sky
-
నేడు ఆకాశంలో అద్భుతం.. ఆరు గ్రహాల పరేడ్
ఈ రోజు(జనవరి 21) రాత్రి.. ఆకాశంలో ఒక అద్భుతమైన ఖగోళ దృశ్యం కనిపించనుంది. నేటి నుంచి మొదలుకొని రాబోయే కొన్ని వారాల పాటు, మన సౌర వ్యవస్థలోని ఆరు గ్రహాలు అంటే.. అంగారక గ్రహం, బృహస్పతి, యురేనస్, నెప్ట్యూన్, శుక్రుడు, శని ఒక సరళ రేఖలోకి రానున్నారు. ఇది ఒక అందమైన ప్లానెట్ పరేడ్‌గా కనిపించనుంది.గ్రహ సంయోగంగా పేర్కొనే ఈ దృగ్విషయం పలు గ్రహాల వరుస క్రమం ఏర్పడినప్పుడు సంభవిస్తుంది. ఈ ఖగోళ అద్భుతం జరిగే సమయంలో యురేనస్, నెప్ట్యూన్లను వీక్షించడానికి బైనాక్యులర్లు టెలిస్కోప్‌లు అవసరం అవుతాయి. మిగిలిన నాలుగు గ్రహాలను నేరుగా కళ్లతో చూడవచ్చు. ఈ అరుదైన గ్రహాల అమరిక రాబోయే కొన్ని వారాల పాటు కనిపించనుంది.గత వారం శని, శుక్ర గ్రహాలు ఒకదానికొకటి దగ్గరగా రావడం మొదలయ్యింది. ఇలాంటి గ్రహ అమరికలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఖగోళ శాస్త్ర ఔత్సాహికులు, నక్షత్ర పరిశీలకులు సాగించే అధ్యయనానికి ఇవి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తున్నాయి. ఈ గ్రహాలు సంపూర్ణ సరళ రేఖను ఏర్పరచకపోయినప్పటికీ, ఆకాశంలో కనిపించే వీటి అమరిక అద్భుతంగా ఉంటుంది.పరేడ్ రూపంలో కనిపించే ఈ ఆరు గ్రహాలలో శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, నెప్ట్యూన్, యురేనస్ ఉన్నాయి. ఈ గ్రహాలన్నీ అంతరిక్షంలో మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. భూమి దాని కక్ష్యలో ఉన్న స్థానం కారణంగా ఈ అమరిక జరిగింది. జనవరిలో అంగారక గ్రహం సూర్యుడి నుండి భూమికి ఎదురుగా నేరుగా ఉండి, సరళ రేఖను ఏర్పరుస్తుందని నాసా తెలిపింది. ఈ సమయంలోనే ఈ గ్రహం భూమికి దగ్గరగా ఉంటుంది. దీని వలన అది అతిపెద్దదిగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.జనవరి 21న ఈ అమరిక ప్రారంభమవుతుంది. ఈ అమరికను సూర్యాస్తమయం అయిన 45 నిమిషాల తర్వాత వీక్షించవచ్చు. రోజులో చీకటి పడిన తర్వాత నెల రోజుల పాటు నైరుతి దిశలో శుక్రుడు, శనిని రెండు గంటల పాటు చూడవచ్చని, బృహస్పతి ప్రకాశవంతంగా ప్రకాశిస్తుందని, తూర్పున అంగారక గ్రహం కనిపిస్తుందని నాసా తెలిపింది. భారతదేశంలోని దాదాపు ప్రతి నగరం నుంచి ఈ అరుదైన గ్రహ అమరికను చూసే అవకాశం ఉంటుంది.నేటి నుంచి రాత్రి సమయంలో ఆకాశంలో శుక్రుడు, శని, బృహస్పతి, అంగారక గ్రహాలను ఏ విధంగా వీక్షించవచ్చో ప్లానెస్ట్రీ సొసైటీకి చెందిన శాస్త్రవేత్త ఎన్ రఘనుందన్ కుమార్ తెలిపారు.1. శుక్రుడు: పశ్చిమ దిశలో ప్రకాశవంతంగా, మిణుకుమిణుకుమంటూ నక్షత్రం మాదిరిగా శుక్రుడు కనిపిస్తాడు. రాత్రి 8.30 గంటలకు అస్తమయం జరుగుతుంది. ఆ సమయంలో మనం శుక్రగ్రహాన్ని వీక్షించగలుగుతాం.2. శని: శుక్రుడిని గుర్తించిన మాదిరగానే నిశితంగా గమనించగలిగితే, శని గ్రహాన్ని కూడా చూడవచ్చు. లేత పసుపురంగుతో పాటు తెల్లని నక్షత్రంలా శని గ్రహం కనిపిస్తుంది.తూర్పు దిశలో3. బృహస్పతి: ఆకాశంలో తూర్పు వైపుకు తిరిగి చూస్తే మెరుస్తున్న నక్షత్రం లా బృహస్పతి కనిపిస్తుంది.4. అంగారక గ్రహం: తూర్పు దిశలో నారింజ ఎరుపు నక్షత్రంలా కనిపించేదే అంగారక గ్రహం.అర్ధరాత్రి, సూర్యోదయానికి ముందు..బృహస్పతిని రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆకాశంలో నడినెత్తిపై చూడవచ్చు. అర్ధరాత్రి 12 గంటల తరువాత అంగారక గ్రహాన్ని చూడవచ్చు. ఇది సూర్యోదయానికి ముందు పశ్చిమ దిశలో కనిపిస్తుంది. ఈ వివరాలను అందించిన శాస్త్రవేత్త రఘునందన్ కుమార్ తన ఇంటి సమీపం నుంచి ఆకాశంలో ఇటీవలి కాలంలో ఈ గ్రహాలు ఎలా కనిపించాయో ఒక ఫొటో ద్వారా తెలియజేశారు. ఇది కూడా చదవండి: Mahakumbh: కుంభమేళాకు భయపడిన బ్రిటీష్ పాలకులు.. విప్లవగడ్డగా మారుతుందని.. -
సైన్సు సినిమా.. అక్టోబర్ స్కై
‘అక్టోబర్ స్కై’ 1999లో విడుదలైన హాలీవుడ్ సినిమా. అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో కోల్ వుడ్ అనే ఓ చిన్న గ్రామంలో జరిగిన నిజజీవిత కథ ఆధారంగా తీశారు. ఆ గ్రామానికి చెందిన నలుగురు కుర్రాళ్ల కథ ఇది. కథ జరిగిన కాలం 1957. పెద్దగా సౌకర్యాలు లేని ఓ కుగ్రామానికి చెందిన ఆ కుర్రాళ్లకి కొన్ని కారణాల వల్ల రాకెట్ తయారు చెయ్యాలని ఆలోచన వస్తుంది. ఎన్నో కష్టనష్టాలకి ఓర్చి ఎంతో వ్యతిరేకతని ఎదుర్కొని చివరికి చిన్న రాకెట్ తయారు చేస్తారు. ఆ రాకెట్‌ని ఓ జాతీయస్థాయి సైన్స్ ప్రాజెక్ట్ పోటీలో ప్రదర్శించి మొదటి స్థానంలో విజయం సాధిస్తారు. అత్యంత స్ఫూర్తిదాయకమైన ఈ కథలో ముఖ్య పాత్ర పేరు ‘హోమర్ హికమ్’. ఆ హోమర్ హికమ్ ఆ తర్వాతి కాలంలో తన రాకెట్ తయారీ అనుభవాన్ని ‘రాకెట్ బోయ్స్’ పేరుతో పుస్తకం రాశాడు. యూనివర్సల్ స్టూడియోస్ వారు పుస్తకం హక్కులు కొని ‘అక్టోబర్ స్కై’ పేరుతో సినిమాగా విడుదల చేసి హిట్ సాధించారు. పుస్తకం పేరు ‘రాకెట్ బోయ్స్’ను యథాతథంగా సినిమాకు కూడా పెడితే ‘ముప్పై ఏళ్లు నిండిన స్త్రీలు ససేమిరా చూడరు’ అని యూనివర్సల్ స్టూడియోస్ వారు అభిప్రాయపడడం చేత Rocket Boys అని మార్చవలసి వచ్చింది. ఇక్కడ తమాషా ఏంటంటే 'Rocket అన్న పదజాలంలోని అక్షరాలని తారుమారు చేస్తే అది 'October Sky' అవుతుంది. ఈ కథ పిల్లలకి ఎంత స్ఫూర్తి దాయకంగా ఉంటుందంటే ఈ పుస్తకాన్ని అమెరికాలో ఎన్నో బళ్లు పిల్లలు తప్పనిసరిగా సిలబస్‌లో పెట్టాయి. -
అనంతపురం : ఆకాశంలో అద్భుతం (ఫొటోలు)
-
స్పేస్‌లోకి వెళ్లిన అతి పిన్న వయస్కురాలిగా కర్సెన్ కిచెన్..!
ఇంతవరకు పలనా పర్యటన చేశామని గొప్పగా చెప్పుకునే వాళ్లుం. ఇక నుంచి స్పేస్‌గా వెళ్లమని గొప్పలు చెప్పుకుంటామేమో..!. ఇక ముందు అలాంటి రోజులే ఉంటాయేమో కాబోలు. ఈ జాబితాలో చేరిపోయింది 21 ఏళ్ల కర్సెన్ కిచెన్. 21 ఏళ్ల ఈ ఆస్ట్రానమీ స్టూడెంట్ ఇటీవలే బ్లూ ఆరిజిన్ సంస్థ నిర్వహించిన అంతరిక్ష యాత్రలో భాగమైంది. తద్వారా అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. ఈ స్పేస్ ఔత్సాహికురాలి ఎవరూ..? ఆ ఛాన్స్ ఎలా లభించింది తదితరాల గురించి తెలుసుకుందామా..!.చాపెల్ హిల్‌లోని నార్త్ కరోలినా విశ్వవిద్యాలయంలో చదువుతున్న కర్సెన్ కిచెన్ బెజోస్ స్థాపించిన బ్లూ ఆరిజిన్ అంతరిక్ష నౌకలో ప్రయాణించారు. ఆమెతో పాటు నాసా ప్రాయోజిత ఏరోస్పేస్ శాస్త్రవేత్తతో సహా మరో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. మొత్త ఆరుగురు సభ్యుల సిబ్బంది ఆగస్టు 29న స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:07 గంటలకు వెస్ట్ టెక్సాస్ సైట్ ఉప కక్ష్యలోకి దాదాపు 10 నిమిషాల తర్వాత ల్యాండ్ అయ్యారు. భూమి ఉపరితలాన్ని దాటి భార రహిత స్థితిలో సుమారు మూడు నిమిషాలకు పైగానే గడిపింది. తద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది కిచెన్.‘అంతరిక్షంలోకి వెళ్లాలన్న నా కల నెరవేరింది. రోదసీ నుంచి భూమి అందాల్ని చూసి ముగ్ధురాలినయ్యా. ఇంత అందమైన గ్రహంపై జీవించడం నా అదృష్టంగా ఫీలయ్యా. ఇలా ఇప్పటివరకు అంతరిక్షంలోకి వెళ్లిన వారిలో నేనే పిన్న వయస్కురాలిని కావడం మరింత ఆనందంగా ఉంది. ఈ యాత్రలో భాగంగా కొన్ని వేల మైళ్ల వేగంతో రాకెట్ నింగిలోకి దూసుకెళ్లడం, అంతరిక్షంలో భార రహిత స్థితిలో తేలియాడడం, చీకటిగా ఉన్న ఆకాశం, అక్కడ్నుంచి నీలం రంగులో కనిపించే భూమి.. ఇలా ప్రతిదీ మర్చిపోలేని మధురానుభూతే!’ అంటూ తన అంతరిక్ష యాత్ర అనుభవాల్ని గూర్చి కళ్లకు కట్టినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఇలా తన కుటుంబంలో స్పేస్‌లోకి వెళ్లోచ్చిన తొలి వ్యక్తి మాత్రం కాదు. ఎందుకంటే ఆమె తండ్రి కూడా అంతరిక్ష ఔత్సాహికుడే. అతను ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అంతరిక్షంపై ఆసక్తితో ఎప్పటికైనా స్పేస్ టూర్‌కి వెళ్లాలనుకున్నారాయన. ఆయనకు ఆ అవకాశం 2022లో వచ్చింది. ఆ సమయంలో బ్లూ ఆరిజిన్ సంస్థ చేపట్టిన ‘ఎన్ఎస్-20 మిషన్’లో రోదసీలోకి వెళ్లారాయన. ఇలా తన తండ్రి కల నెరవేరడంతో తానూ అంతరిక్ష యాత్ర చేయాలన్న ఆసక్తిని పెంచుకుంది కిచెన్. (చదవండి: ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న సైనా నెహ్వాల్..క్రీడాకారులకే ఎందుకంటే..?) -
ఆహా.. సూపర్ పవర్ భూమ్మీదకొచ్చిందా?.. వైరల్ వీడియోలు
ఉల్కాపాతం.. ఈ పేరు చాలామందికి తెలియంది కాదు. ఆకాశం నుంచి ప్రకాశవంతంగా దూసుకొస్తూ.. భూమ్మీద మీద పడే సమయంలో అవి మెరుస్తూ అద్భుతాన్ని తలపిస్తుంటాయి. అయితే.. తాజాగా శనివారం రాత్రి అలాంటి అనుభూతిని పొందారు స్పెయిన్, పోర్చుగల్ ప్రజలు. స్పెయిన్, పొరుగు దేశం పొర్చుగల్ ప్రజలు శనివారం రాత్రి ఆకాశంలో అరుదైన కాంతిని వీక్షించారు. నీలి రంగులో మెరుస్తూ ఉల్క ఒకటి భూమ్మీదకు రయ్‌మని దూసుకొచ్చింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాహనాల్లో వెళ్లే వాళ్లు, పార్టీలు చేసుకునేవాళ్లు.. అనుకోకుండా ఆ దృశ్యాలను బంధించారు. Tires, Cascais, Portugal. ☄️#Tires #Cascais#Portugal #Fireball #Meteor #meteoro #meteorito #España#Spainpic.twitter.com/HDtnhQEYG7— Mr. Shaz (@Wh_So_Serious) May 19, 2024అవి చూసి భూమ్మీదకు సూపర్ పవర్ ఏదైనా దూసుకొచ్చిందా? అంటూ ఆశ్చర్యపోతున్నారు పలువురు. తోక చుక్కలు, ఉల్కాపాతంను కనివినీ ఎరుగని ఒక జనరేషన్ అయితే.. ఈ దృశ్యాల్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతోంది. ఇది ఏలియన్ల పనేనా?.. సూపర్ పవర్ ఏదైనా భూమ్మీదకు వచ్చిందా? అంటూ తమదైన ఎగ్జయిట్‌మెంట్‌ను ప్రదర్శిస్తోంది. A meteor lit up the sky with bright light during the night in Portugal and Spain.Source: X#Meteor #Spain #Portugal #Fireball #Sky #DTNext #DTnextNews pic.twitter.com/09Ma6GO0sg— DT Next (@dt_next) May 19, 2024అయితే ఆ ఉల్క ఎక్కడ పడిందనేదానిపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే కొందరు మాత్రం కాస్ట్రో డెయిర్లో పడిందని, మరికొందరేమో పిన్హెయిరోలో పడిందని చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. JUST IN: Meteor spotted in the skies over Spain and Portugal.This is insane.Early reports claim that the blue flash could be seen darting through the night sky for hundreds of kilometers.At the moment, it has not been confirmed if it hit the Earth’s surface however some… pic.twitter.com/PNMs2CDkW9— Collin Rugg (@CollinRugg) May 19, 2024 రెండు వారాల కిందటే.. అక్కడి ఖగోళ శాస్త్రవేత్తలు ఉల్క పడొచ్చని అంచనా వేశారు. హెలీ తోకచుక్క నుంచి వెలువడే శకలాల కారణంగా రాబోయే రోజుల్లో ఉల్కాపాతం ఎక్కువే ఉండొచ్చని వాళ్లు అంచనా వేస్తున్నారు. -
ఆకాశంలోకి నిప్పుల నిచ్చెన వైరల్ వీడియో
‘అరోరా బొరియాలిస్’ ఆకాశంలో అద్భుతం సృష్టించగా తాజాగా మరో అద్భుతం విశేషంగా నిలుస్తోంది. ఎర్రని నిప్పుల సెగ కక్కుతున్న నిచ్చెన మెట్ల వెలుగులు ఆకాశం వైపు దూసుకెళ్లడం నెట్టింట చక్కర్లు కొడుతోంది.విషయం ఏమిటంటే..ఈ వీడిలో పదేళ నాటిదట. చైనీస్ బాణసంచా కళాకారుడు కాయ్ గువో-కియాంగ్ దీన్ని రూపొందించారు. ఆకాశంలోకి సుమారు అర కిలోమీటర్ ఎత్తు వరకు నిప్పుల నిచ్చెన ఆకారంలో టపాసులు పేలుతూ అద్భుతంగా మారింది.As a tribute to his grandmother, a Chinese artist and pyrotechnic expert created this stairway to Heaven. Stunning. pic.twitter.com/aNmc7YGcKf— Juanita Broaddrick (@atensnut) May 13, 2024ఈ కళాకారుడి క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. స్టెయిర్ వే టు హెవెన్ పేరిట పోస్ట్ అయిన ఈ వీడియో వైరల్ గా మారింది. ఓ చైనీస్ ఆర్టిస్ట్ క్రియేటివిటీకి మచ్చుతునక అంటూ నెటిజన్లు ప్రశంసించారు. కాయ్ తన అమ్మమ్మకు నివాళిగా దీన్ని తయారు చేశాడు. 1,650 అడుగుల ఎత్తు (లేదా 502 మీటర్లు) "స్కై ల్యాడర్" రాగి తీగలు, గన్‌పౌడర్‌తో తయారు చేశాడని వైస్ ఒక నివేదికలో తెలిపింది. అలా కళాకారుడిగా మారాలని కల నెరవేర్చుకోవడంతోపాటు, నివాళిగా కాయ్ గో క్వింగ్ అనే కళాకారుడు ఇలా నింగిలోకి టపాసులను కాల్చినట్లు వివరించింది. ఇలా కాయ్ ఎక్స్‌ప్లోజివ్ ఆర్టిస్ట్‌గా పేరొందాడు.1994లోనే తొలిసారిగా అతను ఈ తరహా ట్రిక్ కోసం ప్రయత్నించినప్పటికీ భారీ గాలుల వల్ల అది విజయవంతం కాలేదట. అలాగే 2001లో మరోసారి ప్రయత్నం చేయాలనుకున్నా అమెరికాలో జరిగిన 9/11 ఉగ్ర దాడుల నేపథ్యంలో చైనా ప్రభుత్వం అందుకు అనుమతి లభించలేదట. కాగా 1957లో ఫుజియాన్ ప్రావిన్స్‌లోని క్వాన్‌జౌ నగరంలో జన్మించారు కాయ్ గువో-కియాంగ్ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్‌లోని న్యూయార్క్‌లో నివసిస్తున్నారు. -
Northern Lights Photos: అరోరా వెలుగులు, నెట్టింట వైరల్ ( ఫోటోలు)
-
బహిరంగంగా ప్రశ్నాపత్రాలు.. నేటి నుంచి వార్షిక పరీక్షలు!
బీహార్ విద్యాశాఖ లీలలు తరచూ బయటపడుతుంటాయి. రాష్ట్ర విద్యాశాఖ అడిషనల్ సెక్రటరీ కెకె పాఠక్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బీహార్ విద్యావ్యవస్థలో మార్పురావడం లేదు. దీనికి ఉదాహరణగా ఛప్రా జిల్లా పాఠశాల నిలిచింది. ఈ పాఠశాలలో బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డ్ నిర్వహించబోయే 11వ, 9వ తరగతుల వార్షిక పరీక్షల ప్రశ్న పత్రాల బండిల్స్ బహిరంగంగా విసిరివేశారు. వీటిని పంపిణీ చేసేందుకు విద్యాశాఖలో ఏ ఉద్యోగి బాధ్యత తీసుకోలేదు. జిల్లాలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తమ పాఠశాల కోడ్ ప్రకారం ప్రశ్నపత్రాలు తీసుకువెళ్లేందుకు ఈ పాఠశాలకు వచ్చి, టెర్రస్ అంతా కలియ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు 9,11 తరగతుల వార్షిక పరీక్షలను మార్చి 13 నుంచి నిర్వహించనుంది. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను జిల్లాలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులు తమ పాఠశాల కోడ్ ప్రకారం ప్రశ్నపత్రాలను వెదికేందుకు గత మూడు రోజులుగా ఇక్కడే తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారు. పరీక్ష తేదీ సమీపించినా కొన్ని పాఠశాలలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు సంబంధిత ఉపాధ్యాయులకు ఇంకా చేరనేలేదు. మీడియాకు అందిన అందిన సమాచారం ప్రకారం 11వ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 13 నుంచి, 9వ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. గతంలో తూర్పు చంపారన్‌లో కూడా విద్యాశాఖాధికారుల ఇటువంటి నిర్లక్ష్యం కనిపించింది. -
నింగిలో ఫుట్‌బాల్ గ్రౌండ్... ఆటగాళ్ల వీడియో వైరల్!
ప్రపంచంలోని పలు దేశాలు ఇతర దేశాల ప్రజలను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఈ విషయంలో చైనా ముందుంటుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. ప్రపంచంలోని ఎవరికీ రాని ఆలోచనలు చైనా వారికి వస్తుంటాయి. అవి కార్యరూపం దాల్చినప్పుడు ప్రపంచాన్ని తనవైపునకు తప్పుకుంటాయి. తాజాగా చైనాలో మరో ఆకర్షణీయమైన ప్రాంతం ఏర్పాటయ్యింది. చైనా తాజాగా ఒక విచిత్రమైన ఫుట్‌బాల్ మైదానాన్ని నిర్మించింది. దానిని చూసినవారంతా విస్తుపోతున్నారు. తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నామంటున్నారు. పైగా ఈ ఫుట్‌బాల్ గ్రౌండ్లో ఏమాత్రం భయం లేనివారే ఆడగలరంటూ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. చైనాకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఫుట్‌బాల్ మైదానానం ఆకాశంలో తేలియాడుతూ కనిపిస్తుంది. ఈ మైదానం రెండు పర్వతాల మధ్య నున్న భాగంలో నెట్ సహాయంతో తయారు చేశారు. కొంతమంది ఆటగాళ్లు ఈ గ్రౌండ్లో ఉత్సాహంగా ఆడటం వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో చైనాలోని జెజియాంగ్‌లో చిత్రీకరించారు. ఈ వీడియో మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’లో @gunsnrosesgirl3 అనే పేజీలో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకూ రెండు లక్షల 70 వేల మంది వీక్షించారు. వీడియో చూసిన ఒక యూజర్ ‘వావ్ వాట్ ఎ గేమ్’అని రాయగా మరొక యూజర్ ‘ఇలా ఆడే ధైర్యం నాకు లేదు’ అని రాశాడు. Playing football in the sky, Zhejiang China 📹mychinatrip pic.twitter.com/36ivYq1Fcu — Science girl (@gunsnrosesgirl3) February 21, 2024 -
వికాస్ లైఫ్‌కేర్ చేతికి స్కై 2.0
న్యూఢిల్లీ: దేశీ కంపెనీ వికాస్ లైఫ్‌కేర్ లిమిటెడ్ తాజాగా దుబాయ్ సంస్థ స్కై 2.0 క్లబ్లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు 7.9 కోట్ల డాలర్లు(సుమారు రూ. 650 కోట్లు) వెచి్చంచనుంది. 2023–24 లోపు వాటా కొనుగోలు ప్రక్రియ ముగియనున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. స్కై 2.0 క్లబ్ హోల్డింగ్ సంస్థ బ్లూ స్కై ఈవెంట్ హాల్ ఎఫ్‌జెడ్–ఎల్ఎల్సీ(దుబాయ్)తో ఇందుకు వాటా మార్పిడి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. 60% వాటాతోపాటు.. భవిష్యత్ బిజినెస్ వెంచర్లనూ సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. 13 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో ఇందుకు డీల్ కుదిరినట్లు తెలిపింది. -
కైలాసగిరిపై స్కై బ్రిడ్జ్
విశాఖ సిటీ: మాస్టర్‌ప్లాన్ రోడ్లు.. సెంటు స్థలాల లేఅవుట్లు.. జగనన్న ఎంఐజీ స్మార్ట్ టౌన్‌షిప్‌లు.. ఇలా ఒకవైపు ప్రజావసరాలకు అనువైన అభివృద్ధి, మౌలిక సదుపాయాల నిర్మాణాలు..కైలాసగిరి, తెన్నేటి పార్కుల పునరుద్ధరణ.. సీ హారియర్ మ్యూజియం.. హెల్త్ ఎరీనా జాగింగ్ ట్రాక్.. కొండకర్ల ఆవలో ఫ్లోటింగ్ జెట్టీ.. మరోవైపు పర్యాటకులను ఆకట్టుకొనే ప్రాజెక్టులకు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) విశాఖ ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తోంది. సుందర విశాఖను పర్యాటకులకు స్వర్గధామంగా మలిచేందుకు మరిన్ని బృహత్తర ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. వీఎంఆర్డీఏ గత ఏడాది కాలంలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటి ప్రగతి, భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులపై మెట్రోపాలిటన్ కమిషనర్, కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున శుక్రవారం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో జరిగిన మీడియా సమావేశంలో వివరించారు. వీఎంఆర్డీఏ గత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 31వ తేదీ వరకు రూ.161 కోట్లు ఆదాయం రాగా.. రూ.215 కోట్లు వ్యయం జరిగినట్లు వెల్లడించారు. సెంటు స్థలాల అభివృద్ధి విషయంలో ప్రభుత్వం బల్క్ ల్యాండ్ ప్రతిపాదనకు అంగీకారం తెలిపిందని, వాటి వేలం ద్వారా సంస్థకు ఆదాయం సమకూరుతోందని చెప్పారు. ఫన్ ప్రాజెక్టులు.. స్టార్ హోటల్.. ► పిల్లల కోసమే ప్రత్యేకంగా వైశాఖి జల ఉద్యానవనంలో 3.48 ఎకరాల్లో పీపీపీ విధానంలో రూ.40 కోట్ల అంచనా వ్యయంతో అమ్యూజ్మెంట్ అండ్ ఫన్ జోన్ ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించారు. ► అలాగే తెన్నేటి పార్కు బీచ్‌లో డిజైన్–ఇన్వెస్ట్–ఇన్స్టాల్మెంట్–ఆపరేషన్ విధానంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ► వీఎంఆర్డీఏ పార్కు వెనుక ఉన్న 7.97 ఎకరాల్లో పీపీపీ విధానంగా రూ.220 కోట్లతో ఫైవ్‌స్టార్ హోటల్, మైస్ సెంటర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి జ్యుడీషియల్ రివ్యూ కోసం పంపించారు. ► నేచురల్ హిస్టరీ పార్క్ అండ్ మ్యూజియం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు డీపీఆర్ సిద్ధం చేశారు. ● ఎన్ఏడీ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు 25 శాతం మేర పూర్తయ్యాయి. 9 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ► 83 లేఅవుట్లలో 1,41,654 మందికి సెంటు స్థలాల పట్టాలు అందించారు. ఈ లేఅవుట్ల అభివృద్ధిలో వీఎంఆర్డీఏ ప్రముఖ పాత్ర పోషించింది. వీటిలో రూ.175 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించారు. ► భూములు ఇచ్చిన రైతులకు 1,215 ఎకరాల్లో 48 లేఅవుట్లు అభివృద్ధి చేసి ప్లాట్లను కేటాయించారు. వాటి అభివృద్ధికి రూ.660 కోట్లు అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ నిధులను మూడు దశలలో ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే తొలి దశలో రూ.200 కోట్లతో క్వారీ రబ్బిష్ రోడ్లు, సీసీ డ్రైన్ల పనులు జరుగుతున్నాయి. ఫేజ్–2లో రూ.305 కోట్లతో బీటీ రోడ్లు, ప్లాంటేషన్, పార్కులు, ఎలక్ట్రిఫికేషన్ పనులు ప్రగతిలో ఉన్నాయి. ఫేజ్–3లో రూ.155 కోట్లతో నీటి సరఫరా కల్పించనున్నారు. ► ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరుకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు చేస్తున్నారు. జగనన్న ఎంఐజీ స్మార్ట్ టౌన్‌షిప్‌కు మంచి స్పందన ► మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకు స్థలాలు ఇవ్వాలన్న సంకల్పంతో చేపట్టిన జగనన్న ఎంఐజీ స్మార్ట్ టౌన్‌షిప్‌కు మంచి స్పందన వస్తోంది. ► విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో 204.96 ఎకరాల్లో లేఅవుట్లు వేసి 1280 ప్లాట్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. ► విజయనగరం జిల్లా రఘుమండలో ఉన్న 229 ప్లాట్లకు ఇప్పటికే 165 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో లాటరీ తీసి 160 మంది కేటాయింపులు చేశారు. అలాగే జియ్యానివలసలో 130 ప్లాట్లకు 66 దరఖాస్తులు రాగా 56 మందికి ఇచ్చారు. విశాఖలో పాలవలస 1, 2లలో 150 దరఖాస్తులకు గాను లాటరీ 94 ప్లాట్లు విక్రయించారు. ఇప్పటికీ వస్తున్న దరఖాస్తులను పరిశీలించి త్వరలోనే వాటికి లాటరీ ప్రక్రియను చేపట్టనున్నారు. రూ.58.74 కోట్లతో మాస్టర్‌ప్లాన్ రోడ్ల అభివృద్ధి ► విశాఖలో రూ.58.74 కోట్లతో మాస్టర్‌ప్లాన్ రోడ్ల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ► బోయపాలెం హైవే నుంచి నుంచి కాపులుప్పాడ, బీచ్ రోడ్డులో సీతకొండ, పాయకరావుపేట రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ● అలాగే రూ.12 కోట్లతో లా కాలేజీ హైవే నుంచి పెబెల్ బీచ్ హౌసింగ్ వరకు ఫుట్‌పాత్, గ్రీనరీ, రూ.3.22 కోట్లతో విజయనగరం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ జంక్షన్ నుంచి కేఏ పేట మీదగా పాల్ నగర్ జంక్షన్ వరకు రోడ్డు, రూ.9.7 కోట్లతో సబ్బవరం నుంచి గుల్లేపల్లికి, రూ.3.52 కోట్లతో యలమంచిలి రైల్వే స్టేషన్ నుంచి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి విగ్రహం వరకు, రూ.7 కోట్లతో, మారికవలస జంక్షన్ నుంచి బీచ్ రోడ్డు వరకు రోడ్డు నిర్మాణం పనులు దాదాపుగా తుది దశకు చేరుకున్నాయి. ► మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ 11 ఫ్లోర్లలో 9 ఫోర్ల నిర్మాణం పూర్తయింది. ఫిబ్రవరి నెలాఖరు నాటికి పూర్తి చేసే లక్ష్యంతో పనులు చేస్తున్నారు. ● చీమలాపల్లి, ఎండాడ లా కాలేజీ వద్ద చేపట్టిన కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం 30 శాతం పూర్తయింది. ఈ సమావేశంలో వీఎంఆర్డీఏ జాయింట్ కమిషనర్ రవీంద్ర, సెక్రటరీ కీర్తి, సీఈ శివప్రసాద్‌రాజు, డీఎఫ్ఓ శాంతిస్వరూప్, ఈఈలు భవానీప్రసాద్, బలరాం తదితరులు పాల్గొన్నారు. కై లాసగిరిపై సరికొత్త ప్రాజెక్టులు ► పర్యాటకులను మరింత ఆకట్టుకొనే తరహాలో కై లాసగిరిపై గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జ్ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ► ఆరు నెలల్లో దీని నిర్మాణం పూర్తిచేయాలన్న లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ► దీంతో పాటు జిప్‌లైన్, స్కై సైక్లింగ్ సౌకర్యాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియను చేపట్టారు. రెండు నెలల్లోనే వీటిని ఏర్పాటు చేసి ప్రజలకు, పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించాలని భావిస్తున్నారు. ►అలాగే కై లాసగిరిపై 1.99 ఎకరాల్లో పీపీపీ విధానంలో రూ.18 కోట్లతో నేచర్ కాటేజీలు, రివాల్వింగ్ రెస్టారెంట్, బీచ్ వ్యూ కేఫ్ నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఏడాదిన్నరలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ► వీఎంఆర్డీఏ పార్కు లైహౌస్ వద్ద ఓషన్ డెక్ నిర్మాణానికి ఇప్పటికే టెండర్లను పూర్తి చేశారు. ► సీఆర్‌జెడ్ అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణాలు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ► కై లాసగిరిపై రూ.4.69 కోట్ల అంచనా వ్యయంతో సైన్స్ మ్యూజియం నిర్మాణానికి రెండు రోజుల క్రితమే శంకుస్థాపన చేశారు. ► అలాగే కొండపై డ్యాషింగ్ కార్, 12డీ థియేటర్, ఫ్లాష్ టవర్ ఏర్పాటుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు. -
ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు
దేశ రాజధాని న్యూఢిల్లీలో వరుసగా రెండో రోజు కనిష్ట ఉష్ణోగ్రత పది డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదైంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రాబోయే మూడు రోజుల పాటు ఆకాశం మేఘావృతమై ఉండవచ్చు. ఈ సమయంలో ఉదయం తేలికపాటి పొగమంచు కూడా ఉండనుంది. శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ , కనిష్ట ఉష్ణోగ్రత 9 డిగ్రీల సెల్సియస్‌గా ఉండి, ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. రెండు రోజుల తర్వాత అంటే రాబోయే సోమవారం నాడు ఢిల్లీలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ప్రకారం ఢిల్లీలోని లోధి రోడ్లో శుక్రవారం కనిష్ట ఉష్ణోగ్రత 9.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. గరిష్ట ఉష్ణోగ్రత 26.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. శనివారం ఉదయం అంటే ఈరోజు వాతావరణంలో పొగమంచు వ్యాపించింది. పగటిపూట తేలికపాటి సూర్యరశ్మి ఉండనుంది. ఇది కూడా చదవండి: రాజస్థాన్ ఎవరిదో! -
జై భజరంగ భళీ!
ఆకాశంలోకి చూస్తే గాల్లో ఎగురుతున్న హనుమంతుడు కనిపిస్తే ఎంత వింత! ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో ఇలాంటి దృశ్యమే కనిపించి ప్రజలను ఆశ్చర్యానందాలకు గురి చేసింది. ఆ నగరంలోని ఒక ఉత్సవ కమిటీ వాళ్లు గాల్లో ఎగురుతున్నట్లు ఉండే హనుమాన్ రూపాన్ని డ్రోన్‌కు బిగించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. కొన్ని సంవత్సరాల క్రితం పంజాబ్‌లోని లుథియానాలో ఇలాంటి దృశ్యమే కనువిందు చేసింది. దానినుంచి స్ఫూర్తి పొంది ఈ వీడియో చేశారేమో తెలియదుగానీ ప్రజలు మాత్రం ఆకాశానికేసి చూస్తూ ‘జై భజరంగభళీ’ అంటూ నినదించారు. -
స్కై బస్సు సర్వీస్ అంటే ఏమిటి? రవాణాలో ఎంత సౌలభ్యం?
భారతదేశంలో స్కై బస్సు రవాణా సౌకర్యంపై మరోమారు చర్చ మొదలైంది. దేశంలో స్కై బస్సు వ్యవస్థను త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. భారత్‌లో స్కై బస్సు సర్వీస్ ప్రారంభమైతే పలునగరాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. స్కై బస్సు సర్వీసుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. స్కై బస్సు అనేది మెట్రో మాదిరిగానే చౌకైన, పర్యావరణ అనుకూల పట్టణ ప్రజా రవాణా వ్యవస్థ. ఇది ఎలివేటెడ్ ట్రాక్‌ను కలిగి ఉంటుంది. స్కై బస్సులు సుమారుగా గంటకు వంద కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. ఇవి విద్యుత్ శక్తితో నడుస్తాయి. వీటి నిర్వహణకు మెట్రో కంటే తక్కువ ఖర్చు అవుతుంది. స్కై బస్ అనేది విలోమ కాన్ఫిగరేషన్ వాహనం. దీని చక్రాలు, ట్రాక్‌లు ఒక మూసివున్న కాంక్రీట్ బాక్స్ మధ్య అమరి ఉంటాయి. ఈ వ్యవస్థలో పట్టాలు తప్పడం లాంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి 2003లో నూతన సంవత్సర కానుకగా గోవాకు స్కై బస్సు ప్రాజెక్టును ప్రకటించారు. రూ.100 కోట్లతో ఖర్చుతో కూడిన ఈ ప్రాజెక్టు ప్రారంభం కాలేదు. మొదటి దశ కింద పైలట్ ప్రాజెక్ట్ మపుసా నుండి పనాజీకి అనుసంధానించాలనుకున్నారు. దీని ప్రారంభ మార్గం 10.5 కి.మీ. అయితే 2016లో కొంకణ్ రైల్వే కార్పొరేషన్ స్కై బస్ ప్రాజెక్ట్‌ను రద్దు చేసింది. ఆ సమయంలో అది లాభదాయకం కాదని, ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా చదవండి: ‘అగ్నివీర్’ అమరుడైతే ఆర్థిక సాయం అందదా? ఇండియన్ ఆర్మీ ఏమంటోంది? -
నింగిలో ‘నీలి సూరీడు’.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?
బ్రిటన్ ప్రజలు ఆకాశంలో ఓ ప్రత్యేక దృశ్యాన్ని తిలకించి మురిసిపోయారు. మబ్బుల్లో సూర్యుని రంగు మారిపోవడాన్ని చూసి ఆశ్యర్యం వ్యక్తం చేశారు. బ్రిటన్‌లో సూర్యుడు నీలిరంగులో కనిపిస్తున్నాడు. అమెరికాలో సంభవించిన అగ్నిప్రమాదమే ఇందుకు కారణమని వాతావరణ శాఖ తెలిపింది. ట్విట్టర్లో ఒక యూజర్ ‘స్కాట్లాండ్లో అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిద కారణంగా నూతన నీలి సూర్యుడు కనిపిస్తున్నాడు’ అని అన్నారు. మరొక యూజర్ ఉదయం 10:15 గంటలకు ‘బ్లూ సన్’ కనిపించాడని రాశారు. కాగా గతంలో సూర్యుడు ముదురు ఆరెంజ్ రంగులో కనిపించాడు. 2017లో పోర్చుగీస్ అడవి కార్చిచ్చుకు సంబంధించిన పొగ బ్రిటన్ అంతటా వ్యాపించింది. అయితే ఈసారి సూర్యుడు నీలి రంగులోకి ఎందుకు మారాడనే దానికి వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు సమాధానం తెలిపారు. ఉత్తర అమెరికాలోని అడవి కార్చిచ్చు పొగ బ్రిటన్‌కు చేరుతోంది. వాతావరణంలో మేఘాలు, పొగ కలసిపోవడం కారణంగా సూర్యరశ్మి వివిధ రంగులలో వ్యాప్తి చెందున్నదని ఆయన చెప్పారు. ప్రతి రంగు వేర్వేరు ప్రకాశాలను కలిగి ఉంటుంది. నీలి రంగు అధికంగా వ్యాపిస్తుందని తెలిపారు. పర్పుల్ రంగు తక్కువగా వ్యాపిస్తుందని, ఇది దాదాపు 380 నానోమీటర్లు ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఎరుపు రంగు పొడవైన తరంగదైర్ఘ్యం కలిగి ఉంటుందని, ఇది దాదాపు 700 నానోమీటర్లు ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: అమెరికాను ముంచెత్తిన వరదలు... న్యూయార్క్ అతలాకుతలం! 28th September 2023 Hertfordshire UK Unnatural fog…#chemtrail #geoengineering pic.twitter.com/P37Mc0SYeA — Dan Stevens (@Dan__Stevens) September 28, 2023 -
ఇళ్ల ధరలు కాదు... ఇళ్లే ఆకాశాన్ని అంటాయి!
‘ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి’ అంటుంటారు. ఈ ఆర్టిస్ట్ మాత్రం ‘ధరలు కాదు ఇళ్లే ఆకాశంలో ఉంటే ఎలా ఉంటుంది!’ అనుకొని మాయజాలాన్ని సృష్టించాడు. మహా పట్టణాలు భవంతులతో కిక్కిరిసిపోతున్నాయి. నిర్మాణాలతో నేల నిండిపోయింది. పైన ఆకాశం మాత్రం ఖాళీగా కనిపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ రైటర్, డిజిటల్ క్రియేటర్ ప్రతీక్ అరోరా ‘ఫ్లోటింగ్ బిల్డింగ్స్’ ఏఐ ఆర్ట్ సిరీస్‌ను సృష్టించాడు. వీటికి ముంబై మహానగరాన్ని నేపథ్యంగా తీసుకొని ‘ముంబై సర్రియల్ ఎస్టేట్’ అనే కాప్షన్ ఇచ్చాడు. ‘మీరు సరదాకు ఇలా చేశారు గానీ ఆకాశం కూడా బిల్టింగ్లతో కిక్కిరిసిపోయే రోజు ఎంతో దూరంలో లేదు’ అని భవిష్యవాణి చెప్పాడు ఒక నెటిజనుడు. -
SKY:ఒక వ్యక్తి అన్నీ కోల్పోయి ఒంటరిగా బ్రతకాల్సి వస్తే?
ఆనంద్, మురళీ కృష్ణంరాజు, శృతిశెట్టి, మెహబూబ్ షేక్ (ఎమ్.ఎస్) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘స్కై’. ‘అగాధమంత బాధ నుంచి ఆకాశమంత ప్రేమ పుడితే" అన్నది ట్యాగ్ లైన్. పృథ్వి పేరిచర్ల దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వేలర్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్"పై నాగిరెడ్డి గుంటక - మురళీ కృష్ణంరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. ‘ఒక వ్యక్తి అన్నీ కోల్పోయి ఒంటరిగా బ్రతకాల్సి వస్తే, ఏళ్ల తరబడి అనుభవిస్తున్న బాధ, ఆనందంతో తన ఒంటరితనాన్ని జయించాడా, లేదా? లేక ఏకాకి జీవితమే కదా అని రోజు గడవడం కోసం పక్కవాడ్ని మోసం చేస్తూ బ్రతికేస్తున్నాడా? అసలు ఒంటరితనం మనిషికి ఏం నేర్పుతుంది? మనిషిని ఎలా మలుస్తుంది? అనేది క్లుప్తంగా "స్కై" చిత్రం కథాంశమని, రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ, సురేష్ ఆర్స్ ఎడిటింగ్ "స్కై" చిత్రానికి మెయిన్ పిల్లర్స్ అని దర్శకుడు పృథ్వి పేరిచర్ల తెలిపారు. -
ఆకాశంలో అద్భుతం.. ఆకుపచ్చ కాంతిలో ఉల్కపాతం
అంకారా: టర్కీలో శనివారం రాత్రి అద్భుత దృశ్యం అవిష్కృతమైంది. నిప్పలు చిమ్ముతూ నేలరాలాల్సిన ఉల్కపాతం.. గ్రీన్‌కలర్‌లో కాంతిని వెదజల్లుతూ భూమి వైపుకు దూసుకొచ్చింది. గుముషానే ప్రావిన్స్‌లోని ఎర్జురం నగరం ప్రాంతానికి వచ్చే సరిగి గ్రీన్ కలర్ రంగులో కాంతిని వెదజల్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. A large green meteor was spotted blazing through the sky in Turkey moments ago. Wow. pic.twitter.com/eQEYLG2ihB — Nahel Belgherze (@WxNB_) September 2, 2023 టర్కీలో రాత్రిపూట అంతా ప్రశాంతంగా ఉండగా.. ఒక్కసారిగా ఆకాశంలో నుంచి ఉల్కపాతం సంభవించింది. అయితే.. అది గ్రీన్ కలర్ రంగులో కాంతిని వెదజల్లింది. ఈ దృశ్యాలను చూపుతున్న వీడియోలో ఓ బాలుడు బెలూన్‌తో ఆడుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోను నహెల్ బెల్గెర్జ్ తన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా షేర్ చేశారు. Green meteor lights up the sky over Turkey on Saturday.pic.twitter.com/Y89ORYz6CP — Science girl (@gunsnrosesgirl3) September 3, 2023 అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ప్రకారం అంతరిక్షంలో దుమ్ము, దూళి కణాలు కలిగిన శిలలు భూవాతావరణంలో కిందికి పడిపోయినప్పుడు భారీ స్థాయిలో కాంతిని వెదజల్లుతాయి. అతి వేగంగా భూమి వైపుకు ప్రయాణిస్తాయి. అయితే.. తాజాగా టర్కీలో సంభవించిన ఘటనపై అధికారులు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ ఇవ్వలేదు. గత వారంలో కొలరాడోలోనూ ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. తెల్లవారుజామున 3.30 సమయంలో ఉల్కలు నెలరాలాయి. Malatya, Erzurum, Elazığ, Gaziantep, Diyarbakır ve çevre illerden görülen büyük ve çok parlak bir göktaşı düşüşü gözlemlendi. İşte o anlar... ☄️👀 #göktaşı #meteor #malatya #erzincan #elazığ #gaziantep #malatya #erzurum pic.twitter.com/lDWTYGzAZM — Hava Forum (@HavaForum) September 2, 2023 ఇదీ చదవండి: Plane Crash: సంతోషంగా పార్టీ.. అందరూ చూస్తుండగా కళ్ల ముందే ఘోర ప్రమాదం! -
ఎదుగుతున్నానుకున్నాడు..సడెన్ బ్రేక్‌లా ఫుట్‌పాత్‌పై పడ్డాడు అదే..
ఓ సాధారణ పట్టణంలో పుట్టి పెరిగాడతడు. కంప్యూటర్ కోర్సు కోసం హైదరాబాద్ వచ్చాడతడు. నేర్చుకున్నాడు... తను నేర్చిన విద్యను ఇతరులకు నేర్పించేపనిలో మునిగిపోయాడు. ఎదుగుతున్నాననుకున్నాడు... అగాధంలోకి జారిపోయాడు. ఫుట్ పాత్ మీదే నిద్ర... అతడిని మార్చిన రోజది. సంజీవకుమార్ పుట్టింది, పెరిగింది మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో. పాలిటెక్నిక్, ఐటీఐ, గ్రాడ్యుయేషన్ పట్టా పుచ్చుకునే నాటికి సమాజంలో సాంకేతికంగా మరో విప్లవం మొదలైంది. అదే కంప్యూటర్ ఎడ్యుకేషన్. రాబోయే కాలంలో కంప్యూటర్ లేనిదే ఏ పనీ చేయలేమని తెలుసుకున్నాడు సంజీవ్‌కుమార్. హైదరాబాద్‌కు వచ్చి డీటీపీతో మొదలు పెట్టి డీసీఏ, పీజీడీసీఏ, పీజీ డీఎస్ఈ వరకు అప్పటికి అందుబాటులో ఉన్న కోర్సులన్నీ చేశాడు. తన మీద నమ్మకం పెరిగింది. సైబర్‌టెక్ పేరుతో నల్లకుంటలో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ స్థాపించాడు. కంప్యూటర్స్‌లో ప్రపంచాన్ని ఆందోళనలో ముంచెత్తిన వైటూకే సమస్య సద్దుమణిగింది. కానీ అంతకంటే పెద్ద ఉత్పాతం సంజీవకుమార్ జీవితాన్ని ఆవరించింది. ఆ వివరాలను సాక్షితో పంచుకున్నాడతడు. అప్పు మిగిలింది! ‘‘నా మీద నాకున్న నమ్మకం, దానికితోడు అందరినీ నమ్మడం నా జీవిత గమనాన్ని మార్చేశాయి. నా మీద నమ్మకంతో కంప్యూటర్ సెంటర్లు ప్రారంభించాను. స్నేహితుల మీద నమ్మకంతో పదకొండు బ్రాంచ్‌లకు విస్తరించాను. కొన్ని బ్రాంచ్‌ల నిర్వహణ స్నేహితులకప్పగించాను. కొందరు స్నేహితులు పెట్టుబడి కోసం డబ్బు అప్పు ఇచ్చి సహకరించారు. నా పెళ్లి కోసం ఒకటిన్నర నెలలు మా ఊరెళ్లాను. పెళ్లి చేసుకుని హైదరాబాద్‌కి వచ్చేటప్పటికి పరిస్థితి తారుమారుగా ఉంది. ఫ్రాంచైసీలు తీసుకున్న స్నేహితులు మోసం చేశారు. నా కళ్ల ముందు తొంబై ఐదు లక్షల అప్పు. నా భార్య బంగారం, నేను నిర్వహిస్తున్న కంప్యూటర్ సెంటర్లను అమ్మేసి కూడా ఆ అప్పు తీరలేదు. అప్పు ఇచ్చిన స్నేహితుల నుంచి ఒత్తిడి పెరిగింది. నా భార్యను పుట్టింట్లో ఉంచి హైదరాబాద్‌కొచ్చాను. నా దగ్గర డబ్బున్నప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్లెవరూ నాకు ఒక్కరోజు అన్నం కూడా పెట్టలేదు. ఆకలితో ఫుట్‌పాత్ మీద పడుకున్న రోజును నా జీవితంలో మర్చిపోలేను. డబ్బులేని మనిషికి విలువ లేదని తెలిసి వచ్చిన క్షణాలవి. మరి ఫుట్‌పాత్ మీదనే బతికేవాళ్ల పరిస్థితి ఏమిటి... అనే ఆలోచన మొదలైన క్షణం కూడా అదే. వైద్యం... ఆహారం! నేను స్కై ఫౌండేషన్ స్థాపించింది 2012లో. అప్పటి నుంచి వీధుల్లో బతికే వాళ్లకు ప్రతి ఆదివారం అన్నం పెట్టడం, మందులివ్వడం, దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేస్తున్నాను. ఆఫీస్‌లోనే వండి రెండు వందలకు పైగా పార్సిళ్లతో మా వ్యాన్ బయలుదేరుతుంది. వాటిని ఫుట్‌పాత్ మీద, చెట్టుకింద పడుకున్న వాళ్లకు ఇస్తాం. అలాగే ప్రతి బిడ్డా పుట్టిన రోజు పండుగనూ, కేక్ కట్ చేసిన ఆనందాన్ని ఆస్వాదించాలనే ఉద్దేశంతో పిల్లలకు సామూహికంగా పుట్టిన రోజులు చేస్తున్నాను. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజు పిల్లల చేత జెండావందనం చేయిస్తాను. కోఠీలో పాత పుస్తకాలు తెచ్చి పంచుతాను. వీటన్నింటికంటే నేను గర్వంగా చెప్పుకోగలిగిన పని వీళ్లందరికీ కరోనా వ్యాక్సిన్ వేయించడం. ఫుట్‌పాత్‌ల మీద బతుకీడ్చే వాళ్లకు ఆధార్ కార్డు ఉండదు, మొబైల్ ఫోన్ ఉండదు. కరోనా వ్యాక్సిన్ వేయాలంటే ఈ రెండూ ఉండాలి. కేంద్ర ప్రభుత్వానికి తెలియచేసి ప్రత్యేక అనుమతి తీసుకుని వాళ్లందరికీ వ్యాక్సిన్ వేయించాను. కరోనా సమయంలో సేవలందించిన వైద్యులకు, వైద్య సిబ్బందికి సన్మానం చేశాను. ఒక్క అవకాశమివ్వండి! వీధుల్లో బతుకు వెళ్లదీసే వాళ్లకు తాత్కాలికంగా అన్నం పెట్టడం, దుస్తులివ్వడం శాశ్వత పరిష్కారం కాదు. ఈ బతుకులు రోడ్డు పక్కనే ఉండిపోకూడదంటే వాళ్లకు బతుకుదెరువు చూపించాలి. ప్రభుత్వాలు వాళ్లను షెల్టర్ హోమ్‌లో ఉంచి ఆహారం పెట్టడంతో సరిపెట్టకూడదు. చిన్న చిన్న పనుల్లో శిక్షణ ఇచ్చి సమాజంలోకి పంపించాలి. వడ్రంగం, బుక్ బైండింగ్, అగరుబత్తీల తయారీ, విస్తరాకుల కటింగ్ వంటి చిన్న పనులు నేర్పించినా చాలు. వాళ్లకు ఒక దారి చూపించినవాళ్లమవుతామని ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతి పత్రాలిచ్చాను. పైలట్ ప్రాజెక్టుగా ఒక ఏరియాకి బాధ్యత ఇవ్వండి. విజయవంతం చేసి చూపిస్తానని కూడా తెలియచేశాను. అలా చేయగలిగినప్పుడు వీధి జీవితాలు ఇంటివెలుగులవుతాయి’’ అన్నారు సంజీవకుమార్. ఫుట్‌పాత్ మీద కొత్త ఉపాధి! కంప్యూటర్ సెంటర్లను అమ్మేసిన తర్వాత కన్సల్టెంట్‌గా మారాను. తార్నాకలోని సన్మాన్ హోటల్ ముందున్న ఫుట్ పాతే నా వర్క్ ప్లేస్. నా భుజాన ఒక్క బ్యాగ్‌తో పాన్ కార్డ్ సర్వీస్ రూపంలో జీవితం కొత్తగా మొదలైంది. రోజుకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు వచ్చేవి. నెలకు రెండు వేల అద్దెతో ఒక గదిలో ‘స్కై క్రియేషన్స్’ పేరుతో సర్వీస్‌ను రిజిస్టర్ చేశాను. పాన్ కార్డు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్‌లు, ప్లేస్మెంట్ల వరకు సర్వీస్‌లను విస్తరించాను. పద్మారావు నగర్లో ఓ చిన్న ఫ్లాట్ కొనుకున్న తర్వాత స్కై ఫౌండేషన్ పేరుతో సామాజిక సేవ మొదలు పెట్టాను. అద్దె ఇంట్లో ఫౌండేషన్ రిజిస్టర్ చేయాలంటే ఇంటి యజమాని అనుమతించరు. కాబట్టి సొంత గూడు ఒకటి ఏర్పరుచుకునే వరకు ఆగి అప్పటి నుంచి వీధి పాలైన జీవితాల కోసం పని చేయడం మొదలుపెట్టాను. – సంజీవకుమార్, ఫౌండర్, స్కై ఫౌండేషన్, హైదరాబాద్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఆకాశంలో వింత.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే! స్వర్గానికి దారి ఇదేనా?
ఈ విశ్వంలో మనకు తెలియని వింతలు విడ్డూరాలు చాలానే ఉన్నాయి. మన శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాల నుంచి బోలెడు అంతుచిక్కని విషయాలను బయటపెట్టిన అవి ఈ విశ్వంలో ఉన్నవాటితో పోలిస్తే చాలా తక్కువనే చెప్పాలి. అప్పుడప్పుడు ఆకాశంలో ఏవో మెరుపులు, వింతలు కనపడడం వాటిని చూసి ఔరా అనుకుంటుంటాం. అలానే దాని గురించి పూర్తిగా తెలియకపోయినా మనకు నచ్చిన, తెలిసిన వాటితో పోలుస్తుంటాం. తాజాగా మేఘావృతమైన ఆకాశంలో ఓ వింత ఆకారం కనిపించింది. దీని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అదేమై ఉంటుందని నెట్టింట ప్రస్తుతం చర్చణీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని హెబ్బాల్ ఫ్లైఓవర్ సమీపంలో శనివారం రాత్రి ఓ వింత ప్రత్యక్ష్యమైంది. అది చూసేందుకు ఎలా ఉందంటే.. ఆకాశంలో ఉన్న భవనానికి సంబంధించిన తలుపులులా కనిపిస్తూ.. దాని వెనుక ప్రకాశవంతమైన వెలుగు కనిపిస్తోంది. ఇక దీన్ని కొందరు వీడియో తీసి నెట్టింట షేర్ చేయగా అది కాస్త వైరల్‌గా మారి రచ్చ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇది ఏమై ఉండవచ్చు? అని ఎవరికి నచ్చిన కామెంట్లు వాళ్లు పెడుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు ఇది స్వర్గానికి దారి అయ్యిండచ్చని కామెంట్ పెట్టగా.. మరికొందరేమో ఇదేంటో అని భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంకొందరేమో మరో ప్రపంచానికి ప్రవేశ మార్గం అని, బెంగుళూరు వాతావరణంలో ఏలియన్స్ తమ బట్టలు ఆరబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఫన్నీగా కామెంట్ పెట్టారు. A mysterious shadow (object?) was seen in Bengaluru skies last night near Hebbal flyover. Did anyone else see? What could this possibly be? A shadow of a building? If it is, then what could possibly be the science behind it? Credits: @SengarAditi pic.twitter.com/8YOIzvIsPv — Waseem ವಸೀಮ್ وسیم (@WazBLR) July 23, 2023 -
నక్షత్రాకాశం మాయం కానున్నదా?
చిన్నతనంలోనూ, కొన్నేళ్ల క్రితం కూడా పల్లెకు వెళ్లి ఆరుబయట పడుకుంటే ఆకాశంలో నక్షత్రాలు ధాన్యం ఆరబోసినట్టు చిక్కగా కనిపించేవి. పట్నం చేరిన తరువాత నక్షత్రాలు కనిపించడం కరువైపోయింది. ఇందుకు కారణం ‘కాంతి కాలుష్యం’ అని సులభంగానే చెప్పవచ్చు. మనుషులు ఏర్పాటు చేసుకున్న వెలుగులు ఆకాశంలోకి కూడా వెదజల్లబడి అక్కడ చుక్కలను మనకు కనిపించకుండా చేస్తున్నాయి. నక్షత్రాలనూ, అంతరిక్షంలోని ఇతర అంశాలనూ పరిశీలించే ఖగోళ శాస్త్రజ్ఞులకు ఇదంతా పెద్ద సమస్యగా చాలా కాలంగానే తెలుసు. కనుక అంతరిక్షంలో నుంచి ఈ కాంతి కాలుష్యాన్ని కొలతలు వేసి చూశారు. అయితే అంతరిక్షంలోని ఉపగ్రహాలు కాంతిని మనిషి కళ్ళు చూసినట్టు చూడలేవు. కనుక వాటికి కనిపించే అంశాలు మనకు కనిపించే అంశాల కంటే వేరుగా ఉంటాయి. మనిషి సృష్టించిన వెలుగులు ఆకాశంలో ఎటువంటి ప్రభావాలను చూపిస్తున్నాయి అన్న ప్రశ్న గురించి పరిశోధనలు మొదలయ్యాయి. జర్మనీ దేశంలో క్రిస్టఫర్ కైబా అనే పరిశోధకుని నాయకత్వంలో ఒక జట్టు ఈ అంశం గురించి బాగా పరిశీలిస్తున్నది. నక్షత్ర పటాలను వారు తయారు చేస్తున్నారు. ఒక పట్టణంలో బాగా వెలుతురుంటే పెద్ద నక్షత్రాలు మాత్రమే కనిపిస్తాయి. అటువంటి ప్రదేశాలతో ఒక పటం తయారు చేస్తారు. ఆ తరువాత అంతగా వెలుగులేని నక్షత్రాలు కూడా కనిపించే పటం ఒకటి ఉంటుంది. వాటిని మామూలుగా మనిషి కళ్ళు కూడా చూడగలుగుతాయి. 2011వ సంవత్సరంలో మొదలయ్యి మొన్న మొన్నటి దాకా సాగిన ఈ ప్రయత్నంలో ప్రపంచమంతటా కనీసం 50,000 మంది పౌర పరిశోధకులు పాల్గొన్నారు. ఎక్కడికక్కడ ఆకాశంలో వెలుగులను, నక్షత్రాలను వాళ్లంతా లెక్కలు వేశారు. ప్రాంతానికీ ప్రాంతానికీ మధ్య తేడాలు ఉండడం పెద్ద ఆశ్చర్యం ఏమీ కాదు. యూరోప్ ఖండంలో కాంతి కాలుష్యం ఏటేటా ఆరున్నర శాతం పెరుగుతున్నదని వాళ్లంతా లెక్క తేల్చారు. అటు ఉత్తర అమెరికాలో ఈ కాలుష్యం 10 శాతం కంటే ఎక్కువగా ఉంది. అవును మరి, అక్కడ వెలుగులు కూడా చాలా ఎక్కువ కదా! మొత్తానికి మొత్తం ప్రపంచంలో సగటున ఏటేటా తొమ్మిది శాతం వరకు కాంతి కాలుష్యం పెరుగుతున్నట్టు కనుగొన్నారు. మామూలుగా ఆలోచిస్తే ఇదేమంత గొప్ప విషయం కాదు అనిపించవచ్చు. కానీ దాని ప్రభావం మాత్రం అంచెలంచెలుగా పెరిగిపోతుంది. ఏటా పది శాతం కాంతి కాలుష్యం అంటే ప్రతి ఏడు ఎనిమిది సంవత్సరాలకు నక్షత్రాలు కనిపించడం సగానికి సగం తగ్గుతుంది అని అర్థమట. అసలు కొంతకాలం పోతే ఆకాశంలో నక్షత్రాలు కనిపించనే కనిపించవేమో అంటున్నారు పరిశోధకులు. టెక్నాలజీలో వస్తున్న మార్పుల కారణంగా ఈ కాలుష్యం బాగా పెరుగుతున్నది అని పరిశోధకులు తేల్చారు. నివాసాల దగ్గర ఉండే వెలుగు ప్రభావం అక్కడ ఉండే మనుషుల మీద చాలా ఉంటుంది. అక్కడి జంతువులు, మొక్కల మీద కూడా ఈ వెలుగు ప్రభావం బాగా ఉంటుంది. వెలుగు వల్ల గజిబిజిపడ్డ పక్షులు తమ వలస మార్గాలను సరిగ్గా అనుసరించలేకపోతాయి. చివరకు మిణుగురు పురుగులు కూడా ఈ వెలుగుకు తికమక పడతాయి. మనుషులకు కలిగే ఆరోగ్య ప్రభావాలలో నిద్రలేమి అన్నిటికంటే ముఖ్యంగా ఉంటుంది. కాంతి కాలుష్యాన్ని ఎవరికి వారు తగ్గించడానికి కొన్ని సూచనలు చేస్తున్నారు నిపుణులు. ‘అంతర్జాతీయ చీకటి ఆకాశం సంఘం’ అనేది ఒకటి తయారై ఉందని, అది తీవ్రంగా పనిచేస్తున్నదని మామూలు మనుషులకు తెలియకపోవచ్చు. వెలుగులను మరింత తెలివిగా వాడుకోవాలని వారు ఎక్కడికక్కడ ప్రచారం చేస్తున్నారు. వీధి దీపాల కాంతి పైకి పోకూడదు, కిందకు మాత్రమే రావాలి అని వారు సలహా ఇస్తున్నారు. విద్యుత్తును ఆదా చేయగల బల్బులను వాడాలని కూడా చెబుతున్నారు. వెలుగు కాలుష్యం గురించి అందరికీ తెలియజేయడం చాలా అవసరం. ఇంటి బయట రాత్రంతా అనవసరంగా వెలుగుతున్న బల్బులను స్విచ్ ఆఫ్ చేయడం మంచిది. ఇటువంటి ఏర్పాట్లను ఎక్కడికక్కడ స్థానికంగా చర్చించి, అక్కడి పరిస్థితులకు అనుకూలంగా ఏర్పాటు చేసుకోవాలి. దాని అర్థం అందరూ చీకటిలో బతకండి అని మాత్రం కానే కాదు. కాంతి కాలుష్యం వల్ల కలిగే ప్రభావాలను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ప్రకృతి అందం పాడవకుండా ఈ వెలుగులను వాడాలి. రాత్రిపూట ఆకాశం అన్నిటికన్నా అందమైన దృశ్యం. దాన్ని చేతనైనంతవరకు కాపాడుకోవాలి. చుక్కలు అంటే ఉల్కలు రాలిపడడం, చంద్రగ్రహణం వంటి వాటిని అందమైన దృశ్యాలుగా గుర్తించి పరిశీలించాలి. రాత్రిపూట ప్రకృతిని పరిశీలించే అదృష్టం గలవారు ఆ అందం గురించి ఎంతైనా చెప్పగలుగుతారు. రాత్రి ఆకాశం నిజంగా అందమైనది. ముందు తరాలకు అందమైన నక్షత్రాకాశాన్ని అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. కె.బి. గోపాలం వ్యాసకర్త సైన్స్ అంశాల రచయిత ‘ మొబైల్: 9849062055 -
ప్రయాగ్‌రాజ్‌లో అబ్బురపరచిన కాంతి వలయం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ పట్టణంలో ఆకాశంలో అద్భుత దృశ్యం సాక్షాత్కారించింది. శుక్రవారం సూర్యుడి చుట్టూ ఏర్పడిన కాంతి వలయం చూపరులను ఆశ్చర్యపర్చింది. కొన్ని గంటలపాటు కనిపించిన ఈ దృశ్యాన్ని జనం ఫోన్లలో బంధించారు. సూర్యుడి చుట్టూ ఏర్పడే కాంతి వలయాన్ని ‘సన్ హాలో’ అంటారు. వాతావరణంలో కాంతి వెదజల్లినట్లుగా మారినప్పుడు ఇలా రింగ్ లాంటి ఆకృతి ఏర్పడుతుంది. సూర్యుడి నుంచి వెలువడే కిరణాలు వాతావరణంలోని మంచు స్ఫటికాలను ఢీకొట్టినప్పుడు కాంతి వెదజల్లినట్లుగా మారుతుంది. అప్పుడు భానుడి చుట్టూ వలయాన్ని చూడొచ్చు. సాధారణ మేఘాల కంటే అధికంగా తెల్లగా, పలుచగా ఉండే సిరస్ మేఘాల్లో మంచు స్ఫటికాలు ఉంటాయి. -
కాలిఫోర్నియాలో అంతుచిక్కని వెలుగురేఖ!
కాలిఫోర్నియా: ఆకాశంలో ఎవరికీ అంతుచిక్కని వెలుగు రేఖ ఒకటి అమెరికా కాలిఫోర్నియోలోని శాక్రమెంటోలో కనిపించింది. సెయింట్ పాట్రిక్ డే వేడుకల్లో ఉన్న వారంతా నీలాకాశంలో కనిపించిన ఆ వెలుగుని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. వెంటనే తమ చేతుల్లో ఉన్న సెల్‌ఫోన్ కెమెరాల్లో దానిని బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కేవలం 40 సెకండ్ల పాటు మాత్రమే కనిపించి ఆ వెలుగురేఖ అదృశ్యమైపోయింది. ‘‘ఇప్పటివరకు ఇలాంటి దృశ్యాన్ని మేము చూడలేదు. ఆకాశంలో ఏదో మండుతున్నట్టుగా ఒక వెలుగు కొన్ని సెకండ్లు కనిపించి మాయమైపోయింది. ఇది ఎందుకు కనిపించిందో ఎవరైనా చెప్పగలరా’’ అంటూ దానిని వీడియో తీసిన హెర్నాండెజ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ వీడియోను చూసిన హార్వార్డ్–స్మిత్సోనియాన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన జోనాథాన్ మెక్‌డొవెల్ అంతరిక్షంలో మండించే శిథిలాల్లో ఒక చిన్న తునక కావడానికి 99.9% ఆస్కారం ఉందని బదులిచ్చారు. జపాన్‌కు చెందిన రిటైర్ అయిన కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఇటీవల మంటల్లో దగ్ధం చేశారని, దాని తాలూకు చిన్న తునక అలా కనిపించి ఉంటుందని అంచనా వేశారు. -
భూమికి బై బై.. నిష్క్రమించిన ఆకుపచ్చ తోకచుక్క
న్యూయార్క్: జనవరి మధ్య నుంచి ఫిబ్రవరి తొలి వారం దాకా దాదాపు నెల రోజుల పాటు ఆకాశంలో కనువిందు చేసిన ఆకుపచ్చని తోకచుక్క ఇక సెలవంటూ వెళ్లిపోతోంది. సి2022ఈ3గా పిలుస్తున్న ఈ తోకచుక్క మన నుంచి అత్యంత దూరంగా సౌరమండలపు వెలుపలి తీరాల కేసి పయనమవుతోంది. ఇది మళ్లీ భూమికి సమీపంగా వచ్చి మనకు కనిపించేది మరో 50 వేల సంవత్సరాల తర్వాతే! సరిగ్గా చెప్పాలంటే, 52023వ సంవత్సరంలో అన్నమాట!! అయితే సూర్యుడు, ఇతర గ్రహాల ఆకర్షణ శక్తి ప్రభావం వల్ల దాని కక్ష్యలో బాగా మార్పుచేర్పులు జరిగే క్రమంలో అది అంతకంటే చాలా ముందే మరోసారి భూమికి సమీపానికి వచ్చే అవకాశాలనూ కొట్టిపారేయలేమంటున్నారు సైంటిస్టులు. అదే సమయంలో కక్ష్యలో వ్యతిరేక మార్పులు జరిగితే 50 వేల ఏళ్ల కంటే ఎక్కువ సమయమూ పట్టవచ్చని కూడా వారు చెబుతున్నారు. భూమికి అతి సమీపానికి వచ్చినప్పుడు భూ ఉపరితలం నుంచి ఈ తోకచుక్క 4.2 కోట్ల కిలోమీటర్ల దూరంలో కనువిందు చేసింది. అది చివరిసారి మనకు కన్పించినప్పటికి భూమిపై ఆధునిక మానవుని ఆవిర్భావమే జరగలేదు! అప్పటికింకా నియాండర్తల్ మానవుల హవాయే నడుస్తోంది. -
వాహ్! విజయవాడ అందాలు.. తనివితీరా చూడాల్సిందే..
నీలాకాశం, తెల్లటి మేఘాల నీడలో బెజవాడ నగరం కొత్త అందాలను సంతరించుకుంది. దుర్గాఘాట్, కృష్ణా నది తీరం, ప్రకాశం బ్యారేజ్.. బ్యూటీఫుల్‌గా మెరిసిపోయాయి. మనసును రంజింప చేసే ఈ సుందర దృశ్యాలను ‘సాక్షి’ కెమెరా క్లిక్ మనిపించింది. సమర్పణం విజయవాడ దుర్గాఘాట్‌లో సోమవారం కృష్ణవేణి సాక్షిగా అర్ఘ్యం సమర్పిస్తున్న దృశ్యం దర్పణం మేఘాల ఘుమఘుమలు.. పుడమికి నీలి ఆకాశం సరిగమలు.. దుర్గాఘాట్‌లో దర్పణంలా వాననీటిలో ఆకాశం ప్రతిబింబం మేఘాల తెరచాప ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అమ్మవారి ఆలయంపై దట్టంగా అలుముకున్న మేఘాల తెరచాప మేఘాల హొయలు కృష్ణా నది తీరంపై అందంగా హొయలు పోతున్న మేఘమాలలు నీలాకాశం నీడలో.. నీలాకాశం నీడలో కొత్త అందాలు సంతరించుకున్న ప్రకాశం బ్యారేజ్ పరిసరాలు సంస్మరణం అక్టోబర్ 21న జరగనున్న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సన్నాహకాల్లో భాగంగా ఇందిరా గాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నీలాకాశం నీడలో పోలీసు సిబ్బంది కవాతు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
SKY Movie: ఒంటరితనం మనిషికి ఏం నేర్పుతుంది?
ఆనంద్, మురళీ కృష్ణంరాజు, శృతిశెట్టి, మెహబూబ్ షేక్ (ఎమ్.ఎస్), రాకేష్ మాస్టర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘స్కై’. పృథ్వి పేరిచర్ల దర్శకత్వంలో ‘వేలర్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్’పై నాగిరెడ్డి గుంటక - మురళీ కృష్ణంరాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. ‘ఒక వ్యక్తి అన్నీ కోల్పోయి ఒంటరిగా బ్రతకాల్సి వస్తే, ఏళ్ల తరబడి అనుభవిస్తున్న బాధ, ఆనందంతో తన ఒంటరితనాన్ని జయించాడా, లేదా? లేక ఏకాకి జీవితమే కదా అని రోజు గడవడం కోసం తుంటరిగా పక్కవాడ్ని మోసం చేస్తూ బ్రతికేస్తున్నాడా? అసలు ఒంటరితనం మనిషికి ఏం నేర్పుతుంది? మనిషిని ఎలా మలుస్తుంది? అనేది క్లుప్తంగా "స్కై" చిత్రం కథాంశమని దర్శకుడు పృథ్వి తెలిపారు. చివరి షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలతోపాటు, ప్యాచ్ వర్క్ కూడా పూర్తి చేయనున్నామని నిర్మాతలు నాగిరెడ్డి గుంటక - మురళీ కృష్ణంరాజు తెలిపారు. -
UK PM Race: ఎవరెంత దూరం? బ్రిటన్ తదుపరి ప్రధానిపై ఉత్కంఠ
బ్రిటన్ తదుపరి ప్రధాని పీఠం కోసం కన్జర్వేటివ్ పార్టీలో పోటీ మొదలైనప్పుడు హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారతీయ మూలాలున్న రిషి సునాక్ రేసులో వెనుకబడిపోతున్నారు. విదేశాంగ శాఖ మంత్రి లిజ్ ట్రస్ క్రమంగా ప్రధాని పీఠానికి దగ్గరవుతున్నట్టుగా సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి. తాజా సర్వేలో 58% మంది ట్రస్‌కు మద్దతుగా ఉంటే, సునాక్‌కు కేవలం 26% మంది సభ్యుల మద్దతు లభించింది. 12% మంది ఎటూ తేల్చుకోలేదని వెల్లడించారు. ఇలాంటి సమయంలో స్కై న్యూస్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో రిషి సునాక్ అనూహ్యంగా విజయం సాధించడం ఆయనకి నైతికంగా బలం చేకూరింది. అయినప్పటికీ ప్రధాని పీఠం అంత సులభంగా దక్కేలా లేదు. ఇరువురు నేతలు వచ్చే నెలరోజుల్లో కనీసం మరో 10 సార్లు చర్చల్లో పాల్గొనాలి. ప్రధాని పదవికి తాము ఎందుకు అర్హులమో ఆకట్టుకునేలా చెప్పగలగాలి. దాదాపుగా లక్షా 80 వేల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్ని మెప్పించగలగాలి. కోవిడ్ –19, రష్యా–ఉక్రెయిన్ యుద్ధాలతో బ్రిటన్ ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం 9.4శాతానికి చేరుకుంది. ఇంధనం ధరలు ఆకాశాన్నంటడం, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయి ప్రజలు తీవ్ర అసహనంలో బతుకుతున్నారు. ఈ నేపథ్యంలో పన్నుల తగ్గింపు ఎన్నికల ప్రధాన అంశంగా మారింది. ఇన్నాళ్లూ బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా నెంబర్ టూ స్థానంలో కొనసాగడంతో పాలనాపరంగానూ, ఆర్థిక వ్యవహారాల్లోనూ రిషికి మంచి పట్టు ఉంది. దీంతో ఎంపీలంతా ఆయన వైపే ఉన్నప్పటికీ, టోరీ సభ్యులు ట్రస్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. సెప్టెంబర్ 1న ఎన్నికల బ్యాలెట్ పత్రాలను పార్టీ సభ్యులకు పంపిణీ చేస్తారు. 2న ఓటింగ్ జరుగుతుంది. 5న ఫలితాలు వెల్లడిస్తారు. రిషి ఎందుకు వెనుకబడ్డారు ? పన్నుల్లో రాయితీ ఇచ్చి ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడతానని లిజ్ ట్రస్ ఇచ్చిన హామీతో ఒక్కసారిగా ఆమె హవా పెరిగింది. ఆదాయ పన్నులో కూడా రాయితీ ఇస్తానని ప్రకటించడం, రిషి ఆర్థిక విధానాలకు పూర్తి వ్యతిరేకంగా ఆమె మాట్లాడడంతో వారి మధ్య పోటీ పెరిగింది. రిషితో పోల్చి చూస్తే ఎంపీల మద్దతు తక్కువగా ఉన్నప్పటికీ తర్వాత చేస్తున్న ప్రచారంలో వివిధ అంశాలపై ఆమె ఇస్తున్న హామీలు సభ్యుల్ని ఆకర్షిస్తున్నాయి. రిషిపై ఆగ్రహంతో ఉన్న బోరిస్ జాన్సన్ తెర వెనుక నుంచి లిజ్ ట్రస్‌కు మద్దతునిస్తున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది. చర్చా కార్యక్రమాల్లో లిజ్ ట్రస్ మాజీ ప్రధాని థాచర్‌ను తలపించే ఆహార్యంతో ఉండడం, ఆదాయ పన్ను రాయితీ వంటి ఆకర్షణీయ పథకాలు ప్రకటిస్తున్నారు. ట్రస్ స్థానికురాలు కావడం, రిషి తాను హిందూ మతాన్నే ఆచరిస్తానని బహిరంగంగా చెబుతూ ఉండడం కూడా ఆయనకు మైనస్‌గా మారింది. రిషి జీవన విధానం చాలా లావిష్‌గా ఉంటుంది. దేశం ద్రవ్యోల్బణంతో అతలాకుతలమవుతున్న సమయంలో ఆయన 500 పౌండ్ల షూ వేసుకోవడం, కోట్ల ఖర్చుతో ఆధునిక వసతులతో ఇల్లు నిర్మించడం, భార్య అక్షతా మూర్తి విదేశీ కార్డుని అడ్డం పెట్టుకొని పన్నులు ఎగ్గొట్టడం వంటివి రిషిపై వ్యతిరేకతను పెంచాయి. అయితే కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక మంత్రిగా ఆయన తీసుకున్న చర్యల్ని ప్రశంసిస్తున్న వారూ ఉన్నారు. వివిధ అంశాలపై వీరిద్దరి వైఖరి.. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఆకాశంలో ‘గులాబీ’ మాయతో హడలెత్తిన జనం.. ఏలియన్స్ పనేనా?
కాన్బెర్రా: ఆకాశం ఏ రంగులో ఉంటుందంటే నీలం అంటూ టక్కున చెప్పేస్తారు. కానీ.. ఆకాశంలో కొద్ది ప్రాంతం గులాబీ రంగులోకి మారితే ఆశ్చర్యమే కాదు.. ఏదో జరుగుతోందనే భయం కూడా కలుగుతుంది. సినిమాల్లో చూపించినట్లుగా ఆకాశం నుంచి ఎవరో భూమిపైకి వస్తున్నప్పు ఏర్పడిన మాదిరిగా ఉంటే.. అది మరింత భయాన్ని పెంచుతుంది. అలాంటి అనుభూతే ఆస్ట్రేలియాలోని మిల్దురా ప్రజలకు ఎదురైంది. గత బుధవారం సాయంత్రం వేళ ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఆకాశం లేత గులాబీ రంగులోకి మారిపోయింది. కొందరు దానిని అద్భుతం అంటూ వర్ణించగా.. కొందరు గ్రహాంతర వాసుల పనేనుంటూ భయాందోళనలకు గురయ్యారు. గులాబీ రంగులోకి మారిన ఆకాశం ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. గులాబీ రంగు కనిపించిన ప్రాంతం మధ్యలో భూమిని నుంచే కాంతి ప్రసారమవుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో భూమిపైన ఉన్న దాని నుంచే ఆ కాంతి వెలువడుతోందని, దాని ద్వారానే ఆకాశం గులాబీ రంగులోకి మారిపోయిందని పలువులు విశ్లేషించారు. మరోవైపు.. దీనిపై కొందరు నెటిజన్లు జోకులు పేల్చారు. అది ఏలియన్స్ సృష్టిగా కొందరు పేర్కొనగా.. మరికొందరు మాహా అద్భుతం అంటూ తెలిపారు. గులాబీ రంగుకు కారణమదే.. అయితే.. ఆకాశంలో ఏర్పడిన గులాబీ రంగుకు కారణం ఆ ప్రాంతంలో ఓ ఫార్మాసిటికల్ సంస్థ సాగు చేస్తున్న గంజాయి మొక్కలేనని తేల్చారు. ‘మా సంస్థలో కొత్త సాగు ప్రాంతం కోసం ప్రయోగాలు చేస్తున్న క్రమంలో ఆకాశంలోకి కాంతి ప్రసరణ జరగటం స్థానికులు గమనించారు. అది సోలార్ ఫ్లేర్ లేదా ఇంటర్ డైమెన్షనల్ పోర్టల్ కాదని మేము నమ్మకంగా చెప్పగలం.’ అని ట్విట్టర్ వేదికగా తెలిపింది ఫార్మా సంస్థ. గంజాయి మొక్కలు ఎదిగేందుకు వివిధ రకాల కాంతి అవసరమవుతుందని, పూలు పూసే సమయంలో ఎర్ర లైట్ ఉపయోగించాలని తెలిపారు ఫార్మా సంస్థ సీఈవో పీటర్ క్రాక్. కొత్త సాంకేతికతను ఈ ఏడాదే తీసుకొచ్చామని, ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆకాశంలో అద్భుత దృశ్యం ఏర్పడటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. An eerie pink glow lit up over Mildura - https://t.co/5vUMebCsDb pic.twitter.com/q2mxsSpWXz — Cann Group (@Cann_Group) July 22, 2022 ఇదీ చదవండి: Sri Lanka: శ్రీలంకలో మళ్లీ ఉద్రిక్తత.. నిరసనలపై కొత్త అధ్యక్షుడి ఉక్కుపాదం! -
రంగులు అద్దిన చిత్రం కాదండోయ్.. ప్రకృతి దిద్దుకున్న మనోహర దృశ్యం
ఇది కాన్వాస్‌పై రంగులు అద్దిన చిత్రం కాదు.. వినీలాకాశంపై ప్రకృతి దిద్దుకున్న ముగ్ధ మనోహర దృశ్యం. దక్షిణ ధ్రువంలోని అంటార్కిటికా వద్ద గులాబీ, ఊదా, నారింజ రంగుల మిశ్రమంతో ఆకాశంపై పరుచుకున్న వర్ణమాలిక. అంటార్కిటికాలోని న్యూజిలాండ్ పరిశోధన కేంద్రం టెక్నీషియన్ స్టువర్ట్ షా ఈ చిత్రాలను క్లిక్‌మనిపించారు. గగనతల రంగుల వెనకున్న కారణం విచిత్రమైనదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఏడాది జనవరి 15న అంటార్కిటికాకు సుమారు 7 వేల కిలోమీటర్ల దూరంలోని టోంగా దీవుల్లో ఉన్న సముద్రగర్భ అగ్నిపర్వతం బద్దలై ఏకంగా 58కి.మీ. ఎత్తుకు బూడిద, దుమ్ము, ధూళిని ఎగజిమ్మిందని చెప్పారు. దీంతో భూ వాతావరణంలోనే నేటికీ కలియతిరుగుతున్న ధూళి తుంపరల్లో కొన్ని సూర్యోదయ, సూర్యాస్తమయాల్లో కాంతిని అడ్డుకున్నప్పుడు ఆకాశంలో ఇలా రంగురంగుల దృశ్యాలు కనిపిస్తాయని వివరించారు. ఇప్పటికే ఇలాంటి దృశ్యాలు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వద్ద గగనతలంపై కనిపించినట్లు చెప్పారు. ఈ అగ్నిపర్వత ధూళి తుంపరలు సుమారు రెండేళ్లపాటు భూ వాతావరణంలో ఉంటాయని పేర్కొన్నారు. చదవండి: India: అత్యధిక బిలియనీర్లు ఏ రంగం నుంచి ఉన్నారో తెలుసా? The sky over Antarctica turned pink due to the January eruption of the Hunga-Tonga-Hunga-Haapai volcano in the Pacific Ocean. pic.twitter.com/AhPwWv0Gp1 — Spriteer (@spriteer_774400) July 17, 2022 -
ఆకాశంలో అద్భుతం.. ఒక్క సెకనులో రాత్రి పగలుగా మారింది.. ఎక్కడంటే?
అంతరిక్షం గురించి మనకి తెలిసింది తక్కువ తెలియాల్సిందే ఎక్కువే ఉందని, ఈ విశ్వంలో మనకు తెలయని అద్భుతాలు ఎన్నో ఉన్నాయని శాస్త్రవేత్తలు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే అందులో కొన్ని మాత్రం అప్పుడుప్పుడు ఆకాశంలో తళుక్కున మెరుస్తూ మనకి దర్శనమిస్తుంటాయి. ఇటీవల ఓ నగరాన ఆకాశంలో అలాంటి అద్భుతమే ఆవిష్కృతమైంది. ఈ ఘటన చిలీ రాజధాని శాంటియాగోలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జూలై 7న శాంటియాగో నగరం ఉదయం 5 గంటల సమయంలో .. అకస్మాత్తుగా అంతరిక్షం నుంచి భూ వాతావారణంలోకి ఓ ఉల్క వచ్చింది. ఇంకేముంది అది అలా ప్రవేశించిందో లేదో భగ్గున మండి ముక్కలై ఆ విస్పోటం చెందింది. దీంతో చీకటిగా ఉన్న ఆ ప్రాంతమంతా తెల్లారకుండానే పట్టపగలులా మారింది. ఇలా ఉల్క పేలినప్పుడు ఏదో పెద్ద మెరుపు మెరిసినట్లు చప్పుడు వచ్చిందని స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనను కన్సెప్షన్ యూనివర్సిటీ స్కాలర్ ధ్రువీకరించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ ఘటన జరిగిన రోజే న్యూజిల్యాండ్ రాజధాని వెల్లింగ్టన్ ఆకాశంలో ఏదో వస్తువు భగ్గున మండిపోయింది. ఒకే రోజు రెండు దేశాల్లో ఇలా జరగడంతో కొందరు భయబాంత్రులకు గురికాగా మరికొందరు ఆశ్చర్యపోతున్నారు. ఏదైమైనా శాస్త్రవేత్తలు ఈ వేర్వేరు వింత ఘటనలకు గల కారణాలపై అధ్యయనాలు మొదలుపెట్టారు. -
అద్భుత దృశ్యం.. ఆకుపచ్చగా మారిన ఆకాశం.. ఫోటోలు వైరల్
అమెరికా: సాధారణంగా నీలిరంగులో ఉండే ఆకాశం పూర్తిగా ఆకుపచ్చ రంగులోకి మారింది. అమెరికాలోని దక్షిణ డకోటాలో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. సియాక్స్ ఫాల్స్ నగర వాసులు ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. హాలీవుడ్ సినిమాలో ఏలియన్స్ రావడానికి ముందు కన్పించే దశ్యాల్లా ఆకాశంలో ఈ మార్పులను చూసి నగరవాసులు ఆశ్చర్యంతో పాటు భయాందోళనకు గురయ్యారు. ఆ మార్పులే కారణం అయితే ఆకాశం ఆకుపచ్చగా మారడానికి వాతావరణంలో అనూహ్య మార్పులే కారణమని తెలుస్తోంది. దక్షిణ డకోటా, మిన్నెసొటా, అయోవ నగరార్లో మంగళవారం ప్రచండ గాలులతో తుపాను బీభత్సం సృష్టించింది. ఆ సమయంలోనే ఈ ప్రాంతాల్లో 'డెరోకో' ఏర్పడిందని వాతావరణ శాఖ ధ్రువీకరించింది. అందుకే ఆకాశం రంగు మారినట్లు పేర్కొంది. ఆకాశం ఆకుపచ్చ రంగులోకి మారినంత మాత్రాన టోర్నడోలు వస్తాయని భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వాతావరణ నిపుణులు తెలిపారు. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. The approach. @NWSSiouxFalls @keloland @dakotanews_now pic.twitter.com/NOl35jIlpt — jaden 🥞 🍦 (@jkarmill) July 5, 2022 #salemsd pic.twitter.com/ExbpCtV1tI — J (@Punkey_Power) July 5, 2022 ఆకుపచ్చగా ఎందుకు? ఆకాశం ఆకుపచ్చ రంగులోకి ఎందుకు మారుతుందో పూర్తిగా అర్థంకాకపోయినప్పటికీ పలు అమెరికా పరిశోధనా నివేదికలు దీని గురించి వివరించాయి. సూర్యాస్తమయం సమయంలో ఎరుపు కాంతి ఉన్నప్పుడు ఉరుములతో కూడిన వర్షం పడితే, గాలిలోని నీటి కణాల వల్ల ఆకాశం ఆకుపచ్చ రంగులో ఉన్నట్లుగా కనిపిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. తుపాను కారణంగా మంగళవారం రాత్రి నాలుగు గంటల పాటు దక్షిణ డకోటాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ ఆస్తి నష్టం కూడా సంభవించింది. గాలివాన వల్ల ఆకాశం పలుమార్లు నలుపు, నీలం, బూడిద, ఆకుపచ్చ రంగుల్లోకి మారింది. -
తారల తళుక్కులను చూసేద్దాం!
సాక్షి, అమరావతి: కాంతి కాలుష్యానికి (లైట్ల వెలుతురు పెద్దగా లేని ప్రాంతం) దూరంగా చీకటి ఆకాశంలో టెలీస్కోప్‌ల సాయంతో నక్షత్రాలను వీక్షించడమే ఆస్ట్రో పర్యాటకం. ఇది ఎత్తైన కొండలు, దట్టమైన కోనలు, హిమ పర్వతాల ప్రాంతాల్లో సాంకేతికతతో కూడిన ఎకో టూరిజంగా ఆహ్లాదాన్ని పంచుతోంది. ఇందులో పర్యాటకులు స్పష్టమైన రాత్రి ఆకాశాన్ని అన్వేషిస్తూ (నైట్ స్కై టూరిజం) గ్రహాలు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, ఖగోళ వస్తువులు, ఉల్కాపాతాలను వీక్షించవచ్చు. ఆస్ట్రో–ఫొటోగ్రఫీ నేర్చుకోవచ్చు. ఖగోళ శాస్త్రజ్ఞులు సైతం ఆకాశంపై పరిశోధనలకు రాత్రి శిఖరాగ్ర ప్రదేశాల్లోనే ఎంచుకొంటారు. ఉపాధి వనరుగా.. ఆస్ట్రో టూరిజం స్థానిక వర్గాలకు బలమైన ఆర్థిక, సామాజిక ఉపాధి వనరుగా మారుతోంది. లద్ధాఖ్‌లో స్థానిక మహిళలకు ఆస్ట్రో టూరిజంలో టెలిస్కోప్‌ల వినియోగంలో శిక్షణ పొంది నక్షత్రాలు, నక్షత్ర రాశులను గుర్తించడంలో పర్యాటకులకు గైడులుగా వ్యవహరిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఆస్ట్రో–స్టే పేరిట స్థానిక గృహాల్లోనే పర్యాటకులకు బస కల్పించి ఉపాధి పొందుతున్నారు. ఉత్తరాఖండ్, రాజస్థాన్‌ల్లో ఖగోళ పర్యాటక ప్రదేశాల్లో టూరిస్టుల కోసం గుడిసెలు ఏర్పాటు చేస్తూ.. భోజనాలు అందిస్తూ..సంగీత కచేరీలతో అలరిస్తూ సంపాదిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని బెనిటల్ ఆస్ట్రో గ్రామంగా మారింది. ఇక్కడ పర్యాటకులను ఆకట్టుకునేందుకు ‘ఆస్ట్రో విలేజ్ పార్టీలు’ పెడుతున్నారు. దేశంలో ఇలా.. దేశంలో తొలి సారిగా రాజస్థాన్ ప్రభుత్వం మొత్తం 33 జిల్లాల్లో ఆస్ట్రో టూరిజాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి జిల్లాలో టెలిస్కోప్‌లు ఏర్పాటు చేయడంతో పాటు ఢిల్లీలోని బికనీర్ హౌస్‌లో కూడా ఆస్ట్రో టూరిజం కోసం కేంద్రాన్ని నిర్వహిస్తోంది. రాజధాని జైపూర్‌లోనే 4 నక్షత్ర వీక్షణ కేంద్రాలను పెట్టింది. ఇప్పటికే ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో పుదుచ్చేరి, కర్ణాటకలోని విరాజ్‌పేట, మడికేరి, గోవా, కేరళలోని మున్నార్‌లో ఆస్ట్రో ఫోటోగ్రఫీ సెషన్లు, ప్లానెటరీ పెరేడ్, ‘మెస్సియర్ మారథాన్’ పేరుతో చీకటి ఆకాశాన్ని వీక్షించేందుకు మొబైల్ అబ్జర్వేటరీలు నడుస్తున్నాయి. తమిళనాడులో తక్కువ జనసాంద్రత కలిగిన ఏలగిరి కొండలు, ఊటీకి ఖగోళ పర్యాటకం పెరుగుతోంది. లద్ధాఖ్‌కు ప్రత్యేక గుర్తింపు! ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశాల్లో లద్ధాఖ్లోని హన్లే గ్రామం ఒకటి. ఈ ప్రాంతాన్నే ఇటీవల మొట్టమొదటి డార్క్ స్కై రిజర్వ్‌గా ప్రకటించారు. ఇది శీతల ఎడారి ప్రాంతం కావడంతో ఏడాది పొడవునా పొడి వాతావరణంతో ఆకాశంలో పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ క్రమంలోనే పరిశోధనల కోసం రాత్రిపూట ఆకాశాన్ని కాంతి కాలుష్య కారకాల నుంచి పరిరక్షించే దిశగా ప్రత్యేక బృందం కృషి చేస్తోంది. -
Telangana: ఆకాశంలో అద్భుతం
ఖానాపూర్: ఆకాశంలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. సోమవారం ఉదయం కొన్ని గంటలపాటు సూర్యుడి చుట్టు ఇంద్రధనుస్సు తరహాలో వలయాన్ని ఏర్పడింది. జిల్లా ప్రజలు పలువురు వీక్షించారు. కొందరు కళ్లద్దాల్లో, మరికొందరు సెల్ఫోన్లలో సూర్యుడి ఫొటో, వీడియోల్లో చిత్రీకరించారు. అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. వాతావరణంలో నీటి బిందువులపై పడిన కాంతి కిరణాలు వక్రీభవనం చెందడంతో ఈ తరహా వలయాలు ఏర్పడుతాయని మస్కాపూర్ ప్రభుత్వ పాఠశాల సైన్స్ టీచర్ జాడి శ్రీనివాస్ తెలిపారు. దీన్ని కెలడోస్కోప్ ఎఫెక్ట్ అంటారని పేర్కొన్నారు. చదవండి: (టీఎస్ఆర్టీసీ చార్జీల పెంపు.. ఏపీఎస్ఆర్టీసీకి రాబడి) -
భయపెట్టేలా రంగు మారిన ఆకాశం.. స్థానికుల్లో టెన్షన్
కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చైనీయులు మరోసారి ఉలిక్కిపడ్డారు. షాంఘైలోని ఓడరేవు నగరం జౌషాన్‌లో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం ఎరుపు రంగులోకి మారిపోయింది. దీంతో చైనీయులు ఆశ్చర్యంతో పాటుగా ఆందోళనకు గురయ్యారు. ఇలా ఆకాశం రంగు మారంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి సెల్ఫోన్లలో వీడియోలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే భయాందోళనకు సైతం గురయ్యారు. ఈ వీడియోపై కొందరు చైనీయులు స్పందిస్తూ.. ఇలా ఆకాశం ఎరుపు రంగులోకి మారడం అపశకుమని కామెంట్ చేశాడు. నేను ఇంతకు ముందెన్నడూ ఇలాంటివి చూడలేదు. ఆకాశం కూడా ఎర్రగా మారడం నన్ను ఆశ్చర్యపరుస్తుందని మరో నెటిజన్ తెలిపాడు. ఇదిలా ఉండగా.. ఈ విచిత్ర ఘటనపై చైనాలోని టెలివిజన్, డిజిటల్ మీడియా మాత్రం ఈ వింత రంగు మానవ నిర్మితం కాదని, సహజ కాంతి వక్రీభవన ఫలితమని వివరించాయి. మరోవైపు వుహాన్‌లోని చైనా యూనివర్శిటీ ఆఫ్ జియోసైన్సెస్‌కు చెందిన ఓ నిపుణుడు స్పందిస్తూ.. భూ అయస్కాంత కార్యకలాపాల ఫలితంగా ఇలా జరిగి ఉండవచ్చని స్పష్టం చేశారు. 'Armageddon' Fear Spreads through Chinese City as sky turns Blood Red#China #Zhoushan #Zhejiang #Shanghai #Sky #RedSky #BloodSky #ViralVideo #Weather #Climate #Viral #ClimateChange #Armageddon pic.twitter.com/tnnGKAagMp — Doregama Viral (@DoregamaViral) May 9, 2022 -
అంతరిక్షంలో అద్భుతం.. ఒకే వరుసలో నాలుగు గ్రహాలు
ఏలేశ్వరం(తూర్పుగోదావరి): అంతరిక్షంలో అద్భుతం చోటు చేసుకుంది. ఖగోళంలో ఒకే రేఖపై నాలుగు గ్రహాలు దర్శనమిచ్చాయి. దీనిని ప్లానెట్స్ పరేడ్ అని అంటారు. ఇది బుధవారం తెల్లవారు జామున 3.49 గంటల నుంచి 5.06 గంటల మధ్య కనువిందు చేసింది. దీనిని కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో స్పార్క్ ఫౌండేషన్ చిత్రీకరించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను ఆస్ట్రనామికల్ వింగ్ డైరెక్టర్ ఎస్.సాయి సందీప్ వెల్లడించారు. చదవండి: ఆ కోర్సులకు గిరాకీ.. ‘డిగ్రీ’ వైపు మళ్లీ చూపు.. శని, అంగారక, శుక్ర గ్రహాలు ఒకే రేఖపైకి రావడం మార్చి చివరిలో ప్రారంభమైంది. ఏప్రిల్‌లో బృహస్పతి అదే రేఖపైకి వచ్చి చేరింది. నాలుగు గ్రహాలు ఒకే రేఖపై దర్శనమివ్వడం అత్యంత అరుదైన విషయమని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 23న నాలుగు గ్రహాల చెంతకు చంద్రుడు వచ్చి చేరడంతో అంతకు మించిన అద్భుతం ఆవిష్కృతం కానుందన్నారు. ప్రస్తుతం సరళరేఖ కుడిపక్కన చంద్రుడు కనిపిస్తున్నాడు. ఐదు గ్రహాలను ఒకే వరుసగా చూడటం ప్రజలకు సువర్ణ అవకాశమని సాయిసందీప్ అన్నారు. -
వినువీధుల్లో ఉల్కాపాతం కనువిందు
ఆసిఫాబాద్/కోటపల్లి/రెబ్బెన: ఉగాది రోజు శనివారం రాత్రి 8గంటల ప్రాంతంలో ఆకాశంలో అద్భుతం చోటు చేసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉల్కాపాతం కనువిందు చేసింది. ఆదిలాబాద్ జిల్లా తాంప్సీ, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెంచపల్లి మీదుగా సుపాక, ఆలుగామ గ్రామం వైపు మహారాష్ట్రలోని తేకడా గ్రామం వరకు ఉల్కలు జారిపడ్డాయి. కుమ్రుంభీం జిల్లా కేంద్రం ఆసిఫాబాద్, వాంకిడి, బెజ్జూర్, రెబ్బెన మండలాలతోపాటు మహారాష్ట్ర సరిహద్దులోని పలువురు ప్రజలు ఉల్కాపాతాన్ని వీక్షించారు. తోకచుక్కల మాదిరి ఉల్కలు భూమి మీదకు దూసుకు వస్తుండడంతో కొందరు సెల్ఫోన్లతో చిత్రీకించారు. నిప్పులు కక్కుతూ ఉల్కలు నేలరాలినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఉల్కాపాతం పడుతుందని టీవీ చానళ్లలో, సోషల్ మీడియాల్లో వార్తలు రావడంతో గ్రామస్తులు కొంత ఆందోళనకు గురయ్యారు. -
ఆకాశంలో వింత.. అంతు చిక్కని రహస్యం!
Mysterious flying object hangs above Pak city: విశాల విశ్వంలో ఇప్పటివరకు శాస్త్రవేత్తలు చేసిన అంతరిక్షి పరిశోధనల్లో చాలా వరకు అంతు చిక్కని రహస్యలు ఎన్నో ఎన్నో ఉన్నాయి. శాస్త్రవేత్తలు కూడా ఆ రహస్యాలను చేధించే ప్రయత్నంలో తలామునకలవుతునే ఉన్నారు. కానీ ఇప్పటికి అంతుబట్టిన చిదంబర రహస్యంలా గగనంలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకుంటునే ఉన్నాయి. అచ్చం అలానే ఒక వింతైన అద్భుతం ఆకాశంలో కనిపించింది. ఈ ఘటన ఇస్లామాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఇస్లామాబాద్‌కి చెందిన ఒక గ్రహాంతర జౌత్సాహికుడు అర్స్లాన్ వార్రైచ్ ఆకాశలో ఎగురుతున్న రాయిని చూశాడు. అతను తన డ్రోన్లను ల్యాండ్ చేయబోతున్నప్నుడు ఆకాశంలో ఈ అద్భుతం చోటు చేసుకుంది. చూసేందుకు నల్లటి గుండ్రపు రాయిలా ఉందని కెమెరాలో జూమ్ చేసి చూస్తే ఒక ఉబ్బెత్తిన త్రిభుజాకారంలో ఉందని చెప్పాడు. అంతేకాదు ఆకాశంలో ఈ వింత రెండు గంటలకు పైనే కనువిందు చేసిందని అన్నాడు. ఈ మేరకు అతను ఆ వింతైన వస్తువు ఆకాశంలో వేలాడిదీసినట్టుగా ఉన్న దానిని రకరకాల యాంగిల్స్‌లో వీడియో రికార్డు చేశాడు. అంతేకాదు వార్రైచ్ ఆ ఘటనకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: సైకిల్ రైడర్ల పై ఘోరంగా దాడి చేసిన ఎద్దు!) -
ఆకాశంలో వింత దృశ్యాలు.. నిమిషాల వ్యవధిలోనే
బత్తలపల్లి(అనంతపురం జిల్లా): సోమవారం తెల్లవారుజామున బత్తలపల్లి పరిసరాల్లో ఆకాశంలో వింత దృశ్యాలు గోచరించాయి. తూర్పున కాంతి వంతంగా కనిపించిన ఓ దృశ్యం కాసేపటికి రూపం మారి అదృశ్యమైంది. అలాగే దక్షిణాన శక్తివంతమైన వెలుగుతో మరో దృశ్యం గోచరించింది. తొలుత చిన్నదిగా కనిపించినా... నిమిషాల వ్యవధిలోనే పెద్దదిగా మారి మాయమైంది. ఈ దృశ్యాలను స్థానికులు సెల్ఫోన్లలో చిత్రీకరించారు. చదవండి: ఎక్కువరోజులు ఉండలేను.. హైదరాబాద్ వచ్చేస్తా.. సీన్ కట్ చేస్తే.. -
karnataka: ఆకాశంలో వింత.. ఎగబడ్డ జనం
Straight Line Of Stars In The Sky, శివమొగ్గ: ఆకాశంలో దూరదూరంగా దర్శనమిచ్చే నక్షత్రాలు ఒకే వరుసలో రైలులా వెళ్తున్నట్లు కనిపించడంతో శివమొగ్గవాసులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. సోమవారం రాత్రి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈ ఆకాశ వింత కనువిందు చేసింది. దీంతో తమ ఫోన్లతో ఫోటోలు, వీడియోలు తీసి మురిసిపోయారు. అవి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తరువాత తెలిసింది ఏమిటంటే అమెరికాకు చెందిన స్టార్‌లింక్ సంస్థ ప్రయోగించిన ఉపగ్రహాలు ఇలా ఆకాశంలో సంచరిస్తున్నట్లు తెలిసి ఔరా అనుకున్నారు. ప్రపంచంలో ప్రతి మూలకూ ఇంటర్నెట్ వసతిని అందించడానికి ఆ సంస్థ ఇటీవల సుమారు 52 శాటిలైట్లను ఒకే వరుసగా అమర్చి ప్రయోగించింది. ఇవి ప్రపంచంలో అన్ని దేశాల మీదుగా సంచరిస్తూ ఉంటాయి. భూమి మీద నుంచి సుమారు 580 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుంటాయి. ఏదేమైనా ఈ శాటిలైట్ కొన్ని గంటలపాటు అందరిలో కుతూహలాన్ని నింపింది. చదవండి: (కరుణ ‘నీడ’ ఇక లేరు.. స్టాలిన్ ఘననివాళి) -
ఆకాశంలో నాలుగు చుక్కలు.. గ్రహాంతర వాసులులేనా!?
గ్రహాంతరవాసులు.. ఈ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మనలో ఏదో తెలియని ఉత్కంఠ, ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. విశ్వంలో ఏలియన్స్ ఉన్నారని వారికి మనుషుల కంటే అధిక శక్తులు ఉంటాయని, టెక్నాలజీ గురించి కూడా తెలుసని చాలాకాలం నుంచి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గ్రహాంతర వాసులు ఉన్నారా? లేరా? చర్చ ఈనాటిది కాదు. ఎప్పటి నుంచో ఈ విషయంపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. పలువురు తాము అన్ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్ (యూఎఫ్ఓ)లను చూశామని ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. అయితే ఒకవేళ నిజంగా ఏలియన్స్ ఆకాశం చక్కర్లు కొడితే.. అవి భూమి మీదికి ఎందుకు రాలేకపోతున్నాయని శాస్త్రవేత్తలు సైతం సందేహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: చైనా దిగ్గజ కంపెనీలో చీకటి యవ్వారాలు.. కామ పిశాచాలపై ‘నో’ యాక్షన్ అయితే తాజాగా.. ఏలియన్స్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వార్తల్లోకి వచ్చింది. ఆకాశంలో అన్ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్ చక్కర్లు కొట్టిన వీడియో ప్రసుత్తం సోషల్ మీడియాలో వైరల్ మారింది. అది ఏలియన్స్ పంపిన యూఎఫ్ఓనా లేదా ఏదైనా ఏయిర్ క్రాఫ్టా? అని చర్చ జరుగుతోంది. అన్ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్ అంటే.. ఆకాశంలో ఎగురుతూ కనిపించే గుర్తు తెలియని వస్తువు లేదా ఏలియన్స్ ఫ్లైయింగ్ మిషిన్. ఏదైన ఏయిర్ క్రాఫ్టు లేదా స్పేస్ షిప్‌లు ఆకాశంలోకి ఎగిరినప్పుడు వాటికి సంబంధించిన రాడార్ సిగ్నల్స్ ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే యూఎఫ్ఓ వంటి వాటికి రాడార్ సిగ్నల్స్ ఉండవు. ఇక కొన్ని సార్లు రాడార్లుకు సంబంధించిన సిగ్నల్ కాకుండా వింత మిషన్లు ఆకాశంలో ఎగురుతూ కనిపిస్తుంటాయి! అయితే వాటివి ఇతర గ్రహాల నుంచి వచ్చిన మిషన్‌గా సైంటిస్టులు భావిస్తుంటారు. భూమిపై నుంచి ఎలాంటి ఫ్లైట్ లేదా స్పేస్ షిప్ గాల్లోకి ఎగిరిగినా అందుకు సంబంధించిన రాడార్ సిగ్నల్స్ ఉంటాయి. పైలెట్స్ వాటిని సులభంగానే గుర్తిస్తారు కూడా. తాజాగా ఓ పైలెట్‌కు ఆకాశంలో వింత ఆకారంలో యూఎఫ్ఓ కనిపించింది. పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఓ పైలెట్ విమానంలో ప్రయాణిస్తున్నాడు. కొంత దూరం ప్రయాణించాక నాలుగు చుక్కలు ఒకదాని పక్కన ఒకటి ప్రయాణించిటం గమనించాడు. ఆ దృశ్యాన్ని చూసిన పైలెట్ ఆశ్చర్యానికి గురై తన కెమెరాలో బంధించాడు. కొంత దూరం ప్రయాణించిన ఆ చుక్కలు.. ఒక్కసారిగా అదృశ్యమైపోయాయి. అవి ఏలియన్స్ యూఎఫ్ఓలని నెటిజన్లు సోషల్ మీడియలో కామెంట్లు చేస్తున్నారు. యూఎఫ్‌వోలకు సంబంధించిన పలు వీడియోలు గతంలో చాలా సార్లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో మాత్రం చాలా ఆశ్చర్యకరంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. A pilot claims he saw a fleet of #UFOs over the Pacific Ocean. The video was shot at around 39,000 feet. 🛸👽 The suspected #alien aircraft took the form of ‘weird’ rotating lights moving across the sky. 😳 What are your thoughts on the footage? 👀🤔 pic.twitter.com/N0I2WS2kYq — Chillz TV (@ChillzTV) December 7, 2021 -
స్పెయిన్‌లో అగ్నిపర్వతం విస్పోటనం
స్పెయిన్‌లోని అట్లాంటిక్ మహాసముద్ర ద్వీపంలోని లాప్లామాలో అగ్నిపర్వతం పేలి లావా పైకి ఉప్పొంగుతోంది. లావా ధారలుగా ప్రవహిస్తూ ఎరుపు రంగు అగ్నికీలల్ని వందల మీటర్ల దూరం వరకు వెదజిమ్మింది. దీంతో ఆకాశమంతా ఎరుపురంగులోకి మారింది. అగ్నిపర్వత శిఖరం నుండి ఎర్రటి లావా ఆకాశంలోకి ఫౌంటెయిన్‌లా ఎగసిపడటంతో ప్రజలు వణికిపోయారు. (చదవండి: ప్రపంచంలోనే ఖరీదైన పెంపుడు జంతువులు ఇవే) సెగలు, పొగలు గక్కుతూ లావా వరదై పారింది. ఈ క్రమంలో స్పెయిన్ అధికారులు తక్షణమే అప్రమత్తమై సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను ట్విటర్లో వాతావరణ శాఖ షేర్ చేసింది. అలాగే దృశ్యాల్ని చూసిన చాలామంది తమ అనుభవాలను పంచుకుంటూ వీడియోలను పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. (చదవండి: చైనాలో పడవ బోల్తా.. 10 మంది మృతి) BREAKING: Volcanic eruption on Canary Island of La Palma in Spain. pic.twitter.com/XghhbjqBPO — Insider Paper (@TheInsiderPaper) September 19, 2021 -
వాల్కనో బీభత్సం : ఎగిసిపడిన లావా
-
వాల్కనో బీభత్సం : ఎగిసిపడిన లావా
సాక్షి,న్యూఢిల్లీ: ఐస్లాండ్ రాజధాని రీజావిక్లో బద్దలైన అగ్నిపర్వతం బీభత్సం రేపేలా అగ్నికీలల్ని వెదజిమ్మింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులయ్యారు. ఎర్రటి లావా ఆకాశంలోకి ఫౌంటెయిన్‌లా ఎగసిపడింది. దీంతో భయంతో జనం బిక్కుబిక్కుమన్నారు. సెగలు, పొగలు గక్కుతూ లావా వరదై పారింది. రాజధానికి 30 కిలో మీటర్ల దూరంలోని ఫాగ్రాదల్సజాల్లో శుక్రవారం ఈ ఉదంతంచోటు చేసుకుంది. అయితే దీని వల్ల ప్రస్తుతానికి ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని ఐస్లాండ్ వాతావరణ శాఖ (ఐఎంవో) పేర్కొంది. కేవలం ఒక నెలలో 40 వేల భూకంపాలు సంభవించిన అనంతరం వాల్కనో బద్దలైనట్టు తెలిపింది. అలాగే దాదాపు 800 సంవత్సరాలలో ఈ ప్రాంతంలో ఇది తొలి అగ్నిపర్వత విస్ఫోటనమని అధికారులు పేర్కొన్నారు. చదరపు కిలోమీటర్ మేర లావా వ్యాపించి, 100 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు రావొద్దని హెచ్చరించారు. అలాగే ఎగిసిన పొగ వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడే ముప్పు ఉందని,అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను ట్విటర్లో వాతావరణ శాఖ షేర్ చేసింది. అలాగే దృశ్యాల్ని చూసిన చాలామంది తమ అనుభవాలను పంచుకుంటూ వీడియోలను పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
అగ్ని పర్వతం బద్దలైనప్పుడు...
ఆకాశంలో చుక్కల ముగ్గేసినట్లు నక్షత్రాలు.. మధ్యలో ఒక్కసారిగా పేలిన కొలిమా అగ్ని పర్వతం.. ఫొటో సూపర్‌గా ఉంది కదూ.. ఈ చిత్రాన్ని హెర్నాండో రివేరా అనే ఫొటోగ్రాఫర్ తీశారు. గతంలో మెక్సికోలోని కొలిమా అగ్ని పర్వతం బద్దలైనప్పుడు ఓ రాత్రంతా అక్కడే ఉండి ఫొటోలను తీసినట్లు రివేరా తెలిపారు. ఒక్కోసారి ప్రకృతి విధ్వంసం కూడా కెమెరా కంటికి చాలా అందంగా కనిపిస్తుందని చెబుతున్న రివేరా ఈ చిత్రాలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నారు. భారీ డ్రోన్‌తో ఉపగ్రహ ప్రయోగాలు ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపాలంటే బోలెడంత ఖర్చు. ఇస్రో లాంటి సంస్థలైతే చౌకగానే ఆ పనిచేస్తున్నాయి గానీ.. మిగిలిన చోట్ల మాత్రం ఒక్కో ప్రయోగానికి రూ.400 కోట్ల నుంచి రూ.వేల కోట్ల వరకు ఖర్చు అవుతుంటుంది. ఇలా కాకుండా.. భారీ డ్రోన్ సాయంతో తక్కువ ఖర్చులో ఉపగ్రహాలను కక్ష్యలోకి చేరుస్తానని అమెరికాకు చెందిన ఏవియమ్ అనే కంపెనీ చెబుతోంది. ‘రావన్ ఎక్స్’పేరుతో ఇటీవలే ఈ కంపెనీ ఓ డ్రోన్‌ను సిద్ధం చేసింది కూడా. పూర్తిగా స్వతంత్రంగా వ్యవహరించే ఈ డ్రోన్ గాలిలో నుంచే చిన్న చిన్న ఉపగ్రహాలను ప్రయోగించగలదు. 80 అడుగుల పొడవు.. రెక్కల వెడల్పు 60 అడుగులు, ఎత్తు 18 అడుగుల వరకు ఉంటుంది. సాధారణ విమాన ఇంధనాన్ని వాడుకుని 1.6 కిలోమీటర్ల రన్‌వే నుంచే నింగిలోకి ఎగరగలదు. 8 వేల చదరపు అడుగుల స్థలమున్న హ్యాంగర్‌లో ఉంచేయవచ్చు. ఎలాంటి వాతావరణంలోనైనా దీన్ని వాడుకోవచ్చని, డ్రోన్‌లో 70% మళ్లీ మళ్లీ వాడుకునేలా తయారు చేశామని కంపెనీ సీఈవో జే స్కైలస్ తెలిపారు. భవిష్యత్తులో డ్రోన్ మొత్తాన్ని పలుమార్లు వినియోగించుకునేలా చేస్తామని చెప్పారు. రావన్ ఎక్స్‌తో ఒక్కో ఉపగ్రహ ప్రయోగం 3 గంటల్లో పూర్తవుతుందన్నారు. కంపెనీ ఇప్పటికే సుమారు రూ.7 వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు దక్కించుకుందని, అమెరికా స్పేస్ ఫోర్స్‌తోపాటు, ఇతర సంస్థలు వినియోగదారులుగా ఉన్నారని వివరించారు. యూఎస్ స్పేస్ ఫోర్స్ ఆస్లోన్–56 పేరుతో భూమికి దగ్గరలో ఉన్న కక్ష్యలోకి చిన్న ఉపగ్రహాలు ప్రయోగించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. -
వినీలాకాశంలో నియో వైస్ కనువిందు
అల్లిపురం (విశాఖ దక్షిణం): వినీలాకాశంలో కొత్త అతిథి సందడి చేస్తోంది. దాదాపు 460 కోట్ల ఏళ్ల క్రితం నాటి దుమ్ము, ధూళితో నిండిన “కామెట్ నియోవైస్’ తోకచుక్క భూమి ఉత్తర ధృవప్రాంతంలో ఆకాశంలో కనువిందు చేస్తోంది. ఈ తోకచుక్కను మార్చిలో నాసాకు చెందిన నియోవైస్ ఇన్ఫ్రారెడ్ స్పేస్ టెలిస్కోప్ గుర్తించింది. అత్యంత అరుదైన ఈ తోకచుక్కను నగరానికి చెందిన హెచ్‌బీ కాలనీ భానునగర్‌కు చెందిన మొదిలి వైష్ణవి భవ్య తన కెమెరాలో ఇటీవల బంధించారు. రోజూ సూర్యాస్తమయం వేళ దర్శనమిచ్చే ఈ తోకచుక్కను తన కెమెరా(కెనాన్ ఈవోఎస్ 600 డీ)లో బంధించేందుకు సింహాచలం కొండకు ఉత్తరం వైపున ఉన్న భైరవస్వామి ఆలయం వద్దకు ఆమె వెళ్లేవారు. రోజూ గంటల కొద్ది వేచి ఉన్నా వాతావరణంలో ధూళి కణాల వల్ల తోకచుక్క కెమెరాకు చిక్కేది కాదు. రెండు రోజులుగా ఎండలు బాగా కాయడంతో శొంఠ్యాం రోడ్డులోని భైరవవాక వద్ద ఈ నెల 26వ తేదీ సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో తోటచుక్క భూమిని రాసుకుని వెళ్తుండగా భవ్య తన కెమెరాతో బంధించింది. క్షణాల్లో ఇలా కనిపించి మాయమైన తోకచుక్కను తన కెమెరాలో బంధించినందుకు ఆమె ఆనందం వ్యక్తం చేశారు. -
ఆకాశంలో బ్లాక్ రింగ్.. ఏలియన్స్ వచ్చేశారు!
లాహోర్ : పాకిస్తాన్‌లోని లాహోర్ ఆకాశంలో వింత ఘటన చోటు చేసుకుంది. నల్లరంగులో ఉన్న వింత ఆకారం ఒకటి ఆకాశంలో తేలియాడుతూ కనిపించింది. మేఘం మాదిరి గగనతలంలో తేలియాడుతున్న బ్లాక్ రింగ్‌ను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాలుష్యం కారణంగా బ్లాక్ రింగ్ ఏర్పడిందని కొందరు పేర్కొనగా.. వినాశనానికే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు. మానవుడు చేస్తున్న కాలుష్యం వల్లే ఆకాశంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఇంకొంత మంది నెటిజన్లు పేర్కొన్నారు. లాహోర్‌లో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చడం వల్లే పొగ అంతా వలయాకారంలో మారి ఆకాశంలో తేలియాడుతున్నదని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక మరి కొంతమంది నెటిజన్లు ఈ వీడియోపై తమదైనశైలిలో కామెంట్లు చేస్తు జోకులు పేలుస్తున్నారు ‘ ఇది కచ్చితంగా ఏలియన్స్ పనే.. వాళ్లు వచ్చేస్తున్నారు’, ఏలియన్స్ పాకిస్తాన్‌లోని వెళ్లరు. కచ్చితంగా వారు అమెరికాలోనే ల్యాండ్ అవుతారు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
సూర్యగ్రహణం కనువిందు
-
ముగిసిన సూర్యగ్రహణం
సాక్షి, హైదరాబాద్: దాదాపు మూడు గంటలపాటు కొనసాగిన సూర్యగ్రహణం ముగిసింది. నేటి (గురువారం) ఉదయం 8 గంటల 8నిమిషాలకు ప్రారంభమైన గ్రహణం.. ఉదయం 11 గంటల 11నిమిషాలకు వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సప్తవర్ణాలతో సూర్యుడు వీక్షకులకు కనువిందు చేశాడు. పలుచోట్ల జాగ్రత్తలు పాటిస్తూ.. అంతరిక్ష ఔత్సాహికులు సూర్యగ్రహాణాన్ని వీక్షించారు. మూలా నక్షత్రం ధనుస్సు రాశిలో ఈ కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ ఏడాదిలో ఇది మూడో సూర్యగ్రహణం. మూడు గంటలకుపైగా గ్రహణం కొనసాగుతుంది. భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్, సౌదీ, సింగపూర్ దేశాల్లో సూర్యగ్రహణం కనిపిస్తోంది. సంపూర్ణ గ్రహణం సమయంలో రింగ్ ఆఫ్ ఫైర్‌గా సూర్యగ్రహణం కనువిందు చేయనుంది. ఆ సమయంలో చందమామ చుట్టూ సూర్యజ్వాలలు కనిపించనున్నాయి. హైదరాబాద్‌లో ముప్పావు వంతు మాత్రమే సూర్యగ్రహణం కనిపిస్తుంది. కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేస్తోంది. కోయంబత్తూర్, పాలక్కాడ్, మంగుళూరు, పిళికుల్ల, ఉడిపి ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక, తెలుగు రాష్ట్రాల్లో సూర్యగ్రహణం పాక్షికంగానే కనిపించనుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో సూర్యగ్రహణ ప్రభావం అంతగా ఉండదు. ఈ ఏడాదికాలంలో ఇది మూడో సూర్యగ్రహణం. తిరిగి తెరుచుకోనున్న ఆలయాలు సూర్యగ్రహణం ముగియడంతో సంప్రోక్షణ అనంతరం తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు తిరిగి తెరుచుకోనున్నాయి. సూర్యగ్రహణం సందర్భంగా బుధవారం రాత్రి 11 గంటలకు శాస్త్రోక్తంగా తిరుమల శ్రీవారి ఆలయ తలుపులను మూసివేశారు. 13 గంటలపాటు మూసివేసిన శ్రీవారి ఆలయ తలుపులు మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి తెరుచుకోనున్నాయి. ఆలయ సంప్రోక్షణ అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు భక్తుల కోసం శ్రీవారి సర్వదర్శనం ప్రారంభం కానుంది. అధిక రద్దీ నేపథ్యంలో సర్వదర్శనం మినహా అన్ని దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. వీఐపీ బ్రేక్ దర్శనాలు, ప్రోటోకాల్ దర్శనాలనూ పూర్తిగా రద్దు చేసింది. సూర్యగ్రహణం సందర్భంగా నేడు తిరుప్పావడ, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. సూర్యగ్రహణం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం ఆలయాన్ని మూసివేశారు. నిన్నరాత్రి 8 గంటల నుంచి దర్శనాలు నిలిపివేశారు. ఇవాళ ఆలయ శుద్ధి అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరవనున్నట్లు అధికారులు తెలిపారు. 3 గంటల నుంచి వ్రతాలు, దర్శనాలు యథావిధిగా జరుగుతాయని వెల్లడించారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని సైతం అర్చకులు మూసివేశారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఆలయాన్ని అర్చకులు తిరిగి తెరవనున్నారు. సంప్రోక్షణ అనంతరం 3:30 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు. పాలకొల్లులోని పంచారామ క్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయాన్ని, చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయాన్ని మూసిశారు. గ్రహణానంతరం సంప్రోక్షణ నిర్వహించి.. ఈ ఆలయాలు తిరిగి తెరువనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆత్మతత్త్వమే దైవత్వం
‘ముండకోపనిషత్తు‘లో చెప్పినట్లుగా ప్రాణం, ఇంద్రియాలు, ఆకాశం, గాలి, నిప్పు, నీరు, భూమి భగవంతునిలో రూపుదిద్దుకున్నాయి. ఆ రూపాల్లో అతనే నిబిడీకృతమై ఉన్నాడు. అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు ఎక్కడైనా పదార్థం పుడుతుంది.అవి తిరిగి శక్తిని వెదజల్లుతూ పదార్థ రూపాన్ని కోల్పోతాయి.ఉదహరణకు కర్రను తీసుకుని, జ్వలింపజేస్తే ఉష్ణం, కాంతి, శబ్దం, వాయువు తదితరాలుగా విఘటనం చెందుతూ వివిధ శక్తి రూపాలలోకి మారిపోతుంది.జీవ పదార్థాలు పంచభూతాల మేలిమి కలయిక అనుకున్నాం. ఉదాహరణకు నాచును తీసుకుంటే, సముద్రం లోపల కాంతి ప్రసరించే స్థలంలోనే నాచు ఏర్పడుతుంది. అక్కడే ఏర్పడటానికి కారణం సూర్యరశ్మి, జలం, భూమి, వాయువు, వీటిలో అంతర్లీనంగా ఉన్న ఆకాశం. ఇదే విషయాన్ని భౌతిక పదార్థాలు, శక్తుల విషయంలో అన్వయించుకుంటే, విద్యుచ్ఛక్తి ప్రసరిస్తేనే బల్బులు వెలుగుతాయి. విద్యుచ్ఛక్తి ఆగిపోతే బల్బులు వెలగడం మానేస్తాయి. విద్యుచ్ఛక్తి, బల్బులు అనేవి భౌతిక పదార్థాలైన నిర్జీవాలు.కానీ, జీవి విషయంలో విద్యుచ్ఛక్తి లాంటి శక్తి జీవి జీర్ణాశయంలో తయారౌతూ ఉంటుంది.ఆ శక్తి ప్రసారం కావడానికి రక్తం లాంటి అవయవాలు తోడ్పడతాయి.బల్బులో ఫిలమెంట్ తెగిపోతే వెలగదు. అలాగే జీవిలో ముఖ్య అవయవాలు పనిచేయకపోతే ప్రాణం నిలవదు. అంతేగాని, ప్రాణం ఎక్కడికో వెళ్లదు. అది ఒకానొక శక్తిరూపం.‘కేనోపనిషత్తు‘ మెరుపులోనున్న శక్తిలో, జీవిలోనున్న ప్రాణశక్తిలో ఉన్నది ఆత్మేకదా అంటుంది. ప్రాణం అనేది విద్యుచ్ఛక్తి, కాంతి శక్తి, ఉష్ణశక్తుల లాంటి ఒకానొక శక్తిరూపం మాత్రమే. అది శరీరమనే పదార్థంలో నిండుగా ఉంటుంది. ఇక్కడ శరీరమే ప్రాణశక్తిని తయారు చేసుకుని జీవనం సాగిస్తుంది. ముదిమిలో అలసిన శరీరం ప్రాణశక్తిని సృష్టించుకోలేక నిశ్చలమైపోయి, పంచ భూతాలుగా విఘటనం చెందుతుంది. అంతేగాని, ప్రతీ జీవికో ప్రత్యేక ఆత్మ అనేది ఉండదు. కర్మఫలాలను మన ప్రాణం మోసుకెళ్లలేదు. ఈ ఆత్మజ్ఞానం తెలుసుకున్న సాధకుడు తనలోని అంతర్యామి, తనను ఆవరించి ఉన్న సర్వాంతర్యామి అభేదమని గుర్తెరిగి తోటిజీవులన్నింటి పట్లా ప్రేమను, ఆరాధ్య భావననూ కలిగి, ఆనందాన్ని గ్రోలుతూ ఉంటాడు. – గిరిధర్ రావుల -
అతడు గోదారి ఎదురీదాడు
రేయ్... ఆగండి.... ఎంత దూరమని పరుగులెడతారు. చుట్టు తిరిగి మళ్లీ ఇక్కడకు రావాల్సిందే కదా. వయసు తాపాలు వద్దు, ప్రేమ పాశాలు వద్దు. మోహాలు...ప్రేమలు ...వద్దు. జీవించడం ప్రధానం. వేట కొడవళ్ళు కక్కుళ్ళు పెట్టి నునుపుదేరి ఉన్నాయి. గండ్ర గొడ్డళ్ళు కొలిమిలో కాగి కాగి పదునుతేరి ఉన్నాయి. దానికి తోడు అడ్డంగా నరికేసే ఆత్మాభిమానాలున్నాయి. కుల జాడ్యాలున్నాయి. కాస్త నిగ్రహం పాటించండి, లోకం మారే దాకా, జనం జట్టు కట్టే దాకా. అయినా...ఆగరా...మీ మాట మీదేనా...ఎవరి మాటా వినరా....అయితే ...అయితే.... మీ ఇష్టం...మీ ప్రారబ్ధం. గోదావరి సుడులు తిరుగుతూ ప్రవహిస్తోంది. పడవ అటూ ఇటూ ఊగుతోంది. ఎదురీదుతున్నట్లుగా సాగుతోంది. కాసేపు ఎండా మరికాసేపు వాన. వాతావరణం గమ్మత్తుగా ఉంది. ఇది విహారం కాదు. వేట ముఖ్యం. బతుకు తెరువు ముఖ్యం. బండి లాగించడం ముఖ్యం. ముగ్గురున్నారు పడవలో. రామచంద్రం, సత్య, శివుడు.దూసుకెళ్తున్న పడవ నీటిని అడ్డంగా కోస్తూంది. నీటి ముక్కలు తెల్లటి నురగలుగా తెగి పడుతున్నాయి. చితికి పరిగెలు ఎగిరెగిరి పడుతున్నట్టుగా ఉంది. దూది పింజెలు చెల్లాచెదురుగా ఎగురుతున్నట్టుగా ఉంది. శివుడు తదేకంగా చూస్తున్నాడు. అమ్మా నాన్నలతో యుద్ధం చేసి వచ్చాడు వేటకు. పెద్ద పేచీ పెట్టి పంతం నెగ్గించుకుని వచ్చాడు. సరదా తీరింది. కళ్ళు సలుపుతున్నాయి. కాళ్ళు నెప్పెడుతున్నాయి. ఉన్నట్టుండి ఆకాశంలో గురక పెడుతున్న చప్పుడు. అల్లంత దూరాన విమానం. తడిగా ఉన్న లాగు ఒంటి మీద ఉండగానే పిండుకున్నాడు. చూపు మాత్రం ఆకాశం పైనే. సరిగ్గా నెత్తి మీదకు రాగానే అడిగాడు.‘‘అందులో నిజంగా మనుషులుంటారా? భయం ఉండదా? నేనెప్పుడైనా అలాంటి పడవలో ఎక్కి కూర్చుంటానా? ’’ ‘‘అది పడవ కాదురా ..ఇమానం...ఇమానం. ఒరేయ్... నాయనా... లాగు విప్పేసి పిండుకోరా... గోదారి మధ్యలో ఉన్నాం. నీకేటి సిగ్గు? ఇందాకటి పాడు వాన... సడీ సప్పుడు లేకుండా వచ్చి కుమ్మరించేసింది... ముందా బట్టలిప్పుకో... ప్రతి దానికీ తయారవుతావు. సెప్పింది ఇనవు కదా ’’ అని విసుగ్గా అంది సత్య.‘‘విమానమని నాకు తెల్దేంటీ? ఊరికే పడవన్నాను’’ చిరాగ్గా ముఖం పెట్టి అన్నాడు శివుడు. దూరంగా చిన్న చుక్కలా కనిపిస్తోంది విమానం. బొటనవేలు, చూపుడువేలు గుండ్రంగా చుట్టి అందులోంచి విమానం చుక్కను చూస్తున్నాడు శివుడు. చిన్నగా ఉంది. అమ్మ చేత ఇక బతిమాలించుకోలేదు. గబగబా బట్టలు విడిచి దిశమొలతో నిలబడ్డాడు. ఈసారి ఆకాశంలో బారులు కట్టిన పక్షులు. వాటికేసి చూస్తూ అలాగే నిలబడ్డాడు. ‘‘ఈవేళ్టికి చాల్లే సంబడం. బేగి తెవిలితే మంచిది. ఈయేళ అచ్చి రాలేదు. సేపలు గీపలు లేవు గానీ కాళ్ళు తీట పుడుతున్నాయి. పొద్దెక్కింది. ఇక వెనక్కి తిప్పు....’’ మొగుడుతో అంది సత్య. గొంతులో నిరాశ. చెంబు లోంచి మంచినీళ్ళు గొంతు లోకి వొంపుకుంది. ‘‘వండుకున్నమ్మ తినక మానదు. కడుపుతో ఉన్నమ్మ కనక మానదు. ఇంటికి పోక ఇక్కడే నీటిలో గుండ్రంగా తిరుగుతూ ఏటెల్ల కాలం ఉండిపోతామా, ఏటి? వొక అంచు వలేసి చూద్దారి...కంగారు పడితే ఎలా? కాసింత నిదానం ఉండాలి’’ అన్నాడు రామచంద్రం చుట్టూ గోదారిని నిశితంగా చూస్తూ. శివుడు ఒబ్బిడిగా వల పట్టుకుని అందివ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకో వాడికి ఇప్పటికిప్పుడే ఇంటికి వెళదామని లేదు. మళ్ళీ ఎప్పటికో గానీ తీసుకెళ్ళరు. ‘‘మనోడు గట్టోడే. ఏదైనా అంటే చాలు చిటికెలో తయారయిపోతాడు. అయినా గానీ సేప పిల్లకి ఈత నేర్పాలా?’’‘‘అసుమంటి కబుర్లు చెప్పమాకు. నా కొడుకు ఈ పని సస్తే చేయడు. సక్కగా సదువుకుని కలకటేరు అవుతాడు...ఏరా అబ్బిగా....’’ అంది మురిపెంగా సత్య కొడుకు కేసి చూస్తూ. తలూపాడు శివుడు. ఎండలో మెరుస్తూ రోడ్డు మీద గాంధీ వేషం వేసుకున్న కుర్రాడిలా ఉన్నాడు శివుడు. ‘‘రోజులీయాల్లా ఉండవులే... మనోడికి సదువొచ్చి మీద పడాలే గానీ నేనేమైనా కాదంటానా?’’ వలలో ఏదో పడినట్లుగా బరువుగా తోచి ‘‘ఇలా రాయే....’’ అంటూ అరిచాడు రామచంద్రం. పడింది పండుగొప్ప. అనుకోని అదృష్టం. ‘‘బాబిగాడొచ్చిన యేలా విసేసం’’ శివుడు ఆసక్తిగా చూస్తున్నాడు. సత్య ఆశగా చూస్తోంది. రామచంద్రం తృప్తిగా చూస్తున్నాడు. గోదారి పాయ.దక్షిణం నుండి ఉత్తరం వైపుకు పారే కోరింగ నది. ఉధృతంగా పరవళ్ళు తొక్కుతూ విశాల ఆవరణంలోంచి సన్నని ఇరుకు సందులోకి వచ్చి గడిబిడిగా... పరుగులు తీస్తోంది. దాని వేగం భయం కలిగించేలాఉంది. కట్టలు తెంచుకుని ప్రవహిస్తే ఇంక ఏమైనా ఉందా? నదీ పాయ దిగువన మంచి పారు మీద వరిచేలున్నాయి. పొట్ట మీద ఉండి ఆకుపచ్చని తివాసీ పరిచినట్లుండే పొలాలు ఏమౌతాయో? ముంపుకు గురయితే నీరు దిగే అవకాశం లేని పంట పొలాల గతి ఊహించడం కష్టం. నీటిని కట్టడి చేయడానికి పెద్ద పెద్ద తలుపులు బిగించి టైడల్ లాక్ ఏర్పాటు చేశారు. ఏ కారణం చేతనైనా అవి కొట్టుకుని పోతే తప్ప ప్రస్తుతం ఇబ్బంది లేదు. దానికి సమీపంలో మర్రిచెట్టు. దాని చుట్టూరా సిమెంటు చప్టా కట్టారు. ఊళ్ళో జనం ఊసులాడుకోడానికి అనువైన అడ్డా అది. సాయంత్రం సమయంలో అంతా చేరతారు భైరవస్వామి కబుర్లూ, కతలూ వినడానికి. అర్ధరాత్రి దాక ఒకటే కబుర్లు. ఊళ్ళో విషయాలన్నీ వాళ్ళకే కావాలి. భైరవస్వామి వయసు ఎనభై ఏళ్ళు. ఎర్రగా ఉంటాడు. తెల్లటి జుట్టు. పొట్టిగా ఉంటాడు. గట్టివాడే. హుషారుగా మాట్లాడతాడు. మాటల పోగు. మనిషిలో దిగులుండదు. సమస్యలున్నట్టు అనిపించదు. ఒకవేళ ఉన్నా తెలియనీయడు. లౌక్యం తెలిసినవాడు. చెట్టు మొదలు గోనెసంచి పరుచుకుని కూర్చుంటాడు భైరవస్వామి. పొగాకు కాడ చీల్చి చుట్టలు చుట్టుకుంటాడు.నోరు ఊరుకోదు. అనుభవం రంగరించి లోకం తీరు గురించి మనుషుల మనస్తత్వాల గురించి చెబుతాడు. మంచీ చెడూ మాట్లాడతాడు. ఎవరినీ నొప్పించడానికి ప్రయత్నించడు. కానీ కోపం వస్తే పట్టుకోలేం.వీరావేశంతో ఊగిపోతాడు. ఊళ్ళో వాళ్ళు భైరవస్వామిని గౌరవిస్తారు. శ్రద్ధగా వింటారు. దినపత్రికల్లో వచ్చే వార్తలు చదివి దేశంలో ఏ మూల ఏ సంఘటన జరిగినా చెబుతాడు. టీవీ కథనాల గురించీ ముచ్చటిస్తాడు. జీవితమంతా నాగరిక ప్రపంచంలో మసిలి వచ్చినవాడు. స్పష్టంగా మంచి భాష మాట్లాడతాడు. రచ్చబండకు దగ్గర్లోనే మహాప్రస్థానం పేరున శ్మశానం ఉంది. శవ దహనం సమయంలో అయితే భైరవస్వామి వేదాంత తత్వాలు పాడతాడు. జీవన సత్యాలు పలుకుతాడు. చావు పుట్టుకల మర్మం విప్పుతాడు. సాయం సంధ్య. చల్లగా గాలి వీస్తోంది. ఆవేళ భైరవస్వామి కాస్త నలతగా ఉన్నాడు. వచ్చీపోయే నాల్ని చూస్తూ కూర్చున్నాడు. అదే సమయంలో శివుడు ఆ దారిన వస్తున్నాడు. దగ్గరకు రమ్మని పిలిచాడు. భైరవస్వామికి శివుడంటే చాలా ఇష్టం. అతడ్ని చూడగానే ఎక్కడలేని ఓపిక వచ్చేసింది. భైరవస్వామితాతకు తల వంచి నమస్కారాలు చెప్పి పాదాలు ముట్టుకున్నాడు శివుడు. ‘‘చాలా సంతోషం నాయనా... మీ నాన్న రామచంద్రం సంబరపడుతూ చెప్పాడు. వాడు ఎంతో ఇదిగా పొంగిపోతున్నాడు. బిడ్డల ఎదుగుదల తండ్రికి ఆనందమే కదా. వాడొక్కడితో సరిపోయిందా? మన పేటోళ్ళంతా గొప్పలు చెప్పుకుంటూ గెంతులేస్తున్నారు. ఇప్పుడేం చేస్తావు, బాబూ...’’ భైరవస్వామి కళ్ళలో వెలుగులు నింపుకుని అడిగాడు. ‘‘కోచింగు తీసుకుంటున్నాను, తాతా... ఐ.ఎ.ఎస్ రాస్తాను. మళ్ళీ ఊరికి రావడం ఇప్పట్లో కుదరదని అమ్మా నాన్నలను చూడ్డానికి వస్తున్నాను ’’ అన్నాడు వినయంగా శివుడు.భైరవస్వామి ఒక్క క్షణం ఆలోచనల్లో పడ్డాడు. తల గోక్కున్నాడు. దగ్గర కూర్చోబెట్టుకున్నాడు.భుజం మీద చేయి వేసి గుచ్చినట్టు గట్టిగా నొక్కి వదిలాడు. లోపలికి గాఢంగా ఊపిరి పీల్చుకుని వదిలాడు. తాత ఏదో ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాడని అర్థమైంది శివుడికి. ఆయన చెప్పబోయే దానికోసం ఎదురుచూస్తున్నాడు.‘‘మన జాతిలో నీ అంత తెలివైనవాడు మరొకడు లేడురా... పదోతరగతి మొదలు అన్నింటా మొదటోడిగా చదువుతున్నావు. నీవు అనుకున్నది కచ్చితంగా సాధించి తీరతావు. అందులో ఈసమెత్తు అనుమానం లేదు. కానీ... ఒరేయ్.... మీ నాన్న కష్టం చూడాలి. చేపల వేట గిట్టుబాటు కావడం లేదని నీకోసం రాత్రింబవళ్లు ఇసుక తవ్వుకి కూడా పోతున్నాడు. నిన్ను ప్రయోజకుడ్ని చేయాలనేది వాడి తాపత్రయం. మీ అమ్మా అంతే. వాళ్ళ కష్టం ఊరికే పోదు. ఇపుడు నీకో పాలి ఓ మాట చెప్పాలి... వింటావా? ’’ భైరవస్వామి అడిగాడు సూటిగా శివుడి కేసి చూస్తూ. ‘‘అలాగే చెప్పండి. పెద్దలు అంతా మంచికే చెబుతారు. చెప్పండి, తాతా? ’’ నవ్వుతూ అన్నాడు శివుడు. ‘‘నన్ను అర్థం చేసుకోగలవు. ఆ జ్ఞానం నీకుందని నాకు తెలుసు. అందుకే చెబుతున్నాను. ఒరేయ్... శివుడూ... నీకెలాగూ మంచి ఉద్యోగమే తప్పక వస్తుంది. అది దేవుడు ఎప్పుడో రాసేశాడు. దానికి తిరుగులేదు. నువ్వు ఈ మట్టిలో పుట్టిన మాణిక్యానివి. అసలు సంగతేమిటంటే నీవు కులం లోని పిల్లనే పెళ్ళాడాలి. నిన్ను ఏ అగ్రకులం పిల్లో వల పన్ని ఎగరేసుకుపోకూడదు. నీ జీవిత వైభోగమంతా కులం పిల్లే పొందాలి. ఎవడైనా ఎదిగాక పుట్టినచోటునీ జాతినీ మరచిపోకూడదు రా..’’ అన్నాడు. అంత దాక ఆవహించిన నీరసం భైరవస్వామిలో ఇప్పుడు మచ్చుకి కూడా లేదు. ‘‘మీ మాటలు గుర్తుంచుకుంటాను, తాతా ... అయినా ఇంకా ఏమైంది... మొదటి మెట్టు మీదే ఉన్నాను’’ అంటూ లేచాడు శివుడు వెళ్లడానికి సిద్ధపడుతూ. ‘‘ఒక్క క్షణం ఆగు... కొన్ని వార్తలు వింటుంటే నా ఒళ్ళు కుతకుతలాడిపోతోంది. ఇంతకష్టపడి తీర్చిదిద్దుకున్న ఫలం ఇంకొకళ్ళు దోచుకుపోతుంటే నాలాంటి వాడు ఉసూరుమంటాడు. వెన్ను లోంచి బాధ తన్నుకొస్తాది ’’అంతలోనే భైరవస్వామి స్వరం మారింది. గొంతులో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ‘‘అలాంటిది మన ఊళ్ళో జరిగితే ఊరుకునేది లేదు. కుల పంచాయితీ పెట్టి ఏం చేయాలో ఆలోచిస్తాం. ఇదిగో అబ్బాయ్... ఆ తర్వాత బాధపడి ప్రయోజనం లేదు... నా మాటను వేళాకోళంగా తీసుకోవద్దు’’అన్నాడు. భైరవస్వామి అంతే. ఉన్నట్టుండి ఒక్కసారిగా మాట్లాడే ధోరణి మారిపోతుంది. ‘‘అలాగే తాతా...’’ వినమ్రంగా అని శివుడు ఊరివైపుకు అడుగులేశాడు. పదడుగులేసి వెనక్కి తిరిగి చూశాడు.అక్కడున్న నలుగురూ చప్పట్లు కొడుతున్నారు. భైరవస్వామి తృప్తిగా తల ఎగరేసి నవ్వుతున్నాడు. నాలుగేళ్ళ కాలం గిర్రున తిరిగిపోయింది. జాతీయ స్థాయిలో శివుడికి ఐదో ర్యాంకు వచ్చింది.దినపత్రికల మొదటి పేజీల్లో ఫొటోతో సహా ప్రముఖంగా ప్రచురించారు. ఊరూ వాడా సంబరాల్లో మునిగిపోయింది. ఊరు కాంతి దిశదశలా వెలుగులు జిమ్ముతోంది. కొడుకు ఫొటో ఉన్న పేపరు చంకలో పెట్టుకుని ఇంటింటికీ తిరిగి చూపిస్తున్నాడు రామచంద్రం. విషయం తెలిసింది మొదలు మొగుడూ పెళ్ళాలు ఏదో లోకంలో విహరిస్తున్నట్లుగానే ఉన్నారు. విలేకర్లు మూకుమ్మడిగా ఊళ్ళోకి వచ్చి ఏవేవే ప్రశ్నలు వేస్తున్నారు. ఉన్నంతలో మంచి బట్టలేసుకుని సమాధానాలు ఇస్తున్నారు. చిన్నప్పట్నుంచీ శివుడికి చదువంటే ఉండే శ్రద్ధ గురించి చెబుతున్నారు వాళ్ళదైన భాషలో. ఊళ్ళో మనిషి కలెక్టరు కావడం అంటే మాటలా? శిక్షణాకాలం పూర్తయ్యింది. మరో ఏడాదిన్నర ఇట్టే గడిచింది. ఉద్యోగ నిర్వహణకు సంబంధించిన తర్పీదూ పూర్తయ్యింది. శివుడి ఆలోచనలు గోదారి తరంగాల్లా ఒకచోట నిలబడటం లేదు. మాట్లాడేవాడెవరో తెలీదు. మాట్లాడుతున్నాడు.అంతలోనే పాట పాడుతున్నాడు. పాట సారాంశం ఏదో సందేశం ఇస్తున్నట్లుగానే ఉంది. మంద్రస్థాయిలో వినబడుతోంది. భాష మటుక్కి ఖచ్చితంగా తెలుగే. కాదు. మరేదో. అయినా భావం మాత్రం తెలిసిపోతోంది. ప్రత్యేకమైన వ్యక్తిలా ఉన్నాడు. దుస్తులు చిత్రంగా ఉన్నాయి. చిరిగిన బట్టల మీద మాసిన కోటు వేసుకున్నాడు. అయిదు అడుగులు కంటే పొడుగుండడు. దవడలు వేలాడుతున్నాయి. గెడ్డం పెరిగి ఉంది. జుట్టు తైలసంస్కారం లేక అట్ట కట్టింది. కళ్ళజోడు ఉంది. వాటికి అద్దాలు లేవు. తనని చూసి దగ్గరకు వస్తున్నాడు. అయినా ఆనవాలు తెలియడం లేదు. చల్లని చూపు మెత్తగా తగిలింది. అది కొండంత అభిమానాన్ని చూపుతున్నది. ఇంకా దగ్గరకు వచ్చేస్తున్నాడు. సూటిగా కళ్ళలోకి చూస్తున్నాడు. ఉహూ(... గుర్తుపట్టడం కష్టంగానే ఉంది. అనునయంగా ఏదో చెబుతున్నాడు. ఒక్క ముక్క అర్థం కావడంలేదు. ముక్కు మీద వేలేసుకుని మంత్రాలు చదివినట్లుగా రాగం తీస్తున్నాడు. భుజం మీద చేయి వేశాడు. స్పర్శ గిలిగింతలు పెట్టింది. భుజం గట్టిగా గుచ్చినట్టు నొక్కి వదిలాడు. ఆత్మీయ స్పర్శ.అంతే... తెలిసిపోయింది. జీర గొంతు. వణుకుతున్న స్వరం లోంచి మాటలు జారుతున్నాయి. మరచిపోయిందేదో గుర్తు చేస్తున్న అలికిడి. జ్ఞాపకాల తేనెతుట్ట రేగింది. ఇక సమస్తం అర్థమైపోయింది.సరిగ్గా అప్పుడే కుక్కలు గందరగోళంగా మొరుగుతున్నాయి, కాలభైరవుని మేల్కొలుపులా. వెంటనే మెలకువ వచ్చేసింది. తక్షణం చేయాల్సిన పని గుర్తుకొచ్చింది. దిగ్గున లేచాడు. మర్నాడు శ్రీలతను కలిశాడు. శ్రీలత తనతోబాటు శిక్షణ పొందింది. ‘‘సమస్యొకటి మీద పడింది. పరిష్కారం నాకు తెలుసు. నా చేతిలోనే ఉంది. మనకేమీ ఇబ్బంది లేదు. అంతా సజావుగా జరుగుతుంది.అందులో సందేహం లేదు. అయినానీకు చెప్పాలి. చెప్పకుండా ఉండలేను’’ అని మొత్తం చెప్పేశాడు. శ్రీలత తేలిగ్గా తీసుకుంది. కంగారుపడలేదు. గుండెలు బాదుకోలేదు. గగ్గోలు పెట్టలేదు. ఇంత అన్యాయం చేస్తావా అని నిలదీయలేదు. ప్రసన్నంగా నవ్వింది. చదువు నేర్పిన సంస్కారం. లోకం తీరు బాగా ఎరిగిన మేధ. ఉదాత్త ఆలోచనల పోగు. ‘‘తప్పుగా ప్రవర్తించకు. నీవు కులం వాళ్ళ మాట విను.పెద్దలు చెప్పినట్టు మసులుకో. పర్వాలేదు. సర్దుకోగలను. అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. నీవు చెప్పడం మంచిదే. ఈ రోజు నుండి మనం మంచి స్నేహితులం’’ అంది శ్రీలత ఏవిధమైన ఉద్వేగం కనిపించనీయకుండా. కళ్ళు తడిగా ఉన్నాయి. ముఖం నవ్వుతూనే ఉంది. జీవితం సవాలు విసిరినపుడు నిబ్బరంగా ఎదుర్కోవాలి. నచ్చచెప్పాల్సిన వాళ్ళకు నచ్చచెప్పాడు. బతిమాలాల్సిన వాళ్ళను బతిమాలాడు. నదిని దాటి గమ్యం చేరాలంటే కొన్నిసార్లు ఎదురీదాలి. ఎన్నో ‘నేను’ల సమూహం సంఘం. ఒక్క ‘నేను’ విడివడి ఎదురీదాలి. శివుడు వాలులో కొట్టుకు పోలేదు. ఎదురీదాడు. ఆఖరుగా ఎదిరించాల్సిన వాళ్ళను ఎదిరించాడు. గోదారి ఎప్పటిలాగే పాటు పోటులతో సందడిగా ఉంది. దాట్ల దేవదానంరాజు -
అవని ఎరుపు .. ధరణి మైమరపు
నీలి మేఘానికి కోపమొచ్చిందో ఏమో.. బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ఎరుపెక్కింది. సూరీడు అస్తమిస్తున్న సమయంలో మేఘం ఎరుపు రంగులోకి మారిపోయింది. పోర్టు ట్రస్టు ఆవరణలో ఉన్న నీటిలో ఆ ప్రతిబింబం పడటంతో.. ఆ వాతావరణమంతా రుధిరవర్ణంలోకి మారిపోయింది. ఆ సమయంలో పోర్టు కూలీలు పనులు చేస్తుండగా.. ఈ వర్ణ దృశ్యాన్ని సాక్షి కెమేరా క్లిక్‌మనిపించింది. ఫొటో : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
ఆకాశంలో అరోరా..
మందస: ఆకాశంలో అద్భుతం కనిపించింది. రాత్రివేళల్లో తోక చుక్క భూమి మీద రాలే విధంగా దర్శనమిచ్చింది. ధ్రువ ప్రాంతాల్లో మాత్రమే ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని అరోరా అంటారని సైన్స్ ఉపాధ్యాయుడు పాత్రుని లక్ష్మణరావు తెలిపారు. ధ్రువ ప్రాంతాల్లో కాంతి పరిక్షేపణం వల్ల ఆకాశంలో మేఘాలు వివిధ రంగులు కనిపిస్తాయని వివరించారు. -
ఆకాశానికి పక్షుల హారం!
నీలాకాశంలో కనువిందు చేసే దృశ్యాలు ఎన్నెన్నో.. ప్రస్తుతం వరికోతలు జరుగుతుండటంతో ధాన్యం కోసం ప్రతి రోజు ఉదయం పయనమైన పక్షులు తిరిగి సాయంత్రం గూళ్లకు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో నంద్యాల– మహానంది రహదారిలో శుక్రవారం సాయంత్రం కనిపించిన దృశ్యాలు ఇవీ. - మహానంది -
గులాబీ ఆకాశం
మండల కేంద్రమైన సి.బెళగల్లో ఆదివారం ఉదయం ఆరుగంటల సమయంలో ఆకాశం గులాబి వర్ణంలో కనువిందు చేసింది. సరిగ్గా సూర్యోదయ సమయంలో ఈ దృశ్యం చోటు చేసుకుంది. ఆకాశం ఆహ్లాదకరంగా మారటంతో స్థానికులు సెల్ ఫోనులలో ఆ దృశ్యాలను బంధించారు. - సి.బెళగల్ -
వెలుగులీనిన నిండు చంద్రుడు
ప్రతి పౌర్ణమీ ఓ అద్భుత సృష్టే ! ఇంతటి అద్భుతానికి కేంద్రబిందువైన చంద్రుడు.. మనకు అత్యంత సమీపంలో ఉన్నట్లుగా కనిపిస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది కదూ! ఇలాంటి అద్భుతం సోమవారం వినీలాకాశంలో ఆవిష్కృతమైంది. 1948 తర్వాత చంద్రుడు అతిపెద్దగా, మనుపటి కంటే ఎక్కువ వెలుగులు ప్రసరిస్తూ కార్తీక పౌర్ణమి నాడు దర్శనమిచ్చాడు. ఈ దృశ్యాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
పోరాటాల ఖిల్లా..
నిజాం రాజుల ఆగడాలను ఎదురించిన వీరులనుగన్న జన్మభూమి.. నక్సల్ బరి ఉద్యమానికి ఊతమిచ్చి.. భూస్వామ్య పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన పోరుగడ్డ.. నాడు నల్లగొండ జిల్లాలో అంతర్భాగమై.. నేడు రెండు వందల గ్రామాలకు ప్రధాన వ్యాపార కేంద్రంగా విలసిల్లుతూ ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ దినదిన ప్రవర్థమానంగా వెలుగొందుతోంది జనగామ జిల్లా. ఎన్నో అవాంతరాలు.. మరెన్నో అడ్డంకులు ఎదురైనప్పటికీ మొక్కవోని దీక్షతో ముందుకుసాగి సొంత జిల్లా కలను సాకారం చేసుకుని ఇక్కడి ప్రజలు జయహో అంటూ నినదించారు. ఆర్థిక, సామాజిక వనరులు కలిగిన ఈ ప్రాంతం జిల్లా గా ఏర్పడడంతో మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నారు. జనగామ: బ్రిటిష్ పాలనలో వ్యాపార, వాణిజ్య, విద్య రం గాలను అభివృద్ధి చేయడంలో జనగామ ప్రాంతానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వందేళ్ల క్రితం ప్రారంభించిన ప్రిస్ట¯ŒS పాఠశాల, మిషనరీ చారిటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల ను రైల్వే మార్గాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని సాగించారు. స్వాతంత్య్రం వచ్చిన ఐదేళ్ల తర్వాత 1952 నవంబర్‌లో జనగామ పట్టణాన్ని జిల్లాలోనే ఏకైక మునిసిపాలిటీగా ఏర్పాటు చేశారు. అయితే మునిసిపాలిటీకి ఆదాయ వనరులు తగ్గిపోవడంతో మధ్యలో మూడేళ్ల పాటు నగర పంచాయతీగా కు దించబడింది. అప్పటి వరకు నల్లగొండ జిల్లా పరిధిలో వరంగల్, ఖమ్మం ప్రాంతాలు కలిసే ఉండేవి. కాగా, మద్రాసు నుంచి విడిపోయి నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ అనంతరం వరంగల్, ఖమ్మం ప్రాంతాలను వేరు చేశారు. ఆ సమయంలోనే నల్లగొండ పరిధిలో ఉన్న జనగామ తాలూకాను వేరు చేయడంతో వరంగల్ జిల్లాలో కలిసి.. దినాదినాభివృద్ధి చెందుతూ జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం జనగామ పట్టణంలో 28 వార్డులు, 1.12 లక్షల జనాభాతో గ్రేడ్–1 మునిసిపాలిటీగా కొనసాగుతుంది. ఆలయాలకు నెలవు.. జనగామ కొత్త జిల్లా ఆలయాలకు నెలవుగా మారనుంది. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం కొమురవెల్లి, మ ద్దూరు మండలం బెక్కల్ రామలింగేశ్వరాలయం, నిజాం రజాకార్లను ఎదిరించిన వీరబైరా¯ŒSపల్లి చరిత్ర జనగామ నుం చి విడిపోయాయి. జిల్లాల విభజనలో భాగంగా కొత్తగా పాలకుర్తి సోమేశ్వరస్వామి, చిల్పూర్‌లోని బుగులు వెంకటేశ్వరస్వామి, దేవరుప్పులలోని మానకొండ లక్ష్మీనర్సింహస్వా మి, లింగాలఘనపురంలోని జీడికల్ సీతారామచంద్రస్వా మి, నవాబుపేటలోని శ్రీకోదండరామస్వామి ఆలయాలతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక చింతనతో విరాజిల్లనుంది. చీట కో డూరులోని కోటిలింగాల పుణ్యక్షేత్రం..పట్టణ ప్రజలకు 365 రోజుల పాటు తాగునీరు అందించే చీటకోడూరు రిజర్వాయర్ జనగామ జిల్లాలోనే ఉండడం గమనార్హం. సాహితీ రంగంలో ప్రత్యేక గుర్తింపు.. కళలకు పుట్టినిల్లు అయిన జనగామ చరిత్ర ప్రపంచ పుటల్లోకి ఎక్కింది. హస్తకళలకు ప్రసిద్ధి గాంచిన పెంబర్తి గ్రామం దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. అమెరికా, లండ¯ŒS, ఆసే్ట్రలి యా, అరబ్ దేశాలతో పాటు పలు ఖండాల్లో ఇక్కడ తయా రు చేసే హస్తకళలకు పేరుంది. ప్రపంచ గుర్తింపు పొందిన ఒగ్గుకథ పితామహుడు చుక్క సత్తెయ్యది కూడా జనగామ ప్రాంతమే. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా ఆయన గండ పెండేరం అందుకుని, ఎన్నో అవార్డులను పొందారు. కాగా, ఐఐటీ ద్వారా ఎందరో విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేసి, ప్రపంచం నలుమూలా ల తన శిషు్యలను తయారు చేసుకున్న చుక్కా రామయ్య పా లకుర్తి మండలం బమ్మెర గ్రామానికి చెందిన వారు కావడం విశేషం. సాహిత్య రంగానికి వన్నెతెచ్చిన పలకనూరి సోమేశ్వర్, బమ్మెర పోతన ఈ ప్రాంతానికి చెందిన వారే. జనగామ జిల్లాలోని మండలాలు.. కొత్తగా ఏర్పాటైన జనగామ జిల్లాలో జనగామ, నర్మెట, లింగాలఘణపురం, బచ్చన్నపేట, తరిగొప్పుల (కొత్త), గుండాల(నల్లగొండ జిల్లా) స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి, జఫర్‌గఢ్, చిల్పూరు(కొత్త), పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పు ల మండలాలు ఉన్నాయి. మొత్తంగా 13 మండలాలతో సుమారు 5,82,457 జనాభాతో జనగామ జిల్లా నూతనంగా ఆవిర్భవించింది. అభివృద్ధిలో పోటీ పడుతూ.. గ్రామంగా ఆవిర్భవించిన జనగామ అభివృద్ధిలో పోటీపడుతూ జిల్లాస్థాయికి ఎదిగింది. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలను కలిపే రైల్వే మార్గం, ఐదు రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ కలిగి ఉన్న రోడ్డు మార్గం జనగామ సొంతం. వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో వంద పడకల ఆస్పత్రికి అనుసంధానంగా చంపక్‌హిల్స్ లో మాతాశిశు సంక్షేమ ఆస్పత్రితో జిల్లాస్థాయి కేడర్‌ను కలిగి ఉంది. విద్య, ఉపాధి రంగాలకు నెలవుగా ఇంజనీరింగ్, ఫార్మసీ, కోచింగ్ సెంటర్లు, కళాశాలలు, నర్సింగ్‌తో పాటు వైద్య రంగంలో కార్పొరేట్ స్థా యి కలిగిన ప్రైవేట్ ఆస్పత్రులతో వరంగల్ తర్వాత జనగామ విద్యాహబ్‌గా విలసిల్లుతోంది. దేశంలోనే ఏకైక పట్టుదారం రోలింగ్ యూనిట్ సెంటర్ ఇక్కడ ఉండడం విశేషం. రైతులు పండించిన సరుకులను భద్రపరుచుకునేందుకు వేల మెట్రిక్ టన్నులు నిల్వ చేసుకునే సామర్థ్యం కలిగిన గోదాంలు, వ్యవసాయ మార్కెట్, కాటన్ యార్డు ఉన్నాయి. రెండు ఫస్ట్ క్లాస్ మెజిసే్ట్రట్ కోర్టులు, సెకండ్ క్లాస్ మెజిసే్ట్రట్, సబ్‌కోర్టు, అడిషనల్ జిల్లా కోర్టుతో పాటు సబ్ జైలు ఉంది. క్రీడాపరంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన మినీ స్టేడియం, మినీట్యాంకు బండ్ ఉంది. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ఇండసీ్ట్రయ ల్, ఐటీ కారిడార్‌తో జనగామకు మరింత ప్రాధాన్యం కలుగనుంది. పది దశాబ్దాల చరిత్ర కలిగిన జనగామ ఘనకీర్తి ప్రచారానికి నోచుకోవడంలేదు. ప్రపంచానికి శాంతి మంత్రాన్ని అందించిన జైనులు జీవించిన ఈ ప్రాంతంలో సజీవ సాక్ష్యాలెన్నో కళ్లెదుటే కని పిస్తున్నా.. నేటి తరానికి అందించే ప్రయత్నం జరగడంలేదు. నల్లగొండ జిల్లా కొలనుపాక రాజధానిగా క్రీ.శ 973లో తెలంగాణను పాలించి న కళ్యాణ చాణక్యులు ఇక్కడ జైన మతాన్ని ఆచరించారు. దేవాలయాలు, విద్యాలయాల ను ని ర్మించి సాక్ష్యాలుగా అనేక శాసనాలు వేయిం చా రు. జనగామ కేంద్రంగా జైనులు వర్తక వ్యా పారం చేస్తూ కాలక్రమేణా ఇక్కడే స్థిర పడ్డారు. ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన కొలనుపాక జైన దేవాలయంతో పాటు మద్దూరు మండలం బైరాపల్లి జైన దేవాలయం (ప్రస్తుత వీరభద్రస్వామి) ఆలయాలు నాటి పూర్వ వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. జనగామ మం డలం ఎల్లంల గ్రామ శివారులో శిథిలమైన జైన యక్ష దేవాలయం గుట్టపై బసది (విడిది కేం ద్రం) బండ్ల గూడెంలోని జైన ఆనవాళ్లు కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. సిద్ధెంకి గుట్టపై ఉన్న ఓ బండరాయిపై వర్ధమాన మహావీరుడు, పా ర్శ్వనాథుడు, జైనయక్షిణి శిల్పలాలు సుందరం గా చెక్కినట్టు కనిపిస్తాయి. గ్రీకు రాయబారి మొ గస్తనీస్ తన రచనల్లో నగ్న సన్యాసులను ఎంతో మందిని తెలంగాణ ప్రాంతంలో చూసినట్లు రా సిన గ్రంథాన్ని ఆంగ్లంలో అనువదించిన ‘మాక్ క్రిండాల్’ అనే పరిశోధకుడు వివరించారు జైనమతాన్ని విస్తరించేందుకు లింగాలఘనపురం మండలం కళ్లెంలో ఆర్యవైశ్యులు భూమిని దా నం ఇచ్చినట్లు అక్కడి శాసనంలో కనిపిస్తుంది. ప్రపంచ పర్యాటక ప్రాంతాలకు తీసిపోని చరిత్ర కలిగిన జనగామకు గురింపు తీసుకొచ్చేందుకు పురావస్తు శాఖ స్పందించాలి. ఇక్కడ మ్యూజి యం ఏర్పాటు చేసి భావితరాలకు నాటి ఘనచరిత్రను తెలియజేసేందుకు చర్యలు తీసుకోవాలి. పర్యాటక అర్హతలున్న ఎల్లంల, బండ్లగూడెం, బండనాగారం, సిద్దెంకి గుట్టలను తీర్చిదిద్దాలి. పారిశ్రామిక అభివృద్ధికి అవకాశాలు హైదరాబాద్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న జనగామ రాబోయే రోజుల్లో అభివృద్ధికి చిరునామాగా మారనుంది. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ఇండసీ్ట్రయల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించిన నేపథ్యంలో జనగామకు సువర్ణ అవకాశం దక్కనుంది. పరిశ్రమల స్థాపనకు జనగామ జిల్లా అన్నింటికి తగిన విధంగా ఉంది. అనుకూల, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునే స్వభావమున్న ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు కు పెట్టుబడిదారులు ఆకర్షితులవుతున్నారు. లింగాలఘణపురం మండలం ఏనె బావి వద్ద గతంలో ప్రభుత్వం 150 ఎకరాల విస్తీర్ణంలో కామోజీ టెక్స్టైల్స్ పా ర్కు ఏర్పాటుకు సన్నాహాలు చేయగా, నాటి ఉమ్మడి ప్రభుత్వం దానిని ఆంధ్ర ప్రాంతానికి తరలించింది. నూతన జిల్లాల విభజన తరుణంలో టెక్స్టైల్స్ పా ర్కు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తే వందలాది కార్మికులు, నిరుగ్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే ఆవకాశం ఉంది. -
ఆకాశాన్ని తాకేలా..
వెంకటాపురం : మండలంలోని నల్లగుంట శివారులో దేవాదుల మొదటి దశకు చెందిన పైపులైన్ గేట్వాల్్వను శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో నీరు 40 అడుగుల ఎత్తులో ఆకాశాన్ని తాకేలా ఎగిసిపడుతోంది. నల్లగుంట సమీపంలోని ఆరె‡కుంట కింద కొందరు రైతులు వరిని సాగు చేస్తున్నారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు దేవాదుల పైపుౖలñ న్ గేట్వాల్్వను తొలగించడంతోపాటు ఫెన్సింగ్ (ఇనుపరాడ్ల)ను ధ్వంసం చేశారు. దీంతో శనివారం అర్ధరాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు నీరు ఆరెకుంటలోకి వెళ్లింది. ఈ విషయమై స్థానిక దేవాదుల సిబ్బంది మొగిలిని ‘సాక్షి’ వివరణ కోరగా.. గేట్వాల్్వను ఎవరో ధ్వంసం చేయడంతో నీరు వృథాగా పోతుందని తెలిపారు. జరిగిన సంఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు ఆయన పేర్కొన్నారు. -
నీలాకాశమా..నీ అందం చూడతరమా!
అందాల ఆవిష్కరణకు క్యాన్వాస్ లాంటింది ఆకాశం. రూపు మారే మేఘాలు, మెరిసే నక్షత్రాలు.. రంగుల హరివిల్లు.. ఇలా ఎన్నో రమణీయ దశ్యాలకు కేరాఫ్. శనివారం సూర్య అస్తమయానికి కొద్ది ముందు ఆకాశం నీలం రంగు మారి ప్రకతి ప్రేమికులను కనువిందు చేసింది. ఈ సమయంలో నీలి మేఘాల కాంతుల్లో కొండారెడ్డి బురుజు వెలిగిపోయింది. ఫొటో: వి. శ్రీనివాసులు, కర్నూలు -
ఎల్లుండి ఉల్కల వర్షం!
వాషింగ్టన్: ఆకాశం నుంచి భూమి వైపుకు దూసుకొస్తున్న ఉల్కలు భూవాతావరణంలోకి రాగానే భగభగమండుతూ అదృశ్యమైపోయే అద్భుత దృశ్యం రెండు రోజుల్లో కనువిందుచేయనుంది. ప్రతీ 133 ఏళ్లకోసారి సూర్యుడి చుట్టూ తిరిగే స్విఫ్ట్-టటిల్ తోక చుక్క ఉల్కల మార్గం గుండా భూమి కక్ష్య వెళ్తుండడంతో ఈ ఆకాశ అద్భుతం ఆవిష్కృతం కానుంది. దీన్ని మనం నేరుగా చూడొచ్చు. ఆగస్ట్ 11-12 తేదీల్లో రాత్రిపూట గంటకు దాదాపు 200 ఉల్కలు భూమిపైకి దూసుకొచ్చే అవకాశముందని నాసా తెలిపింది. -
ఇంద్రధనుస్సు చీరకట్టే..!
ఎండావాన కలసిన వేళ... ప్రకృతిలో ఒక పులకింత... ఆకాశంలో ఒక వినూత్న తేజస్సు ఆకాశ వీధికి తోరణం కట్టినట్లు ఆకర్షణీయమైన ఇంద్ర ధనుస్సు. చూపరుల మదిలో ఉల్లాసాల ఉషస్సులు ప్రసరింపజేస్తున్న ఈ సోయగాల ఇంద్ర ధనుస్సు కర్నూలు నగరంలో శనివారం సాయంత్రం కనిపించింది. ఆకాశపు తెల్ల కాగితంపై కోణమానిని పెట్టి వెలుగు రేఖ గీసినట్టనిపించే ఈ దృశ్యం నిర్మలాకాశ సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసింది. సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు ఇంద్రధనుస్సు చీరకట్టే..! -
రెండు గంటలు ఆకాశంలో విమానం చక్కర్లు
చెన్నై: సాంకేతిక లోపం కారణంగా విమానం సుమారు రెండు గంటల పాటు ఆకాశంలో చక్కర్లు కొట్టింది. తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయం నుంచి సోమవారం సాయంత్రం 5.20 గంటలకు ఎయిర్ ఏషియా విమానం కౌలాలంపూర్‌కు బయలుదేరింది. అందులో 151 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం టేకాఫ్ తీసుకోగానే ఇంజిన్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. పైలట్ తిరుచ్చి విమానాశ్రయ అధికారులకు వెంటనే సమాచారం అందించారు. విమానంలో ఉన్న ఇంధనం స్థాయి తగ్గేవరకు తిరుచ్చి చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందిగా అధికారులు సూచించారు. దీంతో రెండు గంటలపాటు విమానం ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. ప్రయాణికులు ఏం జరుగుతుందోనన్న భయంతో సీట్లలోనే కూర్చుండిపోయారు. రాత్రి 7.15 గంటలకు విమానంలో పెట్రోల్ స్థాయి తగ్గడంతో విమానాన్ని తిరుచ్చి ఎయిర్‌పోర్టులో భద్రంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
అపరిచితులు...
కవర్ స్టోరీ : జూలై 2 వరల్డ్ యూఎఫ్ఓ డే ఆకాశంలో ఏదో ఎగురుతూ కనిపిస్తుంది. విమానమా..? కాదు. హెలికాప్టరా..? అస్సలు కాదు. పోనీ రాకెట్టా..? ఉహు.. కానే కాదు. ఆకారం చూస్తే వాటిలా ఏమీ అనిపించదు. గుండ్రంగా పళ్లెంలా ఉంటాయి. వెలుగులు విరజిమ్ముతూ ఎగురుతూ ఉంటాయి. ఎక్కడివో, ఏమిటో గుర్తు తెలియని ఈ ఎగిరే పళ్లాలకు ఇంగ్లిషులో ‘అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్’గా పేరు పెట్టారు. వీటినే సంక్షిప్తంగా యూఎఫ్ఓలని అంటున్నారు. పళ్లాల్లా ఉంటాయి కాబట్టి వీటిని ‘ఫ్లయింగ్ సాసర్స్’ అని కూడా అంటారు. వీటి ఉనికి ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. గ్రహాంతర వాసులు వీటిని నడుపుతున్నారనే ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. వీటిపై అగ్రరాజ్యాలు చాలాకాలంగా పరిశోధనలు సాగిస్తూనే ఉన్నాయి. గ్రహాంతర వాసులు ఉన్నారా? లేరా? అనేందుకు ఇంతవరకు తగిన ఆధారాల్లేవు. ఒకవేళ ఉంటే వాళ్లు మనకు మిత్రులా? శత్రువులా? అనే దానిపై రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. ఉన్నారో, లేరో తెలియని గ్రహాంతరవాసులు ఇప్పటికి మాత్రం మనకు అపరిచితులు. చాలా చరిత్రే ఉంది మన దేశంలో ఇలాంటి ఎగిరే పళ్లాలను (యూఎఫ్ఓలు) చూసిన వారు దాదాపు లేరు. పాశ్చాత్య దేశాల్లో మాత్రం ఇలాంటివి తమకు కనిపించాయని చెప్పిన వారు చాలామందే ఉన్నారు. ఇప్పటికీ అక్కడక్కడా కొందరు ఆకాశంలో ఎగిరే పళ్లాలను చూసినట్లు చెబుతూనే ఉన్నారు. అలా చూశామని చెబుతున్న వారిలో కొందరు ఔత్సాహికులు ఫొటోలు, వీడియోలు తీసి మరీ ఇంటర్నెట్లో ప్రదర్శనకు ఉంచుతున్నారు. యూఎఫ్ఓల వెనుక చాలా చరిత్రే ఉంది. క్రీస్తుపూర్వం 214లో తొలిసారిగా వీటిని చూసినట్లుగా రోమన్ చరిత్రకారుడు టైటస్ లివియస్ తన రచనల ద్వారా వెల్లడించాడు. వీటిని ఆయన ఆకాశంలో ఎగిరే పడవలుగా అభివర్ణించాడు. యూఎఫ్ఓల గురించి చరిత్రలో నమోదైన తొలి ఉదంతం ఇదే. చరిత్ర పూర్వయుగంలోనే మనుషులు ఇలాంటి యూఎఫ్ఓలను చూసి ఉండవచ్చని ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లా చరమా వద్ద బయటపడ్డ గుహాచిత్రాలను పరిశీలించిన నిపుణులు భావిస్తున్నారు. ఈ గుహా చిత్రాల్లో ఆధునిక స్పేస్‌సూట్స్ వంటి దుస్తులు ధరించిన వారి బొమ్మలతో పాటు ఫ్లయింగ్ సాసర్స్ వంటి వాటి బొమ్మలు ఉండటం విశేషం. యూఎఫ్ఓలు కనిపించిన ఉదంతాలు చరిత్రలో వందలాదిగా నమోదయ్యాయి. మన దేశంలో తొలిసారిగా ఢిల్లీలో ఒక ఫ్లయింగ్ క్లబ్‌కు చెందిన పాతిక మంది సభ్యులు 1951 మార్చి 15న యూఎఫ్ఓను చూశారు. పొగచుట్ట ఆకారంలో దాదాపు వంద అడుగుల పొడవున్న యూఎఫ్ఓ ఆకాశంలో శరవేగంగా ఎగురుతూ కనుమరుగైనట్లు వారు చెప్పారు. ఆ తర్వాత 1954 సెప్టెంబర్ 15న యూఎఫ్ఓ కనిపించిన ఉదంతం వార్తలకెక్కింది. బిహార్‌లోని మన్భూమ్ జిల్లాలో మూడు గ్రామాలకు చెందిన దాదాపు 800 మంది ప్రజలు ఆకాశంలో ఎగిరే పళ్లాన్ని చూసినట్లు చెప్పారు. మధ్యాహ్నం వేళ ఆరుబయట ఉన్న సమయంలో ఆకాశంలో ఎగిరే పళ్లెం కనిపించిందని, దాని వ్యాసం దాదాపు పన్నెండు అడుగులు ఉంటుందని, అది బూడిద రంగులో ఉందని వారు చెప్పారు. ప్రజలు యూఎఫ్ఓలను చూసిన ఉదంతాలు ఎక్కువగా అమెరికాలోనే నమోదయ్యాయి. అయితే, మన దేశంలోనూ యూఎఫ్ఓలు కనిపించిన ఉదంతాలు లేకపోలేదు. గత ఏడాది జూన్ 25న కాన్పూర్‌లో, నవంబర్ 28న గోరఖ్‌పూర్‌లో యూఎఫ్ఓలు కనిపించినట్లు వార్తలు వచ్చాయి. అంతకు ముందు 2007 అక్టోబర్ 29న వేకువ జామున కోల్‌కతాలో కొందరు యూఎఫ్ఓను చూసి వీడియో తీశారు. వెలుగులు చిమ్ముతూ వేగంగా ఆకాశంలో ఎగురుతున్న ఈ యూఎఫ్ఓ దృశ్యాలను తర్వాత కోల్‌కతాలోని బిర్లా ప్లానెటోరియంలో ప్రదర్శించారు. యూఎఫ్ఓల అమీ తుమీ తేల్చడానికి అమెరికా, సోవియట్ రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, బ్రెజిల్, చైనా ప్రభుత్వాలు పలు పరిశోధనలు సాగించాయి. ఇవి ఇప్పటికీ సాగిస్తూనే ఉన్నాయి. చాలాకాలంగా ఈ పరిశోధనలు రహస్యంగానే సాగినా, సమాచార హక్కు చట్టాలు అమలులోకి రావడంతో ఆ రహస్య పరిశోధనలు, వాటి కోసం ప్రభుత్వాలు చేసిన ఖర్చుల వివరాలు బహిర్గతం కాక తప్పలేదు. యూఎఫ్ఓలు, గ్రహాంతరవాసులపై పరిశోధనల కోసం పలు ప్రభుత్వాలు ఇప్పటికే వేల కోట్ల డాలర్లు ఖర్చు చేసినట్లు అంచనా. మరోవైపు కొందరు సంపన్నులు, ప్రైవేటు సంస్థలు కూడా వీటిపై పరిశోధనలు సాగిస్తుండటం విశేషం. ‘అపరిచితుల’ కోసం రాయబారి! గ్రహాంతరాలకు చెందిన ‘అపరిచితుల’ కోసం ఐక్యరాజ్య సమితి ఏకంగా ఒక రాయబారినే నియమించింది. ఐక్యరాజ్య సమితికి చెందిన అంతరిక్ష వ్యవహారాల కార్యాలయానికి (యునెటైడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ది ఔటర్ స్పేస్ అఫైర్స్- యూఎన్‌ఓఓఎస్‌ఏ) అధిపతిగా మలేసియాకు చెందిన అస్ట్రోఫిజిసిస్ట్ మజ్లాన్ ఓత్మన్‌ను 2010 సెప్టెంబర్‌లో ఐరాస నియమించింది. గ్రహాంతరవాసులతో పాటు అంతరిక్షానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలూ ఈ కార్యాలయం పరిధిలోకి వస్తాయి. అందువల్ల ఓత్మన్‌ను ‘అపరిచితుల’ రాయబారిగా చెప్పుకోవచ్చు. సినిమాల్లో ‘అపరిచితులు’ గ్రహాంతర వాసులపై ఇప్పటికే వందలాది సినిమాలు వచ్చాయి. వీటిలో హాలీవుడ్ సినిమాలే ఎక్కువ. గ్రహాంతర వాసులపై వచ్చిన మొట్టమొదటి సినిమా ఫ్రెంచి భాషలో తీసిన ‘లె వోయేజ్ డాన్స్ లా లూన్’ (చంద్రుడి పైకి ప్రయాణం) 1902లో వచ్చింది. ఇది మూకీ సినిమా. జూల్స్ వెర్న్ నవలలు ‘ఫ్రమ్ ది ఎర్త్ టు ది మూన్’, ‘ఎరౌండ్ ది మూన్’తో పాటు మరికొన్ని రచనల ఆధారంగా ఫ్రెంచి దర్శకుడు జార్జెస్ మెలీస్ ఈ సినిమాను రూపొందించారు. దీనికి ఆయనే నిర్మాత కూడా. ఇక బాలీవుడ్లో 1967లో దారాసింగ్ హీరోగా ‘చాంద్ పర్ చఢాయీ’ సినిమా విడుదలైంది. చంద్రయానం ప్రధానాంశంగా తీసుకుని రూపొందించిన ఈ సినిమాలో యూఎఫ్ఓలు, గ్రహాంతర వాసులు కూడా కనిపిస్తారు. అయితే, అంతకు రెండేళ్ల ముందే దిగ్దర్శకుడు సత్యజిత్ రే ఇలాంటి సినిమా ఒకటి తీసే ప్రయత్నం చేశారు. ఆయన స్వయంగా రాసుకున్న కథ ‘బంకుబాబురొ బొంధు’ (బంకుబాబు స్నేహితుడు) ఆధారంగా ‘ది ఎలీన్’ పేరిట హాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘కొలంబియా పిక్చర్స్’ సహకారంతో తలపెట్టిన ఈ సినిమా అర్ధంతరంగానే నిలిచిపోయింది. ఆ తర్వాత ‘ది ఎలీన్’ స్క్రిప్టు ప్రభావంతోనే ‘ఆస్కార్’గ్రహీత స్టీవెన్ స్పీల్బర్గ్ 1982లో ‘ఇ.టి. ది ఎక్స్ట్రా టెరెస్ట్రియల్’ రూపొందించారు. అయితే, ‘బంకుబాబురొ బొంధు’ను సత్యజిత్ రే తనయుడు సందీప్ రే 2006లో టీవీ సీరియల్‌గా రూపొందించారు. ఇదిలా ఉంటే, ఇటీవలి కాలంలో యూఎఫ్ఓలు, గ్రహాంతర వాసులపై ‘కోయీ మిల్గయా’, ‘క్రిష్’, ‘జోకర్’, ‘చాంద్-2013’, ‘పీకే’వంటి బాలీవుడ్ సినిమాలు చాలానే వచ్చాయి. పాలపుంత పరిస్థితి సువిశాల విశ్వంలో అనంతకోటి నక్షత్రాలు ఉన్నాయి. ఉదాహరణకు మన గ్యాలెక్సీ అయిన పాలపుంతనే తీసుకుందాం. ఇందులో 20 వేల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. పాలపుంతలాంటి గ్యాలెక్సీలు అంతరిక్షంలో ఎన్ని ఉన్నాయో కచ్చితమైన లెక్కలేవీ లేవు. పాలపుంతలో ఉన్న వాటిలో కనీసం సగానికి సగం నక్షత్రాల చుట్టూ మన భూమి వంటి గ్రహాలు తిరుగుతూ ఉంటాయని అంతరిక్ష శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జీవజాలం భూమికి మాత్రమే పరిమితం కాదనుకుంటే, పాలపుంతలో సౌరకుటుంబానికి వెలుపల ఎక్కడో ఒకచోట మిగిలిన గ్రహాల్లో కొన్నింటి మీదైనా జీవజాలం ఉండే అవకాశాలు లేకపోలేదనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. అదే నిజమైతే, ఆ గ్రహాలపై ఇప్పటికే నాగరికత వర్ధిల్లే అవకాశాలు లేకపోలేదు. 1500 ఏళ్ల తర్వాత ఎలీన్స్తో దోస్తానా? ఎగిరే పళ్లాలనే కాదు, వాటిలో వచ్చే గ్రహాంతర వాసులను (ఎలీన్స్) చూశామని చెప్పిన వారు కూడా లేకపోలేదు. అయితే, ఎలీన్స్ ఊహాచిత్రాలే తప్ప వాళ్ల ఫొటోలేవీ ఇంతవరకు వెలుగులోకి రాలేదు. భూమ్మీద నివసించే మనుషులతో ఎలీన్స్ మాటామంతీకి ప్రయత్నించిన దాఖలాలేవీ ఇప్పటి వరకు లేవు. అయితే, భూమ్మీద మనుషులతో ఎలీన్స్ సంబంధాలు నెరపే రోజులు వస్తాయని కొందరు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాని, ఆ రోజులు రావడానికి కనీసం 1500 ఏళ్లు పట్టవచ్చని వారు అంచనా వేస్తున్నారు. ‘ఇప్పటి వరకు ఎలీన్స్ నుంచి మనకు ఎలాంటి సమాచారం రాలేదు. అయితే, అంతరిక్షం సువిశాల ప్రదేశం. విశాల విశ్వంలో మన మానవులం మాత్రమే మనుగడ సాగిస్తున్నామని భావించడం సరికాదు. ఎప్పుడో ఒకరోజు ఎలీన్స్ నుంచి మనకు సమాచారం అందేరోజు రాకపోదు. అది ఇప్పట్లో సాధ్యపడకపోవచ్చు. సుమారు 1500 ఏళ్ల తర్వాత ఇది జరగవచ్చనే అంచనా వేస్తున్నాం’ అని అమెరికాలోని కార్నెల్ వర్సిటీ పరిశోధకుడు ఎవాన్ సాల్మనైడ్స్ చెబుతున్నారు. అవీ-ఇవీ... గ్రహాంతరవాసులు తనను కిడ్నాప్ చేశారంటూ కాల్మికియా తొలి అధ్యక్షుడు కిర్సాన్ ఇల్యుమ్నిజోవ్ వార్తల్లోకెక్కారు. యూఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయి స్వతంత్రదేశంగా ఏర్పడిన కాల్మికియాకు 1993లో ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. పసుపు రంగు కళ్లద్దాలు ధరించి వచ్చిన గ్రహాంతర వాసులు తనను 1997 సెప్టెంబర్ 17న కిడ్నాప్ చేసినట్లు కిర్సాన్ ప్రకటించారు. యూఎఫ్‌ఓలో వారు తనను వేరే గ్రహానికి తీసుకుపోయి, గంటసేపు అక్కడ ఉంచి, తర్వాత తిరిగి భూమ్మీదకు తెచ్చి వదిలేశారని చెప్పారు. ఆకాశంలో కనిపించే ఎగిరే పళ్లాలను మొదట్లో ఒక్కొక్కరు ఒక్కో రీతిలో పిలిచేవారు. వీటికి ‘ఫ్లయింగ్ సాసర్స్’ అనే పేరు 1947 నుంచి వాడుకలో ఉండేది. అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఎడ్వర్డ్ రపెల్ట్ 1952లో వీటికి ‘అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్’ (యూఎఫ్ఓ)గా నామకరణం చేశాడు. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా వీటిని ‘యూఎఫ్ఓ’లుగా పేర్కొనడం ప్రారంభమైంది. గ్రహాంతర వాసులపై ఇప్పటికీ చాలామందిలో లేనిపోని అనుమానాలు, భయాలు ఉన్నాయి. యూఎఫ్ఓలలో భూమ్మీదకు వచ్చే ‘అపరిచితులు’ ఇక్కడి మనుషులను కిడ్నాప్ చేస్తారనే వాదనలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఈ భయాల కారణంగానే అమెరికాలో దాదాపు 40 వేల మంది గ్రహాంతర వాసుల ద్వారా కిడ్నాప్‌కు గురయ్యే ‘ప్రమాదం’ నుంచి రక్షణ కోసం బీమా పాలసీలు కూడా తీసుకున్నారు. - కాల్మికియా తొలి అధ్యక్షుడు కిర్సాన్ ఇల్యుమ్నిజోవ్ -
పెట్టుబడులకు ఆకాశమే హద్దు
బీజింగ్ : భారతదేశంలో పెట్టుబడులకు ఆకాశమే హద్దు అని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. చైనాలో ఐదు రోజుల పర్యటనలో ఉన్న జైట్లీ బీజింగ్ లో చైనీస్ ప్రభుత్వం నిర్వహించే సీసీటీవీతో మాట్లాడారు. ఆర్థికవృద్ధి పరంగా భారతదేశం నిలకడగా ఉందని.. మౌలిక సదుపాయాలు, పట్టణీకరణ, హౌసింగ్, విద్యుత్, నీరు మరియు సామాజిక రంగాల్లో పెట్టుబడులకు భారీ అవకాశాలున్నాయని పిలుపునిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థ పుంచుకుంటోందని చెప్పగలననీ, ప్రయివేట్ రంగ పెట్టుబడులు దీనికి ప్రోత్సాహాన్ని ఇవ్వనున్నాయని తెలిపారు. తమ దేశంలో పెట్టుబడులకు ఆకాశమే పరిమితి... ఆస్థాయిలో పెట్టుబడులు తమకు అవసరమని ఆర్థిక మంత్రి చెప్పారు. వర్షపాతమే కీలక అంశంగా ఉన్న తమ దేశంలో గత రెండేళ్లుగా సాధారణ వర్షపాత పరిస్థితులు నమోదవుతున్నా ..గణనీయమైన వృద్ధిని సాధించామని తెలిపారు. ఈ ఏడాది దేశంలో మంచి వర్షాలు కురిస్తే గ్రామీణ ఆర్థిక అభివృద్ధి, గ్రామీణ కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు. గత సంవత్సరం 7.6 శాతం వృద్ధి సాధించామని తెలిపారు. ఆశాజనక వర్షాలు కురిస్తే ఈ పరిస్థితిలో కచ్చితంగా మెరుగుదల ఉంటుందని జైట్లీ ఉద్ఘాటించారు. 6.9 శాతం వృద్ధి రేటుతో వున్న చైనాను గత ఏడాది భారతదేశం అధిగమించిందన్నారు. అధిక జనాభా కలిగి భారత ఆర్థికవ్యవస్థలో ఉద్యోగ వృద్ధి రేటుచాలా ముఖ్యమన్నారు. ప్రపంచ ఆర్థిక మాంద్యం ఆందోళనలపై మాట్లాడిన జైట్లీ ఎంతకాలం ఇది (గ్లోబల్ మాంద్యం) కొనసాగుతుందో.. ప్రపంచంలో ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడుతుందో, ప్రపంచంలో వృద్ధి తిరిగి ఎలా వస్తుందో చూడాలనీ. ఇదొక అనివార్యమైన పరిస్థితి అని చెప్పారు. చైనా మద్దతిస్తున్న ఆసియా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ (ఎఐఐబీ) గవర్నర్ల బోర్డు సమావేశఃలో కూడా జైట్లీ పాల్గొన్నారు. -
రెయిన్ బో ఇలా కూడానా!
సాధారణంగా ఇంద్రధనుస్సు ఎలా కనిపిస్తుంది? విల్లు ఆకారంలో కనిపిస్తుంది. అందుకే దీనిని హరివిల్లు అని కూడా అంటాం. కానీ, అమెరికాలో మండుతున్నట్లుగా కనిపించి అక్కడి ప్రజల్ని మురిపించింది. అత్యంత అరుదుగా సంభవించే ఈ ఘటన మంగళవారం న్యూజెర్సీలో సముద్రతీరంలో దర్శనమిచ్చింది. ఒకసారి మండుతున్న మంటలా.. ఇంకోసారి ఆకాశం నుంచి రాలుతున్న తోకచుక్కలా.. మరోసారి ఒకదాని ఒకటి ఆనుకుని ఉన్న పర్వాతాల్లా కనిపించి చూపరులను సంభ్రమాశ్చార్యాలకు గురిచేసింది. వాతావరణంలో మార్పులు, మేఘాలు అడ్డుతగలడం వల్ల ఇలాంటివి అప్పుడప్పుడు సంభవిస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. మంగళవారం మేఘాలు చాలా ఎత్తులో ఉన్నాయని, అదే సమయంలో సూర్యుని నుంచి కిరణాలు ఒకే కోణంలో మేఘాల్లో ఘనీభవించిన నీటిని తాకడం వల్ల హరివిల్లు ఇలా ఏర్పడినట్లు వివరించారు. దాదాపు 15,000 అడుగుల ఎత్తులో హరివిల్లు ఏర్పడినట్లు చెప్పారు. కాగా, ఆర్లాండో నరమేధానికి నివాళిగా ఈ రెయిన్ బో ఏర్పడినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. -
గగనం నుంచి నగర వీక్షణం!
-
ఆకాశంలో కిలోమీటర్ ఎత్తున టవర్..!
కిలోమీటర్ ఎత్తున.. ఆకాశాన్ని తాకుతున్నట్లుగా కనిపించే ప్రపంచంలోనే అతి పెద్ద, పొడవైన నిర్మాణాన్ని సౌదీ ప్రభుత్వం చేపట్టింది. ఈ భారీ కట్టడం నిర్మాణంలో 57 లక్షల చదరపు గజాల కాంక్రీట్, 80 వేల టన్నుల స్టీల్ ను వినియోగించి, దుబాయ్ లోని అతిపెద్ద టవర్, గిన్నిస్ రికార్డులకెక్కిన 'బుర్జ్ ఖలిఫా' ను తలదన్నే రీతిలో నిర్మిస్తున్న ఈ కట్టడం... అనుకున్నలక్ష్యాన్ని చేరితే ప్రపంచ గుర్తింపు తెచ్చుకోగలదని భావిస్తున్నారు. అతిపెద్ద జెద్ టవర్ ప్రాజెక్టు ఆకర్షణీయంగా నిర్మించేందుకు సుమారు ఏడువేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. జెడ్ ఎకనమిక్ కంపెనీ, సౌదీ అరేబియాకు చెందిన అలిన్మా ఇన్వెస్ట్ మెంట్ సంస్థలు సంయుక్తంగా రెండు వందల ఇరవై కోట్ల రూపాయలను వెచ్చించి జెద్ నగరంలో ఈ నిర్మాణం చేపట్టేందుకు ఒప్పందంపై సంతకాలు చేసినట్లు సౌదీ ప్రభుత్వం ఓ పత్రికా ప్రకటన ద్వారా తెలిపింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ నిర్మాణం 26వ అంతస్తు వరకు పూర్తయిందని, 3 వేల 280 అడుగుల ఎత్తైన ఈ ఆకాశహర్మ్యం 2020 లోగా పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ నిర్మాణంతో స్థానికంగా రియల్ ఎస్టేట్ మరింత అభివృద్ధి చెందుతుందని, ఆధునిక జీవన శైలిని కూడా అందిస్తుందని, అనుకున్న లక్ష్యాన్ని చేరితే ఓ ప్రపంచ స్థాయి పట్టణ కేంద్రంగా ఈ ప్రాంతం రూపు దిద్దుకుంటుందని జెడ్దా ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మౌనిబ్ హమ్మౌద్ అంటున్నారు. -
ఆకాశంలో నిప్పుకణిక
ధాయ్ లాండ్: ఆకాశంలో నిప్పుకణికలా కనిపిస్తోంది కదూ.. ఈ ఫొటోలో కనిపిస్తున్నది నిజంగా అలానే ఉంది. థాయ్ లాండ్ రాజధాని నగరంలో సోమవారం ఉదయం ఫుల్ బిజీగా ఉన్న ఉదయం సమయాల్లో ఇలా నిప్పుకణిక కనిపించింది. ఈ ఫొటో రోజు మొత్తం సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. -
నక్షత్రాలు దూసిన ఆకాశం
ప్రతి ఆడకూతురూ ప్రదక్షిణ చేస్తుంది. ఆషాఢం వచ్చిన ప్రతిసారీ ఆ చెట్టు.. నక్షత్రాలు దూసిన ఆకాశం తూరుపులా రుబ్బురోలు పండేకా సంధ్యవేళకి పడతుల పడతి పేరెత్తగానే సిగ్గు మందారం అరచేతిలో విచ్చుకుంటుంది అరా కొరా మిగిలిన ఆనందాన్ని ఆటలో బుడంకాయలాంటి నాకు అరచేతిలో అప్పచ్చి అంటూ చందమామని నాకు పంచిన మర్నాడు మధ్యలో బంతి ఆకు ఎలా వచ్చిందో నేను చెప్పను గోరింటాకు చెట్టున్న మా పాపత్త వాడ అంతటికీ బంధువు ఆషాఢం వచ్చిన ప్రతిసారీ ఆ చెట్టు నక్షత్రాలని దూసిన ఆకాశం - వర్మ కలిదిండి ఫోన్: 9948943337 సాహిత్యం పేజీలో (ఆగస్టు 2, 2015) ‘రాబోవు పుస్తకం’ కింద ‘జయమ్’ గురించిన అనుబంధం చదివి రాస్తున్నాను. పుణేలోని భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కొన్ని దశాబ్దాలుగా నిష్ణాతులైన పండితులు వ్యాస మహాభారతంలో శతాబ్దాలుగా ఎవరికై వారు చొప్పించిన ఉపాఖ్యానాలు, అసంబద్ధ చేర్పులు ఏరి చివరికి జైమిని రాసిన జయం కావ్యానికి చేరువకావాలన్నది వారి లక్ష్యం. దానికోసం అన్ని లిపులలో ఉన్న ప్రాచీన గ్రంథాలని సేకరించి, క్రిటికల్ ఎడిషన్‌ని పదకొండు సంపుటాలుగా ప్రచురించారు. ఎనిమిదవ శతాబ్దం పూర్వపు ప్రతులు దొరకలేదు. అన్వేషణ ఇంకా జరుగుతోంది. భగవద్గీత భారతంలో భాగం కాదని నిరూపించారు. ఉపగీతని నిరాకరించారు. రీసెర్చ్ ఇంకా జరుగుతోంది. డాక్టర్ ఇరావతి కర్వే రాసిన యుగాంత పుస్తకం ఉపోద్ఘాతంలో మరింత సమాచారం లభ్యమవుతుంది. అదే మార్గంలో బహుశా ఒంటరిగా సాగుతున్న నాయుని కృష్ణమూర్తి అభినందనీయులు. - గబ్బిట కృష్ణమోహన్ ప్రపంచ మూలవాసీ దినోత్సవం (9 ఆగస్టు 2015) సందర్భంగా నల్లమలలో మూలవాసీ చెంచులతో ఆత్మీయ కలయిక ఆదివాసీ తెగకు సంబంధించిన సంక్షేమ పథకాల రూపకల్పనలో ప్రత్యేక దృష్టి కోణం ఉండాలి. వారి స్థానిక, ప్రాంత అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి. వాటి అమలు విధానంలో జాగ్రత్త వహించాలి. ఒకే పథకం అన్ని తెగలకీ, ఒక్కో తెగలోని వివిధ ప్రాంతాలలో నివసించే అందరికీ యాంత్రికంగా వర్తింపజేయడం సరికాదు. ప్రస్తుతం మూలవాసీ చెంచులు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారి నేల వారిది కాకుండా పోతున్నది. నీరు, రవాణా, వైద్యం, ప్రభుత్వ పథకాల అమలు వంటి ఎన్నో రంగాలలో వారు ఎదుర్కొనే సాధకబాధకాలను అధ్యయనం చేసి, వారికి చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. శ్రీశైలం ప్రధాన రహదారిపై మన్ననూరు దగ్గర, ఫరాబాదుకి 20 కిలోమీటర్ల దూరంలోని అటవీప్రాంతంలో గల అప్పాపూర్ (లింగాల మండలం, మహబూబ్‌నగర్) చెంచు గ్రామం, దాని పరిసరాల్లోని ఆరు గ్రామాల చెంచుల మధ్యన ఒక సభ ఏర్పాటుచేస్తున్నాం. చెంచుల నోటి సాహిత్యం, సంస్కృతి, భాషా విశేషాలు, జీవనవిధానం, ఆర్థికాంశాలను అధ్యయనం చేస్తాం. నాగర్‌కర్నూల్ శాఖ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి సహకారంతో అదే రోజున వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నాం. మొదట చెంచులదే అయిన కిన్నెర తంత్రీ వాద్యం ఇప్పుడు అక్కడ కనిపించకుండా పోయింది. అడవి పందులు, సొర తీగను, కాయలను నాశనం చేయడం వల్ల సొరబుర్రలు, విత్తనాలు మాయమయ్యాయి. అందువల్ల కిన్నెర వాద్యం తయారీ ఆగిపోయింది. అయితే చెంచుల పన్నెండు మెట్ల కిన్నెర వాద్యాన్ని ఏడు మెట్ల కిన్నెరగా మార్చుకొని మహబూబ్‌నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల డక్కలి వారు కిన్నెరను తమదిగా స్వీకరించి, మైదాన గ్రామాల్లో వినిపిస్తున్నారు. ఈ కిన్నెరవాద్యాన్ని తిరిగి చెంచులకు బహూకరించనున్నాం. అలాగే చెంచుల కిన్నెర వాదన కూడా ఏర్పాటుచేశాం. ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ కేంద్రంగా పనిచేసే ‘చెంచులోకం’ సంస్థ, సిడాస్ట్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, పాలమూరు విశ్వవిద్యాలయ ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు, రచయితలు పాల్గొంటారు. ఆసక్తి ఉన్నవారందరికీ ఆహ్వానం. మరిన్ని వివరాలకు బెల్లి యాదయ్య ఫోన్: 9848392690. - జయధీర్ తిరుమలరావు అధ్యక్షులు, తెలంగాణ రచయితల వేదిక పుస్తక పరిచయ సభ ‘సాహితీమిత్రులు’ ఆధ్వర్యంలో నేడు సాయంత్రం 6 గంటలకు విజయవాడ, మొగల్రాజపురంలోని మధుమాలక్ష్మి చాంబర్స్‌లో శిఖామణి పుస్తకాలు ‘పొద్దున్నే కవిగొంతు’, ‘స్మరణిక’, ‘తెలుగు మరాఠీ దళిత కవిత్వం’ పరిచయ సభ జరగనుంది. వక్తలు పాపినేని శివశంకర్, సీతారాం, బండ్ల మాధవరావు. -
ఆకాశంలో అద్భుతం!
-
ఆకాశంలో అద్భుత దృశ్యం
రావులపాలెం: సమయం.. బుధవారం ఉదయం 11 గంటలు.. ఎండ చుర్రుమంటున్న వేళలో అనుకోకుండా ఆకాశం వైపు చూసిన వారికి కనువిందైన దృశ్యం కనిపించింది. మబ్బుల నడుమ సూర్యుని చుట్టూ ఇంద్రధనుస్సు మాదిరిగా రంగుల వలయం ఏర్పడింది. వలయపు అంచుకు, సూర్యునికి మధ్య పలచటి చీకటి అలముకున్నట్టు నల్లగా ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో.. ప్రధానంగా కోనసీమ ప్రాంతంలో ఈ విశేషం చాలాసేపు కనిపించింది. ఈ వలయం రాబోయే ఉత్పాతానికి సంకేతమని కొందరు భావిస్తే.. మరికొందరు కలియుగాంతానికి సూచన అనేంతవరకూ ఊహాగానాలు వ్యాపించాయి. కానీ ఇది తుఫాను రాకకు సంకేతం కావచ్చని రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ఫిజిక్స్ విభాగం రీసెర్చ్ డెరైక్టర్ డాక్టర్ కె.రామచంద్రరావు తెలిపారు. ఇలాంటి వలయాన్ని శాస్త్త్రవేత్తలు ‘హాలో’ అంటారన్నారు. భూమికి ఏడు వేల మీటర్ల ఎత్తున దుమ్ముధూళితో కూడిన అణువులు దట్టమైన ‘హై సిర్రస్’ మేఘాలుగా మారి, వాటిలో మంచు స్ఫటికాలు ఏర్పడతాయని వివరించారు. సూర్యకాంతి వాటిపై పడి పరావర్తనం, వక్రీభవనం చెంది ఏడు రంగులుగా మారి ఈ వలయాలు ఆవిష్కృతమవుతాయన్నారు. -
ఆకాశం నుంచి రాలిన చేపలు..
విజయవాడ: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి విజయవాడ శివారు రామవరప్పాడులో ఆకాశం నుంచి చేపలు రాలిపడ్డాయి. పిన్నమనేని హైట్ అపార్టుమెంట్ సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బుధవారం ఉదయం నిద్ర లేచేసరికి బతికే ఉన్న చిన్న చిన్న చేపలు పరిసరాల్లో పడి ఉన్నాయని స్థానికులు తెలిపారు. రాత్రి కురిసిన వర్షానికి చేపలు పడి ఉంటాయని భావిస్తున్నారు. స్థానికులు వాటిని ఏరుకున్నారు. గతంలోనూ కృష్ణాజిల్లాలో ఆకాశం నుంచి చేపలు రాలిపడిన విషయం తెలిసిందే. -
ఆకాశంలో శాంతి చిహ్నం
అమెరికన్ రాక్ బ్యాండ్ సంస్థ ‘గ్రేట్ఫుల్ డెడ్’ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శనివారం కాలిఫోర్నియా నగరంలోని శాంతి చిహ్నం ఆకారం ఏర్పడేలా ఆకాశంలో చక్కర్లు కొడుతున్న విమానం. లెవీస్ స్టేడియం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన ఈ రాక్ బ్యాండ్ సంస్థ 1965 లో శాన్ఫ్రాన్సిస్కో నగరంలో ఏర్పాటైంది. రాక్, ఫోక్, బ్లూ గ్రాస్, రెగ్గే, కంట్రీ, స్పేస్ రాక్, జాజ్ వంటి పలు రకాల మ్యూజిక్ వైవిధ్యాలను ప్రదర్శించడంలో గ్రేట్ఫుల్ డెడ్ బృందం పేరుగాంచింది. -
ఆకాశంలో అద్భుతం..
సాయంత్రం 6.48 నిమిషాల సమయం.. నింగినిండా మబ్బులు.. అప్పుడప్పుడు మెరుపులు.. ఇంతలో ఆకాశంలో అద్భుతం. మార్తాండుడు మళ్లీ ఉదయిస్తున్న సన్నివేశం. తిమిర సంహారం జరుగుతోందా అన్నట్లు ఆకాశంలో ఒక్కసారిగా వెలుతురు వచ్చింది. దాదాపు నిమిషం పాటు ఆ కాంతి కనిపించింది. కాసేపటికి మళ్లీ చీకటి అలముకుంది. ఈ దృశ్యాన్ని చూసిన విశాఖ వాసుల్లో ఏం జరుగుతుందో తెలియని ఆశ్చర్యం.. మరికాసేపటికే మళ్లీ అలాంటి దృశ్యమే ఆవిష్కృతమైంది. దీనిపై వాతా వరణ నిపుణులు స్పందిస్తూ.. వాస్తవానికి ఉత్తర, దక్షిణ ధృవాల ప్రాంతాల్లో ఇలాంటి కాంతిని వెదజల్లే దృశ్యాలు (అరోరా బొరియాల్సిస్) సంభవిస్తాయని చెప్పారు. మన ప్రాంతంలో అలాంటివి ఏర్పడే అవకాశం లేదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు అంటున్నారు. గురువారం నాటి ఘటనపై తాము ఇదమిత్థంగా ఏమీ చెప్పలేమని తెలిపారు. - సాక్షి, విశాఖపట్నం -
ఆకాశంలో పెట్రోల్ బంకులు
భారత్ టు అమెరికా.. స్విట్జర్లాండ్ టు ఆస్ట్రేలియా.. ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా నాన్‌స్టాప్ ప్రయాణం! మధ్య మధ్యలో విమానాలు మారాల్సిన పని లేదు. విమానాశ్రయాల్లో పడిగాపులు కాయాల్సిన అవసరం అసలే ఉండదు. మనం విమానం ఎక్కి కూర్చుంటే చాలు.. ఏ దేశానికైనా నేరుగా ఎగిరిపోవచ్చు! గాలిలో ప్రయాణిస్తుండగానే విమానాలకు ఇంధనం నింపగలిగితే సరి.. ఈ నాన్‌స్టాప్ ప్రయాణం సాకారం కానుంది! లోహవిహంగాలకు ఆకాశంలోనే ఇంధనం నింపడం కొత్త సంగతేమీ కాదు. కానీ ఈ సౌకర్యం ఇప్పటిదాకా యుద్ధవిమానాలకు మాత్రమే అందుబాటులో ఉంది. అదీ అమెరికాతో పాటు కొన్ని దేశాల ఫైటర్జెట్లకు మాత్రమే ఈ సామర్థ్యం ఉంది. అయితే, ఈ టెక్నాలజీని ప్యాసెంజర్ విమానాలకూ అన్వయిస్తే ఇక విమానయానం రూపురేఖలే మారిపోతాయి. అందుకే యూరప్‌లోని 9 యూనివర్సిటీలు, సంస్థల పరిశోధకులు సాధారణ విమానాలకూ గాలిలోనే ఇంధనం నింపే పద్ధతుల రూపకల్పనకు నడుం బిగించారు. ‘రీక్రియేట్(రీసెర్చ్ ఫర్ ఏ క్రూయిజర్ ఎనేబుల్డ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఎన్విరాన్మెంట్)’ అనే ప్రాజెక్టును రూపొందించారు. ఈ ప్రాజెక్టును అమలు చేస్తే ప్యాసెం జర్ విమానాలకూ గాలిలోనే ఇంధనం నింపడం సాధ్యమేనని వీరు చెబుతున్నారు. లోహవిహంగాలకు నింగిలోనే ఇంధనం నింపేందుకు మరో పద్ధతినీ వీరు ప్రతిపాదించారు. లాభమేనా..? విమానాలకు ఆకాశంలోనే ఇంధనం నింపడం వల్ల ఇంధన ఖర్చులు సుమారు 25 శాతం వరకూ తగ్గుతాయని చెబుతున్నారు. ఉదాహరణకు.. 250 మంది ప్రయాణికులతో ఓ విమానం 6 వేల నాటికల్ మైళ్లు ప్రయాణిస్తే.. అందులో ఇంధన ఖర్చు 23 శాతం ఆదా అవుతుంది. అలాగే, విమానాశ్రయాల వద్ద ధ్వని, వాయు కాలుష్యాలు తగ్గుతాయి. ప్రయాణికులకు పలు ప్రయాసలు తప్పుతాయి. పని లేకున్నా వివిధ దేశాల్లో దిగాల్సిన అవసరం ఉండదు. త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. అయితే, ఇంధన విమానాలు కూడా అదనంగా ఆకాశంలో తిరుగుతాయి కాబట్టి వాటి వల్ల వచ్చే కాలుష్యం సంగతేంటి? ఇంధన ఖర్చుల మాటేమిటి? అంటే.. ఆ దిశగా మరింత పరిశోధించాల్సి ఉందన్నదే పరిశోధకుల సమాధానం. ఎలా నింపుతారు? ప్రయాణికులతో కూడిన విమానం గమ్యస్థానానికి బయలుదేరుతుంది. మార్గమధ్యంలో ఇంధనం అయిపోయే దశకు చేరుకోగానే అక్కడికి ఇంధనాన్ని మోసుకుని ఓ రీఫ్యూయెలింగ్ విమానం వస్తుంది. ప్రయాణికుల విమానం పైన, ఇంధన విమానం కింద ఒకే వేగంతో ప్రయాణిస్తాయి. ఇంకేం.. ఇంధన విమానం నుంచి ప్రత్యేక గొట్టాలు, పరికరాల ద్వారా ప్రయాణికుల విమానం ట్యాంకులోకి ఇంధనం సరఫరా అవుతుంది. ట్యాంకు ఫుల్ కాగానే.. రెండూ విడిపోతాయి. ఇంధన విమానం తిరిగి తన స్థావరానికి వెళ్లిపోతుంది. దీనికే వీరు క్రూయిజర్-ఫీడర్ కాన్సెప్ట్ అని పేరుపెట్టారు. అయితే, ఒక మార్గంలో వరుసగా ఐదు విమానాలకు కూడా ఈ రీఫ్యూయెలింగ్ విమానం నుంచి ఇంధనాన్ని నింపొచ్చు. భారీ ఇంధన విమానాన్ని ప్రపంచమంతా విమాన మార్గాల్లో తిప్పుతూ.. ఎక్కడ అవసరమైతే అక్కడ విమానాలకు ఇంధనం నింపే ‘ఎయిర్మెట్రో’ అనే మరో పద్ధతినీ వీరు ప్రతిపాదించారు. -
ఆకాశాన్ని మోసే పక్షి!
చిట్టి కవితలు - గుండంపాటి విజయసారథి గది గోడపై కాలాన్ని మోస్తూ క్యాలెండర్ కాలాన్ని మేస్తూ గడియారం '' హేమంతం చలికి వణుకుతూ నక్షత్రాలు '' పున్నమి రాత్రి నదిలో చేపై చందమామ '' ఎండ కాసేపు చెట్టు నీడలో విశ్రమించింది '' ఆకాశానికి వింజామరలు వీస్తూ పక్షుల గుంపు '' రెక్కలు సాచి ఆకాశాన్ని మోస్తున్న ఒంటరి పక్షి -
పాలపుంత.. ఆకాశమంత..
రాత్రి వేళ ఇంద్రధనస్సు విరిసినట్లు కనిపిస్తున్న ఈ పాలపుంత ఫొటో అదిరిపోయింది కదూ.. ఈ చిత్రాన్ని అమెరికాకు చెందిన ఆస్ట్రోఫొటోగ్రాఫర్ డేవ్ లేన్ తీశారు. ఇలాంటి చిత్రాలు తీయడమంటే మాటలు కాదు. డేవ్ గంటలతరబడి వేచి చూసి.. ఈ అరుదైన ఫొటోను క్లిక్‌మనిపించారు. ఈ చిత్రాన్ని ఆయన అక్కడి ఆర్చెస్ జాతీయ పార్కులో తీశారు. -
భూగ్రహాల అన్వేషణకు ధూళి మేఘాల అవరోధం!
మన సమీపంలోని ఓ నక్షత్రం చుట్టూ తిరుగుతున్న భూమిలాంటి గ్రహంపై వాతావరణం, అతిప్రకాశమంతమైన నక్షత్రకాంతి, ఆకాశంలో ధూళిమేఘాలను చూపుతూ రూపొందించిన ఈ ఊహాచిత్రాన్ని సోమవారం యూరోపియన్ సదర్న్ అబ్జర్వేటరీ పరిశోధకులు విడుదలచేశారు. మన భూమి మాదిరిగా జీవుల మనుగడకు అనుకూలమైన గ్రహాల అన్వేషణ కోసం.. వెరీ లార్జ్ టెలిస్కోపుతో అనేక నక్షత్రాలపై అధ్యయనం చేసిన వీరు తొమ్మిది నక్షత్రాల చుట్టూ భారీ ధూళిమేఘాలను కనుగొన్నారు. నక్షత్రాలకు మరీ దూరంగా, దగ్గరగా లేకుండా అనుకూలమైన దూరంలో ఉన్న గ్రహాల ప్రాంతంలోనే ఈ ధూళిమేఘాలు ఏర్పడటం వల్ల భూమిలాంటి గ్రహాల అన్వేషణకు తీవ్ర అవరోధం కలుగుతోందట. గ్రహశకలాలు ఢీకొట్టుకోవడం, తోకచుక్కలు క్షయం అవడం వల్ల అంతరిక్షంలోకి పెద్ద ఎత్తున ధూళికణాలు విడుదలై ఇలా మేఘాలుగా ఏర్పడి నక్షత్రకాంతితో ప్రతిఫలిస్తున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
4వ తేదీ నుంచి ఫ్లయింగ్ ఫెస్టివల్
సాక్షి, ముంబై: షోలాపూర్ అందాలను ఆకాశం నుంచి వీక్షించేందుకు అవకాశం కలిగించనున్నట్లు డాక్టర్ శిరీష్ వలుసంగ్కర్ తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో ఈ నెల 4వ తేదీనుంచి ఆరు రోజుల పాటు రోటరీ క్లబ్ ఆఫ్ షోలాపూర్ నార్త్ఈస్ట్, అద్విప్ ఫ్లైడ్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ప్యారాగ్లైడింగ్, ప్యారాసెయిలింగ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. నాలుగో తేదీ ఉదయం 10 గంటలకు స్థానిక విమానాశ్రయంలో ఈ ఉత్సవం మొదలవుతుందని, అనంతరం మొదట సిద్ధేశ్వరాలయంపై చిన్న విమానాల ద్వారా పుష్పవర్షం కురిపించనున్నట్లు చెప్పారు. ఈ ఉత్సవం కోసం రెండు ప్యారాసెయిలింగ్, నాలుగు ప్యారాగ్లైడింగ్, నాలుగు చిన్న విమానాలను తీసుకువస్తున్నట్లు వివరించారు. 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు చాలా తక్కువ ఖర్చుతో పవర్ ప్యారాగ్లైడింగ్ , ప్యారాసెయిలింగ్ల్లో ఆకాశంలోకి వేల ఫిట్ల వరకు విహరించవచ్చని చెప్పారు. ఇదేవిధంగా, విమానాలలో పైలట్ ఉజనీ డ్యాం బ్యాక్ వాటర్ వరకు విహరించవచ్చన్నారు. విమానం తిరుగు ప్రయాణంలో తుల్జాపూర్, నలుదుర్గా, అక్కల్కోట్, స్వామి సమర్థ్ మందిరం మీదుగా ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుందని తెలిపారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు విమానం నడుస్తుందన్నారు. సమావేశంలో పవన్ మోండే, సోమేశ్వర్ యబాజి, రాకేష్ ఉదగిరి తదితరులు పాల్గొన్నారు. -
రాత్రీ.. పగలూ.. కలిసే చోట!
నిశి రాత్రి వేళ.. నల్లటి ఆకాశంలో చందమామ. కింద పగటి పూట భానుడి వెలుగు కిరణాలతో తెల్లగా మెరిసిపోతున్న మేఘమాలికలు. భూ వాతావరణం చివరి అంచు, ఆకాశం కలిసేచోట నీలిరంగు మెరుపులు.. ఒకేసారి పగలూ, రేయీ కలిసిపోయి కనిపిస్తున్న ఈ చిత్రం అద్భుతంగా ఉంది కదూ! భూమి చుట్టూ 330 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న జర్మన్ వ్యోమగామి అలెగ్జాండర్ గెర్స్ట్ ఇటీవల ఈ ఫొటోను తీశారు. ఇటీవల ఐఎస్ఎస్ శీతల వ్యవస్థకు మరమ్మతు చేసేందుకు బయటికి వచ్చి స్పేస్‌వాక్ చేసినప్పుడు అలెగ్జాండర్ తీసి పంపిన తన సెల్ఫీ(స్వీయచిత్రం) కూడా ఇంటర్నెట్లో హల్చల్ చేసింది. అన్నట్టూ... భూమి వాతావరణం ప్రభావం వల్ల ఆకాశం మనకు నీలిరంగులో కనిపిస్తుంది. కానీ.. అంతరిక్షంలోకి వెళ్లి చూస్తే మాత్ర ం కనిపించేది నల్లటి ఆకాశమే! -
చుక్కల ఆకాశంలోకి...చక్కగా ప్రయాణమై!
రాత్రిపూట ఆకాశంలో చుక్కలను చూస్తుంటే...ఎంత కాదన్నా భావుకత తన్నుకు వస్తుంది. ఆకాశంలోకి వెళ్లి చుక్కలతో చక్కగా మాట్లాడాలనే కల కంటాం కూడా. అది వాస్తవరూపం దాల్చని అందమైన కల. అయితే రాత్రి వచ్చే కలలకు మాత్రం ఈ నిబంధన వర్తించదు. భేషుగ్గా...ఆకాశదేశానికి వెళ్లి అందమైన చుక్కలతో తనివితీరా మాట్లాడవచ్చు. కొద్దిమందికి చుక్కల దగ్గరికి వెళ్లినట్లు కల వస్తుంటుంది. దీని అర్థం ఏమిటో తెలుసుకుందాం... ఆకాశం అనేది మనలో ఎప్పటి నుంచో ఉన్న సుదీర్ఘ లక్ష్యం అయితే, అక్కడికి వెళ్లి చుక్కలను పలకరించడం అనేది లక్ష్యాన్ని చేరుకోవడాన్ని లేదా చేరువ కావడానికి చేసే ప్రయత్నాన్ని సూచిస్తుంది. ఇక ప్రేమికుల విషయంలో అయితే ‘ప్రేమ ఫలించడం’ అనే అర్థంలో దీన్ని చూడవచ్చు. మాటమాత్రంగా కూడా ఎప్పుడూ ఊహించని అవకాశాలు వచ్చి సంభ్రమాశ్చర్యాలకు గురిచేసినప్పుడు కూడా ఇలాంటి కలలు వస్తుంటాయి. ఆకాశంలో చుక్కలు ఉన్నట్టుండి రాలిపడడం, లేదా ఆకాశం నల్లగా మారి చుక్కలు కనిపించకపోవడం అనేది... మంచి అవకాశం ఒకటి వచ్చినట్లే వచ్చి చేజారడాన్ని సూచిస్తుంది. కొన్ని మానసిక విశ్లేషణల ప్రకారం, వచ్చే జన్మ లక్ష్యాలను ఇప్పుడే నిర్దేశించుకొని వాటి గురించి ఎక్కువగా ఆలోచించేవారికి కూడా చుక్కల మధ్య విహరించినట్లు కలలు వస్తాయి. ఆధ్యాత్మిక విశ్లేషణల ప్రకారం అయితే, సరికొత్త జ్ఞానానికి చేరువ కావడాన్ని ఈ కల సూచిస్తుంది. శాస్త్రసాంకేతిక విషయాల మీద ఆసక్తి ఉన్నవాళ్లకు, అంతరిక్షం ఎప్పుడూ ఒక ప్రహేళిక లాంటిదే. వారిలో ఎప్పటికప్పుడు ఎన్నో ప్రశ్నలు మొలకెత్తుతుంటాయి. వాటికి సమాధానాలు మాత్రం అంత తేలిగ్గా దొరకవు. అలాంటి వారు ఆకాశంలోకి వెళ్లి చుక్కలతో మాట్లాడడం అనేది... సమాధాన తృష్ణను ప్రతిబింబిస్తుంది.