![Young Girl Stucked In Chair While Making Tiktok Video - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/14/tiktok.jpg.webp?itok=DaKn_bZq)
వీడియో దృశ్యాలు
వాషింగ్టన్ : టిక్‌టాక్ ఇండియాలో బ్యాన్ అయినా దాని హవా చాలా దేశాల్లో కొనసాగుతూనే ఉంది. తమ ప్రతిభను ప్రదర్శించాలనే తపనతో జనాలు ఇబ్బందుల పాలవుతూనే ఉన్నారు. తాజాగా అమెరికాకు చెందిన ఓ యువతి టిక్‌టాక్ వీడియో చేసే సరదాతో ఇబ్బందుల్లో పడింది. కుర్చీలో ఇరుక్కుపోయి నానా తంటాలు పడింది. వివరాలు.. అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన సిడ్నీ జో అనే యువతి కొద్దిరోజుల క్రితం కుర్చీలోకి దూరి టిక్‌టాక్ వీడియో చేయటం ప్రారంభించింది. వీడియో అయిపోయిన తర్వాత కుర్చీలోంచి బయటకు రావాలని చూసింది.
అయితే కుర్చీ నడుము దగ్గర గట్టిగా అతుక్కుపోయింది. కుర్చీలోంచి బయటకు రావటానికి చాలా ప్రయత్నించింది. అయితే ఆమె వల్ల కాలేదు. దీంతో రెస్క్యూ టీమ్‌కు ఫోన్ చేసింది. రంగంలోకి దిగిన వారు కుర్చీని కట్ చేసి ఆమెను బయటకు లాగారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.
చదవండి : వైరల్: బురదలో ఏనుగు సరదా!
Comments
Please login to add a commentAdd a comment