వైరల్
ఆటవిడుపులో భాగంగా సెలబ్రిటీలు కుటుంబంతో గడిపే సంతోష సమయాలు వారికి మాత్రమే పరిమితమైనవి కాదు. అభిమానులకు కూడా సంతోషం కలిగిస్తాయి. ‘క్రికెటర్‌గా రోహిత్‌శర్మ ఏమిటి?’ అని చెప్పడానికి బోలెడు సమాచారం ఉంది.
‘తండ్రిగా రోహిత్ ఏమిటి?’ అని చెప్పడానికి ఈ వైరల్ ఫొటో ఒక్కటి చాలు. ‘ఫాదర్స్ డే’ సందర్బంగా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సముద్రపు ఒడ్డున తన కూతురు సమైరతో కలిసి రోహిత్‌శర్మ ఇసుకలో పిచ్చుక గూడు కడుతున్న ఫొటో ‘ఆహా’ అనిపిస్తోంది. ఈ ఫొటోకు ‘ఫ్యామిలీ టైమ్ ఈజ్ ది బెస్ట్ టైమ్’ అని కాప్షన్ ఇచ్చారు నెటిజనులు.
‘ది ఫాదర్, ది కెప్టెన్, ది హిట్‌మ్యాన్, ది భయ్యా, ది ఓపెనర్’ అని ఒక యూజర్ కామెంట్ పెట్టాడు.
మరో యూజర్ ‘బ్యూటీఫుల్ డాటర్ అండ్ ఫాదర్. లవ్ యూ మై మ్యాన్’ అని కామెంట్ పెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment