
T-Series Issues Statement: ప్రముఖ ఆడియో కంపెనీ, మ్యూజిక్ ప్రొడక్షన్ హౌస్ టీ సిరీస్ ఎండీ భూషణ్ కుమార్‌పై అత్యాచార కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి, మూడేళ్లపాటు భూషణ్ తనపై అత్యాచారం చేశాడన్న బాధితురాలి ఆరోపణలను టీ సిరీస్ తోసిపుచ్చింది. ఆమె చెప్పేవన్నీ అవాస్తవాలేనని, ఈ మేరకు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయంటూ ప్రకటన విడుదల చేసింది.
"భూషణ్ కుమార్ మీద వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. పని పేరుతో ఆమెపై భూషణ్ అత్యాచారం చేశాడన్నది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే గతంలో ఆమె సినిమా, మ్యూజిక్ వీడియోల కోసం టీ సిరీస్ బ్యానర్‌లో పని చేసింది. ఈ ఏడాది మార్చిలో ఓ వెబ్ సిరీస్ నిర్మించాలనుకున్న ఆమె ఆర్థిక సాయం కోసం భూషణ్ కుమార్‌ను సంప్రదించింది. కానీ ఆమె విన్నపాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించాడు. ఆ తర్వాత జూన్‌లో(మహారాష్ట్రలో లాక్‌డౌన్ ఎత్తేశాక) భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ మరోసారి టీ సిరీస్ బ్యానర్‌ను సంప్రదించింది. ఈ క్రమంలో దోపిడీకి సైథః ప్రయత్నించగా జూలై 1న అంబోలీ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు చేశాం. దొంగతనానికి ప్రయత్నించింది అని నిరూపించేందుకు మా దగ్గర ఆడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. వీటిని అధికారులకు అప్పగిస్తాం. ఆ దోపిడీ కేసుకు కౌంటర్‌గా ఆమె ఈ ఫిర్యాదు చేసిందే తప్ప అంతకు మంచి మరొకటి కాదు. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం" అని లేఖలో స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment