Viral Video: Pakistan TikTok Star Hareem Shah Stops Midway Of Lip Filler Treatment - Sakshi
Sakshi News home page

TikTok Star: పెదాల సర్జరీకి వెళ్లిన టిక్‌టాక్‌ స్టార్‌, కట్‌ చేస్తే!

Feb 1 2022 1:57 PM | Updated on Feb 1 2022 3:34 PM

Viral Video: Why Pakistan TikTok Star Hareem Shah Stops Midway Of Lip Filler Treatment - Sakshi

యూకేలో డాక్టర్‌ను కలిసిన ఆమె తన పెదవికి ఫిల్లర్‌ ట్రీట్‌మెంట్‌ ప్రారంభించింది. ఇంతలో ఒక ఫోన్‌ కాల్‌ రాగా.. ఈ సర్జరీ ఖరీదైనది కావడంతో దాన్ని మధ్యలోనే వదిలేశానని..

హరీమ్‌ షా.. ఈమె ఒక టిక్‌టాక్‌ స్టార్‌.. తన పెదాల ఆకృతిని మార్చుకోవడానికి లండన్‌ వెళ్లింది. కానీ సర్జరీ సగంలోనే వెనుదిరిగింది. దీంతో ఇప్పుడామె పెదాలు ఉబ్బిపోయి వంకరగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పాకిస్తాన్‌కు చెందిన టిక్‌టాక్‌ స్టార్‌ హరీమ్‌ షా.. లిప్‌ ఫిల్లర్‌ ట్రీట్‌మెంట్‌ చేయించుకోవాలని భావించింది. ఇందుకోసం ఆమె యూకేకు వెళ్లింది. ఈ విషయాన్ని తను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. పెద్ద మొత్తంలో నోట్ల కట్టలను ముందు పెట్టుకుని వీటి సాయంతో సర్జరీ చేయించుకోబోతున్నానని వీడియో షేర్‌ చేసింది.

అన్నట్లుగానే యూకేలో డాక్టర్‌ను కలిసిన ఆమె తన పెదవికి ఫిల్లర్‌ ట్రీట్‌మెంట్‌ ప్రారంభించింది. ఇంతలో ఒక ఫోన్‌ కాల్‌ రాగా, పాకిస్తాన్‌ ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ తన బ్యాంక్‌ ఖాతాలు స్థంభింపజేసిందని సమాచారం అందింది. ఈ సర్జరీ ఖరీదైనది కావడంతో దాన్ని మధ్యలోనే వదిలేసినట్లు ఆమె వెల్లడించింది. కాగా హరీమ్‌ షా పెద్ద మొత్తంలో నగదు తీసుకుని పాకిస్తాన్‌ నుంచి యూకేకు ప్రయాణించినందునే ఆమెపై మనీలాండరింగ్‌ విచారణ జరుపుతున్నట్లు ఎఫ్‌ఐఏ స్పష్టం చేసింది.

పాకిస్తాన్‌ ఫెడరల్‌ బోర్డ్‌ ఆఫ్‌ రెవెన్యూ వెబ్‌సైట్‌ ప్రకారం.. ప్రయాణికులు పాకిస్తాన్‌కు ఏ కరెన్సీ అయినా, ఎంతైనా తీసుకురావచ్చు. అలాగే ఎలాంటి షరతులు లేకుండా పదివేల డాలర్ల వరకు విదేశీ కరెన్సీని సైతం ఇతర దేశాలకు తీసుకెళ్లవచ్చు. కానీ అంతకు మించి భారీ మొత్తాన్ని తీసుకెళ్లాలంటే మాత్రం అనుమతి పొందడం తప్పనిసరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement