
యమధర్మరాజు ఆస్థానంలో చిట్టాలు రాసే చిత్రగుప్తుడు గురించి తెలుగు సినిమాల పుణ్యమా అని మనందరికీ తెలుసు. అయితే అలాంటి చిత్రగుప్తుడికి దేవాలయాలు ఉంటాయని మన ఊహకు కూడా అందదు

ఆయితే శ్రీరాముడు అయోధ్యలో చిత్రగుప్తుడికి ఆలయం కట్టించి పూజించినట్లు పురాణాల్లో ఉంది

ఫలక్ నామలోని కందికల్ గేట్ దగ్గర చిత్రగుప్తు మహాదేవ దేవాలయం ఉంది

పాతబస్తీలోని ఉప్పుగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న శతాబ్దాలనాటి చిత్రగుప్త ఆలయం మూడున్నర ఎకరాల్లో విస్తరించి ఉంది

ఇక దాతల సాయంతో చిత్రగుప్తుడి పక్కనే రామాలయం, శివాలయం, సాయిబాబా, ఆంజనేయస్వామి, అయ్యప్ప ఆలయాలు కూడా నిర్మించారు









