బద్రినాథ్‌ గుడిలో కొత్త బంగారు గొడుగు | New gold umbrella installed at Badrinath | Sakshi
Sakshi News home page

బద్రినాథ్‌ గుడిలో కొత్త బంగారు గొడుగు

Published Fri, May 11 2018 2:50 AM | Last Updated on Fri, May 11 2018 2:50 AM

New gold umbrella installed at Badrinath  - Sakshi

గోపేశ్వర: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బద్రినాథ్‌లోని విష్ణు భగవానుడి విగ్రహంపై కొత్త బంగారు గొడుగును ఏర్పాటుచేశారు. నాలుగు కేజీల బరువున్న ఈ గొడుగును లూధియానాకు చెందిన సూద్‌ కుటుంబం కానుకగా సమర్పించింది. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో దాన్ని దేవాలయానికి తీసుకొచ్చి ప్రత్యేక ప్రార్థనల నడుమ గర్భగుడిలో ప్రతిష్టించారు. సూద్‌ కుటుంబీకులు, దేవాలయ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 600 ఏళ్ల కిత్రం గ్వాలియర్‌ రాచకుటుంబానికి చెందిన మహరాణి అహల్యా బాయ్‌ సోల్కర్‌ సమర్పించిన గొడుగు స్థానంలో కొత్త గొడుగును అమర్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement