ఓ రెండు నిమిషాలు అతన్ని వదిలేయాల్సింది | Son Jumps A Barrier In The Courtroom And Lunges At The Father | Sakshi
Sakshi News home page

ఓ రెండు నిమిషాలు అతన్ని వదిలేయాల్సింది

Published Thu, Jun 6 2019 4:33 PM | Last Updated on Thu, Jun 6 2019 4:44 PM

Son Jumps A Barrier In The Courtroom And Lunges At The Father - Sakshi

మిచిగాన్‌ : కోర్టులో హత్య కేసు విచారణ జరుగుతోంది. నేరస్తుడు దూరంగా ఓ చోట కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఇంతలో అక్కడికి దగ్గరలో.. జనం మధ్య నిలబడి ఉన్న ఓ యువకుడు ఆవేశంగా బ్యారియర్లను దాటుకుంటూ ఆ నేరస్తుడిపై దాడి చేయటానికి పరుగు తీశాడు. కానీ అతడి ప్రయత్నం విఫలమైంది. పోలీసులు అతడ్ని నిలువరించి అక్కడే బంధించేశారు. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే.. ఆ నేరస్తుడు హత్య చేసింది ఎవరినో కాదు.. కట్టుకున్న భార్యను. అతడిపై దాడి చేయాలనుకున్నది కూడా ఎవరో కాదు కన్నకొడుకే. అసలు కథేంటంటే.. మిచిగాన్‌కు చెందిన వాషన్‌ ఫ్లవర్స్‌ అనే వ్యక్తి తన భార్య జేమీ థామస్‌ ఫ్లవర్‌ను దారుణంగా కాల్చిచంపాడు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు.

కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో వాషన్‌ కుమారుడు లండన్‌ థామస్‌ తండ్రిపై దాడి చేయటానికి ప్రయత్నించాడు. కానీ పోలీసులు అతన్ని అడ్డగించి, అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అయితే దీనిపై స్పందించిన ఓ నెటిజన్‌‘‘  తల్లిని కోల్పోయిన ఆ కుమారుడికి కోర్టు కొద్దిగా న్యాయం చేయాల్సింది. కనీసం  ఓ రెండు నిమిషాలు అతన్ని వదిలేయాల్సింద’ని కామెంట్‌ చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement