నింగిలో ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌... ఆటగాళ్ల వీడియో వైరల్‌! | China has Made a Football Ground in the Sky | Sakshi
Sakshi News home page

China: నింగిలో ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌... ఆటగాళ్ల వీడియో వైరల్‌!

Published Thu, Feb 22 2024 1:44 PM | Last Updated on Thu, Feb 22 2024 2:52 PM

China has Made a Football Ground in the Sky - Sakshi

ప్రపంచంలోని పలు దేశాలు ఇతర దేశాల ప్రజలను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఈ విషయంలో చైనా ముందుంటుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. ప్రపంచంలోని ఎవరికీ రాని ఆలోచనలు చైనా వారికి వస్తుంటాయి. అవి కార్యరూపం దాల్చినప్పుడు ప్రపంచాన్ని తనవైపునకు తప్పుకుంటాయి. తాజాగా చైనాలో మరో ఆకర్షణీయమైన ప్రాంతం ఏర్పాటయ్యింది. 

చైనా తాజాగా ఒక విచిత్రమైన ఫుట్‌బాల్ మైదానాన్ని నిర్మించింది. దానిని చూసినవారంతా విస్తుపోతున్నారు. తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నామంటున్నారు. పైగా ఈ ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో ఏమాత్రం భయం లేనివారే ఆడగలరంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చేస్తున్నారు. 

చైనాకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఫుట్‌బాల్ మైదానానం ఆకాశంలో తేలియాడుతూ కనిపిస్తుంది. ఈ మైదానం రెండు పర్వతాల మధ్య నున్న భాగంలో నెట్ సహాయంతో తయారు చేశారు. కొంతమంది ఆటగాళ్లు ఈ గ్రౌండ్‌లో ఉత్సాహంగా ఆడటం వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో చైనాలోని జెజియాంగ్‌లో చిత్రీకరించారు. 

ఈ వీడియో మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్‌’లో @gunsnrosesgirl3 అనే పేజీలో షేర్‌ చేశారు. ఈ వీడియోను ఇ‍ప్పటివరకూ రెండు లక్షల 70 వేల మంది వీక్షించారు. వీడియో చూసిన ఒక యూజర్‌ ‘వావ్ వాట్ ఎ గేమ్’అని రాయగా మరొక యూజర్‌ ‘ఇలా ఆడే ధైర్యం నాకు లేదు’ అని రాశాడు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement