
భార్య దివ్యా ఖోస్లాతో భూషణ్ (పాత ఫొటో)
ప్రముఖ ఆడియో కంపెనీ, మ్యూజిక్ ప్రొడక్షన్‌హౌజ్ టీ సిరీస్ వివాదంలో నిలిచింది. టీ సిరీస్ ఎండీ భూషణ్ కుమార్(43)పై అత్యాచార కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది.
2017లో తన అప్‌కమింగ్ ప్రాజెక్టుల్లో ఒకదాంట్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి మూడేళ్లపాటు భూషణ్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు(30) ఆరోపిస్తోంది. మూడేళ్లపాటు వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డాడని పేర్కొంటూ ముంబైలోని అంధేరీ డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
దీంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో భూషణ్ కుమార్ స్టేట్‌మెంట్ రికార్డు చేయాల్సి ఉంది. మరోవైపు భూషణ్ ఈ ఆరోపణలపై స్పందించాల్సి ఉంది. టీ సిరీస్ స్థాపకుడు, మధురగాయకుడైన గుల్షన్ కుమార్ పెద్ద కొడుకు అయిన భూషణ్ కుమార్ దువా. ప్రస్తుతం టీ సిరీస్‌కు చైర్మన్ కమ్ ఎండీగా కొనసాగుతున్నాడు. ఈయన భార్య నటి దివ్యా ఖోస్లా.
Comments
Please login to add a commentAdd a comment