![Bhagyanagar Ganesh Utsav Committee Removed Flexi Set Up By Police On Tank Bund](/styles/webp/s3/article_images/2024/09/15/Bhagyanagar-Ganesh.jpg.webp?itok=LtrX1Y7H)
సాక్షి, హైదరాబాద్: ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్యాంక్‌బండ్ పై వినాయక నిమజ్జనం లేదంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, భారీ కేడ్లను భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నేతలు తొలగించారు. ట్యాంక్ బండ్ ఏర్పాటుచేసిన జాలీలను తొలగించిన సమితి నేతలు.. వినాయకుని నిమజ్జనం చేశారు.
ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జనం అనేక సంవత్సరాలుగా జరుగుతుందని.. కొత్త రూల్స్ తీసుకువచ్చి భక్తుల మనోభావాలను ప్రభుత్వం, పోలీసులు దెబ్బతీస్తున్నారని ఉత్సవ సమితి నేతలు మండిపడుతున్నారు. 2022, 23లో కూడా ఇదే విధంగా చెప్పారు. కానీ చివరకు ట్యాంక్ బండ్‌లో గణేష్ నిమజ్జనాలు జరిగాయన్నారు.
‘‘ప్రభుత్వం వెంటనే ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జన ఏర్పాట్లు ఈ రోజు మధ్యాహ్నం వరకు చేయాలి.. లేని పక్షంలో ఈ రోజు అన్ని వినాయక మండపాల నిర్వాహకులకు సమాచారం తెలియజేసి రేపు నగరా వ్యాప్తంగా ఆందోళన చేసి నగరాన్ని స్తంభింప చేస్తాం. ఎక్కడికక్కడ మండపాల్లో వినాయకులను అదే విధంగా ఉంచుతాం’’ అంటూ భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రాజావర్ధన్ రెడ్డి హెచ్చరించారు.
ఇదీ చదవండి: గణేశ్ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment