గొంతులో ఇనుప చువ్వతో చిన్నారి విలవిల.. తొలగించిన వైద్యులు
అనపర్తి: తూర్పు గోదావరి జిల్లా అనపర్తికి చెందిన గంగిరెడ్డి నర్సింగ్‌హోమ్ అధినేత డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి బుధవారం ఒక చిన్నారి గొంతులో ప్యాలట్(అంగిడి) భాగాన గుచ్చుకున్న ఊచను శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు. రాజానగరం మండలం ముక్కినాడ గ్రామానికి చెందిన కొప్పుల మిత్రవింద (5) కొక్కెంతో ఉన్న సుమారు మూడడుగుల పొడవున్న ఇనుప ఊచతో ఆడుకుంటూ నోట్లో పెట్టుకుంది.
ఊచ చివరి భాగాన ఉన్న కొక్కెం చిన్నారి అంగిడికి గుచ్చుకుంది. గొంతునుంచి రక్తస్రావం అవుతున్న ఆమెను త ల్లిదండ్రులు అనపర్తిలోని గంగిరెడ్డి నర్సింగ్‌హోమ్‌కు తరలించారు. డాక్టర్ సూర్యనారాయణరెడ్డి ఆపరేషన్ చేసి చిన్నారి గొంతులోంచి ఊచను తొలగించారు. మిత్రవిందకు ఇక ఇబ్బందేమీ లేదని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి విలేకరులకు చెప్పారు.