
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఇప్పటి వరకు అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ ప్రకటించలేదని ఏపీ ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ నకిలిదని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 5 వ తేదీన పాఠశాలలు తెరిచే నాటికి ఈ సంవత్సారాని సంబంధించిన అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. సిలబస్ తగ్గిస్తారు అంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన వెల్లడించారు. సిలబస్ యధావిధిగా ఉంటుందని తెలిపారు. కేవలం కొన్ని మార్పులు తో, త్వరలో స్పష్టమైన ప్రకటన చేస్తామని ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు.
చదవండి: అవినీతి చేయాలంటే భయపడాలి: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment