
చాలామందికి బద్రీనాథ్ వెళ్లాలని ఉంటుంది. కానీ వయసు సహకరించక, ఆరోగ్య సమస్యలు, ఆర్ధిక ఇబ్బందులు కారణంగా వెళ్లలేకపోతున్నారు. అలంటి వారికోసం ఆ బద్రినాథుడు హైదరాబాద్‌కు వచ్చేశారు.

ఉత్తరాఖండ్ లో ప్రసిద్ధి చెందిన అసలు ఆలయానికి ప్రతిరూపంగా ఈ బద్రీనాథ్ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి 40 కి.మీ దూరంలో మేడ్చల్ జిల్లా, బండమైలారం అనే చిన్న గ్రామంలో ఉంది. ఈ ఆలయాన్ని దక్షిణ్ కే బద్రీనాథ్ అని పిలుస్తున్నారు.

ఈ ఆలయంలో బద్రీ నారాయణుడు పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయంలో బద్రీనాథ్ క్షేత్రంలో చేసే పూజ విధానాన్ని అవలంబిస్తారు.

దాదాపు 30,000 మంది NGO సభ్యులతో ఉత్తరాఖండ్ కళ్యాణకారి సంస్థ ఈ ఆలయాన్ని 1,550 చదరపు గజాలలో నిర్మించింది.

ఉత్తరాఖండ్‌లో బద్రీనాథ్ ఆలయం సంవత్సరానికి నాలుగు నెలలు (మే నుండి జూన్, సెప్టెంబర్ నుండి అక్టోబర్) మాత్రమే తెరిచి ఉంటుంది. ఈ ఆలయం సంవత్సరం పొడవునా తెరిచి ఉంటుంది.

ఈ ఆలయంలోని ప్రతిమలు బద్రీనాథ్ ఆలయంలో ఎలా ఉన్నాయో అలానే ప్రతిష్టించారు. అలాగే ఈ ఆలయంలో ఉన్న ఆఖండ దీపాన్ని బద్రీనాథ్ నుంచి తీసుకొని వచ్చారు.










