Formula E World Championship On February 11 In Hyderabad - Sakshi
Sakshi News home page

HYD: ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌.. టికెట్స్‌ వివరాలు ఇవే..

Published Wed, Jan 4 2023 1:36 PM | Last Updated on Wed, Jan 4 2023 2:41 PM

Formula E World Championship On February 11 In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో మరోసారి ఇంటర్నేషనల్‌ కార్‌ రేసింగ్‌ జరుగనుంది. 227 కిలోమీటర్ల రేసింగ్‌ ట్రాక్‌కి FIA లైన్‌ క్లియర్‌ చేసింది. దీంతో,  ఫిబ్రవరి 11వ తేదీన ఫార్ములా ఈ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ జరుగుతుంది. ఈ నేపథ్యంలో స్పెషల్‌ సీఎస్‌ అరవింద్‌ కుమార్‌ బుధవారం ఈవెంట్స్‌ టికెట్స్‌ను లాంచ్‌ చేశారు. 

కాగా, ఈ రేసింగ్‌ కోసం నేటి నుంచి బుక్‌మై షోలో  టికెట్స్‌ను కొనుగోలు చేసుకోవాలని సూచించారు. 2023 హైదరాబాద్‌ E-prix పేరుతో ఈవెంట్‌ జరుపనున్నట్టు స్పష్టం చేశారు. ఇక, అందుబాటులో 22,500 టికెట్స్‌ ఉన్నట్టు పేర్కొన్నారు. కేటగిరిలా వారీగా ఫార్ములా ఈ వరల్డ్‌ ఛాంపియన్‌ రేసింగ్‌ టికెట్ల ధరలు ఉంటాయని తెలిపారు. రేసింగ్‌ టికెట్ల ధరలు.. రూ. 1000, రూ. 3,500, రూ. 6వేలు, రూ.10వేలుగా నిర్ణయించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement