NCERT syllabus
-
వాస్తవ చరిత్రతోనే మెరుగైన భవిత
దేశంలో కోట్లాది మంది విద్యార్థులు అభ్యసించే ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో మతవాద భావజాలాన్ని చొప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మతవాద భావాలు లౌకికవాద భావజాలానికి విఘాతం కలిగిస్తాయని అంబేడ్కర్ ఏనాడో అన్నారు. లౌకికవాద రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పాఠ్య ప్రణాళికలు రూపొందించే విధానం చరిత్రకు నష్టం కలిగిస్తుంది. విద్యార్థి సమూహానికి దేశంలోని భౌగోళిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, చరిత్ర... వాస్తవంగా, ఉన్నది ఉన్నట్టుగా అర్థం కావలసి ఉంది. మతవాదాన్నే జాతీయ వాదంగా ప్రచారం చేసే ప్రయత్నాలు మంచివి కావు. భారతదేశంలో చదువుకుంటున్న విద్యార్థులు దేశ చరిత్రను శాస్త్రీయ భావాలతో, సరైన పద్ధతుల్లో అర్థం చేసుకోకపోతే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దగలరా?ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను అభ్యసిస్తున్న విద్యార్థులు సుమారు నాలుగు కోట్ల మంది ఉన్నారు. మొదట సిలబస్ రూపకల్పనలో భారత దేశ రాజ్యాంగ స్ఫూర్తి కలిగిన, జాతీయ భావాలు కలిగిన, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో పరిశోధకులు అయిన మేధావులు ఉన్నారు. అయితే వాజ్‌పేయి కాలం నుంచి ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను మార్చి మతవాద పూరితమైన భావజాలాన్ని చూపించాలనే ప్రయత్నాన్ని బీజేపీ ప్రభుత్వాలు చేస్తూ వస్తున్నాయి. భారతదేశంలో చదువుకుంటున్న విద్యార్థులు దేశ చరిత్రను శాస్త్రీయ భావాలతో, సరైన పద్ధతుల్లో అర్థం చేసుకోకపోతే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దగలరా? విద్యార్థి సమూహానికి దేశంలోని భౌగోళిక పరిస్థితులు, సామాజిక, లౌకికవాదాల పరిస్థితులు, చరిత్ర... వాస్తవంగా, ఉన్నది ఉన్నట్టుగా అర్థం కావలసి ఉంది. అయితే బీజేపీ ప్రభుత్వం మతవాదాన్నే జాతీయవాదంగా ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తోంది. పాఠ్య గ్రంథాలు రూపొందించినవారి అనుమతి లేకుండా తమకు అనుకూలంగా పాఠ్య గ్రంథాలను మార్చేశారు. అందుకే తమ అనుమతి లేకుండా పాఠ్య గ్రంథాలను మార్చేసి, సలహాదారుల్లో తమ పేరు ఉంచి ప్రచురిస్తే కోర్టులో కేసులు దాఖలు చేస్తామని ప్రొఫెసర్లు యోగేంద్ర యాదవ్, సుహాస్ పల్శీకర్ హెచ్చరించే దాకా పరిస్థితి వచ్చింది. ఈ మేరకు వారు ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేశ్ ప్రసాద్ సక్లానీకి లేఖ రాశారు. చరిత్రలో వాస్తవ ఘట్టాలను తొలగించి, కల్పిత కథలను చేర్చి, వాస్తవ ఆధునిక రాజకీయ చరిత్రను విద్యార్థులకు అందకుండా చేసే నైతిక హక్కు మీకు లేదని వారు వాదించారు. ముఖ్యంగా భారతదేశ ఆధునిక చరిత్రలో అద్వానీ చేసిన రథయాత్రను, హిందూమత వాదాన్ని రాజకీయాల్లో చొప్పించి భారతదేశంలో హిందువులు, హిందూయేతరులు అనే భావజాలాన్ని తీసుకొచ్చారు. అద్వానీ రథ యాత్ర దేశ రాజకీయాల్లో హిందూ భావజాలాన్ని పెంపొందించింది. అంతకు మునుపే హిందూ, ముస్లిం రాజకీయ విభేదాలను పెంచే మతవాద చరిత్రలు కొందరి చేత రాయబడి ఈ వైషమ్యాలను బాగా పెంచాయి. స్వాతంత్రోద్యమానికి ముందు నుంచి కూడా ఈ వైషమ్యాలను పెంచే భావజాల చరిత్ర రాయబడుతూ వచ్చింది. 19వ శతాబ్దంలో భారతీయ రాజకీయాల్లో మతవాదం చోటు చేసుకొనే సరికి మతాన్ని అన్వయించి రాయడం మొదలయింది. మధ్యయుగ భారత చరిత్రను మతవాదులు సుదీర్ఘమయిన హిందూ, ముస్లిం సంఘర్షణగా చూస్తూ, అనివార్యంగా అదే దృష్టిని 19, 20 శతాబ్దాలకు అన్వయిస్తూ, జాతి వివక్ష సిద్ధాంతానికి, రాజకీయాలకు ఈ ఆధునిక యుగంలో ‘న్యాయం’ చేయగలిగామనుకొంటున్నారు. మత వివక్షతా చరిత్రకారులు మధ్యయుగాల్లోని ముస్లిం పాలకుల పాలనను విదేశీయుల పాలనగా చిత్రీకరిస్తూ, భారత సమాజానికి ముస్లింలు శాశ్వతంగా విదేశీయులని చెప్పగలుగుతున్నారు. ఈ దారుణమైన భావం హిందూ, ముస్లింల వైషమ్యాలను పెంచడానికి మరింతగా తోడ్పడింది. మతాన్ని రాజకీయాలకు ఉపయోగించుకోవడమనే ప్రక్రియ భారతదేశ చీలికకు దారితీసింది. ఈ విషయంగా మొదటి నుండి బి.ఆర్.అంబేడ్కర్ ఆందోళన చెందారు. భారతదేశంలో మతవాద భావాలు లౌకికవాద భావజాలానికి విఘాతం కలిగిస్తాయనీ, రాజ్యాంగంలో పేర్కొన్న సౌభ్రాతృత్వం, సామాజిక సమతుల్యత భావాలు దెబ్బతింటాయనీ అన్నారు. ఇప్పుడు చరిత్రలో వీరు తొలగించిన పాఠ్యాంశాల్లో ఎంతో రాజకీయ చరిత్ర దాగి వుంది. ‘బాబ్రి మసీదు’ కూల్చివేత చిన్న విషయం కాదు. ఆ కూల్చివేత వెనుక ‘హిందూ రాజ్య’ నిర్మాణ భావన ఉంది. లౌకికవాద భావజాలానికి ఆ చర్య గొడ్డలి పెట్టు. బాబ్రీ మసీదు కూల్చివేత ముస్లింలకు అభద్రత తీసుకొచ్చింది. నిజానికి చరిత్ర అనేది వాస్తవ ఘటనల సముచ్ఛయంగా ఉండాలి. కొత్తగా సిద్ధం చేసిన పాఠ్యపుస్తకాలలో బాబ్రీ మసీదు విధ్వంసానికి ముందు జరిగిన అద్వానీ రథయాత్ర, ఆ తరువాత జరిగిన పరిణామాలను తొలగించేశారు. వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మించడానికి అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి మాత్రం విస్తారంగా ప్రస్తావించారు. అయోధ్య గురించి మునుపటి పుస్తకాలలో నాలుగు పేజీలు ఉంటే ఇప్పుడు రెండు పేజీలకు కుదించారు. వాస్తవ ఘటనలను తొలగిస్తే, ‘బాబ్రీ మసీదు’ కూల్చివేతను గురించిన మూలాలు, ‘రామ మందిరం’ నిర్మాణం దృక్పథం తెలియకుండా పోతాయి.పాఠ్యపుస్తకాలను కాషాయీకరించాలన్న ప్రస్తుత పాలకుల ధోరణికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేయడాన్ని లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు, సామ్యవాదులు, చరిత్ర రచనా ప్రవీణులు నిరసిస్తున్నారు. దేశంలో అంబేడ్కర్ కృషి వలన లౌకికభావ స్ఫూర్తి బలంగా ఉంది. దేశ చరిత్ర ఎప్పుడూ కూడా మతవాదంతో సాగదు. అది ఉత్పత్తి శక్తుల వల్లే ముందుకు సాగుతుంది. ఈనాటి పాఠ్య ప్రణాళిక భారత రాజ్యాంగ స్ఫూర్తితోనే ముందుకు నడవవలసి ఉంది. భారతదేశ సంస్కృతిలో, ప్రజల్లో మొదటి నుండి కూడా పోరాట పటిమ ఉంది. ఇంగ్లీషువాళ్ళు అనేక రూపాల్లో మన సంపదను దోచుకుని, సుఖాలు పొందుతున్న విషయాలను ప్రజలు అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా రైతులు, కార్మికులు, పేద ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో పన్నుల చేత వేధించబడ్డారు. అందుకే భారతదేశంలో అన్ని వర్గాల ప్రజల్లో పోరాట పటిమ పెరిగింది. ‘రూపాయి సమస్య’ అనే గ్రంథంలో బ్రిటిష్ వాళ్ళ ఆర్థిక దోపిడీని గురించి అంబేడ్కర్ స్పష్టంగా నివేదించారు.ఇకపోతే రాబోయే చరిత్రలో మోదీ పాలనలోని ఎన్నో దాడులు, అణచివేతలు చరిత్రకు సాక్ష్యాలు. ఒకసారి మనం అవలోకిస్తే ఎన్నో దారుణమైన ఘట్టాలు మనముందు వచ్చి నిలబడతాయి. ప్రజల జీవనోపాధిపై దాడి, నోట్ల రద్దు వల్ల ఏర్పడిన సంక్షోభం, గో రక్షణ పేరుతో జరిగిన దాడులు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణతో పాటు వాటి విక్రయాలు... ఇలా ఎన్నో. కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక సుదీర్ఘ కాలంగా ఉనికిలో ఉండటమేగాక, ఆయా సంఘాలు దశాబ్దాలుగా నయా ఉదారవాద విధానాలను ఎదుర్కోవడంలో ప్రధానపాత్ర పోషించాయి. వారి అనుభవం కూడా రైతు ఉద్యమానికి లాభించింది. 2018 మార్చిలో నాసిక్ నుండి ముంబై వరకు సుదీర్ఘంగా సాగిన కిసాన్ లాంగ్ మార్చ్ రైతుల డిమాండ్లను నొక్కిచెప్పింది. ఈ లాంగ్ మార్చ్ బీజేపీని ఓడించటం సాధ్యమేనని... బీజేపీ అజేయశక్తి అనే అభిప్రాయం కేవలం కార్పొరేట్ మీడియా ప్రచార సృష్టి మాత్రమేనని స్పష్టమైన సందేశాన్ని పంపింది. 2019 సంవత్సరంలో జరిగిన పుల్వామా ఘటన, ప్రతిగా జరిగిన బాలాకోట్ వైమానిక దాడి, ఆ తరువాత తీవ్ర జాతీయవాద ప్రచార నేపథ్యంలో బీజేపీ విజయం సాధించినప్పటికీ... 2024 కల్లా 240 సీట్లకు ఎందుకు పడిపోయిందో ప్రజలకు, విద్యార్థులకు తెలియాల్సిన అవసరం ఉంది.దేశంలో లౌకికవాదం, రాజ్యాంగ స్ఫూర్తి పెరుగుతున్నాయి. ఈ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పాఠ్య ప్రణాళికలు రూపొందించే విధానం చరిత్రకు నష్టం కలిగిస్తుంది. రాబోయే తరాలు లౌకికవాదానికీ, మతవాదానికీ జరిగిన సమరాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు భారతీయులే అనేది ముందు గుర్తించాలి. భారతీయులందరికీ వాస్తవమైన చరిత్రను అందించినప్పుడే భారతదేశ పరిణామం త్వరితం అవుతుంది. డీడీ కోశాంబీ, రొమిల్లా థాపర్, బిపిన్ చంద్ర, అంబేడ్కర్ రచనలు భారతదేశ చరిత్ర నిర్మాణానికి దిశా నిర్దేశం చేస్తున్నాయి. ఆ వైపు నడుద్దాం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
NCERT: బాబ్రీ కాదు.. 3 గోపురాల నిర్మాణం
న్యూఢిల్లీ : హేతుబద్దీకరణ పేరుతో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) పాఠ్య పుస్తకాల్లో పలు మార్పులు, చేర్పులు చేసిన సంగతి తెలిసిందే. అయితే 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకంలోనూ అనేక మార్పులు చేసింది. ‘బాబ్రీ మసీదు’ సహా అనేక కీలక అంశాలను, చాలా సమాచారాన్ని తొలగించింది. తొలగింపులు అంశాలవారీగా.. ⇒ ‘బాబ్రీ మసీదు’ పదం తొలగింపు: పాఠ్య పుస్తకంలోంచి బాబ్రీ మసీదు అనే పదాన్ని పూర్తిగా తొలగించింది. దాని స్థానంలో ‘మూడు గోపురాల నిర్మాణం’ను చేర్చింది. ⇒ అయోధ్య అధ్యాయం తగ్గింపు: నాలుగు పేజీలున్న అయోధ్య అధ్యాయాన్ని రెండు పేజీలకు తగ్గించింది. రథయాత్ర, కరసేవకుల పాత్ర, బాబ్రీ మసీదు కూలి్చవేత, అనంతరం జరిగిన హింస, ఆ తరువాత బీజేపీ పాలిత ప్రాంతాల్లో విధించిన రాష్ట్రప తి పాలన అంశాలను తొలగించింది. ⇒ చారిత్రక వివరాల సవరణ: బాబ్రీ మసీదుకు సంబంధించిన వివరాల్లో కూడా అనేక మార్పులు చేసింది. బాబ్రీ మసీదును 16వ శతాబ్దంలో మీర్ బాకీ నిర్మించినట్లుగా గత పుస్తకంలో ఉండగా.. 1528లో రాముడి జన్మస్థలంలో నిర్మించబడిన మూడు గోపురాల నిర్మాణంగా ఇప్పుడు పేర్కొన్నది. అంతేకాదు ఈ నిర్మాణంలో అనేక హిందూ చిహ్నాలు ఉన్నాయని, లోపలి, వెలుపలి గోడలపై శిల్పాలు ఉన్నాయని కొత్త పుస్తకం పేర్కొంది. హిందూ చిత్రాలు, విగ్రహాలను కూడా కొత్తగా ప్రస్తావించింది. ⇒ చట్టపరమైన, మతపరమైన కథనాల్లోనూ మార్పులు: ఆలయంలో పూజలు చేసుకునేందుకు బాబ్రీ మసీదు నిర్మాణాన్ని తెరచి ఉంచాలని 1986 ఫిబ్రవరిలో ఫైజాబాద్ జిల్లా కోర్టు ఇచి్చన తీర్పును పాత పుస్తకం వివరించగా, వాటన్నింటిని తొలగించి మూడు గోపురాల నిర్మాణం, తరువాత వచి్చన మతపరమైన వైరుధ్యాలను కొత్త పుస్తకం క్లుప్తంగా ప్రస్తావించింది. వివాదాస్పద భూమి ఆలయానికే చెందుతుందంటూ 2019లో సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పును మాత్రం కొత్త ఎడిషన్‌లో చేర్చింది. ⇒ వార్తాపత్రికల కటింగ్స్ తీసివేత: పాత పుస్తకంలో వార్తాపత్రిక కథనాలకు సంబంధించిన అనేక ఛాయాచిత్రాలు ఉన్నాయి. వీటిలో డిసెంబర్ 7, 1992న ’బాబ్రీ మసీదు కూలి్చవేత, కేంద్రం కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనం కూడా ఉంది. వీటన్నింటినీ తొలగించారు. ⇒ గుజరాత్ అల్లర్ల అధ్యాయం తొలగింపు: ప్రజాస్వామ్య హక్కుల అధ్యాయం నుంచి గుజరాత్ అల్లర్ల ప్రస్తావనను పూర్తిగా తొలగించింది. అల్లర్ల గురించి బోధించాల్సిన అవసరం లేదుఎన్సీఈఆర్టీ డైరెక్టర్ ద్వేషం, హింస బోధనాంశాలు కావని, పాఠశాల పాఠ్యపుస్తకాలు వాటిపై దృష్టి పెట్టకూడదని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) చీఫ్ దినేష్ ప్రసాద్ సక్లానీ అన్నారు. గుజరాత్ అల్లర్లు, బాబ్రీ మసీదు కూలి్చవేత గురించి బోధిస్తే పాఠశాల విద్యార్థులు హింసాత్మకంగా తయారవుతారని, అందుకే వాటిని పాఠ్యాంశాల్లోంచి తొలగించామని వెల్లడించారు. పాఠ్య పుస్తకాల్లో మార్పులు, బాబ్రీ మసీదు కూల్చివేత, తరువాత మతపరమైన హింసకు సంబంధించిన అంశాల తొలగింపులపై శనివారం ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు. సమాజంలో విద్వేషాలను సృష్టించే విధంగా బోధనలు అవసరం లేదని, చిన్నపిల్లలకు అల్లర్ల గురించిన నేరి్పంచాల్సిన అవసరం లేదని, అది ఎందుకు జరిగిందో పెద్దయ్యాక వారే తెలుసుకుంటారని చెప్పారు. పాఠ్య పుస్తకాల్లోని అంశాలను కాషాయీకరణ చేశారనే ఆరోపణలను కొట్టి పారేశారు. రామజన్మభూమికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిస్తే దాన్ని పాఠ్యపుస్తకాల్లో ఎందుకు చేర్చకూడదని, పార్లమెంటు నూతన భవనాన్ని నిర్మించడం విద్యార్థులకు ఎందుకు తెలియకూడదని ఆయన ప్రశ్నించారు. చరిత్రను యుద్ధభూమిగా మార్చడానికి కాకుండా విద్యార్థులకు వాస్తవాలు తెలిసేలా బోధిస్తామన్నారు. పాఠ్యపుస్తకాల పునరి్వమర్శ ప్రపంచవ్యాప్తంగా జరిగే అభ్యాసమని, ఏది మార్చాలన్నది సబ్జెక్ట్, బోధనా శాస్త్ర నిపుణులే నిర్ణయిస్తారని, తాను ఆ ప్రక్రియలో జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు. ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల్లో 2014 నుంచి ఇప్పటివరకూ నాలుగు పర్యాయాలు మార్పులు చేశారు. -
సీబీఎస్ఈ 3, 6వ తరగతులకు కొత్త సిలబస్
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పాఠశాలల్లో 3, 6వ తరగతుల పాఠ్యప్రణాళిక మారింది. 2024–25 విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది. 3, 6వ తరగతులకు కొత్త సిలబస్‌తో పాఠ్య పుస్తకాలను త్వరలో విడుదల చేయనున్నట్లు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్సీఆర్టీ) ప్రకటించింది. 3వ తరగతికి సంబంధించిన కొత్త పుస్తకాలను ఏప్రిల్ చివరి వారంలో, 6వ తరగతికి సంబంధించిన కొత్త పుస్తకాలను మే మూడో వారంలో విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. పుస్తకాల విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. 4, 5, 9, 11వ తరగతుల పుస్తకాలు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. అన్ని పాఠ్య పుస్తకాల డిజిటల్ కాపీలు ఎన్సీఈఆర్టీ వెబ్‌సైట్‌తో పాటు దీక్షా, ఈ–పాఠశాల పోర్టల్, యాప్‌లలో అందుబాటులో ఉంటాయి. -
చర్చకు తావిచ్చే బోధన లేకపోతే...
ఎంపిక చేసిన అధ్యాయాలను, పేరాలను, చిత్రణలను ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల నుంచి తొలగించడానికి జ్ఞాన రాజకీయాలే దారి తీశాయి. కానీ అసలు సమస్యను విస్మరిస్తున్నాం. తరగతి గదులు ప్రేరణారహితంగా ఉండిపోవడాన్ని మనం విస్మరిస్తున్నాం. పాఠంలో పొందుపర్చిన జ్ఞాన గుళికను విద్యార్థులకు అందించడం కంటే మించిన పాత్ర టీచర్‌కి ఏమీ ఉండటం లేదు. ఘనీభవించిన పదాలను కంఠస్థం చేసే కళలో విద్యార్థులు నైపుణ్యం సాధించేలా చేయాలని టీచర్లను కోరుతున్నారు. కమలా దాస్ కవిత్వం, ఆర్కే లక్ష్మణ్ కార్టూన్ వంటి వాటిని బోధనా సాధనంగా చేసినప్పటికీ అవి కేవలం రెండు మార్కుల ప్రశ్నగా మాత్రమే కుదించబడతాయి. అర్థవంతమైన విద్య అంటే పాఠ్యపుస్తకాన్ని దాటి విద్యార్థిని ఎదిగేలా చేయాలి. భావజాలం, కరిక్యులమ్కి చెందిన గతి శాస్త్రం గురించి ఇప్పటికే చాలా చాలా చర్చ జరిగింది. ఎంపిక చేసిన అధ్యాయాలను, పేరాలను, చిత్రణలను, సమాచారాన్ని ఎన్సీఈఆర్టీ స్కూల్ పాఠ్యపుస్తకాల నుంచి తొలగించడానికి జ్ఞాన రాజకీయాలే దారి తీశాయి. రాజకీయంగా చేపట్టిన ఈ తొలగింపుపై ఉదారవాద వామపక్ష అకడెమిక్ సమాజం తన ఆగ్ర హాన్ని, విచారాన్ని వ్యక్తం చేయగా, ఈ విషపూరిత సమయాల్లో ఎన్సీఈఆర్టీని నడుపుతున్న విద్యావిషయకమైన ఉన్నతాధికార వర్గం... హేతుబద్ధీకరణ పేరిట లేదా విద్యాపరమైన భారాన్ని తగ్గించడం, తీవ్ర ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులకు కాస్త ఉపశమనం కలిగించడం పేరిట ఈ చర్యను చట్టబద్ధం చేసింది. అయితే, ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలపై చర్చ తరగతి గది కమ్యూ నికేషన్ నిజవాస్తవికతను మర్చిపోతున్నట్లు కనిపిస్తోంది. అవును, ఈ చర్చలో, జ్ఞాన విషయాలను నిర్వచించి, తీర్చిదిద్దడానికి హిందుత్వం దాని ఆధిపత్యపు త్వరిత లక్షణం వేగంగా పెరుగుతుండటంలోని ఆసక్తికరమైన ప్రతిఫలనాలను చూశాం. వీటన్నింటికి మించి, మన పిల్లలు ఏది నేర్చుకోవాలి, ఏది నేర్చుకోకూడదు అనే అంశాన్ని కొత్త బాస్‌లు నిర్ణయించే అధికారం కలిగి ఉన్నందున, అతి జాతీయవాద సిద్ధాంతకర్తలు ఉదారవాద వామపక్ష చరిత్రకారులను, సామాజిక శాస్త్రజ్ఞులను పక్కకు పెడుతున్న అధికార మార్పిడి పర్యవసానాలను కూడా అనుభూతి చెందాం. తమతమ రాజకీయ దృక్పథాలు ఏవైనప్పటికీ మన అకడమిక్ బాస్‌లు కిక్కిరిసిపోయిన తరగతి గదుల్లో బోధన, అభ్యాసానికి చెందిన మూసపోత చర్యపై తగినంత శ్రద్ధ పెట్టలేదని అంగీకరించడానికి తగినంత నిజాయితీని మనం కలిగివుండాలి. నిజానికి, పాఠశాల అధ్యాపకులు కేవలం మధ్యవర్తుల పాత్రకు పరిమితమయ్యారు. టీచర్లు చెప్పేదేమీ ఉండదు, వారి విద్యార్థులు కూడా ఖాళీ పాత్రల్లాగ ఉండిపోతున్నారు. పైగా, పాఠ్యపుస్తకాల స్వభావాన్ని ప్రతి ఫలించే కరిక్యులమ్ రూపకల్పనలో లేదా తగిన బోధనా కళను వికసింప చేయడంలో ఎలాంటి కీలకపాత్రను పోషించడానికి కూడా వారిని ప్రోత్సహించడం లేదు. యూనివర్సిటీ ప్రొఫెసర్లు, స్కాలర్లు, ఉదార వాద మేధావులు వంటి పెద్ద హోదాకలిగిన వారు లేదా వర్త మాన భారత్‌లో మితవాద సిద్ధాంతకర్తలు పాఠశాల కరిక్యులమ్‌లో దేనిని పొందుపర్చాలనే విషయాన్ని నిర్ణయిస్తున్నారు. పాఠంలో పొందుపర్చిన జ్ఞాన గుళికను విద్యార్థులకు అందించడం కంటే మించిన పాత్ర టీచర్‌కి ఏమీ లేదని భావిస్తున్నారంటే ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. ఘనీభవించిపోయిన పదాలను కంఠస్థం చేసే కళలో విద్యార్థులు నైపుణ్యం సాధించేలా చేయాలని టీచర్లను కోరుతున్నారు. వల్లె వేయడం కంటే మరే ప్రాధాన్యతా లేని, ఏమాత్రం కల్పనాశక్తి లేని సమాధానాలను వారిచేత రాయించాలని మాత్రమే సూచిస్తున్నారు. పైగా, పాఠ్యపుస్తక నిరంకుశత్వం (లేదా వ్యూహాత్మక ఎంపికలాగా, గైడ్ బుక్స్) ఏది విలువైన బోధనో నిర్వ చిస్తున్నప్పడు, సిలబస్‌కి వెలుపల మరేదీ లేనప్పుడు, అధ్యాపక సృజ నాత్మక వ్యవస్థ మెల్లగా కృశించిపోవడానికే దారితీస్తుంది. అంతకుమించి, బ్రెజిలియన్ విద్యావేత్త పౌలో ఫ్రియరీ చెప్పి నట్లుగా, విద్యను ప్రధానంగా అధికారిక సిలబస్‌పై ఆధారపడిన పరీక్షలతో సమానం చేసి చూసే వ్యవస్థ... సమస్యలను ఎత్తిచూపే విద్యగా ఉంటుంది. ఇది విద్యా కళను ప్రాక్టీస్ చేసే టీచర్లను, విద్యా ర్థులను ప్రేరణా రహితులుగా చేస్తుంది. అందుచేత మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సే రాజకీయాలను యువ అభ్యాసకులు తెలుసుకోకూడదని మెరుగులు దిద్దిన ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకం భావిస్తున్నట్లయితే దాన్ని అలాగే చేయనివ్వండి. టీచర్, విద్యార్ధి ఇరువురూ పాఠాన్ని దాటి తదుపరి విచారణ, పరిశీలనకు ప్రయత్నించి, ఆ పుస్తకం ‘పవిత్రత’ను వివాదాస్పదం చేయడం, పాఠం దాచి పెట్టిన విషయం ఏమిటని చూడవలసిన అవసరం ఏమిటి? ఉదా హరణకు, ఎమర్జెన్సీ బీభత్సం, 2002 గుజరాత్ అల్లర్లు రేపిన హింసాకాండ, అభివృద్ధికీ, నిరాశ్రయులకూ సంబంధించిన సమస్య, నర్మదా బచావ్ ఆందోళన లేవనెత్తిన పర్యావరణ సమస్య వంటి సిలబస్‌కు వెలుపల ఉన్న వాటిని తెలుసుకోవడానికి వారెందుకు ఆరాటపడాలి? పాఠ్యపుస్తకాలపై మితవాద దాడిని విమర్శించడానికి చాలా కారణాలు ఉంటున్నప్పటికీ, మన క్లాసు రూమ్‌లలో పరావర్తన రహిత, సంభాషణకు తావులేని ప్రస్తుత విద్యాభ్యాసంలో రొమిల్లా థాపర్, కృష్ణకుమార్ వంటి విద్యావేత్తల దృక్పథాలను ఎన్ సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో పొందుపర్చినప్పటికీ, వాటిని మౌలికంగా మార్పు లకు గురిచేయవచ్చు. నిజానికి, ఎమ్సిక్యూ(బహుళైచ్ఛిక)–కేంద్రక ప్రామాణీకృత పరీక్షల యుగంలో లేదా బోర్డు పరీక్షల్లో 99 శాతం మార్కుల సాధనకోసం మానసిక ఒత్తిడి ఉంటున్న యుగంలో ప్రతి ఒక్కటీ తలకిందులుగా మారుతుంది. పాబ్లో నెరూడా లేక కమలా దాస్ కవిత్వం, లేదా ఆర్కే లక్ష్మణ్ కార్టూన్ వంటి వాటిని బోధనా సాధనంగా చేసినప్పటికీ అవి కేవలం రెండు మార్కుల ప్రశ్నగా మాత్రమే కుదించబడతాయి. వల్లె వేసే విద్యాభ్యాసం ద్వారా అవి సత్వరం వినియోగమయ్యే సరుకులుగా మారతాయి. ఒక విషయాన్ని అంగీకరించాలి. చింతనాపరులు, సమర్థులైన పరిశోధక విద్యార్థులు లేదా సృజనాత్మక మనస్సులతో పనిలేకుండా యాంత్రికంగా టాపర్ల ఉత్పత్తిని ఆరాధించే వ్యవస్థ ఇక్కడ ఉంది. బోధనా వృత్తిలో, ప్రత్యేకించి పాఠశాల బోధనా వృత్తిలో నిజంగా స్ఫూర్తికలిగిన వ్యక్తులను రూపొందించడం, రిక్రూట్ చేయడం గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? సృజనాత్మకంగా సూక్ష్మ విమర్శనాత్మక బోధన అభ్యాసం గురించి, గాంధీ లేదా సావర్కర్, ఔరంగజేబ్ లేదా శివాజీపై వామపక్ష లేదా మితవాద పక్ష పాఠాల విషయాలను దాటి చూడటానికి సాహసమున్న వారి గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? దీనికి బదులుగా, టీచర్స్ని ప్రోత్సహిస్తూ, ప్రతి పిల్లాడినీ ప్రభావితం చేసే సంభావ్యతను, ఉద్ధరణ వాద విద్యలోని సంభాషణ, సంక్లిష్ట చింతన ప్రభావాన్ని విశ్వసించే వ్యవస్థ కోసం మనం ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు, టీచర్లు సంభాషిస్తూ, చర్చించుకుంటూ, అధికారిక సిలబస్‌ను దాటి చూసేటటువంటి సజీ వమైన, శక్తిమంతమైన తరగతి గదిని ఊహించుకోండి. భగత్ సింగ్ డైరీని చదవమంటూ ఎనిమిదవ తరగతి విద్యార్థులకు చెబుతున్న టీచర్ని, 1947–48లో గాంధీ ప్రార్థనల సమావేశాలపై వ్యాసం రాయాలని కోరే టీచర్ని, లేదా మాంటో రాసిన కథనాన్ని ప్రతిఫలింపజేయాలంటూ కోరుతున్న టీచర్ని మీరు ఊహించుకోండి. లేదా, స్కూల్ లైబ్రరీ నుంచి రస్కిన్ బాండ్, ఆర్కే నారాయణ్ పుస్తకాలను తీసుకుంటున్న 7వ తరగతి యువ విద్యార్థిని ఊహంచుకోండి. తమ సాహిత్య సృజనలపై చర్చ ప్రారంభించాలంటూ హైయర్ టీచర్ని కోరుతున్న విద్యార్థినీ విద్యార్థినులను ఊహించుకోండి. ఇది పాఠ్య పుస్తకాన్ని (మేటి రచయితలు రాసినవైనప్పటికీ) కేవలం ఉత్ప్రేరకంగా మాత్రమే చూస్తూ, తర్వాత దాన్ని దాటి పోవడం అన్నమాట! ఈ సృజనాత్మకమైన కీలకమైన ఫ్యాకల్టీని బలోపేతం చేసిన తర్వాత ప్రశ్నించే, విచారణ చేసే, సిలబస్‌ని దాటి చూసే మేధా, జ్ఞాన సామ ర్థ్యాన్ని పిల్లలు సహజంగా అభివృద్ధి చేసుకుంటారు. అర్థవంతమైన విద్య గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి మనం నిజాయితీగా ఆలోచిస్తున్నట్లయితే, ఎన్ సీఈఆర్టీ పాఠ్య పుస్త కాల అధికారంపై వామపక్షవాదుల, మితవాదుల మధ్య రాజకీయ– సైద్ధాంతిక ఘర్షణను దాటి సమస్యను చూడాల్సిన అవసరం ఉంది. అవిజిత్ పాఠక్ వ్యాసకర్త సోషియాలజిస్ట్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
6, 7, 9 తరగతులకు ఎన్సీఈఆర్టీ పుస్తకాలు
సాక్షి, అమరావతి: విద్యా సంస్కరణలు తీసుకొచ్చి అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ కరిక్యులమ్‌ను కూడా అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్ర విద్యార్థులు మెరుగ్గా రాణించేలా ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ విధానానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా జాతీయ విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) రూపొందించిన సిలబస్‌తో పాఠ్య పుస్తకాలను అందిస్తోంది. సబ్జెక్టు పాఠ్యాంశాల వరకు ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తెస్తోంది. ప్రభుత్వ పాఠశాలలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపుతో కొనసాగే ప్రైవేట్ స్కూళ్లు కూడా ఎన్సీఈఆర్టీ సిలబస్ పుస్తకాలనే అనుసరించాల్సి ఉంటుంది. గత ఏడాది 8వ తరగతిలో ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలను పాఠశాల విద్యాశాఖ ప్రవేశపెట్టింది. స్కూళ్లు తెరిచేనాటికి కొత్త పాఠ్యపుస్తకాలు రెడీ స్కూళ్లు తెరిచే నాటికల్లా కొత్త పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందించేలా పాఠశాల విద్యాశాఖ ముద్రణ పనులను వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో పాఠ్యపుస్తకాల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా అధికారులు జాగ్రత్తలు చేపట్టారు. పేపర్, ముద్రణ నాణ్యమైన రీతిలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. అట్ట డిజైన్‌తోపాటు లోపలి చిత్రాలు, ఇతర అంశాలను కూడా సీఎం సూచనల మేరకు ముద్రిస్తున్నారు. మే చివరి వారానికల్లా పాఠ్యపుస్తకాల ముద్రణ పూర్తికానుంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు 404 టైటిళ్లలో 5.05 కోట్ల పుస్తకాలను సిద్ధం చేస్తున్నారు. అన్ని తరగతుల పుస్తకాలను రెండు సెమిస్టర్లుగా ద్విభాషా (బైలింగ్యువల్) విధానంలో ముద్రించి ఇవ్వనున్నారు. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు జూన్‌లో స్కూళ్లు తెరిచిన వెంటనే సెమిస్టర్ 1 పుస్తకాలను జగనన్న విద్యాకానుక కిట్లలో అందచేస్తారు. తెలుగు, హిందీ, సోషల్ సబ్జెక్టులకు ఎస్సీఈఆర్టీ 2023–24 విద్యాసంవత్సరంలో 6, 7, 9వ తరగతుల విద్యార్థులకు కూడా ఎన్సీఈఆర్టీ కరిక్యులమ్‌తో కూడిన పాఠ్యపుస్తకాలను పాఠశాల విద్యాశాఖ ప్రవేశపెడుతోంది. ఈ ఏడాది 6, 7వ తరగతుల్లో ఇంగ్లీషు, గణితం, సైన్స్ సబ్జెక్టులకు ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు అందించనున్నారు. తెలుగు, హిందీ, సోషల్ సబ్జెక్టులకు మాత్రం రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) సిలబస్‌తో కూడిన పాఠ్యపుస్తకాలను అందిస్తారు. సబ్జెక్టు అంశాల్లో అత్యున్నత సామర్థ్యాలను సమకూర్చడంతో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులతో పోటీ పడేలా సబ్జెక్టు అంశాల్లో మాత్రమే ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను ఇవ్వనున్నారు. స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు, ఇతర చారిత్రక అంశాలపై విద్యార్థులకు అవగాహన పెంచేందుకు వీలుగా ఎస్సీఈఆర్టీ రూపొందించిన సోషల్ పాఠ్య పుస్తకాలను అందించనున్నారు. గత ఏడాది 8వ తరగతిలో ఇంగ్లీషు, మేథ్స్, సైన్సు, సోషల్ సబ్జెక్టుల పుస్తకాలు ఎన్సీఈఆర్టీ సిలబస్‌తో ప్రవేశపెట్టారు. 9వ తరగతి విద్యార్ధులకు ఈ విద్యాసంవత్సరం నుంచి ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి తెస్తున్నారు. మేథ్స్ సైన్సు, ఇంగ్లీషుతో పాటు సోషల్, హిందీ సబ్జెక్టు పాఠ్యపుస్తకాలు ఎన్సీఈఆర్టీ సిలబస్‌తో పంపిణీ కానున్నాయి. 9వ తరగతి తెలుగు సబ్జెక్టులో ఎస్సీఈఆర్టీ సిలబస్‌తో కూడిన పాఠ్యపుస్తకాలను అందించనున్నారు. టెన్త్ విద్యార్థులకు 2024–25లో ఎన్సీఈఆర్టీ బుక్స్ పదో తరగతి విద్యార్థులకు 2023–24 విద్యాసంవత్సరానికి గతంలో మాదిరిగానే ఎస్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలనే అందించనున్నారు. గత ఏడాది ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను అభ్యసించిన విద్యార్థులు ఈ ఏడాది 9వ తరగతిలో ఎన్సీఈఆర్టీ సిలబస్ పుస్తకాలనే అభ్యసించనున్నారు. వీరు 2024–25లో సీబీఎస్ఈ విధానంలో టెన్త్ పబ్లిక్ పరీక్షలను రాయనున్నారు. అందుకు అనుగుణంగా 2024–25లో టెన్త్ విద్యార్థులకు ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను అందించనున్నారు. ప్రైవేట్ స్కూళ్లకు అమెజాన్ ద్వారా పంపిణీ! ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులకు ప్రైవేట్ ప్రింటర్ల ద్వారా పుస్తకాల ముద్రణ చేపట్టిన విద్యాశాఖ వాటిని నేరుగా ఆయా స్కూళ్లకు అందించడంపై కసరత్తు చేస్తోంది. అమెజాన్ ద్వారా వీటిని పంపిణీ చేసేలా సన్నాహాలు జరుగుతున్నాయి.విద్యార్థులు/స్కూళ్ల యాజమాన్యాలు అమెజాన్‌లో పాఠ్యపుస్తకాల కోసం ఆర్డర్ ఇస్తే నేరుగా ప్రింటర్ల ద్వారా సరఫరా చేయటాన్ని పరిశీలిస్తున్నారు. దీనివల్ల పుస్తకాల పేరుతో తల్లిదండ్రులపై బాదుడుకు తెర పడుతుందని భావిస్తోంది. -
చరిత్ర పుస్తకాల్లో ‘గాంధీ, ఆరెస్సెస్’ తొలగింపు
న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం రాగానే హిందూ, ముస్లింల మధ్య గొడవలు, సయోధ్య కోసం గాంధీ విఫలయత్నం, ఆయన హత్య తర్వాత ఆరెస్సెస్‌పై నిషేధం, గోధ్రా అల్లర్ల తర్వాత ఘటనలు తదితరాలను పన్నెండో తరగతి చరిత్ర పాఠ్య పుస్తకాల నుంచి ఎన్సీఈఆర్టీ తొలగించింది. హేతుబద్ధీకరణలో భాగంగా ఏయే అంశాలను తొలగించబోతున్నదీ తెలుపుతూ మండలి గత జూన్‌లో విడుదల చేసిన బుక్‌లెట్‌లో వీటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. హిందూ అతివాదంపై గాంధీ అభిప్రాయాలు వంటి అంశాలను తొలగించడం భావితరాలకు వాస్తవాలు తెలియకుండా చేసే కుటిల యత్నమని ఆరోపించింది. బీజేపీ, ఆరెస్సెస్ ఎంత ప్రయత్నించినా చరిత్రను మార్చలేవని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. విషయ నిపుణుల సూచన మేరకే వాటిని తొలగించినట్టు ఎన్సీఈఆర్టీ చీఫ్ దినేశ్ సాక్లానీ చెప్పారు. ఈ విషయంలో రాద్ధాంతం అనవసరమని అభిప్రాయపడ్డారు. -
‘సోషల్ మీడియాలో ప్రసారమవుతున్న వార్త అవాస్తవం’
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఇప్పటి వరకు అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ ప్రకటించలేదని ఏపీ ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ నకిలిదని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 5 వ తేదీన పాఠశాలలు తెరిచే నాటికి ఈ సంవత్సారాని సంబంధించిన అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. సిలబస్ తగ్గిస్తారు అంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన వెల్లడించారు. సిలబస్ యధావిధిగా ఉంటుందని తెలిపారు. కేవలం కొన్ని మార్పులు తో, త్వరలో స్పష్టమైన ప్రకటన చేస్తామని ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. చదవండి: అవినీతి చేయాలంటే భయపడాలి: సీఎం జగన్ -
విద్యా బోధన.. వయా వీడియో పాఠాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యా బోధన ప్రారంభానికి సంబంధించిన కసరత్తును విద్యాశాఖ వేగవంతం చేసింది. హైకోర్టుకు తమ విధానపర నిర్ణయాన్ని తెలియజేయాల్సి ఉన్నం దున కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. ఇటీవల ప్రజ్ఞత పేరుతో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన డిజిటల్ ఎడ్యుకేషన్ మార్గదర్శ కాల ప్రకారమే ముందుకు సాగాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చి నట్లు తెలిసింది. అయితే అందులో ఆన్లైన్ బోధనతో పాటు రికార్డెడ్ వీడియో పాఠాల విధానం కూడా ఉంది. ఈ నేపథ్యంలో రెండింటి పైనా విద్యాశాఖ ఆలోచనలు చేస్తోం ది. వీలు కలిగిన పట్టణ ప్రాంతాల్లో ఆన్లైన్ బోధన చేపట్టాలని, వీలుకాని గ్రామీణ ప్రాంతాల్లో వీడియో పాఠాలను టీశాట్, దూర దర్శన్ (యాదగిరి), ఎస్సీఈఆర్టీ యూట్యూబ్ చానల్ వంటి వాటి ద్వారా బోధనను చేపట్టే అంశంపైనా పరిశీలన జరుపుతోంది. ఆన్లైన్ బోధన చేపట్టాలంటే విద్యార్థులకు మొబైల్/ట్యాబ్ వంటివి అవసరం. అయితే విద్యార్థుల ఇళలో ఏ మేరకు ఆయా పరికరాలున్నాయో అనధికారిక సర్వే చేయాలని కేంద్రం ప్రజ్ఞతలో పేర్కొన్న నేపథ్యంలో ఆ దిశగా విద్యా శాఖ చర్యలు చేపట్టాలని భావి స్తోంది. కరోనా కొంత అదుపు లోకి వచ్చే వరకు ఆన్లైన్, వీడియో పాఠాలనే కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత మాత్రం షిఫ్ట్ పద్ధతుల్లో బోధన చేపట్టే అంశాలను పరిశీలిస్తోంది. అందులోనూ ముం దుగా 9, 10 తరగతులకు బోధన నిర్వహించడం, కొన్ని రోజుల తర్వాత 6, 7, 8 తరగతులకు బోధన ప్రారంభించే అంశంపైనా పరిశీలన జరుపుతోంది. ఇక రెండు, మూడు నెలల తరువాతే ఒకటి నుంచి 5వ తరగతి వరకు బోధనను చేపట్టే అంశంపై దృష్టి సారించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వ స్కూళ్లలో 90% వీడియో పాఠాలే.. రాష్ట్రంలోని 30 వేల ప్రభుత్వ పాఠ శాలలుంటే అందులో 28 లక్షల మంది విద్యార్థులు చదువు తున్నారు. గురుకులాలు, ఇతర ప్రత్యేక విద్యా సంస్థలను మినహాయిస్తే 23 లక్షల మందికి పైగా విద్యార్థులు జిల్లా పరిషత్, ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదువుతున్నారు. వీటిల్లో 90% మంది విద్యార్థులకు వీడియో పాఠాలే బోధించే అంశంపై పరిశీలన జరుపు తున్నట్లు తెలిసింది. స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్న విద్యార్థులకు మాత్రం ఆన్లైన్లో పాఠాలు బోధించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఇంతవరకు దేనిపైనా ఓ కచ్చితమైన నిర్ణయానికి రాలేకపోయారు. వివిధ కోణాల్లో పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. ప్రైవేటులోనూ ఎక్కువ శాతం వీడియో పాఠాలవైపే.. రాష్ట్రంలోని 10 వేలకు పైగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో 31 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో 2 వేలకు పైగా ఉన్న కార్పొరేట్, సెమీ కార్పొరేట్, ఇంటర్నేషనల్, ప్రముఖ పాఠశాలలు మాత్రమే ఆన్లైన్ పాఠాలను ప్రారంభించాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని గ్రామీణ ప్రాంతాలు, ఇతర జిల్లా కేంద్రాల్లోని మెజారిటీ ప్రైవేటు పాఠశాలలు ఇంకా ఆన్లైన్ బోధన చేపట్టలేదు. ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నా ఆచరణ ఎంత మేరకు సాధ్యమవుతుందన్న విషయంపై తర్జన భర్జన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పాఠశాలలు కూడా కొన్నాళ్ల వరకు వీడియో పాఠాల వైపే మొగ్గు చూపే అవకాశముంది. ఆన్లైన్ కష్టసాధ్యం.. అమలు చేసినా కొద్దిసేపే.. రాష్ట్రంలో వీలున్న స్కూళ్లలో ఆన్లైన్ తరగతులను ప్రారంభిస్తే కేంద్రం ఆదేశాల ప్రకారం ప్రతి తరగతికి 2 నుంచి 3 గంటలే ఆన్లైన్ బోధన చేపట్టే అవకాశముంది. ఉన్నత పాఠశాల్లో గరిష్టంగా 4 సెషన్లలోనే, 1 నుంచి 8 తరగతులకు రెండు సెషన్లలోనే బోధనను నిర్వహించేలా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. అంతకుమించి ఎక్కువ బోధన చేపట్టే వీలుండదని, పైగా ఆన్లైన్ బోధనకు టీచర్లను గుర్తించి, వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని, ఇది కష్టసాధ్యమని పేర్కొన్నారు. వీటన్నింటికంటే వీడియో పాఠాలే ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుందని వెల్లడించారు. -
అందుకే 100 శాతం మార్కులు: దివ్యాన్షి
‘‘నేను రోజూ ప్రార్థనలు చేశాను. అదే విధంగా కష్టపడి చదివాను కూడా. ప్రతీ సబ్జెక్టుకు ప్రత్యేకంగా నోట్స్ తయారు చేసుకున్నాను. కీలక అంశాలను అందులో రాసుకున్నా. తద్వారా త్వరగా, మెరుగ్గా పాఠాలను అర్థం చేసుకొని గుర్తుపెట్టుకున్నా. చదివిన ప్రతీ అంశాన్ని అనేక మార్లు పునరుశ్చరణ చేసి.. వాటిని విశ్లేషించి అర్థం చేసుకున్నా’’అంటూ తన విజయ రహస్యాన్ని వెల్లడించింది సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో 100 శాతం(600/600) మార్కులు సాధించిన దివ్యాన్షి జైన్. హిస్టరీ సబ్జెక్టుపై పరిశోధన చేయాలనుకుంటున్నానని, దేశానికి సంబంధించిన గత చరిత్ర, విశేషాలపై అధ్యయనం చేయాలనుకుంటున్నట్లు భవిష్యత్ ప్రణాళిక గురించి పంచుకుంది. కాగా సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలు సోమవారం వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో బాలురపై(86.19 శాతం) బాలికలు(92.15 శాతం) పైచేయి సాధించారు.(సీబీఎస్ఈ ‘12’లో బాలికలదే పైచేయి) ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన దివ్యాన్షి జైన్ 600/600 స్కోరు సాధించి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. నవయుగ్ రేడియన్స్ సీనియర్ సెకండరీ స్కూళ్లో విద్యనభ్యసించిన ఆమె ఇంగ్లీష్, సంస్కృతం, చరిత్ర, ఆర్థికశాస్త్రం, భూగోళ శాస్త్రం, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్‌లో వంద శాతం మార్కులు సాధించింది. దివ్యాన్షి తండ్రి స్థానికంగా దుకాణం నిర్వహిస్తుండగా.. ఆమె తల్లి గృహిణిగా ఇంటి బాధ్యతలు నెరవేస్తున్నారు. ఇక పరీక్షల్లో తాను సాధించిన గెలుపు గురించి దివ్యాన్షి మాట్లాడుతూ.. గంటల కొద్దీ పుస్తకాలతో కుస్తీ పట్టలేదని, ప్రణాళిక ప్రకారం రివిజన్, మాక్ టెస్టులకు సమయం కేటాయించి.. ఎక్కువగా ఎన్సీఈఆర్టీ(నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్) పుస్తకాలనే చదివానని చెప్పుకొచ్చింది. తన విజయానికి తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహమే కారణమని పేర్కొంది. -
సగానికి తగ్గనున్న ఎన్సీఈఆర్టీ సిలబస్
న్యూఢిల్లీ: విద్యార్థులకు భారంగా మారిన జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) సిలబస్‌ను సగానికి తగ్గించనున్నారు. సిలబస్‌ను సగానికి తగ్గించాలన్న కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ ప్రతిపాదనకు ప్రభుత్వం బుధవారం ఓకే చెప్పింది. ‘విద్యార్థుల పోర్షన్‌ను సగం చేస్తాం. ఇకపై వారికి అంతా బోధించాల్సిన పనిలేదు. విద్యార్థులు ముఖ్యమైన సూత్రాలు నేర్చుకుంటే చాలు. మిగతా నాలెడ్జ్‌ను తర్వాత వారు సముపార్జించగలరు. ప్రస్తుతం అతి సిలబస్ దెబ్బకు విద్యార్థులు వ్యాయామం, జీవన నైపుణ్యాలు వంటి వాటికి సమయం కేటాయించలేకపోతున్నారు’ అని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ అన్నారు. -
త్వరలో పాఠ్య పుస్తకాలపై క్యూఆర్ కోడ్
న్యూఢిల్లీ: జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎన్సీఈఆర్టీ) ప్రచురించే పాఠ్యపుస్తకాలపై వచ్చే ఏడాది నుంచి క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్‌ను ముద్రించనున్నట్లు కేంద్ర మంత్రి జవదేకర్ చెప్పారు. ఈ కోడ్‌ను విద్యార్థులు స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్ చేయడం ద్వారా ఇంటర్నెట్లో ఆయా పాఠ్యాంశాలకు సంబంధించి ఉన్న వీడియోలు, సబ్జెక్టుల సమాచారాన్ని పొందవచ్చన్నారు. దీంతో విద్యార్థులు పాఠ్యాంశాలను క్షుణ్నంగా అర్థం చేసుకునే వీలుంటుందని చెప్పారు. విద్యా రుణాలు తీసుకునే విద్యార్థులు తాము చదివే కోర్సు కాలపరిమితితోపాటు తర్వాతి ఏడాది వరకు ఆ రుణాలకు వడ్డీ కట్టాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రభుత్వ విద్యకు సంబంధించి సర్వ శిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్ష అభియాన్, టీచర్ ఎడ్యుకేషన్లను కలిపి ఒకే కార్యక్రమంగా రూపొందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
సగానికి తగ్గనున్న స్కూల్ సిలబస్
న్యూఢిల్లీ: పాఠశాల విద్యార్థులపై సిలబస్ భారాన్ని తగ్గించే దిశగా కేంద్రం చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతమున్న ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను 2019 విద్యాసంవత్సరం నుంచి సగానికి తగ్గించనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్చార్డీ) శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. బీఏ, బీకాం డిగ్రీల సిలబస్ కన్నా స్కూల్ పాఠ్యప్రణాళికనే ఎక్కువగా ఉందన్నారు. చదువే కాకుండా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన ఇతర కార్యకలాపాల్లో పాల్గొనేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాజ్యసభ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జవదేకర్ మాట్లాడారు. ‘సిలబస్‌ను సగానికి తగ్గించాలని ఎన్సీఈఆర్టీకి సూచించాను. 2019 విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుంది’ అని అన్నారు. పాఠశాల స్థాయిలో డిటెన్షన్ విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. పరీక్షలు లేకుండా విద్యార్థుల మధ్య పోటీ ఉండదని, మెరుగైన ఫలితాలు రాబట్టాలంటే పోటీ వాతావరణం అవసరమని స్పష్టం చేశారు. పాఠశాల విద్యకు సంబంధించిన ఈ సంస్కరణలకు ఉద్దేశించిన బిల్లును మలి విడత బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. మార్చి తరువాత మే.. మార్చిలో జరిగే వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు మేలో పరీక్షలు నిర్వహిస్తామని జవదేకర్ చెప్పారు. ఈ రెండింట్లోనూ ఫెయిలైన విద్యార్థులనే పై తరగతులకు వెళ్లకుండా డిటెన్షన్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ‘విద్యార్థుల సామర్థ్యాలు, బలహీనతలు తెలుసుకుని అందుకు అనుగుణంగా వారికి దిశానిర్దేశం చేయడం ఉపాధ్యాయుల ప్రాథమిక విధి’ అని ఆయన వ్యాఖ్యానించారు. విద్యా హక్కు చట్టం కింద 2015 నాటికి దాదాపు 20 లక్షల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సి ఉండగా, 5 లక్షల మందికి మాత్రమే శిక్షణనివ్వడం సాధ్యమైందన్నారు. మరోవైపు, 14 లక్షల మంది ఉపాధ్యాయులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ నెల చివరి నాటికి నూతన విద్యా విధానంపై నివేదిక సిద్ధమవుతుందని వెల్లడించారు. -
నీట్ హీట్
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్-NEET (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్).. గత రెండు రోజులుగా సర్వత్రా హాట్ టాపిక్‌గా మారింది. జాతీయ స్థాయిలో అన్ని మెడికల్, డెంటల్ కళాశాలల్లో నీట్ ఆధారంగానే ఈ ఏడాది నుంచి ప్రవేశాలు నిర్వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార వర్గాలు రివ్యూ పిటిషన్లు వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ ముగిసింది. మరోవైపు తెలంగాణలోనూ ఎంసెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ తరుణంలో సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులపై విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నిపుణులు మాత్రం విద్యార్థులు నీట్ దిశగా సన్నద్ధం కావడమే మేలంటున్నారు. ఈ నేపథ్యంలో.. అనుసరించాల్సిన వ్యూహాలు.. ‘నీట్లో ర్యాంకు ఆధారంగానే ప్రవేశాలు నిర్వహించాలి. ఇందుకోసం మే 1న నిర్వహించే ఏఐపీఎంటీని నీట్-1గా పరిగణించాలి. దీనికి దరఖాస్తు చేయని విద్యార్థుల కోసం జూలై 24న నీట్-2 పేరుతో ప్రత్యేక పరీక్ష నిర్వహించాలి’ - సుప్రీంకోర్టు ఉత్తర్వులు. ‘నీట్ నిర్వహణపై సుప్రీంకోర్టు ఉత్తర్వులపై రివ్యూ పిటిషన్లు దాఖలు చేస్తాం’ - ప్రభుత్వ వర్గాల ప్రకటన. న్యాయస్థానం ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకుంటే.. విద్యార్థులు ఈ ఏడాది నీట్‌కు హాజరవ్వాల్సిన ఆవశ్యకత, అందులో ప్రతిభ కనబర్చాల్సిన పరిస్థితి స్పష్టమవుతోంది’ - నిపుణులు, విద్యావేత్తల అభిప్రాయం. సరితూగే సిలబస్ నీట్ యూజీకి నిర్దేశించిన సిలబస్ ఎన్సీఈఆర్టీ పుస్తకాల ఆధారంగా ఉంటుంది. ఇది తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు కలిసొచ్చే అంశం. కారణం.. ప్రస్తుత ఇంటర్మీడియెట్ సిలబస్ ఎన్సీఈఆర్టీ సిలబస్‌కు అనుగుణంగా అమలవుతోంది. అంతేకాకుండా మన సిలబస్‌లో కొన్ని అదనపు అంశాలు సైతం ఉన్నాయి. అయితే సమస్య ప్రధానంగా మాధ్యమంతోనే!దాంతోపాటు ఇప్పటివరకు విద్యార్థులు ఎంసెట్‌కు ప్రిపేర్ అయిన తీరుకు.. నీట్ తీరుకు కొంత వైవిధ్యం ఉండటం మరో సమస్య. ప్రిపరేషన్ శైలి నీట్‌కు హాజరుకానున్న విద్యార్థులు ఎన్సీఈఆర్టీ పుస్తకాలను, ఇంటర్మీడియెట్ బోర్డ్ పుస్తకాలను బేరీజు వేసుకోవాలి. అందులో నీట్ సిలబస్, బోర్డ్ సిలబస్‌లో ఉన్న కామన్ అంశాలను గుర్తించాలి. ఆయా టాపిక్స్‌పై ఎన్సీఈఆర్టీ పుస్తకాల ఆధారంగా పట్టు సాధించాలి. ఎక్కువగా ఎన్సీఈఆర్టీ పుస్తకాలను అధ్యయనం చేయడం మేలు. ఏఐపీఎంటీ పాత ప్రశ్నలు ఏఐపీఎంటీని నిర్వహించే సీబీఎస్ఈనే నీట్‌ను కూడా నిర్వహించనుంది. నీట్-2013 పరీక్షను సైతం సీబీఎస్ఈనే నిర్వహించింది. ఈ ఏడాది మే1న నిర్వహించే ఏఐపీఎంటీని నీట్-1గా పరి గణించాలని కోర్టు స్పష్టం చేసింది. వీటన్నింటినీ పరిశీలిస్తే నీట్- 2013, ఏఐపీఎంటీ పరీక్ష విధానం, సిలబస్ సైతం ఒకే విధంగా ఉంది. కాబట్టి విద్యార్థులు ఏఐపీఎంటీ పాత ప్రశ్న పత్రాల సాధన ద్వారా ప్రశ్నల తీరుపై అవగాహన పెంచుకోవచ్చు. ప్రశ్నల సాధనలోనూ ప్రత్యేకంగా సీబీఎస్ఈ నిర్వహించే ఏఐపీఎంటీ పరీక్ష, గతంలో నిర్వహించిన నీట్లో ఎక్కువ శాతం మ్యాచ్ ది ఫాలోయింగ్, మల్టిపుల్ ఛాయిస్, అసెర్షన్ అండ్ రీజన్, డయాగ్రమ్ ఆధారిత ప్రశ్నలే! విద్యార్థులు కూడా తమ ప్రిపరేషన్‌ను ఈ పద్ధతిలోకి అన్వయించుకోవాలి. డెరైక్ట్ కొశ్చన్ అండ్ ఆన్సర్ తరహా ప్రిపరేషన్‌కు స్వస్తి పలకాలి. అప్లికేషన్ ఓరియెంటేషన్, కాన్సెప్ట్ బేస్డ్ ప్రిపరేషన్‌కు ప్రాధాన్యమివ్వాలి. బయాలజీ (బోటనీ, జువాలజీ)లో డయాగ్రమ్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఫిజిక్స్‌లో న్యూమరికల్ ఎబిలిటీ ఆధారిత ప్రశ్నలు ప్రాక్టీస్ చేయడం ఎంతో అవసరం. నీట్ ప్రిపరేషన్ పరంగా అనుసరించాల్సిన మరో ముఖ్యమైన వ్యూహం.. ఇప్పుడు కొత్త అంశాల జోలికి వెళ్లకుండా ఎంసెట్, ఐపీఈ ఎగ్జామ్స్ కోసం బాగా చదివిన అంశాలపైనే మరింత పట్టు సాధించాలి. తగిన సమయం ఇస్తే బాగుంటుంది నీట్ నిర్వహణ.. అమలు పరంగా విద్యార్థులకు కొంత సమయం ఇస్తే బాగుంటుంది. ఈ ఏడాది నుంచే అమలు చేయాలనే నిర్ణయం వల్ల విద్యార్థులు ఇబ్బందికి గురవుతారు. దీనివల్ల వారు పరీక్షకు సంసిద్ధత అయ్యే తీరు, సీట్ల భర్తీ విధానం వంటి విషయాల్లో ఎంతో గందరగోళం నెలకొంటుంది. ఇప్పటికే ఏపీలో ఎంసెట్ ముగిసింది. తెలంగాణలోనూ ఎంసెట్ నిర్వహణ తుది దశకు చేరుకుంది. - డాక్టర్. జి. సుబ్బారావు, ప్రిన్సిపాల్, గుంటూరు మెడికల్ కాలేజ్ అనుకూలతలే సాధనంగా ఒకవేళ నీట్ తప్పనిసరైతే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కారణం.. మన సిలబస్ సీబీఎస్ఈ సిలబస్‌కు అనుగుణంగా ఎన్సీఈఆర్టీ పుస్తకాల మేరకు ఉంది. విద్యార్థులు తమ ప్రిపరేషన్ శైలిని మార్చుకుంటే సరిపోతుంది. - విజయ్ కిశోర్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కాన్సెప్ట్ ఆధారితం నీట్ తప్పనిసరైతే విద్యార్థులు ఎంసెట్ ప్రశ్నల శైలి, నీట్ గత ప్రశ్నల శైలిని గమనించి తమ ప్రిపరేషన్ సాగించాలి. నీట్లో అధికంగా కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు, అప్లికేషన్ ఓరియెంటెడ్ ప్రశ్నలు వస్తాయి. - రాజేంద్ర, బోటనీ, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ నీట్ స్వరూపం నీట్-2013లో నిర్వహించిన ప్రకారం, అదే విధంగా ప్రస్తుతం నిర్వహిస్తున్న ఏఐపీఎంటీని పరిశీలిస్తే నీట్ పరీక్ష ఈ విధంగా ఉండొచ్చు. * ఇంగ్లిష్ / హిందీ (నీట్-2013లో ఆంధ్రప్రదేశ్, అసోం, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లకు చెందిన విద్యార్థులు తమ రాష్ట్రాల్లో స్థానిక కోటాలో సీటు పొందాలనుకుంటే తమ మాతృ భాషలో పరీక్ష రాసుకునే వెసులుబాటు ఇచ్చారు. ఈ విషయమై ఈసారి ఇంకా స్పష్టత రాలేదు.) * మొత్తం విభాగాలు -4 అవి.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ + జువాలజీ) * ప్రశ్నల సంఖ్య - 180. నాలుగు విభాగాల్లో ఒక్కో విభాగం నుంచి 45 ప్రశ్నలు చొప్పున అడిగే అవకాశముంది. * ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది. తప్పు సమాధానానికి ఒక మార్కు కోల్పోతారు. * సమయం మూడు గంటలు. నీట్ అర్హత: ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సులో గ్రూప్ సబ్జెక్ట్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. డిసెంబర్ 31 నాటికి 17 నుంచి 25 ఏళ్లు