నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు: రాహుల్ | RAHUL Never blamed RSS as a body for Gandhi's killing | Sakshi
Sakshi News home page

నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు: రాహుల్

Published Wed, Aug 24 2016 4:20 PM | Last Updated on Mon, Oct 8 2018 7:53 PM

నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు: రాహుల్ - Sakshi

నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు: రాహుల్

న్యూఢిల్లీ:  జాతిపిత మహాత్మా గాంధీని రాష్ట్రీయ స్వయం  సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) హత్య చేసిందని తాను అనలేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆ సంస్థతో సంబంధమున్న వ్యక్తి గాంధీని హత్య చేశాడని మాత్రమే  తాను అన్నానని  రాహుల్ పేర్కొన్నారు. గతంలోరాహుల్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆర్ఎస్ఎస్ ఆయన పై పరువు నష్టం దావా వేసింది. దీనిపై రాహుల్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. కేసును సెప్టెంబర్ 1 వరకు వాయిదా వేయాలని పిటిషనర్ కోర్టును కోరారు.

2014 లో  మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ మహాత్మా గాంధీని హత్య చేసిందని ఆర్ఎస్ఎస్ అని ఆరోపించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన సంఘ్ ముంబై కోర్టులో ఆయనపై పరువు నష్టం దావా వేసింది. దీనిపై స్పందించిన ముంబై కోర్టు క్షమాపణ కోరమని రాహుల్ కు సూచించింది. దీనిపై రాహుల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement