ఆకాశంలో అద్భుతం.. ఆకుపచ్చ కాంతిలో ఉల్కపాతం | Spectacular Meteor Streaks In Turkey Turns It Green | Sakshi
Sakshi News home page

ఆకాశంలో అద్భుతం.. ఆకుపచ్చ కాంతిలో ఉల్కపాతం

Published Mon, Sep 4 2023 2:12 PM | Last Updated on Mon, Sep 4 2023 3:30 PM

Spectacular Meteor Streaks In Turkey Turns It Green - Sakshi

అంకారా: టర్కీలో శనివారం రాత్రి అద్భుత దృశ్యం అవిష్కృతమైంది. నిప్పలు చిమ్ముతూ నేలరాలాల్సిన ఉల్కపాతం.. గ్రీన్‌కలర్‌లో కాంతిని వెదజల్లుతూ భూమి వైపుకు దూసుకొచ్చింది. గుముషానే ప్రావిన్స్‌లోని ఎర్జురం నగరం ప్రాంతానికి వచ్చే సరిగి గ్రీన్ కలర్ రంగులో కాంతిని వెదజల్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

టర్కీలో రాత్రిపూట అంతా ప్రశాంతంగా ఉండగా.. ఒక్కసారిగా ఆకాశంలో నుంచి ఉల్కపాతం సంభవించింది. అయితే.. అది గ్రీన్ కలర్ రంగులో కాంతిని వెదజల్లింది. ఈ దృశ్యాలను చూపుతున్న వీడియోలో ఓ బాలుడు బెలూన్‌తో ఆడుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోను నహెల్ బెల్గెర్జ్ తన ట్విట్టర్ (ఎక్స్‌) వేదికగా షేర్ చేశారు. 

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ప్రకారం అంతరిక్షంలో దుమ్ము, దూళి కణాలు కలిగిన శిలలు భూవాతావరణంలో కిందికి పడిపోయినప్పుడు భారీ స్థాయిలో కాంతిని వెదజల్లుతాయి. అతి వేగంగా భూమి వైపుకు ప్రయాణిస్తాయి. అయితే.. తాజాగా టర్కీలో సంభవించిన ఘటనపై అధికారులు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ ఇవ్వలేదు. గత వారంలో కొలరాడోలోనూ ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. తెల్లవారుజామున 3.30 సమయంలో ఉల్కలు నెలరాలాయి.  

ఇదీ చదవండి: Plane Crash: సంతోషంగా పార్టీ.. అందరూ చూస్తుండగా కళ్ల ముందే ఘోర ప్రమాదం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement