T-Series Owner Bhushan Kumar Gifted An Expensive Ferrari F8 Tributo To Adipurush Director Om Raut - Sakshi
Sakshi News home page

Adipurush Director OM Raut: డైరెక్టర్‌ ఓం రౌత్‌కు లగ్జరీ ఫెరారీ కారు బహుమతి, ధర ఎంతంటే..

Published Wed, Oct 19 2022 1:10 PM | Last Updated on Wed, Oct 19 2022 3:08 PM

Om Raut Gifted Luxury Ferrari Car Worth Rs 4.02 Cr From Producer Bhushan Kumar - Sakshi

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు చర్చించుకుంటున్న సినిమా ఆదిపురుష్‌. ఇటీవల టీజర్‌ విడుదలైనప్పటి నుంచి సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసిన ఆదిపురుష్‌ ముచ్చట్లే కనిపిస్తున్నాయి. టీజర్‌ అద్భుతమంటు పలువురు ప్రశంసిస్తుంటే ఇందులోని పాత్రలను చూపించిన తీరుపై రాజకీయ ప్రముఖులు, హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంతేకాదు ఇది కార్టున్‌ చిత్రంలా ఉందంటూ ఫ్యాన్స్‌ సైతం అసహనం వ్యక్తం చేశారు. 

చదవండి: సుకుమార్‌-దేవిశ్రీ మధ్య రెమ్యునరేషన్‌ చిచ్చు! అసలేం జరిగింది?

పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్‌కు ముందే ఓం రౌత్‌ ఖరీదైన లగ్జరీ కారును బహుమతిగా అందుకున్నాడు. ఆది పురుష్‌ మూవీకి టీ-సిరీస్‌ అధినేత భూషన్‌ కుమార్‌ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తాజాగా నిర్మాత భూషన్‌ కుమార్‌ ఓం రౌత్‌కు లగ్జరీ ఫెరారీ ఎఫ్‌8 ట్రిబ్యూటో(uber-luxurious Ferrari F8 Tributo) కారును కానుగా ఇచ్చాడు. దీని ధర రూ. 4.02 కోట్లు ఉంటుందని అంచనా.

చదవండి: ‘బ్రహ్మాస్త్ర’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌! ఆ రోజు నుంచి స్ట్రీమింగ్‌..

అయితే ఇది అప్పటికప్పుడు షో రూంలో తీసుకుంది కాదనీ, ముందుగానే భూషన్‌ కుమార్‌ తన పేరు మీద ఈ కారు బుక్‌ చేశాడని తెలుస్తుంది. చూస్తుంటే ఓం రౌత్‌కు ఈ కారును గిఫ్ట్‌గా ఇవ్వాలని ఆయన ముందుగానే ప్లాన్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా బడా నిర్మాత అయిన భూషన్‌ కుమార్‌ ఇలా కాస్ట్లీ కార్లను బహుమతిగా ఇవ్వడం ఇదేం తొలిసారి కాదు. ఈ ఏడాది విడుదలైన భూల్‌ భూలయా 2 సినిమా సక్సెస్‌ నేపథ్యంలో హీరో కార్తిక్‌ ఆర్యన్‌కు ఆయన రూ. 4.70 విలువ చేసే లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement