క్రీడలు కావాలి, అవే మనల్ని మనుషుల్ని చేస్తాయి : ఆనంద్ మహీంద్ర
పారిశ్రామికవేత్త ఆనంద్‌మహీంద్ర మరో ఆసక్తికరమైన వీడియోతో అభిమానులను మరోసారి ఆకట్టుకున్నారు. నేషనల్ స్పోర్ట్స్ డే (ఆగస్టు29) సందర్భంగా క్రీడలు ప్రాముఖ్యతను వివరిస్తున్న ఒక వీడియోను పంచుకున్నారు. క్రీడలు మనల్ని మనుషులుగా చేస్తాయి అంటూ క్రీడల గొప్పతనాన్ని వివరించారు. ముఖ్యంగా బాలికావిద్య, సాధికారత ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ, రూపొందించిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు.
చదువుతోపాటు ఈరోజు కొత్తగా నేర్చుకుందాం అటూ ఈ వీడియో ప్రారంభమవుతుంది. ‘‘నీళ్ల కుండను మోయడానికి కాదు బాలిక శిరస్సు ఉన్నది, భయపడి పరిగెత్తడానికి కాదు కాళ్లున్నది, కేవలం సేద్యం కోసం చిందించడానికి మాత్రమే కాదు ఈ స్వేదం ఉన్నది. గోల్ అంటే రోటీలు చేయడానికి మాత్రమే కాదు’’ అంటూ ఫుట్‌బాల్ గోల్ సాధిస్తారు బాలికల బృందం. ఫుట్ బాల్ క్రీడ ద్వారా బాలికల విద్య, అభివృద్ధిని గురించి వివరించడం అద్భుతంగా నిలిచింది.
బాలికలు విద్య ద్వారా సాధికారత పొందే ప్రపంచాన్ని సృష్టించే దృక్పథంతో 1996లో ఆనంద్ మహీంద్రా కేసీ మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్‌లో ప్రాజెక్ట్ నన్హీ కాలీ ప్రాజెక్టును తీసుకొచ్చారు. పలు విధాలుగా బాలికా వికాసం కోసం ఈ సంస్థ కృషి చేస్తోంది. దాదాపు 7లక్షల మంది బాలికలకు సాయం అందించినట్టు నన్హీ కాలీ వెబ్‌సైట్ ద్వారా తెలుస్తోంది.
There is a very, very simple reason why Sports is important:
Because it makes us better human beings.
#NationalSportsDay pic.twitter.com/3IhiQmpB66— anand mahindra (@anandmahindra) August 30, 2024
Comments
Please login to add a commentAdd a comment