Michigan
-
USA Presidential Elections 2024: వైట్‌హౌస్‌కు దారేది?..7 స్వింగ్ స్టేట్లే కీలకం!
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు తుది అంకానికి చేరింది. అంతా అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పోలింగ్ ప్రక్రియ మంగళవారం జరగనుంది. డెమొక్రాట్ల అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అత్యంత హోరాహోరీగా తలపడుతున్నారు. దాంతో వారిలో ఎవరు గెలుస్తారో ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి! అమెరికాలోని 50 రాష్ట్రాల్లో చాలావరకు రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల్లో ఏదో ఒకదానికి స్పష్టంగా మద్దతిచ్చేవే. వీటిని సేఫ్ స్టేట్స్‌గా పిలుస్తారు. ప్రతి అధ్యక్ష ఎన్నికల్లోనూ సదరు రాష్ట్రాలను ఆయా పార్టీలే గెలుచుకుంటాయి. కనుక ఎటూ తేల్చుకోని ఓటర్లు ఎక్కువగా ఉండే కొన్ని రాష్ట్రాల్లోనే పోటీ ప్రధానంగా కేంద్రీకృతం అవుతుంటుంది. వాటిని స్వింగ్ స్టేట్స్‌గా పిలుస్తుంటారు. ఈసారి అలాంటి రాష్ట్రాలు ఏడున్నాయి. అవే పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, మిషిగన్, నార్త్ కరోలినా, జార్జియా, నెవడా, అరిజోనా. 93 ఎలక్టోరల్ ఓట్లు వీటి సొంతం. వాటిలో మెజారిటీ ఓట్లను ఒడిసిపట్టే వారే అధ్యక్ష పీఠమెక్కుతారు. ట్రంప్‌కు 51, హారిస్‌కు 44 అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. విజయా నికి కనీసం 270 ఓట్లు రావాలి. 48 రాష్ట్రాల్లో మెజారిటీ ఓ ట్లు సాధించిన అభ్యర్థి తాలూకు పార్టీకే ఆ రాష్ట్రంలోని మొ త్తం ఎలక్టోరల్ ఓట్లు దఖలు పడే (విన్నర్ టేక్స్ ఆల్) విధా నం అమల్లో ఉంది. ఆ లెక్కన సేఫ్ స్టేట్లన్నీ ఈసారి ఆయా పార్టీల ఖాతాలోనే పడే పక్షంలో హారిస్ 226 ఓట్లు సాధిస్తారు. ట్రంప్‌కు మాత్రం 219 ఓట్లే వస్తాయి. స్వింగ్ స్టేట్లలో ని 93 ఓట్లు అత్యంత కీలకంగా మారడానికి కారణమిదే. ట్రంప్ గెలవాలంటే వాటిలో కనీసం 51 ఓట్లు సాధించాలి. హారిస్‌కు మాత్రం 44 ఓట్లు చాలు. గత కొద్ది ఎన్నికలుగా ఈ ఏడు స్వింగ్ స్టేట్ల ఓటింగ్ ధోరణి, ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా వాటిలో ఈసారి ఫలితాలు ఎలా ఉండవచ్చన్న దానిపై జోరుగా అంచనాలు, విశ్లేషణలు సాగుతున్నాయి.పెన్సిల్వేనియా కీలకం 19 ఎలక్టోరల్ ఓట్లున్న పెన్సిల్వేనియా ఈసారి మొత్తం అమెరికా దృష్టినీ ఆకర్షిస్తోంది. అక్కడ నెగ్గిన అభ్యర్థే అధ్యక్షుడయ్యే అవకాశాలు ఏకంగా 90 శాతమని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. జనాభా వైవిధ్యం విషయంలో కూడా ఆ రాష్ట్రం అచ్చం అమెరికాకు నకలులా ఉంటుంది. డెమొక్రాట్ల ఆధిపత్యం సాగే పెద్ద నగరాలు, రిపబ్లికన్ కంచుకోటలైన గ్రామీణ ప్రాంతాలు పెన్సిల్వేనియా సొంతం. దాంతో హారిస్, ట్రంప్ మధ్య హోరాహోరీ నెలకొంది.రస్ట్ బెల్ట్–సన్ బెల్ట్ అమెరికా నిర్మాణ రంగంలో ప్రముఖ పాత్ర పోషించే విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియాలను రస్ట్ బెల్ట్ రాష్ట్రాలుగా పిలుస్తారు. ఈ మూడింట్లో కలిపి 44 ఓట్లున్నాయి. మిగతా దేశంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండే నెవడా, అరిజోనా, నార్త్ కరోలినా, జార్జియాలను సన్ బెల్ట్ రాష్ట్రాలంటారు. వీటిలో మొత్తం 49 ఓట్లున్నాయి. → రస్ట్ బెల్ట్ నిర్మాణ రంగానికి నిలయం. దాంతో విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియాల్లో ఓటర్లపై కారి్మక సంఘాల ప్రభావం ఎక్కువే. → ఈ రాష్ట్రాలపై దశాబ్దాలుగా డెమొక్రాట్ల ఆధిపత్యమే సాగుతూ వస్తోంది. ఎంతగా అంటే, గత ఎనిమిది అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా ఏడుసార్లు ఈ మూడు రాష్ట్రాలూ ఆ పార్టీ ఖాతాలోనే పడ్డాయి. ఒక్క 2016లో మాత్రం వాటిలో పూర్తిగా ట్రంప్ హవా నడిచింది. → ఈసారి కూడా డెమొక్రాట్ల ఆధిపత్యమే సాగితే 44 ఓట్లూ కమల ఖాతాలోనే పడతాయి. అదే జరిగితే తొలి మహిళా ప్రెసిడెంట్‌గా ఆమె చరిత్ర సృష్టిస్తారు. → అలాగాక 2016లో మాదిరిగా ట్రంప్ మరోసారి ఈ మూ డు రాష్ట్రాలనూ నెగ్గినా విజయానికి ఏడు ఓట్ల దూరంలో నిలుస్తారు. అప్పుడాయన విజయం కోసం కనీసం మరో స్వింగ్ స్టేట్‌ను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. → ఒకవేళ హారిస్ రస్ట్ బెల్ట్ రాష్ట్రాల్లో కీలకమైన పెన్సిల్వేనియాతో పాటు మరోదాన్ని దక్కించుకున్నా ఆమె విజయావకాశాలు మెరుగ్గానే ఉంటాయి. మిగతా నాలుగు స్వింగ్ స్టేట్లలో ఏ ఒక్కదాన్ని నెగ్గినా ఆమె గెలిచినట్టే. ట్రంప్ గెలవాలంటే ఆ నాలుగింటినీ స్వీప్ చేయాల్సి ఉంటుంది. → హారిస్ రస్ట్ బెల్ట్‌లో సున్నా చుట్టినా నాలుగు సన్ బెల్ట్ రాష్ట్రాలను స్వీప్ చేస్తే విజయం ఆమెదే. → అయితే ఇందుకు అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే 1948 తర్వాత డెమొక్రాట్లు సన్ బెల్ట్‌ను క్లీన్‌స్వీప్ చేయలేదు. → రిపబ్లికన్లకు మాత్రం సన్ బెల్ట్‌ను పలుమార్లు క్లీన్‌స్వీప్ చేసిన చరిత్ర ఉంది. ఈసారీ అలా జరిగినా ట్రంప్ విజయానికి అది చాలదు. రస్ట్ బెల్ట్ నుంచి కనీసం ఒక్క రాష్ట్రాన్నైనా ఆయన చేజిక్కించుకోవాలి. లేదంటే 269 ఓట్లకు పరిమితమై ఓటమి పాలవుతారు.రస్ట్ బెల్ట్‌లో విజయావకాశాలు → రస్ట్ బెల్ట్‌లో హారిస్ గెలవాలంటే పట్టణ ఓటర్లు భారీగా ఓటేయాల్సి ఉంటుంది. నల్లజాతీయులు, మైనారిటీలు, విద్యాధికులు, మధ్య తరగతి ఓట్లు, ముఖ్యంగా మహిళలు పోలింగ్ బూత్‌లకు తరలడం తప్పనిసరి. → అలాగాక గ్రామీణ ఓటర్లు భారీగా ఓటేస్తే 2016లో మాదిరిగా మరోసారి రస్ట్ బెల్ట్ ట్రంప్‌దే అవుతుంది. → ఈసారి గ్రామీణులతో పాటు యువ ఓటర్లు కూడా తనకే జైకొడతారని ఆయన ధీమాగా ఉన్నారు. సన్ బెల్ట్‌లో విజయావకాశాలు → ఇక్కడ విజయావకాశాలను అమితంగా ప్రభావితం చేసేది నల్లజాతీయులు, లాటిన్ అమెరికన్ ఓటర్లే. → జార్జియా, నార్త్ కరోలినాల్లో నల్లజాతి ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. అరిజోనా, నెవడాల్లో లాటిన్ అమెరికన్ జనాభా నానాటికీ పెరుగుతోంది. → హారిస్ జమైకన్ మూలాల దృష్ట్యా నల్లజాతీయులు ఆమెవైపే మొగ్గుతారని భావిస్తున్నారు. ఇక ట్రంప్ ర్యాలీలో ప్యూర్టోరీకన్లు, లాటిన్ అమెరికన్లపై వెలువడ్డ వ్యంగ్య వ్యాఖ్యలపై ఆగ్రహంతో వారు కూడా హారిస్‌కే ఓటేస్తారని డెమొక్రాట్లు ఆశిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కమల ‘యాస’పై ట్రంప్ బృందం ట్రోల్స్
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. నువ్వా-నేనా అన్నట్లు మాజీ అధ్యక్షుడు రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. కమలా హారిస్‌పై ఇప్పటికే ట్రంప్, ఆయన ప్రచార బృందం పలు ఆరోపణలు, విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కమల మాట్లాడిన ‘యాస’పై కూడా ట్రంప్ ప్రచార బృందం పెద్దఎత్తున ట్రోల్ చేస్తోంది. ఆమె నకిలీ యాసతో ప్రసంగం చేసినట్లు ఆరోపణలు గుప్పిస్తోంది. కమల ప్రచారంలో భాగంగా మిచిగాన్‌లోని డెట్రాయిట్ స్కూల్లో ఏర్పాటు చేసిన లేబర్ డే ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. అయితే ఆమె అక్కడి టీచర్లు, యూనియన్ సభ్యులను ఉద్దేశిస్తూ.. ‘వారంలో ఐదు రోజుల పని. సిక్ లీవు, వేతనంతో కూడిన సెలవు, వెకేషన్ కోసం సెలవు ఇస్తున్న యూనియన్ మెంబర్స్‌కు మీరంతా కృతజ్ఞతలు తెలిపాలి’ అని అన్నారు.She’s turned into Foghorn Leghornpic.twitter.com/Z1OgJwh6Ht pic.twitter.com/xdXmiAYvEK— mjcmedic (@mjcmedic) September 2, 2024 అయితే ఆమె ఉద్దేశపూర్వకంగానే నకిలీ యాసతో మాట్లాడారని ట్రంప్ ప్రచారం బృందం సోషల్‌మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తోంది. కొంతమంది లూనీ ట్యూన్స్ పాత్ర అయిన ఫోఘోర్న్ లెఘోర్న్తో ఆమె యాసను పోల్చుతున్నారు. ఇక.. కమలా హారిస్ యాసపై విమర్శలు రావటం ఇదే మొదటిసారి కాదు. 2021లో అట్లాంటాలో ఓ ర్యాలీలో పాల్గొని మాట్లానప్పుడు యాసపై ఆమె విమర్శలు ఎదుర్కొన్నారు. అప్పుడు ఏకంగా ఆమె ఫ్రెంచ్ యాసలో మాట్లాడారని ఆరోపణలు చేశారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌ను పేరును అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించినప్పటి నుంచి ఆమెపై ట్రంప్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. జాత్యహంకార విమర్శలు మొదలుకొని ఆమె నవ్వుపై కూడా విమర్శలు చేశారు. ఇక.. ఇండో అమెరికన్ అయిన కమల కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో జన్మించారు. కమల తల్లి భారతీయురాలు కాగా, ఆమె తండ్రి జమైకన్ అన్న విషయం తెలిసిందే. -
అమెరికాలో కాల్పులు.. పదిమందికి గాయాలు
మిచిగాన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. మిచిగాన్‌లోని ఓ చిల్డ్రన్స్ వాటర్ పార్క్ వద్ద శనివారం సాయంత్రం గుర్తుతెలియని దుండగుడు కాల్పులు తెగపడ్డాడు. దీంతో అక్కడ ఉన్న ఎనిమిదేళ్ల చిన్నారితో సహా 10 మందికి గాయలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాల్పలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు.US Shooting: Nine Including Children Injured After Gunman ‘Randomly’ Opens Fire at Splash Pad in Michigan’s Rochester Hills, SWAT Team Mobilised (Watch Videos)https://t.co/tzoa7U1wtM#US #Michigan #RochesterHills #Shooting— LatestLY (@latestly) June 16, 2024 శనివారం సాయంత్ర 5 గంటలకు చిల్డ్రన్స్ పార్క్‌కు వద్ద గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి ఒక్కసారిగా కాల్పులు జరిపినట్లు మిషిగాన్పోలీసులు తెలిపారు. పలుసార్లు అతడు గన్‌లోడ్ చేసుకొని మరీ 28 సార్లు కాల్పులు జరిపినట్లు తెలిపారు. అయితే అతడు ఎందుకు కాల్పులు జరిపాడనేది ఇంకా తెలియరాలేదు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటివల అమెరికాలోని ఓహియో నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. వరుస ఘటనలు అమెరికాలో చర్చనీయాంశంగా మారాయి. -
USA presidential election 2024: మరో మూడు ప్రైమరీలు
కొలంబియా(యూఎస్): అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యరి్థత్వం డొనాల్డ్ ట్రంప్‌కు దాదాపుగా ఖాయమైనట్టే. తాజాగా మిస్సోరీ, ఐదహో, మిషిగన్ ప్రైమరీల్లో ఆయన విజయం సాధించారు. ఆయనకు మద్దతు పలికిన డెలిగేట్ల సంఖ్య 244కు పెరిగింది. ప్రత్యర్థి నిక్కీ హేలీ కేవలం 24 డెలిగేట్ల మద్దతుతో చాలా వెనుకంజలో ఉన్నారు. రిపబ్లికన్ అభ్యర్థిత్వం దక్కాలంటే 1,215 డెలిగేట్ల మద్దతు కావాలి. మిషిగన్ రాష్ట్ర ప్రైమరీలో 68 శాతం ఓట్లు ట్రంప్‌కు, 27 శాతం ఓట్లు హేలీకి పడ్డాయి. మంగళవారం జరగబోయే 16 ప్రైమరీల ఫలితాలతో రిపబ్లికన్, డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థులు దాదాపు తేలిపోనున్నారు. మొత్తం డెలిగేట్లలో మూడింట ఒక వంతు మంది ఆ రోజున తమ పార్టీ తరఫున అభ్యర్థిగా ఎవరు ఉండాలనేది ఓటేసి నిర్ణయిస్తారు. ఇప్పటివరకు కొనసాగిన ట్రంప్ అజేయ జైత్రయాత్ర చూస్తుంటే బైడెన్‌కు పోటీగా బరిలో దిగే రిపబ్లికన్ అభ్యర్థి ట్రంపేనని దాదాపు ఖరారైనట్టు కన్పిస్తోంది. -
అయింది వేలల్లో...వేసింది మాత్రం లక్షల్లో!
మనం రెస్టారెంట్‌కి వెళ్లితే బిల్ తోపాటు బాగా సర్వింగ్ చేసిన వ్యక్తికి కాస్త టిప్ ఇస్తాం. ఇది సహజం. కానీ ఇక్కడొక కస్టమర్ తాను బిల్లు చేసింది వేలల్లో అయితే టిప్పి మాత్రం ఏకంగా లక్షలు ఇచ్చాడు. ఎక్కడ జరిగిందంటే ఈ ఘటన.. ఈ ఆశ్చర్యకర ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. యూస్‌లోని మిచిగాన్‌లో ఉన్న ది మాసన్ జార్ కేఫ్ అనే రెస్టారెంట్‌కి మార్క్ అనే వ్యక్తి బ్రేక్ ఫాస్ట్ చేయడానికి వచ్చాడు. అయితే అతడు అక్కడ తిన్న బ్రేక్ ఫాస్ట్‌కి అయ్యిన ఖర్చు కేవలం రూ. 2,500/- మాత్రమే అయ్యింది. కానీ అతను ఏకంగా రూ. 8 లక్షలు టిప్ చెల్లించాడు. దీంతో అవాక్కయిన సర్వర్ ఈ విషయం మేనేజర్‌కి చెప్పడంతో వారంతా ఆశ్చర్యపోయారు. ఈ మేరకు సదరు రెస్టారెంట్ ఈ విషయాన్ని ఫేస్బుక్లో వివరిస్తూ..ఆ వ్యక్తి విశాల హృదయానికి ధన్యావాదాలు తెలిపింది. అతను ఇచ్చిన డబ్బును సహోద్యోగులు సమంగా పంచుకున్నారని, ప్రతి ఒక్కరూ రూ. 90 వేల చొప్పున ఇంటికి తీసుకువెళ్లారని అన్నారు. ఆయన తన బిల్లు కంటే ముప్పై వేల రెట్టు చెల్లించాడని రెస్టారెంట్ మేనేజర్ అన్నారు. అతనికి ఎన్ని విధాలుగా కృతజ్ఞతలు చెప్పినా అది తక్కువే అని భావోద్వేగంగా అన్నాడు. నిజానికి డిజిటల్ టిప్పింగ్ కల్చర్ సర్వే ప్రకారం..యూఎస్‌లోని వ్యక్తులు భోజనం చేసేటప్పుడు వారి బిల్లులో సగటున అంటే.. 16% టిప్పుగా ఇస్తారు. కానీ మార్క్ దాతృత్వం చాలా దయతో చేసిన చర్య అని కొనియాడారు. View this post on Instagram A post shared by Mason Jar Cafe (@masonjarcafe_) (చదవండి: ఫుల్‌గా తాగితే తాగితే చిరుత అయినా అంతేనా! ఇలానే ఉంటుందా..?) -
కాబోయే డాక్టర్‌కు ‘మిస్ ఇండియా యూఎస్ఏ 2023’ కిరీటం (ఫొటోలు)
-
Miss India USA 2023: కాబోయే డాక్టరమ్మకు అందాల కిరీటం
‘అందమే ఆనందం’ అనుకోవడంతో పాటు ‘ఆనందమే అందం’ అనుకునే రిజుల్ మైని మిచిగాన్ (యూఎస్)లో మెడికల్ స్టూడెంట్. ఈ ఇండో– అమెరికన్ స్టూడెంట్ ‘మిస్ ఇండియా యూఎస్ఏ 2023’ కిరీటాన్ని గెలుచుకుంది... ‘మిస్ ఇండియా యూఎస్ఏ’ టైటిల్ గెలుచుకోవడానికి 25 రాష్ట్రాల నుంచి 57 మంది పోటీ పడ్డారు. ‘వినయంతో, ఒకింత గర్వంతో నేను మిస్ ఇండియా యూఎస్ఏ 2023 అని చెబుతున్నాను. నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లేకపోతే ఈ విజయం సాధ్యం అయ్యేది కాదు. నా ప్రయాణంలో అడుగడుగునా స్నేహితులు అండగా నిలిచారు. విలువైన సూచనలు ఇచ్చారు’ అంటుంది రిజుల్ మైని. ఇరవై నాలుగు సంవత్సరాల ఇండియన్–అమెరికన్ రిజుల్ మైని తనను తాను మెడికల్ స్టూడెంట్, మోడల్‌గా పరిచయం చేసుకుంటుంది. సర్జన్ కావాలనేది తన లక్ష్యం. స్కూలు రోజుల నుంచి చదువుకు ఎంత ప్రాధాన్యత ఇచ్చేదో, కళలు, సాంస్కృతిక సంబంధిత కార్యక్రమాలకు అంతే ప్రాధాన్యత ఇచ్చేది రిజుల్. మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీలో ‘హ్యుమన్ సైకాలజీ’లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన రిజుల్‌కు ఖాళీ సమయం అంటూ ఉండదు. ఎప్పుడూ సందడి సందడిగా ఉంటుంది. ఆమె హాబీల జాబితాలో పెయింటింగ్, కుకింగ్, గోల్ఫింగ్... ఇలా ఎన్నో ఉన్నాయి. స్వచ్ఛంద కార్యక్రమాలలోనూ ముందుంటుంది. వైద్యానికి సంబంధించిన సరికొత్త విషయాలు, పుస్తకాలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో ఇతరులతో పంచుకోవడం అంటే ఇష్టం. ‘కళ అనేది మనసులోని మాలిన్యాన్ని శుభ్రం చేస్తుంది’ అనే మాట రిజుల్ మైనికి ఇష్టం. అందుకేనేమో ఆమెకు కళలు అంటే అంత ఇష్టం. కళలు ఉన్నచోట వెలుగు ఉంటుంది. ఆ వెలుగే అందం. ఆనందం. -
తప్పిపోయినా.. శునకం వద్ద క్షేమం..!
మిషిగన్: రాత్రి వేళ రెండు పెంపుడు కుక్కలతోపాటు కనిపించకుండా పోయిన ఓ చిన్నారి కోసం పోలీసులు, స్థానికులు కలిసి అటవీ ప్రాంతంలో భారీగా గాలించారు. ఇందుకోసం డ్రోన్లు, పోలీసు జాగిలాలను సైతం వాడారు. చివరికి ఆల్ టెర్రయిన్ వెహికల్(ఏటీవీ) చిన్నారి జాడను కనిపెట్టింది. అప్పటికే ఆ చిన్నారి ఒక పెంపుడు కుక్కను దిండుగా చేసుకుని నిద్రిస్తుండగా మరో శునకం జాగ్రత్తగా కాపలా కాస్తూ కనిపించింది. ఇది చాలా అద్భుతమైన విషయమని అందరూ అంటున్నారు. అమెరికాలో మిషిగన్‌లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఫెయిత్ హార్న్‌కు చెందిన థియా చేజ్ అనే రెండేళ్ల బాలిక బుధవారం రాత్రి 8 గంటలప్పుడు ఇంటి నుంచి కనిపించకుండాపోయింది. ఆమె వెంట రెండు కుక్కలు కూడా ఉన్నాయి. విషయం తెలిసిన పోలీసులు స్థానికులతో కలిసి పరిసర అటవీప్రాంతంలో భారీగా అన్వేషణ మొదలుపెట్టారు. ఆల్ టెర్రయిన్ వెహికిల్(ఏటీవీ), డ్రోన్లు, పోలీసు జాగిలాలతో కొన్ని గంటల పాటు గాలించారు. చివరికి వారి ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో థియా ఉన్న విషయాన్ని ఏటీవీ పసిగట్టింది. పోలీసులు వెళ్లే సరికి ఓ చోట వెంట ఉన్న ఒక శునకాన్ని దిండుగా చేసుకుని చిన్నారి నిద్రిస్తుండగా, మరో జాగిలం అప్రమత్తంగా కాపలా కాస్తూ ఉండటం కనిపించింది. ఈ దృశ్యం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. -
మొక్కవోని ధైర్యం.. గడ్డంతో ఆమె గిన్నిస్ బుక్‌లోకి
అమెరికా మిచ్గాన్కు చెందిన ఎరిన్ హనీకట్. వయసు 38 ఏళ్లు. గత రెండేళ్లుగా నాన్‌స్టాప్‌గా గడ్డం పెంచుతూనే ఉంది. అది ఇప్పుడు 30 సెం.మీ. పెరిగి.. గిన్నిస్ బుక్‌లోకి ఆమె పేరును ఎక్కించింది. అందుకు కారణం.. అతిపొడవైన గడ్డంతో భూమ్మీద జీవించి ఉన్న మహిళ ఈమెనే కాబట్టి. ఎరిన్ గడ్డం సహజమైందట. ఎలాంటి హార్మోన్లు, సప్లిమెంట్లు తీసుకోలేదట. ఆమెకు ఉన్న పాలిసిస్టిక్ ఓవెరియన్ సిండ్రోమ్(PCOS) వల్లే ఆమెను ఇలా మార్చేసింది. ఈ సిండ్రోమ్‌తో ఇలా జుట్టు పెరగడం మాత్రమే కాదు.. పీరియడ్స్ సజావుగా రాకపోవడం, బరువు పెరగడం, సంతానలేమి లాంటి సమస్యలు ఆమెను చుట్టుముట్టాయి. పీకోస్ వల్ల 13వ ఏట నుంచే ఆమె ముఖంపై గడ్డం పెరగడం ప్రారంమైందట. షేవింగ్, వ్యాక్సింగ్, అవాంఛిత రోమాల్ని తొలగించే అన్ని పద్ధతుల్ని ఆమె ఉపయోగించారట. ఒక్కోసారి రోజుకు మూడుసార్లు షేవింగ్ చేసిన సందర్భాలూ ఉన్నాయట. అయినా లాభం లేకుండా పోయింది. ఈలోపు ఓ యాక్సిడెంట్లో ఆమె కాలికి తగిలిన గాయంతో ఇన్ఫెక్షన్ సోకి.. కాలిని తీసేయాల్సి వచ్చింది. అంతేకాదు ఆ ప్రభావం మరికొన్ని అవయవాలపై కూడా పడింది. ఏళ్లు గడిచేకొద్దీ ఆరోగ్యం దిగజారి.. మానసికంగా కుంగిపోతున్న ఆమెకు డాక్టర్లు ఆమెకు ధైర్యం కోసం చెప్పిన మాటలు.. ‘అయ్యేదేదో ఎప్పటికైనా అవుతుంది. సంతోషంగా జీవితంలో ముందుకుసాగిపో అని. ఆ మాటలతో ఆమె తనను తాను మార్చుకుంది. తాను మహిళగా ఉండడం కన్నా.. సంతోషంగా కనిపించాలని నిర్ణయించుకుంది. ఈలోపు మరికొన్ని అనారోగ్య పరిస్థితులు ఆమెను చుట్టుముట్టాయి. అయినా ఆమె చెక్కుచెదర్లేదు. భాగస్వామి సహకారంతో.. మొక్కవోని ధైర్యంతో జీవితంలో ముందుకు సాగుతోంది. ఇప్పుడు పొడవైన గడ్డంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. ఇంతకు ముందు ఈ రికార్డు అమెరికాకే చెందిన 75 ఏళ్ల వివియన్ వీలర్ పేరిట ఉండేది. -
ఏం టైమింగ్ రా?.. 60 మందిని కాపాడాడు
Viral Video: పిల్లలను నేర్పాల్సింది విద్యాబుద్ధులు మాత్రమే కాదు.. సంఘంలో ఎలా మెలగాలన్నది కూడా!. సోషల్ మీడియాలో ఎరాలో పిల్లల్ని తప్పుదోవ పట్టించే రీతిలోనే ఉంటోంది చాలామంది తల్లిదండ్రుల పెంపకం. టెక్నాలజీ అవసరమే.. కానీ అది ఏ తరహాలో ఉండాలన్నది పిల్లలకు అలవాటు చేయాల్సింది పేరెంట్స్. ఇదంతా ఎందుకంటే.. తాజాగా ఏడో గ్రేడ్ చదివే ఓ చిన్నారి చేసిన పని.. ఏకంగా 60 మందికి పైగా ప్రాణాల్ని నిలబెట్టింది కాబట్టి. మిచిగాన్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది. డ్రైవర్ కళ్లు తిరిగి పడితే.. ఓ విద్యార్థి సకాలంలో స్పందించాడు. డ్రైవర్ సీటులోకి దూకి.. ఎమర్జెన్సీ స్టాపర్ సాయంతో బస్సును ఆపేశాడు. ఆ ఘటన బస్సులోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. సాహసంగా ముందుకు దూకిన స్టూడెంట్ను దిల్లాన్ రీవ్స్గా గుర్తించిన అధికారులు అభినందించారు. బస్సును ఆపడమే కాదు.. ఎమర్జెన్సీ నెంబర్‌కు డయల్ చేయాలంటూ కేకలు వేశాడు ఆ స్టూడెంట్. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. -
అత్తెసరు మార్కులు వచ్చే అమ్మాయి నుంచి సీఈఓగా.. లాభాల బాటలో..
పరీక్షల్లో అత్తెసరు మార్కులు వచ్చే అమ్మాయి... మాస్టర్ ప్రశ్న అడిగితే బిత్తరచూపులు చూసే అమ్మాయి... క్లాసురూమ్‌లో కూర్చొని పాఠం వినడాన్ని భారంగా భావించే అమ్మాయి ‘భవిష్యత్ ఎలా ఉండబోతుంది?’ అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం ఎవరికైనా కష్టం కాకపోవచ్చు. మరి అదే అమ్మాయి చదువుపై శ్రద్ధ చూపితే...సమాధానం చెప్పడం అంజలి సూద్‌కు మాత్రమే సాధ్యమవుతుంది. అంజలి సూద్ అమెరికాలోని ఫ్లింట్ నగరం(మిచిగాన్)లో పుట్టింది. తల్లిదండ్రులు పంజాబ్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. చిన్నప్పుడు పరీక్షలలో అంజలి చాలా పొదుపుగా తెచ్చుకునే మార్కులను చూసి‘ఈ అమ్మాయి హైస్కూల్ దాటి కాలేజీ గడప తొక్కడం కష్టమే’ అనుకునేవారు పెద్దలు. క్లాస్‌రూమ్‌లో టీచర్ ఎప్పుడైనా పాఠానికి సంబంధించిన ప్రశ్న ఏదైనా వేస్తే ఆమె జవాబు చెప్పిన సందర్భం అంటూ లేదు. అలాంటి అమ్మాయి కాస్తా కాలక్రమంలో మారింది, చదువు మీద శ్రద్ధ పెట్టింది. మార్కులు పెంచుకుంటూ పోయింది. ‘బాగా చదువుతున్నావు’ అనే ప్రశంస ఆమెకు మరింత బలాన్ని ఇచ్చి ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా చేసింది. ‘వార్టన్ స్కూల్ ఆఫ్ ది యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా’లో ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ చదువుకున్న అంజలి హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేసింది. చదువు పూర్తయిన తరువాత ఫైనాన్స్, మీడియా, ఇ–కామర్స్‌కు సంబంధించిన సంస్థల్లో పనిచేసింది. అంజలి ప్రతిభ గురించి ఆ నోటా ఈ నోటా విన్న ఆన్లైన్ వీడియో మార్కెటింగ్ సంస్థ ‘విమియో’ తమ సంస్థలోకి ఆహ్వానించింది. ‘హెడ్ ఆఫ్ గ్లోబల్ మార్కెటింగ్’ ‘జనరల్ మేనేజర్’ (కోర్ క్రియేటర్ బిజినెస్) హోదాల్లో పనిచేసింది. విమియో బిజినెస్ (మార్కెటింగ్, బ్రాండ్స్‌కు మెంబర్షిప్ ప్లాన్)లాంటి ఎన్నో కార్యక్రమాలను లాంచ్ చేసి సక్సెస్ అయింది. అంజలి సృజనాత్మక ఆలోచనలు, వ్యాపార ఎత్తుగడలు నచ్చి సంస్థ ఆమెను ‘సీయీవో’ స్థానంలో కూర్చోబెట్టింది. సీఈవోగా కొత్త స్ట్రాటజీతో ముందుకు దూసుకు వెళ్లింది. వీడియో క్రియేటర్స్ కోసం కొత్త సాఫ్ట్‌వేర్‌ను, టూల్స్‌ను ప్రవేశ పెట్టింది. ‘మనం చేస్తున్న బిజినెస్ మాత్రమే’ అన్నట్లుగా కాకుండా చుట్టుపక్కల ఏం జరుగుతోందో గమనించడం అంజలి అలవాటు. వీడియో ఎడిటింగ్ అండ్ వీడియో మార్కెటింగ్ సంస్థ ‘మాజిస్టో’ను కొనుగోలు చేయడం ‘విమియో’కు కలిసొచ్చింది. 34 ఏళ్ల వయసులోనే సీయీవోగా బాధ్యతలు చేపట్టి ‘విమియో’ను వరల్డ్స్ లార్జెస్ట్ ఆన్లైన్ యాడ్–ఫ్రీ వీడియో ప్లాట్‌ఫామ్‌గా ఉన్నతస్థానంలో నిలిపింది అంజలి. ‘నేను ఈ స్థాయికి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. చేసిన పనికి గుర్తింపు లభిస్తే చాలు అనుకునేదాన్ని. ఆ గుర్తింపే నన్ను ఇక్కడ వరకు తీసుకువచ్చింది. ఒక పెద్ద బాధ్యత మనల్ని వెదుక్కుంటూ వచ్చినప్పుడు నేను చేయగలనా? అని భయపడడం కంటే ఎందుకు చేయలేను అని అనుకోవడంలోనే సక్సెస్ మంత్ర దాగి ఉంది’ అంటుంది అంజలి. చిన్న వయసులోనే కెరీర్లో ఉన్నత శిఖరాలకు చేరిన అంజలి మహిళలకు స్ఫూర్తిదాయకం. చదవండి: Meenakshi Gadge: ఇది మీనాక్షి ఊరు.. సినిమాల్లోనే ఇలాంటి పల్లె ఉంటుందా? అదేం కాదు.. వైకల్యాన్ని జయించి, స్పూర్తిగా నిలిచిన గీతా ఎస్ రావు -
Mystery: ఆ మాటలు వణుకు పుట్టించాయి! మత్స్యకారుల వలలో మృతదేహం! నేటికీ..
అది 2010 జనవరి 12, రాత్రి ఎనిమిది కావస్తోంది. పన్నెండు డిగ్రీల వాతావరణంలో మంచు.. వానలా కురిసే రోజులవి. అమెరికాలోని మిషిగన్‌లో సెయింట్ పాల్ కేథలిక్ చర్చ్‌కి, క్లెయిర్ సరస్సుకు మధ్యలో వన్–వే ఎగ్జిట్ డ్రైవ్‌వేలో పెట్రోలింగ్ చేస్తున్న లెఫ్టినెంట్ ఆండ్రూ దృష్టి.. ఆగి ఉన్న ఓ సిల్వర్ కలర్ కారు మీద పడింది. అది సరస్సుకు వంద అడుగుల దూరంలో ఉంది. దగ్గరకు వెళ్లిన ఆండ్రూ కారుని పరిశీలనగా చూశాడు. కారులో ఎవరూ లేరు. ఆ చుట్టుపక్కలా ఎవరూ లేరు. ‘ఇన్ఫర్మేషన్ నెట్వర్క్’లో కారు నంబరు చెక్ చేసి, కారు మిషెల్ అనే అమ్మాయి పేరు మీద ఉన్నట్లు నిర్ధారించుకున్నాడు. కారుకి ఏదైనా సమస్య వచ్చి వదిలారనుకుని, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరో గంట తర్వాత పెట్రోలింగ్‌లో ఉన్న పబ్లిక్ సేఫ్టీ ఆఫీసర్ కీత్ దృష్టి కూడా ఆ కారు మీదే పడింది. కారు ముందు సీట్లో హ్యాండ్ బ్యాగ్ ఉండటంతో అతడికి అనుమానం మొదలైంది. మంచునేలపై కొన్ని అడుగుల ఆనవాళ్లు.. కారు నుంచి సరస్సు వైపు దారిని చూపడంతో, కీత్ వాటినే అనుసరించాడు. సుమారు 75 అడుగుల తర్వాత రెండు విరిగిన దిమ్మలపై పేరుకున్న మంచు మరింత రక్తికట్టించే కథను చెప్పు కొచ్చింది. ఒక దిమ్మపై మనిషి కూర్చున్నట్లు, మరో దిమ్మపై మనిషి జారి సరస్సులో పడినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. వాటిని గమనించిన కీత్, వెంటనే ఆండ్రూ సాయం కోరాడు. తక్షణమే రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. కారు నంబర్ ఆధారంగా.. అడ్రెస్ పట్టుకుని.. తొమ్మిదిన్నర అయ్యేసరికి మిషెల్ ఇంటికి చేరుకున్నారు పోలీసులు. కాలింగ్ బెల్ కొట్టగానే.. ‘ఇంత ఆలస్యమా?’ అన్నట్లు మిషెల్ ఆత్రంగా తలుపు తీసింది. అప్పటి దాకా సరస్సులో పడింది మిషెల్ అనుకున్న పోలీసులు, తలుపు తీసింది స్వయంగా ఆమేనని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. వచ్చింది తన తల్లి జోవాన్ అనుకున్న మిషెల్.. పోలీసులను చూసి షాక్ అయ్యింది. కారు జోవాన్(50) తీసుకుని వెళ్లిందని తెలుసుకున్న పోలీసులు, ‘మీరు ఆమెతో చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు?’ అని అడిగారు. ఆ ప్రశ్నకు మిషెల్‌కి గుండె ఆగినంత పనైంది. వెంటనే తల్లి ఫోన్‌కి వరసగా డయల్ చేస్తూనే ఉంది. ‘దిస్ నంబర్ ఈజ్ అవుటాఫ్ స్టేషన్’ అనే మాటలు వణుకు పుట్టించాయి. రాత్రి పది దాటేసరికి మిషెల్, తన చెల్లెలు కెల్లీ, తమ్ముడు మైకేల్ ముగ్గురూ కలిసి బిక్కు బిక్కమంటూ పోలీసుల వెంట సరస్సు దగ్గరకు వెళ్లారు. కారు చుట్టూ ఉన్న క్రైమ్ సీన్ టేప్ వాళ్లని మరింత భయపెట్టింది. ఎటు చూసినా పోలీసులే! వారిలో ఒక పోలీస్ ‘జోవాన్ మీ మదరా? ఆవిడ ఈ లేక్‌లో పడిపోయారు’ అన్న మాటలు చుట్టూ చెలరేగే శబ్దాలను నిశబ్దం చేస్తూ ఒక్కసారిగా వారిని దుఃఖంలో ముంచెత్తాయి. కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లలతో, లేక్ షోర్ డ్రైవ్‌లతో సరస్సు మొత్తం జల్లెడపడుతున్నాడు. మర్నాడు తెల్లవారుజామున 4 గంటలకు సర్చ్ ఆపేసి, కారును పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లిపోయారు. ఏదైనా సమాచారం అందితే చెబుతామంటూ మిషెల్ వాళ్లని ఇంటికి పంపించేశారు. జోవాన్ 1980లో డేవిడ్ రోమైన్ అనే వ్యక్తిని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. పెళ్లి అయిన ఇరవై ఐదేళ్లకి విడాకులు ఇచ్చి, తన ముగ్గురు పిల్లలతో కలిసి బతకడం మొదలుపెట్టింది. అయితే విడిపోయే వరకూ ఇద్దరి మధ్య చాలా గొడవలు నడిచాయి. జోవాన్‌కు స్నేహితులు ఎక్కువ. ఎప్పుడూ పార్టీలు, గెట్ టుగెదర్ అంటూ జీవితంలో తనకు తానే సంతోషాన్ని సృష్టించుకునేది. అలాంటి మనిషి అకస్మాత్తుగా కనిపించకపోవడం ఆమె పిల్లలకే కాదు, ఆమె సన్నిహితులకు కూడా మింగుడుపడలేదు. జోవాన్ తప్పకుండా తిరిగి వస్తుందనే వారంతా నమ్మారు. మర్నాడే కారు స్పేర్ కీతో హ్యాండ్ బ్యాగ్ బయటికి తీశారు పోలీసులు. అందులో 15 వందల డాలర్లు సురక్షితంగా ఉండటంతో, ఈ కేసు కుట్రపూరితం కాదని తేల్చేశారు. సరిగ్గా డబ్భై రోజులకు బోబ్లో దీవిలో డెట్రాయిట్ నదిలో మత్స్యకారుల వలలో ఓ మృతదేహం చిక్కింది. అది జోవాన్దేనని తేలింది. ఆ దీవి.. క్లెయిర్ సరస్సుకు 35 మైళ్ల దూరంలో ఉంది. పోలీసులు ఆత్మహత్యగా నిర్ధారించారు. అయితే, ‘మా మామ్‌ని ఎవరో కావాలనే చంపేశారు. కేసు తారుమారు చేయడంలో పోలీసుల పాత్ర కూడా ఉంది, తను మిస్ అవ్వడానికి ముందురోజుల్లో తనను ఎవరో ఫాలో అవుతున్నారని భయపడింది’ అంటూ కోర్టుకెక్కారు జోవాన్ పిల్లలు. ఆ రోజు కారు సమీపంలో, సరస్సు చుట్టు ప్రక్కల పాదముద్రలు కానీ, సరస్సులో పడిన ఆనవాళ్లు కానీ లేవని చీఫ్ జెన్సన్ తేల్చి చెప్పడంతో వివాదం ముదిరింది. పోలీసులపై నమ్మకం లేని మిషెల్.. రాండాల్ అనే ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ని నియమించుకుంది. అతడు చర్చిలో చాలామంది సాక్షులతో మాట్లాడాడు. ఆ రోజు చర్చి నుంచి బయటికి వచ్చే సమయంలో జోవాన్ కారు నుంచి అలారం మోగిందని, పొరబాటున టచ్ అయ్యి ఉంటుందనుకున్నామని కొందరు, సమీపంలో ఓ నల్లటి వ్యాన్ని, నల్ల కండువా ధరించిన మనిషిని చూశామని మరికొందరు చెప్పుకొచ్చారు. మరి జోవాన్ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే చర్చికి వెళ్లేముందు ఎందుకు కారులో గ్యాస్‌ని ఫుల్ ట్యాంక్ చేయించింది? గ్యాస్ట్స్టేషన్ మేనేజర్‌తో ఎందుకంత సంతోషంగా మాట్లాడింది? సరసులో గంటల తరబడి వెతికినా దొరకని మృతదేహం అంతదూరం నీటిలో ఎలా వెళ్లింది? వంటి ఎన్నో అనుమానాలను లేవనెత్తాడు రాండాల్. జోవాన్ శవపరీక్షలో పాల్గొన్న డాక్టర్ జెంట్జెన్.. మృతదేహం కనుగొన్నప్పుడు ఆమె ఊపిరితిత్తులలో నీరు లేదని, అంటే నీటిలో పడకముందే ఆమె ప్రాణాలు పోయాయని ధ్రువీకరించాడు. అయితే అది ప్రమాదమా? హత్యా? ఆత్మహత్యా? అనేది తేల్చలేకపోయాడు. మృతదేహం కోటు జేబులోనే అసలు కారు కీస్ దొరికాయి. జోవాన్ అదృశ్యం కావడానికి నెల్లాళ్ల ముందు.. కారుతో పాటు ఇంటి స్పేర్ కీస్ కూడా కనిపించడం లేదని కూతురు మిషెల్‌తో చెప్పింది. అయితే పోలీసులకు కారు స్పేర్ కీ ఎలా అందింది అనేది అనుమానాస్పదమే. మరోవైపు జోవాన్ మృతదేహాన్ని పరిశీలించిన మిషెల్, ‘మా మామ్ ఎప్పుడూ కోటును ఇలా గడ్డం వరకూ జిప్ చేసుకోదు. అలాగే తను ఎప్పుడూ హ్యాండ్ బ్యాగ్‌ని ఎడమ చేతికే వేసుకునేది. అదే చేతికి రెండు చిన్నచిన్న గాయాలు ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్‌కి చిరుగులు ఉన్నాయి. పైగా అది పదిరోజుల క్రితం కొన్న కొత్త బ్యాగ్. బహుశా కిల్లర్‌కి, మామ్‌కి మధ్య జరిగిన పెనుగులాటలో ఆ డ్యామేజ్ జరిగి ఉంటుంది’ అని ఆరోపించింది. హత్యకు కారకులుగా.. తండ్రి డేవిడ్, మేనమామలు జాన్, బిల్లతో పాటు జోవాన్ కజిన్ టిమ్ మటౌక్లపై అనుమానం వ్యక్తం చేసింది మిషెల్. తన తల్లికి తండ్రితో ఉన్న వ్యక్తిగత తగాదాలతో పాటు మిగిలిన వారితో ఉన్న ఆర్థిక తగాదాలను కారణంగా చూపించింది. జోవాన్‌కి సంబంధించిన రోజరీ (మెడలో వేసుకునే శిలువ), సెల్‌ఫోన్ ఇప్పటికీ దొరకలేదు. స్కాట్ లూయీ అనే మరో ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ సాయంతో.. మిషెల్ నేటికి ఆన్లైన్ పిటిషన్స్ వేస్తూ.. తల్లి కోసం న్యాయం పోరాటం చేస్తూనే ఉంది. సుమారు పన్నెండేళ్లుగా జోవాన్ మరణం మిస్టరీగానే మిగిలింది. -సంహిత నిమ్మన -
ఉబర్‌లో కారు బుక్ చేసుకొని వెళ్లి బ్యాంకు దోచేశాడు.. కానీ చివరకు..
వాషింగ్టన్: అమెరికాలో ఓ దొంగ సినీఫక్కీలో చోరీ చేశాడు. దర్జాగా ఉబర్‌లో కారు బుక్ చేసుకుని వెళ్లి బ్యాంకు దోపిడీకి పాల్పడ్డాడు. అనంతరం అదే కారులో ఇంటికి తిరిగివెళ్లాడు. ఇంత జరిగినా డ్రైవర్‌కు దొంగతనం గురించి అసలు తెలియకపోవడం గమనార్హం. పోలీసులు వచ్చాకే అతనికి అసలు విషయం తెలిసి కంగుతిన్నాడు. అమెరికా మిచిగాన్ సౌత్‌ఫీల్డ్‌లో నవంబర్ 16న ఈ ఘటన జరిగింది. చోరీకి పాల్పడిన వ్యక్తి పేరు జెసన్ క్రిస్ట్మస్(42). ప్లాన్ ప్రకారం కారు బుక్ చేసుకున్న ఇతడు బ్యాంకులో పని ఉందని డ్రైవర్‌ను హంటింగ్టన్ బ్యాంకు వద్దకు తీసుకెళ్లాడు. తాను తిరిగి వచ్చే వరకు వెయిట్ చేయాలని చెప్పాడు. దీంతో డ్రైవర్ బ్యాంకు బయటే ఉన్నాడు. అనంతరం తుపాకీతో బ్యాంకు లోపలికి వెళ్లిన జేసన్.. అధికారులను బెదిరించి డబ్బు తీసుకున్నాడు. తర్వాత హుందాగా తిరిగి కారు వద్దకు వచ్చాడు. మళ్లీ ఇంటికి తీసుకెళ్లమని డ్రైవర్‌కు చెప్పాడు. దీంతో అతడు జేసన్‌న తిరిగి తన ఫ్లాట్‌లో డ్రాప్ చేశాడు. వెంటనే పట్టుకున్న పోలీసులు.. అయితే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే జేసన్ ఫ్లాట్‌కు వెళ్లారు. అతడికి బేడీలు వేసి అదుపులోకి తీసుకున్నారు. కానీ దొంగ దస్తులపై ఎరుపు రంగు కన్పించడంతో ఎవరైనా షూట్ చేశారా? అని పోలీసులు అడిగారు. అలాంటిదేం లేదని, అది రంగు అని.. బ్యాంకు నుంచే తీసుకువచ్చినట్లు నిందితుడు చెప్పాడు. మరోవైపు డ్రైవర్‌ను కూడా అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులను చూసి అతడు షాక్ అయ్యాడు. తనకు ఈ దొంగతనం గురించి ఏమీ తెలియదని వాపోయాడు. పోలీసులు కూడా అతనికి నిజంగానే సంబంధం లేదని నిర్ధరించుకున్నారు. ప్యాసెంజర్ గురించి వివరాలు తెలుసుకోకుండా రైడ్‌కెలా తీసుకెళ్లావని ప్రశ్నించారు. మరోసారి ఎవరైనా అనుమానంగా కన్పిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ తరహా దొంగతనాలు నగరంలో జరగలేదని పోలీసులు చెప్పారు. క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లి దోపిడీలు చేసిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని బంధువులు, కుటుంబసభ్యులకు ఖరీదైన బహుమతులు, వస్తువులు ఇవ్వడానికే జేసన్ క్రిస్టియన్ ఈ దోపిడీ చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. అతడి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్లకు కూడా ఎర్ర రంగు అంటుకొని ఉంది. చదవండి: ఖరీదైన రెస్టారెంట్.. బిల్లుచూసి కళ్లు తేలేసిన నెటిజన్లు.. ఏకంగా రూ.1.3 కోట్లు! -
ఇది కదా జాక్‌పాట్.. ఏడాదికి రూ.20 లక్షల చొప్పున జీవితాంతం
లాన్సింగ్: లాటరీలో అదృష్టం వరించిన వారికి ఒకేసారి భారీ మొత్తంలో డబ్బులు వస్తాయని అందరకీ తెలుసు. కానీ, ప్రతి ఏడాది లక్షల రూపాయలు జీవితాంతం లభిస్తే అది జాక్‌పాట్‌కే జాక్‌పాట్ అంటారు కదా? అలాంటి జాక్పాట్నే కొట్టేశాడు మిచిగాన్కు చెందిన ఓ 50 ఏళ్ల వ్యక్తి. ఏడాదికి రూ.20లక్షల చొప్పున జీవితాంతం పొందే లాటరీని సొంతం చేసుకున్నాడు. ఆన్లైన్లో రాండమ్ నంబర్ జనరేటర్లో తన టికెట్‌పై ఉన్న నంబర్లను పొంది ఈ లాటరీ గెలుపొందనట్లు యూపీఐ పేర్కొంది. ఆయనే.. మిచిగాన్‌లోని వారెన్ ప్రాంతానికి చెందిన అరోన్ ఎసెన్‌మాచెర్(50). వారెన్ హ్యాపీ డేస్ పార్టీ స్టోర్‌లో సెప్టెంబర్ 15న లక్కీ ఫర్ లైఫ్ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు.‘నేను లక్కీ ఫర్ లైఫ్ ఆడాను. ప్రతిసారి ఒకే సెట్ నంబర్లను వినియోగించాను. నేను నా టికెట్ కొనుగోలు చేసినప్పుడు సాధారణంగానే సంఖ్యలను ఎంచుకున్నాను. తర్వాత ఆన్లైన్లో కనుగొన్న రాండమ్ సంఖ్యలను ఉపయోగించాలని నిర్ణయించుకున్నా. డ్రా తీసిన తర్వాతి రోజు నేను నంబర్లను తనిఖీ చేశాను. నేను ఐదు నంబర్లను సరిగా మ్యాచ్ చేసినట్లు తెలుసుకున్నాను. రాండమ్ నంబర్ జనరేటర్లో గెలుపొందిన నంబర్లే ఇక్కడా వచ్చాయి. దాంతో షాక్‌కు గురయ్యాను. ధ్రువీకరించుకునేందుకు నా టికెట్‌ను యాప్‌లో పలుమార్లు స్కాన్ చేసి చూశాను. అప్పుడు నిజంగానే వచ్చిందని తెలుసుకున్నా.’ అని తెలిపారు అరోన్ ఎసెన్‌మాచెర్. ఐదు తెల్లని బంతులపై 02-18-27-41-45 సంఖ్యలు రావటంతో అరోన్ ఎసెన్‌మాచెర్ ఈ జాక్‌పాట్ గెలుపొందారు. దీంతో ఏడాదికి 25వేల డాలర్లు(రూ.20లక్షలు) పొందేందుకు అర్హత సాధించారు. ఇవి 20 ఏళ్లు లేదా జీవితాంతం(ఏది మందుగా వస్తే అది) చెల్లిస్తుంది లాటరీ సంస్థ. అయితే, ఈ 20 ఏళ్ల పాటు చెల్లించే డబ్బులు మొత్తం రూ.3.2 కోట్లు ఒకేసారి ఇవ్వాలని అరోన్ కోరినట్లు లాటరీ సంస్థ పేర్కొంది. అప్పులు చెల్లించాలని, మిగిలిన వాటితో టూర్‌కు వెళ్లాలని చెప్పినట్లు తెలిపింది. లక్కీ ఫర్ లైఫ్ ఆడేందుకు కేవలం 2 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఎన్నిసార్లైనా ఆడొచ్చు. ఈ గేమ్‌లో రోజుకు వెయ్యి డాలర్లు జీవితాంతం చెల్లించటం అతిపెద్ద ప్రైజ్. 1 నుంటి 48 నంబర్ల మధ్య ఐదు నంబర్లను సహా ఓ లక్కీ బాల్ 1-18 నంబర్లును మ్యచ్ చేస్తే గెలచుకోవచ్చు. అయితే, లక్కీబాల్ కాకుండా ఐదు నంబర్లు మాత్రమే సరిగా గుర్తిస్తే ఏడాదికి రూ.20 లక్షలు వస్తాయి. ఇదీ చదవండి: జర్నలిస్టులకు లక్షల్లో ‘క్యాష్ గిఫ్ట్‌లు’.. మరో వివాదంలో కర్ణాటక ప్రభుత్వం -
సముద్రం, భూమి కలిసి చెస్ ఆడుతూ..
ఇక్కడ సముద్ర తీరంలో చెస్ కాయిన్లలా కనిపిస్తున్నవి ఏమిటో తెలుసా?.. ఏవో శిల్పాల్లా ఉన్నాయి, ఎవరో పెట్టి ఉంటారులే అనిపిస్తోందికదా.. కానీ అవి శిల్పాలూ కాదు, ఎవరూ ఏర్పాటు చేయలేదు. ఇవి ప్రకృతి సృష్టించిన చిత్రాలు. కేవలం ఇసుకతో ఏర్పడిన చిన్నపాటి స్తంభాలు. అమెరికాలోని లేక్ మిషిగన్ ప్రాంతంలో రెండు రోజుల కింద ఈ చిత్రమైన ఇసుక ఆకృతులు ఏర్పడ్డాయి. వీటిని అక్కడ ‘హూడూస్’ అని పిలుస్తారు. (క్లిక్: అరుదైన గ్రహాంతర వజ్రం.. కాసులుంటే మీ సొంతం !) అక్కడ చలికాలంలో నీళ్లు గడ్డకట్టేంతగా ఉష్ణోగ్రతలు పడిపోతాయి. సముద్ర తీరంలో నీళ్లు ఇసుకలో చేరి అక్కడక్కడా గడ్డకడతాయని, ఆ తర్వాత అలలకు ఇసుక కోతకు గురవడం, దానికి గాలి తోడవడంతో.. ఇలా రకరకాల ఆకారాల్లో ఇసుక స్తంభాలు ఏర్పడుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తాజాగా టెర్రీ అబ్బాట్ అనే ఫొటోగ్రాఫర్ తీసిన ఈ చిత్రాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. సముద్రం, భూమి కలిసి సరదాగా చెస్ ఆడుతూ.. మధ్యలో వదిలేసినట్టుగా ఉన్నాయంటున్నారు నెటిజన్లు. (చదవండి: అమెరికాను వణికిస్తున్న ఇజ్జీ.. 1,200 విమానాలు రద్దు) -
అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి
న్యూయార్క్: అమెరికాలో ఒక పాఠశాలలో కాల్పుల ఉదంతం కలకలం రేపింది. మిషిగాన్ స్కూల్లో ఒక విద్యార్థి.. తోటి విద్యార్థులపై గన్‌తో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు సంఘటన స్థలంలోనే మృతిచెందారు. మరో ఎనిమిది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా స్కూల్ ఆవరణలో భయానక వాతావరణం నెలకొంది. స్కూల్ సిబ్బంది, విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. కాగా, సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు మిషిగాన్ స్కూల్‌కు చేరుకుని కాల్పులు జరిపిన కుర్రాడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గాయపడిన విద్యార్థులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన విద్యార్థి ఈ మధ్యనే హ్యండ్ గన్ను కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. -
మిస్ ఇండియా యు.ఎస్.ఏ వైదేహీ డోంగ్రేకథక్
మొన్నటి ఆదివారం ఆమెరికాలో ‘మిస్ ఇండియా యుఎస్ఏ’ పోటీ జరిగింది. సౌందర్యం మాత్రమే కాదు ప్రతిభ కూడా తమ సొంతం అని నిరూపించారు మన అమ్మాయిలు. కిరీటాన్ని గెలుచుకున్న వైదేహీ డోంగ్రేకథక్ డాన్సర్,పెద్ద సంస్థకు బిజినెస్ డెవలపర్ కూడా.ఫస్ట్ రన్నర్ అప్‌గా నిలిచిన అర్షి లలానిబ్రైన్ ట్యూమర్‌తో పోరాడుతూఆ టైటిల్ సాధించింది. అంతేకాదు, ఆ టైటిల్‌కు చేరినమొదటి అమెరికన్ ఇండియన్ ముస్లిం కూడా. ఒకరు మిషిగన్ నుంచి ఒకరు జార్జియా నుంచి ఈ టైటిల్స్ సాధించారు. న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్ మొన్నటి వారాంతంలో భారతీయ అమెరికన్ కుటుంబాలతో కళకళలాడింది. అందుకు కారణం అక్కడ ‘మిస్ ఇండియా యు.ఎస్.ఏ’ అందాల పోటీ జరుగుతూ ఉండటమే. దాంతో పాటు ‘మిసెస్ ఇండియా యు.ఎస్.ఏ’, ‘టీన్ ఇండియా యు.ఎస్.ఏ’ పోటీలు కూడా జరిగాయి. గత 40 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా జరుగుతున్న ఈ వేడుకలో 2020–21 సంవత్సరానికిగాను మిషిగన్ రాష్ట్రానికి చెందిన వైదేహి డోంగ్రే విజేతగా నిలిచింది. జార్జియాకు చెందిన అర్షి లలాని ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. ఇద్దరూ తమ తమ ప్రత్యేకతలతో ఈ టైటిల్స్‌ను సాధించారు. ముంబై అమ్మాయి ‘20 ఏళ్ల క్రితం ముంబై నుంచి మా కుటుంబం అమెరికాకు వలస వచ్చింది. ముంబైలో నా బాల్యం గడిచింది. అమెరికాలో నా చదువు. రెండు సంస్కృతుల మధ్య నేను పెరిగాను. రెంటిలోని అందమైన విషయాలను గ్రహించాను’ అంటుంది వైదేహి డోంగ్రే. అమెరికాలోని 30 రాష్ట్రాల నుంచి 61 మంది భారతీయ యువతులు ఈ టైటిల్ కోసం పోటీ పడితే విజయం 25 ఏళ్ల వైదేహి డోంగ్రేను వరించింది. మిషిగన్ యూనివర్సిటీలో చదువుకున్న వైదేహి ప్రస్తుతం ఆర్థిక రంగంలో పని చేస్తోంది. ‘నేను అమెరికాలో ఉన్న భారతీయ సమాజంలో స్త్రీల ఆర్థిక స్వతంత్రం, విద్య గురించి చైతన్యం కలిగించే పని చేయాలుకుంటున్నాను’ అని చెప్పింది. కథక్ డాన్సర్ కావడం వల్ల అద్భుతమైన కథక్ నృత్యం ప్రదర్శించి ‘మిస్ టాలెంటెడ్’ అవార్డు కూడా గెలుచుకుంది. ‘మేము అమెరికా వచ్చినప్పుడు ఇక్కడ కథక్కు అంత ప్రాముఖ్యం లేదు. మా అమ్మ మనిషా కథక్ డాన్సర్, టీచర్. ఇక్కడ కథక్ డాన్స్ స్కూల్‌ను నిర్వహించడానికి ఆమె చాలా కృషి చేయాల్సి వచ్చింది. ఆమెతో చిన్నప్పుడు ఆ డాన్స్ స్కూల్‌కు వెళుతూ కథక్ మీద ఆసక్తి పెంచుకున్నాను. డాన్సర్‌ని అయ్యాను. ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. ఇవాళ మా అమ్మ వల్ల, నా వల్ల అమెరికాలో కథక్ డాన్స్ ప్రదర్శనలు కొనసాగుతున్నాయి’ అంటుంది వైదేహి. ఈ విద్యలే కాకుండా ఆమెకు పాడటం కూడా తెలుసు. చాలా హిందీ సినిమా పాటలు పాడుతూ సరదాగా వీడియోలు చేస్తుంటుంది. మిస్ యు.ఎస్.ఏ ఇండియా టైటిల్ ఆమె తన తల్లికి అంకితం చేసింది. ‘ఇది నా ఆయీకి’ అని సోషల్ మీడియాలో రాసిందామె. హైదరాబాద్ అమ్మాయి ‘గత సంవత్సరమంతా మా ఇంట్లో ఎవరి ముఖాల్లోనూ నవ్వు లేదు. కారణం మీకు తెలుసు. బయట మహమ్మారి వాతావరణం. ఇవాళ నాకు వచ్చిన ఫస్ట్ రన్నర్ అప్ టైటిల్, అందుతున్న పుష్పగుచ్ఛాలు మా నాన్నను చాలా సంతోషపెట్టాయి’ అంది అర్షి లలాని. ‘మిస్ ఇండియా యు.ఎస్.ఏ’ వేదిక పై అర్షి లలాని తన ప్రెజెన్స్‌తో అందరి హృదయాలను గెలుచుకుంది. దానికి కారణం ఆమె బ్రైన్ ట్యూమర్‌తో పోరాడటం వల్ల కూడా. అలాంటి ఆరోగ్య సమస్యతో కూడా ర్యాంప్ మీద ఆమె ఉత్సాహంతో కనిపించి హర్షధ్వానాలు అందుకుంది. అర్షి లలాని తల్లిదండ్రులు అజీజ్, రోజీనాలది హైదరాబాద్. అర్షి హైదరాబాద్‌లోని ఆగాఖాన్ అకాడెమీలో చదువుకుంది కూడా. జార్జియాలో స్థిరపడిన ఈ కుటుంబం నుంచి అర్షి ఈ టైటిల్‌ను గెలుచుకుంది. ‘ఇది నా జీవితానికి సంబంధించి టర్నింగ్ పాయింట్ అనుకుంటున్నాను. మన వెనుక ఎందరు ఉన్నా, మద్దతు అందించినా వేదిక మీద మనం ఒక్కళ్లమే నడవాలి. అంటే మనల్ని మనమే గెలిపించుకోవాలి అని అర్థమైంది. నేను నా కుటుంబాన్ని గర్వపడేలా చేశాను. అమెరికాలో స్థిరపడిన ముస్లిం కుటుంబాల నుంచి ఇలాంటి టైటిల్ గెలుచుకునే స్థానానికి వచ్చినందుకు సంతోషిస్తున్నాను’ అందామె.న్యూయార్క్‌లో స్థిరపడిన భారతీయ వ్యాపారవేత్త ధర్మాత్మ శరణ్ 1980లో ఈ అందాల పోటీని ప్రారంభించారు. అమెరికాలో ఉన్న భారతీయుల కోసం ‘మిస్ ఇండియా యు.ఎస్.ఏ’ ఇతర ప్రపంచ దేశాలలో ఉన్న భారతీయుల కోసం ‘మిస్ ఇండియా వరల్డ్‌వైడ్’ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీలు ఈ అక్టోబర్‌లో ముంబైలో జరగనున్నాయి. -
గడియారం చెప్పేవరకు తెలీదు ఆమెకు గుండెపోటు వచ్చిందని
వాషింగ్టన్: యాపిల్ స్మార్ట్ వాచ్ వీరోచిత గాథలు కొనసాగతునే ఉన్నాయి. గతంలో ఓ మహిళను కిడ్నాపర్ల చెర నుంచి కాపాడటం.. మధ్యప్రదేశ్‌లో ఓ వృద్ధుడి ప్రాణాలు కాపాడిన వైనం చదివాం. తాజాగా ఓ మహిళను గుండెపోటు బారిన పడి చనిపోకుండా కాపాడింది యాపిల్ స్మార్ట్ వాచ్. ఆ వివరాలు.. మిచిగాన్కు చెందిన డయాన్ ఫీన్స్ట్రా అనే మహిళకు ఓ రోజు యాపిల్ స్మార్ట్ వాచ్‌లో తన హృదయ స్పందనలు అసాధరణంగా నమోదవ్వడం గమనించింది. భర్తను పిలిచి దాన్ని చూపించింది. వెంటనే అతడు డయాన్ను ఆస్పత్రికి వెళ్లమని సూచించాడు. హాస్పిటల్‌కు వెళ్లిన తర్వాత డాక్టర్లు డయాన్‌కు ఈసీజీ నిర్వహించగా.. ఆమెకు కొన్ని రోజుల క్రితం గుండెపోటు వచ్చిందని.. కానీ దాని గురించి డయాన్‌కు తెలియలేదని గుర్తించారు. ఈ క్రమంలో డయాన్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఏడాది ఏప్రిల్ 22న నా గుండె నిమిషానికి 169 సార్లు కొట్టుకుంది. కష్టమైన వ్యాయామాలు చేసినప్పుడు, కనీసం మెట్లు ఎక్కినప్పుడు కూడా గుండె ఇంత వెగంగా కొట్టుకోలేదు. అందుకే నా భర్తను పిలిచి.. తనకు ఇది చూపించి.. ఏమైనా సీరియసా అని అడిగాను. ఆయన నన్ను ఆస్పత్రికి వెళ్లమని సూచించారు. వాచ్ రికార్డైన హృదయస్పందనలు పరిశీలించి.. ఈసీజీ నిర్వహించారు. గతంలో నాకు గుండెపోటు వచ్చింది.. కానీ దాని గురించి నాకు తెలయలేదని తెలిపారు. ఇక పురుషులతో పోల్చుకుంటే.. మహిళల్లో గుండెపోటు సందర్భంగా కనిపించే లక్షణాలు చాలా వేరుగా ఉంటాయి’’ అని డయాన్ తెలిపారు. ‘‘ఇక వయసు పెరుగుతున్న కొద్ది నా ఎడమ చేతిలో నొప్పి.. ఎడమ పాదంలో వాపు వంటి లక్షణాలను నేను గమనించాను. అయితే గ్యాస్ సమస్య వల్ల ఇలా అనిపిస్తుందనుకున్నాను. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే నా భుజంలో నొప్పి వచ్చేది. కానీ దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశాను’’ అని తెలిపారు డయాన్. ఈసీజీ రిపోర్టు తర్వాత మరిన్ని టెస్టులు చేసి.. డయాన్‌కు స్టెంట్ వేయడం అవసరం అని తెలిపారు వైద్యులు. ఆ తర్వాత ఆపరేషన్ చేసి.. స్టెంట్ వేశారు. ఈ క్రమంలో డయాన్.. జనాలు ఎప్పటికప్పుడు తమ హృదయ స్పందనలు చెక్ చేసుకుంటే.. గుండెపోటు బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చని సూచిస్తున్నారు. -
కుమార్తెను చేరిన వందేళ్ల నాటి చెక్కుచెదరని ఉత్తరం
ఒక శతాబ్దం కిందట ఎవరో ఒక సందేశం పంపితే, మీకు అది ఇప్పుడు చేరితే ఎలా అనిపిస్తుంది. ఆశ్చర్యంగాను, ఆనందంగాను ఉంటుంది కదూ! ఆశ్చర్యంగా కాదు, వాస్తవంగానే జరిగింది. ఇది సినిమా కథ కాదు. అమెరికాలోని మిచిగాన్‌లో వెలుగుచూసిన వాస్తవ గాథ. ఈ ఆశ్చర్యంతో పాటు, ఆ సందేశం లభించిన ప్రదేశం గురించి తలచుకుంటే మరింత ఆశ్చర్యం వేస్తుంది. జెన్నిఫర్ డౌకర్ ఒక స్కూబా డైవర్. ఆవిడకు బోట్ టూర్ కంపెనీ ఉంది. ఆమె ఒక రోజు స్కూబా డైవింగ్ పూర్తి చేసుకుని, తన బోట్ అంచులు, కిటీకీలు శుభ్రపరుస్తుంటే, అక్కడ ఆకుపచ్చ రంగు సీసా కనిపించింది. అందులో మూడు వంతుల వరకు నీళ్లు ఉన్నాయి. చిన్న బిరడా మూత ఉంది. అయినా కూడా అందులో నుంచి కాగితం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సీసా తీసుకుని, మూత తీసి కాగితం చూసింది. ఆ కాగితం 1926లో రాసినది. అందులో ఒక సందేశంతో కూడిన ఉత్తరం ఉంది. ‘‘ఈ సీసా దొరికిన వారు ఇందులోని కాగితాన్ని జార్జ్ మారో చేబోగాన్‌కి అందచేయండి. అలాగే ఈ సీసా ఎక్కడ దొరికిందో కూడా తెలియచేయండి’’ అని రాసి ఉంది. నాటికల్ నార్త్ ఫ్యామిలీ అడ్వెంచర్స్ అనే సొంత టూర్ కంపెనీ అధినేత అయిన డౌకర్, తనకు దొరికిన సీసా, ఉత్తరాలకు ఫొటోలు తీసి, ఫేస్బుక్లో పోస్టు చేస్తూ ‘నాకు ఏం దొరికిందో ఒకసారి అందరూ చూడండి’ అన్నారు. ఆ మరుసటి రోజు ఈ మెసేజ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. డౌకర్ తన పోస్టు చూసుకునే సమయానికి ఒక లక్ష పదమూడు వేల మంది ఆ పోస్టును షేర్ చేశారు. చాలామంది ‘ఇది అద్భుతం, నమ్మశక్యంగా లేదు’ అంటూ కామెంట్స్ పెట్టారు. ‘ఈ సందేశం చూస్తే మాకు ఆనందంగా ఉంది’ అంటూ మరికొందరు కామెంట్ చేశారు. టలియా రోథ్‌ఫ్లీష్ హాలీ, ‘ఇదొక అద్భుతం. ఆశ్చర్యం. ఇంతకాలం అక్షరాలు చెక్కుచెదరకుండా ఉండేలా ఏ ఇంక్ వాడారో తెలుసుకోవాలని ఉంది. అక్షరాలు చూస్తే ఈ రోజు రాసినట్లు ఉన్నాయి’ అన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో మారో పేరు మార్మోగుతోంది. ఈ సందేశం ఎవరు రాశారు అనే దాని కంటె, కథ సుఖాంతం అవుతుందా లేదా అని చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉదాహరణకి, ‘‘ఈ సంఘటన భలే ఆసక్తిగా ఉంది. ఈ కథను కొనసాగించండి. ముగింపు ఎలా ఉంటుందో వినాలని ఆత్రంగా ఉంది’ అంటున్నారు పాట్రికా ఆడమ్స్. డౌకర్ ఆ ఉత్తరాన్ని ఫోటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, ‘స్కూబాకి ఎవరెవరు సంసిద్ధంగా ఉన్నారు?’ అనే సందేశం పెట్టారు. డౌకర్ సీసా మీద గుర్తుగా ఒక చుక్క పెట్టారు. ఈ సంఘటన జూన్ 18వ తేదీన జరిగింది. జూన్ 20, ఆదివారం నాడు స్కూబా డైవింగ్ చేసి, తన తండ్రి ఇంటి నుంచి తిరిగి వస్తుండగా, డౌకర్‌కి ఒక ఫోన్ వచ్చింది. అది మిచెల్ ప్రిమ్యా అనే 74 సంవత్సరాల మహిళ దగ్గర నుంచి వచ్చిన ఫోన్ కాల్. ఫేస్బుక్లో పోస్టు చూసిన ఒక మహిళ తనకు ఈ సమాచారం అందించిందని ఫోన్లో చెబుతూ, అది తన తండ్రి చేతి రాతని, తన తండ్రి 1995లో మరణించాడని వివరించారు. ఇక్కడ మరో ఆశ్చర్యమేమిటంటే, ఈ ఉత్తరాన్ని డౌకర్... ప్రిమ్యాకి అందచేద్దామనుకున్నారు. కాని ప్రిమ్యా ఆ ఉత్తరాన్ని డౌకర్ దగ్గరే ఉంచమన్నారు. ఆ ఉత్తరాన్ని ఒక షాడో బాక్స్‌లో ఫ్రేమ్ చేయించారు డౌకర్. ‘నా తండ్రి జ్ఞాపకాలు మరింత కాలం పదిలంగా ఉండాలి, అలాగే మరింతమంది ఈ ఉత్తరాన్ని చూడాలి’’ అంటున్నారు ప్రిమ్యా. ఇప్పుడు మీరు కూడా ఆ ఉత్తరం చూడాలనుకుంటున్నారా, అయితే వెంటనే బయలుదేరండి. డౌకర్ దగ్గరకు వెళితే, స్కూబా డైవింగ్ చేయిస్తూ, ఉత్తరం కూడా చూపిస్తారు. – వైజయంతి పురాణపండ -
వైరల్ వీడియో: యువతి తిక్కపని.. కుర్చీలో ఇరుక్కుపోయి..
-
టిక్‌టాక్: యువతి తిక్కపని.. కుర్చీలో ఇరుక్కుపోయి..
వాషింగ్టన్ : టిక్‌టాక్ ఇండియాలో బ్యాన్ అయినా దాని హవా చాలా దేశాల్లో కొనసాగుతూనే ఉంది. తమ ప్రతిభను ప్రదర్శించాలనే తపనతో జనాలు ఇబ్బందుల పాలవుతూనే ఉన్నారు. తాజాగా అమెరికాకు చెందిన ఓ యువతి టిక్‌టాక్ వీడియో చేసే సరదాతో ఇబ్బందుల్లో పడింది. కుర్చీలో ఇరుక్కుపోయి నానా తంటాలు పడింది. వివరాలు.. అమెరికాలోని మిచిగాన్కు చెందిన సిడ్నీ జో అనే యువతి కొద్దిరోజుల క్రితం కుర్చీలోకి దూరి టిక్‌టాక్ వీడియో చేయటం ప్రారంభించింది. వీడియో అయిపోయిన తర్వాత కుర్చీలోంచి బయటకు రావాలని చూసింది. అయితే కుర్చీ నడుము దగ్గర గట్టిగా అతుక్కుపోయింది. కుర్చీలోంచి బయటకు రావటానికి చాలా ప్రయత్నించింది. అయితే ఆమె వల్ల కాలేదు. దీంతో రెస్క్యూ టీమ్‌కు ఫోన్ చేసింది. రంగంలోకి దిగిన వారు కుర్చీని కట్ చేసి ఆమెను బయటకు లాగారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. చదవండి : వైరల్: బురదలో ఏనుగు సరదా! -
విషాదం నింపిన అమెరికా పర్యటన..
పరకాల/ వరంగల్: కొడుకు కుటుంబంతో కొన్నాళ్లు గడుపుదామని అమెరికా వెళ్లిన ఓ వ్యక్తి అక్కడ జరిగిన ప్రమాదంలో కన్నుమూశాడు. ఆదివారం రాత్రి 9గంటల (అమెరికాలో తెల్లవారుజామున 4గంటలు)కు జరిగిన ఈ ప్రమాదంలో వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. పరకాలకు చెందిన ఈదునూరి రాజమౌళి (50) హన్మకొండ గోపాలపూర్‌లో నివాసముంటూ సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్. మిచిగాన్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న చిన్న కుమారుడు పవన్‌కుమార్ వద్దకు రాజమౌళి తన భార్య తో కలసి మార్చి 5న వెళ్లాడు. న్యూయార్క్, వాషింగ్టన్‌లను కారులో కొడుకుతో వెళ్లి సందర్శించారు. ఈ క్రమంలో, ఆదివారం రాత్రి తిరుగు ప్రయాణమై నివాసానికి రెండు మైళ్ల దూరం లో ఉండగా వర్షానికి కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో కారులోని నలుగురూ సురక్షిత మని భావించి పవన్‌కుమార్, డ్రైవింగ్ చేస్తున్న ఆయన మిత్రుడు కారు దిగి పరిశీలిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కారులో వెనుక కూర్చున్న తండ్రి రాజమౌళి, తల్లి నీలిమను కాపాడేందుకు పవన్ ప్రయత్నించాడు. తల్లి ప్రాణాలతో బయటపడగా, తండ్రి మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం సంగతి పరకాలలోని బంధువులకు తెలియడంతో కన్నీటి పర్యంతమయ్యారు. చదవండి: రక్తపు మడుగులో భార్యాభర్తలు.. బాల్కనీలో ఏడుస్తూ చిన్నారి -
ప్రాణం తీసిన ఊపిరితిత్తుల మార్పిడి
మిషెగావ్: అవయవ మార్పిడి విధానంలో తొలిసారి కరోనా వైరస్ మృతి సంభవించింది. కరోనా సోకిన వ్యక్తి ఊపిరితిత్తులు మార్పిడి చేయడంతో పొందిన వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన అమెరికాలోని మిషెగావ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ప్రపంచంలోనే తొలి అవయవ మార్పిడి కరోనా మరణంగా అధికారులు చెబుతున్నారు. ఈ విషయం తెలిసి వైద్యులు నివ్వెరపోయారు. అయితే అవయవ మార్పిడి చికిత్స అందించిన వైద్యుడికి కూడా కరోనా సోకింది. కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఓ మహిళ ఆరోగ్యం క్షీణించింది. ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతినడంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ సమయంలో ఓ వ్యక్తి ఊపిరితిత్తులు అందుబాటులో ఉన్నాయని సమాచారం రావడంతో వైద్యులు వెంటనే వివరాలు సేకరించారు. ఊపిరితిత్తుల మార్పిడికి రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో ఆమెకు ఊపిరితిత్తులు మార్పిడి చికిత్స విజయవంతంగా చేశారు. అయితే మార్పిడి చేసిన 61 రోజులకు ఆమె మరణించండం వైద్యులు షాకయ్యారు. సక్రమంగా చికిత్స అందించినా ఎందుకు ఇలా అయ్యిందని మొత్తం చికిత్స విధానమంతా అధ్యయనం చేశారు. ఈ క్రమంలో వారికి ఊహించని సమాధానం లభించింది. ఊపిరితిత్తులు ఇచ్చిన దాతకు కరోనా సోకిందనే విషయం తెలిసింది. ఆ కరోనా ఇంకా ఊపిరితిత్తుల్లో నిక్షేపమై ఉంది. అవయవదానం పొందిన మహిళకు కూడా కరోనా సోకింది. అంతర్గతంగా కరోనా వైరస్ ఊపిరితిత్తుల్లో విస్తరించి ఆమె ప్రాణం తీసిందని వైద్యులు గుర్తించి షాక్‌కు గురయ్యారు. -
ఆడపిల్ల కోసం 14 మందిని కన్నారు!
మిచిగాన్: ఆడపిల్ల పుడితే దండగ అనుకునే ఈ రోజుల్లో ఓ జంట మాత్రం అమ్మాయి కావాలని ఆరాటపడింది. ఆడపిల్ల పుట్టేంతవరకు పిల్లల్ని కంటూ పోయింది. అలా ఒకరిద్దరు కాదు, ఏకంగా 14 మంది కొడుకులకు జన్మనిచ్చారు. ఎట్టకేలకు ఈ మధ్యే ఓ ఆడబిడ్డను కని వారి కలను సాకారం చేసుకున్నారు. ఈ అరుదైన ఘటన అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. జై, కేటరీ స్కీవాండ్ దంపతులకు ఆడపిల్ల అంటే ఎంతో ఇష్టం. ఒక కూతురు ఉంటే బాగుంటుందని చాలాసార్లు అనుకున్నారు. కానీ వారి ఆశలను నీరుగాస్తూ ప్రతిసారి అబ్బాయిలే జన్మించారు. అలా ఈ దంపతుల సంతానం 14 మందికి చేరింది. తర్వాత కేటరీ మరోసారి గర్భం దాల్చింది. ఈసారి కూడా మగబిడ్డే పుడతాడని అంతా అనుకున్నారు. (చదవండి: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న పాట: మీరూ వినేయండి) కానీ ఊహించని విధంగా వారి జీవితాల్లో వెలుగు నింపుతూ గురువారం(నవంబర్ 5న) అమ్మాయి ప్రసవించింది. దీంతో ఆ కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సుమారు మూడున్నర కిలోల బరువుతో జన్మించిన ఆ శిశువుకు మ్యాగీ జేన్ అని నామకరణం చేసి పిలుచుకుంటున్నారు. "ఈ సంవత్సరం మాకు మర్చిపోలేనిది, మ్యాగీ మా జీవితాల్లోకి రావడం అన్నింటికన్నా పెద్ద గిఫ్ట్" అని కేటరీ చెప్పుకొచ్చారు. మా ముద్దుల చెల్లెలను గుండెల మీద ఆడిస్తామంటూ 14 మంది అన్నలు సంబరపడిపోతున్నారు. మ్యాగీ పెద్దన్న టైలర్‌కు ఇప్పుడు 28 సంవత్సరాలు. ఈ మధ్యే అతడికి నిశ్చితార్థం కూడా జరిగింది. కాబోయే భార్యతో జీవించేందుకు ఈ మధ్యే ఓ కొత్తిల్లు కూడా కొనుగోలు చేసి పెట్టుకున్నాడు. తాజాగా తనకో చిన్ని చెల్లాయి వచ్చిందని తెలిసి సంతోషంగా ఫీలవుతున్నాడు. ఈ పేద్ద కుటుంబానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. (చదవండి: ఆస్తిలో కూతుళ్లకు సమాన వాటా ) -
పాపం ట్రంప్.. కోర్టులో కూడా ఓటమే
వాషింగ్టన్: ఇప్పటికే ఓటమి భయంతో అనాలోచిత వ్యాఖ్యలు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్‌కి కోర్టులో కూడా ప్రతికూల ఫలితాలే ఎదురయ్యాయి. గడువు ముగిసిన తర్వాత వచ్చిన మెయిల్ ఇన్ ఓట్లను లెక్కించవద్దని, కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయంటూ ట్రంప్ మద్దతుదారులు ఆరోపిస్తూ.. కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జార్జియా, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, మిషిగాన్ రాష్ట్రాల్లో ఓట్ల కౌంటింగ్‌ను సవాల్ చేశారు. ఈ క్రమంలో సరైన సాక్ష్యాధారాలు లేవంటూ జార్జియా, మిచిగాన్ కోర్టులు ఈ పిటిషన్లని పరిగణలోకి తీసుకోలేదు. ఇక నెవాడా మీదనే ట్రంప్ ఆశలు పెట్టుకున్నారు. జార్జియా కేసులో, ఆలస్యంగా వచ్చిన 53 బ్యాలెట్లను ఆన్-టైమ్ బ్యాలెట్లతో కలిపినట్లు ట్రంప్ మద్దతుదారులు ఆరోపించారు. మిషిగాన్‌లో కూడా ఇదే కారణంతో ఓట్లను లెక్కించకుండా ఆపడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో జార్జియాలోని ఒక ఉన్నత న్యాయమూర్తి జేమ్స్ బాస్ మాట్లాడుతూ, బ్యాలెట్లు చెల్లవని చెప్పడానికి "ఎలాంటి ఆధారాలు లేవు".. ఈ పిటిషన్లని పరిగణలోకి తీసుకోలేం అని తెలిపారు. (చదవండి: ఎన్నికల ఫలితాలపై ట్రంప్ దావాలు భ్రమే..!) మిషిగాన్ కేసులో, న్యాయమూర్తి సింథియా కూడా స్టీఫెన్స్ ఇవే వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. "యోగ్యతపై విజయం సాధించే అవకాశం ఉందని తెలుసుకోవడానికి నాకు ఎటువంటి ఆధారం లేదు." లాస్ వెగాస్‌తో సహా నెవాడా జనాభా కలిగిన క్లార్క్ కౌంటీలో ఓటింగ్‌లో అవకతవకలు జరిగాయని ట్రంప్ మద్దతుదారులు ఆరోపించారు. ఇక మిచిగాన్, జార్జియా తీర్పులపై ట్రంప్ ప్రచార ప్రతినిధి స్పందించలేదు. అధ్యక్ష పదవిని నిర్ణయించగలిగే కొన్ని కీలక రాష్ట్రాల్లో కౌంటింగ్ ఇంకా కొనసాగుతుంది. డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ నెవాడాలో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. జార్జియాలో ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక మిడిగాన్లో బిడెన్ విజయం సాధిస్తారని అంచనా వేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయానికి బైడెన్ కేవలం ఆరు ఓట్ల దూరంలో ఉన్నారు. (చదవండి: చరిత్ర సృష్టించిన జో బైడెన్) లాస్ వెగాస్‌లో గురువారం ఒక విలేకరుల సమావేశంలో మాజీ నెవాడా అటార్నీ జనరల్ ఆడమ్ లక్సాల్ట్, ఇతర ట్రంప్ మద్దతుదారులు ముఖ్యంగా మాజీ పరిపాలనా అధికారి రిచర్డ్ గ్రెనెల్ విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. అలానే ఎన్నికల్లో డెమొక్రాట్లు అవకతవకలకు పాల్పడినట్లు చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు చూపించలేదు. ఇక లక్సాల్ట్ మాట్లాడుతూ.. ‘లెక్కించబడిన ఓట్లలో చనిపోయిన ఓటర్లు ఉన్నారని మేము నమ్ముతున్నాము. మహమ్మారి సమయంలో క్లార్క్ కౌంటీ నుంచి బయటికి వెళ్లిన వేలాది మంది ప్రజల ఓట్లు లెక్కించారని మాకు తెలిసింది” అని తెలిపారు. అంతేకాక "సరికాని ఓట్ల లెక్కింపును ఆపమని" ఆదేశించాల్సిందిగా న్యాయమూర్తిని కోరడానికి ఫెడరల్ కోర్టులో దావా వేస్తామని అన్నారు. క్లార్క్ కౌంటీలోని ఎన్నికల అధికారి జో గ్లోరియా విలేకరులతో మాట్లాడుతూ సరికాని బ్యాలెట్లను ప్రాసెస్ చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. కోర్టుకు వెళ్తానంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపే అవకాశం లేదని ఎన్నికల న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. -
కోర్టుకెక్కిన ట్రంప్ మద్దతుదారులు
వాషింగ్టన్: జార్జియా, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, మిషిగాన్ రాష్ట్రాల్లో ఓట్ల కౌంటింగ్‌ను సవాల్ చేస్తూ ట్రంప్ మద్దతుదారులు కోర్టులో పిటిషన్లు వేశారు. గడువు ముగిసిన తర్వాత వచ్చిన మెయిల్ ఇన్ ఓట్లను లెక్కించవద్దని, కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయంటూ ఆ పిటిషన్లలో పేర్కొన్నారు. స్వింగ్ రాష్ట్రాల్లో అక్రమాలు జరిగాయని మళ్లీ ఓట్ల లెక్కింపు చేపట్టాలంటూ ట్రంప్ మద్దతుదారులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. న్యాయస్థానంలో సవాళ్లు ఇవీ.. జార్జియా: ఈ రాష్ట్రంలో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. 16 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్న జార్జియాలో అత్యంత కీలక రాష్ట్రం కావడంతో ఓట్ల లెక్కింపుని వెంటనే నిలిపివేయాలని ట్రంప్ అనుచరులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విస్కాన్సిన్: విస్కాన్సిన్లో విజయం సాధించడంతో జో బైడెన్ శ్వేత సౌధానికి మరింత చేరువయ్యారు. 10 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రంలో ఓట్లను మళ్లీ లెక్కించాలని ట్రంప్ వర్గం పిటిషన్ వేసింది. దీనిపై నవంబర్ 17లోగా కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పెన్సిల్వేనియా: 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న పెన్సిల్వేనియాలో ట్రంప్ అధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ రాష్ట్రంలో ఆలస్యంగా కౌంటింగ్ కేంద్రాలకు వచ్చే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించవద్దంటూ ట్రంప్ మద్దతుదారులు కోర్టుకెక్కారు. ఈ రాష్ట్రంలో ఇంకా 10 లక్షల ఓట్లను లెక్కించాల్సిన పరిస్థితి ఉంది. నవంబర్ 12 వరకు పోస్టల్ బ్యాలెట్లను స్వీకరించడానికి గడువు పెంచడంపై ట్రంప్ వర్గం తీవ్ర అసహనంతో ఉంది. మిషిగాన్: ఈ రాష్ట్ర్రంలో ఇంచుమించుగా ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ట్రంప్ అనుయాయులు కోర్టుకెక్కారు. 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రంలో ట్రంప్ కంటే బైడెన్ 3శాతం అధికంగా ఓట్లను సాధించారు. ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియకి సంబంధించి కోర్టుకెక్కినా పెద్దగా ఉపయోగం ఉండదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. పోలింగ్‌కు ముందే వివాదాలు ఈ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు వివాదాల చుట్టూనే తిరుగుతున్నాయి. కరోనా సంక్షోభం కారణంగా ముందస్తు ఓటింగ్, మెయిల్ ఇన్ ఓటింగ్ ప్రక్రియలు ఆది నుంచి వివాదాన్ని రేపుతున్నాయి. మెయిల్ ఇన్ ఓటింగ్‌లో అవకతవకలకు ఆస్కారం ఉందని ట్రంప్ శిబిరం ఆరోపిస్తోంది. పోలింగ్‌కు ముందే ఈ ప్రక్రియను సవాల్ చేస్తూ 44 రాష్ట్రాల్లో 300కి పైగా కేసులు నమోదయ్యాయి. -
నాన్న ఇచ్చిన నాణెం: కోట్లు కురిపించింది!
మిచిగాన్: లాటరీ గెలుచుకోవాలన్నది ఎంతోమంది కల. జీవితంలో ఒక్కసారైనా దాన్ని గెలుచుకుంటే చాలనుకునేవారు కోట్లల్లో ఉంటారు. కానీ ఓ వ్యక్తికి మాత్రం ఒక్కసారేంటి, రెండుసార్లు లాటరీ తగిలింది. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అమెరికాలోని మిచిగాన్కు చెందిన మార్క్ క్లార్క్ అనే వ్యక్తి 2017లో లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. తాజాగా ఆ లాటరీ టికెట్‌ను పదేళ్ల క్రితం చనిపోయిన తండ్రి కానుకగా ఇచ్చిన నాణెంతో గీకి చూడగా ఆ నంబర్ లాటరీ గెలుచుకుంది. దీంతో అక్షరాలా నాలుగు మిలియన్ డాలర్లు(30 కోట్ల రూపాయలు) అతడి సొంతమైంది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు సోమవారం ధృవీకరించారు. కాగా అతడు లాటరీ గెలుపొందండం ఇది రెండోసారి కావడం విశేషం. ఇక క్లార్క్ ముందు లాటరీ నిర్వాహకులు రెండు ఆప్షన్లు ప్రవేశపెట్టారు. (చెత్తలో పడేసిన టికెట్.. జీవితాన్నే మార్చేసింది) దీర్ఘ కాలంలో 4 మిలియన్ డాలర్లు తీసుకుంటారా? లేదా తక్షణమే 2.5 మిలియన్ డాలర్లు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. దీనికి అతడు డబ్బులు అందుకోడానికి ఎక్కువ కాలం వేచి చూడలేనంటూ 2.5 మిలియన్ డాలర్లు (18,95,18,750 కోట్ల రూపాయలు) అందుకున్నాడు. ఈ సందర్భంగా అతడు మీడియాతో మాట్లాడుతూ.. "నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా.. కానీ నేను మళ్లీ లాటరీ గెలిచానంటే అందుకు ఈ నాణెం కారణమని భావిస్తున్నా. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ ఇప్పుడు దశ తిరిగిపోయినట్లు అనిపిస్తోంది" అని పేర్కొన్నాడు. (ఇదీ లక్ అంటే: కోట్లు గెలుచుకున్నాడు!) -
కరోనా: విండ్ షీల్డ్స్‌తో పీపీఈలు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన మహీంద్రా గ్రూప్ కరోనా వైరస్ మహమ్మారి పోరులో అగ్రభాగాన నిలుస్తున్న వైద్య సిబ్బంది రక్షణ నిమిత్తం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని సౌత్ఈస్ట్ మిచిగాన్‌లో మహీంద్రా ఆబర్న్ హిల్స్ ప్లాంట్ లో వైద్య సిబ్బందికి అవసరమైన వ్యక్తిగత రక్షణ పరికరాలను (పీపీఈ) తయారు చేయడానికి రంగంలోకి దిగింది. వినూత్న పద్ధతిలో వీటి తయారీకి ఉపక్రమించింది. ఇందుకు మహీంద్రా గ్రూప్ మిచిగాన్‌లో జనరల్ మోటార్స్, ఫోర్డ్ మోటార్స్ కంపెనీలతో జత కలిసింది. మహీంద్రా రాక్సోర్ వాహనాల్లో వాడే విండ్ షీల్డ్స్ తయారు చేసే పదార్థంతో ఫేస్ షీల్డ్స్, మాస్క్ లు, ఆస్పిషన్ బాక్సులను తయారు చేస్తోంది. విండ్‌షీల్డ్స్‌లో ఉపయోగించే పాలికార్బోనేట్ పదార్థంతోనే ఈ పెట్టెలను తయారుచేస్తున్నామని కంపెనీ తెలిపింది. ఇవి కోవిడ్-19 బారిన పడిన రోగి ఇంట్యుబేషన్ గొట్టాలను తొలగిస్తున్నపుడు, వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి ఇవి రక్షణ కవచంగా ఉపయోగపడతాయని నార్త్ అమెరికా మహీంద్రా ఆటోమోటివ్ సీఈవో రిక్ హాస్ వెల్లడించారు. ఈ పరికరాల తయారీలో ఆబర్న్ హిల్స్ ప్లాంట్ కు చెందిన ఉద్యోగులు నిరంతరం శ్రమిస్తున్నారనీ, సంక్షోభ సమయంలో ఫ్రంట్‌లైన్ కార్మికులకు అవసరమైన ఉత్పత్తులను అందించడంలో ఇదొక వినూత్న విధానమని ఆయన పేర్కొన్నారు. (కరోనా : అమెజాన్‌లో 75 వేల ఉద్యోగాలు) అత్యంత కఠినమైన పదార్థం కావడంతో పగలకుండా, ఇతర ప్లాస్లిక్ ల మాదిరిగా ఫాగ్ చేరకుండా వుంటుందని తెలిపారు. క్రిటికల్ కేర్ ఫెసిలిటీలో పనిచేసే మహీంద్రా ఉద్యోగి భార్య ఈ బాక్సులను తయారు చేయాలని సూచించారట. ఈ సూచనను పరిగణనలో తీసుకొని పరీక్షించిన కంపెనీ ఐదు వెర్షన్లను డిజైన్ చేసింది. దీంతో వైరస్ కారణంగా ఒక నెల క్రితం మూసివేసిన ఈ ప్లాంట్ సుమారు 10 రోజులుగా వీటిని తయారు చేస్తూనే ఉంది. తద్వారా 2వేల మందికి ఉపాది లభించిందని రిక్ హాస్ వెల్లడించారు. ఈ సంక్షోభ సమయంలో ఫ్రంట్‌లైన్ కార్మికులకు అవసరమైన ఉత్పత్తులను పొందడానికి స్థానికంగా మిచిగాన్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం, వాణిజ్య సంస్థలు, ఓక్లాండ్ కౌంటీ, స్థానిక వ్యాపారాలతో కలిసి పనిచేస్తోందన్నారు. తమ కంపెనీ ఉత్పత్తికి దేశవ్యాప్తంగా(అమెరికా), అంతర్జాతీయంగా ఆసక్తి లభిస్తోందని, డిజైన్లను భారతదేశంలో తయారీకి అనువుగా సంస్థ ప్రధాన కార్యాలయానికి పంపించామని చెప్పారు.(హెచ్-1 బీ వీసాదారులకు భారీ ఊరట) -
లాక్డౌన్: ‘ఇది మనసును చిత్రవధ చేస్తోంది’
మిచిగాన్: మనవరాలు పుట్టాడని తెలిసిన క్షణం నుంచీ ఆ పెద్దాయన మనసు మనసులో లేదు. ఎప్పుడెప్పుడు బుడ్డదాన్ని చేతుల్లోకి తీసుకుని ఆడించాలా అని తెగ ఉబలాటపడిపోతున్నాడు. కానీ కాలం బాగోలేదు.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా మహమ్మారి పట్టి పీడించేందుకు సిద్ధంగా ఉంటుంది. దీన్ని దష్టిలో పెట్టుకున్న ఆ పెద్దాయన నడక ప్రారంభించాడు. మితిమీరిన వయసును మర్చిపోయి హుషారుగా కొడుకింటికి చేరుకున్నాడు. ఈ లోకంలోకి కొత్తగా అడుగుపెట్టిన మనవరాలిని కళ్లారా చూసుకున్నాడు. కానీ తనివితీరా ఎత్తుకోలేకపోయాడు. బయట నుంచే చూసి అటునుంచి అటే వెనుదిరిగాడు హదయాలను హత్తుకున్న ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. మిచిగాన్‌లోని జోషువా గిల్లెట్కు కూతురు ఇలియానా జన్మించింది. (కోవిడ్ -19 విధ్వంసం : పేదరికం గుప్పిట్లోకి 40 కోట్ల మంది) సరిగ్గా అదే సమయంలో కరోనా వ్యాప్తి నివారించేందుకు అక్కడి ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. కానీ ఆ తాతయ్యకు ప్రాణం అంతా చిన్నారిమీదే. అందుకే తరచూ నాలుగు మైళ్లు(ఆరు కి.మీ) నడిచి కొడుకింటికి రావడం, మనవరాలిని బయట అద్దంలో నుంచే చూసి సంతోషించడం పరిపాటైంది. దీనికి సంబంధించిన ఫొటోను జోషువా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. "నా కన్నతండ్రి, తన మనవరాలిని కనీసం తాకడానికి కూడా వీలు లేదు. ఇది నా మనసును చిత్రవధ చేస్తోంది" అని భావోద్వేగానికి లోనయ్యాడు. అయితే ఎప్పటికప్పుడు శిశువు ఫొటోలను తన తండ్రికి పంపిస్తున్నానని చెప్పాడు. ఈ విపత్కర సమయంలో అందరూ తమతమ ఇళ్లలోనే ఉండాలని సూచించాడు. (భారత్‌కు పెరుగుతున్న డిమాండ్) -
గ్లౌస్ ధరించినా వైరస్ వ్యాపిస్తుంది!
కరోనా వైరస్ (కోవిడ్-19) బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 13 లక్షలు దాటగా, మృతుల సంఖ్య 74వేలకు చేరింది. ఇప్పటివరకు 2,78,330 లక్షల మంది బాధితులు ఈ ప్రాణాంతకమైన వైరస్ నుంచి కోలుకున్నారు. ఈ వైరస్‌ను నివారించడానికి పలు దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. స్వీయ నియంత్రణ, వ్యక్తిగత శుభ్రతను పాటించాలని ప్రభుత్వాలు పలు సూచనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిచిగాన్కు చెందిన ఓ నర్స్ చేతులకు గ్లౌస్ తొడుకున్నపటికీ ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుందో తన పేయింటింగ్ వీడియో ద్వారా వివరించారు. (ఆ దేశాలకు ఎగుమతి చేస్తాం: భారత్) నర్స్ మోలీ లిక్సే మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ను అడ్డుకోవడానికి ప్రజలు చేతులకు గ్లౌస్ వాడుతున్నారు. ఈ సమయంలో ప్రజలు గ్లౌస్ వాడటం సంతోషం. వైరస్ నివారణకు గ్లౌస్ సరిపోవు. వాటి వల్ల కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంద’ని తెలిపారు. గ్లౌస్ ధరించినప్పటికీ ఇంట్లో చేసే పనుల వల్ల తెలియకుండానే వైరస్ గ్లౌస్‌కు వ్యాపిస్తుంది. అలాగే ఇతర వస్తువులు, మొబైల్ ఫోన్ వంటి వాటిని తాకినప్పుడు వాటిపైకి వైరస్ చేరుతుంది. రక్షణ కలిగించే గ్లౌస్ తొలగించి.. వైరస్ ఉన్న వస్తువులను, ఫోన్‌ను ఉపయోగించటం మూలన వైరస్ సోకుతుంది. దీనిని క్రాస్ కంటామినేషన్ (ఒక చోటు నుంచి మరో చోటుకి మన చర్యల వల్ల వైరస్ వ్యాపించటం) అంటామని ఆమె తెలిపారు. (ప్రతీకారం తప్పదు.. ఇలాంటి వాళ్లను చూడలేదు) నిత్యావసర వస్తువులను కోనుగోలు చేయడానికి సూపర్ మార్కెట్లకు వెళ్లే వినియోగదారుల నుంచి ఆ వైరస్ వస్తువులపైకి ఎలా చేరుతుంది. మరో వినియోగదారుడు ఆ వస్తువులను తాకటం వల్ల ఎలా వైరస్ వ్యాపిస్తుందో స్పష్టంగా మోలీ లిక్సే తన వీడియోలో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరుచుకోవాలని, గ్లౌస్‌ను ఒకేసారి ఉపయోగించాలని మోలీ లిక్సే సూచించారు. -
వైరస్ నివారణకు గ్లౌస్ సరిపోవు
-
దురుసుగా ప్రవర్తించేవాడు! కొట్టేవాడు..
మిచిగాన్ : ఎంతో ఆప్యాయంగా తను పెంచుకుంటున్న కుక్కపిల్లను తండ్రి దురుసు ప్రవర్తన కారణంగా దూరంచేసుకున్నాడో బాలుడు. దాన్ని ఓ సంరక్షణాలయం దగ్గర వదిలేసి తాను కుక్కపిల్లను ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో తెలుపుతూ ఓ లేఖ పెట్టాడు. ఆ లేఖను చదివిన అక్కడివారి మనసు కదిలిపోయింది. వివరాల్లోకి వెళితే.. మెక్సికోలోని మిచావోకాన్కు చెందిన 12 ఏళ్ల ఆండ్రూ అనే బాలుడు ఓ పిట్‌బుల్ డాగ్‌ను పెంచుకుంటున్నాడు. అయితే అతడి తండ్రికి ఆ కుక్క ఇంట్లో ఉండటం నచ్చలేదు. ప్రతిరోజూ దాన్ని హింసించేవాడు.. దురుసుగా ప్రవర్తించేవాడు, ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడు. తండ్రి తన ప్రియమైన కుక్కతో దురుసుగా ప్రవర్తించటం ఆండ్రూకు నచ్చేది కాదు. తండ్రి కుక్కను అమ్మేయాలనుకున్న నేపథ్యంలో ఆండ్రూ మనసు కలత చెందింది. ఎలాగైనా తన కుక్కను రక్షించాలనుకున్నాడు. ఫిబ్రవరి 13న దాన్ని ఓ అట్టపెట్టెలో ఉంచి అక్కడికి దగ్గరలోని మెక్సికన్ సంరక్షణాలయం ముందు వదిలేశాడు. అక్కడ బాక్సులో కుక్కపిల్ల ఉండటం గమనించిన సంరక్షణాలయం వారు దాన్ని బయటకు తీశారు. అందులో కుక్కతో పాటు ఓ లేఖ ఉండటం గమనించారు. ఆ లేఖలో ... ‘‘ నా పేరు ఆండ్రూ. నా వయసు 12 సంవత్సరాలు. నేను, మా అమ్మ ఈ కుక్కపిల్లను మీ చేతుల్లో వదిలిపెట్టాలని నిశ్చయించుకున్నాం. ఎందుకంటే మా నాన్ననుంచి దీన్ని రక్షించాలని. మా నాన్న దీన్ని అమ్మేయాలనుకుంటున్నాడు. ప్రతిరోజూ దాంతో దురుసుగా ప్రవర్తించేవాడు, కొట్టేవాడు. ఓ రోజు దాన్ని కాలుతో చాలా గట్టిగా తన్నాడు. దీంతో దాని తోకకు గాయమైంది. మీరు దీనికి సహాయం చేస్తారనుకుంటున్నాను. ఇది నన్ను మర్చిపోదని నా నమ్మకం’’. ఆ సంరక్షణాలయం వారు ఆ లేఖను ఫేస్బుక్లో ఉంచటంతో కుక్కపిల్ల ఫొటోలు వైరల్‌గా మారాయి. దీంతో 300మందికిపైగా దాన్ని దత్తత తీసుకోవటానికి ముందుకొచ్చారు. సంరక్షణాలయం సిబ్బంది దానికి రిని అని పేరు కూడా పెట్టారు. -
నేషనల్ హైవేపై పోర్న్ వీడియో..
మిచిగాన్ : ఓ ఇద్దరు యువకులు చేసిన అల్లరి పనికి మిచిగాన్ హైవేపై వెళుతున్న ప్రయాణికులు నోరెళ్లబెట్టారు. ప్రచార ప్రదర్శనలు రావాల్సిన బిల్‌బోర్డుపై బూతు చిత్రాలేంటని ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజుల క్రితం మిచిగాన్ నేషనల్ హైవేపై బైకుమీద వెళుతున్న ఇద్దరు వ్యక్తులు బిల్బోర్డును కంట్రోల్ చేసే గది దగ్గరకు వెళ్లారు. తమ సెల్ఫోన్లో ఉన్న పోర్న్ వీడియో బిల్‌బోర్డు తెరపై వచ్చేలా చేశారు. దీంతో రాత్రి 11 గంటల ప్రాంతంలో హైవేపై ఉన్న బిల్‌బోర్డు తెరలపై పోర్న్ వీడియోలోని దృశ్యాలు ప్రత్యక్షమయ్యాయి. ఆ సమయంలో హైవేపై వెళుతున్న వారు ఆ దృశ్యాలను చూసి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. అక్కడినుంచి వెళ్లిపోతూ ఈ తతంగాన్నంతా వీడియో తీసిన ఆ ఇద్దరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బిల్‌బోర్డుపై దాదాపు 17 నిమిషాల పాటు పోర్న్ వీడియోలు ప్రదర్శితమయ్యాయి. ఇది గమనించిన పోలీసులు సంబంధిత వ్యక్తులను అలర్ట్ చేశారు. వారు వెంటనే వీడియోలను నిలిపివేశారు. బిల్బోర్డ్ గది సీసీ టీవీ ఫొటేజ్ల ఆధారంగా ఇద్దరు అనుమానితుల్ని గుర్తించిన పోలీసులు వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. -
యూఎస్‌లో కారు ప్రమాదం.. హైదరాబాద్ యువతి మృతి
-
అమెరికాలో హైదరాబాద్ యువతి దుర్మరణం
సాక్షి, సిటీబ్యూరో: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ యువతి దుర్మరణం పాలైంది. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8.45 గంటలకు మిచిగాన్ వద్ద ఆగి ఉన్న కారును అతివేగంగా వచ్చిన మరో కారు వెనక నుంచి ఢీకొట్టడంతో ముందు కారులో ఉన్న ఎల్ల చరితారెడ్డి ప్రాణాలు కోల్పోయారు. ఘటనలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నేరేడ్మెట్లోని రేణుకానగర్‌కు చెందిన ఇంద్రారెడ్డి, శోభ దంపతులకు కుమార్తె చరితారెడ్డి, కుమారుడు యశ్వంత్‌రెడ్డి ఉన్నారు. 8 నెలల క్రితం అమెరికాలోని డెలాయిట్ కంపెనీలో ఉద్యోగం రావడంతో చరితారెడ్డి అక్కడకు వెళ్లారు. మిచిగాన్‌లో ఉంటున్న ఆమె.. వీకెండ్ కావడంతో శుక్రవారం ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో బయటకు వెళ్లారు. మిచిగాన్ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న వారి కారును వెనుక వైపు నుంచి మరో కారు ఢీకొట్టింది. కారు వెనుక సీటులో కూర్చున్న ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదానికి కారకుడైన వ్యక్తిని అరెస్టు చేశారని మృతురాలి సోదరుడు తెలిపారు. ఆమె మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని.. ఈ విషయంలో మంత్రి ఈటల రాజేందర్ చొరవ తీసుకున్నారన్నారు. ప్రమాదం ముందురోజే తన సోదరి తమతో మాట్లాడిందని, హెచ్వన్ వీసా రాకపోతే హైదరాబాద్ వచ్చేస్తానని చెప్పిందని యశ్వంత్‌రెడ్డి కన్నీళ్ల పర్యంతమయ్యారు. -
సీటు బెల్టు కత్తిలా మారి ఆమె కడుపును..
మిచిగాన్ : ఓ కారు ప్రమాదంలో సీటు బెల్టు కత్తిలా మారి చోదకురాలి కడుపును చీల్చివేసింది. దాదాపు రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఈ విషాదకర సంఘటనలో ఆమె ప్రాణాలతో బయటపడ్డా.. శరీరం మాత్రం చెరిగిపోని గాయంతో చిరుగులు పడ్డ గుడ్డముక్కలా తయారైంది. వివరాల్లోకి వెళితే.. మిచిగాన్కు చెందిన గీనా ఆర్నాల్డ్ 2017 ఆక్టోబర్‌లో తన సొంత కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. దాదాపు 7 సార్లు కారు పల్టీలు కొట్టడంతో రక్షణ కోసం ధరించిన సీటు బెల్టు ఓ కత్తిలా మారి కడుపును చీల్చింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మూడు నెలల పాటు ఇన్టెన్సివ్ కేర్‌లో గడిపింది. దాదాపు 20 అత్యవసర సర్జరీల అనంతరం ప్రాణాలతో బయటపడగలిగింది. గీనా ఆర్నాల్డ్ మాట్లాడుతూ.. ‘‘ ఆ రోజు ఏం జరిగిందో నాకు సరిగా గుర్తులేదు. ప్రమాదం జరిగినపుడు వర్షం పడిందని, కారు నా కంట్రోల్ తప్పి ప్రమాదానికి గురైందని తర్వాత తెలిసింది. నా కారు ఏడు సార్లు పల్టీలు కొట్టి, చెట్టును ఢీకొట్టిందని సంఘటన జరిగిన రోజు అక్కడున్న వ్యక్తి చెప్పాడు. సీటు బెల్టు కత్తిలా మారి నా పొట్టను చీల్చినా.. నా అదృష్టం అది పెట్టుకోవటం వల్ల ప్రాణాలతో బయటపడగలిగాను. ఆ తర్వాత నేను మూడు రోజులు కోమాలో ఉన్నాను. నా రెండు ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. ఏ ఏ ఎముకలు విరిగాయో తెలుసుకోవటానికి డాక్టర్లకు ఓ వారం రోజులు పట్టింది. నన్ను ప్రాణాలతో రక్షించటానికి అత్యవసర సర్జరీలు చేయాల్సి వచ్చింది. ఆ నొప్పిని నా జీవితంలో నేనెప్పుడూ భరించలేదు. సర్జరీలు జరిగినా నడుస్తానన్న నమ్మకం ఉండేది కాదు. నా కడుపులోని చాలా భాగాన్ని తొలగించాల్సి వచ్చింద’’ని తెలిపింది. 14నెలల తర్వాత కోలుకున్న గీనా దివ్యాంగులకు సేవ చేస్తూ జీవితాన్ని గడిపేస్తోంది. -
తల్లీని హత్య చేశాడని తండ్రిపై కోర్టులో దాడి
-
ఓ రెండు నిమిషాలు అతన్ని వదిలేయాల్సింది
మిచిగాన్ : కోర్టులో హత్య కేసు విచారణ జరుగుతోంది. నేరస్తుడు దూరంగా ఓ చోట కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఇంతలో అక్కడికి దగ్గరలో.. జనం మధ్య నిలబడి ఉన్న ఓ యువకుడు ఆవేశంగా బ్యారియర్లను దాటుకుంటూ ఆ నేరస్తుడిపై దాడి చేయటానికి పరుగు తీశాడు. కానీ అతడి ప్రయత్నం విఫలమైంది. పోలీసులు అతడ్ని నిలువరించి అక్కడే బంధించేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ నేరస్తుడు హత్య చేసింది ఎవరినో కాదు.. కట్టుకున్న భార్యను. అతడిపై దాడి చేయాలనుకున్నది కూడా ఎవరో కాదు కన్నకొడుకే. అసలు కథేంటంటే.. మిచిగాన్కు చెందిన వాషన్ ఫ్లవర్స్ అనే వ్యక్తి తన భార్య జేమీ థామస్ ఫ్లవర్‌ను దారుణంగా కాల్చిచంపాడు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో వాషన్ కుమారుడు లండన్ థామస్ తండ్రిపై దాడి చేయటానికి ప్రయత్నించాడు. కానీ పోలీసులు అతన్ని అడ్డగించి, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అయితే దీనిపై స్పందించిన ఓ నెటిజన్‘‘ తల్లిని కోల్పోయిన ఆ కుమారుడికి కోర్టు కొద్దిగా న్యాయం చేయాల్సింది. కనీసం ఓ రెండు నిమిషాలు అతన్ని వదిలేయాల్సింద’ని కామెంట్ చేశాడు. -
అమెరికా అబ్బాయి.. చిత్తూరు అమ్మాయి
సాక్షి, చిత్తూరు: ఖండాంతరాల ప్రేమను పండించుకున్న అమెరికా అబ్బాయి, చిత్తూరు అమ్మాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రానికి చెందిన పీటర్ గ్రెయినర్, షారౌన్ల కుమారుడు అండ్రూ గ్రెయినర్, చిత్తూరు కొంగారెడ్డిపల్లె ఉషానగర్ కాలనీకి చెందిన సుధాకర్, కుమారీల కుమార్తె శ్రీనిరీష హిందూ సంపద్రాయం ప్రకారం గురువారం వివాహం చేసుకున్నారు. వీరి వివాహ వేడుకకు స్థానిక ఎంఎస్ఆర్ సర్కిల్ వద్దనున్న ఓ హోటల్ వేదికైంది. శ్రీనిరీష 2013లో ఎంఎస్ చదువుకోవడానికి అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీలో చేరారు. ఆ సమయంలో సహ విద్యార్థి అండ్రూ గ్రెయినర్తో స్నేహం ఏర్పడింది. తదనంతరం అక్కడే ఇద్దరూ స్టాఫ్‌వేర్ ఉద్యోగాల్లో చేరారు. ఇరువురు ప్రేమించుకోవడం, ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో వీరి పెళ్లికి ముహుర్తం కుదిరింది. ఇటీవల అమెరికాలో ఎంగేజ్మెంట్ చేసుకొని, చిత్తూరులో హిందూ సంప్రదాయం ప్రకారం ఒకటయ్యారు. -
ఫేక్ యూనివర్సిటీ కేసు: మిషిగన్ ఫెడరల్ కోర్టులో ట్రయిల్
-
బాధిత విద్యార్థులకు ‘నాటా’ న్యాయసహాయం
న్యూజెర్సీ : ఫర్మింగ్టన్ ఫేక్ యూనివర్సిటీ వ్యవహారంలో అరెస్టయిన తెలుగు విద్యార్థులకు సాయం చేసేందుకు నార్త్ అమెరికన్ తెలుగు అసోషియేషన్ (నాటా) ముందుకొచ్చింది. ఫర్మింగ్టన్ యూనివర్సిటీ ఫేక్ అని తెలియక చాలా మంది విద్యార్థులు మోసపోయారని నాటా ప్రెసిడెంట్ డాక్టర్ గోసల రాఘవ రెడ్డి, కార్యదర్శి ఆళ్ళ రామిరెడ్డి అన్నారు. బాధితుల్లో ఎక్కువమంది తెలుగు విద్యార్థులే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. (130 మంది విద్యార్థుల అరెస్టు) అరెస్టయిన వారిలో చాలామంది తమ వర్క్ పర్మిట్ పొందడానికి ఈ యూనివర్సిటీలో చేరానని వెల్లడించారు. బాధిత విద్యార్థులు నాటాకు ఫోన్ చేసి పరిస్థితి వివరించారని తెలిపారు. విద్యార్థులకు ఉచిత న్యాయసహాయం అందిస్తామని నాటా నాయకులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇమ్మిగ్రేషన్ లాయర్లు విజయ్ ఎల్లారెడ్డిగారి, సంతోష్‌రెడ్డి సోమిరెడ్డి, యాయా తిబిట్ బాధిత విద్యార్థులతో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, వలసదారుల హక్కులేమిటో తెలిపారని, మళ్లీ ఇలాంటి ఘటనల్లో బాధితులు కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారని తెలిపారు. తల్లిదండ్రులు భయపడొద్దు.. అరెస్టయిన విద్యార్థుల తల్లిదండ్రులు భయపడాల్సిన పనిలేదని నాటా నాయకులు తెలిపారు. విచారరణ పూర్తయిన అనంతరం విద్యార్థుల భారత్‌కు పంపుతారని వెల్లడించారు. హోమ్ ల్యాండ్ సెక్యురిటీ శాఖ నిర్బంధంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని భరోసానిచ్చారు. వివరాలు తెలుసుకోవాలంటే.. అరెస్టయిన వారి వివరాలు తెలుసుకోవాలంటే https://locator.ice.gov వెబ్సైట్లో లేదా ఇండియన్ ఎంబసీ వారికి {(202) 322-1190, (202) 340-2590} ఫోన్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు. వివరాలకోసం.. cons3.washington@mea.gov.in కి ఈమెయిల్ చేయవచ్చని తెలిపారు. కష్టపడి చదివిన విద్యార్థులా ఫేక్ యూనివర్సిటీల ఉచ్చులో పడకుండా.. అన్ని రూల్స్ పాటించి ప్రముఖ విశ్వవిద్యాలయాల నుంచి OPT/CPT పొందడం కోసం కృషి చేయాలని సలహా ఇచ్చారు. ఎటువంటి కోర్లులు లేకుండా ఏ యూనివర్సిటీ అయినా CPT అందించినట్టయితే అలాంటి వర్సిటీలను నమొద్దని హెచ్చరించారు. 129 మంది భారతీయులే.. అమెరికాలో విద్యార్థి వీసాలపై అక్రమంగా ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్న విదేశీయులను పట్టుకునేందుకు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ (ఐసీఈ) అధికారులు పార్మింగ్టన్ పేరుతో నకిలీ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ వలలో చిక్కిన 8 మంది మధ్యవర్తులు (అందరూ తెలుగు వారే) ఇప్పటికే అరెస్టవ్వగా, తాజాగా 130 మంది విద్యార్థులు కూడా అరెస్టయ్యారు. 8 మందిపై వీసా సంబంధిత నేరపూరిత కుట్ర, లాభం కోసం అన్యులకు ఆశ్రయమివ్వడం తదితర అభియోగాలను నమోదు చేసిన అధికారులు, విద్యార్థులపై మాత్రం కేవలం పౌర వలస నిబంధనల ఉల్లంఘన అభియోగంతో సరిపెట్టారు. అరెస్టైన 130 మంది విద్యార్థుల్లో 129 మంది భారతీయులేనని ఐసీఈ అధికార ప్రతినిధి ఖాలిద్ వాల్స్ చెప్పారు. వారిని భారత్‌కు తిరిగి పంపించేయనున్నామన్నారు. -
మనోళ్లను ఆదుకునేందుకు రంగంలోకి ‘ఆటా’
న్యూజెర్సీ : ఫేక్ యూనివర్సిటీ వ్యవహారంలో అరెస్టయిన తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు ఆటా (అమెరికన్ తెలుగు అసోషియేషన్) రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంలో పోలీసులు ఇప్పటివరకు 600 మందికి వారెంట్లు జారీ చేయగా.. 100 మందిని అరెస్టు చేశారు. నకిలీ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న మరో 8 మందిని కూడా అరెస్టు చేశారు. కాగా, ఆటా లీగల్ టీమ్ సంబంధిత అటార్నీలను సంప్రదించింది. యూఎస్‌లోని పలు భారతీయ విద్యార్థి సంఘాలతో సమావేశమైంది. ఫర్మింగ్టన్ యూనివర్సిటీ ఘటనలో చిక్కుకున్న బాధిత తెలుగు విద్యార్థులను బయటకు తెచ్చేందుకు ఇండియన్ అంబాసిడర్ హర్షవర్ధన్ సింఘాల, ఇండియన్ కాన్సులేట్ జనరల్ డాక్టర్ స్వాతి విజయ్ కులకర్ణిలను ఆటా లీగల్ టీమ్ సభ్యులు కలిశారు. తదుపరి చేపట్టబోయే చర్యలపై వారితో చర్చించారు. ఇండియన్ ఎంబసీకి అవసరమైన అన్ని సహాయసహకారాలు అందిస్తామని ఆటా ప్రెసిడెంట్ పరమేష్ భీమ్‌రెడ్డి తెలిపారు. (అమెరికాలో పట్టుబడ్డ 200 మంది తెలుగువారు) ఇమ్మిగ్రేషన్ అటార్నీలు రవికుమార్ మన్నం, మైఖేల్ సోఫో, హేమంత్ రామచెంద్రన్ ఆధ్వర్యంలో గురువారం (జనవరి 31) ఆటా వెబినార్ (ఇమ్మిగ్రేషన్ సెమినార్) సదస్సును నిర్వహిస్తామని తెలిపారు. ఫేక్ ఏజెంట్ల చేతుల్లో మోసాలకు గురికాకుండా ఉండేందుకు ఈ సదస్సులో సలహాలు, సూచనలు ఇస్తామన్నారు. నకిలీ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొంది ఇబ్బందులలకు గురికావద్దని అన్నారు. అమెరికా చట్టాల ఉల్లంఘించి కటకటాలపాలు కాకుండా పాటించాల్సిన మార్గదర్శకాలను అటార్నీలు సదస్సులో చెప్తారని తెలిపారు. -
అమెరికాలో పట్టుబడ్డ 200 మంది తెలుగువారు!
వాషింగ్టన్: అమెరికాలో అక్రమ వలసదారుల అరెస్టు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అక్రమ వలసదారుల గుట్టును రాబట్టేందుకు మిచిగన్ రాష్ట్రంలో ఒక ఫేక్ యూనివర్సిటీని సృష్టించి.. సరైన ధ్రువపత్రాలు లేని 600 మంది విదేశీయులను అమెరికాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) అదుపులోకి తీసుకుంది. ఈ వ్యవహారంలో పట్టుబడ్డవారిలో దాదాపు 200 మంది తెలుగు వారు ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా సరైన ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాలోకి విదేశీ విద్యార్థులను తీసుకువచ్చారనే అభియోగాలతో ఎనిమిది మందిని అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం డెట్రాయిట్ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న వీరిలో భరత్ కాకిరెడ్డి (29) (ఫ్లోరిడా), అశ్వంత్ నూనె (26) (అట్లాంటా), సురేష్‌రెడ్డి కందాల (31) (వర్జినియా), ఫణిదీప్ కర్నాటి (35) (కెంటకీ), ప్రేమ్‌కుమార్ రామ్పీసా (26) (నార్త్ కరోలినా), సంతోష్‌రెడ్డి సామ, (28) (కాలిఫోర్నియా), అవినాష్ తక్కళ్లపల్లి (28) (పెన్సిల్వేనియా), నవీన్ పత్తిపాటి (29) (డల్లాస్) తదితరులు ఉన్నారు. మరో 14మంది తెలుగు విద్యార్థులను కూడా అరెస్టు చేశారని, వీరిలో ముగ్గురు అమ్మాయిలు కూడా ఉన్నారని తెలుస్తోంది. (పలువురు భారతీయ విద్యార్థుల అరెస్ట్) అక్రమ వలసదారుల్ని గుర్తించేందుకే 2015లో డీహెచ్ఎస్.. మిచిగన్ రాష్ట్రంలోని డెట్రాయిట్లో యూనివర్సిటీ ఆఫ్ ఫర్మింగ్టన్ పేరిట ఒక ఫేక్ వర్సిటీని ఏర్పాటు చేసింది. ఈ వర్సిటీలో యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) అధికారులు మారుపేర్లతో అధికారులుగా రంగంలోకి దిగి.. అక్రమ వలసదారులకు అడ్మిషన్ పేరిట గాలం వేశారు. ఉన్నత విద్య పేరిట నకిలీ పత్రాలతో అమెరికాలోకి ప్రవేశించి.. అక్రమంగా నివసిస్తున్న వారిని టార్గెట్ చేసుకొని వారు ఆపరేషన్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్ ఫర్మింగ్టన్‌లో విద్యార్థుల పేరిట నమోదైన అక్రమ వలసదారుల గుట్టు బట్టబయలైంది. అయితే, పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి హెచ్ 1బీ వీసా కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు కూడా ఉండడం గమనార్హం. ఇమ్మిగ్రేషన్ అధికారుల విచారణలో.. నకిలీ మాస్టర్స్ డిగ్రీలతో కొందరు ఉద్యోగాలు కూడా చేస్తున్నట్టు వెల్లడైంది. -
అమెరికాలో భారతీయ విద్యార్థుల అరెస్ట్
వాషింగ్టన్: అమెరికా మిచిగాన్ రాష్ట్రంలో ఒక ఫేక్ యూనివర్సిటీ బండారం బట్టబయలైంది. అందులో అడ్మిషన్ పొందిన పలువురు భారతీయ విద్యార్థులను యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) అరెస్టు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. అయితే, మిచిగాన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ లో కొనసాగుతున్న యూనివర్సిటీ ఆఫ్ ఫర్మింగ్టన్‌లో అడ్మిషన్ తీసుకుని తద్వారా పొందిన ధ్రువపత్రాలు బోగస్ గా గుర్తించిన కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్ మెంట్ బుధవారం పలువురు విద్యార్థులను అరెస్టు చేసినట్టు తెలిసింది. ఈరోజు ఉదయం అరెస్టు చేసిన వారిలో నలుగురు భారతీయ విద్యార్థులు ఉన్నట్టు అక్కడి వర్గాలు చెప్పాయి. కేవలం అమెరికాలో కొనసాగేందుకు వీలుగా ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందుతున్నారని యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) గుర్తించి తనిఖీలు నిర్వహించింది. తనిఖీల సందర్భంగా మొత్తం యూనివర్సిటీయే ఫేక్ అని బయటపడింది. మిడిల్ ఈస్ట్ కు చెందిన పలువురు వ్యక్తులు ఈ ఫేక్ యూనివర్సిటీని నడిపిస్తున్నారని, తరగతులు నిర్వహించకపోవడం, ఏ డిపార్ట్మెంట్లో కూడా ప్రొఫెసర్లు లేకపోవడం వంటి అనేక విషయాలు తనిఖీల్లో బయటపడినట్టు తెలిసింది. యూనివర్సిటీకి అక్రిడిటేషన్ కూడా లేదని బయటపడినట్టు సమచారం అందింది. యూనివర్సిటీ సెవిస్ ఉల్లంఘన కింద అట్లాంటా జార్జియాలో నలుగురు భారతీయ విద్యార్థులను అరెస్టు చేసినట్టు తెలిసింది. అయితే, మొత్తంగా ఎంతమందిని అరెస్టు చేసింది? ఎలాంటి చర్యలకు ఉపక్రమించారన్న పూర్తి వివరాలు అందాల్సి ఉంది. -
ఫైర్ చాలెంజ్ పూర్తి చేస్తానంటూ..
మిచిగాన్ : ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలెంజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఫిట్నెస్, గ్రీన్, కేరళ డొనేషన్ చాలెంజ్ వంటి ఉపయోగకరమైన చాలెంజ్‌లతో పాటు... కీకీ వంటి ప్రమాదకరమైన చాలెంజ్‌లు కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరుగున పడిన ఫైర్ చాలెంజ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలను చూసిన ఓ బాలిక ప్రాణాల మీదకి తెచ్చుకుంది. వైరల్‌గా మారిన చాలెంజ్‌ను స్వీకరిస్తానంటూ ఒంటికి నిప్పంటించుకుంది. ఈ ఘటన మిచిగాన్‌లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. మిచిగాన్కు చెందిన తిమియా ల్యాండర్స్(12) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే స్నేహితురాలితో కలిసి యూట్యూబ్‌లో వీడియోలు చూస్తున్న సమయంలో ఫైర్ చాలెంజ్ గురించి తెలుసుకుంది. తాను కూడా ఈ చాలెంజ్ పూర్తి చేస్తానంటూ ఒంటిపై ఆల్కహాల్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలు తీవ్ర రూపం దాల్చడంతో బాధను భరించలేక గట్టిగా కేకలు వేసింది. తిమియా అరుపులు విన్న ఆమె తల్లి వెంటనే పరుగెత్తుకు వచ్చి మంటలు ఆర్పి, ఆమెను ఆస్పత్రిలో చేర్చింది. అయితే 50 శాతం ఒళ్లు కాలిపోవడంతో ఆమెకు సర్జరీ చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ విషయం గురించి తిమియా తల్లి మాట్లాడుతూ... ‘పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే ఇటువంటి ప్రమాదకరమైన వీడియోల వల్ల నాలాగా ఏ తల్లిదండ్రులు బాధ పడకూడదు. యూట్యూబ్‌లో ఉన్న ఈ వీడియోలను వెంటనే తొలగించాలి. లేనిపక్షంలో వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతాన’ని హెచ్చరించారు. కాగా ఇటువంటి వీడియోలను తాము ఎంత మాత్రం సహించబోమని, వాటిని వెంటనే తొలగిస్తామని యూట్యూబ్ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. ఏమిటీ ఫైర్ చాలెంజ్.. 2012లో ప్రారంభమైన ఫైర్ చాలెంజ్ అమెరికాలో బాగా ఫేమస్ అయ్యింది. ఫైర్ చాలెంజ్‌ను స్వీకరించిన వారు ఒంటిపై ఆల్కహాల్ పోసుకొని నిప్పంటించుకోవాలి. ఆ తర్వాత వెంటనే బాత్‌టబ్ వద్దకు పరిగెత్తి మంటలను ఆర్పేసుకోవాలి. ఈ తతంగాన్నంతా వీడియో తీసి మరొకరికి చాలెంజ్ విసరాలి. కాగా ఇటువంటి పిచ్చి చాలెంజ్‌ల బారిన పడుతున్న పిల్లల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని, పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని పోలీసు అధికారులు చెబుతున్నారు. -
డెలివరీ బాయ్.. అమేజింగ్ టాలెంట్
ఎవరిలో ఏం టాలెంట్ ఉంటుందో చెప్పలేం. అందుకే ఎవరినీ తక్కువ అంచనా వేయవద్దని పెద్దలు సూచిస్తుంటారు. ఇందులో భాగంగానే అమెరికాకు చెందిన ఓ డెలివరీ బాయ్ అనూహ్య రీతిలో తన టాలెంట్‌ను ప్రపంచానికి చాటిచెప్పి శెభాష్ అనిపించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మిచిగాన్ : అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రం డెట్రాయిట్ నగరానికి చెందిన వర్చెట్టి కుటుంబం కొన్నిరోజుల కిందట పిజ్జాలు ఆర్డర్ ఇచ్చింది. బ్రైస్ డుడల్ అనే 18 ఏళ్ల విద్యార్థి డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. వర్చెట్టి ఇంటికి వెళ్లిన డుడల్ పిజ్జాను డెలివరీ చేశాడు. వారి ఇంట్లో పియానో చూసి ముచ్చటపడ్డ ఆ టీనేజర్ నేను ఒక్కసారి ప్లే చేయవచ్చా అని అడిగాడు. అందుకు జూలీ వర్చెట్టి ఆలోచిస్తూనే సరేనంది. వెంటనే పియానో ముందున్న బెంచ్‌పై కూర్చున్న డెలివరీ బాయ్ కొన్ని సెకన్లలోనే బటన్లపై చేతివేళ్లను వేగంగా కదిలించడం మొదలుపెట్టాడు. బీథోవెన్స్ ‘మూన్లైట్’ సొనాటాను చాలా అద్బుతంగా ప్లే చేశాడని ఆమె పొగడ్తల్లో ముంచేసింది. వాషింగ్టన్ పోస్ట్‌తో మాట్లాడుతూ.. చేసేది డెలివరీ బాయ్ జాబ్ కానీ అతడికి ఎంతో టాలెంట్ ఉందన్నారు జూలీ. ర్యాన్ వర్చెట్టి సైతం హర్షం వ్యక్తం చేశాడు. వీడియో గేమ్ ఆడుతున్న మా 10ఏళ్ల బాబు అది పక్కనపెట్టేసి మరీ పియానో ప్లే చేస్తున్నది ఎవరో చూసేందుకు వచ్చాడని తెలిపాడు. డెలివరీ బాయ్ డుడల్ పియానో వద్దకు వెళ్లగా.. అది పగలకొడతాడేమోనని అనిపించిందన్నాడు. చిన్నప్పటి నుంచీ పియానో ప్లే చేయడం అంటే ఇష్టమని, దాంతోపాటు బేస్‌బాల్ గేమ్ వల్ల తనకు స్కాలర్షిప్ వస్తుందని ఆగస్టులో మాకాంబ్ కమ్యూనిటీ కాలేజీలో చేరనున్నట్లు డెలివరీ బాయ్ తమకు చెప్పినట్లు ర్యాన్ వివరించాడు. అతడు పియానో ప్లే చేస్తుండగా వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేయగా భారీ లైక్స్, కామెంట్లతో అతడు పాపులర్ అయిపోయాడు. డెలివరీ బాయ్‌గా చేస్తున్నాడు కానీ.. ఈ టీనేజర్లో అమేజింగ్ టాలెంట్ ఉందని నెటిజన్లు కొనియాడుతున్నారు. -
19న మిచిగాన్‌లో ఉగాది వేడుకలు
మిచిగాన్ : అమెరికాలోని మిచిగాన్‌లో విళంబి నామ సంవత్సర ఉగాది సంబారాలను నిర్వహించడానికి ట్రాయ్ తెలుగు అసోసియేషన్(టీటీఏ) ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఉగాది సంబరాలను టీటీఏ మహిళ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 19న రొచెస్టర్ హిల్స్ లోని రొచెస్టర్ అడమ్స్ హై స్కూల్లో జరపనున్నారు. ఈ వేడుకల్లో ఆట పాటలు, నాటకాలు, మాటల చమత్కారాలు అథితులను అలరిస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ లీడ్ జ్యోత్స్న కంకటాల, కల్చరల్ కమిటీ లీడ్ దీపా కనకపల్లి, స్టాల్స్ కమిటీ లీడ్ సంధ్య చొలవేటి, ఫుడ్ కమిటీ లీడ్ శశికళ తియ్యారి, పబ్లిసిటీ కమిటీ లీడ్ గాయత్రి గంగిసెట్టి, రిసిప్షన్ కమిటీ లీడ్ సీతాల పసుల, డెకరేషన్ కమిటీ లీడ్ రూప గండ్రలు ఉగాది వేడుకల పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున తెలుగువారు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
మిచిగాన్‌లో దీపావళి వేడుకలు
మిచిగాన్‌లో శనివారం దీపావళి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ట్రాయ్ తెలుగు అసోషియేషన్, మిచిగాన్ ఆధ్వర్యంలో జరుగుతాయని నిర్వాహకులు ప్రకటించారు. ఈమేరకు నిర్వాహకులు వెంకటేష్ బాబు, ప్రసాద్ గంగిసెట్టి, సురేష్ చోలవీటిలు పత్రికా ప్రకటన విడుదల చేశారు. లాంఫర్ హైస్కూలులో శనివారం మద్యాహ్నం 3గంటలనుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, దీపావళి వేడుకలు ప్రాంరంభం అవుతాయని నిర్వాహకులు తెలిపారు. అనంతరం రాత్రి ఎనిమిది గంటలకు విందు ఉంటుందన్నారు. తెలుగు వారు ఎక్కడ ఉన్నా పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు. ఈమేరకు కార్యక్రమ నిర్వహకులు దీపావళి వేడుకలకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. -
యజమానిని రక్షించేందుకు..
షికాగో: విపత్కర సమయాల్లోనూ యజమాని పట్ల శునకాలు విశ్వాసాన్ని చాటుకుంటాయి! మిషిగాన్‌లోని పెటోస్కెయ్లో నివసించే బాబ్ అనే వ్యక్తి కొత్త ఏడాది రోజు కట్టెలు తెచ్చుకునేందుకు వ్యవసాయ క్షేత్రం నుంచి పెంపుడు కుక్క కెల్సీతో బయలుదేరాడు. కొద్దిదూరం నడిచాక కాలు జారి మంచులో పడి కదల్లేని పరిస్థితుల్లో ఉన్న బాబ్ను గమనించిన కెల్సీ మొరగటం మొదలుపెట్టింది. అయితే సమీపంలో ఎవరూ లేరు. దీంతో కెల్సీ.. బాబ్ శరీరంపైకి ఎక్కి చలి నుంచి రక్షణగా ఉండి తెల్లవారే వరకు అతను స్పృహ కోల్పోకుండా అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మరుసటి రోజు బాబ్ స్పృహ కోల్పోయినా.. కెల్సీ మాత్రం యాజమానిని కాపాడేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. తర్వాత అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి బాబ్ను బయటికి తీసి రక్షించాడు. -
మిచిగాన్‌లో కాల్పులు.. ఆరుగురు మృతి
న్యూయార్క్: అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. మిచిగాన్‌లోని కలమాజు కౌంటీలో ఓ సాయుధుడు కాల్పులు జరపడంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. క్రాకర్ బారెల్ రెస్టారెంట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. అయితే, కాల్పులు జరిపింది ఎవరు? అతడు ఎందుకు ఈ పనిచేశాడనే వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. -
ఫుట్‌బాల్ ఆటగాళ్ల కోసం.. సేఫ్ హెల్మెట్లు
వాషింగ్టన్: ఫుట్‌బాల్ ఆటగాళ్ల కోసం మిచిగాన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సురక్షితమైన హెల్మట్‌ను రూపొందించారు. తలకు గాయమైనప్పుడు దాని ప్రభావం మెదడుపై ఉండటం వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని శాస్త్రవేత్తలు కొత్త హెల్మెట్ తయారీకి పూనుకున్నారు. దీని తయారీలో బైక్ హెల్మట్లలో ఉండే ఫార్ములాను ఆధారంగా చేసుకున్నారు. బైక్ హెల్మెట్లకు ఎక్కువ బలంతో దెబ్బ తగిలినప్పుడు అందులో ఉండే ప్రత్యేకమైన మెకానిజం వల్ల అవి ఒత్తిడిని శోషించుకోవడంతో పాటు కొంత వ్యతిరేకమైన శక్తిని విడుదల చేస్తాయి. కానీ స్పోర్ట్స్ హెల్మెట్లలో ఇలాంటి ఫార్ములా లేకపోవడంతో తలకు బలమైన గాయాలు అవుతున్నాయని పరిశోధకులు వివరించారు. -
మిస్టరీని ఛేదించిన గూగుల్ మ్యాప్!
పదేళ్ళ క్రితం తప్పిపోయిన వ్యక్తి మిస్టరీ... గూగుల్ మ్యాప్ ఛేదించింది. గూగుల్ తీసిన ఏరియల్ ఇమేజ్ లో నీటి అడుగు భాగంలో ఉన్న కారులో ఓ వృద్ధుని శరీరం ఉన్నట్లు గుర్తించారు. ఎప్పుడో 2006 అక్టోబర్ 11న తప్పిపోయిన డేవీ లీ నైల్స్... మిచిగన్.. బైరాన్ టౌన్ షిప్ లోని.. జేక్స్ బార్ పాండ్ లో కనిపించాడు. లీ కుటుంబం.. ఇక 72 ఏళ్ళ ఆ వృద్ధుడి జాడ కనిపెట్టడం పై ఆశలు వదులుకున్నారు. చివరికి 2011 లో ఆయన సంస్మరణార్థం చరిత్రను పబ్లిష్ కూడా చేశారు. మిచిగన్ పాండ్ లో ఓ వ్యక్తి శరీరంతో పాటు ఉన్న కారును గూగుల్ మ్యాప్ గుర్తించడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. లీ ఓ ఫ్రెండ్ తో కలసి హఠాత్తుగా బయటకు వెళ్ళిపోయాడని, అప్పటికే అతడు క్యాన్సర్ తో బాధపడుతుండేవాడని అతడి కుటుంబం అప్పట్లో వెల్లడించింది. అయితే ఇప్పుడు కూడా అతడు ఎలా మృతి చెంది ఉంటాడో మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. అతడి సంస్మరణార్థం నిర్మించిన హోమ్ బయట క్రిస్మస్ ట్రీ ని అలంకరిస్తున్న సమయంలో లిఫ్ట్ లో నుంచి చూస్తున్న హౌస్ మ్యాన్ బ్రియాన్ కు అకస్మాత్తుగా పాండ్ లో కారు మునిగి ఉన్నట్లుగా కనిపించడంతో అతడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిజంగా పాండ్ లో కారు ఉండటం చూసి తాను ఎంతో ఆశ్చర్యపోయాను అంటూ వివరించాడు. గాఢాందకారంగా ఉన్న ఆ స్థలాన్ని ఎప్పుడూ ఎవరూ పట్టించుకోలేదని, అక్కడ అతడు ఉంటాడని కూడా ఎవరూ ఊహించలేదని అన్నాడు. అయితే గూగుల్ తీసిన చిత్రాల్లో మాత్రం కారులో నైల్స్ బాడీ ఉన్నట్లు గుర్తించారు. తొమ్మిదేళ్ళ రహస్యం బయటపడింది. అయితే అసలు ఆ సంఘటన ఎలా జరిగింది? వివరాలు మాత్రం తెలియలేదు. హౌస్ మ్యాన్ చెప్పిన వివరాలను బట్టి కెంట్ కౌంటీ షెరీఫ్స్ డిపార్ట్ర్ట్ మెంట్ సిబ్బంది పాండ్ లోని కారును గుర్తించింది. డైవ్ టీమ్ నీటిలో కారు ఉన్నట్లుగా నిర్ధారించారు. క్రేన్స్ సహాయంతో కారును బయటకు తీశారు. నైల్స్ చివరిసారి కనిపించిన ప్రాంతానికి అరమైలు దూరం లో ఆ పాండ్ ఉందని కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలను బట్టి చెప్తున్నారు. కారులోని డ్రైవర్ సీటులో నైల్స్ స్కెలిటెన్ ఉండగా... మట్టితో పూడిపోయిన కారును బయటకు తీశారు. అక్కడకు వచ్చిన బంధువులు నైల్స్ శరీర అవశేషాలను చూసి దుఃఖ సాగరంలో మునిగిపోయారు. అయితే ఎట్టకేలకు పదేళ్ళ అనుమానాలకు తెరపడినందుకు ఊపిరి పీల్చుకున్నారు. ఇక శోధనకు ముగింపు దొరికినట్లేనని.. నైల్స్ అల్లుడు స్కాట్ హాత్ వే అన్నారు. ఇన్నాళ్ళు నైల్స్ జాడ తెలియకుండా దేవుడు ఎందుకు ఉంచాడో తెలియదు కానీ... చివరకు ఇంటికి చేర్చడం సంతోషంగా ఉందన్నారు. అయితే అధికారులు నైల్స్ మరణానికి సంబంధించిన మిగిలిన వివరాలను సేకరిస్తున్నారు. నైల్స్ దంతాల రికార్డును బట్టి పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉందని ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అతడి జేబులోని వాలెట్ ను బట్టి అది నైల్స్ శరీరమేనని నమ్ముతున్నారు. ఇది నాటకం అయి ఉండక పోవచ్చని అంటున్నారు. అయితే కచ్ఛితంగా అసలేం జరిగి ఉంటుంది అన్నది మాత్రం తెలుసుకోవాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. -
బొద్దింక..ఇంకా..ఇంకా..
కుక్కలను, పిల్లులను పెంచుకోవడం కామన్.. పావురాలు, చిలుకలను పెంచుకోవడమూ చూశాం.. ఆఖరికి కాకులను కూడా పెంచుకుంటారు.. కాని బొద్దింకలను... బొద్దింకలా కష్టమే అంటారు కదా..! కాని మిషిగాన్‌కు చెందిన కైల్ కేండిలియన్ మాత్రం ఎగిరి గంతేస్తాడు. ఎందుకంటే అతనికి బొద్దింకలంటే చాలా ఇష్టం మరి.. అందుకే వాటిని తన బెడ్రూమ్లో పెంచుకుంటున్నాడు. ఏకంగా 130 జాతులకు చెందిన దాదాపు 2 లక్షల బొద్దింకలు తన గదిలో ఉన్నాయట.. వీటి కోసం ప్రత్యేకంగా అలమరాలు కూడా తయారుచేయించాడట.. అంతేకాదు వాటినిఅమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నాడు. ఎంత తెలివో ఆనందానికి ఆనందం.. పైగా డబ్బు బోనస్! -
ఫోన్ కాల్ తో తల్లి ప్రాణం కాపాడిన చిన్నారి!
వాషింగ్టన్: నాలుగేళ్ల చిన్నారి సమయ స్ఫూర్తితో వ్యవహరించి తన తల్లి ప్రాణాలు కాపాడింది. అమెరికాలోని మిచిగాన్ కలమజూ ప్రాంతానికి చెందిన కలైజ్ మానింగ్ అనే నాలుగేళ్ల చిన్నారి ఒక్క ఫోన్ కాల్ తో తన తల్లి ప్రాణాలు నిలిపింది. పురిటి నొప్పులతో బాధ పడుతున్న తన తల్లి సెంటిరీయా గురించి ఎమర్జెన్సీ సర్వీసుకు ఫోన్ చేసి ఆమెను కాపాడింది. 9 నెలల నిండు గర్భిణి అయిన సెంటిరీయా పురిటి నొప్పులతో కింద పడిపోయి విలవిల్లాడుతుండాన్ని గమనించిన కలైజ్ వెంటనే అత్యవసర సర్వీసు నంబర్ 911కు ఫోన్ చేసింది. 'మా అమ్మ కింద పడిపోయి విలవిల్లాడుతోంది. ఆమె పిల్లాడిని ప్రసవించనుంది. ఆమెకు వెంటనే సహాయం కావాలి' అని ఫోన్లో చెప్పింది. కలైజ్ ఫోన్ కాల్ కు వెంటనే స్పందించి రంగంలోకి అత్యవసర సిబ్బంది సెంటిరీయాను ఆస్పత్రికి తరలించి ఆమె ప్రాణాలు కాపాడారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి తన ప్రాణాలు నిలిపిన కూతురిని చూసి సెంటిరీయా ఎంతో మురిసిపోతోంది. విపత్కర పరిస్థితిలో తెలివిడిగా వ్యవహరించిన కలైజ్ కు అవార్డు కూడా ఇవ్వాలని ప్రతిపాదించారు. తనకు బుల్లి తమ్ముడు రావడంతో 'ఐ యామ్ ది బిగ్ సిస్టర్' అని మురిసిపోతోంది కలైజ్ మానింగ్. -
యూఎస్ ఎన్నికల బరిలో ముగ్గురు ఎన్నారైలు
యూఎస్ చట్టసభలకు నవంబర్‌లో ఎన్నికలు జరగునున్నాయి. ఆ చట్ట సభలలో సభ్యులుగా అడుగు పెట్టేందుకు ముగ్గురు భారతీయ అమెరికన్లు సమాయత్తమవుతున్నారు. వియత్నాం యుద్ధంలో పోరాడిన యోధుడు రాజీవ్ పటేల్ ఉత్తర కరోలినా నుంచి డెమెక్రటిక్ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. 1968లో వియత్నంలో పొరాడిన పటేల్ అనంతరం నార్త్ కరోలినాలోని ఈస్ట్ స్పెన్సర్ నగరానికి మేయర్‌గా ఎన్నికయ్యారు. అలాగే మరో భారతీయుడు అనిల్ కుమార్ స్వతహాగా వైద్యుడు. ఆయన మిచిగాన్ ప్రతినిధుల సభ నుంచి పోటీ చేయనున్నారు. ముచ్చటగా మూడో అభ్యర్థి సతీష్ కోర్పి ఇంజనీరింగ్ చదివి వ్యాపారవేత్తగానే కాకుండా మంచి భారతీయ సంతతికి చెందిన నాయకుడిగా ప్రఖ్యాతి గాంచారు. వర్జీనియా నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు. వీరే కాకుండా పలువురు భారతీయ అమెరికన్లు ఇప్పటికే యూస్ చట్టసభల రేసులో ఉన్నారు. -
తోబుట్టువులా అండగా ఉంటా..
రేణిగుంట, న్యూస్‌లైన్: ఏకష్టం వచ్చినా తోబుట్టువులా అండగా ఉంటానని రేణిగుంట మండలం జీవగ్రామ్‌కు చెందిన మోజస్ భగవాన్‌దాస్ కుటుంబ సభ్యులకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డి ధైర్యం చెప్పారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలం కేఎల్ఎం హాస్పిటల్ సమీపంలోని జీవగ్రామ్‌కు చెందిన మోజస్ భగవాన్‌దాస్ మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి మరణవార్తను జీర్ణించుకోలేక గుండెపోటుతో మృతిచెందారు. బాధిత కుటుంబాన్ని జననేత బుధవారం రాత్రి ఓదార్చారు. ముందుగా కుటుంబ సభ్యుల వివరాలు, క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో ఎంతమంది ఉన్నారంటూ మోజస్ భగవాన్‌దాస్ భార్య సులోచనమ్మను వివరాలు అడిగారు. పింఛన్ వస్తోందా, రేషన్‌కార్డు ఉందా, ఇంటి స్థలం ఉందా అని అడిగారు. రేషన్ కార్డు, పింఛను, ఇంటి స్థలం కోసం అర్జీలు పెట్టుకున్నామని ఆమె తెలిపారు. కుమారుడు హెర్బెట్ సునీల్‌కుమార్ కూలి పనికి వెళితేనే కుటుంబ పోషణ జరుగుతుందని చెప్పారు. మోజస్ భగవాన్‌దాస్ కుమార్తె దేవకుమారి, అల్లుడు అబ్రహాం ఆనంద్‌రాజ్‌ను ఎక్కడ ఉంటున్నారు, ఏం పనులు చేస్తున్నారని అడిగారు. దేవకుమారి దత్తతకు తీసుకున్న చిన్నారి గ్లోరీని ఆశీర్వదించి ముద్దాడారు. నాలుగు నెలల్లో మంచి రోజులు వస్తాయని, అన్ని విధాలా ఇంటి పెద్ద కొడుకునై ఆదుకుంటానని సులోచనమ్మకు భరోసా ఇచ్చారు. తన తరపున పార్టీ నేతలు వరప్రసాద్, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డిని సంప్రదించాలన్నారు. వీరి సమస్యలను స్వయంగా పరిష్కరించాలని బియ్యపు మధుసూదన్‌రెడ్డికి సూచించారు. ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డికి సులోచనమ్మ ఆప్యాయంగా పాయసం తినిపించారు. అనంతరం తమలాంటి కుటుంబాలను ఆదుకుంటూ పేదల కష్టాలను తీర్చేందుకు ముఖ్యమంత్రి కావాలంటూ ఆమె ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వరప్రసాద్, వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి, శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు తిరుమలరెడ్డి, మండల కన్వీనర్ అత్తూరు హరిప్రసాద్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు జువ్వల దయాకర్‌రెడ్డి, గాజులమండ్యం సర్పంచ్ శ్రీరాజ్, నాయకులు విరూపాక్షి జయచంద్రారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, స్థానికులు పాల్గొన్నారు. -
గడ్డకట్టుకుపోయిన మిచ్‌గాన్ సరస్సు
-
పరుపులో నాలుగు అడుగుల పాము!
మీరు పడుకునే పరుపులో పాము దూరితే మీ పరిస్థితి ఏంటి ఓ సారి ఊహించుకోండి. బెడ్ రూమ్ లో చిన్న ఎలుక కనిపిస్తేనే అదిరిపోయే మనం.. ఏకంగా పరుపులో పాము కనిపిస్తే.. ఇంకా ఉహించడం కష్టమే. సరిగ్గా ఇలాంటి సంఘటనే అమెరికాలోని మిచిగాన్ లో గ్రాండ్ రాపిడ్స్ లో నివసించే హోలీ రైట్ బెడ్ రూమ్ లోని పరుపులో పాము దూరింది. రెండు నెలల క్రితం సెకండ్ హ్యాండ్ బజార్ లో పరుపును తెచ్చుకుని వాడుకుంటోంది. అయితే సడన్ ఆ పరుపులో నాలుగు అడుగుల పాము కనిపించడంతో రైట్ కు చుక్కలు కనిపించాయి. వెంటనే తేరుకుని పరుపులో దూరిన పామును వీడియో చిత్రీకరించారు. పరుపులోకి పాము ఎలా దూరిందో అర్ధం కావడం లేదని రైట్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సెకండ్ హ్యండ్ పరుపును జాగ్రత్తగా క్లీన్ చేశాం. కుషన్స్ మార్చాం. అయితే అప్పుడు కనిపించని పాము అందులోకి ఎలా దూరిందో అర్ధం కావడం లేదు. పరుపులోని పామును జాగ్రత్తగా బాక్స్ లో బంధించి..పశువుల డాక్టర్ కు అప్పగించాలని అనుకున్నాం. అనుకోకుండా పాము చనిపోయింది అని రైట్ తెలిపింది. -
ఎలుగు దాడి నుంచి ఇద్దరిని కాపాడి.. చనిపోయిన కుక్కపిల్ల
అదో చిన్న కుక్కపిల్ల. డాషండ్ జాతికి చెందినది. బరువు గట్టిగా చూస్తే రెండు కేజీలు కూడా ఉండదు. దాని పేరు బ్రాడ్లీ. విశ్వాసానికి మారుపేరు. అందుకే.. యజమానిని కాపాడేందుకు ఏకంగా 181 కేజీల బరువున్న నల్లటి ఎలుగుబంటితో పోరాడి.. వాళ్లను రక్షించి తాను మాత్రం ప్రాణాలు కోల్పోయింది!! అమెరికాలోని మిషిగన్ రాష్ట్రంలో గల ఓస్కాడా కౌంటీలో ఈ సంఘటన జరిగింది. బ్రాడ్లీ అక్కడుండి ఎలుగుబంటితో పోరాడి ఉండకపోతే మాత్రం అది తప్పకుండా తమవాళ్లను చంపేసి ఉండేదని బ్రాడ్లీ యజమాని జాన్ ఫోర్స్ చెప్పారు. జాన్ ఫోర్స్ ఇంటికి గత వారం ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వాళ్లు అక్కడకు సమీపంలో ఉన్న అడవిలోకి వెళ్లారు. తమతో పాటు బ్రాడ్లీని కూడా తీసుకెళ్లారు. తీరా అక్కడ ఉన్నట్టుండి ఓ పెద్ద నల్లటి ఎలుగుబంటి వాళ్ల ముందుకు వచ్చింది. దాంతో ఇక తమపని అయిపోయిందనే అనుకున్నారు. కానీ కుక్కపిల్ల మాత్రం ఒక్కసారిగా ఎలుగుబంటి మీదకు దూకి.. దాంతో అరివీర భయంకరంగా పోరాడింది. అలా ఓ గంట పోరాడిన తర్వాత అది ప్రాణాలు కోల్పోయింది. కానీ ఎట్టకేలకు ఎలుగుబంటి కూడా వెనుదిరిగింది.