న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. నువ్వా-నేనా అన్నట్లు మాజీ అధ్యక్షుడు రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. కమలా హారిస్‌పై ఇప్పటికే ట్రంప్, ఆయన ప్రచార బృందం పలు ఆరోపణలు, విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా కమల మాట్లాడిన ‘యాస’పై కూడా ట్రంప్ ప్రచార బృందం పెద్దఎత్తున ట్రోల్ చేస్తోంది. ఆమె నకిలీ యాసతో ప్రసంగం చేసినట్లు ఆరోపణలు గుప్పిస్తోంది. కమల ప్రచారంలో భాగంగా మిచిగాన్‌లోని డెట్రాయిట్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన లేబర్ డే ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. అయితే ఆమె అక్కడి టీచర్లు, యూనియన్ సభ్యులను ఉద్దేశిస్తూ.. ‘వారంలో ఐదు రోజుల పని. సిక్ లీవు, వేతనంతో కూడిన సెలవు, వెకేషన్ కోసం సెలవు ఇస్తున్న యూనియన్ మెంబర్స్‌కు మీరంతా కృతజ్ఞతలు తెలిపాలి’ అని అన్నారు.
She’s turned into Foghorn Leghorn
pic.twitter.com/Z1OgJwh6Ht pic.twitter.com/xdXmiAYvEK— mjcmedic (@mjcmedic) September 2, 2024
అయితే ఆమె ఉద్దేశపూర్వకంగానే నకిలీ యాసతో మాట్లాడారని ట్రంప్ ప్రచారం బృందం సోషల్‌మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తోంది. కొంతమంది లూనీ ట్యూన్స్ పాత్ర అయిన ఫోఘోర్న్ లెఘోర్న్‌తో ఆమె యాసను పోల్చుతున్నారు. ఇక.. కమలా హారిస్ యాసపై విమర్శలు రావటం ఇదే మొదటిసారి కాదు. 2021లో అట్లాంటాలో ఓ ర్యాలీలో పాల్గొని మాట్లానప్పుడు యాసపై ఆమె విమర్శలు ఎదుర్కొన్నారు. అప్పుడు ఏకంగా ఆమె ఫ్రెంచ్ యాసలో మాట్లాడారని ఆరోపణలు చేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌ను పేరును అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించినప్పటి నుంచి ఆమెపై ట్రంప్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. జాత్యహంకార విమర్శలు మొదలుకొని ఆమె నవ్వుపై కూడా విమర్శలు చేశారు. ఇక.. ఇండో అమెరికన్ అయిన కమల కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో జన్మించారు. కమల తల్లి భారతీయురాలు కాగా, ఆమె తండ్రి జమైకన్ అన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment