Copyright issue
-
చాట్‌జీపీటీ చెప్పిందని కోర్టు మెట్లక్కిన దిగ్గజ కంపెనీ.. చివరికి ఏమైందంటే
ఓ కేసు విచారణ నిమిత్తం ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ చాట్‌జీపీటీ ఇచ్చిన ఆధారాల్ని పరిగణలోకి తీసుకొని తీర్పు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఇంతకీ ఆ కేసు ఏంటి? చాట్‌జీపీటీ ఇచ్చిన ఆధారాలేంటి? పలు నివేదికల ప్రకారం.. ఇటీవల ఫ్రాన్స్ లగ్జరీ షూ తయారీ సంస్థ క్రిస్టియన్ లౌబౌటిన్.. భారత్‌లోని ఢిల్లీ కేంద్రంగా షుటిక్ అనే కంపెనీ కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా షూ’లను తయారు చేసి అమ్మకాలు నిర్వహిస్తుంది. ఇప్పుడు షుటిక్‌పై క్రిస్టియన్ లౌబౌటిన్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. తమ సంస్థ కొన్ని షూ డిజైన్లు తమకే చెందుతాయంటూ ట్రేడ్‌మార్క్ తీసుకుందని, ఇందుకోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కోర్టుకు వివరించింది. అయితే, షుటిక్ తమ ట్రేడ్ మార్క్ షూ డిజైన్లను కాపీ కొట్టిందని, ఇదే విషయాన్ని చాట్‌జీపీటీ చెప్పినట్లు ఆధారాలు సమర్పించింది. తమకు న్యాయం చేయాలని విన్నవించుకుంది. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కోర్టు.. న్యాయస్థానంలో చట్టపరమైన లేదా వాస్తవిక సమస్యల పరిష్కారానికి చాట్‌జీపీటీ ఇచ్చిన ఆధారాలు సరిపోవని కోర్టు పేర్కొంది. ఏఐ చాట్బాట్ల ప్రతిస్పందనలు, కల్పితాలు, ఊహాజనిత డేటా మొదలైన వాటికి అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇరు పక్షాల వాదనలను విన్న కోర్టు.. ప్రతివాది ఉద్దేశపూర్వకంగా మనీ సంపాదనకు ట్రేడ్ మార్క్ నిబంధనలను ఉల్లంఘించారని అర్థమవుతుందని తెలిపింది. ఇకపై బూట్ల డిజైన్లు, రంగులు కాపీ చేయరాదని, ఆ ఒప్పందం ఉల్లంఘిస్తే రూ.25 లక్షలు జరిమాన చెల్లించాల్సి వస్తుందని ప్రతివాదిని హెచ్చరించింది. ప్రస్తుతం, పిటిషనర్ ఖర్చుల కింద వాదికి రూ.2 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. చదవండి👉 ‘ఆ AI టూల్‌ను షట్‌డౌన్ చేస్తున్నాం’.. చాట్‌జీపీటీ సృష్టికర్త సంచలన ప్రకటన! -
నా పాట కాపీ కోటేసారు...
-
వివాదంలో కరణ్ జోహార్ లేటెస్ట్ మూవీ, నిర్మాతపై వరుస ఆరోపణలు
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ‘కరణ్ నా స్క్రిప్ట్ దొంగలించాడు’ అని ఓ రచయిత, ‘నా పాటను కాపీ కొంటాడు’ అని ఓ పాకిస్తాన్ సింగర్ ఆయనపై ఆరోపణలు చేశారు. కాగా కరణ్ జోహార్‌అప్‌కమింగ్ మూవీ ‘జగ్ జుగ్ జీయో’. ఇందులో వరుణ్ ధావన్, కియారా అద్వాని హీరోయిన్లు కాగా నీతూ కపూర్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచి దీనిపై సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ అయ్యింది. చదవండి: సినీనటుడు ఆలీ సడన్ సర్ప్రైజ్.. ఎవరికీ చెప్పకుండా.. ఈ నేపథ్యంలో నిన్న(మే 22న) ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. అప్పటి నుంచి ఈ సినిమాను వివాదాలు చూట్టుముడుతున్నాయి. తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్ తనది అంటూ విశాల్ సింగ్ అనే ఓ రచయిత వరుస ట్వీట్స్ చేశాడు. ‘కరణ్ తెరకెక్కిస్తున్న జగ్ జుగ్ జీయో కథను ‘బన్నీరాణి’ పేరుతో జనవరి 2020లో రిజిస్టర్ చేసుకున్నాను. ఫిబ్రవరి 2022లో ధర్మప్రోడక్షన్‌కు ఈ కథ మెయిల్ చేసి మీతో కలిసి ఈ సినిమాను నిర్మించాలనుకుంటున్నాను నాకు ఒక చాన్స్ ఇవ్వాలని కోరాను. దీనికి ధర్మ ప్రొడక్షన్ నుంచి కూడా నాకు సమాధానం వచ్చింది. కానీ, తీరా నా కథను జగ్ జుగ్ జీయో పేరుతో తెరకెక్కించారు. మాట ఇచ్చి ఇలా మోసం చేయడం కరెక్ట్ కాదు కరణ్ జోహార్ గారు’ అంటూ అతడు మొదట ట్వీట్ చేశాడు. Screenshot of my mail to @DharmaMovies dated 17.02.2020. An official complaint will follow.@karanjohar @somenmishra0 @jun6lee #JugJuggJeeyo#BunnyRani@Varun_dvn @AnilKapoor @raj_a_mehta pic.twitter.com/k7WV4kvK2a — Vishal A. Singh (@Vishal_FilmBuff) May 22, 2022 చదవండి: క్యాన్సర్ చికిత్స అనుభవాన్ని పంచుకున్న నటి ఆ తర్వాత ధర్మ ప్రొడక్ష్‌న్‌కు అతడు చేసిన స్క్రిప్ట్ మెయిల్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను షేర్ చేశాడు. అనంతరం తనకు మద్దతు ఇవ్వాలని, ఏది నిజం ఏది అబద్ధమో తెలుసుకోవాలంటూ వరుస ట్వీట్ చేస్తూ కరణ్‌పై విమర్శలు గుప్పించాడు. ఈ సందర్భంగా కరణ్ జోహార్, అతని నిర్మాణ సంస్థ, ఇతర నిర్మాతలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని, వారిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని అతడు తెలిపాడు. మరోవైపు కరణ్ జోహార్ తన లేటెస్ట్ మూవీలో తన పాటకు కాపీ చేశారని పాకిస్తాన్ సింగర్ ఆరోపించాడు. సింగర్ అబ్రార్ ఊ హాకు గాయకుడు నిజానికి ‘జగ్ జుగ్ జీయో’లోని నాచ్ పంజాబన్ అనే పాట తనదని, ఈ పాటను ఆయన కాపీ చేశారని పేర్కొన్నాడు. కాగా చిత్రాన్ని రాజ్ మెహతా దర్శకత్వంలో ధర్మ ప్రొడక్షన్, వయాడాట్ 18 సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. If this would have been for publicity..would have given statements to all publications that contacted me today. Chose to lay down the facts in public and let you all decide what is right and what is wrong? सच और साहस हो जिसके मन में अंत में जीत उसी की रहे!https://t.co/n1f8MW3VqT — Vishal A. Singh (@Vishal_FilmBuff) May 22, 2022 Outcome of this matter will be a strong comment on the power of @swaindiaorg? If #HindiCinema industry has to flourish... @swaindiaorg has to be a strong body. Hope it's taking note of this matter..and ideally should act suo moto. Being a member..am bound to register a complaint. — Vishal A. Singh (@Vishal_FilmBuff) May 22, 2022 -
‘ప్రపంచ నకిలీ మార్కెట్ల జాబితా 2021’ విడుదల.. అన్నీ నకిలీ ఉత్పత్తులే!
వాషింగ్టన్: కాపీరైట్ల ఉల్లంఘన, నకిలీ ఉత్పత్తులకు పేరొందిన మార్కెట్ల జాబితాలో భారత్‌కు చెందిన బీటుబీ ఈ కామర్స్ పోర్టల్ ఇండియమార్ట్.కామ్‌ను యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ తన తాజా జాబితాలోకి చేర్చింది. భారత్ నుంచి మరో నాలుగు మార్కెట్లు.. ముంబైలోని హీరా పన్నా, ఢిల్లీలోని ట్యాంక్ రోడ్, పాలికా బజార్, కోల్‌కతాలోని కిడ్డర్‌పోర్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ‘ప్రపంచ నకిలీ మార్కెట్ల జాబితా 2021’ను యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్) గురువారం విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 42 ఆన్లైన్, 35 భౌతిక మార్కెట్లకు ఇందులో చోటు కల్పించింది. ఇవన్నీ పెద్ద ఎత్తున నకిలీ ట్రేడ్‌మార్క్‌లు, కాపీరైట్ హక్కుల ఉల్లంఘనకు వీలు కల్పిస్తున్నట్టు నివేదిక పేర్కొంది. ‘‘నకిలీ, పైరేటెడ్ ఉత్పత్తులకు (కాపీరైట్ ఉన్న వాటికి నకిలీలు) సంబంధించి అంతర్జాతీయంగా నడుస్తున్న వాణిజ్యం అమెరికా ఆవిష్కరణలు, సృజనాత్మకతను దెబ్బతీస్తోంది. అమెరికా కార్మికులకు నష్టం కలిగిస్తోంది. ఈ చట్ట విరుద్ధమైన వ్యాపారం పెరగడం వల్ల నకిలీ ఉత్పత్తుల తయారీలో పాలు పంచుకునే కార్మికులను దోచుకునే విధానాలకు దారితీస్తుంది. నకిలీ ఉత్పత్తులు వినియోగదారులు, కార్మికుల ఆరోగ్యం, భద్రతకు పెద్ద ముప్పు’’ అని యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ క్యాథరిన్ టే అన్నారు. పెద్ద మొత్తంలో నకిలీలు.. యూఎస్టీఆర్ నివేదిక ప్రకారం.. ‘‘కొనుగోలుదారులు, సరఫరాదారులను అనుసంధానం చేస్తూ, ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆన్లైన్ బిజినెస్ టు బిజినెస్ (బీటుబీ) మార్కెట్‌గా చెప్పుకునే ఇండి యామార్ట్లో, పెద్ద మొత్తంలో నకిలీ ఉత్పత్తులు గుర్తించాం. నకిలీ ఫార్మాస్యూటికల్, ఎలక్ట్రానిక్, వస్త్రాలు కూడా ఉన్నాయి. నకిలీ ఉత్పత్తులను ఏరిపారేయడానికి మెరుగైన విధానాలను ఇండియా మార్ట్ అమలు చేయకపోవడం పట్ల హక్కుదారులు ఆందోళన చెందుతున్నారు. విక్రయదారును నిర్ధారించుకోవడం, నకిలీ ఉత్పత్తుల విక్రయదారులకు జరిమానాలు విధించడం, సరైన పర్యవేక్షణ చేయలేకపోతున్నట్టు’’ పేర్కొంది. ముంబైలోని హీరపన్నా మార్కెట్లో నకిలీ వాచ్‌లు, పాదరక్షలు, యాక్సెసరీలు, కాస్మొటిక్స్ విక్రయమవుతున్నట్టు తెలిపింది. ‘ఫ్యాన్సీ మార్కెట్’గా పేర్కొందిన కిడ్డర్‌పోర్ (కోల్‌కతా) నకిలీ బ్రాండ్ల వస్త్రాలు, కాస్మొటిక్స్‌కు కేంద్రంగా ఉన్నట్టు పేర్కొంది. వీటితో చర్మ సంబంధిత సమస్యలు, కంటి సమస్యలు వస్తున్నట్టు వెల్లడించింది. ఇక ఢిల్లీలోని అండర్‌గ్రౌండ్ మార్కెట్ పాలికా బజార్ 2021 జాబితాలోనూ ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. ఇక్కడ మొబైల్ యాక్సెసరీలు, కాస్మొటిక్స్, వాచ్‌లు, కళ్లద్దాల నకిలీ ఉత్పత్తులను అమ్ముతున్నట్టు తెలిపింది. ట్యాంక్రోడ్ హోల్‌సేల్ మార్కెట్ వస్త్రాలు, పాదరక్షలు, వాచ్‌లు, హ్యాండ్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్స్, సౌందర్య ఉత్పత్తులకు కేంద్రంగా ఉన్నట్టు పేర్కొంది. -
గూగుల్‌కు షాక్: ఫ్రాన్స్ భారీ జరిమానా
సెర్చింగ్ దిగ్గజం గూగుల్‌కు భారీ షాక్ తగిలింది. గూగుల్ న్యూస్ విషయంలో కాపీరైట్ నిబంధనల ఉల్లంఘన కింద భారీ జరిమానా విధించింది ఫ్రాన్స్. ప్యారిస్: ఫ్రాన్స్ కాంపిటీషన్ రెగ్యులేటర్ మంగళవారం గూగుల్(ఆల్ఫాబెట్స్ గూగుల్)కు భారీ జరిమానా విధించింది. ఈయూ కాపీరైట్స్ నిబంధనల ప్రకారం.. స్థానిక మీడియా హౌజ్‌ల కంటెంట్‌ను నిబంధనలకు విరుద్ధంగా గూగుల్‌న్యూస్ వాడుకుంటోందని పేర్కొంటూ 500 మిలియన్ యూరోలను ఫైన్ విధించింది. మన కరెన్సీలో ఆ జరిమానా విలువ రూ.4,415 కోట్లకు పైనే. గూగుల్ న్యూస్‌లో తమ వెబ్సైట్లకు చెందిన కంటెంట్‌ను అనుమతి లేకుండా చూపించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొన్ని న్యూస్ ఏజెన్సీలు గతంలో ఫ్రాన్స్ కాంపిటీషన్ రెగ్యులేటర్‌ను ఆశ్రయించాయి. ఈ మేరకు మీడియా హౌజ్‌లతో సంప్రదింపులు జరపాలని గూగుల్‌కు తెలిపినప్పటికీ.. గూగుల్ నిర్లక్క్ష్యం వహించడంతో యాంటీట్రస్ట్ రెగ్యులేటర్స్ కింద ఇప్పుడు ఈ భారీ జరిమాను విధించింది. అంతేకాదు కాపీరైటెడ్ కంటెంట్‌ను వాడుకుంటున్నందుకు మీడియా పబ్లిషర్లకు రెమ్యునరేషన్ చెల్లించాలని, లేని పక్షంలో రోజుకు 9 లక్షల యూరోలను అదనంగా ఏజెన్సీలకు పరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. -
బాలీవుడ్ నటి కంగనాపై కాపీరైట్ కేసు
ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై కాపీరైట్ కేసు నమోదు చేయాలంటూ ముంబైలోని ఓ కోర్టు పోలీసులను శుక్రవారం ఆదేశించింది. ‘దిద్దా: వారియర్ క్వీన్ ఆఫ్ కశ్మీర్’ అనే పుస్తక రచయిత ఆశిష్ కౌల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. దిద్దా కథకు సంబంధించి తనకు పూర్తి హక్కులు ఉన్నాయని చెప్పారు. అలాంటి కథను సామాజిక కార్యకర్తగా మారిన ఓ నటి గ్రంథ చౌర్యం చేయడం ఏమైనా సమంసంగా ఉందా? అంటూ కంగనాను ఆశిష్ ప్రశ్నించారు. ఈ పుస్తకం హిందీలోకి కూడా అనువాదమైంది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసే పనిలో ఉన్నారు. సినిమాల విషయనికి వస్తే.. తమిళనాడు దివంగత సీఎం జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘తలైవి’లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. తన తదుపరి చిత్రంలో కంగనా భారత తొలి మహిళ ప్రధాన మంత్రి, ఉక్కు మహిళగా(ఐరన్ లేడీ) పేరొందిన ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్నారు. చదవండి: జాతిపితపై కంగనా సంచలన వ్యాఖ్యలు -
‘కాపీ కొట్టినట్లు ఆధారం ఏమిటి?’
మెప్పుల కోసం గొప్పలు చెప్పుకోవడం ఎవరి పేటెంట్ హక్కూ కాదని మద్రాస్ హై కోర్టు తీర్పు ఇచ్చింది. రెండు పెద్ద కంపెనీల మసాలా గొడవ ఇది. 2013 నుంచీ సాగుతోంది. ఐ.టి.సి. కంపెనీ ‘ఇప్పీ’ నూడుల్స్ ప్యాకెట్ మీద ‘మేజిక్ మసాలా’ అని ఉంటుంది. నెస్లే కంపెనీ మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్ మీద ‘మేజికల్ మసాలా’ అని ఉంటుంది. ఈ కారణంగానే నెస్లే మీద ఐ.టి.సి. కేసు వేసింది. తమ ‘మేజిక్’ నే ‘మేజికల్’గా నెస్లే కాపీ కొట్టిందని ఐ.టి.సి ఆరోపణ. ‘కాపీ కొట్టినట్లు ఆధారం ఏమిటి?’ అనే వాదనకు ‘మేము మేజిక్ అని పెట్టిన మూడేళ్లకు వాళ్లు మేజికల్ అని పెట్టుకున్నారు’ అని తన వాదన వినిపించింది. కోర్టుకు ఆ వాదన సంతృప్తికరంగా అనిపించలేదు. ‘మేజిక్ మసాలా, మేజికల్ మసాలా అని చెప్పుకొనే గొప్పలపై ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదని అంటూ కేసును కొట్టేసింది. బిజినెస్ అన్నాక కాపీలు తప్పవు. కోర్టు వెళ్లడం కన్నా కొత్తదారిలోకి వెళ్లడం కొన్నిసార్లు లాభదాయకంగా ఉంటుంది. కానీ.. పెద్ద కంపెనీలు కదా.. తాడో పేడో అనుకుంటాయి.(కాలక్షేపం కోసం వీటిని తినేస్తున్నారు..) చదవండి: 'ఇది తయారు చేసినవాడిని చంపేస్తా’ -
భారతీయులను ఇష్టపడను.. వెళ్లిపోండి!
సిడ్నీ : భారత అభిమానులపై మాజీ రేసర్, అడల్ట్ స్టార్ రెనీ గ్రేసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనుమతి లేకుండా భారత అభిమానులు తన ఫొటోలను, వీడియోలను వినియోగిస్తున్నారని ఆమె ఆరోపించారు. అలాగే సోషల్ మీడియాలో తన పేరిట ఫేక్ పేజీలు సృష్టించి.. అక్రమంగా తన కంటెంట్‌ను అందులో పోస్ట్ చేయవద్దని కోరారు. అది కేవలం తనకు మాత్రమే చెందిన కంటెంట్ అని స్పష్టం చేశారు. ఈ మేరకు అడల్ట్ సబ్స్క్రిషన్ సైట్లో ఓ పోస్ట్ చేశారు. ‘కాపీ రైట్ నిబంధనలు ఉల్లంఘించకండి.. నా పేజీలో పోస్ట్ చేసే ఫొటోలు, వీడియోల హక్కులను నేను మాత్రమే కలిగి ఉన్నాను. మీరు కాదు. నా పేరిట ఫేక్ పేజీలు నడపటం మానుకోండి. చట్ట విరుద్ధంగా నా వీడియోలు, ఫొటోలు షేర్ చేయడం ఆపండి. ప్రస్తుతం నేను భారతీయులను ఇష్టపడటం లేదు. ఒకవేళ మీరు ఇండియన్ అయితే నా పేజీ నుంచి వెంటనే వైదొలగండి. ఇకపై వారిని నా పేజీలో అనుమతించను. నేనే నా పేజీ నుంచి భారతీయులను అందరినీ తొలగించబోతున్నాను’ అని గ్రేసీ పేర్కొన్నారు. అలాగే తన ఫొటోలు షేర్ చేసేవారిపై ఆమె అసభ్య పదజాలన్ని కూడా వాడారు. కాగా, వీ8 సూపర్ కార్స్లో మొదటి ఫుల్ టైం లేడీ రేసర్ రెనీ గ్రేసీ కావడం గమనార్హం. రేసర్‌గా మంచి గుర్తింపు పొందిన గ్రేసీ.. ఆ తర్వాత అడల్ట్ స్టార్‌గా మారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. చాలా కాలంగా రేసర్‌గా ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆమె తెలిపారు. ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చనే అడల్ట్ స్టార్‌గా మారినట్టు చెప్పారు. (బతుకుదెరువు కోసం పోర్న్‌స్టార్‌గా..) -
జూన్ 4న తీర్పు
చెన్నై ,పెరంబూరు: సంగీతదర్శకుడు ఇళయరాజా కాపీరైట్స్ పిటిషన్‌పై తుది తీర్పును జూన్ 4న వెల్లడించనున్నట్లు మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు. సుమారు 1000కి పైగా చిత్రాలకు సంగీతం అందించిన ఇళయరాజా 4,500కు పైగా పాటలకు స్వరపరచారు. ఈయన తన పాటలను తన అనుమతి లేకుండా, కాపీరైట్స్ పొందకుండా సంగీత కచేరీలు వంటి పలు కార్యక్రమాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. కాపీరైట్స్ చట్టం ప్రకారం తన పాటలను వాడుకోవడానికి తనకు సొమ్ము చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ విధంగా 2014లో మలేషియాకు చెందిన అగ్ని మ్యూజిక్, ఏకో రికార్డింగ్, గిరి వర్ధక సంస్థలపై కాపీరైట్స్ కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏకో సంస్థ నిర్వాహకులు మద్రాసు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. అందులో ఇళయరాజా పారితోషికం తీసుకునే సంగీతాన్ని అందిస్తున్నారని, కాబట్టి ఆయనకు కాపీరైట్స్ ఉండవని, చిత్ర నిర్మాతలకే ఆ రైట్స్ ఉంటాయని వాదించారు. దీంతో ఇళయరాజా కేసును కోర్టు కొట్టివేసింది. దీంతో నిర్మాతలు ఇప్పుడు పాటలకు సంబంధించి కాపీ చట్టం ప్రకారం తమకు వాటా ఉంటుందని కోరుతున్నారు. కాగా ఏకో సంస్థ దాఖలు చేసిన పిటిష¯న్పై విచారించిన న్యాయస్థానం ఇళయరాజా పిటిషన్‌ను కొట్టివేసినా, ఇతర రికార్డింగ్ సంస్థలపై కేసు విచారణలోనే ఉంది. ఇప్పుడీ కేసుపై తుది తీర్పును జూన్ 4న వెల్లడించనున్నట్లు న్యాయమూర్తి అనితా సుమంత్ తెలిపారు. బుధవారం నుంచి వేసవి సెలవులు మొదలు కావడంతో ఇప్పుడు తీర్పును వెల్లడించలేమని న్యాయమూర్తి పేర్కొన్నారు. -
‘రంగస్థలం’ క్లైమాక్స్ వివాదం..సుకుమార్ క్లారిటీ
రంగస్థలం సినిమాను ఇటు మెగా అభిమానులే కాదు...అటు తెలుగు ప్రేక్షకులు కూడా మర్చిపోలేరు. సుకుమార్ సృజనాత్మకతకు రంగస్థలం నిదర్శనం. కథను చెప్పిన విధానం, ప్రేక్షకులు మెచ్చేలా తీసిన విధానం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. చరణ్ అద్భుత నటన, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, సుకుమార్ డైరెక్షన్ ఈ సినిమాను ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేశాయి. రంగస్థలం కాన్సెప్ట్ తనదేనంటూ,తన కథను కాపీ కొట్టారంటూ గాంధీ అనే వ్యక్తి రచయితల సంఘంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సుకుమార్‌ను వివరణ ఇవ్వాల్సిందిగా రచయితలగా సంఘం కోరగా... తాను గానీ , తన బృందంలోని సభ్యులు గానీ గాంధీ అనే వ్యక్తిని అసలు కలుసుకోలేదనీ చెప్పాడు. ఉరిశిక్ష పడ్డ వ్యక్తి పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఉరి తీస్తారనీ, ఆ లైన్‌తోనే తాను క్లైమాక్స్‌ను రాసుకున్నానని తెలిపారు. తాను చిన్నప్పుడు ధర్మ యుద్దం సినిమా చూసినప్పటి నుంచీ తనలో ఆ పాయింట్ గుర్తుండిపోయిందనీ, అంతేకాకుండా సిడ్నీ షెల్డన్ రాసిన ఎ స్ట్రేంజర్ ఇన్ ది మిర్రర్, బాలీవుడ్ మూవీ అంజామ్‌లో కూడా ఇదే లైన్ ఉంటుందనీ వివరించారు. అయితే తాను ఎంచుకున్న ఈ లైన్‌కు తనదైన పద్దతిలో కథ, కథనాన్ని రచించానంటూ వివరణ ఇచ్చాడు. ఓ సినిమా వివాదాలు లేకుండా ఈ మధ్య కాలంలో గట్టెక్కితే ఆశ్చర్యం కలగక మానదు. ఈ సినిమాలో రంగమ్మ మంగమ్మ పాటలో ఓ పదం ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందనడంతో ఆ పదాన్నితొలిగించేశారు. భరత్ అనే నేను సినిమా కథను కొరటాల శివ ఓ రచయిత దగ్గరి నుంచి కొన్నాడని, అది వేరే ఓ హీరో కోసం రెడీ చేసిన కథ అంటూ వివాదాలు వచ్చాయి. తర్వాత కొరటాల వీటిపై క్లారిటీ ఇచ్చేశాడు. మహానటిపై ఎలాంటి వివాదాలు లేవు అనుకునే సమయానికి.. జెమినీ గణేశన్ పాత్రను తక్కువ చేసి చూపారనీ, నెగిటివ్‌గా చూపారనీ విమర్శలు వచ్చాయి. -
క్రేజీ పాటను హ్యాక్ చేసేశారు
ఈ మధ్య హ్యాకర్లు దేన్నీ వదలటం లేదు. పాప్ సింగర్స్ కమ్ కంపోజర్స్ లూయిస్ ఫోన్సీ, డాడీ యాంకీలు చేసిన ‘డెస్పాసిటో’ ఆల్బమ్ ప్రపంచాన్ని ఉర్రూత లూగించిన విషయం తెలిసిందే. చాలా మంది ఆ ఆల్బమ్‌ను కాపీ కొట్టేసి సొమ్ము చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోను దాదాపు 500 కోట్ల మంది ఈ వీడియోను వీక్షించారు. యూట్యూబ్‌లో అత్యధిక మంది వీక్షించిన పాట ఇదే. అయితే ఈ వీడియోపై హ్యాకర్ల కన్నేశారు. వెవో యూట్యూబ్ అకౌంట్‌ను హ్యాక్ చేసి ఆ పాట ఒరిజినల్ థంబ్ నెయిల్(ఫోటో)ను.. సాంగ్ టైటిల్‌ను మార్చిపడేయటంతో డెస్పాసిటో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. కాసేపటికే ఆ ఒరిజినల్ ట్రాక్ యూట్యూబ్లోంచి మాయం కావటం గమనార్హం. అయితే డిలీట్ చేసింది ఎవరన్న దానిపై స్పష్టత లేదు. కాగా, సంచలనం సృష్టించిన గంగ్నమ్ స్టైల్ పాట తర్వాత మళ్లీ యూట్యూబ్‌లో ఆ స్థాయిలో ఉర్రూతలు ఊగించింది డెస్సాసిటోనే. ఒరిజినల్ సాంగ్ స్పానిష్, ఇంగ్లీష్ లిరిక్స్‌తో రూపుదిద్దుకుంది. తెలుగులో నటుడు నోయల్ ఈ పాటను రిమేక్ చేయగా.. ఆ ప్రయత్నం ఆకట్టుకుంది. -
చిక్కుల్లో 'అజ్ఞాతవాసి'
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైపోయింది. ఈ నెల 10 న ప్రపంచవ్యాప్తంగా అజ్ఞాతవాసి విడుదల కాబోతోంది. తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న పవన్ అభిమానులను ఓ వార్త కలవరపెడుతోంది. ‘అజ్ఞాతవాసి’ కాపీరైట్ వివాదం చుట్టుముట్టిందని, ఈ మేరకు బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి-సిరీస్ నుంచి నోటీసులు కూడా అందాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు. 2008లో వచ్చిన ‘లార్గో వించ్’ కు ‘అజ్ఞాతవాసి’ కాపీ అని చెప్పుకుంటున్నారు. ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన 'లార్గో వించ్' సూపర్ హిట్ అయింది. దీంతో హిందీలో రీమేక్ చేయడానికి టీ సిరీస్ రైట్స్ సొంతం చేసుకుంది. ఇపుడు ఈ సినిమాకు అజ్ఞాత వాసి కాపీ అనే టాక్ రావడంతో అలెర్ట్ అయిన టీ సిరీస్ సంస్థ ‘అజ్ఞాతవాసి’ దర్శక నిర్మాతలకు నోటీసులు పంపిందని టాలీవుడ్ వర్గాల్లో వార్త హల్ చల్ చేస్తోంది. అయితే ఈ వివాదంపై నిర్మాత చినబాబు కానీ, దర్శకుడు త్రివిక్రమ్ కానీ స్పందించలేదు. అసలు ఈ వార్త ఎంతవరకు నిజమో కూడా తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ విషయంపై టీసిరీస్ కూడా ఎక్కడా అధికారంగా వెల్లడించలేదు. మరో వారంలో విడుదల కాబోతున్న ‘అజ్ఞాతవాసి’ కి తాజావివాదం కలం కలం రేపుతోంది. -
'హ్యాపీ బర్త్ డే..' ఇక అందరిదీ!
- పాట అందరిది.. ఏ ఒక్కరికో హక్కులు ఉండబోవన్న ఫెడరల్ కోర్టు - బర్త్ డే సాంగ్ పేటెంట్‌పై వివాదానికి తెర కాలిఫోర్నియా: ఏళ్లుగా కొనసాగుతున్న వివాదానికి తెరపడింది. పుట్టినరోజు పాటపై పట్టువిడుపులకు పోవద్దని, ఇప్పటికే విశ్వజనీనమైన ఈ పాట అందరికీ చెందిందని, ఏ ఒక్కరికో దీనిపై హక్కులు కల్పించలేమని అమెరికాలోని సెంట్రల్ కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టు తీర్పు చెప్పింది. అంతేకాదు.. 'హ్యాపీ బర్త్ డే టు యు' అనే పాటకు ఇకపై రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అమెరికాకే చెందిన వార్నర్- చాపెల్ మ్యూజిక్ కంపెనీ ఇప్పటివరకు ఈ పాటపై రాయల్టీ పొందుతూ వస్తున్న సంగతి తెలిసిందే. కాగా బర్త్ డే సాంగ్ పై హక్కును నిరసిస్తూ వార్నర్ సంస్థకు వ్యతిరేకంగా పోరాడింది ఓ మహిళ కావటం గమనార్హం. బర్త్ డే సాంగ్ ను ఎవరు రాశారు? ఎప్పటి నుంచి ఇది వాడుకలోకి వచ్చింది? తదితర వివరాలను పొందుపరుస్తూ జెన్నీఫర్ నెల్సన్ అనే మహిళా దర్శకురాలు ఓ డాక్యుమెంటరీ తీశారు. ఆ డాక్యుమెంటరీలోనూ బర్త్ డే సాంగ్ ఉండటంతో రాయల్టీ చెల్లించాల్సిందేనని వార్నర్ సంస్థ డిమాండ్ చేసింది. 'అదేంటి పాట చరిత్రను వెలికితీసినా రాయల్టీ కట్టాల్సిందేనా!' అని వాపోయిన జెన్నీఫర్.. వార్నర్ సంస్థ తీరును నిరసిస్తూ కోర్టును ఆశ్రయించింది. వార్నర్ కు వ్యతిరేకంగా మరి కొందరూ వాదులుగా చేరారు. విచారణ చేపట్టిన కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఇదీ పుట్టినరోజు పాట నేపథ్యం గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం 'హ్యాపీ బర్త్ డే టూ యూ'.. ఇంగ్లీష్ లో మోస్ట్ పాపులర్ సాంగ్. అమెరికాకు చెందిన పాటీ హిల్, మిల్డెడ్ అనే సొదరీమణులు 1893లో ఈ పాటను రాసి, ట్యూన్ చేసినట్లు ఆధారాలున్నాయి. కిండర్ గార్డెన్ బోధకురాలైన పాటీ.. పియానో విధ్వాంసురాలైన తన సోదరి మిల్డెడ్ తో కలిసి.. పిల్లలకు సులభంగా అర్థమయ్యే, నేర్చుకోగలిగే పాటలను రూపొందించేవారు. ఆ క్రమంలో రూపొందించిన 'గుడ్ మార్నింగ్ టు ఆల్' ట్యూన్ నుంచి 'హ్యాపీ బర్త్ డే టు యు' పుట్టింది. 1912లో మొదటిసారి ఈ పాట అచ్చయింది. తర్వాతి కాలంతో సమ్మీ సంస్థ ఈ పాటపై కాపీరైట్ (1935లో) సాధించింది. 1990లో వార్నర్ బ్రదర్స్ కు చెందిన వార్నర్- చాపెల్ మ్యూజిక్ కంపెనీ.. 15 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 100 కోట్లు) చెల్లించి 2030 వరకు హ్యాపీ బర్త్ డే పాటపై హక్కులు పొందింది. కాగా జెన్నీఫర్ లారెన్స్ పోరాటంతో బర్త్ డే పాట అందరి సొంతమైనట్లయింది.