#Vinesh Phogat కుట్ర? కఠిన వాస్తవమా? గుండె పగిలిందంటున్న నెటిజన్లు | wrestler Vinesh Phogat disqualification from ParisOlympics social media reacts | Sakshi
Sakshi News home page

కుట్ర? కఠిన వాస్తవమా? గుండె పగిలిందంటున్న నెటిజన్లు

Published Wed, Aug 7 2024 1:23 PM | Last Updated on Wed, Aug 7 2024 3:17 PM

wrestler Vinesh Phogat disqualification from ParisOlympics social media reacts

ప్యారిస్‌  ఒలింపిక్స్‌లో  రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ ఆశలు అడియాసలయ్యాయి. భారత్‌కు మరో పతకం ఖాయమని ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న వేళ భారతీయ క్రీడాభిమానులకు ఊహించని షాక్‌ తగిలింది. ఫైనల్‌కు చేరి పతకం ఖాయం చేసుకున్న ఆనంద క్షణాలో ఆమెపై అనర్హత వేటు  పడటం సంచలనంగా మారింది. 50 కేజీల విభాగంలో  100 గ్రాములు ఎక్కువ బరువున్నకారణంగా ఆమెను అనర్హురాలిగా ఒలింపిక్‌ సంఘం ప్రకటించింది.

బరువు నియం​​త్రణకోసం 14 గంటలు నీరు కూడా తాగలేదు వినేశ్‌. బరువు తగ్గడానికి నిద్ర పోలేదు అయినా 100 గ్రాములు ఎక్కువ కావడం ఆమెతోపాటు,  కోట్లాదిమంది భారతీయులను గుండెల్ని బద్దలు చేసింది.  కానీ నీళ్లు తాగని కారణంగా డీహైడ్రేషన్‌కు గురికావడంతో వినేశ్‌ ఆస్పత్రి పాలైంది. 

దీంతో సోషల్‌మీడియాలో నెటిజన్లు బావురుమన్నారు. కుట్ర జరిగిందా, కఠిన వాస్తవమా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 100 గ్రా. కోసమా అంటూ మరికొంతమంది కమెంట్‌ చేశారు.  

నమ్మశక్యంగా లేదు.. గుండె కొట్టించుకున్నాసరిపోయేదిగా!
ఇది అసలు నమ్మశక్యంగా లేదు. 100 గ్రాముల కోసం అనర్హత వేటా? ఈ మాత్రం బరువు తగ్గేందుకు నెత్తి మీద వెంట్రుకలు తీయించుకున్నా సరిపోతుంది అంటూ  ప్రముఖ యూ ట్యూబర్‌  ధృవ్‌ రాఠీ  ట్వీట్‌ చేశారు. పలువురు నెటిజన్లు గుండె పగిలిన ఎమోజీలను పోస్ట్‌ చేశారు. మరోవైపు ‘నువ్వు విజేతవే.. వినేశ్‌... అధైర్యపడవద్దు’ అంటూ మరికొంతమంది వ్యాఖ్యానించారు. ఈ బాధ తీరనిది అంటూ మరికొందరు ట్వీట్‌ చేశారు.

ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనడాని కంటే ముందు మహిళా రెజర్లపై లైంగిక ఆరోపణల పోరాటంలో వినేశ్  ఫోగట్‌ ముందు వరుసలో నిలిచారు.  రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై  ఆ రోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement