
న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం రాగానే హిందూ, ముస్లింల మధ్య గొడవలు, సయోధ్య కోసం గాంధీ విఫలయత్నం, ఆయన హత్య తర్వాత ఆరెస్సెస్‌పై నిషేధం, గోధ్రా అల్లర్ల తర్వాత ఘటనలు తదితరాలను పన్నెండో తరగతి చరిత్ర పాఠ్య పుస్తకాల నుంచి ఎన్‌సీఈఆర్‌టీ తొలగించింది.
హేతుబద్ధీకరణలో భాగంగా ఏయే అంశాలను తొలగించబోతున్నదీ తెలుపుతూ మండలి గత జూన్‌లో విడుదల చేసిన బుక్‌లెట్‌లో వీటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. హిందూ అతివాదంపై గాంధీ అభిప్రాయాలు వంటి అంశాలను తొలగించడం భావితరాలకు వాస్తవాలు తెలియకుండా చేసే కుటిల యత్నమని ఆరోపించింది. బీజేపీ, ఆరెస్సెస్ ఎంత ప్రయత్నించినా చరిత్రను మార్చలేవని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు.
విషయ నిపుణుల సూచన మేరకే వాటిని తొలగించినట్టు ఎన్‌సీఈఆర్‌టీ చీఫ్ దినేశ్ సాక్లానీ చెప్పారు. ఈ విషయంలో రాద్ధాంతం అనవసరమని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment