T Series
-
యువరాజ్ సింగ్ బయోపిక్‌పై అధికారిక ప్రకటన
యువరాజ్‌సింగ్ పేరు చెబితే వెంటనే గుర్తుకొచ్చేది ఆరు సిక్స్‌లు.. ఇప్పుడా సీన్‌ను వెండితెరపై మళ్లీ చూసే అవకాశం రానుంది. మొట్టమొదటి టీ20 ప్రపంచకప్ సందర్భంగా 2007 సెప్టెంబర్ 19న ఇంగ్లాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో యవరాజ్‌సింగ్ వీర బాదుడుకి ఇంగ్లాడ్ చేతులెత్తేసింది. స్టువర్ట్ బ్రాడ్ వేసిన 19వ ఓవర్లో మన యూవీ 6 సిక్సర్లు బాదేసి రికార్డ్ క్రియేట్ చేశాడు. 2011 వరల్డ్ కప్ విజయంలో యూవీ పాత్ర చాలా ఎక్కువగానే ఉంది. గ్రౌండ్లో వీరోచితంగా పోరాడే ఈ వీరుడి బయోగ్రఫీ వెండితెరపైకి రానుంది.ఇప్పటికే సచిన్, ధోనీ వంటి క్రికెటర్ల బయోపిక్‌లు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. తాజాగా యువరాజ్ సింగ్ బయోపిక్‌ను నిర్మిస్తున్నట్లు నిర్మాతలు భూషణ్ కుమార్, రవిభాగ్ చందక్ ప్రకటించారు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణసంస్థ టీ సిరీస్ భాగస్వామ్యంతో ఈ చిత్రం రానుంది. త్వరలో పూర్తి వివరాలు ప్రకటిస్తామని వారు చెప్పారు. అయితే, ఇందులో యువరాజ్‌సింగ్ పాత్రలో ఎవరు కనిపిస్తారా..? అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజం చెప్పాలంటే యువరాజ్‌సింగ్ జీవితంలో చాలా వీరోచిత పోరాటాలు ఉన్నాయి. ఫిట్నెస్ కోల్పోయినప్పుడు ఇక యూవీ గుడ్‌బై చెబుతాడని అందరూ భావించన సమయంలో తను సత్తా చాటి మళ్లీ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. క్యాన్సర్‌ను జయించి చాలామందిలో ధైర్యాన్ని నింపాడు. అలా ప్రతీది యూవీ జీవితం ఒక ప్రత్యేకం అని చెప్పవచ్చు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి. -
'యానిమల్' నిర్మాత ఇంట్లో విషాదం.. 20 ఏళ్ల కూతురు మృతి
'యానిమల్' నిర్మాతల్లో ఒకరైనా కృషన్ కుమార్ కుమార్తె కన్నుమూసింది. చాలా చిన్న వయసులోనే అంటే 20 ఏళ్లకే క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించింది. ఈ విషయం తెలిసి ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈయన నిర్మాణ సంస్థ టీ-సిరీస్ కూడా మరణవార్తని ధ్రువీకరించారు.(ఇదీ చదవండి: 'డార్లింగ్' సినిమా రివ్యూ)బాలీవుడ్లోనే బడా నిర్మాణ సంస్థ టీ-సిరీస్. ప్రస్తుతం దీన్ని భూషణ్ కుమార్ చూసుకుంటున్నారు. ఈయనకు చిన్నాన్న కృషన్ కుమార్. ప్రస్తుతం కృషన్.. టీ-సిరీస్ ఛైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. 1995లో 'బేవఫా సనమ్' అనే సినిమాలో నటించిన ఈయన.. ఆ తర్వాత పూర్తిగా నిర్మాణ వ్యవహారాలకే పరిమితమైపోయారు. గతేడాది వచ్చిన 'యానిమల్' నిర్మాతల్లో ఈయన కూడా ఒకరు.ఇకపోతే కృషన్ కుమార్‌కి ఒకే ఒక్క కూతురు త్రిష కుమార్. ప్రస్తుతం ఈమెకు 20 ఏళ్లు. కానీ ఊహించని విధంగా క్యాన్సర్ బారిన పడిన ఈమెకు జర్మనీలో అత్యాధునిక చికిత్స అందించారు. కానీ వైద్యులు ఈమెని కాపాడలేకపోయారు. జూలై 18న త్రిష తుది శ్వాస విడిచింది. మరీ చిన్న వయసులోనే ఇలా క్యాన్సర్‌తో త్రిష చనిపోవడం బాధాకరమైన విషయం!(ఇదీ చదవండి: బాలీవుడ్ మాఫియాకి దెబ్బ మీద దెబ్బ.. షాకిచ్చిన 'కల్కి' మేకర్స్!) -
ప్రపంచంలోనే నంబర్ వన్ యూట్యూబ్ ఛానల్ ఇదే..!
-
వరల్డ్ టాప్ యూట్యూబ్ ఛానెల్ మనదే.. ఏదో తెలుసా?
యూట్యూబ్! వీడియో విభాగంలో ఓ సెన్సేషన్. 2005 ప్రారంభమై ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతోంది. డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌లో గేమ్‌ఛేంజర్‌గా మారిన యూట్యూబ్ లక్షలాది కంటెంట్ క్రియేటర్లకు ఆదాయ వనరుగా మారింది. వారి ఎదుగుదలకూ తోడ్పడుతోంది. సబ్స్క్రైబర్లు, లైక్స్, వ్యూస్ ఆధారంగా డిజిటల్ వరల్డ్‌లో ఏ యూట్యూబ్ ఛానల్ అగ్రస్థానంలో ఉందో గుర్తించవచ్చు. అయితే ఎప్పటిలాగే తొలి టాప్‌టెన్ యూట్యూబ్ ఛానల్స్ వివరాల్ని ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసింది. ప్రపంచంలో మిగిలిన దేశాల యూట్యూబ్ ఛానల్స్‌తో పోలిస్తే భారత్‌కు చెందిన యూట్యూబ్ ఛానల్స్ యూజర్లను ఆకట్టుకోవడంతో సబ్‌స్క్రైబర్ లాయల్టీ పరంగా అగ్రస్థానాన్ని సంపాదించాయి. ఫోర్బ్స్ ఇండియా ప్రకారం..భారత్‌లోని మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ టీ సిరీస్ అగస్థానాన్ని సంపాదించుకుంది. శ్రోతల్ని ఆకట్టుకునే సంగీతంతో పాటు, ఎంటర్టైన్మెంట్ను అందించడంతో ప్రపంచంలో అత్యధికంగా సబ్స్క్రయిబ్ చేసుకున్న టాప్ 10 యూట్యూబ్ ఛానెల్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. టీ సిరీస్ తర్వాత మిగిలిన ఛానల్స్ ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన యూట్యూబ్ ఛానెల్స్ జాబితా ప్రకారం.. టీ-సిరీస్: ప్రపంచంలోనే నంబర్ వన్ యూట్యూబ్ ఛానెల్ 257 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లను కలిగి ఉంది. భారతదేశంలోని అతిపెద్ద మ్యూజిక్ లేబుల్, మూవీ స్టూడియో యాజమాన్యంలో వారి ఛానెల్లో మ్యూజిక్ వీడియోలు, సినిమాలు, ట్రైలర్లతో సహా ఇతర ఎంటర్ టైన్మెంట్ వీడియోల్ని ఇందులో వీక్షించవచ్చు. మిస్టర్ బీస్ట్: జిమ్మీ డొనాల్డ్సన్ అమెరికన్ యూట్యూబర్. మిస్టర్బీస్ట్గా ప్రసిద్ధి చెందారు. సాహసాలూ, వింత స్టంట్లూ చేస్తూ నడుపుతున్న ఈ ఛానల్‌కు సబ్స్క్రైబర్ల సంఖ్య సుమారు 232 మిలియన్లకు పైగా.. ఆదాయం వందల కోట్లే కోకోమెలన్ : ఈ అత్యంత ప్రజాదరణ పొందిన ఛానెల్ 3డీ యానిమేటెడ్ నర్సరీ రైమ్‌లు, పిల్లల పాటల వీడియో కంటెంట్‌ను అందిస్తుంది. ఈ ఛానెల్‌కు 170 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. సెట్ ఇండియా (సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్): భారతదేశంలో సెట్ ఇండియా అధికారిక యూట్యూబ్ ఛానెల్ ఉంది. హిందీలో కంటెంట్‌ను అందిస్తుంది. ఈ ఛానెల్‌కు 167 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. కిడ్స్ డయానా షో: ఆన్లైన్లో కిడ్స్ డయానా షో అని పిలువబడే ఎవా డయానా కిడిస్యుక్. ఆమె, అమె కుటుంబ సభ్యులు కలిసి ఈ ఛానెల్‌ను నిర్వహిస్తున్నారు. 118 మిలియన్ల మంది సబ్‌స్కైబర్లు ఉన్నారు. ప్యూడైపీ : స్వీడిష్ యూట్యూబర్ ఫెలిక్స్ కెజెల్బర్గ్ నిర్వహించే ప్యూడైపీ అత్యంత ప్రజాదరణ పొందిన ఛానెల్‌లలో ఒకటి. ఇందులో 111 మిలియన్ల మంది సబ్‌స్కైబర్లు ఉండగా.. 4,747 వీడియోల్ని అప్లోడ్ చేశారు. లైక్ నాస్త్య: ది లైక్ నాస్త్య యూట్యూబ్ ఛానెల్ అనేది నాస్త్య అనే యువతి, ఆమె కుటుంబ సభ్యులతో పిల్లలకు ఎంటర్టైన్మెంట్ వీడియోల్ని అందిస్తుంటుంది. దీనికి 112 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. వ్లాడ్ అండ్ నికి: ఈ అత్యంత ప్రజాదరణ పొందిన ఛానెల్ ఇద్దరు అన్నదమ్ములు నిర్వహిస్తున్నారు. ఈ ఛానెల్‌కు 108 మిలియన్ల మంది సబ్‌స్కైబర్లు ఉన్నారు. జీ మ్యూజిక్ కంపెనీ: ప్రధానంగా హిందీ ఎంటర్టైన్మెంట్తో పాటు ఆఫర్లతో, జీ మ్యూజిక్ కంపెనీ యూట్యూబ్ ఛానెల్ 104 మిలియన్ల సబ్స్క్రైబర్లను కలిగి ఉంది. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్: డబ్ల్యూడబ్ల్యూఈ యూట్యూబ్ ఛానెల్‌కు 99 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు, 73 వేల వీడియోలు ఉన్నాయి. ఇందులో రెజ్లింగ్ వీడియోల్ని వీక్షించవచ్చు. -
2023 భారీ డిజాస్టర్ సినిమా ఇదే.. రూ. 45 కోట్ల బడ్జెట్‌కు లక్ష మాత్రమే వచ్చింది
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ ఏడాది ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టాయి. నేడు ఇండియన్ సినిమాను ప్రపంచ దేశాలు కూడా దగ్గర చేర్చుకుంటున్నాయి. ఒక సినిమా కోసం నెలల పాటు కష్టపడటమే కాకుండా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. సినిమా బాగుంటే థియేటర్ ప్రేక్షకుల నుంచి వచ్చే డబ్బే కాకుండా శాటిలైట్ హక్కులు, ఓటీటీ రైట్స్ ఇలా పలు రకాలుగా తిరిగి పొందుతారు. అదే సినిమా బాగలేదని టాక్ వస్తే మొదటి రోజు నుంచే ఆ థియేటర్ వైపు వెళ్లరు. దీంతో నిర్మాతకు కోట్ల రూపాయల నష్టం తప్పదు. 2023లో కొన్ని వందల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ - హీరోయిన్ భూమి పెడ్నేకర్ నటించిన 'ది లేడీ కిల్లర్' నవంబర్ 3న విడుదలైంది. ఈ చిత్రం దారుణమైన వసూళ్లను అందుకుంది. బాలీవుడ్లో వీళ్లు అల్లాటప్పా యాక్టర్లు ఏమీ కాదు.. అక్కడ టాప్ రేంజ్లో వారికి గుర్తింపు ఉంది కాబట్టే ఈ సినిమా కోసం రూ. 45 కోట్లు ఖర్చు పెట్టారు.. కానీ నిర్మాతకు ఫైనల్‌గా కేవలం రూ. లక్ష మాత్రమే వచ్చింది. నమ్మలేకున్నా ఇదే నిజం. 2023లో విడుదల అయిన ఇండియన్ చిత్ర పరిశ్రమలోనే అత్యంత దారుణమైన డిజాస్టర్‌గా ఈ సినిమా కలెక్షన్స్ ఉన్నాయి. ఈ చిత్రాన్ని అజయ్ బెహల్ దర్శకత్వం వహించారు. శైలేష్ సింగ్, సాహిల్ మీర్ చందానీ నిర్మించారు. టీ-సీరీస్ వాళ్ల భాగస్వామ్యంతో ఈ సినిమా విడుదలైంది. మొత్తంగా ముంబై, ఢిల్లీ కలిపి 11 స్క్రీన్లలో మాత్రమే విడుదల చేశారు. సినిమా షూటింగులో ఉండగానే ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు అప్పటికే భారీగా బడ్జెట్ పెట్టేశారు. మళ్లీ ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు ముందుకు రాలేదు.. దీంతో సరిగ్గా ఎడిటింగ్ కూడా చేయకుండానే విడుదల చేశారు. సినిమాలో కథతో పాటు ఏ ఒక్క విషయం కూడ ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. మొదటిరోజు కేవలం 293 టికెట్లు మాత్రమే సేల్ అయ్యాయి. ఐఎండీబీలో కూడా కేవలం 1.5 రేటింగ్‌తో 'ది లేడీ కిల్లర్' ఉంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ తీసుకుంది. అందుకు గాను నిర్మాతకు ఎంత చెల్లించారనేది తెలియదు. ఓటీటీలో కూడా ఆ చిత్రం వ్యూస్ మరీ దారుణంగా ఉన్నాయి. -
సినిమాల కోసం రాజీనామా చేసిన IAS.. గతంలో ఈ కలెక్టర్ చరిత్ర ఇదే
ఉత్తర్‌ప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాలపై మక్కువతో ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులు కూడా ధ్రువీకరించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అయిన ఢిల్లీ క్రైమ్ సీజన్- 2లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో ఆయన మెప్పించిన విషయం తెలిసిందే. గ్లామర్‌లో సినీతారలకు ఏ మాత్రం తగ్గడు. ఓటీటీలలో మంచి నటుడిగా పేరు తెచ్చుకుంటూ, ర్యాంప్‌ల మీద మోడల్‌గా దర్పం ఒలకబోస్తూ, కలెక్టర్ స్థాయి అధికారిగా ఢిల్లీ సచివాలయంలో కీలక హోదాలో కొనసాగారు. (IASగా సస్పెండ్ కావటానికి కారణమైన ఫోటో ఇదే) 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా భాద్యతలు తీసుకున్నాక సర్వీసులో ఉండగా పలు వివాదాలను ఆయన ఎదుర్కొన్నారు. 2015లో యూపీ నుంచి డిప్యుటేషనుపై దిల్లీకి వెళ్లారు. గతేడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడిగా అభిషేక్ వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తానే ఎన్నికల పరిశీలకుడినని చెబుతూ ఒక ఫోటో తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఇదీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్దం. దీంతో అతన్ని ఎన్నికల విధుల నుంచి ఈసీ తప్పించి సస్పెండ్ చేసింది. తాజాగా ఆయన తన ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం సంచలనం అయింది. అభిషేక్ సతీమణి శక్తి నాగ్‌పాల్ కూడా ఐఏఎస్ అధికారి కావడం విశేషం. యమునా నగర్ ఇసుక అక్రమ రవాణా కుంభకోణం వ్యవహారంలో ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నది. (అభిషేక్ సతీమణి శక్తి నాగ్‌పాల్ IAS) కొవిడ్ మహమ్మారి సమయంలో అభిషేక్ పరిపూర్ణ సమాజ సేవకుడిగా మారారు. ఆ సమయంలో రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆక్సిజన్ కోసం ఇబ్బందులు పడుతున్నవారి అవసరాలు తీర్చారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలోనూ తనవంతు పాత్ర పోషించారు. సొంత గ్రామాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న శరణార్థుల ఇబ్బందులు తీర్చారు ఇలా ఎన్నో మంచిపనులు ఆయన చేశారు. ఈ సినిమాతో గుర్తింపు అభిషేక్ సింగ్ తొలిసారిగా నటించిన ఈ షాట్ ఫిలిం పేరు ‘చార్ పండ్రా’. ఈ సినిమా ప్రముఖ ఎంటర్టైన్మెంట్ దిగ్గజం టీ సిరీస్ రూపొందించింది. ఈ పాటలో అభిషేక్ రొమాంటిక్ సైడ్‌ని అద్భుత్వంఘౠ ప్రదర్శించాడు. అంతేగాక ప్రేమలో దెబ్బతిన్న ప్రేమికుడిగా హృదయ విదారకరమైన భావాలను వ్యక్తపరిచి నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడని చెప్పుకొవచ్చు. అందుకు కారణం ఈ సాంగ్ తన నిజ జీవితంలోని సంఘటనలను బేస్ చేసుకుని తీసినట్లు ఆయన చెప్పారు. ఐఏఎస్ అధికారి అయినప్పటికీ నటుడిగా అద్భుత ప్రదర్శనను కనబరిచిన అభిషేక్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ పాట విడుదలైన నాలుగు రోజులకే యూట్యూబ్ ట్రెండింగ్ మారింది. ఇప్పటి వరకు ఆ పాటకు 560 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అభిషేక్‌కు ఇన్‌స్టాగ్రాంలో 50 లక్షల మంది ఫాలోవర్లు ఉండటం విశేషం. -
Adipurush: ఎవరీ ఓం రౌత్.. ప్రభాస్‌కు ఎలా పరిచయం?
టాలీవుడ్ నుంచి బాలీవుడ వరకు అందరి చూపు ప్రభాస్ 'ఆదిపురుష్' పైనే ఉంది. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో తాజాగా అందరి చూపు ఈ చిత్ర దర్శకుడు ఓం రౌత్‌పై పడింది. ఈ పేరు ఇప్పుడు భారతదేశం అంతటా మారుమోగుతోంది. ఎవరితను..? ఎక్కడ నుంచి వచ్చాడు? ఎన్ని సినిమాలు చేశాడు? అంటూ గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు. అతను ముంబయిలో పుట్టాడు.. తల్లి నీనా టెలివిజన్ నిర్మాత అయితే కాగా తండ్రి భరత్ కుమార్ ఒక జర్నలిస్ట్, రాజ్యసభ సభ్యుడు కూడా.. ఓం రౌత్ తాత సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అందుకే ఇతనికి సినిమాలంటే ఫ్యాషన్ ఏర్పడింది. (ఇదీ చదవండి: Adipurush: హనుమాన్కు కేటాయించిన సీట్ ఇదే) మొదట అతను బాల నటుడిగా పని చేశాడు, అలాగే కాలేజీలో జరిగే నాటకాల పోటీల్లో కూడా పాల్గొనేవాడు. కాలేజీలో చదువుకుంటున్నప్పుడే కథానాయకుడిగా 'కారమతి కోట్' అనే సినిమా చేశాడు. ఆ సినిమాలో ఇర్ఫాన్ ఖాన్ కూడా ఒక కీ రోల్ చేశాడు. మరాఠీ భాషలో 'లోకమాన్య: ఏక్ యుగ్ పురుష్' అనేది ఆయనకు మొదటి సినిమా. ఓం రౌత్, అతని తల్లి నీనా ఇద్దరూ కలిపి 'నీనా రౌత్ ఫిలిమ్స్' పేరుతో నిర్మించారు. ఇది అందరి ప్రసంశలు అందుకున్న సినిమానే కాకుండా, బెస్ట్ దర్శకుడిగా ఫిలిం ఫేర్ అవార్డు అతనికి వచ్చింది. మొదటి సినిమాతోనే అక్కడ భారీ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. (ఇదీ చదవండి: ఆదిపురుష్ ట్విట్టర్ రివ్యూ) ప్రభాస్‌తో ఓం రౌత్ పరిచయం ఎక్కడ జరిగిందంటే టి సిరీస్ సంస్థతో ప్రభాస్‌కు మంచి అనుబంధం వుంది. సాహో , రాధే శ్యామ్ సినిమాల సమయంలో వారి సంస్థతో ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చారట. అప్పటికే అదే సంస్థలో వున్న ఓం రౌత్ అప్పుడు జపాన్‌కి చెందిన సినిమా 'రామాయణ: ది లెజెండ్ అఫ్ ప్రిన్స్ రామ' అనే హిందూ పురాణ కథ ఆధారంగా నిర్మించిన సినిమా నుండి స్ఫూర్తి పొందాడు. ఇది 1992లో జపాన్‌లో విడుదల అయింది. ఈ సినిమాని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటి ఆధునిక సాంకేతిక సాయంతో ఎందుకు రామాయణం తీయకూడదు అనే ఆలోచన వచ్చి అదే విషయాన్ని టి సిరీస్ సంస్థ ప్రతినిదులకు చెప్పడంతో.. అలా ఆదిపురుష్‌కు అంకురార్పణ జరిగింది. ఆ తర్వాత టీ సిరీస్ వల్ల అతనికి ప్రభాస్ పరిచయం అయ్యాడు. మొత్తానికి ఓం రౌత్ ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశాడు.. ఆ సినిమాలు అన్ని విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు ఆదిపురుష్ సినిమా కూడా మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. -
'పుష్ప రాజ్' తగ్గేదేలే.. భారీ ధరకు ఆడియో రైట్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'పుష్ప- ది రూల్.' ఈ చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. గతంలో రిలీజైన పుష్ప పార్ట్-1 బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగానే బన్నీ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్‌కు ఓ రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా పుష్ప-2 మూవీకి సంబంధించిన ఓ వార్త తెగ వైరలవుతోంది. ఈ సినిమా ఆడియో హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ ఆడియో రైట్స్‌ను టీ-సిరీస్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: సీనియర్ నటుడు శరత్ బాబుపై అసత్య వార్తలు.. సోదరి క్లారిటీ) 'పుష్ప- పార్ట్-1 బ్లాక్ బస్టర్ కావడంతో పుష్ప-2కు అదేస్థాయిలో పోటీ నెలకొంది. పుష్ప ది రైజ్ బీజీఎం, సాంగ్స్ ఓ రేంజ్లో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాయి. పుష్ప- ది రూల్ అంతకుమించి ఉండనుండడంతో ఆడియో హక్కుల కోసం పోటీ మరింత పెరిగింది. 'టీ సిరీస్' రూ.65 కోట్లకు మూవీ ఆడియో రైట్స్‌ను దక్కించుకుందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ లెక్కల ప్రకారం బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ సినిమాల మ్యూజిక్ రైట్స్ కంటే ఇది అత్యధికం కానుంది. దీంతో మరోసారి పుష్పరాజ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో ఆడియో హక్కులకే ఈ స్థాయిలో అమ్ముడైతే ఇక ఈ సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటాయోనని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. కాగా.. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సంగీతమందించగా.. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. (ఇది చదవండి: రాత్రి ఓ యువకుడు ఏకంగా బాల్కనీలోకి దూకేశాడు: ప్రియాంక చోప్రా) "అర్జునుడి" రికార్డుల వేట ఆరంభం!!! 🛐🔥#Pushpa2TheRule audio rights sold for 65Crs.This is ALL TIME RECORD price for any Indian film by double margin.@alluarjun 👑(previous #RRR -26c) pic.twitter.com/b52dEmwwKp — Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) May 2, 2023 -
ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థలో బన్నీ నెక్ట్స్ మూవీ, ఆ సెన్సేషన్ డైరెక్టర్‌తో..
‘పుష్ప’ మూవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. దీంతో ప్రస్తుతం ఆయనకు దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం బన్నీ పుష్ప 2తో బిజీగా ఉన్నాడు. ఇక పాన్ ఇండియా స్టార్‌గా ఎంతో క్రేజ్‌ను సొంతం చేసుకున్న బన్ని నెక్ట్స్ సినిమా ఏంటనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో అల్లు ఫ్యాన్స్‌కి సర్ప్రైజ్ అందించే అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. తన నెక్ట్స్ మూవీకి ఓ క్రేజీ డైరెక్టర్‌తో జతకట్టబోతున్నాడు బన్నీ. తాజాగా దీనికి సంబంధించని అధికారిక ప్రకటన వెలువడింది. చదవండి: సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ హీరో కన్నుమూత ‘అర్జున్‌రెడ్డి’ కొత్త ట్రెండ్ సెట్ చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ దీప్‌రెడ్డి వంగాతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు ఈ స్టైలిష్ స్టార్. అర్జున్ రెడ్డి అనంతరం అల్లు అర్జున్- సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్లో సినిమా కోసం ఫ్యాన్స్ అంత ఎంతో ఆసక్తికగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే అభిమానులంత సంబరాలు చేసుకుంటున్నారు. బన్నీ హీరోగా సందీప్ రెడ్డి తెరకెక్కించే ఈ సినిమాను బాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ టీ సిరీస్ ప్రొడక్షన్స్, భద్రకాళి పిక్చర్స్ పతాకాలపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చదవండి: కాబోయే భార్య ఫొటో షేర్ చేసిన మంచు మనోజ్ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు సమాచారం. కాగా సందీప్ రెడ్డి ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్‌తో యనిమల్ మూవీని తెరకెక్కిస్తుండగా.. బన్నీ ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. అందే క్రమంలో యానిమల్ షూటింగ్ శరవేగంగా కంప్లీట్ చేసి బన్నీ మూవీని సెట్స్‌పై తీసుకువచ్చేందుకు సందీప్ వంగ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. Brace yourselves for this massive collaboration between three powerhouses of India - Producer Bhushan Kumar, Director Sandeep Reddy Vanga and superstar Allu Arjun.@alluarjun @imvangasandeep #BhushanKumar #KrishanKumar @VangaPranay @VangaPictures #ShivChanana @NeerajKalyan_24 pic.twitter.com/xis8mWSGhl — T-Series (@TSeries) March 3, 2023 -
హీరోల రెమ్యునరేషన్ పాతిక కోట్లా? అంటే మేము నష్టపోవాలా?: నిర్మాత
సినిమాకు పెడుతున్న పెట్టుబడిలో సగం హీరోల పారితోషికమే ఉంటుంది. ఆ రేంజ్లో డిమాండ్ చేస్తుంటారు కథానాయకులు. దీనివల్ల సినిమా ఫ్లాప్ అయినప్పుడు తీవ్రస్థాయిలో నష్టపోతున్నారు నిర్మాతలు. ఇదే విషయాన్ని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ సైతం ఓ ఇంటర్వ్యూలో ధృవీకరిస్తూ కొందరు తారలు మరీ ఎక్కువ మొత్తాన్ని అడుగుతారని అసహనం వ్యక్తం చేశాడు. తాజాగా మరో అగ్ర నిర్మాత, టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ సైతం ఈ ధోరణిని ఎండగడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. 'కొందరు హీరోలు చాలా బాగా అర్థం చేసుకుంటారు. నాకింత కావాలని బెట్టు చేయరు. కానీ కొందరు మాత్రం అదేమీ పట్టించుకోకుండా వారికి కావాల్సింది అప్పజెప్పాలని డిమాండ్ చేస్తారు. లేదంటే కలిసి పనిచేసేదే లేదని తేల్చి చెప్తారు. అలాంటి సందర్భాల్లో మేము కూడా కుదరదంటే వెళ్లిపోండనే చెప్తాం. మేమెందుకు తలకు మించిన భారాన్ని మోయాలి? ఒక్క హీరోకే రూ.20-25 కోట్ల దాకా ఇచ్చుకున్నాక సినిమా సరిగా ఆడకపోతే అది మాకు భారమే కదా! చిన్న సినిమాకు కూడా రూ.20 కోట్లు డిమాండ్ చేస్తారు. అంత భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఇచ్చుకోలేనప్పుడు కొన్నిసార్లు వారితో బేరసారాలు జరుపుతాం' చెప్పుకొచ్చాడు. కాగా గతేడాది బాలీవుడ్‌కు హిట్ ఇచ్చిన హీరోకు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చాడు భూషణ్. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న బాలీవుడ్‌కు గతేడాది భూల్ భులాయా 2 సక్సెస్‌తో ఆక్సిజన్ అందించాడు కార్తీక్ ఆర్యన్. ఈ సంతోషంతో అతడికి మెక్లారెన్ జీటీ అనే స్పోర్ట్స్ కారు గిఫ్టిచ్చాడు భూషణ్ కుమార్. అలాగే ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్‌కు లగ్జరీ ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటోను కానుకగా ఇచ్చాడు. ఈ రెండు కార్ల విలువ కోట్లల్లోనే ఉండటం విశేషం. చదవండి: రెండేళ్లు స్ట్రగుల్.. ఒక తోడు కావాలనిపించింది: దిల్ రాజు బాత్రూమ్లోకి వెళ్లి ఏకధాటిగా ఏడ్చేశా: నాటునాటు కొరియోగ్రాఫర్ -
‘ఆదిపురుష్’ డైరెక్టర్‌కు లగ్జరీ ఫెరారీ కారు బహుమతి, ఎవరిచ్చారంటే..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు చర్చించుకుంటున్న సినిమా ఆదిపురుష్. ఇటీవల టీజర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఆదిపురుష్ ముచ్చట్లే కనిపిస్తున్నాయి. టీజర్ అద్భుతమంటు పలువురు ప్రశంసిస్తుంటే ఇందులోని పాత్రలను చూపించిన తీరుపై రాజకీయ ప్రముఖులు, హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంతేకాదు ఇది కార్టున్ చిత్రంలా ఉందంటూ ఫ్యాన్స్ సైతం అసహనం వ్యక్తం చేశారు. చదవండి: సుకుమార్-దేవిశ్రీ మధ్య రెమ్యునరేషన్ చిచ్చు! అసలేం జరిగింది? పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్‌కు ముందే ఓం రౌత్ ఖరీదైన లగ్జరీ కారును బహుమతిగా అందుకున్నాడు. ఆది పురుష్ మూవీకి టీ-సిరీస్ అధినేత భూషన్ కుమార్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తాజాగా నిర్మాత భూషన్ కుమార్ ఓం రౌత్‌కు లగ్జరీ ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో(uber-luxurious Ferrari F8 Tributo) కారును కానుగా ఇచ్చాడు. దీని ధర రూ. 4.02 కోట్లు ఉంటుందని అంచనా. చదవండి: ‘బ్రహ్మాస్త్ర’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఆ రోజు నుంచి స్ట్రీమింగ్.. అయితే ఇది అప్పటికప్పుడు షో రూంలో తీసుకుంది కాదనీ, ముందుగానే భూషన్ కుమార్ తన పేరు మీద ఈ కారు బుక్ చేశాడని తెలుస్తుంది. చూస్తుంటే ఓం రౌత్‌కు ఈ కారును గిఫ్ట్‌గా ఇవ్వాలని ఆయన ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా బడా నిర్మాత అయిన భూషన్ కుమార్ ఇలా కాస్ట్లీ కార్లను బహుమతిగా ఇవ్వడం ఇదేం తొలిసారి కాదు. ఈ ఏడాది విడుదలైన భూల్ భూలయా 2 సినిమా సక్సెస్ నేపథ్యంలో హీరో కార్తిక్ ఆర్యన్‌కు ఆయన రూ. 4.70 విలువ చేసే లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చాడు. -
మంచి మంచి పాటల్ని చెడగొడుతున్నారు కదయ్యా!
ముంబై: టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా ఏ వుడ్లో అయినా పాత హిట్ సాంగ్స్‌ను రీమిక్స్‌లు, రీ-రీమిక్స్‌లు, రీక్రియేషన్ల పేరుతో ఇప్పటి తరాలకు అందిస్తుండడం చూస్తున్నాం. అదే సమయంలో చాలావరకు కొత్తవాటిపై విమర్శలు వెల్లువెత్తుతుండం, సోషల్ మీడియాలో ట్రోలింగ్ సర్వసాధారణంగా మారిపోయాయి. తాజాగా.. శ్రీలంక గాయని యోహానీతో ‘మనికే మేగే’ సాంగ్‌ను.. ‘థ్యాంక్ గాడ్’ సినిమా కోసం ఆమెతోనే పాడించి ఓ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అయితే ఆ సాంగ్ కొరియోగ్రఫీ కంపోజిషన్‌పై మాములు తిట్లు పడడం లేదు. ఇక ఇప్పుడు మరో క్లాసిక్ పాటను చెడగొట్టే యత్నమూ జరుగుతోందన్న విమర్శ వెల్లువెత్తుతోంది. ‘మైనే పాయల్ హై ఛన్‌కాయి’ సాంగ్ గుర్తుందా? అప్పట్లో నార్త్-సౌత్ తేడా లేకుండా ఊపేసిన సాంగ్. ముఖ్యంగా యూత్‌ను బాగా ఆకట్టుకున్న సాంగ్ అది. సింగర్ నేహా కక్కర్ ‘ఓ సజ్నా’ పేరిట రీమిక్స్ చేయించి వదిలింది టీ సిరీస్. దీంతో మంచి పాటను చెడగొట్టారంటూ విమర్శలు మొదలయ్యాయి. ఇప్పటికే నేహా కక్కర్ పాడిన పలు రీక్రియేషన్స్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి గతంలో. ఇక ఒరిజినల్ కంపోజర్ & సింగర్ ఫాల్గుని పాథక్ సైతం తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు ప్రచారం నడుస్తోంది. ఫ్యాన్స్ షేర్ చేసిన కొన్ని మీమ్స్‌ను, విమర్శలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ రూపంలో షేర్ చేశారంటూ కథనాలు వెలువడుతున్నాయి. video credits: T-Series ఫాల్గుని పాడిన మైనే పాయల్ హై ఛన్‌కాయి ఒరిజినల్ సాంగ్ 1999లో రిలీజ్ అయ్యింది. వివన్ భాటేనా, నిఖిలా పలాట్లు ఇందులో నటించారు. కాలేజీ షోలో తొలుబొమ్మల ప్రదర్శన మీద ఈ సాంగ్ పిక్చరైజేషన్ ఉంటుంది. ఇక కొత్త వెర్షన్ ఓ సజ్నాకు తన్షిక్ బాగ్చీ మ్యూజిక్ అందించగా.. ప్రియాంక శర్మ, ధనాశ్రీ వర్మ నటించారు. videoCredits: FalguniPathakVEVO -
తెరపైకి ‘కెఫె కాఫీ డే’ ఫౌండర్ వీజీ సిద్ధార్థ బయోపిక్
‘కెఫె కాఫీ డే’ ఫౌండర్ వీజీ సిద్ధార్థ్ జీవితం త్వరలోనే తెరపైకి రానుంది. ఆయన బయోపిక్‌ను రూపొందించనున్నట్టు ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్, ఆల్మైటీ మోషన్ పిక్చర్, కర్మ మీడియా ఎంటర్టైన్మెంట్లు శుక్రవారం ప్రకటించాయి. ఇన్వేస్టిగేటివ్ జర్నలిస్టులు రుక్మిణీ బీఆర్, ప్రోసెంజీత్ దత్తా రాసిన కాఫీ కింగ్ పుస్తకంగా ఆధారం ఆయన బయోపిక్ తెరకెక్కించబోతున్నట్లు స్పస్టం చేశారు. చదవండి: ఇంటింటికి సబ్బులు అమ్ముకుంటున్న స్టార్ నటి ఐశ్వర్య కాగా నిన్న సదరు నిర్మాణ సంస్థలు మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని తెలిపాయి. ఈ సందర్భంగా ‘కాఫీ మనందరి జీవితంలో భాగం చేసి వీజీ సిద్ధార్థ్ వ్యాపారవేత్తగా ఎన్నో విజయాలు సాధించారు. అలాంటి ఆయన ఆత్మహత్య చేసుకోవడం షాకింగ్ ఘటన. సక్సెస్ఫుల్ బిజినెస్మెన్ అయిన వీజీ సిద్ధార్థ్ జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలు, ఒడిదుడుకులకు సంబంధించి లోతైన పరిశీలనతో రాసిన పుస్తకమే ‘కాఫీ కింగ్: ది స్వీఫ్ట్ రైజ్ అండ్ సడెన్ డేత్ ఆఫ్ కెఫె కాఫీ డే ఫౌండర్ వీజీ సిద్ధార్థ్’. ఇది వెండితెరపై ఆవిష్కరించాల్సిన కథ. చదవండి: Sai Pallavi: ఆ వీడియో బయటకు రావడంతో దారుణంగా ట్రోల్ చేశారు, ఇక అప్పడే.. అందుకే ఆయన బయోపిక్ హక్కులను తీసుకున్నాం. త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటిస్తాం’ అని టీ-సీరిస్ చైర్మన్ భూషన్ కూమార్ తెలిపాడు. కెఫె కాఫీ డే ఫౌండర్‌గా వీజీ సిద్ధార్థ్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఆనతి కాలంగో గొప్ప వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. అలాంటి వీజీ సిద్ధార్థ్ 2019 జూలైలో ఆకస్మాత్తుగా కర్ణాటకలోనే ఓ నది శవమై తేలారు. అప్పటికి ఆయనకు 59 ఏళ్లు. అయితే ఆయన ఆత్మహత్యకు కారణాలేంటో ఇప్పటికి తెలియదు. సిద్ధార్థ మరణాంతరం ఆయన భార్య మళవిక హెగ్డే కెఫె కాఫీ డే బాధ్యతలు చేపట్టారు. చదవండి: భర్త సిద్దార్థ్ కలలను నిజం చేస్తున్న కేఫ్ కాఫీ డే మాళవిక హెగ్డే..! -
యూతమ్మా! యూత్! అట్లుంటది మరి.. ‘అతి’ వద్దు.. తక్కువ మాటలతో..
లాక్డౌన్ టైమ్‌లో యూత్ వోటీటీ ప్లాట్‌ఫామ్‌లకు అతుక్కుపోయింది. ‘అది కాలమహిమ, అంతే. మళ్లీ థియేటర్లు ఓపెన్ అయితే ఈ ఆకర్షణ పోతుంది. ఎంతైనా థియేటర్ థియేటరే’ అనుకున్నారు చాలామంది. థియేటర్లు తెరుచుకున్నప్పటికీ యూత్‌లో వోటీటీ ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదు. ‘వోటీటీ వోటీటీయే– థియేటర్ థియేటరే’ అనే పరిస్థితి వచ్చింది. వోటీటీ విషయానికి వస్తే...యూత్ ఇష్టపడే వాటిలో మోస్ట్ పాపులర్ జానర్ కామెడీ(సీ). ఆ తరువాత స్థానంలో థ్రిల్లర్(టీ), యాక్షన్(ఏ) ఉన్నాయి. దేశవ్యాప్తంగా యూత్ వోటీటీ సబ్స్క్రిప్షన్ విస్తృతంగా పెరిగింది. జెన్ జెడ్, మిలీనియల్స్ రెండు నుంచి మూడు వరకు వోటీటీ ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్క్రిష్షన్ ఉండడం సహజమై పోయింది. మోస్ట్ పాపులర్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్కు వోటీటీ కేరాఫ్ అడ్రస్ కావడం వల్ల కూడా డెబ్బై శాతం పైగా యూత్ ఈ వేదికలను ఇష్టపడుతుంది. మరోవైపు చూస్తే... వోటీటీ ప్లామ్ఫామ్లకు యూత్ ఆడియెన్స్ టార్గెట్ అయ్యారు. ‘మీరు చెప్పిన సబ్జెక్ట్ తరువాత ఆలోచిద్దాం గానీ, ముందు ఏదైనా యూత్ సబ్జెక్ట్ ఉంటే చెప్పండి’ అనే మాటను విన్నాడు, వింటూనే ఉన్నాడు అభిషేక్ యూదవ్. వోటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై యూత్ పల్స్ తెలిసిన రచయితగా గుర్తింపు పొందాడు అభిషేక్. ‘యూత్ సబ్జెక్ట్ కావాలి’ అనగానే ‘ఛలో రాసేద్దాం’ అంటూ రచయితలు ఒంటిస్తంభం మేడలో కూర్చోవడానికి లేదు. వారికి కచ్చితంగా యూత్పల్స్ ఏమిటో తెలియాలి. అది తెలియాలంటే ఏకాంతవాసానికి స్వప్తి చెప్పాలి. యూత్ జాడలు వెదుక్కుంటూ వెళ్లాలి. కాలేజీ క్యాంటీన్లలో కూర్చొని వారి మాటలు గమనించాలి. ఊతపదాలు క్యాచ్ చేయాలి. కాలేజీ అయిపోగానే రయ్యిమని పరుగెత్తి బస్సులో గందరగోళానికి, సరదా సందడి యాడ్ చేసే స్టూడెంట్స్‌ను గమనించాలి... ఇలాంటి హోమ్‌వర్క్ చేసిన రచయితల్లో అభిషేక్ యాదవ్ కూడా ఒకరు. (చదవండి: Summer Tips: వేసవిలో విజృంభించే కామెర్లు, అతిసార.. ఈ ‘పానీయం’ తాగారంటే!) ‘తెర మీద యూత్ తమను తాము చూసుకోవాలి. నిత్యజీవితంలో తమ అల్లర్లు, ఆలోచనలు తెర మీద చూస్తూ మమేకం కావాలి’ అంటాడు అభిషేక్. భారతీయ జనాభాలో 46.9 శాతం పాతికేళ్లలోపు వారు ఉన్నారు. కంటెంట్ విషయంలో వారి ‘టేస్ట్’ ఏమిటి అనేది విశ్లేషిస్తే...హాస్యమే కాని అది పూర్వపు హాస్యం కాదు. తక్కువ మాటలతో ఎక్కువగా నవ్వించే హాస్యం కావాలి. ‘అతి’ కంటె మితమైన హాస్యంతోనే నవ్వించాలి. ఈ తరాన్ని దృష్టిలో పెట్టుకొని ‘క్యూ ఇండియా’ 24/7 కామెడీ ప్రోగ్రామ్స్‌తో ‘క్యూ కామెడీస్థాన్’ అనే డిజిటల్ చానల్ తీసుకువస్తోంది. దీనికోసం పాపులర్ డిజిటల్ కామెడీ స్టార్స్ రంగంలోకి దిగారు. పంకజ్ శర్మలాంటి కంటెంట్ క్రియేటర్లు యూత్పల్స్ పట్టుకునే పనిలో కసరత్తులు చేస్తున్నారు. మరోవైపు థ్రిల్లర్, యాక్షన్ సబ్జెక్ట్‌లను కూడా ఇష్టపడుతుంది యూత్. ఉదా: స్కాటిష్ మిస్టరీ థ్రిల్లర్ ‘గిల్టీ’ని ఆధారంగా చేసుకొని రూపొందించిన ‘బ్లడీ బ్రదర్స్’ (జీ5), 1957 నవల ‘డీప్ వాటర్’ను అదే పేరుతో తీసిన సైకాలజీ థ్రిల్లర్(అమెజాన్ ప్రైమ్)....మొదలైన వాటికి యూత్ నుంచి మంచి ఆదరణ లభించింది. టీ–సీరిస్ వోటీటీ స్పేస్‌పై గట్టిగా దృష్టి పెట్టింది. కామెడీ, థ్రిల్లర్, యాక్షన్ జానర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ‘‘యూత్‌ను ఆకట్టుకునే ఫ్రెష్, ఒరిజినల్ అండ్ ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ మా ప్రథమ ప్రాధాన్యత’ అంటున్నారు టీ–సీరిస్ ఛైర్మన్ భూషణ్ కుమార్. (చదవండి: నోరూరించే చికెన్ బ్రెడ్ పాకెట్స్ తయారీ ఇలా!) -
ఆ బడా కంపెనీలకే ఆర్ఆర్ఆర్ ఆడియో రైట్స్
RRR Movie Audio Rights: 'బాహుబలి' సినిమా తర్వాత టాలీవుడ్లో లెక్కలు మారిపోయాయి. తెలుగు హీరోలు పాన్ ఇండియా సినిమాల మీద మోజు పెంచుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగులో రూపుదిద్దుకుంటున్న రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, పుష్ప, ఆర్ఆర్ఆర్, లైగర్ సహా పలు చిత్రాలు పాన్ ఇండియా సినిమాలే. అందులోనూ ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా కోట్లలోనే జరుగుతోంది. తాజాగా ఆర్ఆర్ఆర్ ఆడియో హక్కులను లహరి మ్యూజిక్, టీ సిరీస్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నాయి. Glad to acquire the music rights of India’s Biggest Action Drama, @SSRajamouli’s @RRRMovie 🤩🔥🌊 An @MMKeeravaani Musical 🎶 on @TSeries & @LahariMusic#RRRAudioOnTseriesLahari#BhushanKumar #TSeries @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @DVVMovies @PenMovies pic.twitter.com/w59F9XlmD5 — T-Series (@TSeries) July 26, 2021 ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియోపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ మూవీ పాటలను లహరి, టీ సిరీస్ సంయుక్తంగా దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఆడియో రైట్స్ ద్వారా ఆర్ఆర్ఆర్ నిర్మాతలకు రూ.25 కోట్లు ముట్టినట్లు సమాచారం. సుమారు రూ.350-400 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ సినిమాకు మొత్తంగా రూ. 900 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ఫిల్మీదునియాలో ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. కేవలం ప్రీరిలీజ్ బిజినెస్‌తోనే లాభాలందుకుంటోన్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎన్ని కోట్ల కాసులు కురిపిస్తుందో చూడాలి! -
'మూడేళ్లుగా అత్యాచారం': అంతా అబద్ధమన్న టీ సిరీస్
T-Series Issues Statement: ప్రముఖ ఆడియో కంపెనీ, మ్యూజిక్ ప్రొడక్షన్ హౌస్ టీ సిరీస్ ఎండీ భూషణ్ కుమార్‌పై అత్యాచార కేసులో ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి, మూడేళ్లపాటు భూషణ్ తనపై అత్యాచారం చేశాడన్న బాధితురాలి ఆరోపణలను టీ సిరీస్ తోసిపుచ్చింది. ఆమె చెప్పేవన్నీ అవాస్తవాలేనని, ఈ మేరకు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయంటూ ప్రకటన విడుదల చేసింది. "భూషణ్ కుమార్ మీద వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. పని పేరుతో ఆమెపై భూషణ్ అత్యాచారం చేశాడన్నది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే గతంలో ఆమె సినిమా, మ్యూజిక్ వీడియోల కోసం టీ సిరీస్ బ్యానర్లో పని చేసింది. ఈ ఏడాది మార్చిలో ఓ వెబ్ సిరీస్ నిర్మించాలనుకున్న ఆమె ఆర్థిక సాయం కోసం భూషణ్ కుమార్‌ను సంప్రదించింది. కానీ ఆమె విన్నపాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించాడు. ఆ తర్వాత జూన్‌లో(మహారాష్ట్రలో లాక్డౌన్ ఎత్తేశాక) భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ మరోసారి టీ సిరీస్ బ్యానర్‌ను సంప్రదించింది. ఈ క్రమంలో దోపిడీకి సైథః ప్రయత్నించగా జూలై 1న అంబోలీ పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు చేశాం. దొంగతనానికి ప్రయత్నించింది అని నిరూపించేందుకు మా దగ్గర ఆడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. వీటిని అధికారులకు అప్పగిస్తాం. ఆ దోపిడీ కేసుకు కౌంటర్‌గా ఆమె ఈ ఫిర్యాదు చేసిందే తప్ప అంతకు మంచి మరొకటి కాదు. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం" అని లేఖలో స్పష్టం చేశారు. -
‘మూడేళ్లుగా అత్యాచారం’.. టీ సిరీస్ భూషణ్‌పై కేసు
ప్రముఖ ఆడియో కంపెనీ, మ్యూజిక్ ప్రొడక్షన్హౌజ్ టీ సిరీస్ వివాదంలో నిలిచింది. టీ సిరీస్ ఎండీ భూషణ్ కుమార్(43)పై అత్యాచార కేసులో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. 2017లో తన అప్‌కమింగ్ ప్రాజెక్టుల్లో ఒకదాంట్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి మూడేళ్లపాటు భూషణ్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు(30) ఆరోపిస్తోంది. మూడేళ్లపాటు వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డాడని పేర్కొంటూ ముంబైలోని అంధేరీ డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో భూషణ్ కుమార్ స్టేట్మెంట్ రికార్డు చేయాల్సి ఉంది. మరోవైపు భూషణ్ ఈ ఆరోపణలపై స్పందించాల్సి ఉంది. టీ సిరీస్ స్థాపకుడు, మధురగాయకుడైన గుల్షన్ కుమార్ పెద్ద కొడుకు అయిన భూషణ్ కుమార్ దువా. ప్రస్తుతం టీ సిరీస్‌కు చైర్మన్ కమ్ ఎండీగా కొనసాగుతున్నాడు. ఈయన భార్య నటి దివ్యా ఖోస్లా. -
బాలీవుడ్‌లోకి ‘డార్లింగ్’ డైరెక్ట్ ఎంట్రీ
-
ప్రభాస్ కొత్త చిత్రం 'ఆదిపురుష్'
బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న ప్రభాస్‌తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ దర్శకులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో 'తానాజీ' దర్శకుడు ఔంరౌత్‌తో కలిసి ప్రభాస్ సినిమా చేయనున్నారనేది తెలిసిన విషయమే. అయితే ఈ చిత్రం ఎలాంటి నేపథ్యంలో తెరకెక్కనుందనే సస్పెన్స్‌కు తెరదించుతూ మంగళవారం ఉదయం 7.11 నిమిషాలకు ఈ చిత్ర టైటిల్‌ను పోస్టర్‌తో సహా విడుదల చేశారు. ప్రభాస్ 22వ సినిమాకు "ఆదిపురుష్" అనే పేరును ఖరారు చేస్తున్నట్లు హీరో ప్రభాస్, దర్శకుడు ఓంరౌత్ ప్రకటించారు. "చెడుపై మంచి సాధించే విజయాన్ని పండగ చేసుకుందాం" అనేది క్యాప్షన్. ఈ పోస్టర్లో హనుమంతునితోపాటు ఎందరో మునులు కూడా ఉన్నారు. దీన్ని బట్టి ఇది పౌరాణిక చిత్రమని ఈజీగా తెలుస్తోంది. (పారితోషికంలో ప్రభాస్ రికార్డు!) త్రీడీలో రూపుదిద్దుకోనుండటం ఈ సినిమా ప్రత్యేకత. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కన్నడ, మలయాళ భాషల్లో అనువాదం చేయనున్నారు. టీ సిరీస్ నిర్మిస్తోంది. సుమారు రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించిన ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాదే ప్రారంభం అవుతుండగా, వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామంటున్నారు. ప్రభాస్ 22 వ సినిమాలో రాముడిగా లేదా విష్ణువుగా కనిపించనున్నారని అభిమానులు జోస్యం చెప్తున్నారు. ఇదే నిజమైతే ప్రభాస్ కెరీర్లో ఈ చిత్రం ప్రత్యేకంగా నిలిచిపోనుంది. మరోవైపు లాక్‌డౌన్‌లోనూ సినిమా అనౌన్స్ చేసి తమను సర్ప్రైజ్ చేశారంటూ అభిమానులు #Prabhas22, #Adipurushను ట్రెండ్ చేస్తున్నారు. (చిరు చేసిన 'చేపల వేపుడు’ వీడియో చూశారా!) -
ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ పాట
ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్ మొదటి సారిగా నటించిన షాట్ ఫిలింలోని ఓ రొమాంటిక్ సాంగ్ సంగీత ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. ప్రముఖ సింగర్ బి ప్రాక్ పాడిన తాజా రొమాంటిక్ సాంగ్ ‘దిల్ తోడ్ కే’ ప్రపంచవ్యాప్తంగా రికార్డు బద్దలు కొడుతోంది. ఈ పాట విడుదలైన నాలుగు రోజులకే యూట్యూబ్ ట్రెండింగ్ మారింది. ఇప్పటి వరకు ఆ పాటకు 25 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ పాటలో ఐఎఎస్ ఆఫీసర్ అభిషేక్ సింగ్ నటన చాలా బాగుందని మళ్లీ చూడాలనింపించేంతగా ఆకట్టుకున్నాడంటూ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. Jaise Gayi Ho Jaata Hai Kya Koi Aise Chhod Ke? Song releases.. Listen in on the following link 👂 https://t.co/2aFXAKDY8I@itsBhushanKumar @TSeries @BPraak @RochakTweets @manojmuntashir #KaashishVohra @radiasunita @Rajuchanana @AshishPanda #tseries pic.twitter.com/ql0pNonPcH — Abhishek Singh (@Abhishek_asitis) July 15, 2020 ఐఏఎస్ అధికారి అయిన అభిషేక్ సింగ్ తొలిసారిగా నటించిన ఈ షాట్ ఫిలిం పేరు ‘చార్ పండ్రా’. ఈ సినిమా ప్రముఖ ఎంటర్టైన్మెంట్ దిగ్గజం టీ సిరీస్ రూపొందించింది. ఈ పాటలో అభిషేక్ రొమాంటిక్ సైడ్‌ని అద్భుత్వం ప్రదర్శించాడు. అంతేగాక ప్రేమలో దెబ్బతిన్న ప్రేమికుడిగా హృదయ విదారకరమైన భావాలను వ్యక్తపరిచి నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడని చెప్పుకొవచ్చు. ఓ ఐఏఎస్ అధికారి అయినప్పటికీ నటుడిగా అద్భుత ప్రదర్శనను కనబరిచిన అభిషేక్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. త్వరలో అభిషేక్ స్టార్ హీరోగా వెండితెరపై కనిపించడం ఖాయమని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అభిషేక్ ఢిల్లీ క్రైం-2లో నటిస్తున్నాడు. క్రైం నేపథ్యంలో సాగే ఈ వెబ్‌సిరీస్ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. -
చరిత్ర సృష్టించిన ‘టీ సిరీస్’
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ సంస్థ టీ సిరీస్ అరుదైన ఘనత సాధించింది. సంగీత రంగంతో పాటు సినీ నిర్మాణ రంగంలోనూ ఉన్న ఈ సంస్థ యూట్యూబ్‌లో ప్రపంచంలోనే అత్యధిక సబ్స్క్రైబర్స్ కలిగిన చానల్‌గా చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ల(పది కోట్ల)కు పైగా సబ్స్క్రైబర్స్ కలిగిన ఏకైక సంస్థ టీ సిరీస్ రికార్డ్ సృష్టించింది. సందర్భంగా యూట్యూబ్ నిర్వాహకులు టీ సిరీస్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోనే రిలీజ్ చేశారు. టీ సిరీస్ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్ కూడా ఈ రికార్డ్ నెలకొల్పటంలో భాగస్వాములైన ప్రేక్షకులకు తన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది ఇండియా శక్తి. భారతీయత కలిగి కంటెంట్, వీక్షకుల ఆదరణ, మా డిజిటల్ టీం కృషి మూలంగానే యూట్యూబ్‌లో 100 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్స్ గెలుచుకోగలిగాం అంటూ ట్వీట్ చేశారు. Congratulations to @TSeries for reaching 100M subscribers! 🎉 pic.twitter.com/6kHopm2GAZ — YouTube (@YouTube) 30 May 2019 Salute to India's power! It is the power of Indian content, consumers and our digital strength that has lead us to a milestone of 100 million subscribers on YouTube. Thank you. pic.twitter.com/XSGJP83pE3 — Bhushan Kumar (@itsBhushanKumar) 29 May 2019 -
మన సంగీత మార్కెట్లోకి మరో దిగ్గజం
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయులకు సంగీతాన్ని ఆస్వాదించే సంస్కృతి అద్భుతంగా ఉండడంతో భారతీయ పాటల ప్రపంచంలోకి మరో ప్రపంచ దిగ్గజ సంస్థ ‘స్పాటిఫై’ అడుగు పెట్టింది. స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్ నగరం ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ అంతర్జాతీయ సంస్థ భారత పాటల మార్కెట్లోకి ప్రవేశించాలనే సంకల్పంతో సరిగ్గా 11 నెలల క్రితం ముంబైలో తన భారతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యాలయంలో మూడు వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీనికి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఇంతకుముందు ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్ ‘ఓఎల్ఎక్స్’కు సీఈవోగా పనిచేసిన అమర్‌సింగ్ బాత్రాను తీసుకున్నారు. భారతీయ మార్కెట్లోకి తమ ఉత్పత్తిని లాంఛనంగా ప్రవేశపెడుతున్నట్లు స్పాటిఫై వ్యవస్థాపకులు, కంపెనీ సీఈవో డేనియల్ ఎక్ బుధవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. హిందీ, తెలుగు, తమిళ్, పంజాబీ భాషల్లో నాలుగు కోట్లకుపైగా భారతీయ పాటలు తమ వద్ద ఉన్నాయని, వాటిని ఏకంగా ‘త్రీ బిలియన్ ప్లే లిస్ట్స్’తో విడుదల చేస్తున్నామని చెప్పారు. భారతీయ వినియోగదారుడి నుంచి నెలకు 119 రూపాయల చందాకు ఎలాంటి వాణిజ్య ప్రకటనలు లేకుండా తమ పాటలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. ఇదే అమెరికా వినియోగదారుడి దగ్గరి నుంచి నెలకు 9.99 డాలర్లు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. వాస్తవానికి జనవరి చివరలోనే ‘స్పాటిఫై’ భారతీయ మార్కెట్లోకి రావల్సి ఉండింది. అమెరికాలోని ‘వార్నర్ మ్యూజిక్ గ్రూప్’కు చెందిన వార్నర్–ఛాపెల్ మ్యూజిక్ కంపెనీ, స్పాటిఫై లెసెన్స్ ఒప్పందంపై ముంబై హైకోర్టుకు వెళ్లడంతో మార్కెట్లోకి రావడానికి ఆలస్యమైంది. హాలివుడ్ సింగర్స్ కేటి పెర్రీ, బెయాన్స్, కెండ్రిక్ లామర్, లెడ్ జెప్పెలిన్ కేటలాగ్‌ల విషయంలో రెండు కంపెనీల మధ్య వివాదం తలెత్తింది. ఈ విషయమై ఓ పక్క న్యాయ పోరాటం కొనసాగుతుండగానే ప్రపంచంలోని దాదాపు 80 దేశాల్లో 20 కోట్ల మంది వినియోగదారులకు ‘స్పాటిఫై’ తన పాటల సర్వీస్‌ను అందిస్తోంది. భారత్‌లోని అతిపెద్ద సంగీత బ్రాండ్ లేబుల్ కలిగిన టీ సీరీస్‌తో ఒప్పందం కుదుర్చుకొని 1,60,000 పాటల లైబ్రరీని సమకూర్చుకుంది. అయినప్పటికీ భారతీయ మార్కెట్లో ఉన్న పోటీని తట్టుకొని నిలబడడం చాలా కష్టం. 2017 లెక్కల ప్రకారం మొత్తం ఆసియాలో సంగీత మార్కెట్ రెవెన్యూ 38.2 శాతానికి విస్తరించగా ఒక్క భారత్‌లోనే 60.8 శాతానికి విస్తరించింది. భారత్‌లో ఇంటర్నెట్ విస్తృతంగా అందుబాటులోకి రావడం, డేటా చార్జీలు బాగా తగ్గడం కూడా సంగీత మార్కెట్ విస్తరించడానికి దోహదపడ్డాయి. 2020 నాటికి భారత సంగీత ప్రపంచంలో రెవెన్యూ 27.30 కోట్ల డాలర్లకు చేరుకుంటుందన్నది ఓ అంచనా. గత ఏడాది ఫిబ్రవరి నెలలోనే అమెజాన్ కంపెనీ భారత సంగీత మార్కెట్లోకి అడుగు పెట్టింది. ఏడాది సబ్స్క్రిప్షన్ కింద కేవలం 999 రూపాయలనే వసూలు చేస్తోంది. ఇంగ్లీషు, హిందీతోపాటు పలు భారత ప్రాంతీయ భషల్లో కొన్ని కోట్ల కాటలాగ్లను ‘అమెజాన్ మ్యూజిక్’ అందిస్తోంది. చైనా ఇంటర్నెట్ దిగ్గజం ‘టెన్సెంట్’ భారతీయ సంగీత మార్కెట్లోకి ‘గానా’ పేరుతో ప్రవేశించింది. ఏకంగా 7.50 కోట్ల మంది నెల ఛందాదారులతో మార్కెట్లో నెంబర్ వన్‌గా చెలామణి అవుతోంది. రిలయెన్స్, ఏర్టెల్, వొడావోన్ కంపెనీలు భారతీయ సంగీత మార్కెట్లోకి ఎప్పుడో అడుగుపెట్టాయి. రిలయెన్స్ కంపెనీకి చెందిన ‘జియో మ్యూజిక్’ను గతేడాది మార్చి నెలలో అంతర్జాతీయ కంపెనీ ‘సావ్న్’లో వంద కోట్ల డాలర్లకు విలీనం చేసింది. -
క్రిస్మస్ కానుకగా ‘మొఘల్’..!!
ప్రస్తుతం బాలీవుడ్లో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఆటగాళ్లు, నటులు, స్ఫూర్తిదాయక వ్యక్తుల జీవితం ఆధారంగా చాలా సినిమాలు తెరకెక్కి మంచి వసూళ్లు సాధించాయి. తాజాగా సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సంజు’ మూవీ భారీ వసూళ్లు సాధిస్తూ నిర్మాతలకు కాసులు కురిపిస్తోంది. ‘సంజు’ సక్సెస్ ఇచ్చిన బూస్ట్‌తో మరికొన్ని బయోపిక్‌లు తెరక్కించేందుకు నిర్మాతలు ముందుకొస్తున్నారు. కాగా ప్రస్తుతం బీ- టౌన్లో మరో ఆసక్తికర వార్త హల్చల్ చేస్తోంది. ప్రఖ్యాత మ్యూజిక్ కంపెనీ టీ- సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ జీవిత కథ ఆధారంగా తెరపై ఆవిష్కరించేందుకు సన్నాహకాలు జరుగుతున్నట్లు సమాచారం. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, టీ- సిరీస్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు సుభాష్ కపూర్(జాలి ఎల్ఎల్బీ ఫేం) దర్శకత్వం వహించనున్నారు. ‘మొఘల్’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో గుల్షన్ కుమార్‌గా అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాను ఈ క్రిస్మస్ కానుకగా విడుదల చేసేందుకు మూవీ టీం ప్రయత్నిస్తోందట. ఈ విషయాన్ని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. BIG NEWS... Aamir Khan Productions and TSeries to release Gulshan Kumar biopic in Christmas 2019... Written and directed by Subhash Kapoor... Filming to begin early next year. — taran adarsh (@taran_adarsh) July 26, 2018 -
చిక్కుల్లో 'అజ్ఞాతవాసి'
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైపోయింది. ఈ నెల 10 న ప్రపంచవ్యాప్తంగా అజ్ఞాతవాసి విడుదల కాబోతోంది. తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న పవన్ అభిమానులను ఓ వార్త కలవరపెడుతోంది. ‘అజ్ఞాతవాసి’ కాపీరైట్ వివాదం చుట్టుముట్టిందని, ఈ మేరకు బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి-సిరీస్ నుంచి నోటీసులు కూడా అందాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు. 2008లో వచ్చిన ‘లార్గో వించ్’ కు ‘అజ్ఞాతవాసి’ కాపీ అని చెప్పుకుంటున్నారు. ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన 'లార్గో వించ్' సూపర్ హిట్ అయింది. దీంతో హిందీలో రీమేక్ చేయడానికి టీ సిరీస్ రైట్స్ సొంతం చేసుకుంది. ఇపుడు ఈ సినిమాకు అజ్ఞాత వాసి కాపీ అనే టాక్ రావడంతో అలెర్ట్ అయిన టీ సిరీస్ సంస్థ ‘అజ్ఞాతవాసి’ దర్శక నిర్మాతలకు నోటీసులు పంపిందని టాలీవుడ్ వర్గాల్లో వార్త హల్ చల్ చేస్తోంది. అయితే ఈ వివాదంపై నిర్మాత చినబాబు కానీ, దర్శకుడు త్రివిక్రమ్ కానీ స్పందించలేదు. అసలు ఈ వార్త ఎంతవరకు నిజమో కూడా తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ విషయంపై టీసిరీస్ కూడా ఎక్కడా అధికారంగా వెల్లడించలేదు. మరో వారంలో విడుదల కాబోతున్న ‘అజ్ఞాతవాసి’ కి తాజావివాదం కలం కలం రేపుతోంది. -
బాలీవుడ్ కంపెనీతో పెళ్లిచూపులు హీరో..!
పెళ్లి చూపులు సినిమాతో బిగ్ హిట్ సాధించిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ఈ యంగ్ హీరో లావణ్య త్రిపాఠితో కలిసి మరో లవ్ స్టోరిని లైన్ లో పెట్టాడు. పరుశురాం దర్శకత్వంలో గీతాఆర్ట్స్ 2 బ్యానర్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమా తరువాత ఓ బడా బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి పనిచేయబోతున్నాడు విజయ్. బాలీవుడ్ మ్యూజిక్ కంపెనీ టి సిరీస్ విజయ్ దేవరకొండ లీడ్ రోల్ లోఒక మ్యూజిక్ ఆల్బం చేయబోతుంది. బాలీవుడ్ టాప్ స్టార్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, సోనమ్ కపూర్ లాంటి వారితో టి సిరీస్ సంస్థ మ్యూజిక్ వీడియోలు రూపొందించింది. ఇప్పుడు విజయ్ దేవరకొండతో తెలుగు, హిందీ భాషల్లో మ్యూజిక్ ఆల్బమ్ రెడీ చేస్తోంది. మిక్కి జే మేయర్ సంగీతం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాటను అర్మాన్ మాలిక్ గానం చేశాడు. విజయ్ దేవరకొండకు జోడిగా బెంగాలీ నటి కనిపించనుందట. సందీప్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన 'అర్జున్ రెడ్డి' సినిమా ఈ నెల ఆగష్టు 25 న విడుదలకాబోతుంది. ఈ సినిమాలో విజయ్ దేవేరకొండ కు జంటగా షాలిని హీరోయిన్ గా నటిస్తోంది.