badrinath temple
-
Badrinath Highway: విరిగిపడిన కొండచరియలు.. తృటిలో తప్పించుకున్న కార్మికులు
ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్‌లో దేవుడుని దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులకు కష్టాలు తప్పడం లేదు. భారీ వర్షాలు, వరదలతో కొండ చరియలు విరిగి పడుతున్నాయి. రోడ్లు, రహాదారులను అధికారులు ముందు జాగ్రత్తగా మూసేస్తున్నారు. దీంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.చమోలీ జిల్లాలో బద్రీనాథ్ యాత్రాస్థలిని కలిపే జాతీయ రహదారిపై ప్రజలు చూస్తుండగానే ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. దీంతో భయభ్రాంతులకు గురైన అక్కడి ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు.హైవేపై కొండచరియలు విరిగిపడటంతో శిథిలాక కారణంగా రహదారిని అధికారులు మూసివేశారు. సుమారు 48 గంటల పాటు ఈ రోడ్డును మూసివేస్తున్నట్లు ప్రకటించారు.కాగా బద్రీనాథ్ హైవేను తిరిగి తెరిచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. రహదారిపై పడిన శిథిలాలను కార్మికులు తొలగిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం కార్మికులు పనిచేస్తుండగా పర్వతం నుంచి ఒక్కసారిగా బండరాళ్లు కిందపడ్డాయి. అయితే ఈ ప్రమాదం నుంచి కార్మికులు తృటిలో తప్పించుకున్నారు. రాళ్లు జారడం చూసిన కార్మికులు కొండపైకి పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది.ఇక బద్రీనాథ్ జాతీయ రహదారి మూసివేయడంతో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. రహదారిని క్లియర్ చేసేందుకు బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జోషిమఠ్ వద్ద రహదారిని క్లియర్ చేసేందుకు సుమారు 241 ఎక్స్కవేటర్లను అక్కడ మోహరించారు. ఉత్తరాఖండ్‌లో వర్షం, కొండచరియలు విరిగిపడటంతో మొత్తం 260కి పైగా రోడ్లు మూసేశారు. . రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా ఛార్‌దామ్ యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. -
Badrinath Temple Photos: జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిన ఆధ్యాత్మిక యాత్ర (ఫొటోలు)
-
Badrinath In Hyderabad: హైదరాబాద్ శివారులో బద్రీనాథుడు.. అచ్చం ఉత్తరాఖండ్ లాగే నిర్మాణం (ఫొటోలు)
-
హైదరాబాద్ లో బద్రినాథ్ ఆలయం
-
చార్ధామ్ దేవస్థానం బోర్డు రద్దు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో రెండేళ్ల క్రితం నుంచి విధులు నిర్వర్తిస్తున్న చార్ధామ్ దేవస్థానం బోర్డును రద్దుచేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చార్ధామ్ దేవస్థానం బోర్డు చట్టాన్ని ఉపసంహరిం చుకుంటున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం ప్రకటించారు. ఈ నిర్ణయంపై పూజారులు హర్షం వ్యక్తంచేశారు. మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ హయాంలో 2019లో ఈ బోర్డును ఏర్పాటుచేశారు. ప్రఖ్యాత ఆలయాలు కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిసహా 51 ప్రముఖ ఆలయాల పాలనా వ్యవహారాలను ఈ బోర్డు చూసుకుంటోంది. అయితే తమ సంప్రదాయ హక్కులను ఈ బోర్డు ఉల్లంఘిస్తోందని, పూజారులు మొదట్నుంచీ బోర్డు ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో తాజాగా మనోహర్ కంత్ ధ్యాని నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీ ఈ సమస్యలపై అధ్యయనం చేసి నివేదికను సీఎం పుష్కర్ ధామికి ఆదివారం అందజేసింది. అన్ని సమస్యలను పరిగణనలోకి తీసుకుని, కమిటీ సిఫార్సుల మేరకు బోర్డును రద్దు చేస్తున్నట్లు సీఎం మంగళవారం చెప్పారు. ప్రభుత్వంపై ఒత్తిడి కారణంగానే ఇది సాధ్యమైందని పూజారులు సంతోషం వ్యక్తంచేశారు. ‘సాగు చట్టాల రద్దు తరహాలోనే ఈ సారీ బీజేపీ సర్కార్ దురహంకారం ఓడిపోయింది. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇది ముమ్మాటికీ పూజారుల విజయం’ అని ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ వ్యాఖ్యానించారు. -
చార్ధామ్ యాత్రకు కోర్టు బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ: జూలై 1వ తేదీ నుంచి ఉత్తరాఖండ్‌లోని మూడు జిల్లాల ప్రజల కోసం చార్ధామ్ యాత్రను పాక్షికంగా తెరవాలన్న రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయంపై ఉత్తరాఖండ్ హైకోర్టు స్టే విధించింది. కోవిడ్ మహమ్మారి మధ్య యాత్ర నిర్వహించడం వల్ల కలిగే నష్టాలకు సంబంధించి న్యాయవాదులు దుష్యంత్ మైనాలి, సచి్చదానంద్ దబ్రాల్, అను పంత్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అలోక్ కుమార్ వర్మలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాశ్, ఇతర ఉన్నతాధికారులు కోర్టులో హాజరయ్యారు. విచారణ సందర్భంగా కోవిడ్ మహమ్మారి మధ్య యాత్రికులు, పర్యాటకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తపరిచారు. అంతేగాక దేవాలయాలలో లైవ్ స్ట్రీమింగ్ చేయడం, ఆచారాలు, సంప్రదాయాలకు విరుద్ధమని రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదన, అర్చకుల భావోద్వేగాలపై సానుభూతితో చేసినట్లుగా ప్రభుత్వ వాదన ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. కాగా చార్ధామ్ యాత్ర కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ) ను తిరస్కరిస్తూ, అవి కుంభమేళా సందర్భంగా జారీ చేసిన మార్గదర్శకాల నకలు కాపీ మాత్రమేనని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఎస్ఓపీలో హరిద్వార్ జిల్లాలో పోలీసుల మోహరింపు ప్రస్తావించారని, ఇది యాత్ర విషయంలో ప్రభుత్వం ఏమేరకు సీరియస్‌గా ఉందో చూపిస్తోందని కోర్టు తెలిపింది. చార్ధామ్ యాత్ర కుంభ్‌మేళా మాదిరిగా మరో ‘కోవిడ్ సూపర్ స్ప్రెడర్’గా మారకుండా ఉండేందుకు యాత్రను నిలిపివేయాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే దేవాలయాలతో ప్రజలకు ఉన్న మనోభావాలను పరిగణనలోకి తీసుకుని, ప్రస్తుతం గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ధామాల్లో కొనసాగుతున్న కార్యక్రమాలను ప్రజలు వీక్షించేలా ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ‘శాస్తాలు రాసినప్పుడు ముఖ్యమైన ఘటనలను ప్రసారం చేసేందుకు టెలివిజన్ వంటి సాంకేతిక పరిజ్ఞానం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ వాదనను తప్పుబడుతూ కోర్టు వ్యాఖ్యానించింది. కేవలం కొంతమంది భావాలను పట్టించుకోకుండా, డెల్టా ప్లస్ వేరియంట్ నుంచి ప్రతి ఒక్కరినీ రక్షించడం చాలా ముఖ్యమని కోర్టు అభిప్రాయపడింది. గత సంవత్సరం కరోనా మొదటి వేవ్ సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం జూలై 1 నుంచి చార్ధామ్ యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా, కరోనా రెండవ వేవ్ వేగం కాస్త మందగించడంతో చమోలి, రుద్రప్రయాగ్, ఉత్తర కాశీ జిల్లాల నివాసితుల కోసం పరిమితంగా చార్ధామ్ యాత్రను ప్రారంభించేందుకు ఈనెల 25న రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. చదవండి: Auli Bugyal: మంచు తివాచీ.. రెండు కళ్లు చాలవు! Vitamin C: తక్కువైతే తంటా.. ఎక్కువైతే మంట! -
తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం.. కానీ
డెహ్రాడూన్ : పవిత్ర పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయం తెరుచుకుంది. నేడు ( శుక్రవారం) ఉదయం 4:30 నిమిషాలకు వేద మంత్రాలతో ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. అనంతరం ఆలయాన్ని పూలతో సుందరంగా అలంకరించి అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాన పూజారితో సహా మొత్తం 28 మంది మాత్రమే ఆలయం తలుపులు తెరుచుకున్నప్పుడు బద్రీనాథుని సన్నిధిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే కరోనా కారణంగా దేవాలయాలన్నీ మూతపడిన విషయం తెలిసిందే. (చైనా నుంచే వ్యాప్తి: భయపెడుతున్న స్వైన్ ఫీవర్) కాగా ప్రస్తుతం పవిత్రక్షేత్రంలోకి భక్తులను అనుమంచడం లేదు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆదేశాల మేరకు భక్తులను ఎవరిని ఆలయంలోకి అనుమతించడం లేదని చమోలీ సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ అనిల్ ఛన్యాల్ తెలిపారు. శీతాకాల విరామం తరువాత ఏప్రిల్ 29న మొదట ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. అయితే కరోనా కారణంగా ఏ యాత్రికుడిని ఆలయంలోకి అనుమంతించలేదు. యత్రికులు లేకుండానే పంచముఖి డోలీ యాత్ర నిర్వహించారు. గత సంవత్సరం ఆలయం తెరిచిన మొదటి రోజు 10 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కాని లాక్డౌన్ కారణంగా ఈ సంవత్సరం భక్తుల ప్రవేశానికి అనుమతి ఇవ్వలేదు. ఆ పుణ్యక్షేత్రాల దర్శన భాగ్యం లేనట్టేనా! -
ఆ పుణ్యక్షేత్రాల దర్శన భాగ్యం లేనట్టేనా!
డెహ్రాడూన్: మే 15 నుంచి ప్రముఖ విష్ణ ఆలయం బద్రినాధ్ పుణ్యక్షేత్రం తెరుచుకోనుంది. మే15 ఉదయం 4:30 గంటలకు బద్రీనాధ్ ఆలయ ద్వారాలు తెరవడం జరుగుతుందని ఉత్తరఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ గత నెలలోనే ప్రకటించారు. ఆరు నెలల తరువాత మంచు కరిగి ఆలయం కనిపించడంతో మళ్లీ ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. అయితే ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకుడితో కలిపి కేవలం 27 మందిని మాత్రమే అనుమతించనున్నారు. (కరోనా క్యాబ్‌లు వచ్చేశాయ్!) కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో భక్తులను ఎవరిని ఆలయంలోకి అనుమతించడం లేదని చమోలీ సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ అనిల్ ఛన్యాల్ తెలిపారు. ‘గాడు గాథ’ సంప్రదాయం ప్రకారం స్వామి వారికి నువ్వుల నూనెతో చేసే కైంకర్యాలను కూడా గత వారం నిర్వహించారు. ఆరు నెలల విరామం తరువాత కేథరినాధ్, బద్రినాధ్ ఆలయాలు తెరుచుకోబడ్డాయి. మంచు కారణంగా ఈ ఆలయాలు ఆరు నెలల పాటు ప్రతి యేడాది మూసివేయబడతాయనే విషయం తెలిసిందే. (కరోనా సాకుతో ఇంత అన్యాయమా?) -
ఈసీకి మోదీ కృతజ్ఞతలు
బద్రీనాథ్/కేదార్నాథ్/న్యూఢిల్లీ: తన ఉత్తరాఖండ్ పర్యటనకు అనుమతి ఇచ్చిన ఎన్నికల సంఘానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ఉదయం బద్రీనాథ్ వెళ్లేముందు ఆయన కేదార్‌నాథ్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘నిశ్శబ్ద సమయం’లో మోదీ చేపట్టిన పర్యటనపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రధాని పర్యటనకు మీడియా పెద్దయెత్తున ప్రచారం కల్పించడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఇది పూర్తిగా ఎన్నికల నియమావళి ఉల్లంఘనే అంటూ విపక్షాలు ధ్వజమెత్తాయి. కాగా కేదార్‌నాథ్‌లో ధ్యానం సందర్భంగా తానేమీ కోరుకోలేదని, అది తన నైజం కాదని మోదీ చెప్పారు. డిమాండ్ చేయడం కాకుండా ఇచ్చే సామర్థ్యాన్ని దేవుడు మనకిచ్చాడని ఆయన అన్నారు. దేవుడు భారతదేశాన్నే కాకుండా యావత్ మానవాళి సంతోషంగా ఉండేలా దీవించాలని ప్రధాని ఆకాంక్షించారు. బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నానన్నారు. పలుమార్లు ఈ ఆలయాన్ని సందర్శించడం తన అదృష్టమని, 2013లో వరుస వరదలతో కుదేలైన కేదార్‌నాథ్‌లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. బద్రీనాథ్‌లో 20 నిమిషాలు పూజ శనివారం కేదార్నాథ్ సందర్శించిన మోదీ సుమారు 20 గంటల పాటు అక్కడ గడిపిన తర్వాత ఆదివారం వైమానిక దళం హెలికాప్టర్లో బద్రీనాథ్ చేరుకున్నారు. ఆలయానికి సమీపంలోని ఐఏఎఫ్ హెలిప్యాడ్ వద్ద దిగిన ఆయన తర్వాత రోడ్డు మార్గంలో గుడికి చేరుకున్నారు. ఆలయం లోపల గర్భగుడిలో పూజలు జరిపారు. ప్రధాని సుమారు 20 నిమిషాలు పూజలో పాల్గొన్నారని బద్రీనాథ్–కేదార్నాథ్ ఆలయ కమిటీ చీఫ్ మోహన్ ప్రసాద్ తప్లియాల్ వెల్లడించారు. ఆలయ పూజారులు ఆయనకు భోజ చెట్టు ఆకులపై రూపొందించిన గ్రీటింగ్ కార్డును అందజేసినట్లు తెలిపారు. కాగా కొద్దిసేపు ఆలయం ఆవరణలో కలియతిరిగిన మోదీ భక్తులకు, స్థానికులకు షేక్‌హ్యాండ్ ఇచ్చారని, ఆలయం వద్ద వేచి చూస్తున్న యాత్రికులను ప్రధాని కలిసారని వివరించారు. కాగా అతిథి గృహంలో ప్రధానితో భేటీ అయిన ఆలయ కమిటీ సభ్యులు ఆలయం ఆవరణాన్ని విస్తరించాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ ఓ వినతిపత్రం అందజేశారు. మీడియా కవరేజీపై టీఎంసీ ఫిర్యాదు ప్రధాని నరేంద్ర మోదీ కేదార్‌నాథ్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడటం అనైతికమని తృణమూల్ కాంగ్రెస్ విమర్శించింది. ఆయన సందర్శనకు మీడియా కవరేజీ ఇవ్వడం ఎన్నికల నియమావళిని పూర్తిగా ఉల్లంఘించడమేనని ఆ పార్టీ అధికార ప్రతినిధి డెరెక్ ఒబ్రీన్ ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రధానిపై ఈసీ ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రధాని పర్యటనకు మీడియా కవరేజీ ఇవ్వడం కోడ్ ఉల్లంఘనేనని కాంగ్రెస్ ఎంపీ ప్రదీప్ భట్టాచార్య ఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. -
కేదార్‌నాథ్‌లో మోదీ పూజలు
-
బద్రినాథ్ గుడిలో కొత్త బంగారు గొడుగు
గోపేశ్వర: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బద్రినాథ్‌లోని విష్ణు భగవానుడి విగ్రహంపై కొత్త బంగారు గొడుగును ఏర్పాటుచేశారు. నాలుగు కేజీల బరువున్న ఈ గొడుగును లూధియానాకు చెందిన సూద్ కుటుంబం కానుకగా సమర్పించింది. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో దాన్ని దేవాలయానికి తీసుకొచ్చి ప్రత్యేక ప్రార్థనల నడుమ గర్భగుడిలో ప్రతిష్టించారు. సూద్ కుటుంబీకులు, దేవాలయ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 600 ఏళ్ల కిత్రం గ్వాలియర్ రాచకుటుంబానికి చెందిన మహరాణి అహల్యా బాయ్ సోల్కర్ సమర్పించిన గొడుగు స్థానంలో కొత్త గొడుగును అమర్చారు. -
ఈ పూజలు ఎవరి కోసం?
‘నాకు దైవ భక్తి ఎక్కువ. వీలు కుదురినప్పుడల్లా పుణ్యక్షేత్రాలకు వెళుతుంటాను’ అని చాలా సందర్భాల్లో పేర్కొన్నారు అనుష్క. ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ టెంపుల్‌ను సందర్శించారామె. అక్కడ కొన్ని ప్రత్యేక పూజలు కూడా చేయించారు అనుష్క. కేదార్‌నాథ్‌తో పాటు గంగోత్రి, బద్రీనాథ్ కూడా సందర్శించనున్నారట. సన్నిహితుల కోసం మొక్కుకుని గుడికి వెళుతుంటానని అనుష్క ఈ మధ్య ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. గుడికి వెళ్లి తన కోసం తాను ఎప్పుడూ ఏమీ కోరుకోనని కూడా అన్నారు. మరి.. ఇప్పుడు ఎవరి కోసం గుడికి వెళ్లారో? లేక జస్ట్ ఖాళీ దొరికింది కాబట్టి పీస్‌ఫుల్‌గా ఉంటుందని వెళ్లారో? -
అందరినీ ఆకర్షిస్తోన్న గణేష్ మంటపం
వనస్థలిపురం: వనస్థలిపురం రామాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన బద్రినాథ్ దేవాలయం నమూనాలోని గణేష్ మంటపం అందరినీ ఆకర్షిస్తోంది. కోల్‌కతాకు చెందిన కళాకారులు నెల రోజులపాటు శ్రమించి చార్ధాంలోని బద్రీనాథ్ దేవాలయం మాదిరిగా మంటపాన్ని తీర్చిదిద్దారని ఛత్రపతి శివాజీ క్రాంతి సంఘ్ చైర్మన్ చింతల రవికుమార్ తెలిపారు. ఈ మంటపం నిర్మాణానికి రూ.5 లక్షలు ఖర్చయినట్లు ఆయన తెలిపారు. -
ఏప్రిల్‌లో తెరుచుకోనున్న బద్రీనాథ్ ఆలయం
గర్వాల్ హిమాలయాల్లో ఉన్న పవిత్ర బద్రీనాథ్ ఆలయం ఐదు నెలల తర్వాత మళ్లీ ఏప్రిల్ 26న తెరుచుకోనుంది. శీతాకాలం, మంచు కారణంగా ఈ ఆలయాన్ని ప్రతియేటా ఐదు నెలల పాటు మూసేస్తారు. ఏప్రిల్ 26 ఉదయం 5.15 గంటలకు భక్తుల కోసం ఆలయ గేట్లు తెరుస్తారని పండిట్ ఆచార్య కృష్ణప్రసాద్ ఉనియాల్ తెలిపారు. వసంత పంచమి సందర్భంగా పూజారులు, తేహ్రి రాజకుటుంబ సభ్యులు, డిమ్రి వర్గ ప్రతినిధులు, బద్రీనాథ్- కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మన్.. అంతా కలిసి ఆలయాన్ని మళ్లీ తెరిచే పవిత్ర ముహూర్తాన్ని నిర్ణయించారు. గత సంవత్సరం నవంబర్ 27న శీతాకాలం సందర్బంగా ఆలయాన్ని మూసేశారు.