యువకుడి కిడ్నీలో భారీ రాయి | stone removed from kidney in medak district | Sakshi
Sakshi News home page

యువకుడి కిడ్నీలో భారీ రాయి

Published Fri, Jan 8 2016 2:54 AM | Last Updated on Sun, Sep 3 2017 3:16 PM

యువకుడి కిడ్నీలో భారీ రాయి

యువకుడి కిడ్నీలో భారీ రాయి

మెదక్ టౌన్: ఓ యువకుడి కిడ్నీలో నుంచి 300 గ్రాముల రాయిని వైద్యులు బయటకు తీశారు. ఇంతపెద్ద రాయిని చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు. ఈ ఘటన మెదక్‌లో గురువారం వెలుగులోకి వచ్చింది. కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన మోహన్(25) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.


మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మూడు రోజులుగా మూత్రం ఆగిపోయింది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆయన మెదక్‌లోని సాయిచంద్ర నర్సింగ్‌హోంకు వచ్చాడు. పరీక్షలు చేసిన వైద్యులు కిడ్నీలో రాళ్లు ఉన్నట్టు గుర్తించారు. ఆపరేషన్ నిర్వహించగా కిడ్నీలో 300 గ్రాముల బరువుగల రాయి బయట పడింది. ఓ వ్యక్తి కిడ్నీలో ఇంత పెద్ద రాయి రావడం ఇదే మొదటిసారి అని వైద్యులు సురేశ్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement