removed
-
Pune Porsche car crash: మైనర్ నిందితునికి బెయిలు.. జడ్జిల తొలగింపు
పుణే: పోర్షే కారు దుర్ఘటనలో మైనర్ నిందితుడికి బెయిల్ మంజూరు చేసిన కేసులో జువెనైల్ జస్టిస్ బోర్డు (జేజేబీ)కి చెందిన ఇద్దరు జడ్జిలను మహారాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. విధానపరమైన లోపాలు, దుష్ప్రవర్తన, నిబంధనలు పాటించకపోవ డంవంటి ఆరోపణలపై ఎల్.ఎన్.దన్వాడే, కవితా థోరట్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ (డబ్ల్యూసీ డీ) దర్యాప్తు కమిటీ సిఫారసు చేసింది. ఈ మేరకు జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కల్పించిన అధికారాలను దుర్వినియోగం చేసిన ట్లు తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరి ని యామకాన్ని రద్దు చేసింది. పుణేలోని కళ్యా ణి నగర్ ప్రాంతంలో ఓ బిల్డర్ కుమారుడైన 17 ఏళ్ల బాలుడు మద్యం మత్తులో పోర్షే కారు నడిపి మోటార్ సైకిల్‌ను ఢీకొట్టాడు. ఈ దుర్ఘటనలో ఇద్దరు ఐటీ నిపుణులు మృతి చెందారు. అప్పటి జేజేబీ జడ్జిలు నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఆ షరతులలో రోడ్డు భద్రతపై 300 పదాల వ్యాసం రాయాలని ఉంది. ఇది జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. -
ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్తత.. గణేశ్ ఉత్సవ సమితి Vs పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్యాంక్‌బండ్ పై వినాయక నిమజ్జనం లేదంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, భారీ కేడ్లను భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నేతలు తొలగించారు. ట్యాంక్ బండ్ ఏర్పాటుచేసిన జాలీలను తొలగించిన సమితి నేతలు.. వినాయకుని నిమజ్జనం చేశారు.ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జనం అనేక సంవత్సరాలుగా జరుగుతుందని.. కొత్త రూల్స్ తీసుకువచ్చి భక్తుల మనోభావాలను ప్రభుత్వం, పోలీసులు దెబ్బతీస్తున్నారని ఉత్సవ సమితి నేతలు మండిపడుతున్నారు. 2022, 23లో కూడా ఇదే విధంగా చెప్పారు. కానీ చివరకు ట్యాంక్ బండ్లో గణేష్ నిమజ్జనాలు జరిగాయన్నారు.‘‘ప్రభుత్వం వెంటనే ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జన ఏర్పాట్లు ఈ రోజు మధ్యాహ్నం వరకు చేయాలి.. లేని పక్షంలో ఈ రోజు అన్ని వినాయక మండపాల నిర్వాహకులకు సమాచారం తెలియజేసి రేపు నగరా వ్యాప్తంగా ఆందోళన చేసి నగరాన్ని స్తంభింప చేస్తాం. ఎక్కడికక్కడ మండపాల్లో వినాయకులను అదే విధంగా ఉంచుతాం’’ అంటూ భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రాజావర్ధన్ రెడ్డి హెచ్చరించారు.ఇదీ చదవండి: గణేశ్ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు -
నైతిక ఉల్లంఘన: థాయ్‌లాండ్ ప్రధాని తొలగింపు
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ ప్రధాన మంత్రిపై వేటు వేస్తూ.. రాజ్యాంగ న్యాయ స్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. నైతిక ఉల్లంఘన కేసులో స్రెత్తా తవిసిన్‌ను ప్రధాన మంత్రి పదవి నుంచి తొలిగించినట్లు వెల్లడించింది. గతంలో జైలు శిక్ష అనుభవించిన న్యాయవాదిని మంత్రివర్గంలో నియమించటంతో థావిసిన్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని కోర్టు న్యాయమూర్తి పుణ్య ఉద్చాచోన్ అన్నారు. విచారణ సందర్భంగా ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో నలుగురు న్యాయమూర్తులు తవిసిన్‌ను ప్రధాని పదవి నుంచి తొలగించాలని నిర్ణయించారు. మరోవైపు.. తక్షణమే తమ ఆదేశాలను అమలు చేయాలని కోర్టు ఆదేశించింది.ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన దేశ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో పిచిత్ చుయెన్‌బాన్‌ను ప్రధాని కార్యాలయ మంత్రిగా తవిసిన్ నియమించారు. అయితే ఆయన 2008లో మాజీ ప్రధాని తక్సిన్ షినవత్రాకు సంబంధించిన న్యాయమూర్తికి లంచం ఇచ్చిన కేసులో కోర్టు ధిక్కార ఆరోపణలు ఎదుర్కొని ఆరు నెలల జైలు శిక్ష అనుభవించారు. ఏప్రిల్‌లో పిచిత్ మంత్రిగా నియామకం జరిగిన నెల రోజుల తర్వాత దేశ మిలిటరీ నియమించి 40 మంది మాజీ సెనేటర్ల బృందం నైతిక ఉల్లంఘిన కింద కేసు నమోదు చేశారు. ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రధాని తొలిగించిన అనంతరం కేబినెట్ తక్షణమే రద్దు చేయబడదని, థాయ్‌లాండ్ కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు కేర్ టేకర్ ప్రధాని ఉంటారని అధికారులు పేర్కొన్నారు. -
బ్యాటరీ మింగేసిన చిన్నారి
పశ్చిమగోదావరి: ఆడుకునే బొమ్మలో ఉండే చిన్న బ్యాటరీని పొరపాటున 11 నెలల పాప మింగేసింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగింది. ఈ విషయాన్ని గుర్తించిన చిన్నారి తల్లి.. వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు చిన్నారిని పరీక్షించి విజయవాడకు తీసుకెళ్లాలని రిఫర్ చేశారు. దీంతో హుటాహుటిన అంబులెన్స్‌లో విజయవాడలోని ఆయుష్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు.డాక్టర్లు చిన్నారి పొట్టను ఎక్స్‌రే తీసి పరిశీలించారు. కడుపు, ఛాతి మధ్య భాగంలో బ్యాటరీ ఇరుక్కున్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఆపరేషన్ అవసరం లేకుండానే వైద్యులు ఎండోస్కోపీ ద్వారా చిన్నారి పొట్టలోని బ్యాటరీని బయటకు తీశారు. ఘటన జరిగిన వెంటనే తల్లిదండ్రులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తీసుకురావడంతో ప్రమాదం తప్పిందని వైద్యులు వెల్లడించారు. -
10 యాప్ సంస్థలపై గూగుల్ చర్యలు
న్యూఢిల్లీ: సర్వీస్ ఫీజు చెల్లింపుల వివా దం కారణంగా టెక్ దిగ్గజం గూగుల్ పలు యాప్ సంస్థలపై చర్యలకు ఉపక్రమించింది. వాటిని తమ ప్లేస్టోర్ నుంచి తొలగించే ప్రక్రియ ప్రారంభించింది. అనేక అవకాశాలు ఇచి్చనప్పటికీ, తమ ప్లాట్‌ఫామ్‌తో ప్రయోజనం పొందుతున్న ‘పేరొందిన’ పది సంస్థలు ఫీజులు చెల్లించడం లేదని సంస్థ పేర్కొంది. అయితే, గూగుల్ సదరు సంస్థల పేర్లను నిర్దిష్టంగా వెల్లడించలేదు. కానీ, షాదీ, మ్యాట్రిమోనీడాట్కా మ్, భారత్ మ్యాట్రిమోనీ వంటి యాప్స్ కోసం ఆండ్రాయిడ్ ఫోన్లపై సెర్చి చేస్తే వాటి పేర్లు కనిపించకపోవడంతో జాబితాలో అవి ఉన్నట్లుగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే బాలాజీ టెలీఫిలిమ్స్కి చెందిన ఆల్ట్ (గతంలో ఆల్ట్‌బాలాజీ), ఆడియో ప్లాట్‌ఫాం కుకు ఎఫ్ఎం, డేటింగ్ సర్వీస్ యాప్ క్వాక్‌క్వాక్, ట్రూలీ మ్యాడ్లీ కూడా ప్లేస్టోర్ నుంచి మాయమయ్యాయి. ఇన్–యాప్ పేమెంట్స్‌పై గూగుల్ 11 నుంచి 26 శాతం ఫీజులను విధిస్తుండటంపై నెలకొన్న వివాదం ఈ పరిణామానికి దారి తీసింది. ప్లాట్‌ఫాం ఫీజుపై పోరాడుతున్న కంపెనీలకు అనుకూలంగా సుప్రీం కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో నిబంధనలను పాటించని యాప్‌లను గూగుల్ తొలగించడం ప్రారంభించింది. ఉచిత డిజిటల్ మార్కెట్‌ప్లేస్‌ను ఆఫర్ చేస్తూ ఇండస్ యాప్ స్టోర్‌ను ఫోన్‌పే ప్రవేశపెట్టిన తరుణంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది గుత్తాధిపత్య ధోరణి..: కుకు ఎఫ్ఎం కాగా, గూగుల్ గుత్తాధిపత్య ధోరణితో వ్యవహరిస్తోందని కుకు ఎఫ్ఎం సహ–వ్యవస్థాపకుడు వినోద్ కుమార్ వ్యాఖ్యానించగా, ఇది భారత్‌లో ఇంటర్నెట్కు దుర్దినంగా భారత్ మ్యాట్రిమోనీ వ్యవస్థాపకుడు మురుగవేల్ జానకిరామన్ అభివరి్ణంచారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ పెండింగ్‌లో ఉన్నందున ఎటువంటి చర్యలు తీసుకోవద్దని, ఏ యాప్‌ను డీలిస్ట్ చేయొద్దని గూగుల్‌కి ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ (ఏఐఎంఏఐ) సూచించింది. -
జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయండి
ఖైరతాబాద్ (హైదరాబాద్): ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని ఆయన ఘాట్ వద్ద నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫొటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలంటూ బాలకృష్ణ ఆదేశించడం వివాదానికి దారితీసింది. బాలకృష్ణ ఆదేశాలతో ఆయన అనుచరులు ఫ్లెక్సీలు తొలగించడం, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వాటిని తిరిగి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడం, పోలీసులు అడ్డుకోవడంతో ఘాట్ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్టీఆర్‌కు కుటుంబసభ్యుల నివాళి గురువారం ఎన్టీఆర్ వర్ధంతి పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్‌లోని ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. తెల్లవారు జామున జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు.. ఎన్టీఆర్ ఘాట్‌కు విచ్చేసి తాతకు నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ కుమారు డు, సీనియర్ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, నంద మూరి రామకృష్ణ, సుహాసినితో పాటు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నివాళులర్పించారు. అయితే ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లోపల, ప్రవేశ ద్వా రం రెండువైపులా జూనియర్ ఎన్టీఆర్ అభిమాను లు.. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్‌లతో కూడిన భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తండ్రికి నివాళులర్పించి బయటకు వచ్చే క్రమంలో ఈ ఫ్లెక్సీలను చూసిన బాలకృష్ణ.. వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించడంతో, ఆయన అనుచరులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించి కొన్నింటిని రోడ్డు ఫుట్‌పాత్‌పై, మరికొన్ని ఘాట్ పార్కింగ్ ప్రాంతంలో కనిపించకుండా పెట్టారు. జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం తమ హీరో ఫ్లెక్సీలు తొలగించారన్న విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. బయట ఉంచిన ఫ్లెక్సీలను తిరిగి లోపల పెట్టేందుకు అనుమతించాలని పోలీసులను కోరారు. వారు అందుకు అనుమతించకపోవడంతో అభిమానులు ఘాట్ లోపల తొలగించకుండా వదిలేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలకు పూలమాల వేసి పాలాభిషే కం చేశారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన జూని యర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం అధ్యక్షుడు ఫుట్‌పాత్‌పై ఉంచిన రెండు ఫ్లెక్సీలను ఘాట్ లోపలికి తీసుకువచ్చారు. ఇది గమనించిన పోలీ సులు.. బయట ఉన్న ఫ్లెక్సీలు లోపలికి ఎందుకు తీసుకువచ్చారంటూ.. వెంటనే వాటిని యథా స్థానంలో పెట్టాలని ఆదేశించారు. వారు విన్పించుకోక పోవడంతో అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రి క్తత నెలకొంది. చివరకు పోలీసులు లోపలికి తీసుకువచ్చిన ఫ్లెక్సీలను తిరిగి బయట పెట్టించి వారిని అక్కడినుంచి పంపించి వేయడంతో ఉద్రి క్తత చల్లారింది. కాగా నివాళులర్పించిన అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ..తెలుగు బిడ్డ బొడ్డు కోయకముందే రాజకీయాలంటే ఏంటో తెలిపిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. సాహసోపేత పథకాల అమలుతో పేదవాడి ఆక లి తీర్చి, విప్లవాత్మక, సామాజిక మార్పులు తీసుకువచ్చిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. అందుకే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారని చెప్పారు. -
అన్నపూరణి ఆగింది
బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అన్నపూరణికి దేశంలోనే నంబర్ వన్ చెఫ్ కావాలన్నది ఆశయం. తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి మాంసాహార వంటలు చేసేందుకు సిద్ధం అవుతుంది. అది మాత్రమే కాదు.. ముస్లిమ్ యువకుడితో ప్రేమలో పడుతుంది. నయనతార టైటిల్ రోల్లో నటించిన ‘అన్నపూరణి’ చిత్రం ప్రధానాంశం ఇది. ‘ది గాడెస్ ఆఫ్ ఫుడ్’ అనేది ఉపశీర్షిక. నీలేష్ కృష్ణ దర్శకత్వంలో జతిన్ సేథీ, ఆర్. రవీంద్రన్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలై, అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఓటీటీ ప్రేక్షకులను కొంత ఆకట్టుకోగలిగింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ఓ బ్రాహ్మణ యువతి మాంసాహారం వండటం, ముస్లిమ్ యువకుడితో ప్రేమలో పడటం అనే కథాంశం వివాదమైంది. పైగా రాముడు కూడా మాంసాహారం తిన్నాడన్నట్లు, వాల్మీకి అయోధ్య కాండలో ఉందన్నట్లు ఓ డైలాగ్ కూడా ఉంది. ఓ దేవత (అన్నపూర్ణ) మీద టైటిల్ పెట్టి ఇలాంటి సినిమా తీయడం తగదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దాంతో ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని కొందరు బ్రాహ్మణ సంఘం నాయకులు డిమాండ్ మొదలుపెట్టారు. అలాగే మహారాష్ట్రకు చెందిన శివసేన మాజీ నేత రమేశ్ సోలంకి ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ పై తగిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నయనతారపై కూడా కేసు నమోదైంది. వివాదం పెద్దదవుతుండటంతో ఈ సినిమా స్ట్రీమింగ్‌ను నిలిపివేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఆ విధంగా ఓటీటీలో ‘అన్నపూరణి’ ఆట ఆగింది. -
2500 యాప్స్ తొలగించిన గూగుల్ - నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
చాలీ చాలని జీతాలతో పనిచేసే చాలామంది ఉద్యోగులు అత్యవసర సమయంలో బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకోవడం.. లేకుంటే కొన్ని యాప్స్ నుంచి ఇన్స్టంట్ లోన్స్ తీసుకోవడం ఎక్కువైపోతోంది. బ్యాంకుల్లో లోన్ తీసుకునే వారి విషయం పక్కన పెడితే.. యాప్స్ ద్వారా లోన్స్ తీసుకున్న వారు ఏకంగా ప్రాణాలే తీసుకున్న సందర్భాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి వాటిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది, తాజాగా దీని గురించి కేంద్ర ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' లోక్‌సభలో మాట్లాడారు. 2021 ఏప్రిల్ నుంచి 2022 జూలై మధ్య కాలంలో గూగుల్ సంస్థ తన ప్లే స్టోర్ నుంచి ఏకంగా 2500 మోసపూరిత లోన్ యాప్‌లను తొలగించినట్లు డిసెంబర్ 18న లోక్‌సభలో వెల్లడైన ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ప్రజలను మోసం చేస్తున్న యాప్‌ల మీద కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో వర్షానికి మొలిచిన పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఫ్రాడ్ లోన్ యాప్‌ల మీద కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిసి పనిచేస్తున్నట్లు కూడా కేంద్రమంత్రి వెల్లడించారు. ఫేక్ లోన్ యాప్స్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇలాంటి వాటిని నివారించడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే సరిపోతుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. జనం కూడా ఫ్రాడ్ లోన్ యాప్‌ల గురించి అవగాహన పెంచుకోవాలని, అలాంటప్పుడే మోసాల నుంచి బయటపడే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: 2024లో బంగారం డిమాండ్ మరింత పైపైకి - కారణం ఇదే అంటున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ మోసపూరిత రుణ యాప్‌లను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలలో భాగంగా, భారత ప్రభుత్వ చట్టపరమైన నియమాలను పాటిస్తున్న యాప్‌ల జాబితాను ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (Meity) గూగుల్‌తో భాగస్వామ్యం చేసింది. ఈ యాప్‌లన్నీ కూడా తప్పకుండా ప్రభుత్వ నియమాలను లోబడి పనిచేయాల్సి ఉంటుంది. -
డేంజర్ యాప్స్.. మీ ఫోన్లో ఇప్పుడే తొలగించండి..
వినియోగదారుల సమాచార భద్రతకు ముప్పుగా పరిణమించిన పలు మొబైల్ యాప్‌లను గూగుల్ ఇటీవల తన ప్లేస్టోర్ నుంచి తొలగించింది. సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈసెట్(ESET) ఈ ఏడాది గూగుల్ ప్లేస్టోర్‌లో 18 లోన్ యాప్‌లను స్పైలోన్ యాప్‌లుగా గుర్తించింది. కోట్లాది డౌన్లోడ్స్ ఉన్న ఈ లోన్‌యాప్‌లు వినియోగదారుల ఫోన్ల నుంచి వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఈ సమాచారాన్ని రుణగ్రహీతలను బ్లాక్మెయిల్ చేసి అధిక వడ్డీ రాబట్టడానికి దుర్వినియోగం చేస్తున్నాయి. ఇటువంటి యాప్‌లకు సంబంధించిన వివరాలను ఈసెట్ పరిశోధకులు తెలియజేశారు. ఈ యాప్‌లు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియాలోని వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈసెట్ గుర్తించిన 18 డేంజర్ యాప్‌లలో 17 యాప్‌లను గూగుల్ ఇప్పటికే తొలగించింది. ఒకటి మాత్రం ఇప్పటికీ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. అయితే ఇది యాక్టివ్ స్థితిలో లేదు. గూగుల్ ప్లేస్టోర్‌లో తొలగించిన ఈ యాప్‌ను ఇక్కడ ఇస్తున్నాం.. ఇవి మీ మొబైల్ ఫోన్లో ఉంటే ఇప్పుడే తొలగించండి.. డేంజర్ యాప్స్ ఇవే.. ఏఏ క్రెడిట్ (AA Kredit) అమోర్ క్యాష్ (Amor Cash) గేయబాక్యాష్ (GuayabaCash) ఈజీ క్రెడిట్ (EasyCredit) క్యాష్‌వావ్ (Cashwow) క్రెడిబస్ (CrediBus) ఫ్లాష్‌లోన్ (FlashLoan) ప్రెస్టమోస్క్రెడిటో (PréstamosCrédito) ప్రెస్టమోస్ డి క్రెడిట్-యుమికాష్ (Préstamos De Crédito-YumiCash) గో క్రెడిటో (Go Crédito) ఇన్స్టంటానియో ప్రెస్టమో (Instantáneo Préstamo) కార్టెరా గ్రాండే (Cartera grande) రాపిడో క్రెడిటో (Rápido Crédito) ఫైనప్ లెండింగ్ (Finupp Lending) ఫోర్‌ఎస్ క్యాష్ (4S Cash) ట్రూనైరా (TrueNaira) ఈజీ క్యాష్ (EasyCash) ఇది కూడా చదవండి: టెక్ ప్రపంచంలో సంచలనం.. ఈ యేటి మేటి సీఈవో ఈయనే.. -
ఇనుప కంచె తొలగింది
సాక్షి, హైదరాబాద్: ప్రజాభవన్‌గా మారిన ప్రగతి భవన్ ఎదుట సుదీర్ఘకాలంగా ఉన్న ఇనుప కంచెను జీహెచ్ఎంసీ అధికారులు గురువారం తొలగించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో ఈ చర్యలు తీసుకున్నారు. సిటీ ట్రాఫిక్ చీఫ్ జి.సుదీర్‌బాబు సైతం ఆ ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఒకట్రెండు రోజుల్లో ఆ రోడ్డును పూర్తిస్థాయిలో వాహన చోదకుల కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో మొదలు.. బేగంపేటలోని గ్రీన్లాండ్స్ చౌరస్తా సమీపంలో చాలా ఏళ్లుగా ముఖ్యమంత్రి నివాసం, క్యాంప్ ఆఫీస్ కొనసాగుతున్నాయి. వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో అక్కడ ముఖ్యమంత్రి నివాసం నిర్మితమైంది. ఆయన అందులో బస చేసినప్పుడు రహదారిపై ఎలాంటి అడ్డంకులు ఉండేవి కాదు. కేవలం సీఎం నివాసంలోకి ప్రవేశించడానికే అనుమతులు అవసరమయ్యేవి. అయితే నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక అప్పటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తొలిసారిగా ఆ రహదారిలో బారికేడ్లు వెలిశాయి. తొలినాళ్లలో తాత్కాలికంగా 8 అడుగుల ఎత్తున వాటిని ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో ప్రగతి భవన్ నిర్మించిన తర్వాత రోడ్డుపైకి ఇనుప గ్రిల్స్ వచ్చాయి. వాటి ప్రభావంతో బేగంపేట మార్గంలో పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడేవి. సీఎం రేవంత్ ఆదేశంతో... మంగళవారం తనను ముఖ్యమంత్రిగా ప్రకటించిన వెంటనే మాట్లాడిన రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మారుస్తున్నట్లు, అక్కడే ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం నుంచి ప్రజాదర్బార్ ప్రారంభం కానుండటంతో అందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంతోపాటు అడ్డంకులు తొలగించాలని అధికారులను ఆదేశించారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు గురువారం ఉదయం నుంచి అవసరమైన చర్యలు ప్రారంభించారు. -
ఓపెన్ ఏఐ సహ వ్యవస్థాపకుడికి ఉద్వాసన
శాన్ ఫ్రాన్సిస్కో: చాట్ జీపీటీకి రూపకల్పన చేసిన ఓపెన్ ఏఐ కంపెనీ సహవ్యవస్థాపకుడు, సీఈవో శామ్ ఆల్ట్‌మన్‌కు ఆ సంస్థ ఉద్వాసన పలికింది. కంపెనీ బోర్డుకు విశ్వాసం కలిగేలా ఆయన వ్యవహరించడం లేదని ఓపెన్ ఏఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఓపెన్ ఏఐకి సారథిగా ఆయన సామర్థ్యంపై కంపెనీ బోర్డుకు విశ్వాసం పోయిందని పేర్కొంది. ఆయన స్థానంలో ఓపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ అధికారిణి మిరా మురాటికి తాత్కాలిక సీఈవో బాధ్యతలను అప్పగిస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. -
కునో నేషనల్ పార్కులోని 6 చీతాలకు రేడియో కాలర్ల తొలగింపు
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కు(కేఎన్పీ)లో ఉన్న చీతాల్లో ఆరింటికి రేడియో కాలర్లను తొలగించినట్లు అధికారులు సోమవారం తెలిపారు. కేఎన్పీ వైద్యులు, నమీబియా దక్షిణాఫ్రికాల నుంచి వచ్చిన నిపుణులు వీటి ఆరోగ్య పరిస్థితిపై పరిశీలన జరుపుతారని వెల్లడించారు. కేఎన్‌పీలో ప్రస్తుతం 11 చీతాలున్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి 5 పెద్ద చీతాలు, 3 కూనలు చనిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేఎన్‌పీలో ఉన్న ఆరు చీతాల ఆరోగ్యాన్ని పరిశీలిస్తామని, మరో నాలుగు చీతాలకు ఏర్పాటు చేసిన రేడియో కాలర్లను కూడా తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. రేడియో కాలర్ల వల్లే చీతాలు మృతి చెంది ఉంటాయనే అనుమానాలున్నాయా అన్న ప్రశ్నకు.. అటువంటిదేమీ లేదని ఆ అధికారి అన్నారు. ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసే అవసరమున్న చీతాలకు మాత్రమే రేడియో కాలర్లను తొలగిస్తున్నామని వివరించారు. -
తీవ్ర ఉద్రిక్తత.. పేదల గుడిసెలు కూల్చివేత
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా కలెక్టరేట్ సమీపంలో ప్రభుత్వ భూమిలో వెలసిన గుడిసెలను అధికారులు తొలగించారు. 255/1 సర్వే నెంబర్ లోని పదెకరాల భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలను మున్సిపల్ రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. తొలగింపును అడ్డుకునేందుకు పేదలు యత్నించడంతో భారీగా పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో అధికారులతో గుడిసెవాసుల వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు వెళ్ళిపోవాలంటూ గుడిసె వాసుల ఆందోళన చేపట్టారు. గుడిసె వాసులను బలవంతంగా పోలీసులు నెట్టివేసి గుడిసెలు తొలగించారు. కాగా అధికారులు పేదలు వేసుకున్న గుడిసెల తొలగింపు ప్రక్రియ చేపట్టడం ఇది నాలుగోసారి. -
మీకు మాత్రం అన్యాయం జరిగింది సార్!
న్యాయ వ్యవస్థకు న్యాయం జరిగింది కానీ.. మీకు మాత్రం అన్యాయం జరిగింది సార్! -
రాత్రి అదిరిపోయే పార్టీ ఇచ్చి...ఉదయాన్నే ఉద్యోగులను పీకేసిన కంపెనీ..
-
హైదరాబాద్ లో తెలుగుతల్లి, పొట్టిశ్రీరాములు విగ్రహాల తొలగింపు
-
చరిత్ర పుస్తకాల్లో ‘గాంధీ, ఆరెస్సెస్’ తొలగింపు
న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం రాగానే హిందూ, ముస్లింల మధ్య గొడవలు, సయోధ్య కోసం గాంధీ విఫలయత్నం, ఆయన హత్య తర్వాత ఆరెస్సెస్‌పై నిషేధం, గోధ్రా అల్లర్ల తర్వాత ఘటనలు తదితరాలను పన్నెండో తరగతి చరిత్ర పాఠ్య పుస్తకాల నుంచి ఎన్సీఈఆర్టీ తొలగించింది. హేతుబద్ధీకరణలో భాగంగా ఏయే అంశాలను తొలగించబోతున్నదీ తెలుపుతూ మండలి గత జూన్‌లో విడుదల చేసిన బుక్‌లెట్‌లో వీటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. హిందూ అతివాదంపై గాంధీ అభిప్రాయాలు వంటి అంశాలను తొలగించడం భావితరాలకు వాస్తవాలు తెలియకుండా చేసే కుటిల యత్నమని ఆరోపించింది. బీజేపీ, ఆరెస్సెస్ ఎంత ప్రయత్నించినా చరిత్రను మార్చలేవని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. విషయ నిపుణుల సూచన మేరకే వాటిని తొలగించినట్టు ఎన్సీఈఆర్టీ చీఫ్ దినేశ్ సాక్లానీ చెప్పారు. ఈ విషయంలో రాద్ధాంతం అనవసరమని అభిప్రాయపడ్డారు. -
వైద్యుల పొరపాటు.. యువకుడి మర్మాంగం తొలగింపు.. పరిహారంగా..
వైద్యులు చికిత్స అందించే సమయంలో చేసిన పొరపాటు ఓ యువకుడికి శాపంగా మారింది. అతని మర్మాంగాన్ని పూర్తిగా తొలిగించాల్సి వచ్చింది. దీంతో అతడు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కోర్టు నుంచి అనుకులంగా తీర్పు వచ్చింది. ఫలితంగా ఆస్పత్రి యాజమాన్యం అతనికి భారీ పరిహారం చెల్లించింది. ఫ్రాన్స్ నాంటెస్ యూనివర్సిటీలో 2014లో ఈ ఘటన జరిగింది. అప్పుడు యువకుడి వయసు 30 ఏళ్లు. పెళ్లి కూడా అయింది. అయితే అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లిన అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా కార్సినోమా క్యాన్సర్ అని తేలింది. అంటే చర్మ ఎపిథీలియల్ కణజాలం లేదా అంతర్గత అవయవాల టిష్యూలకు క్యాన్సర్ సోకింది. పొరపాటుతో తలకిందులు.. అయితే వైద్యులు అతనికి చికిత్స అందించారు. టిష్యూల నుంచి క్యాన్సర్‌ను పూర్తిగా తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో చేసిన పొరపాట్లు అతనికి మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. క్యాన్సర్ మర్మాంగానికి కూడా సోకింది. దీంతో భరించలేని నొప్పితో అతను నరకయాతన అనుభవించాడు. ఒకానొక సమయంలో కట్టర్‌తో స్వయంగా తానే మర్మంగాన్ని తొలగించుకునేందుకు ప్రయత్నించాడు. కానీ భార్య వద్దని చెప్పడంతో ఆగిపోయాడు. కానీ రానురాను అతని క్యాన్సర్ తీవ్రత పెరిగింది. మొత్తం మర్మాంగానికి అది సోకింది. ఇక గత్యంతరం లేదని భావించిన వైద్యులు యువకుడి మర్మాంగాన్ని పూర్తిగా తొలగించారు. అలా చేయకపోతే అతని ప్రాణాలు పోయేవని చెప్పారు. అయితే తనకు జరిగిన అన్యాయంపై యువకుడు న్యాయపరంగా పోరాడాడు. వైద్యులు పొరపాటు వల్లే మర్మాంగాన్ని తొలగించుకోవాల్సి వచ్చిందని, ఆ బాధ వర్ణనాతీతం అని వాపోయాడు. ఆస్పత్రి యాజమాన్యం తమ తప్పును అంగీకరించి యువకుడికి రూ.54 లక్షలు పరిహారంగా ఇచ్చింది. చదవండి: అఫ్గాన్‌లో విద్యార్థినుల నిరసన గళం -
హ్యారీకి అవమానం
లండన్: రాణి అస్తమయం నేపథ్యంలో విభేదాలు పక్కన పెట్టి దగ్గరవుతున్నారని భావించిన రాకుమారులు విలియం, హ్యారీ మధ్య దూరాన్ని మరింతగా పెంచే ఉదంతం తాజాగా చోటుచేసుకుంది. ఇది హ్యారీకి తీరని అవమానం కూడా మిగిల్చిందట. రాణి ఎలిజబెత్–2 మనవలు, మనవరాళ్లు శనివారం రాత్రి ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. విలియంతో పాటు హ్యారీ కూడా రాజు చార్లెస్–3 ప్రత్యేక అనుమతితో ఈ సందర్భంగా సైనిక దుస్తులు ధరించారు. కానీ వాటిపై ఉండాల్సిన రాణి అధికార చిహ్నమైన ‘ఈఆర్’ను తొలగించారు. పెద్ద కుమారుడైన యువరాజు విలియం సైనిక దుస్తులపై మాత్రం ఈఆర్ చిహ్నం అలాగే ఉంచారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక హ్యారీకి గుండె పగిలినంత పనైందట. తండ్రితోనూ సోదరునితోనూ హ్యారీకి సత్సంబంధాలు లేవన్న విషయం తెలిసిందే. రాచకుటుంబం అభ్యంతరాలను కాదని ఆయన అమెరికా నటి మెగన్ మార్కెల్‌ను పెళ్లాడినప్పటినుంచీ విభేదాలు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలో హ్యారీ దంపతులు రాచరిక హోదా వదులుకున్నారు. దాంతో ఆయన సైనిక దుస్తులు ధరించే అర్హత కోల్పోయారు. ‘‘నాయనమ్మ అంత్యక్రియల సందర్భంగా ప్రత్యేక అనుమతితో వాటిని ధరిస్తే ఇంతటి అవమానం జరిగిందంటూ హ్యారీ కుమిలిపోయారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేసిన పనేనని భావిస్తున్నారు. ఎందుకంటే సైనిక దుస్తులు ధరించే అర్హత లేని ఎలిజబెత్–2 కుమారుడు ప్రిన్స్ ఆండ్రూ సైనిక దుస్తులపై కూడా అధికార చిహ్నాన్ని యథాతథంగా కొనసాగించారు. కేవలం తన దుస్తులపై మాత్రమే తొలగించడం హ్యారీకి మరింత మనస్తాపం కలిగించింది’’ అని ఆయన మిత్రున్ని ఉటంకిస్తూ సండే టైమ్స్ కథనం పేర్కొంది. అంతేకాదు, ఆదివారం రాత్రి బకింగ్‌హాం ప్యాలెస్‌లో దేశాధినేతలకు చార్లెస్–3 అధికారిక విందు కార్యక్రమానికి కూడా హ్యారీ దంపతులను దూరంగా ఉంచారు. గురువారం హ్యారీ 38వ పుట్టిన రోజు. ఆ సందర్భంగా మెగన్తో కలిసి కార్లో వెళ్తుండగా విలియం తన ముగ్గురు పిల్లలను స్కూలు నుంచి కార్లో తీసుకొస్తూ ఎదురయ్యారు. ఇద్దరూ కార్ల అద్దాలు దించుకుని క్లుప్తంగా మాట్లాడుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారట. -
దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ హైకమాండ్ గట్టి షాక్..
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరికి పార్టీ హైకమాండ్ గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఒడిశా పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ బాధ్యతల్లో కోతలు విధించగా తాజాగా ఛత్తీస్‌గఢ్ బాధ్యతల నుంచి పురందేశ్వరిని పూర్తిగా తప్పించారు. 2020 నవంబర్ నుంచి ఆమె ఛత్తీస్‌గఢ్, ఒడిశా బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్గా ఉన్నారు. పురందేశ్వరి స్థానంలో రాజస్థాన్‌కు చెందిన కీలక నాయకుడు ఓం మాథుర్‌ను ఛత్తీస్‌గఢ్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్గా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తాజాగా అక్కడ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఇన్‌చార్జ్‌ను మారుస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. చదవండి: బీజేపీ బిగ్ ప్లాన్.. ప్రత్యర్థులకు అంతుచిక్కని ఎత్తుగడలు! యూపీ విజయంలో కీలక పాత్ర ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు అత్యంత సన్నిహితుడిగా భావించే ఓం మాథుర్ గతంలో గుజరాత్ ఇన్చార్జ్గా, గతేడాది ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇన్చార్జ్గా పనిచేశారు. యూపీ విజయంలో మాథుర్ తనదైన శైలిలో కీలక పాత్ర పోషించారు. ఏడాదిన్నరగా పురందేశ్వరి అంచనాలకు తగ్గట్లుగా పార్టీ బలోపేతానికి కృషి చేయని కారణంగానే ఆమెను తప్పించారనే చర్చ జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా మార్పు.. వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ క్షేత్రస్థాయిలో భారీ మార్పులు చేపట్టింది. అందులో భాగంగా 15 రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌లుగా బలమైన నేతలకు బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా వచ్చే ఏడాది డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఛత్తీస్‌గఢ్‌లో అధికార కాంగ్రెస్‌ను గద్దె దింపేందుకు బీజేపీ సన్నద్ధమైంది. ఒడిశా ఇన్చార్జ్గా ఉన్న పురందేశ్వరి బాధ్యతల్లో హై కమాండ్ కోత విధించింది. అంతేకాకుండా ఛత్తీస్‌గఢ్‌కు మరో ఇన్చార్జ్గా జాతీయ ప్రధాన కార్యదర్శి, అమిత్ షాకి సన్నిహితుడైన సునీల్ బన్సల్‌ను నియమించింది. బన్సల్ రంగంలోకి దిగడంతో పురందేశ్వరి పాత్ర నామమాత్రమే అనే చర్చ జరుగుతోంది. రానున్న రోజుల్లో మరిన్ని మార్పులు చోటు చేసుకొనే అవకాశాలున్నాయని కీలక నేత ఒకరు వెల్లడించారు. -
2 వేల లోన్ యాప్స్ తొలగింపు
న్యూఢిల్లీ: నిబంధనల ఉల్లంఘన, తప్పుదోవ పట్టించే సమాచారం ఇవ్వడం, వివాదాస్పద ఆఫ్‌లైన్ ధోరణులు తదితర అంశాల కారణంగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ ఇండియా ప్లే స్టోర్ నుంచి 2,000 పైగా లోన్ యాప్స్‌ను తొలగించినట్లు టెక్ దిగ్గజం గూగుల్ సీనియర్ డైరెక్టర్ సైకత్ మిత్రా తెలిపారు. రుణాల యాప్‌ల సమస్య ఇప్పటికే తారా స్థాయికి చేరుకుందని, దీనిపై అంతా దృష్టి పెడుతున్న నేపథ్యంలో ఇది ఇకపై క్రమంగా తగ్గుముఖం పట్టొచ్చని మిత్రా వివరించారు. రాబోయే రోజుల్లో నిబంధనలను మరింత కఠినతరం చేసే అంశాన్ని కూడా సంస్థ పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. లోన్ యాప్‌ల సమస్య ఒకో మార్కెట్లో ఒకో రకంగా ఉంటోందని మిత్రా తెలిపారు. అమెరికాలో పోటీ సంస్థలను దెబ్బతీసే విధమైన యాప్‌ల సమస్య ఉండగా.. భారత్‌లో తప్పుదోవ పట్టించే, నిబంధనలను ఉల్లంఘించడం రూపంలో యాప్‌ల సమస్య ఉన్నట్లు పేర్కొన్నారు. తాము కార్యకలాపాలు సాగించే అన్ని దేశాల్లోనూ నియంత్రణ నిబంధనలను పాటించడానికి కట్టుబడి ఉన్నామని మిత్రా స్పష్టం చేశారు. సైబర్‌సెక్యూరిటీపై రోడ్‌షోలు.. ఆన్లైన్ భద్రతపై అవగాహన కల్పించే దిశగా భారత్‌లో వివిధ నగరాల్లో సైబర్‌సెక్యూరిటీ రోడ్‌షోలు నిర్వహించనున్నట్లు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా తెలిపారు. 1,00,000 మంది డెవలపర్లకు శిక్షణ కల్పించనున్నట్లు, అలాగే డిజిటల్ భద్రతను ప్రోత్సహించే దిశగా వివిధ సంస్థలకు గూగుల్‌డాట్‌ఆర్గ్ 2 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 16 కోట్లు) నిధులు గ్రాంట్‌గా అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కలెక్టివ్ గుడ్ ఫౌండేషన్, పాయింట్ ఆఫ్ వ్యూ, హెల్ప్‌ఏజ్ ఇండియా తదితర స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. సైబర్ ముప్పుల నుంచి డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు పటిష్టమైన రక్షణ కల్పించే ఉద్దేశ్యంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు గుప్తా వివరించారు. డిజిటల్ లావాదేవీలను సురక్షితంగా నిర్వహించే క్రమంలో మెరుగైన విధానాలు పాటించేలా ఇంటర్నెట్ యూజర్లను ప్రోత్సహించే అవగాహన కార్యక్రమాన్ని కూడా వివిధ భాషల్లో గూగుల్ ఆవిష్కరించింది. -
ట్విటర్లో భారీ కుదుపు.. టాప్ ఎగ్జిక్యూటివ్‌లకి ఉద్వాసన
మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్ పేరు నెల రోజులుగా అందరి నోళ్లలో నానుతోంది. ఈ కంపెనీ గురించి రోజుకో వార్త ప్రచారంలోకి వస్తోంది. త్వరలోనే ఈలాన్ మస్క్ చేతిలోకి ఈ సంస్థ వెళ్లనుండగా టాప్ మేనేజ్మెంట్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ కంపెనీకి చెందిన టాప్ ఎగ్జిక్యూటీవ్‌లను బయటకు సాగనంపారు. దయచేసి వెళ్లిపోండి ఈలాన్ మస్క్ భారీ డీల్‌తో ట్విటర్‌ను సొంతం చేసుకుంది మొదలు వరుసగా ఏదో ఘటన ఆ సంస్థలో జరుగుతూనే ఉంది. ట్విటర్ సీఈవో పరాగ్ అగ్రావాల్‌ను బయటకు పంపుతారని, పాలసీ హెడ్ గద్దె విజయకు ఎగ్జిట్ తప్పదంటూ వార్తలు వినవస్తూనే ఉన్నాయి. అయితే అనూహ్యంగా ట్విటర్ హెడ్ ఆఫ్ ప్రొడక్ట్‌గా పని చేస్తున్న టాప్ ఎగ్జిక్యూటీవ్ బెక్పూర్ని సంస్థను వీడ వెళ్లాల్సిందిగా సీఈవో పరాగ్ అగర్వాల్ కోరాడు. అదే విధంగా రెవెన్యూ హెడ్ బ్రూస్ ఫలాక్‌ను పక్కన పెట్టారు. ఊహించలేదు ట్విటర్ సీఈవో అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడంటూ బెక్‌పూర్ వాపోయాడు. ఇంత కాలంలో ట్విటర్లో పని చేసినందుకు, సాధించిన లక్ష్యాల పట్ల తాను గర్వంగా ఉన్నానంటూ బెక్‌పూర్ ట్వీట్ చేశాడు. ట్విటర్‌ను వెళ్లి వీడాల్సిన రోజు వస్తుందని తాను ఊహించలేదంటూ చెప్పుకొచ్చాడు బెక్‌పూర్. While I’m disappointed, I take solace in a few things: I am INSANELY proud of what our collective team achieved over the last few years, and my own contribution to this journey. — Kayvon Beykpour (@kayvz) May 12, 2022 బ్రూస్ ఫలాక్ కూడా మరోవైపు ట్విటర్ రెవెన్యూ హెడ్‌గా బ్రూస్ ఫలాక్‌ను కూడా ఆ స్థానం నుంచి తప్పిస్తున్నట్టు తొలుత ట్విటర్లో ప్రకటించారు. అయితే ఆ ట్వీట్‌ను తర్వాత తొలగించినా ఫలాక్‌ను మాత్రం కీలక బాధ్యతల నుంచి పక్కన పెట్టారు. కీలకమైన ఈ రెండు బాధ్యతలను జే సల్లివాన్కి అప్పగించారు. ఇకపై ప్రొడక్ట్ హెడ్‌గా జే సల్లివాన్ బాధ్యతలు నిర్వర్తిసారు. రెవెన్యూ హెడ్‌గా మరొకరు వచ్చే వరకు ఆ బాధ్యతలకు ఇంఛార్జీగా ఉంటారు. I wanted to take a moment to thank all the teams and partners I’ve been lucky enough to work with during the past 5 years. Building and running these businesses is a team sport — bruce.falck() 🦗 (@boo) May 12, 2022 సమర్థుడు ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌ల తొలగింపుపై సీఈవో పరాగ్ అగర్వాల్ స్పందిస్తూ.. సరైన సమయంలో సరైన లీడర్లు వస్తారని చెప్పారు. ప్రొడక్ట్ హెడ్‌గా బాధ్యతలు స్వీకరించిన సల్లివాన్ వేగంగా నిర్ణయాలు తీసుకోవడంతో అత్యంత సమర్థుడంటూ పరాగ్ కొనియాడారు. చదవండి: Elon Musk: నాకు ధమ్కీ ఇచ్చారు.. నా ప్రాణాలకు ఏమైనా అయితే ? మస్క్ ట్వీట్‌కి కారణం ఇదే! -
అనూహ్యం: డీజీపీని తప్పించిన సీఎం యోగి
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్ర డీజీపీ ముకుల్ గోయల్‌ను అర్ధాంతరంగా తప్పిస్తున్నట్లు బుధవారం సాయంత్రం ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించిన నేపథ్యంలోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పనులను పట్టించుకోకపోవడం, శాఖాపరమైన పనులపై ఆసక్తి చూపడం లేదంటూ డీజీపీ పదవి నుంచి ఆయన్ని తప్పిస్తున్నట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది జూన్‌లోనే యూపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు ముకుల్ రాయ్. ప్రస్తుతం డీజీపీ పోస్ట్ నుంచి ముకుల్ గోయల్‌ను సివిల్ డిఫెన్స్ డీజీ పోస్టుకు పంపించారు. ఇంటెలిజెన్స్ డీజీ డీఎస్ చౌహాన్ యూపీకి తర్వాతి డీజీపీ అయ్యే అవకాశం ఉంది. 1987 ఉత్తర ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ముకుల్ గోయల్.. గతంలో పలు కీలక పదవులు చేపట్టారు. గతంలో బీఎస్ఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్‌గానూ ఆయన బాధ్యతలు నిర్వహించారు. పోలీసు రిక్రూట్మెంట్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో 2007లో మాయావతి సర్కార్ ముకుల్‌పై సస్పెన్షన్ వేటు వేసింది కూడా. చదవండి👉🏼: మాజీ ఐపీఎస్‌పై ట్రోలింగ్! కారణం ఏంటంటే.. -
జగ్గారెడ్డికి బిగ్ షాక్.. బాధ్యతల నుంచి తొలగింపు
-
జగ్గారెడ్డి బాధ్యతల్లో కోత...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. సీనియర్లు వర్సెస్ పీసీసీ అధ్యక్షుడు అన్నట్టుగా చోటు చేసుకుంటున్న పరిణామాల పరంపర సోమవారం కూడా కొనసాగింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఉన్న పార్టీ బాధ్యతల్లో కోత పడింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఆయన ఇన్చార్జిగా వ్యవహరిస్తోన్న ఖమ్మం, వరంగల్, భువనగిరి, కరీంనగర్ లోక్‌సభ స్థానాలతో పాటు మహిళా కాంగ్రెస్, ఐఎన్టీయూసీ, ఇతర సంఘాల ఇన్చార్జి బాధ్యతలను ఇతర వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగిస్తూ రేవంత్ ఉత్తర్వులు జారీ చేశారు. తాను వర్కింగ్ ప్రెసిడెంట్‌గానే కొనసాగుతానని, ఇతర బాధ్యతలు వద్దని తెలియజేస్తూ గతంలో జగ్గారెడ్డి పార్టీకి రాసిన లేఖ ఆధారంగా ఆయన్ను ఆ బాధ్యతల నుంచి తొలగించినట్టు గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు రాష్ట్ర మంత్రి హరీశ్‌రావును కలిసిన అంశంపై వివరణ కోరుతూ త్వరలోనే మాజీ ఎంపీ, సీనియర్ నేత వి. హనుమంతరావుకు షోకాజ్ నోటీసు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. జగ్గారెడ్డి బాధ్యతల తొలగింపు, వీహెచ్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయడం ద్వారా ఇతర అసంతృప్త నేతలను కూడా అధిష్టానం దారిలోకి తీసుకురావాలని టీపీసీసీ నాయకత్వం భావిస్తున్నట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఢిల్లీ వెళ్లిన రేవంత్‌రెడ్డి జగ్గారెడ్డి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీలో విలేకరులతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఇటీవలి, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడతారన్నది కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మరోవైపు పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు సోమవారం ఢిల్లీ వెళ్లిన రేవంత్‌రెడ్డి.. మంగళవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్‌తో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌లో మరేమైనా ఇతర పరిణామాలు చోటు చేసుకుంటాయా అనే చర్చ కూడా జరుగుతోంది. పార్టీకి నష్టం కలిగితే వారిదే బాధ్యత: మహేశ్‌కుమార్ గౌడ్ టీపీసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎంతటి సీనియర్లు అయినా ఊరుకునేది లేదని అన్నారు. సీనియర్లంటే తమకు గౌరవం ఉందని, వారికి వ్యక్తిగతంగా ఏవైనా సమస్యలు ఉంటే అధిష్టానానికి చెప్పుకోవాలని, పార్టీని నష్టపరిచే వ్యవహారాలు మంచివి కావని సూచించారు. పార్టీకి నష్టం కలిగితే వారిదే బాధ్యత అని పేర్కొన్నారు.