FIA
-
ఫార్ములా ఇ రేసింగ్‌పై ఆనంద్ మహీంద్ర ట్వీట్,కేటీఆర్ స్పందన
సాక్షి, హైదరాబాద్: భారతదేశంలోనే తొలిసారిగా ఫార్ములా ఇ-రేస్ హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ఈ రేస్ కోసం టికెట్ల బుకింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. 2023 ఫిబ్రవరి 12, న FIA ఫార్ములా E వరల్డ్ ఛాంపియన్షిప్ ఈవెంట్‌ద ద్వారా హైదరాబాద్ చరిత్ర సృష్టించోబోతోంది. దీనిపై పారిశశ్రామిక వేత్త ఆనంద్‌మహీంద్ర ట్విటర్లో ఒక వీడియోను షేర్ చేశారు. FIA ఫార్ములా E వరల్డ్ ఛాంపియన్షిప్ ఈవెంట్‌ను నిర్వహించే మొదటి భారతీయ నగరంగా హైదరాబాద్ అవతరించిందని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 8 సంవత్సరాల రేసింగ్ తర్వాత, దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో రేసింగ్ జరుగుతున్న ఈ సందర్భంగా తెలంగాణా ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే టైటిల్ స్పాన్సర్ గ్రీన్కో రేసును విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ కూడా ఆనంద్ మహీంద్రకు ధన్య వాదాలు తెలిపారు. మాతృ సంస్థలో మహీంద్రా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ వాహన విభాగమైన మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ తమలో విలీనమైందని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. ఈ మేరకు ఎన్సీఎల్టీ నుంచి ఆమోదం లభించిందని వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి, తయారీ, విక్రయ కార్యకలాపాలను ఏకీకృతం చేయడానికి విలీనం చేసినట్టు మహీంద్రా స్పష్టం చేసింది. Welcome to Hyderabad Anand Ji 🏎️ https://t.co/b2IFjMpmBg — KTR (@KTRBRS) February 3, 2023 -
HYD: ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్..
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి ఇంటర్నేషనల్ కార్ రేసింగ్ జరుగనుంది. 227 కిలోమీటర్ల రేసింగ్ ట్రాక్‌కి FIA లైన్ క్లియర్ చేసింది. దీంతో, ఫిబ్రవరి 11వ తేదీన ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ బుధవారం ఈవెంట్స్ టికెట్స్‌ను లాంచ్ చేశారు. కాగా, ఈ రేసింగ్ కోసం నేటి నుంచి బుక్‌మై షోలో టికెట్స్‌ను కొనుగోలు చేసుకోవాలని సూచించారు. 2023 హైదరాబాద్ E-prix పేరుతో ఈవెంట్ జరుపనున్నట్టు స్పష్టం చేశారు. ఇక, అందుబాటులో 22,500 టికెట్స్ ఉన్నట్టు పేర్కొన్నారు. కేటగిరిలా వారీగా ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్ రేసింగ్ టికెట్ల ధరలు ఉంటాయని తెలిపారు. రేసింగ్ టికెట్ల ధరలు.. రూ. 1000, రూ. 3,500, రూ. 6వేలు, రూ.10వేలుగా నిర్ణయించారు. -
పాపం టిక్‌టాక్ స్టార్.. పెదాల సర్జరీకని వెళ్తే కథ అడ్డం తిరిగింది!
హరీమ్ షా.. ఈమె ఒక టిక్‌టాక్ స్టార్.. తన పెదాల ఆకృతిని మార్చుకోవడానికి లండన్ వెళ్లింది. కానీ సర్జరీ సగంలోనే వెనుదిరిగింది. దీంతో ఇప్పుడామె పెదాలు ఉబ్బిపోయి వంకరగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పాకిస్తాన్‌కు చెందిన టిక్‌టాక్ స్టార్ హరీమ్ షా.. లిప్ ఫిల్లర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలని భావించింది. ఇందుకోసం ఆమె యూకేకు వెళ్లింది. ఈ విషయాన్ని తను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. పెద్ద మొత్తంలో నోట్ల కట్టలను ముందు పెట్టుకుని వీటి సాయంతో సర్జరీ చేయించుకోబోతున్నానని వీడియో షేర్ చేసింది. అన్నట్లుగానే యూకేలో డాక్టర్‌ను కలిసిన ఆమె తన పెదవికి ఫిల్లర్ ట్రీట్మెంట్ ప్రారంభించింది. ఇంతలో ఒక ఫోన్ కాల్ రాగా, పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తన బ్యాంక్ ఖాతాలు స్థంభింపజేసిందని సమాచారం అందింది. ఈ సర్జరీ ఖరీదైనది కావడంతో దాన్ని మధ్యలోనే వదిలేసినట్లు ఆమె వెల్లడించింది. కాగా హరీమ్ షా పెద్ద మొత్తంలో నగదు తీసుకుని పాకిస్తాన్ నుంచి యూకేకు ప్రయాణించినందునే ఆమెపై మనీలాండరింగ్ విచారణ జరుపుతున్నట్లు ఎఫ్ఐఏ స్పష్టం చేసింది. పాకిస్తాన్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ వెబ్సైట్ ప్రకారం.. ప్రయాణికులు పాకిస్తాన్‌కు ఏ కరెన్సీ అయినా, ఎంతైనా తీసుకురావచ్చు. అలాగే ఎలాంటి షరతులు లేకుండా పదివేల డాలర్ల వరకు విదేశీ కరెన్సీని సైతం ఇతర దేశాలకు తీసుకెళ్లవచ్చు. కానీ అంతకు మించి భారీ మొత్తాన్ని తీసుకెళ్లాలంటే మాత్రం అనుమతి పొందడం తప్పనిసరి. View this post on Instagram A post shared by Hareem Bilal shah (@hareem.shah_official_account) -
మరోసారి చిక్కుల్లో పాక్ కెప్టెన్ బాబర్ అజమ్
కరాచీ: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. అతడు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని గతంలో హమీజా ముఖ్తార్ అనే మహిళ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆజంతో పాటు పలువురు వ్యక్తులు తనకు వాట్సాప్‌లో బెదిరింపు సందేశాలు పంపిస్తున్నట్లు ఆ మహిళ మరో కేసు పెట్టింది. దీనిపై విచారణ జరిపిన లాహోర్‌లోని సెషన్స్ కోర్టు.. బాబర్ అజమ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ)కి చెందిన సైబర్ క్రైమ్ సర్కిల్‌ను ఆదేశించింది. తనకు బెదిరింపులు వస్తున్నట్లు హమ్జా ఫిర్యాదు చేసిన తర్వాత తాము ఫిర్యాదు చేశామని, ఆ ఫోన్ నంబర్లలో ఒకటి బాబర్ ఆజంపై పేరుపై ఉన్నదని ఎఫ్ఐఏ కోర్టుకు తెలిపింది. మరో రెండు నంబర్లు ఇద్దరు మహిళలకు చెందినవిగా గుర్తించారు. దీనిపై బాబర్ స్టేట్మెంట్ రికార్డు చేయడానికి ఎఫ్ఐఏ కొంతకాలం ఆగాలని అతని తరఫున హాజరైన సోదరుడు ఫైజల్ ఆజం కోరాడని, అయితే ఇప్పటి వరకూ బాబర్ మాత్రం రాలేని తన రిపోర్ట్‌లో ఎఫ్ఐఏ వెల్లడించింది. దీంతో బాబర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. గతంలో హమీజా ముఖ్తార్ ఫిర్యాదుపై బాబర్‌పై కేసు నమోదు చేయాలన్న సెషన్స్ కోర్టు ఆదేశాలను లాహోర్ హైకోర్టు కొట్టేసింది. అయితే తాజాగా బెదిరింపుల అంశంలో మరోసారి బాబర్‌పై కేసు నమోదు చేయాలని సెషన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా బాబర్ అజమ్ పాక్ తరపున 31 టెస్టుల్లో 2167 పరుగులు, 77 వన్డేల్లో 3580 పరుగులు, 47 టీ20ల్లో 1730 పరుగులు సాధించాడు. ప్రస్తుతం బాబర్ అజమ్ అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. చదవండి: 'పాక్ కెప్టెన్ నన్ను నమ్మించి మోసం చేశాడు' 'రూ. 45 లక్షలిస్తే కేసు ఉపసంహరించుకుంటా' -
భారత సాక్షుల్ని రప్పించండి
లాహోర్: 2008 ముంబై ఉగ్రదాడులకు సంబంధించి 24 మంది భారతీయ సాక్షుల వాంగ్మూలాలను స్వీకరించేందుకు పాక్‌కు తీసుకురావాలని ఇక్కడి ఉగ్రవాద నిరోధక కోర్టు పాక్ ఫెడరల్ దర్యాప్తు సంస్థ (ఎఫ్ఐఏ)ను ఆదేశించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రతినిధిని నియమించాలని ఎఫ్ఐఏ డైరెక్టర్ జనరల్(డీజీ)కు సూచించింది. విచారణను ముగించడానికి భారత సాక్షుల వాంగ్మూలం అవసరమని ప్రాసిక్యూషన్ వాదించడంతో ఉగ్రవాద నిరోధక కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై కోర్టుకు చెందిన అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ఒకవేళ భారత సాక్షులు కోర్టుకు రాకుంటే వారి వాంగ్మూలం లేకుండానే తీర్పు ఇవ్వాలని ప్రాసిక్యూషన్ కోర్టును కోరుతుంది’ అని తెలిపారు. -
హెల్త్ హబ్‌గా హైదరాబాద్
‘డబ్ల్యూసీవో–2017’లో మంత్రి లక్ష్మారెడ్డి హైదరాబాద్: వైద్య, ఆరోగ్య రంగానికి ప్రత్యేక బడ్జెట్, అధిక నిధులు కేటాయించడంతో హైదరాబాద్ హెల్త్ హబ్‌గా మారిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ మాదాపూర్ హెచ్ఐసీసీలో ‘వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ఆప్తోమెట్రీ(డబ్ల్యూసీవో)–2017’అంతర్జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. కంటి ఆరోగ్యం, నాణ్యమైన చూపు అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఐఎంఆర్, ఎంఎంఆర్, వ్యాక్సినేషన్ వంటి హెల్త్ ఇండికేటర్స్‌లో ఎంతో ప్రగతి సాధించామన్నారు. 3 రోజుల పాటు జరిగే సదస్సుకు 48 దేశాల నుంచి 1,500 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ జి.ఎన్. రావు, ప్రొఫెసర్ కోవిన్నాయుడు, డబ్ల్యూసీవో ప్రెసిడెంట్ డాక్టర్ ఉదక్ ఉడోమ్, ఇండియా విజన్ సీఈవో వినోద్ డానియేల్, ఆప్తోమెట్రీ వరల్డ్ కౌన్సిల్ ఎండీ స్యూచైలిస్ తదితరులు పాల్గొన్నారు. ఎసిలార్, ఎఫ్ఐఏ ఒప్పందం నానాటికీ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అంతర్జాతీయ సంస్థ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ అటోమొబైల్ (ఎఫ్ఐఏ), కంటి అద్దాల తయారీ సంస్థ ఎసిలార్లు చేతులు కలిపాయి. ఈ సందర్భంగా సదస్సులో ఇరు సంస్థల ప్రతినిధులు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. -
టాప్ పదవి నుంచి మాల్యా ఔట్
న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక మోటార్ బాడీ ఎఫ్ఐఏలో దేశీయ మోటార్‌స్పోర్ట్ బాడీకి టాప్ ప్రతినిధిగా ఉన్న విజయ్ మాల్యా ఆ పదవి నుంచి తప్పుకున్నారు. క్రీడా మంత్రిత్వశాఖ జోక్యంతో ఆయన ఈ పదవి నుంచి తప్పుకున్నట్టు తెలిసింది. బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగొట్టిన విజయ్ మాల్యా, యూకేలో దర్జాగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఆయన్ను భారత్‌కు రప్పించడానికి అధికారులు, ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం లండన్‌లో ఆయన్ను భారత్‌కు అప్పగించే ప్రక్రియపై విచారణ కూడా జరుగుతోంది. గత కొన్నిరోజులుగా మాల్యా స్థానంలో డిఫ్యూటీ విక్కీ చందోక్ భారత్ తరఫున అంతర్జాతీయ సంస్థ ఎఫ్ఐఏ సమావేశాలకు హాజరవుతున్నారు. జూన్‌లో ఎఫ్ఐఏ వరల్డ్ మోటార్ స్పోర్ట్ కౌన్సిల్ చివరి సమావేశం జరుగనున్న నేపథ్యంలో మాల్యా రాజీనామా చేసినట్టు తెలిసింది. ఈ విషయంపై మంత్రిత్వశాఖ ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎంఎస్సీఐ)కు ఆదేశాలు జారీచేసినట్టు వెల్లడైంది. అయితే దీనిపై స్పందించడానికి ఎఫ్ఎంఎస్సీఐ బాస్ అక్బార్ ఇబ్రహిం నిరాకరించారు. అధికారిక ఎఫ్ఎంఎస్సీఐ వెబ్సైట్లో మాత్రం ఎఫ్ఐఏ ప్రతినిధుల జాబితా నుంచి విజయ్ మాల్యా, మాజీ ఎఫ్ఎంఎస్సీఐ విక్కీ చందోక్ పేర్లను తొలిగించారు. మూడేళ్ల కాలానికిగాను ఎఫ్ఐఏలో భారత ప్రతినిధిగా మాల్యాను నామినేట్ చేశారు. ఆయన పదవీకాలం 2018తో ముగుస్తోంది. ఒకవేళ మాల్యాను అర్ధంతరంగా తప్పిస్తే, నిబంధనల ప్రకారం ఎఫ్ఐఏలో భారత్ నుంచి కొత్త ప్రతినిధిని నామినేట్ చేసేందుకు అవకాశముండదని అంతకముందు అక్బర్ ఇబ్రహీం చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో మాల్యా పదవీకాలం ముగిసేదాకా వేచిచూడడం తప్ప ఏమీ చేయలేం అని అక్బర్ అన్నారు. కానీ తాజాగా క్రీడా మంత్రిత్వశాఖ జోక్యంతో ఆయన తప్పుకున్నట్టు తెలిసింది.