చిక్కుల్లో 'అజ్ఞాతవాసి' | Pawan Kalyan Agnyaathavaasi in copyright row | Sakshi
Sakshi News home page

చిక్కుల్లో 'అజ్ఞాతవాసి'

Published Tue, Jan 2 2018 2:07 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Pawan Kalyan’s Agnyaathavaasi in copyright row - Sakshi

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైపోయింది. ఈ నెల 10 న ప్రపంచవ్యాప్తంగా అజ్ఞాతవాసి విడుదల కాబోతోంది. తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న పవన్‌ అభిమానులను ఓ వార్త కలవరపెడుతోంది. ‘అజ్ఞాతవాసి’  కాపీరైట్ వివాదం చుట్టుముట్టిందని, ఈ మేరకు బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి-సిరీస్ నుంచి నోటీసులు కూడా అందాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఫ్యాన్స్‌ షాక్‌కు గురవుతున్నారు.  

2008లో వచ్చిన ‘లార్గో వించ్’  కు ‘అజ్ఞాతవాసి’  కాపీ అని చెప్పుకుంటున్నారు. ఫ్రెంచ్‌ యాక్షన్‌ థ్రిల్లర్ గా వచ్చిన 'లార్గో వించ్‌' సూపర్‌ హిట్‌ అయింది. దీంతో హిందీలో రీమేక్‌ చేయడానికి టీ సిరీస్‌ రైట్స్‌ సొంతం చేసుకుంది. ఇపుడు ఈ సినిమాకు అజ్ఞాత వాసి కాపీ అనే టాక్‌ రావడంతో అలెర్ట్‌ అయిన టీ సిరీస్‌ సంస్థ  ‘అజ్ఞాతవాసి’  దర్శక నిర్మాతలకు నోటీసులు పంపిందని టాలీవుడ్‌ వర్గాల్లో వార్త హల్‌ చల్‌ చేస్తోంది. 
 
అయితే ఈ వివాదంపై నిర్మాత చినబాబు కానీ, దర్శకుడు త్రివిక్రమ్ కానీ స్పందించలేదు. అసలు ఈ వార్త ఎంతవరకు నిజమో కూడా తెలియాల్సి ఉంది.  మరోవైపు ఈ విషయంపై టీసిరీస్ కూడా ఎక్కడా అధికారంగా వెల్లడించలేదు. మరో వారంలో విడుదల కాబోతున్న ‘అజ్ఞాతవాసి’ కి  తాజావివాదం కలం కలం రేపుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement