
ఇక్కడ సముద్ర తీరంలో చెస్ కాయిన్లలా కనిపిస్తున్నవి ఏమిటో తెలుసా?.. ఏవో శిల్పాల్లా ఉన్నాయి, ఎవరో పెట్టి ఉంటారులే అనిపిస్తోందికదా.. కానీ అవి శిల్పాలూ కాదు, ఎవరూ ఏర్పాటు చేయలేదు. ఇవి ప్రకృతి సృష్టించిన చిత్రాలు. కేవలం ఇసుకతో ఏర్పడిన చిన్నపాటి స్తంభాలు. అమెరికాలోని లేక్ మిషిగన్ ప్రాంతంలో రెండు రోజుల కింద ఈ చిత్రమైన ఇసుక ఆకృతులు ఏర్పడ్డాయి. వీటిని అక్కడ ‘హూడూస్’ అని పిలుస్తారు. (క్లిక్: అరుదైన గ్రహాంతర వజ్రం.. కాసులుంటే మీ సొంతం !)
అక్కడ చలికాలంలో నీళ్లు గడ్డకట్టేంతగా ఉష్ణోగ్రతలు పడిపోతాయి. సముద్ర తీరంలో నీళ్లు ఇసుకలో చేరి అక్కడక్కడా గడ్డకడతాయని, ఆ తర్వాత అలలకు ఇసుక కోతకు గురవడం, దానికి గాలి తోడవడంతో.. ఇలా రకరకాల ఆకారాల్లో ఇసుక స్తంభాలు ఏర్పడుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తాజాగా టెర్రీ అబ్బాట్ అనే ఫొటోగ్రాఫర్ తీసిన ఈ చిత్రాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. సముద్రం, భూమి కలిసి సరదాగా చెస్ ఆడుతూ.. మధ్యలో వదిలేసినట్టుగా ఉన్నాయంటున్నారు నెటిజన్లు. (చదవండి: అమెరికాను వణికిస్తున్న ఇజ్జీ.. 1,200 విమానాలు రద్దు)
Comments
Please login to add a commentAdd a comment