Despacito
-
క్రేజీ పాటను హ్యాక్ చేసేశారు
ఈ మధ్య హ్యాకర్లు దేన్నీ వదలటం లేదు. పాప్ సింగర్స్ కమ్ కంపోజర్స్ లూయిస్ ఫోన్సీ, డాడీ యాంకీలు చేసిన ‘డెస్పాసిటో’ ఆల్బమ్ ప్రపంచాన్ని ఉర్రూత లూగించిన విషయం తెలిసిందే. చాలా మంది ఆ ఆల్బమ్‌ను కాపీ కొట్టేసి సొమ్ము చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోను దాదాపు 500 కోట్ల మంది ఈ వీడియోను వీక్షించారు. యూట్యూబ్‌లో అత్యధిక మంది వీక్షించిన పాట ఇదే. అయితే ఈ వీడియోపై హ్యాకర్ల కన్నేశారు. వెవో యూట్యూబ్ అకౌంట్‌ను హ్యాక్ చేసి ఆ పాట ఒరిజినల్ థంబ్ నెయిల్(ఫోటో)ను.. సాంగ్ టైటిల్‌ను మార్చిపడేయటంతో డెస్పాసిటో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. కాసేపటికే ఆ ఒరిజినల్ ట్రాక్ యూట్యూబ్లోంచి మాయం కావటం గమనార్హం. అయితే డిలీట్ చేసింది ఎవరన్న దానిపై స్పష్టత లేదు. కాగా, సంచలనం సృష్టించిన గంగ్నమ్ స్టైల్ పాట తర్వాత మళ్లీ యూట్యూబ్‌లో ఆ స్థాయిలో ఉర్రూతలు ఊగించింది డెస్సాసిటోనే. ఒరిజినల్ సాంగ్ స్పానిష్, ఇంగ్లీష్ లిరిక్స్‌తో రూపుదిద్దుకుంది. తెలుగులో నటుడు నోయల్ ఈ పాటను రిమేక్ చేయగా.. ఆ ప్రయత్నం ఆకట్టుకుంది. -
‘డెస్పాసిటో ’ పాటకి ఫ్యాన్స్ ఫిదా!
-
493 కోట్ల హిట్స్ వచ్చిన పాట.. తెలుగులో..!
సాక్షి, హైదరాబాద్ : గంగ్నమ్ స్టైల్ పాట మీరు వినే ఉంటారు కదూ. ఆ పాట ప్రపంచాన్ని ఎంతగా ఉర్రూతలు ఊగించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్లీ అదే స్థాయిలో యూట్యూబ్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న పాట ‘డెస్పాసిటో’.. స్పానిష్, ఇంగ్లీష్ లిరిక్స్‌తో రూపుదిద్దుకున్న ఈ పాటను తెలుగు రిమేక్ చేశారంటే అది ఎంతలా ప్రపంచాన్ని ఆకట్టుకుంటుందో అర్థం అవుతుంది. ప్యూర్టోరికో దేశానికి చెందిన ప్రముఖ సింగర్ లూయిస్ ఫోన్సీ, డాడీ యాంకీలు డెస్పాసిటోను కంపోజ్ చేశారు. 2017లో విడుదలైన ఈ పాట కేవలం 16 వారాల్లో యూట్యూబ్‌లో 493 కోట్ల మందికి పైగా వీక్షించారు. ఇంత తక్కువ సమయంలో అత్యధిక మంది వీక్షించిన పాట ఇదే. డెస్పాసిటోతో ఇంప్రెస్ అయిన గాయకుడు నోయల్ సీన్, గాయని ఎస్తర్ నొరాహాలు కలసి తెలుగులో ఈ పాటను పాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను నోయల్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. డెస్పాసిటో ప్రేమలో పడ్డా నీతో అని సాగే పాట అద్భుతంగా ఉంది. అయితే, ఒరిజినల్ పాటకు నోయల్ కంపోజ్ చేసిన పాటకు తేడా ఉంది. ఒరిజినల్‌ను కాపీ చేయకుండా నోయల్ చేసిన ప్రయత్నం ఆకట్టుకుంటోంది. లిరిక్స్ కూడా వినడానికి చక్కగా ఉన్నాయి. ఇప్పటివరకూ ఈ పాటకు యూట్యూబ్‌లో 40 వేల పైచిలుకు వీక్షించారు.