Despacito Removed From YouTube | Vivo Channel Hacked and Deleted Some Popular Albums - Sakshi
Sakshi News home page

Published Tue, Apr 10 2018 4:07 PM | Last Updated on Tue, Apr 10 2018 4:45 PM

Original Despacito Song Was Hacked And Removed From Youtube - Sakshi

ఈ మధ్య హ్యాకర్లు దేన్నీ వదలటం లేదు. పాప్‌ సింగర్స్‌ కమ్‌ కంపోజర్స్‌ లూయిస్‌ ఫోన్సీ, డాడీ యాంకీలు చేసిన ‘డెస్పాసిటో’ ఆల్బమ్‌ ప్రపంచాన్ని ఉర్రూత లూగించిన విషయం తెలిసిందే. చాలా మంది ఆ ఆల్బమ్‌ను కాపీ కొట్టేసి సొమ్ము చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోను దాదాపు 500 కోట్ల మంది ఈ వీడియోను వీక్షించారు. యూట్యూబ్‌లో  అత్యధిక మంది వీక్షించిన పాట ఇదే.

అయితే ఈ వీడియోపై హ్యాకర్ల కన్నేశారు. వెవో యూట్యూబ్‌ అకౌంట్‌ను హ్యాక్‌ చేసి ఆ పాట ఒరిజినల్‌ థంబ్‌ నెయిల్‌(ఫోటో)ను.. సాంగ్‌ టైటిల్‌ను మార్చిపడేయటంతో డెస్పాసిటో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. కాసేపటికే ఆ ఒరిజినల్‌ ట్రాక్‌ యూట్యూబ్‌లోంచి మాయం కావటం గమనార్హం. అయితే డిలీట్‌ చేసింది ఎవరన్న దానిపై స్పష్టత లేదు. 

కాగా, సంచలనం సృష్టించిన గంగ్నమ్‌ స్టైల్‌ పాట తర్వాత మళ్లీ యూట్యూబ్‌లో ఆ స్థాయిలో  ఉర్రూతలు ఊగించింది డెస్సాసిటోనే. ఒరిజినల్‌ సాంగ్‌ స్పానిష్‌, ఇంగ్లీష్‌ లిరిక్స్‌తో రూపుదిద్దుకుంది. తెలుగులో నటుడు నోయల్‌ ఈ పాటను రిమేక్‌ చేయగా.. ఆ ప్రయత్నం ఆకట్టుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement