gifted
-
కార్లు, బైక్‌లు అబ్బో.. అదృష్టమంటే ఈ ఐటీ కంపెనీ ఉద్యోగులదే!
చెన్నైకి చెందిన టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ అద్భుతమైన బహుమతులతో తమ ఉద్యోగులను ఆశ్చర్యపరిచింది. 28 కార్లు, 29 బైక్‌లను బహుమతిగా ఇచ్చింది. ఉద్యోగుల్లో మరింత ప్రేరణ కల్పించడానికి, ఉత్పాదకతను పెంచడానికి కంపెనీ ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది.2005లో ప్రారంభమైన టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ స్ట్రక్చరల్ స్టీల్ డిజైన్, డిటైలింగ్ సేవలను అందిస్తోంది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ కణ్ణన్ మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి, అభినందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ గుర్తింపు ఉద్యోగులను తమ పాత్రల్లో రాణించేలా మరింత ప్రేరేపిస్తుందని కంపెనీ అభిప్రాయపడింది.ఉద్యోగులకు బహుమతిగా ఇచ్చిన కార్లలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్ వంటి కంపెనీలతోపాటు మెర్సిడెస్ బెంజ్ కార్లు కూడా ఉండటం విశేషం. కార్లు, బైక్‌లతో పాటు, టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ తమ ఉద్యోగులకు వివాహ కానుకను కూడా అందిస్తోంది. గతంలో రూ.50,000గా ఉన్న ఈ కానుకను ఈ ఏడాది రూ.లక్షకు కంపెనీ పెంచింది. -
గాంధీ చెప్పే మూడు కోతుల కథ వెనుక..
నేడు దేశవ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. గాంధీ జీవితంతో ముడిపపడిన పలు కథనాలు మనం వింటుంటాం. వాటిలో ఒకటే గాంధీ చెప్పే ‘మూడు కోతుల కథ’. ఆ మూడు కోతులు చెడు మాట్లాడవద్దు, చెడు వినవద్దు, చెడు చూడవద్దు అనే సందేశాన్ని అందిస్తాయనే విషయం తెలిసిందే. అయితే గాంధీ దగ్గరకు ఈ మూడు కోతులు ఎలా వచ్చాయనే దాని వెనుక ఆసక్తికర ఘట్టం ఉంది.గాంధీ చెప్పే మూడు కోతుల కథ సుమారు 90 ఏళ్ల క్రితం నాటిది. ఈ కోతుల బొమ్మలు జపాన్ నుంచి గాంధీకి బహుమతిగా వచ్చాయి. జపాన్‌కు చెందిన ప్రముఖ బౌద్ధ సన్యాసి నిచిదత్సు ఫుజీ గాంధీకి ఈ మూడు కోతుల బొమ్మలను బహూకరించారు. జపాన్‌లోని అసో కాల్డెరా అడవుల్లో జన్మించిన నిచిదత్సు ఫుజీ వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. 19 ఏళ్ల ప్రాయంలోనే బౌద్ధ సన్యాసిగా మారాడు. 1917లో భారత్‌లో ఆయన తన మిషనరీ కార్యకలాపాలు ప్రారంభించాడు.1923లో జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ సమయంలో నిచిదత్సు ఫుజీ జపాన్‌కు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. కొన్నాళ్ల తర్వాత ఆయన తిరిగి భారత్ వచ్చాడు. 1931లో నిచిదత్సు ఫుజీ కలకత్తా చేరుకుని, నగరమంతా పర్యటించాడు. తన భారత పర్యటనలో నిచిదత్సు ఫుజీ మహాత్మా గాంధీని కలవాలనుకుని, వార్ధాలోని గాంధీ ఆశ్రమానికి వచ్చాడు. నిచిదత్సు ఫుజీని చూసి గాంధీ చాలా సంతోషించారు. అతను గాంధీకి మూడు కోతుల బొమ్మలను కానుకగా ఇచ్చాడు. గాంధీకి ఈ కోతి బొమ్మలు ఎంతగా నచ్చాయంటే, ఆయన వాటిని తన టేబుల్‌పై పెట్టుకున్నారు.గాంధీని కలవడానికి వచ్చిన ప్రతివారూ ఆ టేబుల్‌పై ఉన్న మూడు కోతులను గమనించి, దానిలోని అంతర్థాన్ని తెలుసుకునేవారు. అనతికాలంలోనే ఈ మూడు కోతుల సందేశం అందరికీ చేరింది. తరువాతి కాలంలో నిచిదత్సు ఫుజీ బీహార్‌లోని రాజ్‌గిర్‌లో శాంతి గోపురాన్ని నిర్మించారు. ఈ ప్రదేశంలో జపాన్ దేవాలయం కూడా ఉంది. జపనీస్ శైలిలో నిర్మించిన ఈ ఆలయంలో అందమైన తెల్లటి బుద్ధుని విగ్రహం కనిపిస్తుంది. నిచిదత్సు ఫుజీ 1986 జనవరి 9న కన్నుమూశారు.ఇది కూడా చదవండి: మహాత్మా గాంధీకి ప్రధాని మోదీ నివాళులు -
ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన బిగ్‌బాస్ శోభాశెట్టి (ఫొటోలు)
-
జీ20 నేతలకు అరకు కాఫీ గిఫ్ట్.. ఆనంద్ మహీంద్రా పోస్టు వైరల్..
జీ20 సమ్మిట్‌కు హాజరైన విదేశీ నేతలకు అరకు కాఫీలను కేంద్రం గిఫ్ట్‌గా ఇచ్చింది. దీనిపై వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేయగల భారతదేశ సామర్థ్యానికి ప్రధాన ఉదాహరణ అరకు కాఫీ అని ప్రశంసించారు. అరకు బోర్డు ఛైర్మన్‌గా ఈ ఘనత తనకు ఎంతో గర్వకారణమని అన్నారు. 'అరకు బోర్డు ఛైర్మన్‌గా నాకు ఇది ఎంతో గర్వించదగ్గ విషయం. అరకు కాఫీని గిఫ్ట్‌గా ఇవ్వడంపై నేను ఎక్కువ మాట్లాడలేను. ప్రపంచంలోనే అత్యంత కాఫీ ఉత్పత్తుల్లో ఇండియా అరకు కాఫీ కూడా ఒకటి. ఇది మనకు ఎంతో గర్వకారణం' అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. జీ20 సమావేశం నుంచి వెనుదిరుగుతున్న విదేశీ నేతలకు కేంద్రం అరకు కాఫీలను గిఫ్ట్‌గా ఇస్తున్న వీడియోను షేర్ చేశారు. As the Chairman of the Board of Araku Originals, I can’t argue with this choice of gift! It just makes me very, very proud. Araku Coffee is the perfect example of ‘The best in the World, Grown in India’… https://t.co/VxIaQT6nZL — anand mahindra (@anandmahindra) September 12, 2023 అరకు కాఫీ ఎంతో ప్రత్యేకమైనది. ఆంధ్రప్రదేశ్‌లోని అరకు కొండ ప్రాంతాల్లో సేంద్రీయ తోటల్లో దీనిని ఎక్కువగా పెంచుతారు. ప్రత్యేకమైన సుగంధ లక్షణాలు కలిగి రుచికి ప్రసిద్ధి చెందింది. అరకు కాఫీని గిరిజన రైతులు ఉత్పత్తి చేస్తారు. భారతదేశంలోని తూర్పు కనుమలలో ఉన్న సుందరమైన అరకు లోయ పర్యాటకంగా కూడా చాలా ప్రసిద్ధి చెందిన ప్రదేశం. 2008లో ఏర్పాటు చేసిన నంది ఫౌండేషన్ అరకు కాఫీని ప్రపంచ స్థాయికి తీసుకుపోవడంలో తోడ్పాటునిచ్చింది. ఇదీ చదవండి: భారతదేశాన్ని సూర్యుడు మొదట ముద్దాడే ప్రదేశం.. నాగాలాండ్ మంత్రి వీడియో వైరల్.. -
Mahindra Thar Gifted To Nikhat Zareen: వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్‌కు మహీంద్రా ‘థార్’ గిఫ్టు (ఫొటోలు)
-
ఫండ్స్‌ను మనవళ్లకు గిఫ్ట్ ఇవ్వొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?
నేను గ్రోత్ ఆప్షన్ బదులు ఐడీసీడబ్ల్యూ (నెలవారీ) ప్లాన్‌ను ఎంపిక చేసుకుంటే, ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు ఎలా ఉంటాయి? ఈ విషయలో పన్ను బాధ్యతలు ఎలా ఉంటాయి? – అభినవశ్రీ మీరు మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటుంటే ఇనకమ్ ఇస్ట్రిబ్యషన్ కమ్ క్యాపిటల్ విత్‌డ్రాయల్ (ఐడీసీడబ్ల్య) ప్లాన్‌కు దూరంగా ఉండండి. దీనికి బదులు గ్రోత్ ప్లాన్ ఎంపిక చేసుకోండి. ఐడీసీడబ్ల్యూ ప్లాన్ పన్ను పరంగా మెరుగైనది కాదు. గ్రోత్ ప్లాన్ పన్ను పరంగా మెరుగైన సాధనం. గ్రోత్ ప్లాన్‌లో పెట్టుబడులపై రాబడులు అన్నీ ఫండ్ వద్దే ఉంటాయి. దీంతో వాటిపైనా రాబడితో కాంపౌండింగ్ ప్రయోజనాన్ని పూర్తిగా పొందుతారు. అదే ఐడీసీడబ్ల్యూ ప్లాన్‌లో డివిడెండ్ అన్నది పెట్టుబడి, రాబడుల్లో కొత భాగాన్ని ఫండ్ సంస్థ తిరిగి చెల్లించడం. స్టాక్స్‌లో అయితే డివిడెండ్ వరకే ఇన్వెస్టర్లకు నేరుగా చెల్లిచడం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో డివిడెండ్లు అన్నవి తప్పుడు పదంతో ఇంత కాలం కొనసాగాయి. అందుకే ఇటీవలే డివిడెండ్ పేరును ఐడీసీడబ్ల్యూగా మార్చారు. డివిడెండ్లు చెల్లించిన వెంటనే ఫండ్ ఎన్ఏవీ అంతే మేర తగ్గుతుంది. ఐడీసీడబ్ల్యూ ప్లాన్‌లో డివిడెండ్లు మీ పన్ను ఆదాయానికి తోడవుతాయి. మీ శ్లాబు ప్రకారం పన్ను చెల్లించాలి. ఒక ఏడాదిలో డివిడెండ్ ద్వారా రూ. 5,000కు మించి ఆదాయం లభిస్తే టీడీఎస్ కింద 10 శాతాన్ని మినహాయిస్తారు. డివిడెండ్‌ను ఇన్వెస్టర్‌కు చెల్లించినా, లేక దాన్ని తిరిగి ఇన్వెస్ట్ చేసినా కానీ ఈ 10 శాతం టీడీఎస్ అమలవుతుంది. సాంకేతికంగా చూస్తే ఆదాయం లభిస్తే టీడీఎస్ కింద 10 శాతాన్ని మినహాయిస్తారు. డివిడెండ్‌ను ఇన్వెస్టర్‌కు చెల్లించినా, లేక దాన్ని తిరిగి ఇన్వెస్ట్ చేసినా కానీ ఈ 10 శాతం టీడీఎస్ అమలవుతుంది. సాంకేతికంగా చూస్తే ఐడీసీడబ్ల్యూ ప్లాన్‌లో మీ పెట్టుబడి ఫండ్ సంస్థతోనే ఉంటుంది. కానీ, వాస్తవంగా చూస్తే చెల్లించే డివిడెండ్‌పై పన్ను పడుతుంది. కనుక పన్ను పరంగా అంత సమర్థమైనది కాదు. ఐడీసీడబ్ల్యూ ప్లాన్‌లో డివిడెండ్ ఎంత చెల్లించాలన్నది ఫండ్ సంస్థలు నిర్ణయిస్తాయి. ఇందులో ఇన్వెస్టర్లకు పాత్రకు ఉండదు. మీకు క్రమం తప్పకుండా ఫండ్స్ పెట్టుబడుల నుంచి ఆదాయం రావాలని కోరుకుంటే, అందుకు గ్రోత్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేసి, సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ఎంపిక చేసుకోవడం మెరుగైనది. దీనివల్ల ఎంత కాలానికి ఎంత చొప్పున కావాలన్నది మీరే నిర్ణయించుకోవచ్చు. కనుక ఐడీసీడబ్ల్యూ ప్లాన్‌తో పోలిస్తే గ్రోత్ ప్లాన్ చాలా మెరుగైనది. మీ పెట్టుబడులపై మీరు నియంత్రణ కలిగి ఉంటారు. నా కుమారుడు మరణించాడు. జాయింట్ హోల్డర్‌గా ఉండడంతో ఫండ్స్ యూనిట్లు నాకు సంక్రమించాయి. వీటిని నా కుమారుడి పిల్లలకు బదిలీ చేయాలని అనుకుంటున్నాను. సాధ్యపడుతుందా? – విష్ణు కుమార్ మీ పేరుతో ఉన్న ఫండ్ యూనిట్లను మీ మనవళ్లు, మనవరాళ్లకు ఇవ్వడానికి లేదు. ఎందుకంటే ఫండ్స్ యూనిట్లు అనేవి గిఫ్ట్‌గా ఇవ్వడానికి, మరొకరికి బదిలీ చేయడానికి అవకాశం లేదు. అయితే మీ మనవళ్ల పేరిట ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇందుకు మీరు ముందుగా మీ పేరుతో ఉన్న ఫండ్స్ పెట్టుబడులు మొత్తాన్ని వెనక్కి తీసుకోండి. మీ మనవళ్ల వయసు 18 ఏళ్లు నిండి ఉంటే ప్రస్తుత పెట్టుబడులను వెనక్కి తీసుకుని, వచ్చిన మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయండి. అప్పుడు మీ మనవళ్లు, మనవరాళ్లే స్వయంగా వారి బ్యాంకు ఖాతా నుంచి ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ విషయంలో మీరు వారికి సాయం అందించొచ్చు. ఒకవేళ మీ మవనళ్ల వయసు 18 ఏళ్లలోపు ఉంటే వారి తల్లి లేదంటే కోర్టు నియమించిన గార్డియన్‌కు పెట్టుబడులు బదలాయించొచ్చు. ఆ పని వారే చేస్తారు. మరో మార్గంలో ప్రస్తుతం మీ పేరుతో ఉన్న పెట్టుబడులను కొనసాగిస్తూ, నామినీగా మీ మనవళ్లు, మనవరాళ్లను పేర్కొనాలి. ఎవరికి ఎంత శాతం అనేది నిర్ణయించొచ్చు. అప్పుడు యూనిట్ హోల్డర్‌కు ఏదైనా జరిగితే అవి వారి పేరిట బదిలీ అవుతాయి. ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
‘ఆదిపురుష్’ డైరెక్టర్‌కు లగ్జరీ ఫెరారీ కారు బహుమతి, ఎవరిచ్చారంటే..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు చర్చించుకుంటున్న సినిమా ఆదిపురుష్. ఇటీవల టీజర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఆదిపురుష్ ముచ్చట్లే కనిపిస్తున్నాయి. టీజర్ అద్భుతమంటు పలువురు ప్రశంసిస్తుంటే ఇందులోని పాత్రలను చూపించిన తీరుపై రాజకీయ ప్రముఖులు, హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంతేకాదు ఇది కార్టున్ చిత్రంలా ఉందంటూ ఫ్యాన్స్ సైతం అసహనం వ్యక్తం చేశారు. చదవండి: సుకుమార్-దేవిశ్రీ మధ్య రెమ్యునరేషన్ చిచ్చు! అసలేం జరిగింది? పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్‌కు ముందే ఓం రౌత్ ఖరీదైన లగ్జరీ కారును బహుమతిగా అందుకున్నాడు. ఆది పురుష్ మూవీకి టీ-సిరీస్ అధినేత భూషన్ కుమార్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తాజాగా నిర్మాత భూషన్ కుమార్ ఓం రౌత్‌కు లగ్జరీ ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో(uber-luxurious Ferrari F8 Tributo) కారును కానుగా ఇచ్చాడు. దీని ధర రూ. 4.02 కోట్లు ఉంటుందని అంచనా. చదవండి: ‘బ్రహ్మాస్త్ర’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఆ రోజు నుంచి స్ట్రీమింగ్.. అయితే ఇది అప్పటికప్పుడు షో రూంలో తీసుకుంది కాదనీ, ముందుగానే భూషన్ కుమార్ తన పేరు మీద ఈ కారు బుక్ చేశాడని తెలుస్తుంది. చూస్తుంటే ఓం రౌత్‌కు ఈ కారును గిఫ్ట్‌గా ఇవ్వాలని ఆయన ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా బడా నిర్మాత అయిన భూషన్ కుమార్ ఇలా కాస్ట్లీ కార్లను బహుమతిగా ఇవ్వడం ఇదేం తొలిసారి కాదు. ఈ ఏడాది విడుదలైన భూల్ భూలయా 2 సినిమా సక్సెస్ నేపథ్యంలో హీరో కార్తిక్ ఆర్యన్‌కు ఆయన రూ. 4.70 విలువ చేసే లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చాడు. -
ఈ విజయం ఎంతో ప్రత్యేకం
న్యూఢిల్లీ: పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌గా నిలవడంతో అందరికంటే అమితానందం పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్. తన శిష్యురాలి తాజా ప్రదర్శన గోపీచంద్‌ను గర్వపడేలా చేసింది. స్వర్ణం సాధించడంతో ఒక పనైపోయిందని ఆయన అన్నారు. ‘నాకు సంబంధించి ఇది చాలా పెద్ద విజయం. వరల్డ్ చాంపియన్ అనిపించుకోవడం నిజంగా చాలా గొప్ప ఘనత. దీనిని ఆమె సాధించిన తీరు ఇంకా అపూర్వం. రెట్టింపు గర్వంగా అనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ గెలుపు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక మన దేశం నుంచి ఇప్పటికే కాంస్యం, రజతం చూశాం. ఇప్పుడు స్వర్ణం కూడా దక్కింది’ అని గోపీచంద్ భావోద్వేగంతో చెప్పారు. ఒకుహారాతో జరిగిన మ్యాచ్‌పై ప్రత్యేక వ్యూహంతో బరిలోకి దిగాల్సిన అవసరం లేకపోయిందని, ఒక్కసారి మ్యాచ్‌లో పట్టు చిక్కితే ఆమె దూసుకుపోతుందనే విషయం తనకు తెలుసని కోచ్ వ్యాఖ్యానించారు. ‘ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్‌షిప్, కామన్వెల్త్, ఆసియా క్రీడలు... ఇలా అన్ని చోట్లా సింధు రాణించింది. బయటి వారి సంగతి ఎలా ఉన్నా ఆమె ఆటపై నాకు మాత్రం ఎలాంటి సందేహాలు లేవు. ఫైనల్లో ఫలితం ప్రతికూలంగా వచ్చినా నేను బాధపడకపోయేవాడిని. మన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే ముఖ్యం’ అని మాజీ ఆల్‌ఇంగ్లండ్ చాంపియన్ అభిప్రాయపడ్డారు. ఎమ్మెస్కే అభినందన... సింధు విజయంపై భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అభినందనలు తెలియజేశారు. ఈ క్రమంలో గోపీచంద్ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు ‘సింధు కఠోర శ్రమ, అంకితభావం, నైపుణ్యానికి దక్కిన ఫలితమిది. ఆమెను చూసి దేశం గర్విస్తోంది. భారత బ్యాడ్మింటన్‌కు వెన్నెముకలా నిలిచి శ్రమించిన గోపీచంద్‌కు కూడా నా అభినందనలు. వ్యక్తిగతంగా ఆయన నాకు ఆత్మీయ మిత్రుడు. ఇంతటి అంకితభావం ఉన్న కోచ్‌ను నేను ఎప్పుడూ చూడలేదు’ అని ప్రసాద్ అన్నారు. చాముండేశ్వరీనాథ్ కారు కానుక... వరల్డ్ చాంపియన్‌షిప్ స్వర్ణం గెలిచిన పీవీ సింధుకు అత్యాధునిక హై ఎండ్ కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు వి.చాముండేశ్వరీనాథ్ ప్రకటించారు. నేడు హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో దీనిని అందజేసే అవకాశం ఉంది. -
ఫుట్‌బాల్ టికెట్లు, వాచీలు..!
న్యూఢిల్లీ: వేల కోట్ల రుణాల డిఫాల్ట్‌తో మార్కెట్లను అతలాకుతలం చేసిన ఇన్ఫ్రా ఫైనాన్స్ సంస్థ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కుంభకోణంలో విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అధిక రేటింగ్ పొందేందుకు కంపెనీ మేనేజ్మెంట్ ఏవిధంగా అడ్డదారులు తొక్కారన్న వివరాలన్నీ ఒక్కొక్కటిగా బైటికొస్తున్నాయి. రేటింగ్ ఏజెన్సీల అధికారులకు ఫుట్‌బాల్ మ్యాచ్ టికెట్ల నుంచి వాచీలు, షర్టుల దాకా తాయిలాలిచ్చి ఏవిధంగా కుంభకోణానికి తెరతీసినది గ్రాంట్ థార్న్టన్ మధ్యంతర ఆడిట్లో వెల్లడయింది. దాదాపు రూ. 90,000 కోట్ల రుణభారం ఉన్న ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్ సంస్థలు పలు రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్ అయిన సంగతి తెలిసిందే. సంక్షోభంలో ఉన్న ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్ సంస్థలకు మెరుగైన రేటింగ్స్ ఇచ్చిన వివాదంలో ఇప్పటికే ఇద్దరు సీఈవోలను రెండు రేటింగ్ ఏజెన్సీలు సెలవుపై పంపాయి. ఇక, కొత్తగా ఏర్పాటైన బోర్డు... గత మేనేజ్మెంట్ వ్యవహారాల నిగ్గు తేల్చేలా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించే బాధ్యతలను కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్‌టన్‌కు అప్పగించింది. 2008–2018 మధ్య కాలంలో గ్రూప్ సంస్థల బాండ్లు తదితర సాధనాలకు అధిక రేటింగ్ ఇచ్చి, ఆయా సంస్థలు భారీగా నిధులు సమీకరించుకోవడంలో రేటింగ్ ఏజెన్సీలు పోషించిన పాత్రపై ఆడిట్ నిర్వహిస్తున్న గ్రాంట్ థార్న్టన్ మధ్యంతర నివేదికను రూపొందించింది. ఇండియా రేటింగ్స్ అధికారికి లబ్ధి.. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్వర్క్స్ (ఐటీఎన్‌ఎల్), ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎఫ్ఐఎన్), ఐఎల్ అండ్ ఎఫ్ఎస్కు 2008–2018 మధ్యకాలంలో ప్రధానంగా కేర్, ఇక్రా, ఇండియా రేటింగ్స్, బ్రిక్‌వర్క్ సంస్థలు రేటింగ్ సేవలు అందించాయి. 2012 సెప్టెంబర్– 2016 ఆగస్టు మధ్యకాలంలో ఐఎఫ్ఐఎన్ మాజీ సీఈవో రమేష్ బవా, ఫిచ్ రేటింగ్స్‌లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ విభాగం హెడ్ అంబరీష్ శ్రీవాస్తవ మధ్య జరిగిన ఈమెయిల్స్ సంభాషణలను గ్రాంట్ థార్న్టన్ పరిశీలించింది (ఇండియా రేటింగ్స్‌కి ఫిచ్ మాతృసంస్థ). శ్రీవాస్తవ భార్య ఓ విల్లా కొనుక్కోవడంలోనూ, డిస్కౌంటు ఇప్పించడంలోనూ రమేష్ తోడ్పాటునిచ్చినట్లు వీటి ద్వారా తెలుస్తోంది. అలాగే, విల్లా కొనుగోలు మొత్తాన్ని చెల్లించడంలో జాప్యం జరగ్గా.. దానిపై వడ్డీని మాఫీ చేసేలా చూడాలంటూ యూనిటెక్ ఎండీ అజయ్ చంద్రను కూడా రమేష్ కోరినట్లు నివేదికలో పేర్కొంది. -
బద్రినాథ్ గుడిలో కొత్త బంగారు గొడుగు
గోపేశ్వర: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బద్రినాథ్‌లోని విష్ణు భగవానుడి విగ్రహంపై కొత్త బంగారు గొడుగును ఏర్పాటుచేశారు. నాలుగు కేజీల బరువున్న ఈ గొడుగును లూధియానాకు చెందిన సూద్ కుటుంబం కానుకగా సమర్పించింది. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో దాన్ని దేవాలయానికి తీసుకొచ్చి ప్రత్యేక ప్రార్థనల నడుమ గర్భగుడిలో ప్రతిష్టించారు. సూద్ కుటుంబీకులు, దేవాలయ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 600 ఏళ్ల కిత్రం గ్వాలియర్ రాచకుటుంబానికి చెందిన మహరాణి అహల్యా బాయ్ సోల్కర్ సమర్పించిన గొడుగు స్థానంలో కొత్త గొడుగును అమర్చారు. -
విభిన్న ప్రతిభావంతుల సమస్యలపై చట్టసభల్లో చర్చ
– ఒకరోజు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో సూచనలు తీసుకుంటాం – శాసనమండలి చైర్మన్ చక్రపాణియాదవ్ కర్నూలు(అర్బన్): విభిన్న ప్రతిభావంతుల సామాజిక, ఆర్థిక పరిపుష్టికి సంబంధించి ప్రత్యేక అజెండాను రూపొందించి శాసనసభ, శాసనమండలిలో ఒక రోజు సంపూర్ణ చర్చ జరిగేందుకు కృషి చేస్తామని శాసనమండలి చైర్మన్ డా.ఏ చక్రపాణియాదవ్ అన్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సూచనలు, సలహాలు స్వీకరించి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రయోజన పూర్వకమైన ఉత్తర్వులను తీసుకువస్తామన్నారు. శనివారం ప్రపంచ ప్రత్యేక ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా స్థానిక కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముందుగా స్థానిక అంబేడ్కర్‌భవన్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చక్రపాణియాదవ్ మాట్లాడుతూ వికలాంగుల్లో ఎనలేని శక్తి సామర్థ్యాలు దాగి ఉంటాయని, వాటిని వెలికితీసేందుకు కృషి చేయాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు వారికి అండగా మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సి. హరికిరణ్ మాట్లాడుతూ జిల్లాలో 55 వేల మందికి వికలాంగ పింఛన్లు ఇస్తున్నామని, ఏ కుటుంబంలోనైనా 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఉంటే ఆయా కుటుంబాలకు అంత్యోదయ కార్డులు అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఇందుకు సంబంధించి గుర్తింపు ప్రక్రియ ప్రారంభించామన్నారు. ఈ నెలలో జరగనున్న సదరం క్యాంపులో దివ్యాంగులు దరఖాస్తులు అందించి తగిన సర్టిఫికెట్లు పొంది పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కర్నూలులో సెన్సరీ పార్కు ఏర్పాటుకు రూ. 5 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. అనంతరం వీల్చైర్లు, ట్రైసైకిళ్లు, వివాహ ప్రోత్సాహకాలు అందించారు. కార్యక్రమంలో జేసీ–2 ఎస్ రామస్వామి, ఉపాధ్యాయులు పుష్పరాజ్, ఉద్యోగ సంఘాల ప్రతినిధి కృష్ణతో పాటు పెద్ద సంఖ్యలో విభిన్న ప్రతిభావంతులు హాజరయ్యారు. -
3న ప్రత్యేక ప్రతిభావంతుల శోభయాత్ర
కర్నూలు(అర్బన్): ప్రపంచ ప్రత్యేక ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 3వ తేదీన ఉదయం 9 గంటలకు అంబేద్కర్ భవన్ నుంచి సునయన ఆడిటోరియం వరకు శోభయాత్రను నిర్వహిస్తున్నట్లు వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు భాస్కర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వయో వృద్ధుల సంక్షేమ శాఖ, గ్రామీణ, పట్టణాభివృద్ధి సంస్థ, మెప్మా, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, సర్వశిక్ష అభియాన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక విద్యను కల్పిస్తున్న విద్యా సంస్థల్లో చదువుతన్న విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. శోభయాత్ర అనంతరం ఉదయం 10 గంటలకు సునయన ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, విభిన్న ప్రతిభావంతులు. ఆయా సంఘాలకు చెందిన నాయకులు హాజరు కావాలని కోరారు.