా సమష్టిగా ప్రయత్నిస్తే విజయాలు వస్తాయి. గ్రామీణ జీవితంలో స్త్రీలకు ఇంకా ఎన్నో ఆటంకాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. కర్రచేత బట్టి ఆర్మీగా మారకపోయినా స్త్రీలు సంఘాలు ఏర్పరుచుకుంటే సమస్యలు దూరం కాకపోవడం ఉండదు. గ్రీన్ ఆర్మీ ఇస్తున్న సందేశం అదే. -
గ్రీన్ హైడ్రోజన్.. గేమ్ చేంజర్!
హైడ్రోజన్ కార్లు.. బస్సులు.. రైళ్లు.. నౌకలు.. పరిశ్రమలు... ఇలా ప్రపంచమంతా ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ నామ జపం చేస్తోంది! పునరుత్పాదక ఇంధన రంగంలో గేమ్ చేంజర్‌గా అభివరి్ణస్తున్న గ్రీన్ హైడ్రోజన్ కోసం భారత్ కూడా వేట మొదలుపెట్టింది. దేశీ కార్పొరేట్ దిగ్గజాలైన రిలయన్స్, అదానీ గ్రూపులతో పాటు అవాడా, హైజెన్కో గ్రీన్ ఎనర్జీస్, థెర్మాక్స్ వంటి సంస్థలు ఈ రంగంలో ఇప్పటికే భారీ ప్రణాళికలతో చకచకా ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా ఈ నయా ఇంధనాన్ని వినియోగదారులకు చౌకగా అందించేందుకు ఉత్పాదక వ్యయాన్ని రెండింతలకు పైగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రస్తుతం దేశంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదక వ్యయం ఒక్కో కేజీకి 4–5 డాలర్లు (దాదాపు రూ.340–430)గా ఉంటోంది. అదే గ్రే హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చు 1–2 డాలర్లు (రూ.85–170) మాత్రమే. గ్రే హైడ్రోజన్ ఉత్పత్తి కాలుష్యకరమైనది కావడంతో ప్రపంచవ్యాప్తంగా దీనిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో కంపెనీలు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదక వ్యయాన్ని గణనీయంగా తగ్గించడంపై దృష్టిపెట్టాయి. సరికొత్త టెక్నాలజీలతో పాటు వినూత్న ఉత్పత్తులు, ఇతరత్రా మార్గాలను ఎంచుకుంటున్నాయి. 2030 నాటికి భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్దేశించుకున్న 50 లక్షల వార్షిక టన్నుల ఉత్పత్తి లక్ష్యం సాకారం కావాలంటే, ఉత్పాదక వ్యయాన్ని తగ్గించడం చాలా కీలకమని నిపుణులు పేర్కొంటున్నారు. టెక్నాలజీ దన్ను... గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదనలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో పాటు అధునాతన ఎనలిటిక్స్‌ను అవాడా గ్రూప్ ఉపయోగిస్తోంది. ‘అత్యాధునిక ఎలక్ట్రోలైజర్ టెక్నాలజీ వల్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం మెరుగుపడి, హైడ్రోజన్ ఉత్పత్తికి తక్కువ విద్యుత్ అవసరమవుతుంది. దీంతో వ్యయం భారీగా దిగొస్తోంది’ అని కంపెనీ చైర్మన్ వినీత్ మిట్టల్ పేర్కొన్నారు. హైజెన్కో సంస్థ అయితే, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), ఏఐతో పాటు మెషీన్ లెరి్నంగ్‌ను ఉపయోగించి గ్రీన్ హైడ్రోజన్, అమోనియా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుంటోంది. కంపెనీ ఒడిశాలోని గోపాల్‌పూర్‌లో 1.1 మిలియన్ టన్నుల సామర్థ్యంతో గ్రీన్ అమోనియా ప్రాజెక్టును నెలకొల్పే ప్రణాళికల్లో ఉంది. వెల్స్పన్ న్యూ ఎనర్జీ కూడా గ్రీన్ హైడ్రోజన్‌ను చౌకగా అందించేందుకు సౌర, పవన విద్యుత్‌తో పాటు బ్యాటరీల్లో స్టోర్ చేసిన విద్యుత్‌ను కూడా ఉపయోగిస్తోంది. అంతేకాకుండా పెద్దయెత్తున జల విద్యుత్‌ను కూడా వినియోగించే సన్నాహాల్లో ఉన్నట్లు కంపెనీ సీఈఓ కపిల్ మహేశ్వరి పేర్కొన్నారు. ఇక గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అవసరమైన మాడ్యూల్స్ తయారీ, విక్రయం, సరీ్వస్ కోసం థర్మాక్స్ బ్రిటన్‌కు చెందిన సెరెస్తో ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా దాని ఆక్సైడ్ ఎల్రక్టాలిసిస్ టెక్నాలజీని ఉపయోగించుకోనుంది. తక్కువ ఉష్ణోగ్రతతో కూడిన ఎలక్ట్రాలిసిస్ సాంకేతికతతో పోలిస్తే ఇది 25% మెరుగైనదని సంస్థ సీఈఓ ఆశిష్ భండారీ వెల్లడించారు.అంబానీ, అదానీ గిగా ఫ్యాక్టరీలుదేశంలో గ్రీన్ హైడ్రోజన్ సమగ్ర వ్యవస్థ (ఎకో సిస్టమ్) నెలకొల్పేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) 10 బిలియన్ డాలర్లను వెచి్చంచనుంది. 2030 నాటికి కేజీ గ్రీన్ హైడ్రోజన్‌ను ఒక డాలరుకే ఉత్పత్తి చేయాలనేది కంపెనీ లక్ష్యం. 2026 కల్లా తొలి ఎలక్ట్రోలైజర్ గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ తాజా ఏజీఎంలో ప్రకటించారు కూడా. ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచి, కొత్త తరం ఎలక్ట్రోలైజర్ల కోసం పెట్టుబడి వ్యయాలను తగ్గించుకోవడానికి అధునాతన ఎల్రక్టాలిసిస్ ఆధారిత టెక్నాలజీలను కూడా కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో దిగ్గజ సంస్థల్లో ఒకటిగా అదానీ న్యూ ఇండస్ట్రీస్‌ను తీర్చిదిద్దే సన్నాహాల్లో అదానీ గ్రూప్ నిమగ్నమైంది. 2030 నాటికి 10 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి తోడ్పడేలా సమగ్ర ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తోంది. తదుపరి పదేళ్లలో ఈ సామర్థ్యాన్ని 30 లక్షల టన్నులకు పెంచాలనేది అదానీ లక్ష్యం. ఈ వ్యవస్థలో గ్రీన్ అమోనియా, గ్రీన్ మిథనాల్, పర్యావరణానుకూల విమాన ఇంధనం వంటి పలు ఉత్పత్తులు ఉంటాయి. గ్రీన్ హైడ్రోజన్: ప్రకృతిలో అపారంగా దొరికే నీటిని పునరుత్పాదక ఇంధనాలైన సౌర, పవన, జల విద్యుత్‌ను ఉపయోగించి హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడగొడతారు. ఎలక్ట్రోలైజర్లో జరిపే ఈ ప్రక్రియను ఎల్రక్టాలిసిస్గా పేర్కొంటారు. ఉత్పత్తిలోనూ, వినియోగంలోనూ 100 శాతం పర్యావరణానుకూలమైనది కావడంతో దీనికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. దీన్ని నిల్వ చేయడం చాలా సులభం. అంతేకాకుండా, వాహనాల నుండి పరిశ్రమల వరకు అనేక అవసరాల కోసం వాడుకోవచ్చు. గ్రే హైడ్రోజన్: హైడ్రోజన్ ఉత్పత్తిలో ఇది అత్యంత సాధారణ ప్రక్రియ. స్టీమ్ మీథేన్ రిఫారి్మంగ్ (ఎస్ఎంఆర్) అనే ప్రక్రియలో సహజవాయువును ఉపయోగిస్తారు. తయారీలో గణనీయంగా కార్బన ఉద్గారాలను విడుదల చేయడం వల్ల దీనిపై వ్యతిరేకత నెలకొంది. వినియోగంలో మాత్రం 100% పర్యావరణ హితమైనదే. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
గ్రీన్‌ఫ్యూయల్ కొనుగోలు పూర్తి: లుమాక్స్
ముంబై: గ్రీన్‌ఫ్యూయల్ ఎనర్జీ సొల్యూషన్స్‌కు చెందిన ప్రత్యామ్నాయ ఇంధన బిజినెస్‌లో 60 శాతం వాటా కొనుగోలుని పూర్తి చేసినట్లు లుమాక్స్ రిసోర్స్ వెల్లడించింది. ఇందుకు రూ. 153 కోట్లకుపైగా వెచ్చించింది. నిధులను అంతర్గత వనరులు, రుణాల ద్వారా సమీకరించినట్లు కంపెనీ వెల్లడించింది.ఆటోమోటివ్ సిస్టమ్స్, విడిభాగాల తయారీ దిగ్గజం లుమాక్స్ ఆటో టెక్నాలజీస్‌కు సొంత అనుబంధ కంపెనీ లుమాక్స్ రిసోర్స్. తాజా ఈ కొనుగోలు ద్వారా లుమాక్స్ ఆటో టెక్నాలజీస్ సీఎన్జీ, హైడ్రోజన్ తదితర గ్రీన్, ఆల్టర్నేట్ ఇంధన విభాగాలలోకి ప్రవేశించనుంది. వీటికి పటిష్ట డిమాండ్ కారణంగా రానున్న కాలంలో అత్యుత్తమ వృద్ధిని అందుకోనున్నట్లు కంపెనీ పేర్కొంది. -
ఎన్టీపీసీ గ్రీన్ రూ. లక్ష కోట్ల పెట్టుబడి
ముంబై: ఐపీవో బాటలో ఉన్న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ 2026–27 నాటికి సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల్లో రూ.1 లక్ష కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. పెట్టుబడిలో 20 శాతం ఈక్విటీ రూపంలో రావాలంటే.. విస్తరణ కోసం రూ.20,000 కోట్ల సొంత నిధులు అవసరమవుతాయని సంస్థ సీఎండీ గుర్దీప్ సింగ్ వెల్లడించారు.రాబోయే ఐపీవో ద్వారా రూ.10,000 కోట్ల నిధులు వస్తాయని అన్నారు. కంపెనీ అంతర్గత వనరుల ద్వారా మిగిలిన మొత్తాన్ని సేకరించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ ఏజెన్సీల నుండి కంపెనీ మెరుగైన క్రెడిట్ రేటింగ్‌ను పొందుతోందని, ఇది పోటీ కంపెనీలతో పోల్చినప్పుడు తక్కువ రేట్లతో రుణాన్ని అందుకునేందుకు వీలు కల్పిస్తుందని సింగ్ చెప్పారు. ఇతర విభాగాల్లోకీ ఎంట్రీ.. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ కేవలం విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే పరిమితం కాకూడదని, గ్రీన్ హైడ్రోజన్, పంప్డ్ స్టోరేజ్ పవర్, ఎనర్జీ స్టోరేజీ విభాగాల్లో ఎంట్రీపై కూడా ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన చెప్పారు. దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్‌ను నెలకొల్పడానికి విశాఖపట్నం సమీపంలోని 1,200 ఎకరాల భూమిని చాలా సంవత్సరాల క్రితం ఎన్టీపీసీ తీసుకుంది. ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని సింగ్ వెల్లడించారు. 2027కల్లా 19,000 మెగావాట్లు.. ప్రస్తుతం 3,220 మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ.. 2025 మార్చికి 6,000 మెగావాట్లకు, 2026 మార్చి నాటికి 11,000 మెగావాట్లకు, 2027 మార్చి కల్లా 19,000 మెగావాట్లకు సామర్థ్యాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 11,000 మెగావాట్లకు సమానమైన ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని సింగ్ వెల్లడించారు.నవంబర్ 19 నుంచి ఐపీవో.. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీవో నవంబర్ 19న ప్రారంభమై 22న ముగుస్తుంది. ఒక్కొక్కటి రూ.102–108 ప్రైస్ బ్యాండ్‌తో రూ.10,000 కోట్ల వరకు విలువైన తాజా షేర్లను జారీ చేయడానికి కంపెనీ ప్రణాళిక చేస్తోంది. ఇన్వెస్టర్లు కనీసం 138 షేర్లతో కూడిన లాట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంతకు మించి వాటాలు కావాల్సినవారు మరిన్ని లాట్స్‌కు బిడ్లు వేసుకోవచ్చు.ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 75 శాతం, నాన్–ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 10 శాతం వాటాలు కేటాయిస్తారు. అర్హత కలిగిన కంపెనీ ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.5 డిస్కౌంట్‌ను ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఆఫర్ చేస్తోంది. ఉద్యోగుల కోటాకై రూ.200 కోట్ల విలువైన షేర్లను కేటాయించారు. హ్యుండై మోటార్ ఇండియా, స్విగ్గీ తర్వాత ఈ ఏడాది మూడవ అతిపెద్ద ఐపీవోగా ఇది నిలవనుంది. -
గ్రీన్ డ్రెస్‌లో బుల్లితెర భామ తేజస్విని అందాలు (ఫొటోలు)
-
Karisma Kapoor: బాలీవుడ్ బ్యూటీ సీరియల్ లుక్స్.. గ్లామర్ మాత్రం (ఫొటోలు)
-
గ్లోయింగ్ స్కిన్ కోసం..నటి భాగ్యశ్రీ గ్రీన్ జ్యూస్ ట్రై చేయండి!
బాలీవుడ్ నటి భాగ్యశ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైనే ప్యార్ కియా వంటి మూవీలో మంచి హిట్లను అందుకుని తన నటనతో వేలకొద్ది అభిమానులకు చేరువయ్యింది. వివాహ బంధంతో సినిమాలకు దూరంగా ఉన్నా..అంతే గ్లామర్ మెయింటైన్ చేస్తున్న నటి భాగ్యశ్రీ. ఎప్పుడూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లతో సరికొత్త వంటకాలను షేర్ చేసుకుంటుంటారు. ప్రస్తుతం తాజగా కాంతి వంతమైన చర్మం కోసం సరికొత్త హెల్తీ జ్యూస్‌తో మన ముందుకు వచ్చింది భాగ్యశ్రీ. బచ్చలి, కొత్తిమీర, సెలెరీ, ఉసిరికాయలతో చేసిన గ్రీన్ జ్యూస్ గురించి చెప్పుకొచ్చారు. ఇది చర్మం ఆరోగ్యంలో కీలకపాత్ర పోషించడమే కాకుండా కాంతివంతంగా ఉంచుతుందని చెప్పారు. గ్రీన్ జ్యూస్‌తో కలిగే లాభాలు..ఉదయమే ఒక గ్లాస్లు ఈ గ్రీన్ జ్యూస్ చర్మాన్ని మెరుస్తూ ఉంచుతుంది. అలాగే శరీరానికి కావాల్సిన గట్ బ్యాక్టీరియాని ప్రోత్సహించి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. బచ్చలికూరలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. పైగా చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. దీనిలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇక కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట గుణాలు ఉంటాయి. ఇవి గట్ ఆరోగ్యాన్ని, జీవక్రియను ప్రోత్సహిస్తాయి. ఇందులో కాల్షియం, పోటాషియం, మెగ్నీషియం, సెలీనియం వంటి ఖనిజాలు ఉంటాయి. అవి చర్మాన్ని ప్రకాశవంతంగా ఉండేలా చేస్తాయి. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. వృద్ధాప్య వ్యతిరేక లక్షణాలను కూడా కలిగి ఉంది. తయారీ..నటి భాగ్యశ్రీ బచ్చలికూర, కొత్తిమీర, సెలెరీ, ఉసిరికాయ తదితరాలను మిక్క్లో వేసి మెత్తగా జ్యూస్ అయ్యేలా చేయాలి. ఆ తర్వాత చక్కగా వడకట్టుకుంటే చాలు గ్రీన్ జ్యూస్ రెడీ. దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే మంచి పోషకాలు అందడమేగాక ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలుగుతారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Bhagyashree (@bhagyashree.online) (చదవండి: 'ప్రపంచంలోనే తొలి ఏఐ డ్రెస్'!..ఏకంగా రోబోటిక్ పాములతో..) -
గ్రీన్ డ్రెస్‌లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
-
సమ్మర్ హీట్‌కి ఈ ఆటో డ్రైవర్ భలే చెక్ పెట్టాడు!
ఈ ఏడాది సమ్మర్ మొదలవ్వక మునుపే ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. అయినప్పటికీ ఏదో ఒక పని మీద బయటకు వెళ్లకుండా పని అవ్వదు. అలాంటి తరుణంలో ఓ ఆటో డ్రైవర్ ఎండ నుంచి రక్షణ కోసం చేసిన ఆలోచన నెటిజన్లు ఫిదా అయ్యారు. వాట్ ఐడియా బాస్ అంటూ అతడిపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.ఏం చేశాడంటే..?మనసుంటే మార్గం ఉంటుందన్న రూటులో సరికొత్తగా ఆలోచించాడు ఈ ఆటో డ్రైవర్. ఈ ఎండలకు ఏసీ కారు లాంటివి తప్ప సాధారణ బస్సు, ఆటోల్లో ప్రయాణించడం మహా కష్టం. ముఖ్యంగా ఆటోలో ఎడపెడా వేడి గాల్పు కొట్టేస్తుంది. అందుకని ఈ డ్రైవర్ ఆటో చుట్టూతా చక్కగా కవర్ అయ్యేలా మటితో నింపిన గోను ఏర్పాటు చేసి గడ్డి నాట్లు వచ్చేలా చేశాడు.దీంతో ఆటోలో కూర్చొన్న వాళ్లకు మండే ఎండలో చల్లటి వెన్నెల్లో ఉన్న పీల్ కలుగుతుంది. ఆటోలో సహజసిద్ధమైన ఏసీ కదూ ఇది..!నిజంగా ఈ డ్రైవర్ ఆలోచనకు హ్యాట్సాప్ అని చెప్పకుండా ఉండలేం కదూ..!. మొత్తం పల్లె పచ్చదనాన్ని ఆటోతో పట్నంలోకి తీసుకొచ్చాడేమో..! అన్నంత అందంగా ఉంది కదూ ఆ డ్రైవర్ ఐడియా..! View this post on Instagram A post shared by WAHED MIRZA (@wahed_mirza8639) -
గ్రీన్ టపాసులూ హానికరమే? అధ్యయనంలో ఏం తేలింది?
కోర్టులు, ప్రభుత్వాలు పర్యావరణ అనుకూల గ్రీన్ క్రాకర్స్‌ను ప్రోత్సహిస్తున్నాయి. అయితే తాజా అధ్యయనాల్లో గ్రీన్ క్రాకర్స్‌కు సంబంధించిన 63 శాతం నమూనాలలో బేరియంతో పాటు ఇతర ప్రమాదకరమైన రసాయన మూలకాలు ఉన్నాయని తేలింది. ఇవి మన ఆరోగ్యానికి అత్యంత హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీపావళి వేడుకలు సమీపిస్తున్న సమయంలో వెల్లడైన ఈ అధ్యయనం టపాసుల విక్రేతల ఉత్సాహాన్ని చల్లార్చేలా ఉంది. ఈ తరహా గ్రీన్ క్రాకర్స్ విక్రయాలను నిలిపివేయాలని ఈ అధ్యయనం చేపట్టిన సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. సీఎస్ఐఆర్ నీరి అధికారిక గ్రీన్ లోగోతో మార్కెట్లోకి విడుదల చేసిన టపాసులు తక్కువ కాలుష్యాన్ని వెదజల్లుతాయని ఆ సంస్థలు చెబుతున్నాయి. ప్రభుత్వేతర సంస్థలు, ఆవాజ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో గ్రీన్ టపాసులలో బేరియం, ఇతర ప్రమాదకరమైన రసాయన మూలకాలు ఉన్నట్లు తేలింది. ఇవి మనిషి ఆరోగ్యాన్ని హరింపజేస్తాయి. దేశవ్యాప్తంగా బేరియం వ్యాపింపజేసే పటాకులను నిషేధించారు. సాంప్రదాయ బాణసంచాలో వెలువడే మెటల్ ఆక్సైడ్ బేరియం అనేది శబ్ద కాలుష్యంతోపాటు కళ్ళు, ముక్కు, గొంతు, చర్మం ఊపిరితిత్తులకు హాని కలిగిస్తుంది. ఇది కూడా చదవండి: ఆకాశానికి నిచ్చెనొద్దు.. చంద్రునికి తాడు బిగించి.. -
ఇది గ్రీన్ పాలిటిక్స్ యుగం!
క్లైమెట్ పాటు పొలిటికల్ క్లైమెట్ కూడా గుణాత్మకంగా మారుతోంది. నిన్న మొన్నటి వరకు తోక పార్టీలుగా ఉన్న గ్రీన్ పార్టీలు ఇప్పుడు ప్రపంచ రాజకీయాలను మలుపు తిప్పే దశకు ఎదిగే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు నిపుణులు. పర్యావరణ చైతన్యంతో కూడిన ప్రజాస్వామిక రాజకీయాలతో పాటు శాంతి, అహింస, సామాజిక న్యాయంతో కూడిన సమాజం కోసం గ్రీన్ పార్టీలు కలలు కంటున్నాయి. ఈ క్లైమెట్ ఎమర్జెన్సీ కాలంలో పారిశ్రామిక దేశాల రాజకీయాల తోపాటు మన రాజకీయాలు కూడా పర్యావరణ కేంద్రంగా ఇకనైనా మారేనా? పర్యావరణ సమస్యలపై సాంఘిక ఉద్యమాలు నిర్మించే సంఘాలు, సంస్థలే కాలక్రమంలో గ్రీన్ రాజకీయ పార్టీలుగా మారుతున్నాయి. యూరప్, అమెరికా ఖండాల్లోని సంపన్న దేశాల్లో ఎక్కువగా గ్రీన్ పార్టీలు పుట్టుకు రావటమే కాదు ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి కూడా. 1960వ దశకంలో రాడికల్ సోషల్ యాక్టివిస్టులు, ముఖ్యంగా విద్యార్థుల నిరసనోద్యమాలు.. 1970–80 దశకాల్లో అణ్వాయుధ వ్యతిరేక ఉద్యమాల నుంచి తొలినాటి గ్రీన్ పార్టీలు ఆవిర్భవించాయి. ప్రధాన స్రవంతి రాజకీయాల్లో ముఖ్యంగా యూరోపియన్ దేశాల్లో గ్రీన్ పార్టీలకు ప్రాధాన్యం పెరుగుతూ వస్తోంది. కీలకమైన పార్లమెంటరీ స్థానాల్లో గెలుపొందటమే కాదు ముఖ్యమైన ప్రభుత్వ పదవులను సైతం చేపడుతుండటం విశేషం. క్లైమెట్ ఛేంజ్ వల్ల పర్యావరణ విపత్తులు గతమెన్నడూ ఎరుగని రీతిలో విరుచుకు పడుతున్న ప్రస్తుత తరుణంలో సంప్రదాయ రాజకీయ పార్టీల కూసాలు కదులుతుండగా గ్రీన్ పార్టీలకు ప్రజల్లో అంతకంతకూ ప్రాధాన్యం పెరుగుతోంది. 1972 నుంచి గ్రీన్ పార్టీల పుట్టుక తొలి రెండు గ్రీన్ పార్టీలు ఆస్ట్రేలియా (ద యునైటెడ్ తస్మానియా గ్రూప్), న్యూజిలాండ్ (ద వాల్యూస్ పార్టీ)లలో 1972లో ఏర్పాటయ్యాయి. 1973లో యునైటెడ్ కింగ్డమ్లో పీపుల్ (తర్వాత ద ఎకాలజీ పార్టీగా మారింది) పార్టీ పుట్టింది. 1979లో గ్రీన్ పార్టీ ఆఫ్ జర్మనీ రిజిస్టరైంది. 250 పర్యావరణ సంఘాలను ఏకం చేసి హెర్బర్ట్ గ్రూల్, పెట్రా కెల్లీ ఈ పార్టీని నెలకొల్పారు. 1983లో జాతీయ ఎన్నికల్లో ఈ పార్టీ ప్రతినిధి తొలుత గెలుపొందారు. 1998 నుంచి 2005 వరకు సోషల్ డెమోక్రటిక్ పార్టీతో కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది. 2021 ఎన్నికల్లో అపూర్వమైన రీతిలో 15% ఓట్లు గెల్చుకుంది. గ్రీన్ పార్టీ అంటే..? ఫక్తు ఆధిపత్య రాజకీయాలకే పరిమితం కాకుండా పర్యావరణవాదం, సామాజిక నాయ్యం, అహింస తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించే రాజకీయ పార్టీలే గ్రీన్ పార్టీలు. సాధారణంగా ఇవి సోషల్ డెమోక్రటిక్ ఆర్థిక విధానాలను అనుసరిస్తూ వామపక్ష పార్టీలతో జత కడుతూ ఉంటాయి. ‘గ్లోబల్ గ్రీన్స్’ సమాచారం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 87 గ్రీన్ పొలిటికల్ పార్టీలున్నాయి. ఈ పార్టీలన్నీ కలిసి 2001లో గ్లోబల్ గ్రీన్స్ పేరిట సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నాయి. బ్రస్సెల్స్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థలో 87 గ్రీన్ రాజకీయ పార్టీలతో పాటు, 9 పర్యావరణ సంస్థలు కూడా సభ్యులుగా ఉన్నాయి. 12 మంది సభ్యులు గల స్టీరింగ్ కమిటీకి బాబ్ హలె, గ్లోరియా పొలాంకో 2020 నుంచి కన్వీనర్లుగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా సురేశ్ నాటియాల్ 2019లో నెలకొల్పిన ‘ఇండియా గ్రీన్స్ పార్టీ’కి కూడా ఈ సమాఖ్యలో సభ్యత్వం ఉంది. గ్లోబల్ గ్రీన్స్‌లోని పార్లమెంటేరియన్ నెట్‌వర్క్‌లో ప్రపంచవ్యప్తంగా విస్తరించిన 400కి పైగా గ్రీన్ పార్లమెంటు సభ్యులు టచ్‌లో ఉన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో 1992లో బ్రెజిల్‌లోని రియో డి జనీరో నగరంలో జరిగిన గ్రీన్ పార్టీల తొలి అంతర్జాతీయ సమావేశం గ్లోబల్ గ్రీన్స్ ప్రకటనను వెలువరించాయి. ‘గ్రీన్ పొలిటికల్ పార్టీలకు ప్రజలు ఓట్లు వేసినప్పుడే పర్యావరణ సమస్యలపై ప్రభుత్వాలు సీరియస్‌గా స్పందిస్తున్నాయని అనుభవాలు చెబుతున్నాయ’ని ఈ ప్రకటన పేర్కొంది. ఈ నేపథ్యంలో 2001లో తొలి ‘గ్లోబల్ గ్రీన్ పార్టీల కాంగ్రెస్’ కాన్బెర్రాలో జరిగింది. ఆ కాంగ్రెస్‌లోనే ‘గ్లోబల్ గ్రీన్స్ ఛార్టర్’ పేరిట పూర్తిస్థాయి ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించాయి. ఆ తర్వాత 2012లో డకర్లో, 2017లో లివర్‌పూల్‌లో గ్రీన్ పార్టీల కాంగ్రెస్‌లు జరిగాయి. ఈ ఏడాది ఆగస్టులో దక్షిణ కొరియాలో జరిగిన కాంగ్రెస్‌లో గ్లోబల్ గ్రీన్స్ చార్టర్ అప్డేట్ చేశారు. 6 మూల సూత్రాలు పర్యావరణ జ్ఞానం, సాంఘిక న్యాయం, భాగస్వామ్య ప్రజాస్వామ్యం (పార్టిసిపేటరీ డెమోక్రసీ), అహింస, సుస్థిరత, వైవిధ్యానికి గౌరవం.. ఇవీ గ్లోబల్ గ్రీన్ పార్టీల మేనిఫెస్టోలో పేర్కొన్న ఆరు మూల సూత్రాలు. ‘భూమి జీవ శక్తి, వైవిధ్యం, సౌందర్యం మీద ఆధారపడి మనం జీవిస్తున్నాం. వీటిని అంతరింపజేయకుండా, వీలైతే మెరుగుపరిచి, మన తరువాతి తరానికి అందించడం మన బాధ్యత’ అని దీని పీఠికలో తొలి వాక్యం చాటి చెబుతోంది. ‘పౌరులందరికీ తమ అభిప్రాయాలను వ్యక్తీకరించే హక్కు ఉన్న ప్రజాస్వామ్యం కోసం కృషి చేస్తాం. వారి జీవితాలను ప్రభావితం చేసే పర్యావరణ, ఆర్థిక, సామాజిక, రాజకీయ నిర్ణయాలలో ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు. స్థానిక, ప్రాంతీయ సమాజాలలో అధికారం, బాధ్యతలు కేంద్రీకృతమై ఉంటాయి. ఉన్నత స్థాయి పాలనకు అవసరమైన చోట మాత్రమే అధికారం, బాధ్యతలు పంపిణీ అవుతాయి..’ అని చార్టర్ భాగస్వామ్య ప్రజాస్వామ్యానికి భాష్యం చెప్తోంది. చారిత్రక బాధ్యత యూరప్, అమెరికా ఖండాల్లోని పారిశ్రామిక దేశాలు చాలా దశాబ్దాలుగా అతిగా కర్బన ఉద్గారాలను వెలువరిస్తూ భూగోళాన్ని అతిగా వేడెక్కిస్తూ పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. ఈ పనికి చారిత్రక బాధ్యతను సంపన్న దేశాలు ఇప్పటికైనా స్వీకరించాలి. భూతాపంతో వెల్లువెత్తుతున్న విపత్తులతో అన్ని దేశాలూ అతలాకుతలం అవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఇది మరీ స్పష్టమైపోయింది. అయితే, చేయని తప్పునకు పెను నష్టానికి గురవుతున్న అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలను నష్ట నివారణ సాంకేతికతను, నగదు తోడ్పాటును అందించి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ, ప్రస్తుతానికి యూరప్, అమెరికా ఖండాలకే పరిమితమైన పర్యావరణ చైతన్యంతో కూడిన రాజకీయాలు ఈ ‘క్లైమెట్ ఎమర్జెన్సీ’ కాలంలో మనకు కూడా అవసరమే అనటంలో అతిశయోక్తి ఇసుమంతైనా లేదు. – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: ఈగలతో ప్రొటీన్ల సేద్యం! వ్యర్థాలకు చెక్..ఆదాయానికి ఆదాయం!) -
సహారా ఎడారిలో పచ్చదనం? వేల ఏళ్లకు కనిపించే దృశ్యం?
జీవం ఉనికితో పాటు భూమి ఇతర గ్రహాలకు చాలా భిన్నమైనది. ఇక్కడి వాతావరణం మారుతూ ఉంటుంది. కొన్ని లక్షల సంవత్సరాలలో వాతావరణం తీరుతెన్నులు సంపూర్ణంగా మారుతుంటాయి. ఇలాంటి మార్పులు ఇతర గ్రహాలలో చాలా అరుదుగా కనిపిస్తాయి. ఒకప్పుడు సహారా ఎడారిగా పచ్చగా ఉండేదనడానికి కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. అయితే ఇలాంటి మార్పు ఎలా సంభవించిందో ఇప్పటివరకు శాస్త్రవేత్తలు తెలుసుకోలేకపోయారు. అయితే తాజా పరిశోధన దీనిపై కొంత క్లారిటీని తీసుకువచ్చింది. ఎడారిలో నదులు, సరస్సులు ఆఫ్రికాలోని సహారా ఎడారి 92 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి. కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి ఇది ఇది ఆకుపచ్చగా మారుతుంది. అప్పుడు ఇక్కడ నీటిపై ఆధారపడే జంతువులు, సవన్నా మైదానాలు, నదులు, సరస్సులు కనిపిస్తాయి. నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురితమైన అధ్యయనంలో సహారా ఎడారిలో ఎప్పుడు తడి కాలాలు సంభవిస్తాయి? దీనికి సూర్యుని చుట్టూ తిరిగే భూమి కక్ష్య ఎలాంటి పాత్రను పాత్ర పోషిస్తుందో వివరించారు. భారీ పర్యావరణ మార్పులలో ఇదొకటి సహారాలో మంచు యుగం ప్రభావం కూడా కనిపించింది. బ్రిస్టల్, హెల్సింకి విశ్వవిద్యాలయానికి చెందిన వాతావరణ శాస్త్రవేత్త ఎడ్వర్డ్ ఆర్మ్‌స్ట్రాంగ్ విడుదల చేసిన ఒక ప్రకటనలో.. సహారా ఎడారిని సవన్నాలేదా ఫారెస్ట్‌గా మార్చే ప్రక్రియ భూమిపై అత్యంత అద్భుతమైన పర్యావరణ మార్పులలో ఒకటని పేర్కొన్నారు. ఈ సంఘటనలు ఎప్పుడు, ఎలా జరిగాయో వెల్లడించడానికి ఆఫ్రికాలో క్లైమేట్ మోడలింగ్ అధ్యయనం జరిగిందన్నారు. ఇటువంటి మార్పులు అనివార్యం చరిత్రలో సహారా ఎడారి పచ్చగా మారుతుందనే వాదనకు మద్దతు ఇచ్చే అనేక ఆధారాలు అందుబాటులో ఉన్నాయి. ఈ అధ్యయనంలో ఈ పచ్చదన ప్రక్రియ సూర్యుని చుట్టూ భూమి కక్ష్యలోని ప్రీసెషన్ ప్రక్రియ ద్వారా నిర్ణయమవుతుందని సూచించారు. భూమి కొన్నిసార్లు దాని సొంత అక్షం మీద కదలినప్పుడు సంభవించే మార్పుల కారణంగా భూమిపై ఏర్పడే రుతువులు దాదాపు ప్రతి 21 వేల కాలచక్రాలకు ప్రభావితం అవుతాయి. ఫలితంగా వర్షపాత పరిస్ధితులు ఏర్పడి ఆఫ్రికా రుతుపవనాలు నియంత్రితమవుతాయి. ఫలితంగా సహారాలో పచ్చదనం వ్యాపిస్తుంది. ప్రతి 21 వేల సంవత్సరాలకు.. ఉత్తర ఆఫ్రికాలో ప్రతి 21 వేల సంవత్సరాలకు విపరీత వాతావరణమార్పులు సంభవిస్తాయని, వీటిని భూమి తిరిగే కక్ష్య నిర్ణయిస్తుందనేది నిర్ధారించడానికి ఈ అధ్యయనంలో క్లిష్టమైన వాతావరణ నమూనాలను ఉపయోగించారు. ఈ మార్పు ఉత్తర అర్ధగోళంలో, పశ్చిమ ఆఫ్రికాలో రుతుపవన వ్యవస్థ శక్తిని మరింతగా పెంచుతుంది. ఫలితంగా సహారాలో వర్షపాతం విస్తృతంగా వ్యాపిస్తుంది. దీంతో ఎడారిలో పచ్చదనం కనిపిస్తుంది. 12 వేల ఏళ్ల తరువాత.. ఈ అధ్యయనంలో కనుగొన్న ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే.. ఉత్తర ఆఫ్రికాలోని తేమతో కూడిన ప్రాంతాలు విపరీత వాతావరణమార్పులకు అంతగా గురికావు. ఎందుకంటే అక్కడి మంచు పలకలు అధిక అక్షాంశాలలో వ్యాపిస్తాయి. ఈ షీట్లు వాతావరణాన్ని చల్లబరుస్తాయి. ఫలితంగా రుతుపవనాల ప్రభావం కనిపించదు. సహారాలో సుమారు 5000 సంవత్సరాల క్రితం వరకు పచ్చదనం ఉండేది. ఇది భూమి కక్ష్య యొక్క వంపు 24.1 డిగ్రీలుగా మారిన సమయంలో జరిగింది. ప్రస్తుతం భూమి వంపు 23.5 డిగ్రీలలో ఉంది. అంటే ఇప్పుడు సహారాలో తదుపరి మార్పు సుమారు 12 వేల సంవత్సరాల తర్వాత కనిపిస్తుంది అప్పుడు మనం సహారా ఎడారి పచ్చగా మారడాన్ని చూడగలుగుతాం. ఇది కూడా చదవండి: కెనడాలో చోరీ, అఫ్రికాలో ప్రత్యక్ష్యం.. ఈ కార్లు ఎలా వస్తున్నాయబ్బా? -
తుక్కు కేంద్రాలను కూడా ప్రారంభించండి
న్యూఢిల్లీ: ఆటోమొబైల్స్ డీలర్లు.. వాహనాల తుక్కు కేంద్రాలను కూడా ప్రారంభించాలని కేంద్ర రహదారులు, హైవేస్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం అనుమతులు ఇస్తుందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాలు, బయోఫ్యుయల్ వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, అలాగే హరిత హైడ్రోజన్ ఉత్పత్తిలో భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కూడా కృషి చేస్తోందని మంత్రి వివరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ ఉందని అయిదో ఆటో రిటైల్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి తెలిపారు. 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్ ఎదగడంలో ఆటో డీలర్లు కీలక పాత్ర పోషించగలరని పేర్కొన్నారు. ప్యాసింజర్ వాహనాల తయారీలో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉన్న భారత్.. వాణిజ్య వాహనాల తయారీలో ఆరో స్థానంలో ఉందన్నారు. దేశాన్ని టాప్ ఆటోమొబైల్ హబ్‌గా తీర్చిదిద్దడం తన కల అని ఆయన చెప్పారు. -
గ్రీన్ హైడ్రోజన్‌కు అదానీ జేవీ
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ తాజాగా జపాన్ దిగ్గజం కోవా గ్రూప్‌తో చేతులు కలిపింది. సమాన వాటా(50:50)తో భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేసింది. తద్వారా జపాన్, తైవాన్, హవాయ్ మార్కెట్లలో గ్రీన్ హైడ్రోజన్ విక్రయాలను చేపట్టనుంది. రానున్న దశాబ్ద కాలంలో దేశీయంగా సమీకృత గ్రీన్ హైడ్రోజన్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే 50 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికలు ప్రకటించింది. దీనిలో భాగంగా తొలి దశలో మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి తెరతీయనుంది. తదుపరి దశలో సామర్థ్యాన్ని 3 మిలియన్ టన్నులకు పెంచనుంది. ఈ బాటలో తాజాగా సింగపూర్ అనుబంధ సంస్థ ద్వారా కోవా హోల్డింగ్స్ ఏషియా పీటీఈతో జేవీని నెలకొలి్పంది. వెరసి గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్, వీటి డెరివేటివ్ అమ్మకాలు, మార్కెటింగ్ చేపట్టనుంది. శుద్ధ ఇంధన తయారీకి హైడ్రోజన్ ఉపయోగపడనుంది. ప్రధానంగా రిఫైనింగ్, కెమికల్ రంగాలలో వినియోగిస్తారు. అదానీ ఇప్పటికే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన కంపెనీగా ఆవిర్భవించింది. గుజరాత్, ముంద్రా సెజ్‌లోని సోలార్ మాడ్యూల్ తయారీ సామర్థ్యాలను వార్షికంగా 10 గిగావాట్లకు పెంచుకునే ప్రణాళికల్లో ఉంది. ఇక్కడ మెటలర్జికల్ గ్రేడ్(ఎంజీ) సిలికాన్, పాలీసిలికాన్, ఇన్గాట్స్, వేఫర్స్, సెల్స్ తదితరాలను రూపొందించేందుకు వీలుంది. వీటిని సౌర ఇంధనం ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టే ప్రక్రియలో వినియోగిస్తారు. -
ఆకాశంలో అద్భుతం.. ఆకుపచ్చ కాంతిలో ఉల్కపాతం
అంకారా: టర్కీలో శనివారం రాత్రి అద్భుత దృశ్యం అవిష్కృతమైంది. నిప్పలు చిమ్ముతూ నేలరాలాల్సిన ఉల్కపాతం.. గ్రీన్‌కలర్‌లో కాంతిని వెదజల్లుతూ భూమి వైపుకు దూసుకొచ్చింది. గుముషానే ప్రావిన్స్‌లోని ఎర్జురం నగరం ప్రాంతానికి వచ్చే సరిగి గ్రీన్ కలర్ రంగులో కాంతిని వెదజల్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. A large green meteor was spotted blazing through the sky in Turkey moments ago. Wow. pic.twitter.com/eQEYLG2ihB — Nahel Belgherze (@WxNB_) September 2, 2023 టర్కీలో రాత్రిపూట అంతా ప్రశాంతంగా ఉండగా.. ఒక్కసారిగా ఆకాశంలో నుంచి ఉల్కపాతం సంభవించింది. అయితే.. అది గ్రీన్ కలర్ రంగులో కాంతిని వెదజల్లింది. ఈ దృశ్యాలను చూపుతున్న వీడియోలో ఓ బాలుడు బెలూన్‌తో ఆడుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోను నహెల్ బెల్గెర్జ్ తన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా షేర్ చేశారు. Green meteor lights up the sky over Turkey on Saturday.pic.twitter.com/Y89ORYz6CP — Science girl (@gunsnrosesgirl3) September 3, 2023 అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ప్రకారం అంతరిక్షంలో దుమ్ము, దూళి కణాలు కలిగిన శిలలు భూవాతావరణంలో కిందికి పడిపోయినప్పుడు భారీ స్థాయిలో కాంతిని వెదజల్లుతాయి. అతి వేగంగా భూమి వైపుకు ప్రయాణిస్తాయి. అయితే.. తాజాగా టర్కీలో సంభవించిన ఘటనపై అధికారులు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ ఇవ్వలేదు. గత వారంలో కొలరాడోలోనూ ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. తెల్లవారుజామున 3.30 సమయంలో ఉల్కలు నెలరాలాయి. Malatya, Erzurum, Elazığ, Gaziantep, Diyarbakır ve çevre illerden görülen büyük ve çok parlak bir göktaşı düşüşü gözlemlendi. İşte o anlar... ☄️👀 #göktaşı #meteor #malatya #erzincan #elazığ #gaziantep #malatya #erzurum pic.twitter.com/lDWTYGzAZM — Hava Forum (@HavaForum) September 2, 2023 ఇదీ చదవండి: Plane Crash: సంతోషంగా పార్టీ.. అందరూ చూస్తుండగా కళ్ల ముందే ఘోర ప్రమాదం! -
‘గ్రీన్’ ప్రాజెక్టులకు రెడ్ కార్పెట్
సాక్షి, అమరావతి: వాతావరణ కాలుష్య రహిత, నాణ్యమైన విద్యుత్తు అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న చర్యలతో రాష్ట్రం గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం (హబ్)గా అవతరిస్తోంది. తరిగిపోతున్న శిలాజ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా, పెరుగుతున్న వాతావరణ కాలుష్యానికి విరుగుడుగా స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగంలోకి తేవడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో ఏపీ భాగం అవుతోంది. ఈ ప్రాజెక్టు కోసం గతేడాది కేంద్రం ఎంపిక చేసిన ఐదు రాష్ట్రాల్లో మన రాష్ట్రం కూడా ఉంది. దీనికి అనుగుణంగా గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా పాలసీ 2023ని రాష్ట్రం రూపొందించింది. తాజాగా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) తయారు చేసిన నివేదిక శ్వేత పత్రాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. అందులోని వివరాలను ‘ఎన్ఆర్ఈడీసీఏపీ’ వీసీ, ఎండీ ఎస్.రమణారెడ్డి ‘సాక్షి’ ప్రతినిధికి వెల్లడించారు. సమగ్రంగా శ్వేతపత్రం రాష్ట్ర ప్రభుత్వం సౌర, పవన విద్యుత్ వంటి స్వచ్ఛ ఇంధనాన్ని ప్రోత్సహిస్తోంది. హైబ్రిడ్ వ్యవస్థగా చెబుతున్న పంప్డ్ హైడ్రో స్టోరేజి ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపడుతోంది. ప్రస్తుతం రాష్ట్రానికి 9 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి స్థాపిత సామర్థ్యం ఉంది. అనేక ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో సౌర, పవన, పంప్డ్ హైడ్రో సిస్టం ప్రాజెక్టులు 24 గంటలూ విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. కొత్త టెక్నాలజీల ఆవిర్భావం, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ వంటి వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకుంటోంది. తద్వారా రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ రంగంలో 10 బిలియన్ డాలర్ల నుంచి 15 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులకు అవకాశాలున్నాయి. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు మౌలిక సదుపాయాలు ఉన్నాయి. రాష్ట్ర అవసరాలతోపాటు ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ను ఎగుమతి చేయడానికి అవసరమైన గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్రం అనుకూలంగా ఉంది. రాష్ట్రంలో ఏటా 400 కిలో టన్నుల దేశీయ హైడ్రోజన్ డిమాండ్ ఉంది. దేశ పారిశ్రామిక హైడ్రోజన్ డిమాండ్‌లో ఇది దాదాపు 8 శాతం. ప్రతి ఏటా పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా పాలసీ 2023 ప్రకారం 2030 నాటికి కనీసం 500 కిలో టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుంది.దీని సాయంతో శిలాజ ఇంధన వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలని(డీకార్బనైజ్) భావిస్తోంది. ఇందుకోసం యాక్సిలరేటింగ్ స్మార్ట్ పవర్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ ఇండియా (ఆస్పైర్) ప్రోగ్రామ్ కింద ఫారిన్, కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ సాయంతో ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ హైడ్రోజన్ ఇన్వెస్ట్మెంట్ అవకాశాల నివేదిక సిద్ధం చేసింది. రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం వ్యాపారాలకు, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం, పర్యావరణ వ్యవస్థలపై ‘వైట్‌పేపర్’లో వివరించారు. ఇది పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అభివృద్ధి కార్యకలాపాలను ప్రోత్సహించడానికి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర సంసిద్ధంగా ఉందని శ్వేతపత్రంలో పొందుపరిచారు. కేంద్రం ఎంచుకున్న ఐదు రాష్ట్రాల్లో ఏపీ ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో ఐదు జాతీయ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లు ఏర్పాటు చేయాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. వీటిని 25 గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ క్లస్టర్లుగా విభజించి, వివిధ రంగాలకు ఉపయోగించుకునేలా ప్రణాళికలు రూపొందించింది. మొదటి తరం జాతీయ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులుగా పిలుస్తున్న వీటిలో పన్నెండు రసాయనాలు, రిఫైనరీ, ఉక్కు పరిశ్రమలలోని పారిశ్రామిక డీ–కార్బనైజేషన్ ప్రాజెక్టులు కాగా మూడు భారీ రవాణా ప్రాజెక్టులు, మరో మూడు సిటీ గ్యాస్ డ్రిస్టిబ్యూషన్ (సీజీడీ) ప్రాజెక్టుల్లో హైడ్రోజన్–బ్లెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. మిగిలిన ఏడు ప్రాజెక్టులు మునిసిపాలిటీల్లో వ్యర్థాల నుండి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసేవి. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో వీటి ద్వారా 2025 నాటికి 150 మెగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యానికి గ్రీన్ హైడ్రోజన్ పాలసీతో ఏపీ జీవం పోసింది. -
మార్కెట్లో దూసుకుపోతున్న భారత్: ఈ నంబర్ ప్లేట్ల గురించి తెలుసా?
జపాన్ను అధిగమించి భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆటోమోటివ్ మార్కెట్‌గా అవతరించింది. దేశీయంగా వివిధ విభాగాలలో వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో అమెరికా, చైనా తరువాత భారత్ ప్రముఖంగా నిల్తుస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోని వాహనాల రక రకాల నెంబర్ ప్లేట్స్, ఎందుకు ఉపయోగిస్తారు? తెలుసుకుందాం! సాధారణంగా వాహనాలపై డిఫరెంట్ కలర్స్ గల నెంబర్ ప్లేట్స్ మనం చూస్తూ ఉంటాం. పలు రంగలుల్లో, ముఖ్యంగా గ్రీన్ కలర్లో ఉండే నెంబర్ ప్లేట్లను ఎపుడైనా చూశారా? తెలుగు, పసుపు, ఆకుపచ్చ, నీలం, ఎరుపు రంగుల నెంబర్ ప్లేట్లు భారతదేశంలో ఉపయోగిస్తారు? అలాగే ప్రతి వాహనం ఒక ప్రత్యేక గుర్తింపుతో ఉంటుంది. ప్లేట్‌పై లాటిన్ అక్షరాలు , అరబిక్ నెంబర్లు బొమ్మల కలయికతో ఉంటాయి. ఎక్కువగా వైట్ నెంబర్ ప్లేట్స్ పై బ్లాక్ లెటర్స్, పసుపు రంగు బోర్డు పై నల్ల అక్షరాలు లెటర్స్ మాత్రమే చూస్తూ ఉంటాం కానీ ఇంకా కొన్ని రకాల నెంబర్ ప్లేట్లు కూడా ఉన్నాయి. తెల్లని నంబర్ ప్లేట్ ఇది భారతదేశంలో కనిపించే అత్యంత సాధారణ లైసెన్స్ ప్లేట్ రకం. రిజిస్ట్రేషన్ వివరాలు తెలుపు , నలుపు రంగులో ముద్రించబడతాయి. ఈ రకమైన రిజిస్ట్రేషన్ ప్లేట్ ప్రైవేట్ లేదా వాణిజ్యేతర వాహనాలపై కనిపిస్తుంది. అద్దెకు తీసుకోవడం లేదా సరుకు రవాణా వంటి వాణిజ్య ప్రయోజనాల కోసం దీనిని ఉపయోగించలేరు. పసుపు నంబర్ ప్లేట్ తేలికపాటి మోటారు వాహనాలకు ఇవి వర్తిస్తాయి. ఈ వాహనాలు ప్రైవేట్ వాహనాల కంటే భిన్నమైన పన్ను ప్లేట్స్ కలిగి ఉంటాయి. ఇంకా, అటువంటి వాహనాల డ్రైవర్లు తప్పనిసరిగా కమర్షియల్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి. రెడ్ నంబర్ ప్లేట్ తాత్కాలికి రిజిస్ట్రేషన్ ప్లేట్. తెలుపు అక్షరాలతో ఎరుపు నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ వివరాలు టెంపరరీని సూచిస్తుంది. RTO రిజిస్ట్రేషన్ ద్వారా శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్‌ను పొందే వరకు భారతదేశంలో రెడ్ నంబర్ ప్లేట్ ఉంటుంది. అయితే, రెడ్ నంబర్ ప్లేట్ ఒక నెల మాత్రమే చెల్లుబాటు అవుతుంది. చాలా రాష్ట్రాలు ఇలాంటి వాహనాలను తమ రోడ్లపైకి అనుమతించవు. ఆకుపచ్చ నంబర్ ప్లేట్ మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV)లకు బాగా ఆదరణ పెరుగుతోంది. ఈవీలకు కేటాయించే నెంబర్ ప్లేట్ గ్రీన్లోఉంటుంది. అందుకే దేశంలో గ్రీన్ నంబర్ ప్లేట్లు పెరుగుతున్నాయి. తెలుపు అక్షరాలతో ఉన్న అన్ని EVలు ప్రైవేట్ వాహనాలకు వర్తిస్తాయి. అయితే పసుపు అక్షరాలు ఉన్నవి కమర్షియల్ EVలకు ప్రత్యేకం. బ్లూ నంబర్ ప్లేట్ విదేశీ డిప్లొమేట్స్ వారు ఉపయోగించే వాహనాలకు వైట్ లెటర్స్‌తో బ్లూ నెంబర్ ప్లేట్స్ ను అందజేస్తారు. ఇటువంటి నంబర్ ప్లేట్లు ప్రధానంగా మూడు కోడ్లలో దేనినైనా కలిగి ఉంటాయి- CC (కాన్సులర్ కార్ప్స్), UN (యునైటెడ్ నేషన్స్), లేదా CD (కార్ప్స్ డిప్లొమాటిక్). రాష్ట్ర కోడ్‌ను ప్రదర్శించడానికి బదులుగా, ఈ నంబర్ ప్లేట్లు దౌత్యవేత్తకు సంబంధించిన దేశ కోడ్‌ను తెలుపుతాయి. పైకి సూచించే బాణంతో నంబర్ ప్లేట్ ఇటువంటి నంబర్ ప్లేట్లు ప్రత్యేకంగా సైనిక ప్రయోజనాల కోసం వాడతారు. రక్షణ మంత్రిత్వ శాఖ క్రింద నమోదవుతాయి. మొదటి లేదా రెండవ అక్షరం తర్వాత పైకి చూపే బాణాన్ని బ్రాడ్ బాణం అంటారు. బాణం తర్వాత వచ్చే అంకెలు వాహనం కొనుగోలు చేసిన సంవత్సరాన్ని సూచిస్తాయి. తదుపరిది బేస్ కోడ్, దాని తర్వాత క్రమ సంఖ్య. సీరియల్ నంబర్ తర్వాత వచ్చే చివరి అక్షరం వాహనం తరగతిని సూచిస్తుంది. మిలిటరీ వెహికల్ నంబర్ ప్లేట్ భారతదేశ అశోకా చిహ్నంతో కూడిన నంబర్ ప్లేట్లు భారత రాష్ట్రపతి లేదా రాష్ట్రాల గవర్నర్లకు మాత్రమే ప్రత్యేకం. బ్లాక్ నంబర్ ప్లేట్ పసుపు అక్షరాలతో నలుపు రంగు నంబర్ ప్లేట్ సాధారణంగా విలాసవంతమైన హోటల్‌కు సంబంధించి లగ్జరీ కార్లకు కేటాయిస్తారు. అలాంటి వాహనాలను డ్రైవర్ కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండనవసరం లేకుండానే వాణిజ్య వాహనాలుగా పరిగణిస్తారు. భారత్ సిరీస్ వివిధ రాష్ట్ర కోడ్లతో పాటు, ఒక సాధారణ పౌరుడు తన వాహనం కోసం 'BH' లేదా భారత్ సిరీస్ లైసెన్స్ ప్లేట్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల ప్రభుత్వ రంగ ఉద్యోగులు, అలాగే నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలలో కార్యాలయాలు ఉన్న సంస్థల ప్రైవేట్ రంగ ఉద్యోగులు కూడా BH సిరీస్ నంబర్ ప్లేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. BH-సిరీస్-వాహనం-రిజిస్ట్రేషన్ వాహనం యజమాని కొత్త రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి మకాం మార్చినప్పుడు, వాహనాన్ని తిరిగి నమోదు చేయడంలో ఉన్న ఇబ్బందులను తొలగించడం ద్వారా అంతర్-రాష్ట్ర చలనశీలతను సులభతరం చేయడానికి ఈ నంబర్ ప్లేట్ తీసుకొచ్చారు. -
సాక్షి మనీ మంత్రా: తేరుకున్న సెన్సెక్స్, నిఫ్టీ.. లాభాలతో ముగింపు
Today stockmarket closing: దేశీయ స్టాక్ మార్కెట్లు తేరుకున్నాయి. సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల బాట పట్టాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 347 పాయింట్ల లాభంతో 66,508 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ కూడా 94 పాయింట్ల లాభంతో 19,740 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, టెక్ మహీంద్ర, టాటా స్టీల్, టీసీఎస్ సంస్థల షేర్లు లాభాలను అందుకోగా కోటక్ మహీంద్ర, బజాజ్ ఫైనాన్స్, హిందూస్థాన్ యూనిలివర్, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్ సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న పూర్తి వీడియో చూడండి.. -
రాష్ట్రంలో స్వచ్ఛ ఇం‘ధనం’
సాక్షి, అమరావతి: గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అనుకూలమైన రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ ఎంపికైంది. స్వచ్ఛ ఇంధనం ఉత్పత్తికి అవసరమైన అన్ని వనరులు ఉండటం, ఇందుకోసం రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పాలసీని తేవడంతో కీలకమైన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు రాష్ట్రానికి రానున్నాయి. వీటి ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రాష్ట్రాభివృద్ధికి మరింతగా చేయూతనిస్తాయి. ప్రకృతి పరిరక్షణకు ప్రపంచ దేశాలు చేసుకున్న ఒప్పందంలో భాగంగా మన దేశంలో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కొత్త పథకాలు, పాలసీలు తెస్తున్నాయి. వాటి ద్వారా ఈ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశంలో 4.5 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర పభుత్వం టెండర్లు పిలిచింది. ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఏపీ సహా 10 రాష్ట్రాలు అనుకూలమని తేలి్చంది. దీంతో త్వరలోనే రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ‘సైట్’తో ప్రోత్సాహకాలు ఏటా 125 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనంతో పాటు 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సాధించాలనే లక్ష్యంతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ని కేంద్రం తీసుకువచ్చింది. ఇందులో భాగంగా, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే పరిశ్రమలకు ఆర్థిక తోడ్పాటునందించడానికి స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ (సైట్) పథకాన్ని గత నెలాఖరులో ప్రవేశపెట్టింది. ఉత్పత్తిదారులకు ఆ ర్థికంగా చేయూతనందించేందుకు రూ.19,744 కోట్లు కేటాయించింది. 2029–30 వరకు ఈ పథకం అమలులో ఉంటుంది. తొలి ఏడాది రూ.4,440 కోట్లు, రెండో ఏడాది రూ.3,700 కోట్లు, మూడో ఏడాది రూ.2,960 కోట్లు, నాలుగో ఏడాది రూ.2,220 కోట్లు, ఐదో ఏడాది రూ.1,480 కోట్లు చొప్పున ఆరి్ధక ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఏపీ సొంత పాలసీ రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ఉత్పత్తిని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక పాలసీని రూపొందించింది. ఈ ఏడాది కేంద్రం పాలసీని తేవడానికి ఒక రోజు ముందే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పాలసీని తీసుకొచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్ డిమాండ్ ఏడాదికి దాదాపు 0.34 మిలియన్ టన్నులు (ఎంటీ) ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రానున్న ఐదేళ్లలో సంవత్సరానికి 0.5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్, 2 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక మిలియన్ టన్ను గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయగలిగితే 12 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేసింది. ఈ పాలసీ ఐదేళ్లపాటు లేదా కొత్త పాలసీ జారీ అయ్యే వరకు అమలులో ఉంటుంది. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్‌ని ఉపయోగించడం ద్వారా నీటి నుంచి గ్రీన్ హైడ్రోజన్ లేదా గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేయాలనుకునే డెవలపర్లు ఈ పాలసీ పరిధిలోకి వస్తారు. ఈ పాలసీ అమలుకు న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వ విధానం, ప్రోత్సాహకాలతో రాష్ట్రానికి తప్పకుండా ప్రాజెక్టులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు ♦ ప్రాజెక్టు ప్రారంభించిన తేదీ నుంచి ఐదేళ్లపాటు గ్రీన్ హైడ్రోజన్ అమ్మకంపై డెవలపర్లకు స్టేట్ జీఎస్టీలో 100 శాతం తిరిగి చెల్లింపు ♦గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తికి ఉపయోగించే పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుకు వాణిజ్య ఆపరేషన్ తేదీ నుంచి ఐదేళ్ల పాటు విద్యుత్ సుంకంపై 100 శాతం మినహాయింపు ♦ ఇంట్రాస్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీల్లో 25 శాతం రీయింబర్స్మెంట్ ♦ క్రాస్–సబ్సిడీ సర్‌చార్జి ఐదేళ్లు వెనక్కు ♦ ప్రాజెక్టుకు భూమిని ప్రభుత్వమే నోడల్ ఏజెన్సీ ద్వారా నామ మాత్రపు ధరకు లీజుగా కేటాయింపు ♦ భూ వినియోగ మార్పిడి ఛార్జీలు, స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు -
గ్రీన్ ఫైనాన్స్ వ్యవస్థ పటిష్టం కావాలి..
ముంబై: గ్రీన్ ఫైనాన్స్ (వాతావరణ పరిరక్షణకు దోహదపడే పరిశ్రమలకు ప్రోత్సాహకంగా రుణాలు) వ్యవస్థ మరింత పటిష్టం కావాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వరరావు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పర్యవేక్షణ, కార్యాచరణ ప్రణాళికల రూపకల్పన, ప్రమాణాల అభివృద్ధికి ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్‌ల మధ్య సమన్వయం అవసరమని అన్నారు. ఆయా అంశాలకు సంబంధించి కొన్ని అవరోధాలు ఎదురైనా, వాటిని ఎదుర్కొనడానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు. వాతావరణ పరిరక్షణ అంశాల్లో ఆర్బీఐ పాత్ర గురించి ఇక్కడ జరిగిన ఒక చర్చా గోష్ఠిలో ఆయన ప్రసంగించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనమిక్ ఫోరమ్ ఈ చర్చాగోష్ఠిని నిర్వహించాయి. న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమం వివరాలను ఆర్బీఐ విడుదల చేసింది. రాజేశ్వర రావు ప్రసంగంలో ముఖ్యాంశాలు... కొత్త గ్రీన్ వెంచర్లకు ఆర్థిక సహాయం చేయడం మాత్రమే సరిపోదు. ఇప్పటికే ఉన్న ఉద్గార సంస్థలు ఉత్పత్తి లేదా వృద్ధి అంశాలపై రాజీ పడకుండా విశ్వసనీయమైన వాతావరణ అనుకూల పరివర్తన ప్రణాళికలను రూపొందించుకొని, అనుసరించాల్సిన అవసరం ఉంది. ఇందుకు ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకుల సహాయ సహాయసహకారాలు, కార్యాచరణ ప్రణాళికలు అవసరం. ఇది గ్రీన్ ఫైనాన్స్ మార్కెట్లో పారదర్శకత, ప్రామాణీకరణ, సమగ్రతను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. సంవత్సరాలుగా గ్రీన్ ఫైనాన్స్ కార్యక్రమాలను ప్రోత్సహించడానికి, వాటికి మద్దతు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంక్ వివిధ విధాన చర్యలు తీసుకుంటోంది. ఉదాహరణకు బ్యాంకుల ప్రాధాన్యతా రంగ రుణాల (పీఎస్ఎల్) పోర్ట్‌ఫోలియోలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఫైనాన్స్‌ను చేర్చడం జరిగింది. ఈ సంవత్సరం ప్రారంభంలో సావరిన్ గ్రీన్ బాండ్లను (ఎస్‌జీఆర్‌బీ) విజయవంతంగా జారీ చేయడంలో భారత ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ మద్దతు ఇచి్చంది. ఈ బాండ్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆర్థిక వ్యవస్థలో కార్బన్ తీవ్రతను తగ్గించడంలో సహాయపడే ప్రభుత్వ రంగ ప్రాజెక్టుల అమలుకు వినియోగించే విషయం తెలిసిందే. సావరిన్ గ్రీన్ బాండ్ల జారీ... ఇందుకు సంబంధించి ఇతర ఆర్థిక సాధనాల విషయంలో ధరను నిర్దారించేందుకు కూడా సహాయపడుతుంది. అలాగే దేశంలో గ్రీన్ ఫైనాన్సింగ్ పర్యావరణ వ్యవస్థకు ఉద్దేశించిన మార్కెట్ అభివృద్ధికి పురికొల్పుతుంది. ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థపై వాతావరణ మార్పు ప్రభావాల గురించి ప్రపంచ దేశాల్లో అవగాహన పెరుగుతోంది. తదనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు, పర్యవేక్షకుల సానుకూల ప్రతిస్పందనలూ పెరుగుతున్నాయి. వాతావరణ సమస్యలు, సంబంధిత ఆర్థిక నష్టాలను అర్థం చేసుకోవడానికి, అంచనా వేయడానికి, ప్రణాళికలు రూపొందించడానికి సెంట్రల్ బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు, రియల్ ఎకానమీ భాగస్వామ్యులను సన్నద్ధం చేయడానికి పెద్ద ఎత్తున సామర్థ్య నిర్మాణ ప్రయత్నాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది. తద్వారానే నూతన ఆవిష్కరణలు, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మూలధనాన్ని సమీకరించగలరు. స్థిరత్వ లక్ష్యాలను సాధించడానికి సమర్థవంతమైన పరివర్తన ప్రణాళికలను రూపొందించగలరు. వాతావరణ అనుకూల పారిశ్రామికీకరణ విషయంలో సూక్ష్మ, లఘు, మధ్య, చిన్న (ఎంఎస్ఎంఈ) తరహా పరిశ్రమలపై పాత్ర ఎంతో కీలకం. వాస్తవానికి అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించి వాతావరణ పరిరక్షణకు చర్యలు, ఆర్థిక కట్టుబాట్లు, అమలు సంతృప్తికరంగా లేదు. ఏమి చేస్తున్నారు– చేయవలసినది ఏమిటి అన్న అంశాల మధ్య అంతరం పెరుగుతోంది. ఈ విషయంలో 100 బిలియన్ డాలర్ల హామీకి భిన్నంగా 2020లో అభివృద్ధి చెందిన దేశాలు మొత్తం 83.3 బిలియన్ డాలర్లు వెచ్చించాయి. 2019తో పోల్చితే ఇది కేవలం 4 శాతం మాత్రమే పెరిగాయి. ఇలాంటి ధోరణి మారాలి. -
పచ్చని సంసారానికి ఆకుపచ్చని ఆర్మీ
పచ్చని సంసారానికి గ్రీన్ ఆర్మీ కావాలి అంటున్నారు వారణాసిలోని కుషియారి గ్రామ వాసులు. ఈగ్రామంలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాల వాళ్లే ఎక్కువ.నిరుపేదలు కావడంతో విద్యాగంధం ఉన్న వాళ్లు తక్కువ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రమే. చాలా కుటుంబాల్లో పెద్దరికం వహించాల్సిన భర్తలు తాగుడు, మత్తుపదార్థాలకు బానిసలై భార్యలను కొట్టడం, తిట్టడం, ఇంట్లో ఖర్చులకు డబ్బులు అడిగితే తన్ని తరిమేయడం సర్వసాధారణమైంది. గత కొన్నేళ్లుగా భర్తల తీరుతో విసిగిపోయిన గ్రామ మహిళలకు రవి మిశ్రా అనే టీచర్ చుక్కానిలా దారిచూపుతున్నాడు. భర్త బాధితురాలైన ఆశాదేవిని కలిసిన మిశ్రా సమస్యలు ఆమె ఒక్కదానికే కాదు, ఆమె ఇరుగు పోరుగు వారి పరిస్థితులు కూడా అలానే ఉన్నాయని తెలుసుకున్నాడు. మీరంతా కలసికట్టుగా ఉంటే ఇవేమీ పెద్ద సమస్యలు కాదని చెప్పి, ఆశాదేవితోపాటు మరికొంతమంది మహిళలను కూడగట్టుకుని 2014లో ‘గ్రీన్‌ఆర్మీ’నిప్రారంభించారు. వ్యసనాలకు బానిసలైన భర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చి సరైన దారిలో నడిపించడమే ఈ ఆర్మీ ముఖ్య ఉద్దేశ్యం. ఆర్మీలోని సభ్యులు పచ్చని రంగు చీర కట్టుకుని, కర్రలు పట్టుకుని ఎవరైనా ఇంట్లో భర్తలు తాగి గొడవచేస్తుంటే వెళ్లి ఆ వ్యక్తికి కౌన్సెలింగ్ ఇచ్చి సాధారణ స్థితికి తీసుకొస్తారు. లిక్కర్, మత్తుపదార్థాలకు బానిసలైన వారికి రకరకాలుగా కౌన్సెలింగ్ ఇచ్చి మంచి మనుషులుగా మార్చడానికి కృషిచేస్తోంది. భర్తలతోపాటు.. గ్రామాభివృద్ధికి ప్రస్తుతం ఈ ఆర్మీలో 1800 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఆర్మీ చేస్తోన్న కార్యకలాపాలు చూసిన ఎంతోమంది ఇతర గ్రామాల్లో గులాబీ గ్యాంగ్ వంటి రకరకాల పేర్లతో ఆర్మీలను ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. మహిళలు తమను తాము రక్షించుకొనేందుకు ఆత్మరక్షణ విద్యలలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. వారణాసి, మీర్జాపూర్ జిల్లాల్లోని చాలామంది మహిళలు ఈ ఆర్మీ ద్వారా భర్తలను మార్చుకుని సంతోషంగా జీవిస్తున్నారు. మూర్ఖపు భర్తలను మార్చడంతోపాటు, గృహహింస, వరకట్నం, మూఢాచారాలు నిర్మూలించేందుకు ఆర్మీలు కృషి చేస్తున్నాయి. ఈ ఆర్మీల వల్ల కుటుంబ పరిస్థితులు మెరుగుపడడమేగాక, గ్రామాలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయి. ‘‘నా పేరు ఆశాదేవి. పద్నాలుగేళ్లకే పెళ్లి అయ్యింది. ఐదుగురు పిల్లలు. నా భర్త ఎప్పుడూ కొట్టేవాడు. గర్భవతినని కూడా చూడకుండా హింసించేవాడు. పిల్లలు ఎదిగే కొద్దీ ఖర్చులు కూడా పెరిగాయి. కానీ ఆయన మాత్రం తాగడం మానలేదు. నన్ను కొట్టడం ఆపలేదు. ఆయన కొట్టిన దెబ్బలకు రాత్రులకు నిద్రపట్టేది కాదు. మూలుగుతూ పడుకున్న నన్ను మళ్లీ మళ్లీ కొట్టేవాడు. చలికాలం ఇంటి బయటకు నెట్టేసేవాడు. బాధలు తట్టుకోలేక చచ్చిపోదామని నిప్పు అంటించుకున్నాను.కానీ వేరేవాళ్లు కాపాడడంతోప్రాణాలు రవి మిశ్రా హోప్ వెల్ఫేర్ ట్రస్ట్వాళ్లతో కలసి మా గ్రామానికి వచ్చారు. అప్పుడు నా పరిస్థితి, పిల్లలు స్కూలుకు కూడా వెళ్లడంలేదని తెలుసుకున్నారు. నేను నా బాధల గురించి వివరించాను. వారు ఇచ్చిన కౌన్సెలింగ్‌తో ఆయన తాగడం మానేశాడు. ఎనిమిదేళ్లుగా మంచి వ్యక్తిగా మారి, నన్ను పిల్లల్ని బాగా చూసుకుంటున్నాడు. ఆ తరువాతే నాలాంటి మహిళలను ఆదుకునేందుకు మిశ్రా తో కలిసి గ్రీన్ ఆర్మీని ఏర్పాటు చేశాము.’’ ఆశా దేవి లాంటి వందలమంది మహిళలు గ్రీన్ ఆర్మీ ద్వారా సంసారాలను చక్కబెట్టుకుని ఆనందంగా జీవిస్తున్నారు. -
హరిత హైడ్రోజన్ వినియోగ విధానాలపై కసరత్తు
న్యూఢిల్లీ: దేశీయంగా హరిత హైడ్రోజన్ వినియోగానికి సంబంధించి విధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ కార్యదర్శి భూపిందర్ సింగ్ భల్లా తెలిపారు. పరిశ్రమ తగు స్థాయిలో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు వీలుగా డిమాండ్‌ను మదింపు చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా భల్లా ఈ విషయాలు పేర్కొన్నారు. 2030 నాటికి ప్రతిపాదిత హరిత హైడ్రోజన్ ఉత్పత్తిలో 70 శాతం భాగం ఎగుమతుల కోసం ఉద్దేశించినదై ఉంటుందని ఆయన తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి సంబంధించి భారత్‌ను ప్రపంచ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ ఏడాది జనవరిలో కేంద్రం రూ. 19,744 కోట్లతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రణాళికను ఆమోదించింది. మరోవైపు, హరిత హైడ్రోజన్ వినియోగానికి మారే క్రమంలో సిబ్బందికి శిక్షణ కల్పించేందుకు కేంద్రం కృషి చేస్తోందని భల్లా పేర్కొన్నారు. -
గ్రీన్ మొబిలిటీలో ఆంధ్రప్రదేశ్ మున్ముందుకే
ఆటోమొబైల్ రంగంలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న ఇండియా ఇక ముందు ఎలెక్ట్రిక్ ఆటోమొబైల్ వాహనాల రంగంలో కూడా ముందుకు సాగే అవసరంతోపాటు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పెట్రోలు, డీసెల్ బదులు విద్యుత్ బ్యాటరీలతో నడిచే వాహనాల వినియోగాన్ని నేటి ప్రపంచంలో ‘గ్రీన్ మొబిలిటీ’ అని పిలుస్తున్నారు. గ్రీన్ మొబిలిటీలో ఆంధ్రప్రదేశ్ సైతం ప్రగతి సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన కృషి చేస్తోంది. ప్రపంచంలో ఆటోమొబైల్ రంగంలో చైనా, అమెరికా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. గత ఏడాది మూడో ర్యాంకర్ జపాన్ను ఆటో అమ్మకాల్లో ఇండియా అధిగమించింది. కిందటేడాది జపాన్ 42 లక్షల ఆటోమొబైల్ వాహనాలను అమ్మగా, ఇండియాలో 42 లక్షల 50 వేల వాహనాలు అమ్ముడయ్యాయి. వచ్చే ఐదు సంవత్సరాల్లో దేశంలో ఎలెక్ట్రిక్ కార్లు, ఇతర రకాల వాహనాల ఉత్పత్తి పెరిగితే ఆటో రంగంలో చైనా, అమెరికాలను ఇండియా దాటిపోతుందని కేంద్ర ప్రభుత్వం అంచనావేస్తోంది. అమెరికాలోని అట్లాంటిక్ మహాసముద్ర తీరంలోని పెద్ద రాష్ట్రం జార్జియా గ్రీన్ మొబిలిటీలో అగ్రభాగాన నిలిచే దిశగా ముందుకు సాగుతోంది. ఈ రాష్ట్రాన్ని అమెరికాకు ‘ఎలెక్ట్రిక్ మొబిలిటీ రాజధాని’గా చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ఆటోమొబైల్ రంగంలో అమెరికాలో మొదటి స్థానంలో ఉన్న మిషిగన్ రాష్ట్రాన్ని మించిపోతుందని అంచనా. గ్రీన్ మొబిలిటీలో ఆంధ్రప్రదేశ్ నాలుగేళ్ల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచీ ఆంధ్రప్రదేశ్ లో గ్రీన్ మొబిలిటీకి ప్రాధాన్యం పెరిగింది. ఎలెక్ట్రిక్ వాహనాల తయారీ, వాటికి అవసరమైన బ్యాటరీలు, చార్జింగ్ పరికరాలు ఉత్పత్తి విస్తరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని సర్కారు ఏటా ప్రోత్సాహకాలు ప్రకటాస్తూ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో ఎలెక్ట్రిక్ (గ్రీన్) మొబిలిటీకి తగిన వ్యవస్థ, వాతావరణం ఏర్పాటు చేయడానికి గతంలోనే ఈ రంగంలో అనుభవం ఉన్న ‘ఊర్జా గ్లోబల్’ అనే కంపెనీతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి బోర్డు (ఏపీఈడీబీ) ఒప్పందం చేసుకుంది. ఈ అవగాహన ఒప్పందం ప్రకారం లిథియం-అయాన్ బ్యాటరీలు, ఎలెక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్లు ఏపీలో ఏర్పాటవుతాయి. నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఊర్జా గ్లోబల్ రూ.200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే పరిశ్రమల వల్ల 250 మందికి ప్రత్యక్షంగా, 1000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలుంటాయని అప్పుడు అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్ ను ఎలెక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీ కేంద్రంగా చేయడానికి వరల్డ్ ఇకనామిక్ ఫోరమ్ తో కలిసి ఏపీ సర్కారు కిందటేడాది ఆగస్టులో ఏర్పాటు చేసిన తొలి వర్చ్యుల్ మీటింగ్ విజయవంతంగా జరిగింది. విద్యుత్ వాహనాల రంగంలో ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తుందని ఈ సమావేశంలో ప్రసంగించిన నీతి ఆయోగ్ సలహాదారు సుధేందు సిన్హా విశ్వాసం ప్రకటించారు. రాష్ట్రంలో పెరుగుతున్న సాంప్రదేయేతర ఇంథన వనరుల ఉత్పత్తి కారణంగా ఎలెక్ట్రిక్ వాహనాల రంగం విస్తరణకు అనువైన వాతావరణం ఉందని అందరూ గుర్తిస్తున్నారు. - విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు -
హరిత భవనాలు: దేశంలోనే తొలిసారిగా గ్రీన్ ప్రాపర్టీ షో!
సాక్షి, హైదరాబాద్: హరిత భవనాలలో ప్రపంచంలోనే ఇండియా మూడో స్థానంలో నిలిచింది. గత రెండు దశాబ్దాల కాలంలో దేశంలో 1,027 కోట్ల చ.అ. విస్తీర్ణంలో 11 వేలకు పైగా ప్రాజెక్ట్‌లు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) గుర్తింపు పొందాయి. తెలంగాణలో 112 కోట్ల చ.అ.లలో 700లకు పైగా ప్రాజెక్ట్‌లు ఐజీబీసీ ధ్రువీకరణ దక్కించుకున్నాయి. ఈక్రమంలో దేశంలోనే తొలిసారిగా హరిత భవనాల స్థిరాస్తి ప్రదర్శనను నిర్వహించాలని ఐజీబీసీ నిర్ణయించింది. జూలై 28-30 తేదీలలో మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో గ్రీన్ ప్రాపర్టీ షోను నిర్వహించనుంది. ఈమేరకు మంత్రులు కేటీ రామారావు, టీ హరీశ్‌రావులు ప్రాపర్టీ షో బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ వీసీ అండ్ ఎండీ ఈవీ నరసింహారెడ్డి పాల్గొన్నారు. (రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు) ఈ సందర్భంగా ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్, సీఐఐ తెలంగాణ చైర్మన్ సీ శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులకు హరిత భవనాల ప్రాముఖ్యత, పర్యావరణ బాధ్యత, ఆవశ్యకతలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రాపర్టీ షోకు శ్రీకారం చుట్టామని తెలిపారు. నిర్వహణ వ్యయం, విద్యుత్, నీటి బిల్లుల తగ్గింపులతో పాటు ఆరోగ్యకరమైన జీవన విధానం వంటి వాటిపై అవగాహన పెరుగుతుందన్నారు. 75కి పైగా ఐజీబీసీ సర్టిఫైడ్, ప్రీ-సర్టిఫైడ్ నివాస, వాణిజ్య సముదాయ ప్రాజెక్ట్‌లతోపాటు హరిత నిర్మాణ ఉత్పత్తులు, సాంకేతికత, సేవల సంస్థలు కూడా ఈ ప్రాపర్టీ షోలో పాలుపంచుకోనున్నారని వివరించారు. -
Venice: రాత్రికి రాత్రే రంగు మారింది!
వైరల్ న్యూస్: ఇటలీ నీటి నగరం వెనిస్లో ఆసక్తికర ఘటన ఒకటి జరిగింది. తేట నీరుతో టూరిస్టులను ఆకట్టుకునే అక్కడి గ్రాండ్ కెనాల్ నీటి రంగు.. రాత్రికి రాత్రే మొత్తం ఆకుపచ్చగా మారింది. ఆదివారం ఉదయం కాలువ రంగు మారిపోవడంతో అక్కడి ప్రజలంతా ఆశ్చర్యానికి గురయ్యారు. వెనెటో రీజియన్ రాజధాని వెనిస్లో Grand Canal నీరు అసాధారణ రీతిలో ఆకుపచ్చ రంగులోకి మారిపోయింది. తెల్లవారు జామున రియాల్టో బ్రిడ్జి వద్ద తొలుత అది గమనించిన కొందరు స్థానికులు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని పోలీసులకు వెనెటో రీజియన్ ప్రెసిడెంట్ లూకా జాయియా ఆదేశించారు. మరోవైపు సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక నీరు రంగు మారిన పరిణామం రకరకాల ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి. ఇది ఆల్గే(నాచు) వల్ల సంతరించుకుంది కాదని పరిశోధకులు ప్రకటించారు. దీంతో.. బహుశా ఎవరైనా నిరసకారులు లేదంటే ఆకతాయిలు ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా వాళ్లను కనిపెట్టే పనిలో పోలీసులు ఉన్నారు. The water in the Grand Canal in Venice has turned bright green. Has grown significantly. pic.twitter.com/N7js56Vmiy — Animal World (@dragon_of_time_) May 28, 2023 ఇదిలా ఉంటే.. వెనిస్ గ్రాండ్ కెనాల్ ఇలా రంగు మారడం ఇదే తొలిసారి కాదు. గతంలో.. 1968లో అర్జెంటీనా ఆర్టిస్ట్ నికోలస్ గార్సియా ఉద్దేశపూర్వకంగానే గ్రాండ్ కెనాల్లో ఫ్లూరెసెయిన్ అనే డైని కలిపారు. ఆ టైంలో వెనిస్ ఇంటర్నేషనల్ థియేటర్ ఫెస్టివల్ జరగాల్సి ఉండగా.. పర్యావరణ సమస్యలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో ఆ టైంలో ఆయన ఆ పని చేశారు. -
గ్రీన్ డిపాజిట్లకు మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) ‘గ్రీన్ డిపాజిట్ల’ను పొందేందుకు ఉద్దేశించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ డిపాజిట్ నిధులను పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ ట్రాన్స్పోర్ట్, గ్రీన్ బిల్డింగ్‌ల వంటి ఫైనాన్సింగ్ కార్యకలాపాలకు ఉపయోగించడానికి వీలు కలుగుతుంది. వాతావరణ మార్పును ప్రపంచ వ్యాప్తంగా అత్యంత క్లిష్టమైన సవాళ్లలో ఒకటిగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు జారీ కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఉద్గారాలను తగ్గించడంతోపాటు వాతావారణంలో సుస్థిరతను ప్రోత్సహించేందుకు వివిధ ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజా ఫ్రేమ్‌వర్క్ జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. -
హరిత హైడ్రోజన్‌కు త్వరలో మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా హరిత హైడ్రోజన్ తయారీకి భారత్‌ను ప్రధాన హబ్‌గా తీర్చిదిద్దే విధంగా త్వరలోనే ప్రమాణాలు, మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. దేశీయంగా ఎలక్ట్రోలైజర్ల తయారీ కోసం 15 గిగావాట్ల సామర్థ్యానికి సంబంధించి ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకంపై (పీఎల్ఐ) కసరత్తు చేసినట్లు ఆయన చెప్పారు. 2030 నాటికి దీన్ని 60 గిగావాట్ల స్థాయికి పెంచుకోవాలని భావిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దేశీయంగా తయారీని ప్రోత్సహించే క్రమంలో ఎలక్ట్రోలైజర్లను తక్కువ సుంకాలతో ఎప్పటివరకూ దిగుమతి చేసుకోవచ్చనేది కేంద్రం నిర్దిష్ట గడువు నిర్దేశిస్తుందని, ఆ తర్వాత నుంచి భారీ సుంకాలు అమల్లోకి వస్తాయ ని చెప్పారు. అలాగే హరిత హైడ్రోజన్ తయారీలో దేశీ పరిశ్రమ తగు రీతిలో పోటీపడే స్థాయికి ఎదిగే వరకూ తొలుత కొన్నేళ్ల పాటు పీఎల్ఐ స్కీము అందుబాటులో ఉంటుందని సింగ్ వివరించారు. దాదాపు రూ. 19,744 కోట్ల జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్‌ను కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన నేపథ్యంలో ఆయన వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మిషన్ కింద వచ్చే అయిదేళ్లలో 5 మిలియన్ టన్నుల హరిత హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. -
Fashion: క్రిస్మస్ వేడుకలో మరింత వెలిగిపోయేలా..
కొన్ని రంగులు కొన్ని సందర్భాలలో ప్రత్యేకత నింపుకుంటాయి. ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ కాంబినేషన్లో చేసే హంగామా క్రిస్మస్ వేడుకలో మరింతగా వెలిగిపోయేలా చేస్తుంది. ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగు కాంబినేషన్ల డ్రెస్‌లు మాత్రమే కాదు ఇతర అలంకార వస్తువుల్లోనూ ప్రత్యేకత చూపవచ్చు. వాటిలో చేతికి ధరించే బ్రేస్లెట్స్, మెడలో ధరించే నెక్‌పీస్, క్రోచెట్ హ్యాండ్ బ్యాగ్స్, హెయిర్ క్లిప్స్ అండ్ బ్యాండ్స్, చెవులకు హ్యాంగింగ్స్ వేడుక ప్రతిఫలించేలా ఎంపిక చేసుకోవచ్చు. నెయిల్ ఆర్ట్‌లో భాగంగా క్రిస్మస్ ట్రీ, శాంటాక్లాజ్, స్టార్స్ డిజైన్స్‌తో మరింతగా మెరిసిపోవచ్చు. క్రిస్మస్ ట్రీలా నిండైన పచ్చదనాన్ని, ఆత్మీయ ఆప్యాయతలను పంచుకునే కానుకలా, స్వచ్ఛతకు ప్రతిరూపంగా నిలుస్తూ భూమిపైన నక్షత్రాల్లా మెరవాలని ఈ రంగులు సూచిస్తుంటాయి. అందుకే ఈ పండగ పూట అలంకరణలో ఈ రంగులు ప్రధాన భూమికను పోషిస్తుంటాయి. ఆధునికంగానూ ఉంటూనే అంతే హంగునూ పరిచయం చేసే ఈ కలెక్షన్ పండగ వేళ ఎంచుకుంటే మరింత ప్రత్యేకంగా కనిపిస్తారు. చదవండి: Malavika Sharma: అందమైన అల్లికల శారీలో మెస్మరైజ్ చేస్తున్న మాళవిక! చీర ధర 68 వేలకు పైమాటే -
గ్రీన్ ఫైనాన్స్ నిర్వచనం... వర్గీకరణ అవశ్యం
ముంబై: పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రాజెక్టులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడానికి, సంబంధిత (పర్యావరణ) కార్యకలాపాలకు ఆర్థిక వ్యవస్థలో ప్రాధాన్యతన ఇవ్వడానికి ఉద్దేశించిన– గ్రీన్ ఫైనాన్స్‌పై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గ్రీన్ ఫైనాన్స్‌కు అంటే ఏమిటో స్పష్టమైన నిర్వచనం, వర్గీకరణ చేయాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. దీనివల్ల ఆయా పర్యావరణ పరిరక్షణా కార్యకలాపాలకు, ప్రాజెక్టులకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. బిజినెస్ స్టాండెర్డ్ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గ్రీన్ ఫైనాన్స్‌కు తగిన నిర్వచనం, వర్గీకరణ వల్ల పర్యావరణ పరిరక్షణకు అంటే ఏమిటి? తమ రుణ పోర్ట్‌ఫోలియోలో గ్రీన్ ఫైనాన్స్‌కు ఎంతమేర ప్రాముఖ్యతను ఇవ్వాలి? వంటి అంశాలను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మదింపు చేసుకోగలుగుతాయని అన్నారు. అలాగే గ్రీన్ ఫైనాన్స్‌ను నిర్లక్ష్యం చేసే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గిపోతాయని అన్నారు. గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లకు ప్రాధాన్యత దేశంలో పర్యావరణ పరిరక్షణ కార్యకలాపాలకు ఫైనాన్స్‌ను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని రాజేశ్వర్‌రావు ఉద్ఘాటించారు. ఈ దిశలో గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు దేశంలో గ్రీన్ ఫైనాన్స్‌ను పెంచడంలో సహాయపడతాయని చెప్పారు. వాతావరణ మార్పు.. భౌతిక, పరివర్తన ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందన్నారు. వెరసి ఆయా అంశాలు ఆర్థిక పటిష్టతకు, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి చిక్కులను తెచ్చిపెట్టే అవకాశమూ లేకపోలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో భౌగోళిక వాతావారణ మార్పుల వల్ల చోటుచేసుకునే ఆర్థిక నష్టాలను అర్థం చేసుకోవడానికి, అంచనా వేయడానికి, వీటిని నివారించే దిశలో సమగ్ర ఫ్రేమ్‌వర్క్‌లను అభివృద్ధి చేయడానికి, అమలు చేయడానికి నియంత్రణా సంస్థల ఏర్పాటు అవసరం ఉందని పేర్కొన్నారు. సావరిన్ గ్రీన్ బాండ్ (ఎస్జీబీ)ఇష్యూ నుండి రూ. 16,000 కోట్ల వరకు సమీకరించాలన్న బడ్జెట్ ప్రతిపాదనను డిప్యూటీ గవర్నర్ స్వాగతించారు. గ్రీన్ ప్రాజెక్టుల్లోకి నిధుల ప్రవాహానికి ఈ చర్య దోహదపడుతుందని అన్నారు. -
ఏఎన్‌యూకి హరిత వర్సిటీ ర్యాంకు
ఏఎన్‌యూ(గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ హరిత యూనివర్సిటీ ర్యాంకు పొందింది. యూనివర్సిటీ ఆఫ్ ఇండోనేషియా ప్రపంచ వ్యాప్తంగా యూనివర్సిటీలకు సోమవారం రాత్రి ‘యూఐ గ్రీన్ మెట్రిక్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్–2022’ పేరుతో ర్యాంకులు జారీ చేసింది. వీటిలో ఏఎన్‌యూ ఆంధ్రప్రదేశ్‌లో మొదటి ర్యాంకును, జాతీయ స్థాయిలో 6వ, అంతర్జాతీయ స్థాయిలో 246 ర్యాంకును సొంతం చేసుకుంది. ఆయా యూనివర్సిటీలలోని సెట్టింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్, వేస్ట్ ట్రీట్మెంట్, వాటర్ రిసోర్స్ యూసేజ్, ట్రాన్స్‌పోర్టేషన్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అంశాల ప్రాతిపదికన ఈ ర్యాంకులను కేటాయించింది. ఈ అంశాలన్నింటిలో 10వేల మార్కులకు గాను ఏఎన్‌యూ 7,325 మార్కులు దక్కించుకుని ఈ ర్యాంకులు సొంతం చేసుకుంది. ఏఎన్‌యూకి ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకు రావడం అభినందనీయమని వీసీ ఆచార్య పి.రాజశేఖర్ అన్నారు. యూనివర్సిటీలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏఎన్‌యూకి ఐదేళ్లలో 150 జాతీయ, అంతర్జాతీయ ర్యాంకులు రావడాన్ని పురస్కరించుకొని వీసీ కేక్ కట్ చేశారు. వర్సిటీ ర్యాంకింగ్స్ కో–ఆర్డినేటర్ డాక్టర్ భవనం నాగకిషోర్‌ను అభినందించారు. ఇదీ చదవండి: ఏపీ, తెలంగాణలో వీ ఫౌండర్ సర్కిల్ పెట్టుబడులు -
డ్రాగన్ కంట్రీలో అలజడి: సూచీల పరుగుకు బ్రేక్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ సూచీలు స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి. చైనాలో కరోనా వైరస్ మళ్లీ విస్తరించడం, లాక్డౌన్ ఆంక్షలు, జీరో-కోవిడ్ విధానానికి వ్యతిరేకంగా ప్రదర్శనల ఫలితంగా గ్లోబల్ మార్కెట్లు బలహీనపడ్డాయి. ఆదివారం షాంఘైలో ప్రదర్శనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ, ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో COVID-19 నిర్వహణపై ఆందోళనలు ఆసియా మార్కెట్ల పతనానికి దారి తీసాయి. దీంతో దేశీయ మార్కెట్లలో వరుస లాభాలకు చెక్ పడింది. అయితే ప్రస్తుతం నష్టాలనుంచి తేరుకుని సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ 97 పాయింట్లు ఎగిసి 62,396 , నిఫ్టీ పాయింట్లు లాభంతో 18532వద్ద పటిష్టంగా కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. బీపీసీఎల్, ఎస్బీఐ లైఫ, హీరో మోటో, రిలయన్స్, టాటా మోటార్స్ టాప్ విన్నర్స్‌గా, హిందాల్కో, అపోలో హాస్పిటల్స్,హెచ్డీఎఫ్సీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి స్వల్ప నష్టాల్లో 81.73 వద్ద ఉంది. -
ఈజిప్ట్‌లో రెన్యూ పవర్ హైడ్రోజన్ ప్లాంట్
న్యూఢిల్లీ: ఈజిప్ట్‌లో రెన్యూ పవర్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనుంది. సూయిజ్ కెనాల్ ఎకనమిక్ జోన్లో 8 బిలియన్ డాలర్ల (రూ.64 వేల కోట్లు) పెట్టుబడులతో హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించి ఈజిప్ట్ ప్రభుత్వంతో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ పీఎల్సీ (రెన్యూ) అనుబంధ కంపెనీ ‘రెన్యూ పవర్ ప్రైవేటు లిమిటెడ్’ ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా ఏటా 2,20,000 టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ ఏడాది జూలైలోనే ఈజిప్ట్‌తో అవగాహన ఒప్పందం చేసుకోగా, ఇప్పుడు కార్యాచరణ ఒప్పందంపై సంతకాలు చేసినట్టు పేర్కొంది. దశలవారీగా ఈ ప్రాజెక్టు ఉత్పత్తిని ఆరంభిస్తుందంటూ, మొదటి దశలో 20,000 టన్నుల గ్రీన్ హైడ్రోజన్, డెరివేటివ్‌లను ఉత్పత్తి చేయనున్నట్టు తెలిపింది. కార్యాచరణ ఒప్పందం కింద, ప్రాజెక్టు, క్షేత్రస్థాయి అధ్యయనం నిర్వహించి, వచ్చే 12–16 నెలల్లో తుది నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు స్థానిక డెవలపర్‌గా ఎల్స్వెడీ ఎలక్ట్రిక్ ఎస్‌ఏఈ పనిచేయనుంది. -
గ్రీన్‌కోతో సెరెంటికా జట్టు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పారిశ్రామిక క్లయింట్లకు నిరాటంకంగా పునరుత్పాదక విద్యుత్‌ను సరఫరా చేసే దిశగా గ్రీన్కో గ్రూప్‌తో సెరెంటికా రెన్యువబుల్స్ చేతులు కలిపింది. ఈ ఒప్పందం ప్రకారం గ్రీన్కో గ్రూప్‌కి సంబంధించి 1500 మెగావాట్ అవర్ పునరుత్పాదక విద్యుత్ నిల్వ సామర్థ్యాన్ని వినియోగించుకోనుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌లోని పిన్నాపురంలో, మధ్యప్రదేశ్‌లోని గాంధీ సాగర్‌లో అందుబాటులోకి వస్తున్న ఆఫ్ స్ట్రీమ్ క్లోజ్డ్ లూప్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ (ఓసీపీఎస్పీ) ఉపయోగపడ నున్నాయి. వివిధ క్లయింట్లకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ఈ ఒప్పందం సహా యపడగలదని సెరెంటికా రెన్యువబుల్స్ డైరెక్టర్ ప్రతీక్ అగర్వాల్ తెలిపారు. ట్విన్‌స్టార్ ఓవర్సీస్కు 100% అనుబంధ సంస్థగా సెరెంటికా 2022లో ఏర్పాటైంది. ట్విన్స్టార్కి స్టెరిలైట్ పవర్ ట్రాన్స్మిషన్, స్టెరిలైట్ టెక్నాలజీస్‌లో నియంత్రణ స్థాయి వాటాలు ఉన్నాయి. గ్రీన్కో గ్రూప్‌నకు సౌర, పవన, హైడ్రో జనరేషన్ టెక్నాజీలవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో సుమారు 7.5 గిగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంది. -
కర్ణాటకలో ఏబీసీ క్లీన్టెక్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటు
బెంగళూరు: పునరుత్పాదక విద్యుత్ రంగ దిగ్గజం యాక్సిస్ ఎనర్జీ గ్రూప్‌లో భాగమైన ఏబీసీ క్లీన్టెక్ తాజాగా కర్ణాటకలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పనుంది. ఇందుకోసం రూ. 50,000 కోట్లు వెచ్చించనుంది. దీనికి సంబంధించి ఇన్వెస్ట్ కర్ణాటక 2022 కార్యక్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ యూనిట్‌తో వచ్చే 10 ఏళ్లలో 5,000 మందికి ఉపాధి కల్పన జరుగుతుందని ఏబీసీ క్లీన్టెక్ సీఎండీ రవి కుమార్ రెడ్డి తెలిపారు. జీరో కార్బన్ ఎకానమీగా ఎదిగేందుకు, స్థానిక ఎకానమీకి తోడ్పాటు అందించేందుకు ఇది దోహదపడగలదని ఆశిస్తున్నట్లు ఆయన వివరించారు. సమతౌల్యమైన అభివృద్ధి సాధనకు, భవిష్యత్ తరాలకి సురక్షితమైన.. ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని అందించేందుకు పునరుత్పాదక శక్తి ఒక్కటే మార్గమని కర్ణాటక అదనపు చీఫ్ సెక్రటరీ ఈవీ రమణా రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. గతేడాది అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పొందిన రాష్ట్రంగా కర్ణాటక నిల్చినట్లు ఆయన వివరించారు. హైదరాబాదీ సంస్థ యాక్సిస్ ఎనర్జీ, అతి పెద్ద అసెట్ మేనేజ్మెంట్ సంస్థల్లో ఒకటైన బ్రూక్‌ఫీల్డ్ భాగస్వామ్యంలో జాయింట్ వెంచర్ గా ఏబీసీ రెన్యువబుల్స్‌ను ఏర్పాటైంది. ఇది ప్రస్తుతం 2 గిగావాట్ల పైగా సామర్థ్యమున్న ప్రాజెక్టులను నిర్మిస్తోంది. -
గ్రీన్కో గ్రూప్ సంస్థ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
హరిత గృహ రుణాలపై ఐఐఎఫ్ఎల్: వారికి ప్రత్యేక డిస్కౌంట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పర్యావరణానికి అనుకూలమైన, హరిత గృహాల ప్రాజెక్టులకు రుణాలివ్వడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు ఐఐఎఫ్ఎల్ హోమ్ ఫైనాన్స్ జోనల్ హెడ్ (ఏపీ, తెలంగాణ, తమిళనాడు) శ్రీనివాసరావు రేకపల్లి తెలిపారు. నిర్దిష్ట నిబంధనలను పాటించే డెవలపర్లకు ప్రత్యేక డిస్కౌంట్లు కూడా అందిస్తున్నట్లు వివరించారు. అటు కీలక వ్యాపార విభాగమైన అఫోర్డబుల్ ఇళ్లకు సంబంధించి మరిన్ని రుణాలు అందించేందుకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. 2022 మార్చి ఆఖరు నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 25,300 కుటుంబాలకు రుణాలు అందించామని .. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దీన్ని రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 50, తెలంగాణలో 35శాఖలు ఉన్నాయన్నారు. కొత్తగా ఏపీలో మరో 10, తెలంగాణలో 15 శాఖలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వివరించారు. -
Diwali 2022: పండుగ పచ్చగా.. గ్రీన్ క్రాకర్స్‌కు పెరిగిన ఆదరణ
దీపావళి వచ్చేసింది. అమావాస్య చీకటి రోజున దివ్వెల కాంతులతో పాటు కాకరపువ్వొత్తుల చిటపటలు, మతాబుల వెలుగులు, చిచ్చుబుడ్ల మెరుపులు, లక్ష్మీబాంబుల మోతలు లేకుండా పండుగకి కళే రాదు. మరి ఈ బాణాసంచాతో పర్యావరణం, వ్యక్తిగత ఆరోగ్యం దెబ్బ తింటోంది. అందుకే ఇప్పుడు అందరూ ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడుకుంటూ పండగ సరదా తీర్చుకోవాలంటే గ్రీన్ క్రాకర్స్ మార్గం కావడంతో వాటికి ఆదరణ పెరుగుతోంది. ఏమిటీ గ్రీన్ క్రాకర్స్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)–నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్ఈఈఆర్ఐ) ప్రకారం తక్కువ షెల్ సైజుతో, రసాయనాలు తక్కువగా వినియోగిస్తూ, బూడిద వాడకుండా తయారు చేసే బాణసంచాను గ్రీన్ క్రాకర్స్‌గా పిలుస్తున్నారు. మామూలుగా వాడే హానికరమైన సల్ఫర్ నైట్రేట్స్, సోడియం, లెడ్, మెగ్నీషియం, బేరియం, అత్యంత హానికరమైన బ్లాక్ పౌడర్‌ను వీటిలో వాడరు. అందుకే వీటితో కాలుష్యం 30% తక్కువగా ఉంటుంది. శబ్ద కాలుష్యమూ తక్కువే. సాధారణ బాణసంచా 160 డెసిబుల్ శబ్దంతో పేలితే ఇవి 110 డెసిబుల్ శబ్దం చేస్తాయి. వాయు కాలుష్యం అధికంగా ఉన్న నగరాల్లో గ్రీన్ క్రాకర్స్‌కు మాత్రమే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అనుమతినిచ్చింది. గ్రీన్ క్రాకర్స్‌ని గుర్తించడం ఎలా ? ఎన్ఈఈఆర్ఐ ఫార్ములా ప్రకారం ప్రస్తుతం తమిళనాడులో ప్రఖ్యాత బాణాసంచా కేంద్రమైన శివకాశీలోనే తయారు చేస్తున్నారు. వీటిని గుర్తించడానికి వీలుగా సీఎస్ఐఆర్–ఎన్ఈఈఆర్ఐ ఆకుపచ్చ రంగు లోగోను బాణాసంచా బాక్సులపై ముద్రిస్తున్నారు. క్యూఆర్ కోడ్ కూడా ఈ బాక్సులపై ఉంటుంది. గ్రీన్ క్రాకర్స్ మూడు రకాలున్నాయి. స్వాస్: వీటిని కాల్చినప్పుడు నీటి ఆవిరి కూడా విడుదలై గాల్లో ధూళిని తగ్గిస్తుంది. గాలిలో సూక్ష్మ ధూళికణాలు 30% తగ్గుతాయి స్టార్: వీటిలో పొటాషియం నైట్రేట్, సల్ఫర్ వాడరు వాయు కాలుష్యానికి కారణమైన పర్టిక్యులర్ మేటర్ (పీఎం)ని తగ్గించడంతో పాటు శబ్ద కాలుష్యాన్ని కూడా నివారిస్తాయి సఫల్: ఈ రకమైన గ్రీన్ క్రాకర్స్‌లో మెగ్నీషియమ్కు బదులుగా అల్యూమినియమ్ తక్కువ మోతాదులో వాడతారు.సంప్రదాయ బాణాసంచాతో పోలిస్తే శబ్ద కాలుష్యం తక్కువ. కేంద్రం లైసెన్స్ ఇచ్చిన కేంద్రాల్లోనే గ్రీన్ క్రాకర్స్ కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఏడాదే ఆదరణ ఎందుకు ? పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ముప్పుని గుర్తించిన సుప్రీం కోర్టు బాణాసంచాను నిషేధిస్తూ అక్టోబర్ 23, 2018 దీపావళికి ముందు సంప్రదాయ బాణాసంచాపై నిషేధం విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. గ్రీన్ క్రాకర్స్‌కి మాత్రమే అనుమతినిచ్చింది. 2019లో దీపావళి సమయంలో గ్రీన్ క్రాకర్స్‌పై గందరగోళంతో బాణాసంచా పరిశ్రమ భారీగా నష్టపోయింది. వేటిని గ్రీన్ అనాలో వేటి కాదో తెలీక, తయారీదారులకే వీటిపై అవగాహన లేకపోవడంతో ఆ ఏడాది దీపావళి పండగ కళ తప్పింది. ఆ తర్వాత వరసగా రెండేళ్లు కరోనా మహమ్మారి ప్రభావం పండగపై పడింది. 2021లో సుప్రీం కోర్టు ఆకుపచ్చ రంగుని వెదజల్లే బేరియమ్ను వాడే టపాసులకి అనుమతి లేదని మరోసారి స్పష్టం చేసింది. సుప్రీం తీర్పు వచ్చి నాలుగేళ్లు కావడంతో ఇప్పుడు వీటిపై అందరికీ అవగాహన పెరుగుతోంది. అయినప్పటికీ బాణాసంచా ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 50% తగ్గిపోయిందని శివకాశీలో తయారీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏయే రాష్ట్రాల్లో ఎలా? కాలుష్యంతో సతమతమయ్యే ఢిల్లీలో జనవరి 1 దాకా అన్ని రకాల బాణసంచాపై నిషేధముంది. కొన్ని రాష్ట్రాలు గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతినిచ్చాయి. పశ్చిమ బెంగాల్లో దీపావళి రోజు మాత్రం క్రాకర్స్‌ను కాల్చుకోవచ్చు. పంజాబ్ రాత్రి 8 నుంచి 10 వరకే గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతించింది. హరియాణా కూడా గ్రీన్ క్రాకర్స్‌కే అనుమతినిచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హరిత హైడ్రోజన్ దిగ్గజంగా భారత్
హ్యూస్టన్: త్వరలోనే భారత్ హరిత హైడ్రోజన్ విభాగంలో లీడరుగా ఎదుగుతుందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ధీమా వ్యక్తం చేశారు. ఈ దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇంధనాల్లో 20 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని 2030 నుంచి 2025 నాటికి కుదించుకున్నామని పేర్కొన్నారు. జీవ ఇంధనా లు, హరిత హైడ్రోజన్, పెట్రోకెమికల్స్, ప్రత్యా మ్నాయ వనరుల నుంచి జీవ ఇంధనాల ఉత్పత్తి మొదలైన విభాగాల్లో అమెరికా–భారత్ కలిసి పని చేసేందుకు అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి చెప్పారు. దీనికి సంబంధించి నాలుగు అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు అమెరికాలోని హ్యూస్టన్‌లో భారత కాన్సల్ జనరల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. అమెరికన్ ఇంధ న కంపెనీలు, అమెరికా భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం యూఎస్ఐఎస్పీఎఫ్ ప్రెసిడెంట్ ముకేశ్ అఘి తదితరులు ఇందులో పాల్గొన్నారు. కోల్ బెడ్ మీథేన్ (సీబీఎం) క్షేత్రాల వేలానికి సంబంధించి అంతర్జాతీయ బిడ్డింగ్‌ను మంత్రి ప్రారంభించారు. అలాగే 26 ఆఫ్‌షోర్ బ్లాకులకు కూడా బిడ్డింగ్‌ను ఆవిష్కరించారు. అంతర్జాతీయంగా ఇంధన మార్కెట్లలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ హరిత ఇంధనానికి మళ్లాలన్న లక్ష్యం నుంచి అమె రికా, భారత్ పక్కకు తప్పుకోలేదని పురి చెప్పారు. ఇరు దేశాల మధ్య గ్రీన్ ఎనర్జీ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. ప్రభుత్వా లు ఇందుకు అవసరమైన విధానాలు, వాతావరణా న్ని మాత్రమే కల్పించగలవని ప్రైవేట్ రంగమే దీన్ని సాకారం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
హరితవనంగా ఆటో.. ఎక్కడ ఉందో తెలుసా?
సాక్షి, విశాఖపట్నం: ఇంటి పెరట్లో.. మిద్దెలపైన మొక్కలు పెంచడం సహజం. అందుకు భిన్నంగా తన బతుకు బండి అయిన ఆటోను హరితవనంగా మార్చాడు ఓ ఆటోవాలా. పర్యావరణ పరిరక్షణకు తన ఆటోకు చుట్టూ కుండీలను ఏర్పాటు చేసి వాటిలో పచ్చని మొక్కలను పెంచుతున్నాడు. ఇలా ఐదేళ్లుగా తన ఆటోలో ఎక్కిన ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాడు. ఆ ఆటో డ్రైవర్ పేరు డేవిడ్. గాజువాక గణపతినగర్ అతని నివాసం. కాకినాడ జిల్లా హెచ్.కొత్తూరు నుంచి ఉపాధి కోసం కొన్నాళ్ల క్రితం గాజువాక వచ్చాడు డేవిడ్. అక్కడ పాసింజర్ ఆటో కొనుక్కుని నడుపుతున్నాడు. మొక్కల పెంపకంపై ఆసక్తి ఉన్న డేవిడ్‌కు తానుంటున్న అద్దె ఇంట్లో వాటిని పెంచడానికి స్థలం లేదు. దీంతో తన ఆటోలోనే వాటిని పెంచాలన్న ఆలోచన కలిగింది. ఆటోకు కుడివైపున, హ్యాండిల్‌కు ఇరువైపులా బోల్టులు బిగించి కుండీలను స్థిరంగా ఏర్పాటు చేసి వాటిలో అందమైన మొక్కల పెంపకం ప్రారంభించాడు. వీటిలో ఆరోగ్యాన్నిచ్చే పసుపు మొక్కలు, సుగంధ పరిమళాన్ని వెదజల్లే మొరవంతో పాటు మనీప్లాంట్, పూలమొక్కలు వెరసి 11 రకాల మొక్కలను పెంచుతున్నాడు. అంతేకాదు ఆటోకు ముందు భాగంలో, అద్దానికి పైన, ఆటో లోపల కాళ్లు ఉంచే చోట్ల పచ్చని మ్యాట్లను కూడా అమర్చాడు. ఇలా ఆటో లోపల, బయట పచ్చదనంతో నింపేశాడు. పసుపు పచ్చని ఆటో చుట్టూ ఆకుపచ్చని మొక్కలతో ఆ ఆటో రోడ్లపై వెళ్తుంటే చూసే వారికి కనువిందు చేస్తోంది. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ముచ్చట పడిన వారు ఈ ఆటో ఫొటోలను కూడా తీసుకుంటున్నారు. స్కూలు పిల్లలను ఎక్కువగా తీసుకెళ్లే డేవిడ్.. తన ఆటోలో మొక్కలు, పచ్చదనాన్ని చూసి వారు మురిసిపోతుంటారు. వీటిని ఈ స్కూలు పిల్లలు గాని, డేవిడ్ పరిసర ప్రాంతాల వారు గాని పాడు చేయరు. అన్నట్టు.. డేవిడ్ ఆటోలో మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి అవసరమైన ఆవు గత్తాన్ని తన సొంతూరు నుంచి ప్రత్యేకంగా తెస్తుంటాడు. ఒకసారి తెచ్చిన గత్తం ఐదారు నెలలకు సరిపోతుంది. పచ్చదనంపై మమకారంతో.. చిన్నప్పట్నుంచి నాకు పచ్చదనం అంటే ఇష్టం. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు మేలు చేస్తాయని తెలుసు. నేనుంటున్న అద్దె ఇంట్లో మొక్కల పెంపకానికి జాగా లేదు. అందుకే నా ఆటోలో శాశ్వతంగా మొక్కలు ఏర్పాటు చేస్తే పచ్చదనంతో పాటు పర్యావరణాన్ని నా వంతు కాపాడవచ్చని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాను. పగలంతా నగరంలో తిరిగి రాత్రి వేళ ఆ మొక్కలకు నీరు పోస్తాను. ఇక నా ఆటోలో ప్రయాణించే వారు పచ్చని పార్కులో కూర్చొని జర్నీ చేస్తున్న అనుభూతి పొందుతున్నామని చెబుతుంటారు. ఆ మాటలు వింటే నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది. – ఎం.డేవిడ్, ఆటోడ్రైవర్, గాజువాక -
టీమిండియాపై గ్రీన్ సరికొత్త చరిత్ర.. తొలి ఆటగాడిగా!
హైదరాబాద్ వేదికగా టీమిండియాతో మూడో టీ20లో ఆస్ట్రేలియా ఓపెనర్ కామెరూన్ గ్రీన్ విధ్వంసం సృష్టించాడు. ఆది నుంచే ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై విరుచుకు పడ్డాడు. ఈ క్రమంలో కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, మూడు సిక్స్‌లు ఉన్నాయి. తద్వారా ఓ అరుదైన రికార్డును గ్రీన్ తన ఖాతాలో వేసుకున్నాడు. భారత జట్టుపై టీ20ల్లో అత్యంత వేగంగా అర్ధ శతకం సాధించిన తొలి ఆటగాడిగా గ్రీన్ రికార్డులకెక్కాడు. అంతుకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ ఆటగాడు జాన్సన్ చార్లెస్ పేరిట ఉండేది. 2016లో లాడర్‌హిల్ వేదికగా భారత్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో చార్లెస్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 21 బంతుల్లో 52 పరుగులు చేసి భువనేశ్వర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. చదవండి: Ind A vs NZ A 2nd ODI: కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ .. న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం -
క్యారీ, గ్రీన్ల అద్భుత పోరాటం.. ఆసక్తికర పోరులో కివీస్‌ను ఓడించిన ఆసీస్
3 వన్డేల సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న న్యూజిలాండ్ కెయిన్స్ వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 6) తొలి వన్డే ఆడింది. చివరి నిమిషం వరకు ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు అలెక్స్ క్యారీ (99 బంతుల్లో 85; 8 ఫోర్లు, సిక్స్), కెమరూన్ గ్రీన్ (92 బంతుల్లో 89 నాటౌట్; 10 ఫోర్లు, సిక్స్)లు అద్భుతమైన పోరాట పటిమ కనబర్చి జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించారు. ముఖ్యంగా గ్రీన్ చివరి నిమిషం వరకు క్రీజ్‌లో ఉండి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా ఆసీస్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (68 బంతుల్లో 46; 4 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ విలియమ్సన్ (71 బంతుల్లో 45; 3 ఫోర్లు, సిక్స్), వికెట్‌కీపర్ టామ్ లాథమ్ (57 బంతుల్లో 43; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లలో మ్యాక్స్‌వెల్ 4, హేజిల్‌వుడ్ 3, స్టార్క్, జంపా తలో వికెట్ పడగొట్టారు. Wow, that was some contest! Cameron Green (89no), Alex Carey (85) and Glenn Maxwell (4-52) impress in the Chappell-Hadlee series opener in Cairns #AUSvNZ pic.twitter.com/rxXnwpeb7Y— Cricket Australia (@CricketAus) September 6, 2022 అనంతరం 233 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 44 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, అలెక్స్ క్యారీ, కెమరూన్ గ్రీన్ అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి ఆసీస్‌ను గెలిపించారు. గ్రీన్ తొమ్మిదో వికెట్‌కు ఆడమ్ జంపాతో (13 నాటౌట్) కలిసి 26 పరుగులు జోడించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో ట్రెంట్ బౌల్ట్ (4/40), మ్యాట్ హెన్రీ (2/50)లు ఆసీస్‌ను వణికించారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికగా సెప్టెంబర్ 8న జరుగనుంది. చదవండి: రైనా రిటైర్మెంట్పై స్పందించిన చెన్నై యాజమాన్యం -
భావి ఇంధనం గ్రీన్ హైడ్రోజన్.. ఒకసారి నింపితే చాలు సుదీర్ఘ ప్రయాణం..
(సాక్షి ప్రతినిధి, అమరావతి): విద్యుత్ వాహనాల్లో వాడే లిథియం అయాన్ బ్యాటరీ తయారీలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా గ్రీన్ హైడ్రోజన్‌ను ముందుకు తెస్తున్నారు శాస్త్రవేత్తలు. దీనిని భవిష్యత్ ఇంధనంగా కూడా చెబుతున్నారు. విద్యుత్ వాహనాల్లో గ్రీన్ హైడ్రోజన్‌ను ఇంధనంగా ఉపయోగించుకొని నడిచే ఫ్యూయల్ సెల్ ఆధారిత వాహనాల మీదా పలు దేశాలతోపాటు మన దేశంలోనూ ముమ్మరంగా పరిశోధనలు జరుగుతున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ మీద నడిచే వాహనాలనూ (ఫ్యూయల్ సెల్ ఎల్రక్టానిక్ వెహికల్స్) (ఎఫ్‌సీఈవీ) దేశంలో తయారు చేశారు. కాలుష్య రహితంగా రవాణా రంగం రూపు మార్చడానికి గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అదే సమయంలో కొన్ని సవాళ్లనూ మన ముందు ఉంచింది. చదవండి: గుజరాత్లో మూడుముక్కలాట.. కేజ్రీవాల్ కింగా? కింగ్ మేకరా? ఇదీ సాంకేతికత హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య ఎలక్ట్రో కెమికల్ రియాక్షన్ వల్ల విద్యుత్ పుడుతుంది. ఈ శక్తిని వాడుకుని ఇంజన్ నడుస్తుంది. లిథియం అయాన్ బ్యాటరీ తయారీలో వాడే ముడిపదార్థాల లభ్యత మన దేశంలో తక్కువగా ఉండటం మనకు సమస్య. కానీ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడంలో ఉపయోగించే ముడి పదార్థాల సమస్య మనకు లేదు. రానురాను తక్కువ ధరకే ఇంధనం దేశంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి పన్ను రాయితీలతో పాటు ఇతర రాయితీలను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి ధరలు తగ్గుతున్నందున, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ధరలు కూడా క్రమేణా తగ్గుతాయని నీతి ఆయోగ్ ‘హార్నెసింగ్ గ్రీన్ హైడ్రోజన్’ నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం గ్రీన్ హైడ్రోజన్ ఒక కిలో ఉత్పత్తి చేయడానికి 2030లో 1.6 డాలర్లు, 2050కి 0.7 డాలర్లు అవుతుందని నీతి ఆయోగ్ అంచనా వేసింది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌తో ప్రయోజనాలు ఇవీ.. ♦ఒకసారి హైడ్రోజన్ నింపితే సుదీర్ఘ ప్రయాణం చేయొచ్చు. లిథియం అయాన్ బ్యాటరీ వాహనాలతో పోలిస్తే దీని రేంజ్ బాగా ఎక్కువ ♦రీ ఫ్యూయలింగ్ సులభం. వేగంగా పూర్తి చేయొచ్చు. చార్జింగ్ అవసరం లేదు. బ్యాటరీ చార్జ్ అయ్యే వరకు వేచి చూసే అవసరం ఉండదు. ♦కాలుష్యం వెలువడదు ♦దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం లేదు. అందువల్ల హైడ్రోజన్‌ను ప్రభుత్వాలు చౌకగా అందించే అవకాశం ఉంది. చౌకగా లభ్యమయితే వ్యయమూ బాగా తగ్గుతుంది. సవాళ్లూ ఉన్నాయి.. ♦హైడ్రోజన్‌కు మండే స్వభావం ఎక్కువ. నిల్వ చేసిన ట్యాంకు లోహాన్ని పెళుసుగా మార్చే గుణం ఉంటుంది. ఫలితంగా లీకేజీకి అవకాశాలు ఉంటాయి. ♦హైడ్రోజన్ ఉత్పత్తి అత్యంత జఠిలమైన ప్రక్రియ. ఉత్పత్తి వ్యయాన్ని ఇప్పుడే అంచనా వేయలేం. గ్రీన్ హైడ్రోజన్ కాకపోతే ఉత్పత్తి సమయంలో కాలుష్యం వెలువడుతుంది. సంప్రదాయ శిలాజ ఇంధనాలను ఉత్పత్తికి వాడితే వ్యయం తక్కువగా ఉంటుందని ఆశించలేం. ♦ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం.. హైడ్రోజన్ నిల్వ, రవాణా కష్టమైన అంశాలు. అందువల్ల రవాణా కూడా ఖరీదే. ♦దేశంలో డిమాండ్‌కు అనుగుణంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి చాలా సమయం పడుతుంది. వాహనాల తయారీతో పాటు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి టెక్నాలజీ మీద ఏకకాలంలో పనిచేయాలి. హైడ్రోజన్ పలు రకాలు ఉత్పత్తి విధానాన్ని బట్టి హైడ్రోజన్‌ను 6 రకాలుగా విభజించారు 1. గ్రీన్ హైడ్రోజన్ ఎలక్ట్రోలసిస్ ద్వారా నీటిని వినియోగించి హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తారు. ఈ విధానంలో పవన, సౌర విద్యుత్ లాంటి పునరుత్పాదక వనరులు వాడతారు. ఈ విధానంలో కాలుష్యానికి చోటు లేదు. 2. వైట్ హైడ్రోజన్ (సహజ హైడ్రోజన్) శిలాజ ఇంధనాలు, సహజ వాయువు లభించినట్లుగానే హైడ్రోజన్ కూడా భూమిలో లభిస్తుంది. సహజ వాయువు ఉత్పత్తి మాదిరే డ్రిల్లింగ్ పద్ధతిలో హైడ్రోజన్‌ను వెలికితీయవచ్చు. అయితే వాణిజ్యపరంగా ఇది ఖరీదైన వ్యవహారం. పరిశోధనలకు మాత్రమే ఈ విధానాన్ని శాస్త్రవేత్తలు వాడుతున్నారు. 3. బ్లూ హైడ్రోజన్ బయోగ్యాస్‌ను బయోమీథేన్గా మార్చి హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తారు. ఈ విధానంలో కార్బన్ డై ఆక్సైడ్ అత్యంత కనిష్ట స్థాయిలో వెలువడుతుంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ అసోసియేషన్ (ఐఈఏ) అంచనా ప్రకారం.. క్లీన్ ఎనర్జీరంగంలో 2050 నాటికి హైడ్రోజన్ ఉత్పత్తికి ఇదొక్కటే విధానం అనుసరిస్తారు. 4. పింక్ హైడ్రోజన్ ఎలక్ట్రోలసిస్ ద్వారా నీటిని వినియోగించి దీనిని ఉత్పత్తి చేస్తారు. విద్యుత్‌ను న్యూక్లియర్ ఎనర్జీ నుంచి తీసుకుంటారు. 5. యెల్లో హైడ్రోజన్ ఎలక్ట్రోలసిస్ ద్వారా నీటిని వినియోగించి దీనిని ఉత్పత్తి చేస్తారు. సంప్రదాయ విధానంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను దీనికి వాడతారు. 6. బ్లాక్, బ్రౌన్ హైడ్రోజన్ హైడ్రోజన్ ఉత్పత్తికి బొగ్గు వాడితే బ్లాక్, లిగ్నైట్ వాడితే బ్రౌన్ హైడ్రోజన్ అంటారు. ఇది కాలుష్యకారకమైన విధానం. హైడ్రోజన్ కారు తయారయింది టయోటా, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటీవ్ టెక్నాలజీ (ఐసీఎటీ) పైలెట్ ప్రాజెక్టు కింద హైడ్రోజన్ ఇంధన వాహనాన్ని తయారు చేశాయి. ‘టయోటా మిరాయ్’ పేరిట రూపొందించిన ఈ కారును కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల విడుదల చేశారు. ఇన్‌టేక్ గ్రిల్ ద్వారా గాలిలోని ఆక్సిజన్ తీసుకొని, ఇంధన ట్యాంకులోని హైడ్రోజన్‌తో సంయోగం చెంది.. ఇంజన్ నడవడానికి కావాల్సిన శక్తిని విడుదల చేస్తుంది. పొగ గొట్టం నుంచి పొగ కాకుండా, నీరే వస్తుంది. పుణేలో రోడ్డెక్కిన తొలి హైడ్రోజన్ బస్సు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండ్రస్టియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), పుణేలోని మల్టీ నేషనల్ సాఫ్ట్వేర్ సంస్థ కేపీఐటీ కలిసి హైడ్రోజన్‌తో నడిచే బస్సును తయారు చేసి గత వారం రోడ్డెక్కించాయి. దేశంలో ఇదే తొలి హైడ్రోజన్ బస్సు. సాధారణ డీజిల్ బస్సు ఏడాది పాటు తిరిగితే కనీసం 100 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదల చేస్తుందని సీఎస్ఐఆర్ తెలిపింది. డీజిల్ బస్సులు దేశంలో లక్షల సంఖ్యలో ఉన్నాయని వాటి నుంచి వెలువడే కాలుష్యం అత్యధికమని పేర్కొంది. -
కుప్పం గ్రానైట్.. అంతర్జాతీయంగా ఫుల్ డిమాండ్
కుప్పంలో గ్రానైట్ పరిశ్రమ వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక్కడ లభించే అరుదైన గ్రీన్ గ్రానైట్‌కు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. నాణ్యమైన రాళ్లు తక్కువ ధరకే అందుబాటులో ఉండడంతో ఆర్డర్ల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ఎగుమతుల ద్వారా ప్రభుత్వానికి భారీగా విదేశీ మారకద్రవ్యం సమకూరుతోంది. రాతి బంగారం లావాదేవీల కారణంగా స్థానిక ప్రజల జీవన ప్రమాణం మెరుగుపడుతోంది. సాక్షి, చిత్తూరు/శాంతిపురం: జిల్లా సరిహద్దు ప్రాంతంలోని కుప్పం నియోజకవర్గం గ్రానైట్ వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది. పొరుగునే తమిళనాడు, కర్ణాటక ఉండడంతో లావాదేవీలకు మరింత అనుకూలంగా మారింది. ఈ ప్రాంతంలో వివిధ రకాల గ్రానైట్ రాళ్లు లభిస్తుంటాయి. అయితే గ్రీన్ గ్రానైట్‌కు మాత్రం మంచి డిమాండ్ ఉంది. తక్కువ ధరకే అధిక నాణ్యత గల రాళ్లు ఇక్కడ దొరుకుతుండడంతో వ్యాపారులు కొనుగోలు చేసేందుకు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు. దేశ, విదేశాలకు ఎగుమతులు చేస్తుంటారు. ప్రధానంగా శాంతిపురం మండలం రాళ్లబూదుగూరు, సి.బండపల్లె, రామకుప్పం మండలం బగళనత్తం, ముద్దనపల్లె, గుడుపల్లె మండలం ఓయన్ పుత్తూరు, పాపానూరులో సుమారు 100 వరకు గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. ఇక్కడే గ్రానైట్ రాళ్లను వివిధ సైజ్‌ల్లో తీర్చిదిద్దుతారు. ప్లేట్లు, క్యూబ్స్, కర్బ్స్గా పల ఆకృతుల్లో రాళ్లను మలుస్తుంటారు. వేలాది మందికి ఉపాధి కుప్పం నియోజకవర్గంలోని గ్రానైట్ క్వారీల్లో సుమారు 20వేల మంది ఉపాధి పొందుతున్నారు. తమిళనాడు, చత్తీస్ఘడ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన కార్మికులే అధికంగా పనిచేస్తున్నారు. పరోక్షంగా మరో 20వేల మందికి జీవనోపాధి లభిస్తోంది. మొత్తం 40వేల కుటుంబాల వరకు గ్రానైట్ పరిశ్రమ మీదే ఆధారపడి ఉన్నాయి. ఇక్కడి కార్మికులు ఒక్కో గ్రానైట్ పీస్‌కు కూలీ కింద రోజుకు రూ.600 నుంచి రూ.వెయ్యి వరకు సంపాదిస్తున్నారు. ఆకర్షణీంగా డిజైన్లు కుప్పం పరిసర ప్రాంతాల్లో వివిధ రకాల గ్రానైట్ రాళ్లు లభిస్తుంటాయి. ఆకుపచ్చ (గ్రీన్), బూడిద రంగు (గ్రే), గ్రీన్ అండ్ గ్రే రాళ్లు ఆకర్షణీయమైన లేన్లుగా ఉంటాయి. వీటి బేస్ తెల్లటి మచ్చలు, లైనింగ్‌తో చూడగానే ఆకట్టుకుంటాయి. ఇక తక్కువ పరిమాణంలో బ్లాక్‌స్టోన్ కూడా దొరుకుతుంటాయి. వీటిలో గ్రీన్ గ్రానైట్ అధికంగా విదేశాలకు ఎగుమతి అవుతుంటుంది. బ్రిటీష్ కాలంలోనే.. బ్రిటీష్ వారి పాలనలోనే కుప్పం గ్రానైట్ ఎగుమతి ప్రారంభమైనట్లు రికార్డుల్లో ఉంది. 1925లో ఇక్కడి నుంచి లండన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. సమాధి రాళ్ల కోసం తెల్లదొరలు కుప్పం గ్రానైట్‌ను తీసుకెళ్లినట్లు పేర్కొని ఉంది. అయితే అధికారిక లెక్కల ప్రకారం సుమారు 35 ఏళ్లుగా కుప్పం గ్రానైట్ ఎగుమతులు సాగుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. కోవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే.. గత రెండేళ్లలో కోవిడ్ కారణంగా గ్రానైట్ వ్యాపారం డీలా పడింది. లావాదేవీలు నిలిచిపోవడంతో పరిశ్రమ తీవ్ర సంక్షభాన్ని ఎదుర్కొంది. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో మళ్లీ యథావిధిగా పుంజుకుందని స్థానిక వ్యాపారులు వెల్లడిస్తున్నారు. ఎగుమతులు కూడా బాగా సాగుతున్నాయని వివరిస్తున్నారు. (క్లిక్: తిరుపతిలో ట్రాఫిక్ మళ్లింపు.. ఇవి గమనించండి!) రూ.కోట్ల లావాదేవీలు.. కుప్పం గ్రీన్ గ్రానైట్‌కు అధిక ఉష్ణోగ్రత, అత్యల్ప ఉష్ణోగ్రతలను తట్టుకునే సామర్థ్యం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ గ్రానైట్‌ను కొనుగోలు చేసేందుకు దేశ,విదేశీ వ్యాపారులు పోటీపడుతుంటారు. అంతర్జాతీయ స్థాయిలో పలు కార్పొరేట్ కంపెనీలు తమ నిర్మాణాల్లో వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలోనే కుప్పం నుంచి ప్రతి నెలా సుమారు 2వేల టన్నుల వరకు గ్రీన్ గ్రానైట్ ఎగుమతి చేస్తున్నారు. రూ.కోట్ల లావాదేవీలు సాగిస్తున్నారు. భారీ గ్రానైట్ బండలను స్థానికంగానే ట్రిమ్మింగ్ చేసి వివిధ సైజుల్లో తయారు చేసి ఎగుమతులు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి సైతం పెద్దమొత్తంలో విదేశీ మారకద్రవ్యం సమకూరుతోంది. రాతి పనే జీవనాధారం మాకు రాతి పనే జీవనాధారం. గ్రానైట్ డ్రస్సింగ్ క్యాంపుల్లో నేను, నా భార్య జయమ్మ పనిచేస్తున్నాం. ఒక్కో పీస్‌కు రూ.1,200 నుంచి రూ.1,400 వరకు వస్తోంది. ఈ డబ్బుతోనే మా పిల్లలను చదివిస్తున్నాం. వాళ్లు మాలాగా కాయకష్టం చేయకుండా ఉద్యోగాలు చేసుకోవాలని కోరుకుంటున్నాం. గ్రానైట్ వ్యాపారం బాగా సాగితే కుటుంబ పోషణ సాఫీగా సాగిపోతుంది. – సుబ్రమణ్యం, రాళ్లబూదుగూరు మరో పని తెలియదు చదువు ఒంట బట్టక మా నాన్నతో కలిసి చిన్నతనం నుంచి రాయిని తొలిచే పనులకు వచ్చేవాడిని. సుమారు 20 ఏళ్లుగా రాతి పని చేస్తుండటంతో మరో వృత్తి తెలియదు. పనులు బాగా దొరికితే రోజుకు రూ వెయ్యి వరకు వస్తుంది. అయితే కరోనా సమయంలో పనిలేక తీవ్రంగా ఇబ్బందిపడ్డాం. ప్రభుత్వం, దాతల సాయంతో పొట్ట పోసుకున్నాం. ఇప్పుడు మళ్లీ పనులు పెరుగుతున్నాయి. – కార్తీక్, కార్మికుడు, సోలిశెట్టిపల్లె -
అద్భుత దృశ్యం.. ఆకుపచ్చగా మారిన ఆకాశం.. ఫోటోలు వైరల్
అమెరికా: సాధారణంగా నీలిరంగులో ఉండే ఆకాశం పూర్తిగా ఆకుపచ్చ రంగులోకి మారింది. అమెరికాలోని దక్షిణ డకోటాలో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. సియాక్స్ ఫాల్స్ నగర వాసులు ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. హాలీవుడ్ సినిమాలో ఏలియన్స్ రావడానికి ముందు కన్పించే దశ్యాల్లా ఆకాశంలో ఈ మార్పులను చూసి నగరవాసులు ఆశ్చర్యంతో పాటు భయాందోళనకు గురయ్యారు. ఆ మార్పులే కారణం అయితే ఆకాశం ఆకుపచ్చగా మారడానికి వాతావరణంలో అనూహ్య మార్పులే కారణమని తెలుస్తోంది. దక్షిణ డకోటా, మిన్నెసొటా, అయోవ నగరార్లో మంగళవారం ప్రచండ గాలులతో తుపాను బీభత్సం సృష్టించింది. ఆ సమయంలోనే ఈ ప్రాంతాల్లో 'డెరోకో' ఏర్పడిందని వాతావరణ శాఖ ధ్రువీకరించింది. అందుకే ఆకాశం రంగు మారినట్లు పేర్కొంది. ఆకాశం ఆకుపచ్చ రంగులోకి మారినంత మాత్రాన టోర్నడోలు వస్తాయని భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వాతావరణ నిపుణులు తెలిపారు. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. The approach. @NWSSiouxFalls @keloland @dakotanews_now pic.twitter.com/NOl35jIlpt — jaden 🥞 🍦 (@jkarmill) July 5, 2022 #salemsd pic.twitter.com/ExbpCtV1tI — J (@Punkey_Power) July 5, 2022 ఆకుపచ్చగా ఎందుకు? ఆకాశం ఆకుపచ్చ రంగులోకి ఎందుకు మారుతుందో పూర్తిగా అర్థంకాకపోయినప్పటికీ పలు అమెరికా పరిశోధనా నివేదికలు దీని గురించి వివరించాయి. సూర్యాస్తమయం సమయంలో ఎరుపు కాంతి ఉన్నప్పుడు ఉరుములతో కూడిన వర్షం పడితే, గాలిలోని నీటి కణాల వల్ల ఆకాశం ఆకుపచ్చ రంగులో ఉన్నట్లుగా కనిపిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. తుపాను కారణంగా మంగళవారం రాత్రి నాలుగు గంటల పాటు దక్షిణ డకోటాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ ఆస్తి నష్టం కూడా సంభవించింది. గాలివాన వల్ల ఆకాశం పలుమార్లు నలుపు, నీలం, బూడిద, ఆకుపచ్చ రంగుల్లోకి మారింది. -
బుజ్జి పిట్ట.. బుల్లి పిట్ట.. పక్షి ప్రేమికుల విలక్షణ ఆలోచన
అనకాపల్లి: సూర్యుడు ఠారెత్తిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. ఈ సమయం.. పశుపక్ష్యాదులకు గడ్డుకాలం. పల్లెల్లో పక్షులకు ఏదో రూపంలో ఆహారం, నీరు సమకూరుతాయి. పట్టణ ప్రాంతాల్లో జంగిల్ కాంక్రీట్ పుణ్యమా అని నీరు లభించడమే కష్టమవుతోంది. అందుకే పక్షి ప్రేమికులు వాటి కోసం విలక్షణంగా ఆలోచించారు. పట్టణాల్లో కూడా ఆహారం, నీరు అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. పర్యావరణ పరిరక్షణకు విశేష సేవలందించిన కొణతాల ఫణిభూషణ్ శ్రీధర్ ఆధ్వర్యంలో సేవామూర్తులు పక్షులకు అండగా నిలుస్తున్నారు. చదవండి👉: 11 ఏళ్ల కిందట సంచలనం.. ఇప్పటి యువ ఐపీఎస్‌లకు పాఠమైంది.. పక్షి జాతిని కాపాడుకుందామని ప్రదర్శన చేస్తున్న విద్యార్థినులు నూనె డబ్బాను నాలుగు అరలుగా అమరిక చెట్ల వద్ద ఆహారం, నీటి సౌకర్యం గ్రీన్‌క్లబ్ వ్యవస్థాపకుడైన కొణతాల ఫణిభూషణ్ శ్రీధర్ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. తాను పని చేసే పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దే అలవాటు ఉన్న శ్రీధర్ మాస్టారు.. పర్యావరణ పరిరక్షణలో కూడా ముందుంటారు. వేసవి నేపథ్యంలో పట్టణంలో అక్కడక్కడా ఉండే చెట్ల వద్ద అలమంటించే పక్షులకు ఆహారం, నీటిని అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నూనె డబ్బాలను సగానికి కోసి దాంట్లో నాలుగు అరలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క అరలో కొర్రలు, గంట్లు వంటి ఆహార పదార్థాలను, మరో అరలో నీటిని వేసి చెట్లకు కట్టించారు. నీటి బాటిళ్లను మట్టిపాత్రలకు అమర్చి పలు చోట్ల ఏర్పాటు చేశారు. పక్షిజాతిని కాపాడుకోవాలని పలుచోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొక్కకు అమర్చిన మట్టిపాత్ర పక్షుల కోసమే.. ఇప్పటికే చాలా పక్షిజాతులు అంతరించిపోయాయి. వేసవికాలంలో అవి పడే ఇబ్బందులు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా నగరాల్లో పక్షులకు ఆహారం, మంచినీరు అందించే లక్ష్యంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. పక్షి జాతులకు ఎంతో కొంత సహాయం చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. ఈ మహాయజ్ఞంలో చాలా మంది పాలు పంచుకుంటున్నారు. – ఫణిభూషణ్ శ్రీధర్, క్లబ్ వ్యవస్థాపకుడు -
బాణాసంచాపై సంపూర్ణ నిషేధం లేదు
సాక్షి, న్యూఢిల్లీ: బాణాసంచా కాల్చడంపై సంపూర్ణ నిషేధం ఉండబోదని, గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతి ఉంటుందని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. వాటి దుర్వినియోగాన్ని అరికట్టడానికి పటిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కాళీ పూజ, దీపావళి, క్రిస్మస్, కొత్త ఏడాది వేడుకలు ఇతరత్రా పండుగల సమయంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి బాణాసంచా కాల్చడంపై నిషేధం విధిస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. గౌతమ్ రాయ్, సుదీప్త భౌమ్నిక్ తదితరులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. బాణాసంచా డీలర్ల తరఫు న్యాయవాది సిద్ధార్ధ భట్నాగర్ వాదనలు వినిపిస్తూ.. గ్రీన్ కాకర్స్‌కు అనుమతిస్తూ 2020లో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. బాణాసంచాపై పూర్తి నిషేధం లేదని, చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యానికి హానికలిగించే వాటినే నిషేధిస్తున్నట్లు ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ధర్మాసనానికి వివరించారు. గ్రీన్ కాకర్స్పై నిషేధం లేదని, సుప్రీంకోర్టు, ఎన్జీటీ ఆదేశాలు అమలు చేస్తున్నామని భట్నాగర్ తెలిపారు. ఇటీవలే నిషేధిత బేరియంతో బాణాసంచా తయారుచేస్తున్న పలు ఉత్పత్తి సంస్థలపై సీబీఐ కేసు నమోదు చేసిందన్నారు. జులై, అక్టోబరుల్లో వేర్వేరు పిటిషన్ల విచారణ సందర్భంగా బాణాసంచా కాల్చడంపై సంపూర్ణ నిషేధం ఉండదని, గ్రీన్‌కాకర్స్‌ను అనుమతిస్తామని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం తెల్సిందే. -
TS Assembly: పచ్చదనానికి హరిత నిధి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పచ్చదనం పెంచడం కోసం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగించడానికి తెలంగాణ హరిత నిధి (తెలంగాణ గ్రీన్‌ఫండ్)ను ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రతినెలా కొంత మొత్తాన్ని ఈ ఫండ్‌కు జమ చేయాలని కోరారు. దీనితోపాటు పలు ఇతర మార్గాల ద్వారా గ్రీన్‌ఫండ్‌కు నిధులు సమకూర్చుతామని వెల్లడించారు. శుక్రవారం శాసనసభలో హరితహారం అంశంపై చేపట్టిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ‘హరితనిధి’ ఏర్పాటుతోపాటు ఇతర ప్రతిపాదనలను వివరించారు. సభలో సీఎం చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్రంలో అడవులు నాశనం అవుతున్నాయి. ప్రణాళికబద్ధంగా పచ్చదనం పెంచాల్సిన అవసరముంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం పథకాన్ని ఐక్యరాజ్యసమితి కూడా ప్రశంసించింది. హరితహారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు హరితనిధిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు తమ వంతుగా ఆర్థిక సాయం చేయాలి. ఈ విషయంగా అఖిలభారత సర్వీసులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో మాట్లాడాం. ప్రతినెలా జీతాల నుంచి చెల్లించేందుకు వారు అంగీకరించారు. మొత్తం 184 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాల నుంచి నెలకు రూ.500 చొప్పున చెల్లించాలని కోరాం. దీనికి టీఆర్ఎస్ సభ్యులందరూ సమ్మతం తెలిపారు. ప్రతిపక్షాల నేతలు కూడా సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నాం. తెలంగాణ హరితనిధి దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. గ్రీనరీలో మూడో స్థానం ప్రపంచంలో గ్రీనరీ విషయంగా తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో కెనడా, రెండో స్థానంలో బ్రెజిల్, మూడో స్థానంలో రాష్ట్రం ఉంది. రాష్ట్రంలో మొత్తం 2.75 కోట్ల ఎకరాల భూమి ఉంది. అందులో 66.25 లక్షల ఎకరాల మేర అటవీ భూములు ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్‌లో ఒకప్పుడు అద్భుతమైన అడవులు ఉండేవి. ఇప్పుడు మాయమైపోయాయి. నర్సాపూర్ అడవులు మన కళ్ల ముందే ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలోనే హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఐక్యరాజ్యసమితి కూడా దీనిని ప్రశంసించింది. గ్రామపంచాయతీల్లో నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలతో పచ్చదనం ప్రాధాన్యతను ప్రజలకు చెప్పాం. 19,472 ఆవాసాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశాం. మండలానికి ఒకటి లెక్కన బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం. 526 మండలాల్లోని 7,178 ఎకరాల్లో ప్లాంటేషన్ పనులు విస్తృతంగా జరుగుతున్నాయి. పట్టణాల్లోని 109 ఏరియాల్లో మొత్తంగా 75,740 ఎకరాల్లో అర్బన్ ¯ఫారెస్టులు ఏర్పాటు చేస్తున్నాం. 53 అర్బన్ పార్కుల్లో పని బాగా జరిగింది. మిగతాచోట్ల కొనసాగుతున్నాయి. భారీ సంఖ్యలో మొక్కలు నాటాం మొత్తంగా రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటాలని హరితహారం లక్ష్యంగా పెట్టుకున్నాం. సిద్దిపేటలో 20కోట్ల మొక్కలు లక్ష్యంగా పెట్టుకుంటే, ఇప్పటికే 20.64 కోట్ల మొక్కలు నాటాం. గ్రేటర్ హైదరాబాద్, హెచ్ఎండీఏ పరిధిలో 10 కోట్ల మొక్కలు టార్గెట్ పెట్టుకుంటే 14.5 కోట్ల మొక్కలు నాటాం. అటవీ ప్రాంతాల బయట 130కోట్లు టార్గెట్‌గా పెట్టుకుంటే, 176.82 కోట్లు నాటాం. హైదరాబాద్ ఎకో సిస్టం నిర్వహణకు 188 రిజర్వు ఫారెస్ట్ బ్లాక్‌లున్నాయి. 1.60 లక్షల ఎకరాల భూమి ఉంది. వాటిని గోడలు, కంచెలతో రక్షిస్తున్నాం. గ్రామాలు, మున్సిపాలిటీల్లో పచ్చదనం పెంచడా నికి 10% బడ్జెట్‌ను గ్రీనరీకే పెట్టాం. మొక్కల బాధ్యత సర్పంచ్‌లకు అప్పగించాం. ఎమ్మెల్యేలు గ్రామాల్లో తనిఖీలు చేసి మొక్కల పరిస్థితిని పరిశీలించాలి. కంపా నిధులు కేంద్రానివి కావు కంపా నిధులు కేంద్ర ప్రభుత్వానివి కావు. 100 శాతం రాష్ట్రాల డబ్బే. నీటి ప్రాజెక్టులు, రోడ్లు, ఇతర అవసరాల కోసం అటవీ భూములు తీసుకుం టాం. ఇందుకోసం అడ్వాన్స్ కింద రాష్ట్రాలు కేంద్రానికి డబ్బు చెల్లించాలి. ఇలా తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్లిన సొమ్ము రూ.4,675 కోట్లు. ఈ నిధులనే తిరిగి రాష్ట్రానికి విడుదల చేయాలని ప్రధాని మోదీని కలిసి కోరాం. నాలుగేళ్ల తర్వాత రూ.3,109 కోట్లు విడుదల చేశారు. అందులో రూ.1,320 కోట్లు ఖర్చు పెట్టాం. ఉపాధి హామీ కింద రూ.3,673 కోట్లు ఖర్చు చేశాం. హెచ్ఎండీఏ ద్వారా రూ.367 కోట్లు, జీహెచ్ఎంసీ ద్వారా రూ.83 కోట్లు ఖర్చు పెట్టాం. నర్సరీల పెంపకం, కూలీలు, మొక్కల సరఫరా, నీటి రవాణాకు ఈ నిధులు వినియోగించాం. ఎక్కడా దుర్వినియోగం లేదు. ఇప్పటివరకు హరితహారం కోసం రూ.6,555 కోట్లు ఖర్చు చేశాం. అధికారుల అత్యుత్సాహం పోడు భూముల విషయంగా కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అడవి మీద ఆధారపడి బతికే గిరిజనులను గందరగోళానికి గురిచేస్తున్నారు. ఇటీవల ఘర్షణలు కూడా జరిగాయి. గతంలో యూపీఏ ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది. అడవుల్లో జీవిస్తున్న గిరిజనులకు ఆశ్రయం కల్పించేందుకు 2005 నాటికి ఎవరెవరు, ఎక్కడ ఉన్నారో సర్వే చేశారు. ఆ ప్రకారం భూములకు పత్రాలు ఇచ్చారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అటవీ భూముల ఓనర్షిప్ మారదు. అది సుప్రీంకోర్టు తీర్పుల మేరకు రూపొందిన కేంద్ర చట్టం. మన చేతుల్లో ఏమీ లేదు. రాష్ట్రంలో 96,676 మంది గిరిజనులకు 3.08 లక్షల ఎకరాల మేర ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చాం. రైతుబంధు ప్రారంభించినప్పుడు వారికి రైతుబంధు వచ్చేది కాదు. తర్వాత వారికి కూడా ఇస్తున్నాం. పోడు భూములపై ఢిల్లీకి అఖిలపక్షం పోడు భూముల వ్యవçహారాన్ని తేల్చుతామని ప్రజలకు హామీ ఇచ్చాం. తేల్చాల్సిన అవసరం ఉంది. అటవీ అధికారులు, గిరిజనుల మధ్య గొడవలు ఉండటం మంచిది కాదు. అది సమసిపోవాలి. ఈ సమస్యపై మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో సబ్ కమిటీ చేశాం. ఇప్పటికే పట్టాలిచ్చిన భూములు కాకుండా.. ఎంత భూమిలో పోడు వ్యవసాయం చేస్తున్నారో తేల్చాల్సి ఉంది. వారికి కూడా ఆర్వోఎఫ్ఆర్ పట్టాలిచ్చి, రైతుబంధు ఇస్తే సమస్య సమసిపోతుంది. ఇందుకోసం చట్టంలో పేర్కొన్న కటాఫ్ తేదీని పొడిగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. సబ్ కమిటీ రిపోర్టు ఆధారంగా ఈ శాసనసభ సమావేశాల్లోనే ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిద్దాం. అవసరమైతే పోడు భూముల విషయంలో అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాం. దీనితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి మన ప్రాంతంలోకి వస్తున్న గిరిజనులను అడ్డుకుని, మన గిరిజనులకు రక్షణ కల్పించాల్సి ఉంది. అసైన్డ్ భూములను లాక్కోవడం లేదు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అసైన్డ్ భూములను ప్రభుత్వం లాగేసుకుంటోందన్న ప్రతిపక్ష సభ్యుల విమర్శలపై సీఎం కేసీఆర్ స్పందించారు. ‘‘అభివృద్ధి కార్యక్రమాల కోసం అనివార్య పరిస్థితుల్లోనే అసైన్డ్ భూములను తీసుకుంటున్నాం. వంద ఎకరాలను దళితులకు అసైన్ చేశామని అనుకుందాం. మరి ఆ భూములకు నీరివ్వాలంటే కాల్వను ఆ భూముల నుంచే తవ్వాలి. అందువల్ల కొంత భూమి తీసుకోవాల్సి వస్తుంది. పట్టా భూమి ఉన్నవారికి ఎంత పరిహారం ఇస్తామో, వీరికీ అంతే పరిహారం ఇస్తున్నాం. అనవసరంగా తీసుకున్నవి ఎక్కడైనా ఉంటే చెప్పండి. కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ’’ అని స్పష్టం చేశారు. ఆ 7 మండలాలపై ప్రధానితో గొడవపడ్డా.. రాష్ట్ర విభజన సమయంలో ఇష్టమున్నట్టు గీతలు గీసి భద్రాచలం నియోజకవర్గంలోని ఏడు మండలాలను ఏపీలో కలిపారని, తమ ప్రజలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య అసెంబ్లీలో ప్రస్తావించగా.. సీఎం కేసీఆర్ స్పందించారు. ‘‘ఏడు మండలాలను ఇష్టమొచ్చినట్టుగా ఏపీలో కలిపారు. అది ఫాసిస్ట్ పద్ధతి. ఈ విషయంగా ప్రధానమంత్రితోనూ గొడవపడ్డాను. గతంలో చంద్రబాబు, వెంకయ్యనాయుడులకూ చెప్పాను. ప్రస్తుతం అక్కడ వేరే ప్రభుత్వం ఉంది..’’ అని పేర్కొన్నారు. ఇతర మార్గాల ద్వారా.. ►నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)కు ప్రభుత్వం నుంచి అందుతున్న మాదిరిగానే.. ప్రభుత్వ పనులు చేపట్టే సివిల్, ఇతర కాంట్రాక్టుల నిధుల్లోంచి విధిగా 0.1 శాతాన్ని హరిత నిధికి జమచేయాలి. దీనిద్వారా ఏటా రూ.20–30 కోట్లు వస్తాయని అంచనా. ►నియోజకవర్గ అభివృద్ధి నిధి నుంచి 10 శాతాన్ని హరితనిధికి జమ చేయాలి. రాష్ట్రంలో జరుగుతున్న అన్నిరకాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రతీ లావాదేవీకి రూ.50 చొప్పున హరిత నిధికి జమచేయాలి. ►వ్యాపార సంస్థల లైసెన్సు రెన్యువల్ సందర్భంగా రూ.1,000 జమ చేయాలి. హరితనిధి ఇలా.. ప్రజాప్రతినిధులు, అధికారులు (ప్రతినెలా జీతాల్లోంచి..) ►ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల నుంచి రూ.500 (రాష్ట్రానికి చెందిన 24 మంది లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల్లో 16 మంది టీఆర్ఎస్ ఎంపీలు హరితనిధికి ప్రతినెలా రూ.500 ఇవ్వడానికి అంగీకరించారు.) ►జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ల నుంచి రూ.100 ►మున్సిపల్ చైర్పర్సన్, ఎంపీపీ, జెడ్పీటీసీల నుంచి రూ.50 ►మున్సిపల్ కార్పొరేటర్, కౌన్సిలర్, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీల నుంచి రూ.10 ►ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల నుంచి రూ.100 చొప్పున.. ►రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి రూ.25 సాయపడతాం ప్రభుత్వం ప్రతిపాదించిన హరితనిధి కోసం కాంగ్రెస్ శాసనసభాపక్షం నుంచి కంట్రిబ్యూషన్ ఇస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో అమాయక ప్రజల భూములు పోకూడదని.. సుమారు ఆరేడు లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. భద్రాచలం పక్కనే ఉన్న ఐదు గ్రామాల విషయంగా వెంటనే తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని.. ఏపీ ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. దళితులకు ఇచ్చిన భూములను హరితహారం కోసం తీసుకోవద్దని డిమాండ్ చేశారు. కాగా.. బీజేపీ నేత రాజాసింగ్ మాట్లాడుతూ.. హరితనిధి ప్రతిపాదనపై హర్షం వ్యక్తం చేశారు. దీంతో భట్టి, రాజాసింగ్ ఇద్దరికీ సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. -
హరిత ఇంధనమే భవితకు బాట
పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అసాధారణంగా పెరిగిపోతున్నాయి. ఇతర సహజవనరుల విషయంలోనూ పర్యావరణపరమైన ఒత్తిళ్ళున్నాయి. ఈ నేపథ్యంలో ఇంధన వనరుల రంగం సమూలంగా దిశ మార్చుకుంటోంది. వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాల వినియోగం నుంచి ప్రపంచం సౌర, పవన, హైడ్రోజన్ వంటి పునర్వినియోగ ఇంధనాల వైపు మళ్లుతోంది. విద్యుత్తు వినియోగం, రవాణా–ప్రయాణ రంగంలో వాహ నాలకు పునర్వినియోగ ఇంధన వాటా పెరిగితేనే, ‘వాతావరణ మార్పు’ ప్రతికూల ప్రభావాల నుంచి స్థూలంగా ప్రపంచానికి, ప్రత్యేకంగా భారత్‌కు రక్ష! ఆధునిక మానవుడి నిత్యావసరమైన ఇంధన వనరు రంగం సమూలంగా దిశ మార్చుకుంటోంది. కర్భన ఉద్గారాలతో వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాల వినియోగం నుంచి ప్రపంచం సౌర, పవన, హైడ్రోజన్ వంటి పునర్వినియోగ (స్వచ్ఛ– హరిత) ఇంధనాల వైపు మళ్లుతోంది. ఇదొక... అవసర, అనివార్య స్థితి! ఈ మార్పుకనుగుణంగా భారత్‌లోనూ బలమైన అడుగులే పడు తున్నాయి. అక్టోబర్ నెలాఖరుకి 150 గిగావాట్లు, 2022 సంవత్సరాం తానికి 175 గిగావాట్ల పునర్వినియోగ విద్యుత్ ఇంధన (ఆర్ఈ) స్థాపక సామర్థ్యానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమౌతోంది. (ఒక గిగా వాట్ అంటే వెయ్యి మెగావాట్లు) గాంధీ జయంతి రోజైన శనివారం 2.2 గిగావాట్లు, నెలాఖరున మరో 2.32 గిగావాట్ల స్థాపక సామర్థ్య ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. కార్పొరేట్ రంగం నుంచి ఇటీవల వచ్చిన భారీ ప్రకటనల ప్రకారం.... రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ వచ్చే మూడేళ్లలో రూ 75 వేల కోట్లు (పది బిలియన్ డాలర్లు), అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ వచ్చే పదేళ్లలో రూ 1.50 లక్షల కోట్లు (ఇరవై బిలియన్ డాలర్లు) çపునర్వినియోగ ఇంధన రంగంలో వ్యయం చేయనున్నారు. ప్రభుత్వాలు, పరిశ్రమ, పౌర సమాజం... అప్రమత్తంగా ఉండి భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా బాటను చక్కదిద్దుకోవడమే వారి ముందున్న కర్తవ్యం. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అసాధారణంగా పెరిగిపోతున్నాయి. ఇతర సహజ వనరుల విషయంలోనూ పర్యావరణపరమైన ఒత్తిడులున్నాయి. వాటి లభ్యత కష్టం–ఖరీదవుతుండగా, వినియోగం దుర్భరమౌతున్న పరిస్థి తుల్లో పర్యావరణ సానుకూల çపునర్వినియోగ ఇంధనాల వినియోగ వాటాను పెంచడం ఆరోగ్యకర పరిణామం! ఐక్యరాజ్యసమితి (యూఎన్) నిర్దేశించనట్టు, 2015 పారిస్ పర్యావరణ ఒప్పందం ప్రకారం నిర్దేశిత లక్ష్యాలు చేరుకోవడానికి ఈ దిశలో పయనం అత్య వసరం! అదే సమయంలో సుస్థిరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుంటే, ఇప్పుడు చైనా ఎదుర్కొంటున్న తీవ్ర విద్యుత్ సంక్షోభ దుస్థితి మనకూ తప్పదు! ప్రపంచంలో అత్యధికంగా బొగ్గు వినియో గించే చైనా సదరు శిలాజ ఇంధన వాడకాన్ని రమారమి తగ్గించింది. గత దశాబ్దారంభంలో 68 శాతం ఉన్న బొగ్గు వినియోగం వాటాని, 2020లో 56 శాతానికి తగ్గించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సరిగా లేనందున ఇప్పుడు పారిశ్రామిక, నివాస, ట్రాఫిక్ నిర్వహణ వంటి నిత్యావసరాలకూ తీవ్ర విద్యుత్ కొరత ఎదుర్కొంటూ దిగుమతుల కోసం దిక్కులు చూస్తోంది. సరైన దిశలోనే భారత్! అమెరికా, చైనా తర్వాత ఎక్కువ కర్బన ఉద్గారాలను (గ్రీన్ హౌజ్ గ్యాసెస్) విడుదల చేస్తున్న దేశంగా భారత్‌పై పర్యావరణ పరిరక్షణ బాధ్యత ఎంతో ఉంది. 2030 నాటికి, కార్బన్ ఫుట్‌ప్రింట్‌ని 33–35 శాతం (2005 నాటి స్థాయిపై లెక్కించి) మేర తగ్గిస్తామని పారిస్‌లో మాటిచ్చాం. పునర్వినియోగ ఇంధన వాటాని 40 శాతానికి పెంచుతా మన్నది కూడా ఒప్పందంలో భాగమే! ఇప్పటికే 38.4 శాతానికి చేరు కున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది. ప్రభుత్వ–ప్రయివేటు రంగంలో తాజాగా వస్తున్న పెట్టుబడులు, ప్రణాళికల్ని బట్టి ఈ వాటాను 2030 నాటికి 66 శాతానికి పెంచే ఆస్కారముంది. పర్యా వరణ సానుకూల దిశలో గట్టి ముందడుగు పడ్డట్టే! కార్బన్ డైయాక్సైడ్ (సీవోటూ) వంటి కర్బన ఉద్గారాలను 28 శాతానికి తగ్గించినట్టు ప్రభుత్వం చెబుతోంది. కోవిడ్ రెండో అల సమయంలో దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం తగ్గి, బొగ్గు ఉత్పత్తి పెరిగింది. కానీ, సాధారణ పరిస్థితుల్లో విద్యుత్ వినియోగం మనదేశంలో పెరుగుతోంది. గరిష్ట వినియోగ సమయంలో (పీక్) గత జూలై 7న, 200.57 గిగావాట్ల విద్యుత్ వినియోగం జరిగినట్టు కేంద్ర ఇంధన మంత్రి రాజ్‌కుమార్ సింగ్ తెలిపారు. ప్రపంచ సగటు తలసరి కర్బన ఉద్గారాలతో పోలిస్తే మన తలసరి మూడో వంతేనని ఇటీవల ఒక అంతర్జాతీయ వేదిక నుంచి, సదరు మంత్రి సెలవిచ్చారు. కర్బన ఉద్గారాల సున్నాస్థితి (జీరో న్యూట్రాలిటీ) సాధించే విషయమై భారత్ నిర్దిష్ట ప్రకటన చేయాలన్న వాదనను తోసిపుచ్చుతూ ఆయనీ మాటలన్నారు. కానీ, అది సరైన వాదన కాదనేది పర్యావరణ కార్యకర్తల భావన! ప్రపం చంలో రెండో అతి పెద్ద ఉత్పత్తి దేశం, రెండో అత్యధిక జనాభా దేశం, కర్బన ఉద్గారాల్లో మూడో అతిపెద్ద దేశం. తలసరి ఉద్గారాల వెల్లడి తక్కువే అయినా, విస్తృత జనాభా రీత్యా, దీన్ని తీవ్ర సమస్యగానే పరిగణించాలి. నెల రోజుల్లో గ్లాస్గోవ్లో జరుగనున్న ‘కాప్–26’ యూఎన్ సదస్సులోగానీ, ముందేగానీ దీనిపై నిర్దిష్ట ప్రకటన చేయా లని భారత్‌పై అంతర్జాతీయ సమాజం నుంచి వత్తిడి పెరుగుతోంది. భూమి ఒక వివాదాంశమే! భారత్ పురోగమిస్తున్న çపునర్వినియోగ ఇంధన రంగంలో, అందుక వసరమైన భూలభ్యత, సేకరణ, వినియోగం జఠిల సమస్యే కానుంది. హరిత మార్గాలైన సౌర విద్యుత్కైనా, పవన విద్యుత్తుకైనా నిర్దిష్టంగా స్థలం అవసరమౌతుంది. పునర్వినియోగ ఇంధనాల ద్వారా. 2050 నాటికి కర్భన ఉద్గారాల శూన్యస్థితి సాధించాలంటే ‘ఇంధన వ్యయ– ఆర్థిక విశ్లేషన సంస్థ’ (ఐఈఈఎప్ఎ) అధ్యయనం ప్రకారం, పెద్ద మొత్తం భూమి అవసరమౌతుంది. సౌర విద్యుత్ వ్యవస్థకు 50,000 నుంచి 70,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, పవనవిద్యుత్ వ్యవస్థ కోసం మరో 15,000 నుంచి 20,000 చ.కి.మీ భూమి అవసరమౌతుంది. అంటే ఒక్క విద్యుత్తుకే మొత్తం భూభాగంలో 1.7 నుంచి 2.5 విస్తీర్ణం, అటవీయేతర భూభాగంలో దీన్ని 2,2 నుంచి 3.3 శాతంగా లెక్కగట్టారు. ఇది మంచిది కాదని, భూమ్యావరణ వ్యవస్థకు చేటని పర్యావరణవేత్తలంటున్నారు. ఆహారోత్పత్తిపైనా ప్రతికూల ప్రభా వమే! బడా కార్పోరేట్ల స్పర్థలో భూసేకరణ, భూదురాక్రమణలు మళ్లీ వివాదాస్పదమనే అభిప్రాయం ఉంది. ఈ విషయంలో తగినంత కస రత్తు జరగాలని, భూవినియోగ విధానాలు సమగ్రంగా ఉండాలని ఆ సంస్థ సిఫారసు చేసింది. సౌరవిద్యుత్ పలకలు (ప్యానల్స్), పవన్ విద్యుత్ టవర్స్ ఏర్పాటు చేసే భూములు, సామాజికంగా–వ్యావసా యికంగా–పర్యావరణ పరంగా తక్కువ ప్రభావితమయ్యే ప్రాంతాలు, ప్రభుత్వ ఖాళీ, పోరంబోకు, గైరాన్ వంటి భూముల్ని ఎంపిక చేయాలి. గరిష్ట ప్రయోజనం–కనీస వివాదం ప్రాతిపదకగా ఉండాలనీ సూచించింది. పంట కాల్వలపైన, ప్రయివేటు–కృత్రిమ జలాశయాల పైన సౌరపలకలు ఏర్పాటు చేయడం మంచిదంటున్నారు. ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నపుడు, నీటిపారుదల ప్రాజెక్టు కాలువ లపై సౌరపలకలు ఏర్పాటు చేసిన నమూనాకు ‘జాతీయ సోలార్ మిషన్’గా యూఎన్ స్థాయిలో ప్రచారం కల్పించారు. ఇపుడు దేశ వ్యాప్తంగా దాన్ని మరింత విస్తృతపరచవచ్చు. ఇళ్లు, ఇతర నివాస ప్రదేశాలు, కార్యాలయాలపైన (రూప్‌టాప్) కూడా ప్యానల్స్ ఏర్పాటు చేయడం సముచితమనే అభిప్రాయముంది. ఫ్రాన్స్‌లో ఒక దశలో, ప్రతి ఇంటి పైకప్పునూ అయితే హరితంతో లేదా సౌరపలకలతో గానీ కప్పి ఉంచేట్టు ఇచ్చిన ఆదేశాలు ఫలితమిచ్చాయి. పెట్రోలియం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో వేగంగా పెరుగు తున్నాయి. బ్యారెల్ క్రూడ్ 90 డాలర్లకు చేరనుందని వార్తలొస్తు న్నాయి. భారత్, 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. దేశీయంగా పెట్రో ఉత్పత్తి విస్తరణ అవకాశాలు తక్కువ. ఎలక్ట్రిక్ వాహనాలు రావాల్సినంత త్వరగా భారత్ మార్కెట్లోకి రావటం లేదు. ఏయే లాబీలు బలంగా పనిచేస్తున్నాయో గానీ, వాటికెన్నో ప్రతి బంధకాలు! పెట్రో ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్) అధ్యయనం ప్రకారం, వచ్చే పాతికేళ్లలో, డీజిల్–గ్యాసోలైన్పై ఆధారపడి నడిచే మన వాహనాల వాటా 51 శాతం నుంచి 58 శాతానికి పెరుగనుంది. ఇది, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. విద్యుత్తు వినియోగం, రవాణా–ప్రయాణ రంగంలో వాహనాలకు పునర్వినియోగ ఇంధన వాటా పెరిగితేనే, ‘వాతావరణ మార్పు’ ప్రతికూల ప్రభావాల నుంచి స్థూలంగా ప్రపంచానికి, ప్రత్యేకంగా భారత్‌కు రక్ష! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
స్వచ్ఛ భారత్ కోసం రిలయన్స్ మెగా ప్లాగింగ్
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌ను చెత్తరహిత దేశంగా మార్చేందుకు రిలయన్స్ కు చెందిన ఆర్ ఎలాన్ (ఫ్యాబ్రిక్ మ్యానుఫాక్చరింగ్ సంస్థ) చేపట్టిన రన్ విజయవంతం అయింది. భారతదేశపు మొదటి ప్లాగర్ రిపు దామన్ భాగస్వామ్యంతో అటు పర్యావరణ పరిరక్షణ ఇటు ఫిట్నెస్ను సాధించే ఉమ్మడి లక్ష్యంతో చేపట్టిన ప్లాగింగ్ రన్‌ను గురువారం విజయవంతంగా ముగించింది. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఈ గ్రాండ్‌ఫినాలేకు కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు కూడా హజరయ్యారు. 50 నగరాల ప్రజలు ఈ రన్లో పాల్గొన్నారని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఆర్ఎలాన్ సంస్థ వెల్లడించింది. ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించేందుకు సెప్టెంబర్ 5న కొచ్చిలో ప్రారంభమైన ఈ రన్ ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో పూర్తి అయిందని, ఈ సందర్భంగా తమకు ఘనస్వాగతం లభించిందని తెలిపింది. ముంబై, హైదరాబాద్, కోల్‌కతా తదితర 50 నగరాల్లో సుమారు 1000 కిలోమీటర్ల మేర కొనసాగిన ఈ మెగా రన్లో సుమారు 2.7 టన్నుల ప్లాస్టిక్ చెత్తను సేకరించారు. ‘రన్ టు మేక్ ఇండియా లిట్టర్ ఫ్రీ' కార్యక్రమంపై ప్లాగర్ దామన్ స్పందిస్తూ ఇది డ్రీమ్ రన్ అని పేర్కొన్నారు. తమ ప్రయత్నాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత క్రీడా అథారిటీ గుర్తించడం గర్వంగా ఉందని దామన్ అన్నారు. ఆర్ఐఎల్ పాలిస్టర్ బిజినెస్ సీఈవో గుంజన్ శర్మ మాట్లాడుతూ ఈ ప్లాగింగ్ రన్ దేశవ్యాప్తంగా లభించిన ఆదరణ తమకెంతో సంతోషానిచ్చిం దన్నారు. పర్యావరణంపై అవగాహనతోపాటు, పౌరులలో ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను పెంపొందింస్తామన్నారు. అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలతో గ్రీన్ గోల్డ్ ఫైబర్‌తో అద్భుతమైన దుస్తులను తయారుచేస్తామని వెల్లడించారు. కాగా రి లయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో గ్రీన్ గోల్డ్ ఫైబర్ అద్భుతమైన వస్త్రాలను తయారు చేస్తుంది. ప్లాంట్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీ లోని ప్లాంట్ ద్వారా ప్రతి ఏటా ఈ యూనిట్ 2.5 బిలియన్ పెట్ బాటిల్స్‌ను రీసైకిల్ చేస్తుంది. దీన్ని పర్యావరణహితమైన గ్రీన్ గోల్డ్ ఫైబర్‌గా మారుస్తున్న సంగతి తెలిసిందే. -
మొక్క నాటిన సింధు
రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్‌చాలెంజ్‌కు బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు స్పందించారు. దీనిలో భాగంగా శనివారం ఆమె మూడు మొక్కలు నాటి హరితహారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతుగా కృషి చేయాలని కోరారు. అలాగే విరాట్ కోహ్లి, అక్షయ్ కుమార్, సానియా మీర్జాలకు గ్రీన్ చాలెంజ్ చేసి మొక్కలు నాటాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. – బంజారాహిల్స్ -
యువతకు ఉపాధే లక్ష్యం
సాక్షి, యాదాద్రి: యువతకు ఉపాధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో టీఎస్ఐఐసీ–టీఐఎఫ్–ఎంఎస్ఎంఈ–గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను సహచర మంత్రి జి. జగదీశ్‌రెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. అనంతరం పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో కేటీఆర్ మాట్లాడారు. రూ.1,552 కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో 450 యూనిట్ల స్థాపనకు వీలుగా ఏర్పాటు చేసిన ఈ పార్కు ద్వారా ప్రత్యక్షంగా 19 వేల మందికి, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. వాక్–టు–వర్క్ విధానంలో భాగంగా పార్కులోనే 192 ఎకరాల్లో హౌసింగ్ కాలనీ నిర్మిస్తున్నట్లు చెప్పారు. టీఎస్ ఐపాస్ ద్వారా 12 లక్షల ఉద్యోగాలను సృష్టించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ నాయకులకు పాలన వచ్చా? అని ఎగ తాళి చేసిన వాళ్లే ఇవాళ రాష్ట్ర విధానాలను అనుసరిస్తున్నారని గుర్తుచేశారు. టీఎస్ ఐపాస్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఢిల్లీలో జరిగిన పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రుల సమావేశంలో తెలంగాణ పరిశ్రమల విధానాన్ని ఇతర రాష్ట్రాలు కోరుకుంటున్నాయని చెప్పారు. ‘మాది తెలంగాణ’అని గర్వంగా చెప్పుకునే స్థాయికి వచ్చామన్నారు. పక్షం రోజుల్లోనే అనుమతులు... సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని, 15 రోజుల్లో అనుమతులు రాకుంటే డీమ్డ్ అఫ్రూవల్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణయేనని కేటీఆర్ తెలిపారు. పరిశ్రమలకు అనుమతులివ్వడంలో జాప్యం చేసిన అధికారులకు రోజుకు రూ. వెయ్యి జరిమానా విధిస్తున్నామన్నారు. ప్రస్తుతం దేశంలో అన్ని రంగాలకు 24 గంటల కరెం ట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సూక్ష్మ, స్థూల, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలబడుతోందన్నారు. పెద్ద పరిశ్రమల్లో యాంత్రీ కరణ ఎక్కువగా ఉండి ఉపాధి అవకాశాలు తక్కువగా ఉంటాయని, ఎంఎస్ఎంఈ పరిశ్రమల్లోనే 70 శాతం ఉద్యోగాలు వస్తాయన్నారు. భవిష్యత్తులో 2 వేల ఎకరాలకు విస్తరణ... గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను ప్రస్తుతం 440 ఎకరాల్లో ప్రారంభించినా భవిష్యత్తులో 2 వేల ఎకరాలకు విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తామని కేటీఆర్ తెలిపారు. 440 ఎకరాల్లో పార్క్ ఏర్పాటు చేసినా మరింత స్థలం కావాలని పారిశ్రామికవేత్తలు కోరుతున్నారని, పార్క్ విస్తరణకు అవసరమైన భూసేకరణ కోసం వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనితా రామచంద్రన్‌ను ఆదేశించారు. గ్రీన్ ఇండస్ట్రీకి మాత్రమే ఇందులో పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 33/11 కేవీ సబ్‌స్టేషన్ ప్రారంభించుకున్నామని, పెరిగే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ దగ్గర 132 కేవీ సబ్ స్టేషన్ ప్రారంభిస్తామన్నారు. వరంగల్‌లో దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్‌ను, సంగారెడ్డి జిల్లా లో దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటు చేశామన్నారు. ప్లాస్టిక్ పార్క్, మైక్రో ప్రాసెసింగ్ పార్క్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేశామన్నారు. ఏ పరిశ్రమ ఏర్పాటైన మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులకు ప్రత్యేక కోటా కేటాయిస్తున్నట్లు చెప్పా రు. చౌటుప్పల్ ప్రాంతంలో 40 కాలుష్యకారక పరిశ్రమలు పనిచేస్తున్నాయన్నారు. కాలుష్య నివారణకు ఎఫ్లు్యయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందన్నారు. మరో 3 చోట్లా ఇండస్ట్రియల్ పార్క్‌లు... నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌లలోనూ ఇండస్ట్రియల్ పార్క్‌లు ఏర్పాటు చేయబోతున్నామని కేటీఆర్ తెలిపారు. త్వరలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు డ్రైపోర్టు రాబోతుందన్నారు. ఖాయిలా పరిశ్రమలను ఆదుకోవడానికి ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌ను తీసుకురానున్నట్లు వివరించారు. పార్క్‌కు భూములిచ్చిన వారికి కుటుంబానికో ఉద్యోగమివ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి 10 ఎకరాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక యువతకు పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. రాష్ట్రానికి అన్నీ చిన్న పరిశ్రమలే వస్తున్నాయని, భారీ పరిశ్రమలను తీసుకురావాల్సిన అవ సరం ఉందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి స్థానిక శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అధ్యక్షత వహించారు. స్థానిక యువతకు ప్రాధాన్యత: మంత్రి జగదీశ్‌రెడ్డి మల్కాపురం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ దేశానికే ఆదర్శంగా ఉంటుందని, ఇందులో స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యతిస్తా మని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. మంత్రి కేటీఆర్ తన ప్రతిభతో రాష్ట్రాన్ని పరిశ్రమలు, ఐటీకి కేరాఫ్ అడ్రస్‌గా మార్చివేశారన్నారు. -
హరిత ప్రణాళికలు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించే ప్రధాన లక్ష్యంతో చేపడుతున్న 30 రోజుల ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలోని పంచాయతీల్లో హరిత ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రాష్ట్రంలోని 530 గ్రామాల్లో మినహా మొత్తం 12,221 పంచాయతీల్లో గ్రీన్ ప్లాన్ రూపొందించుకున్నట్లు గ్రామ పంచాయతీల నుంచి ప్రభుత్వానికి అధికారులు నివేదికలు అందజేశారు. ఈ ప్రణాళికలో భాగంగా పెద్దసంఖ్యలో మొక్కలు నాటడం, నాటిన మొక్కలను కాపాడుకోవడం ముఖ్యకర్తవ్యంగా నిర్దేశించుకున్నారు. గ్రామాల్లోని నర్సరీల్లో మొక్కలు పెంచడం, వాటిని గుర్తించినచోట్ల నాటడం, ఇళ్ల పరిసరాల్లో నాటేందుకు యజమానులకు పంపిణీ చేయడం, వాటి సంరక్షణ చర్యలను గురించి హరిత ప్రణాళికల్లో వివరిస్తున్నారు. 12,250 గ్రామాల్లో వార్షిక ప్రణాళిక .. ప్రస్తుతం గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక చురుకుగా అమలవుతున్న నేపథ్యంలో 12,250 గ్రామాల్లో వార్షిక ప్రణాళికకు తుదిరూపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న 30 రోజుల పల్లె ప్రగతి ప్రణాళికను స్ఫూర్తిగా తీసుకుని ఏడాది పొడవునా నిర్వహించేలా 365 రోజుల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ తీర్మానాలను పంచాయతీ, గ్రామసభల్లో తీర్మానం చేసుకుని ఏడాది అంతా అభివృద్ధి పనులు కొనసాగించే దిశలో చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. గ్రామాల్లో నియమితులైన స్టాండింగ్ కమిటీ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, పంచాయతీల పాలకవర్గాలు ఈ ప్రణాళికలను రూపొందించుకుంటున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామ పంచాయతీలకు గాను 12,250 గ్రామాల్లో వార్షిక ప్రణాళికలు సిద్ధమైనట్టు పీఆర్‌శాఖ అధికారులు తెలియజేశారు. ఈ వార్షిక ప్రణాళికలు రూపొందించుకున్న గ్రామాలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయానికి తమ నివేదికలను అందజేసినట్టు సమాచారం. వార్షిక ప్రణాళికలో భాగంగా వారంలో ఒక రోజు వీధుల్లో, గ్రామంలో ఒక రోజు గ్రామస్తులంతా కలిసి శ్రమదానం, మొక్కలు నాటడంతోపాటు గ్రామసభల్లో అందరూ కలిసి కొత్త నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రణాళిక తయారు చేసుకుంటున్నారు. -
శ్రీకాంత్‌కు వనమిత్ర అవార్డు
బంజారాహిల్స్: గ్రీన్‌చాలెంజ్‌లో భాగంగా గతేడాది సీనీహీరో శ్రీకాంత్ నాటిన మొక్కలకుగాను ఆదివారం ఆయనకు వనమిత్ర అవార్డును అందుకున్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ గ్రీన్‌చాలెంజ్‌కు స్పందించి శ్రీకాంత్ మొక్కను నాటి మరో ముగ్గురు సీనీనటులు నాని, విజయ్ దేవరకొండ, అల్లరి నరేష్‌లకు సవాలు విసిరారు. హరితహారాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేసేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. -
‘ట్రాఫిక్’ పందిరి
వరంగల్ క్రైం: సాధారణంగా మనం వాహనాలపై రహదారి మీదుగా వెళ్తుంటే ఎక్కడా నీడ కనిపించదు.. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరైతే పరిస్థితి మరీ దారుణం. పైన ఎండ సుర్రుమంటున్నా గ్రీన్‌సిగ్నల్ పడే వరకు వేచి చూడాల్సిందే.. ఈ విష యమై వాహనచోదకుల ఇబ్బందులను గుర్తించిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఓ ఉపాయం తట్టింది. దీంతో వెంటనే హన్మకొండలోని అదాలత్ సర్కిల్‌తోపాటు పలు కూడళ్ల వద్ద గురువారం గ్రీన్ నెట్ ఏర్పాటు చేయించారు. దీంతో ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు కూడళ్ల వద్ద ఆగే వాహనదారులకు కొంత ఉపశమనం కలుగుతోంది. దీనికితోడు విధులు నిర్వర్తించే ట్రాఫిక్ కానిస్టేబుళ్లు కూడా నీడ పట్టున ఉంటున్నట్లవుతోంది. -
అనూహ్యంగా లాభాల్లోకి
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు అనూహ్యంగా లాభాల్లోకి మళ్లాయి. ఆరంభంలో 100 పాయింట్లకు పైగా క్షీణించిన ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో భారీగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం దాదాపు 200 పాయింట్లు ఎగిసింది. నిఫ్టీ కూడా అదే బాటలో పయనిస్తూ 10900స్థాయికి పైన ట్రేడ్ అవుతోంది. . ప్రధానంగా ఐటీ, ప్రభుత్వ రంగ బ్యాంక్స్ , మెటల్ సెక్టార్ కొనుగోళ్లు జోరందుకోవడంతో సెన్సెక్స్ లాభాల్లోకి మళ్లింది. అయితే రియల్టీ ప్రయివేట్ బ్యాంక్స్, ఆటో నష్టపోతున్నాయి. ఇన్ఫీబీమ్ 16 శాతం దూసుకెళ్లగా, నిట్ టెక్, మైండ్‌ట్రీ, టీసీఎస్, ఒరాకిల్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లాభపడుతున్నాయి. వీటితోపాటు యస్ బ్యాంక్, హిందాల్కో, ఐబీ హౌసింగ్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫ్రాటెల్, ఐసీఐసీఐ, ఎస్బీఐ లాభపడుతున్నాయి. ఇక రియల్టీ విషయానికి వస్తే యూనిటెక్, ఇండియాబుల్స్, సన్‌టెక్, డీఎల్ఎఫ్, ఫీనిక్స్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, శోభా, బ్రిగేడ్ 6-2 శాతం మధ్య పతనమయ్యాయి. ఇంకా హెచ్‌పీసీఎల్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్, ఇండస్ఇండ్, భారతీ ఎయిర్టెల్, ఎల్అండ్టీ, బజాజ్ ఫిన్సర్వ్, గ్రాసిమ్, బీపీసీఎల్, కొటక్ బ్యాంక్ తదితరాలు నష్టపోతున్నాయి. -
జాదవ్.. ఓ గ్రీన్ చాలెంజ్
గ్రీన్ చాలెంజ్..ఈ మధ్య దీనికి బాగా క్రేజ్ పెరిగింది.. మూడు మొక్కలు నాటడం.. సెల్ఫీ తీసుకుని పోస్ట్ చేయడం.. అస్సాంకు చెందిన జాదవ్ పాయెంగ్ కూడా గ్రీన్ చాలెంజ్ స్వీకరించాడు.. మొక్కలు నాటాడు. కానీ సెల్ఫీ తీద్దామంటేనే ఫోన్లో రావడం లేదు.. ఇందుకోసం హెలికాప్టర్‌నే తేవాల్సి వచ్చింది.. ఎందుకో తెలుసా? అతడు నాటింది మొక్కలను కాదు.. ఏకంగా ఓ అడవిని.. 1979.. అస్సాంలోని మాజులీ ద్వీపం.. బ్రహ్మపుత్ర నది వరుస వరదల వల్ల తరచూ భూమి కోతకు గురయ్యేది. దీనికితోడు అడపాదడపా కరువు కూడా.. తాను పుట్టిన నేలను కాపాడుకోవాలని 16 ఏళ్ల జాదవ్ అప్పుడే నిర్ణయించుకున్నాడు. ప్రకృతి విసిరిన సవాలును స్వీకరించాడు.. పచ్చదనమంటూ లేని ప్రాంతంలో రోజుకొక మొక్క నాటాడు. అలాఅలా.. మొక్కంటూ మొలవని నేలపై ఓ అడవి ఆవిష్కృతమైంది. 1,360 ఎకరాల్లో విస్తరించింది. పులులు, ఏనుగులు వంటి ఎన్నో రకాల వన్యప్రాణులకు నివాస కేంద్రమైంది. 2007 వరకూ.. మీకో విషయం తెలుసా? జాదవ్ ఓ వనాన్నే సృష్టించాడన్న విషయం 2007 వరకు బయటి ప్రపంచానికి తెలియదు.. ఓ రోజున ఫొటోజర్నలిస్ట్ జీతూ కలితా అనుకోకుండా ఈ ప్రాంతానికి రావడంతో ఈ విషయం బయటపడింది. వాళ్లు కలవడమే చాలా చిత్రంగా జరిగిందట. ‘‘పక్షుల ఫొటోలు తీయడానికి ఓ బోటు తీసుకుని.. బ్రహ్మపుత్ర నదిలో వెళ్తున్నా. మాజులీ ద్వీపం వద్దకు రాగానే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నా కళ్లను నేనే నమ్మలేకపోయాను.. మొక్క మొలకెత్తడానికే సందేహించే ఈ నేలపై పచ్చని అడవి’అని జీతూ నాటి సంఘటనను గుర్తు చేస్తున్నారు. ఇక జాదవ్ అయితే.. ఎవరూ రాని ఆ ప్రదేశానికి జీతూ రావడంతో వన్యప్రాణుల వేటగాడు అని అనుకున్నాడట. ఈ సందర్భంగా జాదవ్ భగీరథ యత్నం గురించి తెలుసుకున్న జీతూకు నోట మాట రాలేదు. కొన్ని రోజులు అక్కడే ఉన్నారు. జాదవ్ గొప్పతనాన్ని తన కథనం ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారు. ఒక్క వ్యక్తి తలుచుకుంటే ఏం చేయగలడన్న దానికి ఉదాహరణ జాదవేనని చెబుతారు. తొలి మొక్క ఇప్పటికీ జ్ఞాపకమే.. జాదవ్‌కు తాను మొదటిసారి నాటిన మొక్క ఎక్కడుందో కూడా తెలుసు.. ఓ మహారణ్యానికి బీజం వేసిన ఆ వృక్షం వద్దకు రోజుకు ఒక్కసారైనా వెళ్లి.. సేదతీరుతాడు.. నీవు లేనిదే నేను లేను అంటాడు.. ఉదయం 3 గంటలకు నిద్రలేవగానే.. తన వనం వద్దకు వెళ్తాడు. మొక్కలు నాటే పనిలో మునిగిపోతాడు. సమీప గ్రామాల్లో పాలు అమ్మి.. జీవనం కొనసాగించే జాదవ్ నిజంగా హరిత సంపన్నుడే. ఇతడి కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. సమీప వనాల నుంచి ఏనుగులు, పులులు వంటివి జాదవ్ సృష్టించిన అడవికి వస్తూ పోతుంటాయట. అంతేకాదు.. జాదవ్‌కు అప్పుడప్పుడు వన్యప్రాణి వేటగాళ్లు, కలప అక్రమ రవాణాదారుల నుంచి బెదిరింపులు కూడా వస్తుంటాయి.. అయినా.. మనోడు వెనకడుగు వేయడు. తన చివరి శ్వాస వరకూ మొక్కలు నాటుతునే ఉంటానని.. వాటిని అనుక్షణం కాపాడుతునే ఉంటానని చెబుతాడు.. ఓ అడవినే సృష్టించానని అతడు అక్కడితో ఆగిపోలేదు.. మరో గ్రీన్ చాలెంజ్‌కు సిద్ధమయ్యాడు.. ఆ అడవిని 5 వేల ఎకరాలకు విస్తరిస్తాడట.. అదిగో బయలుదేరాడు జాదవ్.. మరో మహాకార్యానికి బీజం వేయడానికి.. మరో మహారణ్యమై మొలకెత్తడానికి.. 1979లో తాను తొలిసారిగా నాటిన మొక్క వద్ద జాదవ్. (ఇన్సెట్లో) ఇలాంటి భూముల్నే జాదవ్ అడవిలా మార్చాడు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
‘గ్రీన్’ హైవేకు పచ్చజెండా
సాక్షి, చెన్నై: గ్రీన్ హైవేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.10 వేల కోట్లతో పనులు చేపట్టనున్నారు. ఈ పనులకుగాను స్థల సేకరణకు తగ్గ ఆదేశాలు జారీ అయ్యాయి. చెన్నై నుంచి సేలం వైపు ఎనిమిది మార్గాలతో 274 కిమీ దూరంలో ఈ గ్రీన్ నేషనల్ హైవే రూపుదిద్దుకోనుంది. కన్యాకుమారి నుంచి చెన్నై మీదుగా పలు రాష్ట్రాలను కలుపుతూ జాతీయ రహదారి రూపదిద్దుకుని ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో జాతీయ రహదారుల్లో నిత్యం వాహనాలు దూసుకెళ్తున్నాయి. ఈ జాతీయ రహదారులను అనుసంధానిస్తూ రాష్ట్ర రహదారులు అనేకం ఉన్నాయి. అయినా, ట్రాఫిక్ తగ్గేది లేదు. ఈ పరిస్థితుల్లో చెన్నై నుంచి పశ్చిమ తమిళనాడు వైపుగా సేలంకు సరికొత్త రోడ్డు మార్గానికి కేంద్రం నిర్ణయించింది. ఇందుకు తగ్గ ప్రణాళిక సిద్ధమైంది. పచ్చదనంతో నిండిన మార్గంగా ఈ జాతీయ రహదారిని రూపొందించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. ఈ పనులకుగాను స్థలసేకరణ నిమిత్తం రాష్ట్ర రహదారుల శాఖ కార్యదర్శి రాజీవ్ రంజన్‌కు కేంద్ర రహదారుల శాఖ నుంచి ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మార్గం సాగే జిల్లాల్లోని కలెక్టర్ల పర్యవేక్షణలో స్థల సేకరణకు ప్రత్యేక అధికారుల్ని రంగంలోకి దించే విధంగా ఆ ఉత్తర్వుల్లో వివరించారు. అలాగే , ఆ రోడ్‌రూట్ మ్యాప్ అంశాలను అందులో పొందుపరిచారు. రూ.10 వేల కోట్లతో పచ్చదనం: చెన్నై నుంచి సేలం వరకు 274 కి. మీద దూరం రూపుదిద్దుకోనున్న ఈ హైవే 250 కిమీ దూరం అటవీ మార్గంలో సాగనుంది. చెన్నై తాంబరం నుంచి ధర్మపురి జిల్లా అరూర్ వరకు ఎన్‌హెచ్ 179బీగా, అరూర్ నుంచి సేలం వరకు ఎన్‌హెచ్ 179ఏగా ఈ గ్రీన్ హైవేను పిలుస్తారు. రూ.పదివేల కోట్ల వ్యయంతో పచ్చదనంతో ఈ మార్గం రూపుదిద్దుకోనుంది. కాంచీపురం జిల్లాల్లో 53 కిమీ, తిరువణ్ణామలై జిల్లా సెయ్యారు, వందవాసి, పోలూరు, ఆరణి, సెంగం మీదుగా 122 కి.మీ, కృష్ణగిరిలో రెండు కిమీ, ధర్మపురి జిల్లా తీర్థమలై, అరూర్, పాపిరెడ్డి పట్టిలను కలుపుతూ 53 కి.మీ, సేలం జిల్లా వాలప్పాడి తాలుకా నుంచి సేలం నగరంలోకి 38 కిమీ దూరం నిర్మించనున్నారు. స్థలసేకరణ ప్రక్రియను త్వరితగతిన ముగించాలని, ప్రత్యేక అధికారుల ద్వారా పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 250 కి.మీ దూరం అటవీ మార్గంలో ఈ గ్రీన్ హైవే పయనించనున్న దృష్ట్యా, అందుకు తగ్గ అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఉంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. ఈ రహదారి పూర్తయతే చెన్నై నుంచి సేలంకు 3 గంటల్లో చేరుకోవచ్చు. దేశంలోనే రెండవ గ్రీన్ హైవే తమిళనాడుకు దక్కడం గమనించదగ్గ విషయం. -
రైతులకు వరం ఆపరేషన్ గ్రీన్
హన్వాడ : ప్రధాన ఆహార పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుంది. మార్కెట్లో ధర తగ్గిన సమయంలో అన్నదాతలు పండించిన పంటలను కనీస మద్దతు ధరతో ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. కాని రైతులు ప్రధానంగా సాగుచేసే కూరగాయ పంటలైన ఉల్లి, టమాటలకు మాత్రం ఒక్కోసారి ధరలేకపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఎక్కువగా ధరల్లో హెచ్చు తగ్గులుండే ఈ పంటలకు మద్దతు ధర కల్పించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం వీటిని మద్దతు ధరలో చేర్చింది. మద్దతు ధరకు, మార్కెట్లో లభించే ధరకు మధ్య వ్యత్యాసం ఉండి రైతులు నష్టపోతున్న సందర్భంలో ఈ పథకం కింద ప్రభుత్వం ఆదుకుంటుంది. మద్దతు ధర కన్నా దిగువ స్థాయికి మార్కెట్లో ధరపడిపోయినప్పుడు ఆ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రభుత్వం రైతులకు చెల్లించే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ పంటల ధరల్లో హెచ్చుతగ్గుల సమస్యల పరిష్కారానికి ఇటీవలే తమ బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో టమాట, ఉల్లి సాగు చేసిన రైతులకు ఇక ఢోకా ఉండదు. కూరగాయ తోటలే.. హన్వాడ మండల కేంద్రంతోపాటు పెద్దర్పల్లి, కొత్తపేట, టంకర, దాచక్‌పల్లి, సల్లోనిపల్లి, గుడిమల్కాపూర్, కొనగట్టుపల్లి, నాయినోనిపల్లి తదితర గ్రామాల్లో అత్యధికంగా కూరగాయల పంటలే సాగు చేస్తారు. అయితే ఆయా గ్రామాల్లో ఎక్కువగా ఉల్లి, టమాట పంటలు సాగుచేసి గతంలో చాలామంది రైతులు నష్టపోయిన దాఖలాలు కోకొల్లలు. దీంతో సాగుచేసిన ప్రతిసారి ఏదో ఓసారి నష్టాలబారిన పడాల్సి వచ్చేది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘ఆపరేషన్ గ్రీన్’ పథకం ఆయా పంటల రైతులకు ఇక వరంగా మారనుంది. ఇక మండలంలో మరిన్ని గ్రామాల్లో సైతం వీటి సాగుపై దృష్టి సారిస్తున్నారు. రైతులకు మేలుచేసే ఈ పథకంతో చాలామంది అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా నష్టపోయా.. ఇటీవల టమాట సాగుచేసి మార్కెట్లో ధరలు రాక తీవ్రంగా నష్టపోయాను. ఉల్లి, టమాట పంటలకు సరైన ధర రాక వృథాగా పారబోశాను. పెళ్లిళ్లు, పండగల సీజన్లకు ముందుగా అందరూ ఇదే పంటల సాగుపై దృష్టిసారించడంతో ఈ సమస్య తలెత్తేది. కేంద్ర ప్రభుత్వం ఉల్లి, టమాటపై మద్దతు ధర ప్రకటించడం సంతోషంగా ఉంది. – నర్సింహులు, రైతు, హన్వాడ -
ఆస్పత్రిలో ఆకుపచ్చ రంగులే ఎందుకు వాడతారు?
ఆకుపచ్చ రంగు క్షేమానికి, సస్యశ్యామలానికి గుర్తు. సాధారణంగా ఆస్పత్రుల్లో రక్తపు మరకలు అంటుకునే అవకాశం ఎక్కువ. వేరే రంగు దుస్తులు వాడితే ఆ ఎరుపు రంగు మరింత బాగా కనిపించి రోగులను వారి బంధువుల్ని భయాందోళనలకు గురిచేసే అవకాశం ఉంది. ఆకుపచ్చ బట్టలపై రక్తం చిందినా అది ఎర్రగా కాకుండా నల్లగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆకుపచ్చ, ఎరుపు ఒకదానికొకటి పూర్తిగా భిన్నమైన రంగులు. ఈ రెండు రంగులూ ఒకదానిలో ఒకటి కలిసిపోయి కొత్త రంగు ఏర్పడుతుంది. ఆ రంగు నలుపుగా ఉంటుంది. అంటే ఆకుపచ్చ రంగు మీద పడ్డ రక్తపు మరకలు నల్లగా కనిపించడం వల్ల రోగికి భయం అనిపించదు. అందువలనే ముఖ్యంగా ఆపరేషన్ థియేటర్లలో వైద్యులు, నర్సులు ఆకుపచ్చని దుస్తులు ధరిస్తారు. కొన్ని ఆస్పత్రి వార్డుల్లో పేషెంట్లకు కూడా ఆకుపచ్చని దుస్తులు ఇస్తారన్న విషయం తెలిసిందే. -
గ్రీన్‌కార్డుకు ఇంటర్వ్యూ తప్పనిసరి
► భారతీయులకు ట్రంప్ సర్కారు మరో షాక్ ► ఆర్ఎఫ్ఈల పేరిట హెచ్–1బీ దరఖాస్తులపై పెరిగిన నిఘా న్యూయార్క్: గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ట్రంప్ సర్కారు మరో షాకిచ్చింది. హెచ్–1బీ వీసాపై అమెరికాలో పనిచేస్తూ గ్రీన్‌కార్డు(శాశ్వత నివాసం)పొందాలనుకునే వారికి అక్టోబర్ 1 నుంచి యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్(యూఎస్సీఐఎస్) ఇంటర్వ్యూల్ని తప్పనిసరి చేసింది. ఇప్పటికే లక్షల గ్రీన్‌కార్డుల దరఖాస్తులు ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉండగా తాజా నిర్ణయంతో మరిన్ని చిక్కులు రావచ్చు. ఇంటర్వ్యూల్ని తప్పనిసరి చేస్తూ గ్రీన్‌కార్డు నిబంధనల్లో మార్పులపై ఆగస్టు 28న యూఎస్సీఐఎస్ ప్రకటన విడుదల చేసింది. హెచ్–1బీ వీసా దరఖాస్తుదారులు రిక్వెస్ట్స్ ఫర్ ఎవిడెన్స్(ఆర్ఎఫ్ఈ)లు సమర్పించాలని ఇమిగ్రేషన్ అటార్నీలకు లేఖలు పెరుగుతున్నాయి. హెచ్–1బీ వీసాకు లెవల్–1 వేతనాలు అంగీకరించబోమని యూఎస్సీఐఎస్ తేల్చిచెప్పింది. 2017 ఏప్రిల్‌లో చేసిన హెచ్–1బీ వీసా దరఖాస్తులు అక్టోబర్, 1 2017 నుంచి చెల్లుబాటు కానున్న నేపథ్యంలో ఆర్ఎఫ్ఈలు సమర్పించాల్సి ఉంది. గ్రీన్‌కార్డుల కోసం చేసిన మార్పులపై ఎన్పీజెడ్ లా గ్రూప్ మేనేజింగ్ అటార్నీ డేవిడ్ హెచ్ నచ్‌మన్ మాట్లాడుతూ.. ‘కుటుంబ ఆధారిత గ్రీన్‌కార్డులు, పౌరసత్వ ప్రక్రియ కోసం ఇంటర్వ్యూలు తప్పనిసరి. నిజానికి ఉద్యోగ వీసా నుంచి గ్రీన్‌కార్డుకు మారాలంటే ఇంటర్వ్యూలు నిర్వహించడం దశాబ్దకాలంగా అమల్లోఉంది. ఇంతవరకూ ఇంటర్వ్యూల్లో చాలామందికి మినహాయింపు ఇచ్చేవారు. కొత్త విధానంలో అలా మినహాయింపు ఉండదు. గ్రీన్‌కార్డుల కోసం మరింత సమయం నిరీక్షించాల్సి రావచ్చు’ అని చెప్పారు. అమెరికాలో తాత్కాలిక వీసాపై పనిచేస్తున్నవారికే అధిక శాతం గ్రీన్‌కార్డులు దక్కుతున్నాయి. 2010 నుంచి 2014 మధ్య హెచ్–1బీ వీసాదారులు 2 లక్షల గ్రీన్‌కార్డులు పొందారని ‘బైపార్టిసన్ పాలసీ సెంటర్’ తెలిపింది. యూఎస్సీఐఎస్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2015లో దాదాపు 34,843 మంది భారతీయులు తాత్కాలిక వీసా నుంచి గ్రీన్‌కార్డుకు మారారు. ఇందులో 25,179మంది హెచ్–1బీ కేటగిరీలో అమెరికాలో ఉద్యోగం చేస్తున్నవారే. హెచ్–1బీకి లెవల్ 1 జీతాలకు అంగీకరించం హెచ్–1బీ దరఖాస్తుల్లో వెల్లడించిన వివరాలపై విచారణను యూఎస్సీఐఎస్ వేగవంతం చేసింది. హెచ్–1బీ వీసాదారులకు కంపెనీలు ఆఫర్ చేసిన లెవల్–1 వేతనాలు అంగీకరించమని హెచ్చరికలు వస్తున్నాయని ఇమిగ్రేషన్ అటార్నీ రాజీవ్ ఖన్నా తెలిపారు. ‘ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు కంపెనీలు లెవల్–1 వేతనాలు, సాంకేతిక నిపుణులు, ఉన్నతస్థాయి ఉద్యోగులకు లెవల్–4 కేటగిరీ వేతనాలు ఇస్తున్నాయి. శాన్ జోస్‌లో సాఫ్ట్వేర్ డెవలపర్‌కు(లెవల్ 1) 88,733 డాలర్ల(రూ. 56 లక్షలు) వేతనం ఉండగా, లెవల్ 4లో 1,55,147 డాలర్ల వేతనం ఆఫర్ చేస్తున్నారు. ఆందోళనలో 8 లక్షల వలసదారులు వలసదారుల్ని స్వదేశానికి పంపడమే లక్ష్యంగా పనిచేస్తున్న ట్రంప్ మరో వివాదాస్పద నిర్ణయంపై మంగళవారం నిర్ణయం తీసుకోనున్నారు. ట్రంప్ తీసుకునే ఈ నిర్ణయంపై దాదాపు లక్షల మంది వలసదారుల జీవితాలు ఆధారపడి ఉన్నాయి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అమెరికాకు వచ్చి తాత్కాలిక వీసాపై అక్కడ ఉద్యోగం చేస్తున్న వీరంతా ట్రంప్ నిర్ణయం ఎలా ఉంటుందోనని ఆందోళనలో ఉన్నారు. ‘ చిన్నారులుగా ఉన్నప్పుడు దేశంలోకి అక్రమంగా వచ్చి ఉద్యోగాలు చేస్తున్న లక్షల మంది భవిష్యత్తుపై మంగళవారం ట్రంప్ తన నిర్ణయం ప్రకటిస్తారు’అని వైట్‌హౌస్ పేర్కొంది. కాగా శుక్రవారం ట్రంప్ మాట్లాడుతూ.. ‘వీరిని స్వదేశాలకు పంపాలని ఒబామా హయాంలోనే డిమాండ్ చేయగా 2012లో నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదావేశారు. డిఫెర్డ్ యాక్షన్ ఫర్ ఛైల్డ్‌హుడ్ అరైవల్స్ పేరిట అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు తాత్కాలిక వర్క్‌పర్మిట్లు జారీ చేశారు. -
లాభాల్లో మొదలైన స్టాక్‌మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో సెన్సెక్స్ 175 పాయింట్ల లాభంతో 31 800 స్థాయి వద్ద, నిఫ్టీ 45పాయింట్లు ఎగిసి 9900 స్థాయికిపైన పటిష్టంగా ప్రారంభమైయ్యాయి. ఫార్మ,ఎఫ్ఎంసీజీ సెక్టార్లో ఒత్తడిలో ఉన్నాయి. బ్యాంక్‌నిఫ్టీ లాభాల్లో ఉంది. అదానీ, రిలయన్స్ ,లుపిన్, నెస్లీ ఐషర్ మోటార్స్ లాభపడుతుండగా, ముఖ్యంగా ఇన్ఫోసిస్‌లో స్థిరత్వానికి ఛైర్మన్ నందన్‌నీలేకని హామీ ఇవ్వడంతో ఈ స్టాక్‌పై ఇన్వెస్టర్లు మొగ్గుచూపుతున్నారు. డా. రెడ్డీస్ , హీరో మోటో కార్ప్, టీసీఎస్, బజాజ్ఆటో, బారతి ఎయిర్ టెల్, ఐటీసీ , బీపీసీల్, దీంతో ఇన్ఫోసిస్ బాగా లాభపడుతోంది. అటు డాలర్ తో పోలిస్తే రూపాయి 0.24 పైసల లాభంతో రూ.63.88 వద్ద కొనసాగుతోంది. పుత్తడి కూడా పాజిటివ్‌గా గానే ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో పది గ్రా. రూ.63 లు పెరిగి 29,162 వద్ద ఉంది. -
గ్రీన్ మార్కెట్ యార్డుగా అభివృద్ధి
- శిథిల భవనాల పునరుద్ధరణకు నిధులు - శరవేగంగా ర్యాంపులు, షెడ్ల నిర్మాణం - వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ రాష్ట్ర కమిషనర్ మల్లికార్జునరావు కర్నూలు (వైఎస్‌ఆర్‌సర్కిల్): పారిశుద్ధ్య చర్యలు చేపట్టి కర్నూలు మార్కెట్ యార్డును..రెండు నెలల్లో పచ్చదనంతో నింపాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ రాష్ట్ర కమిషనర్ మల్లికార్జునరావు ఆదేశించారు. శనివారం ఉదయం ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు తదితర యార్డులను పరిశీలించిన అనంతరం సాయంత్రం ఆయన కర్నూలు మార్కెట్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన యార్డులోని కూలేందుకు సిద్ధంగా ఉన్న షెడ్లతో పాటు శిథిలావస్థలోని గోదాములను పరిశీలించారు. రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న జంబో గోదామును తనిఖీ చేసి మార్చిలోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం లోపించిన మరుగుదొడ్లను, షెడ్ల వద్ద ఉన్న అపరిశుభ్రతను గమనించి.. అధికారులకు సూచనలు చేశారు. స్వచ్ఛ భారత్ పథకం కింద యార్డుల్లో పచ్చదనం వెల్లవిరిసేలా బృహత్తర ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అంగవైకల్యం కల్గిన రైతులు గోదాములోకి వెళ్లేలార్యాంపుల నిర్మాణం శరవేగంగా జరగాలని ఆదేశించారు.మార్కెట్ల శిథిల భవనాల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేస్తామని హామీనిచ్చారు. కూలిని పెంచాలని హమాలీలు.. కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. వ్యాపారులు, రైతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వారికి కమిషనర్ భరోసానిచ్చారు. మార్కెటింగ్ శాఖ ప్రాంతీయ సహాయ సంచాలకులు సుధాకర్, ఏడీఎం సత్యనారాయణ చౌదరి, యార్డు కార్యదర్శి నారాయణమూర్తి, సహాయ కార్యదర్శి రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
8400 మార్కును చేధించిన నిఫ్టీ
ఎలాంటి ప్రత్యేక పాలసీ వివరాలను అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన తొలి ప్రసంగంలో ప్రస్తావించకపోవడంతో మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. స్వల్ప లాభాల్లో ఎంట్రీ ఇచ్చిన సెన్సెక్స్ నిఫ్టీలు మంచి లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 124.19 పాయింట్ల లాభంలో 27,264 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ తన కీలకమార్కు 8412ను చేధించి ట్రేడ్ అవుతోంది. నవంబర్ 11 తర్వాత మొదటిసారి నిఫ్టీ 8400ను తాకింది. ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, హీరో మోటోకార్పొ టాప్ గెయినర్లుగా లాభాలు పండిస్తుండగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సన్‌ఫార్మా, లుపిన్, సిప్లా, ఐటీసీలు నష్టాలు గడిస్తున్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్‌లు ప్రకటించినున్న క్యూ3 ఫలితాల నేపథ్యంలో ఆ కంపెనీ షేర్లు 2.15 శాతం, 0.17 శాతం పైకి ట్రేడవుతున్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా లాభాల్లోనే ప్రారంభమైంది. బుధవారం ముగింపుకు 17 పైసలు లాభపడి 68.15గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ట్రంప్ తొలి మీడియా సమావేశంలో తన ప్రతిపాదిత పాలసీల గురించి ఊసైనా ఎత్తలేదు. ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో డాలర్ విలువ పడిపోయింది. ఆసియన్ షేర్లు మిక్స్‌డ్‌గా ట్రేడవుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే యెన్ భారీగా బలపడింది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధర కూడా 187 రూపాయల లాభంతో 28,331వద్ద ట్రేడవుతోంది. -
లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ఎన్నో ఒడిదుడుకుల పయనం అనంతరం మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 47.79 పాయింట్ల లాభంతో 26643.24 వద్ద, నిఫ్టీ 12.75 పాయింట్ల లాభంతో 8192.25 వద్ద క్లోజ్ అయ్యాయి. కోల్ ఇండియా, బీహెచ్ఈఎల్, యాక్సిస్ బ్యాంకు, గెయిల్, ఐసీఐసీఐ బ్యాంకు టాప్ గెయినర్లుగా లాభాలు పండించగా.. భారతీ ఎయిర్టెల్, హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్, టాటా స్టీల్, విప్రోలు నష్టాలు గడించాయి. ఆయిల్, గ్యాస్ షేర్లు నేటి మార్కెట్లో మంచి ప్రదర్శనను కనబరిచాయి. నిఫ్టీలో టాప్ గెయినర్‌గా నిలిచిన బీహెచ్ఈఎల్ 3 శాతం పెరిగి, రూ.126.10 వద్ద ట్రేడ్ అయింది. ఐటీ, ఆటో స్టాక్స్ మినహా మిగతా రంగాల సూచీలు నేడు లాభాల్లోనే ముగిశాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థలైన ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా, విప్రో చైర్మన్ అజీం ప్రేమ్ జీలు తమ సంస్థలోని ఉద్యోగులకు రాసిన లేఖలతో ఆ కంపెనీ షేర్లు గజగజలాడాయి. మార్నింగ్ ట్రేడ్‌లో 1.4 శాతం పడిపోయిన ఇన్ఫోసిస్ షేర్లు, చివరికి కొంత కోలుకుని 0.60 శాతం నష్టంతో రూ.995.05 వద్ద ముగిసింది. విప్రో సైతం 0.81 శాతం నష్టంతో క్లోజ్ అయింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.07 పైసల బలహీనపడి 68.30గా నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధర కూడా 92 రూపాయల నష్టంలో 27,478గా ట్రేడ్ అయింది. -
శుభ్రత కోసం పరుగు
కర్నూలు(హాస్పిటల్): పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పచ్చదనాన్ని కాపాడాలన్న నినాదంతో ఎన్సీసీ కేడెట్లు శనివారం కర్నూలు నగరంలో పరుగు తీశారు. 68వ ఎన్సీసీ డే ఉత్సవాలను పురస్కరించుకుని కలెక్టరేట్ వద్ద ' గో గ్రీన్ గో క్లీన్' పేరుతో టు కే రన్ కార్యక్రమాన్ని కర్నూలు ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ పీజీ కృష్ణ ప్రారంభించారు. పరుగు కలెక్టరేట్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో 300 మంది ఎన్సీసీ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం పెరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ పాల్గొని ప్రసంగించారు. ఎన్‌సీసీతో క్రమశిక్షణ గల జీవితం అలవడుతుందని, ప్రతి విద్యార్థి ఎన్సీసీలో పాల్గొనాలని సూచించారు. అనంతరం ఆయన వివిధ అంశాల్లో ప్రతిభ కనపరిచిన ఎన్సీసీ కేడెట్లకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో లెఫ్ట్‌నెంట్ కల్నల్ గౌస్‌బేగ్, ఎస్కే సింగ్, మధు, ఎన్సీసీ అధికారి పివి శివయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆకుపచ్చ తెలంగాణను నిర్మిద్దాం
రామన్నపేట : హరితహారాన్ని విజయవంతం చేసి ఆకుపచ్చ తెలంగాణను నిర్మించుకుందామని జెడ్పీటీసీ జినుకల వసంత, ఎస్ఐ ప్యారసాని శీనయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని అభయాంజనేయ ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. నాటిన ప్రతీ మొక్కను సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని ఈ సందర్భంగా వారు సూచించారు. కార్యక్రమంలో డీలర్ రామిని రమేష్, వివిధ పార్టీల నాయకులు బందెల రాములు, జినుకల ప్రభాకర్, కక్కిరేణి విజయ్‌కుమార్, జెల్ల వెంకటేశం, సాల్వేరు లింగం, ఊట్కూరి నర్సింహ, గర్దాసు సురేష్, బత్తుల కృష్ణగౌడ్, కొంపల్లి విజయానందం, ఎం.డి నాజర్, గుత్తా నర్సిరెడ్డి, నోముల మారయ్య, కోట నరేందర్, ధర్మరాజు, శంకర్ పాల్గొన్నారు. -
ఈసీఈ ఎవర్గ్రీన్ బ్రాంచ్
బాలాజీచెరువు(కాకినాడ): ఇంజినీరింగ్ కోర్సులలో ఈసీఈ బ్రాంచ్ ఎవర్గ్రీన్ అని, దానికున్న ప్రాముఖ్యం ఎనలేనిదని జేఎన్టీయూకే వీసీ వీఎస్ఎస్ కుమార్ పేర్కొన్నారు. జేఎన్టీయూకేలో మంగళవారం ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ వీఏఎస్‌ఐ టెక్నాలజీ డిజైన్ యూజింగ్ ఈడీఏ టూల్స్ అనే అంశంపై ఐదు రోజుల పాటు జరిగే జాతీయవర్క్‌షాపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ కుమార్ మాట్లాడుతూ ఈసీఈ బ్రాంచ్‌కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుందని, దీనిలో ముఖ్యంగా వీఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్ స్పెషలైజేషన్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు వీటిలో పరిశోధనలు చేసి వ్యవస్థాపకులుగా ఎదగాలని సూచించారు. కోరల్ టెక్నాలజీ జనరల్ మేనేజర్ బి.కె.దేవయ్య మాట్లాడుతూ దేశ రక్షణలో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ విభాగం చాలా కీలకమైన పాత్ర పోషిస్తోందని, అందువల్ల పరిశోధనపై దృష్టి సారించి సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకెళ్లాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ వి.రామచంద్రరాజు మాట్లాడుతూ చర్చాగోష్టిలో పొందిన విషయ పరిజ్ఞానాన్ని ప్రయోగ పద్ధతుల్లో విద్యార్థులకు నేర్పించగలిగితే విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించవచ్చన్నారు. కార్యక్రమంలో ఐఎస్టీ డైరక్టర్ కె.సత్యప్రసాద్, అధ్యాపకులు డాక్టర్ పద్మప్రియ, పి.పుష్పలత, ఝాన్సీరాణి పాల్గొన్నారు. -
హరితవన అభివృద్ధిలో ఖాకీలు!
ముంబై ప్రజలు ట్రీ ప్లాంటేషన్ డే ను ఘనంగా జరుపుకున్నారు. మహరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మొక్క్లలు నాటే కార్యక్రమంలో ముంబై పోలీసులు సైతం భాగస్వాములయ్యారు. నగరంలో హరిత వనాన్ని అభివృద్ధి చేసి, కాలుష్యాన్ని కాలరాసే ప్రయత్నం చేశారు. మహరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో ముంబై పోలీసులు పాలుపంచుకున్నారు. జూలై 1న రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2 కోట్ల మొక్కలను నాటాలన్న తలంపుతో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో తమవంతు ప్రయత్నంగా నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటారు. మొక్కలు నాటే కార్యక్రమంలో పోలీసులతోపాటు, స్థానిక రాజకీయ నాయకులు, ఎన్జీవో సంస్థలు, ప్రజలు సైతం భాగం పంచుకున్నట్లు ప్రభుత్వాధికారులు తెలిపారు. హరిత వనాన్ని అభివృద్ధి చేసేందుకు పోలీసులు ట్విట్టర్ ను కూడ వాడుకున్నారు. ఆయా ప్రాంతాల పోలీస్టేషన్లలో మొక్కలు నాటుతూ తీసుకున్నఫోటోలను ప్రచారంలో భాగంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. -
స్వల్ప లాభాల్లో దేశీయ సూచీలు
ముంబై : అమెరికా ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లు పెంచుతాదనే సంకేతాలు ఊపందుకోవడంతో గురువారం ట్రేడింగ్ లో నష్టాలు పాలైన దేశీయ సూచీలు, శుక్రవారం ట్రేడింగ్ లో కొంతమేర కోలుకుని స్వల్పలాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 28.20 పాయింట్ల లాభంతో 25,427.92 వద్ద, నిఫ్టీ 3.35 పాయింట్ల లాభంతో 7786.65గా కొనసాగుతున్నాయి. సన్ ఫార్మా, ఓఎన్జీసీ, ఐటీసీ, బీహెచ్ఈఎల్, యాక్సిస్ బ్యాంకు లాభాల్లో నడుస్తుండగా.. లుపిన్, మారుతీ, ఇన్ఫోసిస్, హీరో మోటార్ కార్పొరేషన్లు నష్టాలు పాలవుతున్నాయి. రియాల్టీ, ఆయిల్, గ్యాస్, మూలధన ఉత్పత్తులు, బ్యాంకింగ్ స్టాక్స్ నిఫ్టీని నష్టాల బాట నుంచి లాభాల్లో నడిపిస్తున్నాయి. సింగపూర్ స్టాక్ ఎక్సేంజ్ కూడా 20.50 పాయింట్ల లాభంలో ట్రేడ్ అవుతుండటంతో, దేశీయ సూచీలు పాజిటివ్ గానే ప్రారంభమయ్యాయి. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచినా అవి ఈక్విటీ మార్కెట్లోకి ప్రవేశించే ఎఫ్ఐఐలపై కొంత మాత్రమే ప్రభావం చూపుతాయని, డాలర్ బలపడినా మరీ అంత నెగిటివ్ ట్రేడ్ ఉండదని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో మార్కెట్లు కొంత మెరుగుపడ్డాయి. మరోవైపు బంగారం, వెండి ధరలు నష్టాలు పాలవుతున్నాయి. పసిడి రూ.65 నష్టంతో రూ.29,732గా.. వెండి రూ.18 నష్టంతో రూ.39,806గా ట్రేడ్ అవుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 67.34గా ఉంది. -
పచ్చ‘ధనం’ మాయం
రికార్డులు దాటని పచ్చదనం వన మహోత్సవాల పేరుతో నిధుల దుర్వినియోగం నర్సరీల స్థాయిలో మాయాజాలం లెక్కలు తేల్చలేని అక్రమాల గుట్టు మూడేళ్లలో రూ.13 కోట్లు మట్టి పాలు ఆకాశంలో చుక్కలు ఎన్నంటే ఎలా చెప్పగలం. సామాజిక అటవీశాఖలో నాటుతున్న మొక్కల లెక్కలూ అంతే. వన మహోత్సవాలు వస్తే చాలు... ఆ శాఖకు కాసులు కురిసినట్టే. మొక్కలు నాటేస్తున్నట్టు రికార్డుల్లో చూపుతారు. లెక్కలకందని గారడీ చేస్తారు. ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందే తడవు... ప్రణాళికలు రూపొందిస్తారు. లక్షల రూపాయలతో ప్రతిపాదనలు చేస్తారు. నిధులు మంజూరు కాగానే... ఆర్భాటంగా కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. వారినీ... వీరినీ... పిలుస్తారు. ఫొటోలతో అదరగొడతారు. ప్రచారం చేపట్టేస్తారు. రికార్డుల్లో నిధుల ఖర్చు చూపిస్తారు. నెల తిరిగేసరికి అక్కడి మొక్కలు కనిపించవు. మళ్లీ వనమహోత్సవం వస్తే అదే తంతు... ఈ సారీ కాసుల పంటే... వీరఘట్టం/పాలకొండ:పచ్చని ఆశయానికి తూట్లు పడుతున్నాయి. మొక్కల పెంపకం మాటున నిధులు భారీగానే దుర్వినియోగమవుతున్నాయి. ఎంచుకున్న లక్ష్యం ఘనమే... క్షేత్రస్థాయిలో మాత్రం అది నీరుగారిపోతుంది. రికార్డుల్లో పచ్చదనం పరచుకున్నా... వాస్తవంగా ఆ జాడలే కానరావు. మొక్కలకు లెక్కగట్టే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడం ... తనిఖీలకు సున్నా చుట్టేయడంతో అక్రమాలకు అడ్డూ అదుపు లేకపోయింది. గత మూడేళ్లలో రూ.13 కోట్లు ఖర్చు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. కాని ఒక్క మొక్కా అక్కడ కానరాకపోవడమే ఆ నిధులు ఎంతగా దుర్వినియోగమయ్యాయనడానికి నిదర్శనం. ఉపాధిలో రూ. 12.50కోట్లు మట్టిపాలు గత రెండేళ్లలో ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ పచ్చ తోరణం కార్యక్రమం కింద 2.50 లక్షల మొక్కలు నాటారు. ఇందుకు రూ. 10.50 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాది నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా 2 లక్షల మొక్కలు నాటారు. రూ.2 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు మొక్కలు నాటిన దాఖలాలు ఎక్కడా కానరావడం లేదు. అక్కడక్కడ నాటిన మొక్కలు రక్షణలేక మట్టి పాలయ్యాయి. వనమహోత్సవాల్లో అయితే... గతేడాది వనమహోత్సవం పేరిట జిల్లా వ్యాప్తంగా 50 వేల మొక్కలు నాటామని అధికారులు చెబుతున్నారు. కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభిస్తున్నారే తప్ప తర్వాత ఆల నా పాలన లేక మొక్క దశలోనే మోడువారిపోతున్నాయి. నర్సరీల పేరిట మొక్కలు పెంచుతున్న విషయం రికార్డులకే పరిమితం. ఇప్పుడేమో ప్రభుత్వం కార్తీక వనమహోత్సవం పేరిట లక్ష మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సుమారు రూ. 35 లక్షలతో మొక్కలు నాటేందుకు రంగం సిద్ధం చేశారు. గతంలో కోట్లు కుమ్మరించి నాటిన మొక్కలకే అతీగతీలేదు. ఇప్పుడు కార్తీక వనమహోత్సవం పేరిట మరోసారి నిధులు కాజేసేందు అవకాశం వచ్చినట్టేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పక్కాగా అమలు చేస్తాం: అధికారులు ఈసారి కార్తీక వనమహోత్సవాన్ని పక్కాగా నిర్వహిస్తామని సోషల్ పారెస్ట్ జిల్లా అధికారి షేక్సలామ్ సాక్షికి తెలిపారు. లక్ష మొక్కలు నాటడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టి వాటి పరిరక్షణకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఇది పాలకొండ మండల పరిషత్ కార్యాలయ ఆవరణ. గతేడాది ఇక్కడే మొక్కలు నాటారు. ఫొటోలు తీసుకున్నారు. పత్రికల్లో ప్రచురింపజేసుకున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇదీ పచ్చదనంపై అధికారులకు ఉన్న చిత్తశుద్ధి -
లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
ముంబై: గురువారం నాటి దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆర్బీయై ప్రకటనతో జోరుమీదున్న మార్కెట్లు గురువారం కూడా తమ జోరును కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్ 228 పాయింట్ల లాభంతో 26,383 దగ్గర, నిఫ్టీ 49 పాయింట్ల లాభంతో 7,997 దగ్గర ట్రేడవుతున్నాయి. ఒకవైపు గ్లోబల్ మార్కెట్ల ట్రెండ్, మరోవైపు ఐటి షేర్లలోలాభాలు మార్కెట్ లీడ్ చేస్తున్నాయి. ముఖ్యంగా నిఫ్టీ ఎనిమిది వేల మార్కు ను టచ్ చేయడం సెంటిమెంట్‌ను బలపరుస్తోందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. అటు అంతర్జాతీయ మార్కెట్లో రూపాయ లాభాల్లో కొనసాగుతోంది. 9 పైసలు లాభపడి 65.49 దగ్గర ట్రేడవుతోంది. -
పచ్చని పల్లె!
ఇంటిని ఉపయోగించకుండా ఖాళీగా వదిలేస్తే ఏమవుతుంది? శిథిలమై ఎందుకూ పనికిరాకుండా పోతుంది. మరి ఏకంగా ఒక ఊరినే అలా వదిలేస్తే ఏమవుతుంది? ఇదిగో.. ఇలా తయారవుతుంది. చైనాలోని యాంగ్జే నది ఒడ్డున హౌటౌ వాన్ అనే చిన్నగ్రామం ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం అక్కడ మత్స్యకారులు నివసించేవారు. కాలక్రమంలో అక్కడ జీవనోపాధి కష్టం కావడంతో వారంతా వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. దీంతో గ్రామం మొత్తం ఖాళీ అయిపోయింది. అనంతరం 50 ఏళ్లలో అక్కడి ఇళ్లు పాడైపోయినా, వాటి నిండా మొక్కలు ఎదగడంతో ఇలా పచ్చదనంతో నిండిపోయింది. చూడటానికి ఆకర్షణీయంగా ఉండటంతో ప్రస్తుతం ఇదో పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. ఈ పచ్చని పల్లెను చూడటానికి పర్యాటకులు క్యూ కడుతున్నారట..! -
విజయాల బాటలో...!
అ అమ్మాయి పేరు సుమన స్నిగ్ధ... ఆరెంజ్, గ్రీన్, బ్రౌన్ బెల్టులు దాటి బ్లాక్‌బెల్ట్‌కు చేరింది.ఇటీవల బ్లాక్‌బెల్ట్‌లో రెండో రౌండ్ పూర్తి చేసింది... మూడో రౌండ్లో పోటీ పడడానికి సిద్ధమే అంటోంది... కానీ అందుకు ఇంకా మూడేళ్లు ఆగాలంటున్నాయి నిబంధనలు. మన రాష్ట్రంలో పన్నెండేళ్లలోపు వయసులో బ్లాక్‌బెల్ట్‌లో రెండవ లెవెల్‌కు చేరిన తొలి అమ్మాయి స్నిగ్ధ. ఐదేళ్ల పాపాయిగా ఉన్నప్పుడు మొదలు పెట్టిన కరాటే సాధనలో ఇప్పటికి ఆమె సాధించిన బంగారు పతకాలు పందొమ్మిది. వీటికి తోడు రజత, కాంస్య పతకాలు అన్నీ కలిసి పాతిక దాకా ఉంటాయి. స్నిగ్ధ డైలీ రొటీన్ ఇలాగ! ఉదయం నాలుగుంపావుకి నిద్ర లేచింది మొదలు రాత్రి తొమ్మిదింటికి నిద్రపోయే వరకు స్నిగ్ధ టైమ్‌టేబుల్‌లో ఏమాత్రం ఖాళీ కనిపించదు. ఐదున్నరకు తల్లితో కలిసి వాకింగ్, ఆరు నుంచి ఏడుగంటల ఇరవై ఎనిమిషాల వరకు కరాటే సాధన చేస్తుంది. తర్వాత స్కూలు మొదలవుతుంది, మధ్యాహ్నం మూడు యాభైకి ఇంటికి వస్తుంది. మరో గంటలో ట్యూషన్కెళ్లి రాత్రి ఏడున్నరకు ఇంటికి వస్తుంది. హోమ్‌వర్కు, భోజనం తర్వాత తొమ్మిదికి ఎట్టిపరిస్థితుల్లోనూ నిద్రకుపక్రమించేలా చూస్తారు స్నిగ్ధ తల్లి సుధ. ఆదివారం ఈ రొటీన్ మొత్తానికీ సెలవు ప్రకటించేసి టీవీ చూడడం, బయటకు వెళ్లడంలో గడిపేస్తారు. గోల్కొండ, చార్మినార్లతోపాటు నగరంలో చారిత్రక ప్రదేశాలన్నింటినీ చూపిస్తున్నానంటారు సుధ. వేసవి సెలవులకు తప్పనిసరిగా అందరూ కలిసి కేరళ, ఊటీలాంటి ప్రదేశాలకు టూర్‌కి వెళ్తారు. పుస్తకాలే నేస్తాలు! ‘‘స్మార్ట్ ఫోన్ వాడడం, ల్యాప్‌టాప్, ఫేస్బుక్లో గడపడం అంటే అమ్మకు చిరాకు. ఇ-మెయిల్, ఇంటర్నెట్ వంటి వాటిని అవసరాలకు మాత్రమే అనుమతిస్తుంది. బుక్స్ మాత్రం అడిగినవన్నీ కొనిస్తుంది. బుక్ఫెయిర్లకు తీసుకెళ్తుంది. కొన్నింటిని నేను అడగకపోయినా సరే ‘ఇవి చాలా బాగుంటాయి పెద్దయ్యాక చదువు’ అని మాల్గుడి డేస్ వంటి ఆర్కె నారాయణ్ పుస్తకాలు కొనిచ్చింది. ఇలాంటివి నా రూమ్‌లో నాలుగు ర్యాక్‌ల నిండా పుస్తకాలున్నాయి’’ అన్నది స్నిగ్ధ డ్రాయింగ్‌రూమ్‌లో ఉన్న బుక్ రాక్‌ని చూపిస్తూ. స్నిగ్ధని విజేతను చేయడంలో తల్లి సుధపాత్ర అపారం. ‘‘పిల్లలు ఏదైనా సాధించాలంటే తల్లిదండ్రుల్లో ఒకరు పిల్లల కోసమే అంకితం కావాలి. అందుకే ఇంటర్నేషనల్ స్కూల్లో ఆపరేషన్స్ మేనేజర్ ఉద్యోగాన్ని వదిలేశాను. టీవీ ముందు కూర్చోవడానికి నేను వ్యతిరేకిని. టీవీ ముందు కాలం గడపడం పిల్లలకు అలవాటు కాకూడదని ఏదో ఒక పనిలో నిమగ్నం చేయాలనుకున్నాను. దీనికి తోడు స్నిగ్ధ చిన్నప్పుడు బొద్దుగా ఉండేది. శరీరానికి శ్రమను కలిగిస్తూ ఆత్మరక్షణకు కూడా దోహదం చేసే యాక్టివిటీ అయితే మంచిదని కరాటేలో చేర్చాను. కరాటేలో ఇంతగా రాణిస్తుందని ఊహించి కానీ, రాణించాలని ఆశించి కానీ చేర్చలేదు. కానీ స్నిగ్ధ పాల్గొన్న ప్రతి పోటీలోనూ బంగారు, రజత పతకాలు తెచ్చుకోసాగింది. దాంతో ఈ రంగంలో కొనసాగిద్దామనే ఆలోచన కలిగింది. కొంతకాలం బాడ్మింటన్‌లో శిక్షణ తీసుకుంది. కానీ తాను కరాటేలోనే బాగా రాణిస్తున్నట్లు అనిపించింది. దాంతో బాడ్మింటన్ శిక్షణ కొనసాగించలేదు. స్నిగ్ధ రక్షణరంగంలో కానీ ఐపిఎస్‌గా కానీ దేశానికి సేవ చేయాలని, మంచి అధికారిగా గుర్తింపు తెచ్చుకోవాలని నా కోరిక. నేను చేయలేకపోయాను, తనైనా చేస్తే బావుండని ఆశ. అయితే ఇంత చిన్న వయసులోనే తన వృత్తి గురించి ఆలోచించడం సరి కాదేమో! అలాగే నా అభిప్రాయాన్ని, నా ముచ్చటను తన మీద రుద్దను. స్నిగ్ధ కూడా కోరుకుంటే దానికి తగిన కోచింగ్ ఇప్పించడంతోపాటు నేను చేయగలిగినంత సపోర్టునిస్తాను’’ అంటారు స్నిగ్ధ తల్లి సుధ. కరాటే ఫీజులు తక్కువే కానీ..! ‘‘కొన్ని పాఠశాలలు విద్యేతరకార్యక్రమాల్లో భాగంగా కరాటే క్లాసులు నిర్వహిస్తుంటాయి. అలా కాకుండా విడిగా కోచింగ్ తీసుకోవడం అంటే ఖర్చుతోకూడిన అంశం అనుకుంటారు. కానీ కరాటే శిక్షణకు నెలకు వెయ్యి రూపాయలు చాలు. అసలు ఖర్చు టోర్నమెంట్లకు హాజరుకావడంలోనే ఉంటుంది. పిల్లలతో తల్లి కానీ తండ్రి కానీ వెళ్లాలి, కోచ్‌తోపాటు పంపించవచ్చు కానీ నేనింత వరకు అలా పంపలేదు’’ అన్నారు సుధ. కరాటేలో వెపన్ ట్రైనింగ్, కటాస్, కుమితే విన్యాసాలన్నింటిలో మంచి పట్టు సాధించి డాన్ టెన్ స్థాయిని చేరడమే తన లక్ష్యం అంటోంది స్నిగ్ధ. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న తండ్రి ప్రోత్సాహం, అడుగడుగునా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న తల్లి సహకారంతో స్నిగ్ధ కోరుకున్న శిఖరాలను చేరుతుందని ఆశిద్దాం. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి, ఫొటోలు: లావణ్యకుమార్ -
హరిత విజయం...
ఒక సంస్థ నలుగురికీ తెలిసేందుకు నాలుగేళ్లు సరిపోయేంత సమయం కావచ్చు. కానీ గెలవడానికి అది సరిపోయే సమయమేనా? అది కూడా వినూత్న వ్యాపార పంధాలో వెళితే... అంత స్వల్ప కాలం ఏ మూలకు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తాడు సూర్యదేవర విజయ్ భాస్కర్. కృష్ణా జిల్లాలోని మారుమూల ఘంటసాల మండలం కొడాలి గ్రామానికి చెందిన ఓ చిన్న రైతు కొడుకు ఈ మూడు పదుల యువకుడు. ఇతనికీ, హైదరాబాద్‌లోని పలు ప్రతిష్ఠాత్మక నిర్మాణాలకీ మధ్య ఉన్న సంబంధం... ఓ వైవిధ్యభరితమైన ఆలోచనకూ, అది సాధించే విజయానికీ ఉన్న సంబంధం లాంటిది. ఈ విజయ ప్రస్థానం గురించి అతని మాటల్లోనే... భారీ ప్యాకేజీని కాదనుకుని... ఇంజినీరింగ్ పూర్తి చేసిన వెంటనే బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా మంచి ప్యాకేజీతో ఉద్యోగం. ఆ తర్వాత షార్ట్‌టైమ్‌లోనే అమెరికాలో నాలుగురెట్లు జీతంతో మరో ఉద్యోగం. ఇలాంటి పరిస్థితుల్లో మరొకరైతే ఇంతకన్నా ఏం కావాలనుకునేవారో, అంతకన్నా మరింత జీతం ఇచ్చే కంపెనీని అన్వేషించేవారో కానీ నేను మాత్రం అలా అనుకోలేదు. నెలకు లక్షల రూపాయల జీతం గొప్పగా అనిపించక ఉద్యోగానికి రాజీనామా చేశాను. అమెరికా వదిలేశాను. తిరిగి విద్యార్థిగా... విజయవంతమైన వ్యాపార వేత్తగా రాణించడానికి అందరూ ముందు పెట్టుబడి కావాలనుకుంటారు. నేను మాత్రం వ్యాపార పరిజ్ఞానం కావాలనుకున్నాను. ఎందుకంటే కొత్త ఆలోచన ఉంటే పెట్టుబడి అదే నడిచొస్తుంది. ఒక కొత్త ఆలోచన అంకురించాలంటే నడుస్తున్న వ్యాపార విధానాలపై పూర్తి అవగాహన అవసరం. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో జేరాను. కోర్సు పూర్తవుతుండగానే ఆలోచనలకు ఓ రూపం వచ్చింది. దాని పేరే ‘గ్రీన్ బిల్డింగ్ మెటీరియల్’. నగరాలను కాంక్రీట్ భవనాల కీకారణ్యాలుగా పిలుస్తున్నారంటే దానికి కారణం ప్రస్తుత నిర్మాణశైలి. దీన్నే మార్చాలనుకున్నాను. పర్యావరణానికి హాని కలిగించని ఎకో ఫ్రెండ్లీ బిల్డింగ్ మెటీరియల్‌ను అందించే మార్గంలో వేసిన తొలి అడుగే ఎఎసి బ్లాక్స్ ఇటుకలు. సంప్రదాయ ఇటుకల తయారీ వల్ల అత్యధికంగా విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ ఈ ఇటుకల తయారీలో కనీసస్థాయికి పరిమితం అవుతుంది. మేము తయారు చేసే పర్యావరణహిత ఇటుకలు ఫ్లైయాష్‌తో తయారవుతాయి. దీంతో పరిశ్రమలు వెలువరించే కాలుష్యాన్ని అరికట్టేందుకు కూడా ఇది ఉపకరిస్తుంది. మరోవైపు భవనాలలో చల్లదనాన్ని కాపాడుతాయి, వీటి జీవితకాలం కూడా మెరుగ్గా ఉంటుంది. అనేక అంతస్థులతో కూడిన ఎత్తై భవనాలకు ఈ రకమైన ఇటుకలు వాడడం అవసరం కూడా. దీంతో బ్యాంకులు, సన్నిహితులు అందించిన ఆర్థిక సహకారంతో వీటి తయారీకి శ్రీకారం చుట్టాం. ‘విజయ’బావుటా... వైవిధ్యభరితమైన ఆలోచనకు ద ఇండస్ ఎంటర్ప్రెన్యూర్ (టై) ఐఎస్బీ కనెక్ట్ ‘బిజ్క్వెస్ట్’ అవార్డుల లాంటి పురస్కారాలను అందుకోగలిగాం. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో సంప్రదాయ ధోరణికి భిన్నంగా ఉత్పత్తి చేసిన తక్కువ బరువున్న ఎఎసి బ్లాక్స్ వినియోగదారుల ఆదరణ చూరగొన్నాయి. నందిగామలో మా పరిశ్రమ శరవేగంగా విస్తరించింది. చెన్నై, బెంగుళూరు వంటి నగరాలకూ ఎగుమతి చేస్తున్నాం. హైదరాబాద్ ఎల్ అండ్ టి తమ మెట్రోరైల్ నిర్మాణాల కోసం మా ఇటుకలను వినియోగించడం గొప్ప విజయం. దేశంలోనే ఒక పౌర సదుపాయ ప్రాజెక్ట్‌కు ఈ తరహా ఇటుకలు వాడడం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రత్యక్షంగా, పరోక్షంగా 300 మందికి ఉపాధి కల్పిస్తున్నాం. ఉచిత పత్రిక పంపిణీ... వ్యాపారం, లాభాలు ఇదొక్కటే ధ్యేయం కాదు. రేపటి తరాలపై పర్యావరణ కాలుష్య దుష్ర్పభావాలు పడకుండా చూడాలనేది మాకు మేము పెట్టుకున్న స్వచ్ఛంద లక్ష్యం. పర్యావరణ హిత భవన నిర్మాణాలు పెరగాలంటే ముందుగా వినియోగదారుల్లో అవగాహన పెరగాలి. అందుకే ప్రైమ్ ఇన్సైట్స్ పేరుతో నిర్మాణ రంగానికి సంబంధించిన సమగ్ర సమాచారంతో మేగజైన్‌ను ప్రచురించి పూర్తి ఉచితంగా పంపిణీ చేయనున్నాం. ఇటుకలు మాత్రమే కాకుండా హరిత భవనాల నిర్మాణానికి అవసరమైన అన్ని రకాల ముడి ఉత్పత్తులనూ అందించే పూర్తిస్థాయి పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధమవుతున్నాం’’ అంటూ ముగించారు విజయ్. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తన కార్పొరేట్ ఆఫీసులో కంపెనీ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న విజయ్... నవతరం కలలకే కాదు, కష్టపడేతత్వానికీ నిదర్శనంలా కనిపించారు. - ఎస్.సత్యబాబు విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణించడానికి అందరూ ముందు పెట్టుబడి కావాలనుకుంటారు. నేను మాత్రం వ్యాపార పరిజ్ఞానం కావాలనుకున్నాను. ఎందుకంటే కొత్త ఆలోచన ఉంటే పెట్టుబడి అదే నడిచొస్తుంది. - విజయ్ -
అడగండి చెబుతాం...
హాకీలో ఆటగాళ్లకు శిక్ష విధించే గ్రీన్, ఎల్లో, రెడ్ కార్డులను ఎప్పుడు వాడతారు? ప్రశ్న అడిగిన వారు: స్వరూప్ కుమార్, నెల్లూరు సాధారణంగా హాకీ మైదానంలో ఆటగాళ్లు క్రమశిక్షణ తప్పకుండా అదుపులో ఉంచేందుకు రిఫరీలు ఈ కార్డులను ఉపయోగించి హెచ్చరిస్తారు. ఇందులో అన్నింటికంటే తక్కువ రకమైన శిక్షగా గ్రీన్ కార్డును చెప్పవచ్చు. మైదానంలో ప్రత్యర్థి ఆటగాడిని ఆపే ప్రయత్నంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు భావిస్తే దీంతో హెచ్చరిస్తారు. గ్రీన్ కార్డు చూసిస్తే ఆటగాడు రెండు నిమిషాల పాటు మైదానం వీడాల్సి ఉంటుంది. ఆ తర్వాతి స్థాయిలో ఎల్లో కార్డ్‌ను జారీ చేస్తారు. ప్రత్యర్థి పట్ల దురుసుగా ప్రవర్తించడం, స్టిక్‌తో కాకుండా శరీరంతో అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ఎల్లో కార్డు చూపించి ఆటగాడిని బయటికి పంపిస్తారు. ఇందులో కనీసం 5 నిమిషాల పాటు మైదానం వీడాలి. అంతకంటే ఎక్కువ సమయం కూడా శిక్షించవచ్చు. రెడ్ కార్డు అన్నింటిలోకి పెద్ద శిక్ష. ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి ఆటగాడిపై శారీరకంగా దాడి చేసేందుకు ప్రయత్నించడం, రక్తమోడటంలాంటిది ఏదైనా జరిగితే రెడ్ కార్డు చూపిస్తారు. రెడ్ కార్డు శిక్షకు గురైతే చూపిస్తే ఆ మ్యాచ్ మొత్తంలో అతను ఆడటానికి వీలుండదు. దాంతో పాటు తర్వాతి మ్యాచ్ కూడా ఆడకుండా నిషేధం విధిస్తారు. అయితే శిక్షల్లో స్థాయి భేదాలు అంతా రిఫరీ నిర్ణయంపైనే ఆధార పడి ఉంటుంది. ఏ కార్డు ద్వారానైనా ఆటగాడు బయటికి వెళితే మిగతా 10 మంది సభ్యులతోనే సదరు జట్టు మ్యాచ్‌ను ఆడాల్సి ఉంటుంది. ఇది ఆ మ్యాచ్ ఫలితంపై కూడా ప్రభావం చూపవచ్చు. -
కంటతడి పెట్టించిన కిరాతకం
నిజామాబాద్ క్రైం/దూలపల్లి, న్యూస్‌లైన్: నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు పసిపిల్లల్ని కిరాతకుడు చిదిమేసిన ఘటన నగర శివారు దూలపల్లిలోని అలేఖ్య రెసిడెన్సీలో కలకలం రేపింది. అప్పటివరకు ఆడిపాడిన పిల్లలు అంతలోనే మంటల్లో మాడి మసైపోయారని తెలిసి తల్లిదండ్రులు కలవరపడ్డారు. పిల్లల్ని పొట్టన పెట్టుకుని కన్న వారికి గర్భశోకాన్ని మిగిల్చిన వ్యక్తి పిల్లలకు వరుసకు బాబాయి కావడం అందర్నీ కలచివేసింది. ఈ దారుణానికి పాల్పడిన నరేందర్‌రెడ్డి ఆదిలాబాద్ జిల్లా బాసరలోని గోదావరిలో దూకినట్లు అనుమానాలుండటంతో పోలీసులు గాలిస్తున్నారు. పెళ్లికి వెళ్లి.. నిజామాబాద్ జిల్లాకు చెందిన రఘపతి రెడ్డికి ముగ్గురు కుమారులు. వీరిలో గంగారెడ్డి, ఆయన భార్య హరిత, కుమార్తె సిరి (8) , రాజిరెడ్డి, భార్య చైతన్య, కుమార్తె ఖుషి (6)తో కలిసి కుత్బుల్లాపూర్ మండలం దూలపల్లిలోని అలేఖ్య రెసిడెన్సీ 204, 101 ఫ్లాట్ల లో ఉంటున్నారు. మరో కుమారుడు సాయిరెడ్డి, భార్య, కుమారుడు, కుమార్తె అక్షయ (6)తో కలిసి తండ్రితోనే కలిసి ఉంటున్నా రు. నిజమాబాద్‌లో జరిగే బంధువుల పెళ్లికి గంగారెడ్డి, రాజిరెడ్డి భార్యపిల్లలతో రెండ్రోజుల క్రితం వెళ్లారు. వీరి పిల్లలు సిరి, ఖుషి తో పాటు అక్షయ (6).. గురువారం వరుసకు బాబాయ్ అయ్యే నరేందర్‌రెడ్డి చేతిలో దారుణహత్యకు గురయ్యారు. విషయం తెలియగానే ఇటు దూలపల్లిలో, అటు నిజామాబాద్ జిల్లాలోని స్వగ్రామం దూపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమకు టాటా.. బై బై చెప్పిన పిల్లలు మంటల్లో కాలిపోయారని తెలిసి దూలపల్లిలోని అపార్ట్‌మెంట్‌వాసులు నివ్వెరపోయారు. యూనిసెంట్ స్కూల్లో విషాదఛాయలు బంధువుల పెళ్లికని వెళ్లిన ఖుషి, సిరి.. దారుణంగా హతమయ్యారని తెలిసి కొంపల్లిలోని యూనిసెంట్ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. ఈ స్కూల్లో ఖుషి 1, సిరి 3వ తరగతి చదువుతున్నారు. చిన్నారుల హత్య ఘటన ఆందోళనకు గురిచేసిందని ప్రినిపాల్, ఉపాధ్యాయులు చెప్పారు. చదువులో ఇద్దరు పిల్లలు ముందుండేవారని గుర్తుచేసుకున్నారు. తెగిన పేగుబంధం రఘుపతిరెడ్డి ముగ్గురు కుమారుల్లో పెద్దవాడు గంగారెడ్డి, చిన్న కుమారుడు రాజరెడ్డి. వీరికి చెరో కూతురు మాత్రమే సంతానం. నడిపి కుమారుడు సాయరెడ్డికి కూతురు, కుమారుడు ఉన్నారు. పిల్లలు హలత్యకు గురికావడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదించారు. ఒక్కో కూతురితోనే వారు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించుకున్నారు. ఆడపిల్లలనే వారసులుగా ఆశలు పెట్టుకున్న వారికి ఈ ఘటన అంతులేని మనోవేదన మిగిల్చింది. తోటి బంధువులు పెళ్లిళ్లు చేసుకుని సుఖపడుతూ, ఆర్థికంగా ఎదుగుతున్నారనే ఈర్ష్యతోనే నరేందర్‌రెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని మృతుల బంధువులు చెబుతున్నారు. పిల్లల విషయం చెప్పలేదు బుధవారం రాత్రి నరేందర్‌రెడ్డి డీఐజీకి ఫోన్ చేసి తాను చనిపోతున్నట్లు చెప్పాడని, దీంతో అప్రమత్తమయ్యామని జిల్లా ఎస్పీ తరుణ్‌జోషీ తెలిపారు. అయితే ముగ్గురు పిల్లల్ని కిడ్నాప్ చేసినట్టు నరేందర్‌రెడ్డి చెప్పలేదన్నారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో కుటుంబసభ్యుల ఫిర్యాదుతో జిల్లావ్యాప్తంగా పోలీసులతో పాటు, మహారాష్ట్ర నాందేడ్ జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చామన్నారు. అంతలో గురువారం ఉదయం ముగ్గురు పిల్లలు డిచ్పల్లి మండలం బర్దిపూర్ గ్రామ శివారులో మంటల్లో కాలి చనిపోయినట్లు తెలిసిందన్నారు. మృతదేహాలు స్వగ్రామానికి తరలింపు అతి దారుణంగా హతమైన ముగ్గురు పిలల్ల మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. నరేందర్‌ను ప్రజల ముందే ఉరితీయాలని నినాదాలు చేశారు. పోస్టుమార్టమ్ అయ్యే వరకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మృతదేహాలను దహన సంస్కారాల కోసం రెంజల్ మండలం దూపల్లి గ్రామానికి తరలించారు. పక్కపక్కనే చితులు పేర్చి.. ముగ్గురు చిన్నారుల తల్లిదండ్రులు ఒకేసారి తలకొరివి పెట్టడం చూసిన వారంతా కంటతడి పెట్టారు.