ప్రధాన వార్తలు

ADCET నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యంపై వైఎస్ జగన్ ఆగ్రహం
తాడేపల్లి : ADCET నిర్వహణలో ఏపీ ప్రభుత్వం వైఫల్యంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వ ఉదాసీనతను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ‘ మా ప్రభుత్వం 2020–21లో కడపలో YSR ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీని స్థాపించింది. దీనికి AICTE, UGC అనుమతులు కూడా ఉన్నాయి. ఐతే కరోనా టైంలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (CoA) పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించలేక పోయింది. 2023లో ఒక కమిటీని ఏర్పాటు చేసి, మొదటి మూడు బ్యాచ్‌లకు ఆమోదం తెలిపింది. కానీ వైస్-ఛాన్సలర్ నుండి ఎలాంటి హామీ రాకపోవడంతో ఇప్పటికీ ఆ ఆమోదం పెండింగ్‌లోనే ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పటికీ దాని గురించి పట్టించుకోకపోవడం దారుణం. మా ప్రభుత్వ హయాంలోనే 2023–24, 2024–25 బ్యాచ్‌లకు CoA అనుమతులు వచ్చాయి. కానీ ఈ ప్రస్తుత ప్రభుత్వం కొత్త విద్యార్థులను చేర్చుకోవడానికి కనీసం ADCET పరీక్షను కూడా ఇప్పటి వరకు నిర్వహించలేదు. అసలు ADCET కోసం ఇంతవరకు కన్వీనర్‌ను కూడా నియమించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్ష ఎప్పుడు జరుగుతుంది? అడ్మిషన్లు ఎప్పుడు ప్రారంభమవుతాయి?, ఈ ప్రభుత్వం ఇప్పటికైనా నిద్రావస్థ నుండి బయట పడుతుందని, విద్యార్థులకు మేలు చేస్తుందని ఆశిస్తున్నాను’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.The TDP government failed to bifurcate JNAFAU. Our government established YSR Architecture and Fine Arts University in Kadapa in 2020–21. AICTE and UGC approvals were obtained, but the Council of Architecture (CoA) couldn’t conduct inspections during the COVID pandemic. On… pic.twitter.com/xtxszydn1Y— YS Jagan Mohan Reddy (@ysjagan) July 8, 2025

కోటా పెంచండి.. జేపీ నడ్డాకు సీఎం రేవంత్‌రెడ్డి వినతి
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి అయిన యూరియా కోటా పెంచాలని కేంద్ర ఆరోగ్య, సంక్షేమ, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అవసరాలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కోరారు. రెండురోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీలో ఉన్న సీఎం.. మంగళవారం నడ్డాతో పాటు మరో కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో వేర్వేరుగా వారి అధికారిక నివాసాల్లో భేటీ అయ్యారు. ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) ఏపీ జితేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, కేంద్ర పథకాల సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘు నందన్‌రావు ఆయన వెంట ఉన్నారు. కాగా యూరి యా, ఏరో–డిఫెన్స్ కారిడార్, వరంగల్ విమానాశ్రయా నికి ఆర్థిక సహాయం వంటి అంశాలపై ఇద్దరు మంత్రులతో వేర్వేరుగా సీఎం చర్చించారు. రైల్వే రేక్‌లు పెంచండి.. రాష్ట్రంలో ప్రాజెక్టులకు నీరు వచ్చి, సాగు పనులు జోరుగా సాగుతున్నందున యూరియా సరఫరాలో ఆటంకాలు తలెత్తకుండా చూడాలని కేంద్ర మంత్రి నడ్డాను రేవంత్ కోరారు. వర్షాకాలం సీజన్‌కు సంబంధించి ఏప్రిల్–జూన్ మాసాల మధ్య 5 లక్షల మెట్రిక్ టన్నులకు గాను కేవలం 3.07 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారని తెలిపారు. జూలైలో దేశీయంగా ఉత్పత్తి అయిన యూరియా 63 వేల టన్నులు, విదేశాల నుంచి దిగుమతి అయిన యూరియా 97 వేల మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి సరఫరా చేయాల్సి ఉండగా.. కేవలం 29 వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా చేయడం వలన రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న యూరియా కోటాను పెంచాలని కోరారు. యూరియా సరఫరాకు సంబంధించి రైల్వే శాఖ తగిన రేక్‌లు కేటాయించడం లేదని, వాటి సంఖ్య పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఏరో–డిఫెన్స్ కారిడార్‌గా మంజూరు చేయండి హైదరాబాద్ ఆదిభట్లలో అత్యున్నతమైన మౌలిక వసతులతో ప్రత్యేక రక్షణ, ఏరోస్పేస్ పార్కును తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ను ఏరో–డిఫెన్స్ కారిడార్‌గా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ‘పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న వంద ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు సమర్పిస్తాం. కేంద్ర ప్రభుత్వం వాటికి మద్దతుగా నిలవాలి. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, అమలు ట్రస్ట్ (ఎన్ఐసీడీఐటీ) ఆమోదించిన రూ.596.61 కోట్లను త్వరగా విడుదల చేయాలి. స్మార్ట్ సిటీకి అవసరమైన నీటి సరఫరా, విద్యుత్, ఇతర వసతుల కల్పనకు ఆర్థిక సహాయం చేయాలి. హైదరాబాద్–వరంగల్ పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా వరంగల్ విమానాశ్రయానికి నిధులు మంజూరు చేయాలి..’అని కోరారు. హైదరాబాద్–విజయవాడ పారిశ్రామిక కారిడార్ ఫీజబిలిటీపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు.

ఠాక్రే సోదరుల యుగళం
రాజకీయాల్లో ఏ నిర్ణయం ఎటువైపు లాక్కెళుతుందో చెప్పటం కష్టం. మహారాష్ట్రలో నిరుడు నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు 235 గెల్చుకుని అధికారంలోకొచ్చిన బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి... అంతా సవ్యంగా ఉందనుకున్న వేళ హిందీని ప్రాథమిక విద్య స్థాయిలో ఒకటో తరగతి నుంచి తృతీయ భాషగా నేర్చుకు తీరాలని జీవో తీసుకొచ్చి కష్టాల్లో పడింది. అటు తర్వాత రాష్ట్రంలో క్రమేపీ హిందీ వ్యతిరేక, మరాఠీ ఆత్మగౌరవ ఉద్యమం బలపడు తుండటాన్ని గమనించి గత్యంతరం లేక దాన్ని వెనక్కు తీసుకుంది. కానీ ఇలా వచ్చి, అలా పోయిన ఆ జీవో చేసిన చేటు అంతా ఇంతా కాదు. రక్త సంబంధాన్ని కూడా బేఖాతరు చేసి గత రెండు దశాబ్దాలుగా పరస్పరం కత్తులు నూరుకుంటున్న రెండు దాయాది వర్గాలను అది ఏకం చేసింది. మహాయుతికి రాజకీయంగా తగని తలనొప్పి తెచ్చిపెట్టింది. బాల్ ఠాక్రే వున్న రోజుల్లోనే అన్న దమ్ముల పిల్లలైన రాజ్ ఠాక్రే, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కయ్యానికి దిగారు. వీరిలో ఉద్ధవ్, బాల్ ఠాక్రే కుమారుడు. శివసేనపై ఎవరి ఆధిపత్యం ఉండాలన్న అంశంలో అన్నదమ్ములు తగువు పడ్డారు. అవసాన దశలో బాల్ ఠాక్రే రాజీకి ఎంతగానో ప్రయత్నించినా ఇద్దరికిద్దరూ పట్టుదలకు పోయారు. చివరకు 2005లో ఉద్ధవ్‌ను బాల్ ఠాక్రే తన వారసుడిగా ప్రకటించటంతో శివసేన నుంచి రాజ్ నిష్క్రమించారు. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) పేరిట పార్టీ స్థాపించారు. మధ్యలో ఒకటి రెండుసార్లు కుటుంబీకంగా కలిసిన సందర్భాలుండొచ్చుగానీ ఒకే వేదికను పంచు కున్నది లేదు. రాజకీయాల్లో కలిసి పనిచేస్తామని చెప్పింది లేదు. కానీ ఆ పని మహారాష్ట్ర ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడణవీస్ చేయగలిగారు. తప్పనిసరి హిందీ జీవోతో వారిని సన్నిహితం చేశారు. బీజేపీకి అధికారమే పరమావధి కాదు. దాని ఎజెండా దానికుంది. దేశవ్యాప్తంగా ఎప్పటికైనా హిందీని జాతీయ స్థాయిలో అధికార భాష చేసి తీరాలన్న సంకల్పం అందులో ఒకటి. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎన్ని వాగ్దానాలైనా ఇవ్వొచ్చుగానీ హిందీకి ప్రాముఖ్యమీయటం దాని ప్రచ్ఛన్న సంకల్పం. ఈమధ్య కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంగ్లిష్ మాట్లాడేవారంతా సిగ్గుపడే రోజొకటి వస్తుందని ప్రకటించటం యాదృచ్ఛికం కాదు. ఆ మాటెలావున్నా బీజేపీకీ, ఠాక్రే సోదరులకూ రెండు అంశాల్లో ఏకీభావం వుంది. అవి ఒకటి – హిందూ, రెండు – హిందూస్తాన్. కానీ హిందీ విషయంలోనే ఆ సోదరులకు బీజేపీతో పేచీ. అధికార పంపకం సమస్య సరేసరి. ఏదేమైనా అసాధ్య మనుకున్నది జరిగిపోయింది. సోదరులిద్దరూ ఏకమయ్యారు. హిందీ జీవోను వెనక్కి తీసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ముంబైలో శనివారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. రాజ్ ఠాక్రే భవిష్యత్తు కార్యాచరణ గురించి చెప్పటానికి కొంత మొహమాట పడ్డారుగానీ ఉద్ధవ్ ఠాక్రే నేరుగా చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు పార్టీల మధ్యా పొత్తు ఉంటుందని ప్రకటించారు. బాల్ ఠాక్రే కాలంలో ముంబైలో శివసేన తిరుగులేని పక్షంగా ఉండేది. తిరిగి ఆ వైభవాన్ని తీసుకురావాలన్నది ఉద్ధవ్ ఉద్దేశం. కానీ అదంత సులభమేమీ కాదు. నాయకులిద్దరూ కలిసినంత మాత్రాన శ్రేణులు అంత తేలిగ్గా ఏకమవుతాయా అన్నది ప్రశ్నార్థకం. ఎందుకంటే గత ఇరవైయ్యేళ్లుగా ఆ పార్టీల మధ్య దాయాది పోరు నడుస్తోంది. అదీగాక ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన (యూబీటీ) ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో ఇప్ప టికే మహావికాస్ అఘాదీ(ఎంవీఏ)లో భాగస్వామిగా ఉంది. సోదరులిద్దరూ ఏకమైతే ఎంవీఏ కూటమి అయోమయంలో పడుతుంది. ఉద్ధవ్ ఆ రెండు పార్టీలతో కలిసి ప్రయాణించగలుగు తున్నారు. కానీ రాజ్ అందుకు సిద్ధపడతారా లేక వారిద్దరూ కలిసి ఇక ఎంవీఏ కథ ముగిస్తారా అన్నది చూడాల్సి ఉంది. కానీ ఈ కలయిక రాజకీయాల్లో ఒక కొత్త దూకుడును ప్రవేశపెట్టింది. ముంబైలో బతకడానికొచ్చినవారు మరాఠీ నేర్చుకు తీరాలని విజయోత్సవ ర్యాలీలో రాజ్ ప్రకటించారు. ఇక శ్రేణులు రెచ్చిపోవటంలో వింతేముంది? నిజానికి ఆ ప్రకటనకు ముందే ముంబైలో ప్రముఖ ఇన్వెస్టర్ సుశీల్ కేడియా ‘మరాఠీ నేర్చుకొనేది లేదం’టూ ట్విటర్లో ప్రకటించాక ఈ నెల 3న ఎంఎన్ఎస్ శ్రేణులు ఆయన కార్యాలయంపైబడి విధ్వంసానికి పూనుకున్నాయి. దీన్ని రాజ్ ఖండించకపోగా ‘మరాఠీ మాట్లాడనంత మాత్రాన ఎవరినీ కొట్టనవసరం లేదు. కానీ అనవసర డ్రామాకు దిగేవారి కర్ణభేరికి కింద తగిలేలా కొట్టండ’ని పిలుపునిచ్చారు.భాషాధిపత్యం తగువు ఈనాటిది కాదు. దేశానికి జాతీయ భాష అవసరమనీ, అది హిందీ అయితీరాలనీ జాతీయోద్యమ కాలంలో కాంగ్రెస్ నేతలు వాదించారు. వారిపై వినాయక్ దామోదర్ సావర్కర్, ఆరెస్సెస్‌ల ప్రభావం ఉంది. కానీ తమిళనాడు ద్రవిడ ఉద్యమ నాయకులతోపాటు ప్రఖ్యాత తెలుగు రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి వంటి వారు హిందీ వ్యతిరేకతను చాటారు. స్వాతంత్య్రం వచ్చాక హిందీని జాతీయ భాషగా చేయబోమని హామీ ఇస్తేనే కాంగ్రెస్‌తో కలిసి నడ వాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుత ఎన్డీయే పాలకులు మాత్రమే కాదు... యూపీఏ ఏలు బడిలో సైతం హిందీ ఆధిపత్యాన్ని నిలపాలని శతధా ప్రయత్నించారు. దక్షిణాదిన అందుకు ప్రతిఘటన వస్తూనే ఉంది. భాషా సంస్కృతులు సున్నితమైనవి. ప్రజామోదం లేకుండా వాటి జోలికి పోకపోవటం ఉత్తమం. ప్రస్తుతానికి రాజకీయంగా అయోమయంలో ఉన్న ఠాక్రే సోదరులకు మరో ఆర్నెల్లలో జరగబోయే స్థానిక ఎన్నికలకు హిందీ జీవో అందివచ్చిందన్నది వాస్తవం. ప్రజల మనోభావాల్ని బేఖాతరు చేస్తే అధికార కూటమికి చేటు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు.

జీఎస్టీ చిక్కుముళ్లు వీడేనా?
ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీపై ఎన్నో ఏళ్లుగా పట్టిన మంకుపట్టు సడలించి పేద, మధ్య తరగతి వర్గాలకు ఊరట కల్పించేందుకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో కొన్ని మార్పులు తేవడానికి సమాయత్తం అయింది. ప్రస్తుతం 12% శ్లాబులో ఉన్న నిత్యావసర వస్తువులపై పూర్తిగా పన్నును తొలగించడం లేదా చాలా వస్తువులను 5% పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తు న్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెలఖరులో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశంలో ఈ మేరకు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రజల వినియోగ సామర్థ్యాన్ని పెంచడానికి జీఎస్టీ తగ్గింపు నిర్ణయం తీసుకుంటున్నట్లు అర్థం అవుతున్నది. వస్తువుల ధరలు తగ్గితే విక్రయాలు పెరగడం వల్ల ఉత్పత్తి రంగం కళకళలాడే అవ కాశం ఉంది. గత కొన్నేళ్లుగా జీఎస్టీకి సంబంధించి ఎవరేమి మాట్లా డినా సమాధానం ఇవ్వకుండా మిన్నకుండిపోయిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల దేశంలో వినిమయ సంస్కృతిని మరింత పెంచడానికి కేంద్రం కట్టుబడి ఉందని చెబుతున్నారు. పరో క్షంగా ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి నిత్యావసర వస్తువులపై విధిస్తున్న జీఎస్టీని హేతుబద్ధీకరిస్తున్నట్లు చెప్పకనే చెప్పినట్లయింది.సరళతరం కాకపోగా చిక్కులు8 ఏళ్ల క్రితం ‘ఒకే దేశం ఒకే పన్ను’ అన్నది లక్ష్యంగా, చక్కని సరళతరమైన పన్ను (గుడ్ అండ్ సింపుల్ టాక్స్)గా చెప్పబడిన ‘జీఎస్టీ’ (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) క్రమంగా తన అర్థాన్ని మార్చుకొంది. 2017 జూలై 1న ఎన్డీఏ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన జీఎస్టీ చిన్న, సన్నకారు వ్యాపారుల సమస్యలను తీర్చకపోగా వారికి అనేక చిక్కుముళ్లను తెచ్చి పెట్టింది. నిజానికి, గత 8 ఏళ్లుగా జీఎస్టీపై జరిగినంత చర్చ, వాదోపవాదాలు మరే అంశం మీదా జరగలేదు. జీఎస్టీ అమలులోకి వచ్చాక దేశంలో పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగిన మాట వాస్తవం. ఏటా దాదాపు 8 నుంచి 11 శాతం పైబడి జీఎస్టీ వసూళ్లలో వృద్ధిరేటు కనబడుతోంది. అయితే, జీఎస్టీ అమలు కారణంగానే పన్ను ఎగవేతలు తగ్గాయనీ, ‘పన్ను ఉగ్రవాదం’ సమసిపోయిందనీ చెప్పడం అర్ధ సత్యమే. జీఎస్టీ వల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని పలు వర్గాల వారు గగ్గోలు పెడుతున్నారు. పన్ను రేట్లు, వివిధ శ్లాబులలోకి వచ్చే వస్తువులు, సేవల విషయంలో కేంద్రం, రాష్ట్రాల నడుమ ఇంకా ఏకాభిప్రాయం కుదరకపోవడం గమనార్హం. ముఖ్యంగా, రాష్ట్రాలకు అతిపెద్ద ఆదాయ వనరులుగా ఉన్న పెట్రోల్, డీజిల్, మద్యం వంటి వాటిని జీఎస్టీ పరిధిలోకి చేర్చడాన్ని మెజారిటీ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికి 55 సమావేశాలు జరిపినప్పటికీ జీఎస్టీ మండలి భేటీలలో పలు అంశాలపై ఏకాభిప్రాయం కుదరడం లేదు.జీఎస్టీ చిక్కుళ్లలో పన్ను రేట్ల హేతుబద్ధీకరణ ప్రధానమైనది. 5, 12, 18, 28 శాతాలుగా పన్ను రేట్లు ఉన్నాయి. 1,400కు పైబడిన వస్తువులు, 500 రకాల సేవలను ఈ నాలుగు శ్లాబులలో సర్దుబాటు చేశారు. భారీ కసరత్తు అనంతరం రేట్లను ఖరారు చేశామని చెప్పారు గానీ అందులో హేతుబద్ధత, మానవత్వం కనుమరుగయ్యాయన్న విమర్శల్ని సాక్షాత్తూ బీజేపీ నేతలే చేస్తున్నారు. ఉదాహరణకు జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియంలపై 18% జీఎస్టీ వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన సహచర మంత్రి నిర్మలా సీతారామన్ కు బహిరంగ లేఖ సంధించడం కలకలం రేపింది. సామాన్యులకు అవసరమైన జీవిత బీమా, ఆరోగ్య బీమాలపై ఇంత మొత్తం జీఎస్టీ వేయడం వల్ల... వారు జీవిత, ఆరోగ్య రక్షణకు దూరం అవుతారని గడ్కరీ తన లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీలపై 5% జీఎస్టీ విధించినా కొంతవరకు అర్థం ఉందిగానీ... ఏకంగా 18% పన్ను వేయడం అన్యాయమని పాలసీదారుల అసోసియేషన్ సైతం కేంద్రానికి విన్న వించినప్పటికీ సానుకూల స్పందన రావడం లేదు.నిత్యావసరాలపై ఇంతా?ఇక, శ్లాబుల విషయంలో స్పష్టత లోపించడం వల్ల చెల్లింపు దారులకు, వివిధ ప్రభుత్వ విభాగాలకు మధ్య వివాదాలు తలెత్తి చివ రకు అవి న్యాయస్థానాలకు చేరుతున్నాయి. అలాగే, కోవిడ్ ప్రబలిన 2020, 2021 సంవత్సరాలలో రాష్ట్రాలకు అందించిన ఆర్థిక సహ కారాన్ని తిరిగి రాబట్టుకొనేందుకు కేంద్రం ‘సెస్సు’ విధించి ప్రజలపై అదనపు భారాన్ని మోపింది. దీన్ని ఉపసంహరించు కోవాలన్న అభ్యర్థనను పెడచెవిన పెట్టింది.ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తులపై, ప్రాణాలు నిలబెట్టే ఔషధాలపై 5% జీఎస్టీ మాత్రమే వేస్తామని చెప్పినప్పటికీ ఆచరణలో భిన్నంగా వ్యవహరించారు. వెన్న, నెయ్యి, పాలు వంటి పాల ఉత్పత్తులపై, ప్యాకింగ్ చేసిన కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలపై 18% జీఎస్టీ విధించడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు. చివరకు పెన్నులపైన కూడా జీఎస్టీ విధిస్తున్నారు. నిత్యావసర వస్తువులను మినహాయించి విలాస వస్తువుల పైననే పన్ను వేస్తామని చెప్పిన దానికీ, ఆచరణలో చేస్తున్న దానికీ పొంతన ఉండటం లేదు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే పొగాకు ఉత్పత్తులు, శీతల పానీయాలపై 35 శాతం జీఎస్టీ విధించాలంటూ జీఎస్టీ రేట్ల హేతు బద్ధీకరణపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం జీఎస్టీ మండలికి ఓ నివేదిక అందించింది. పన్నులు పెంచితే ఆరోగ్య హానికర ఉత్పత్తుల వాడకాన్ని ప్రజలు మానేస్తారా అన్నది చర్చనీయాంశం. అదే నిజ మైతే మద్యం మీద కూడా అధికంగా పన్నులు వేయాల్సి ఉంటుంది.ఎంఎస్ఎంఇలకు శరాఘాతంజీఎస్టీ అమలులో స్పష్టత, హేతుబద్ధత లోపించడం వల్ల దెబ్బ తిన్న వాటిల్లో సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల రంగం ఒకటి. దేశీయ తయారీ రంగంలో దాదాపు 70% మేర ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తున్న ఎంఎస్ఎంఇ రంగం జీఎస్టీ కారణంగా కుదేలయిందన్నది చేదు వాస్తవం. చిన్న చిన్న వ్యాపారాలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చాక... అవి చాలావరకు మూతబడ్డాయి. ముడి సరుకులపై పన్ను విధించడం, మళ్లీ అంతిమ ఉత్పత్తులపై పన్ను వేయడం వల్ల... దేశంలో దాదాపు 20 కోట్ల మంది ఆధారపడిన సూక్ష్మ, మధ్య తరహా పరిశ్ర మలకు తీరని నష్టం కలిగింది. వాటి సప్లయ్ చెయిన్ తెగిపోయిందని ఆ రంగంపై ఏళ్లుగా జీవనం సాగిస్తున్నవారు మొత్తుకొంటున్నారు. ఒకవైపు వస్తుసేవలను అంతిమంగా వినియోగించుకొనే వారే పన్ను చెల్లించాలని చెబుతూ, మరోవైపు బహుళ పన్నులు వేస్తున్న పరిస్థితి కొన్ని రంగాల్లో ఉంది. వివాదాలు ఏర్పడితే వాటిని పరిష్క రించుకోవడానికి జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను అందుబాటులోకి తెచ్చిన మాట నిజమే గానీ... చిన్న వ్యాపారులు ఎంతమంది దానిని ఆశ్రయించగలరు? స్థానిక ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఆయా ఉత్పత్తులపై పన్నులు విధించే హక్కు గతంలో రాష్ట్రాలకు ఉండేది. ప్రజలకు జవాబుదారీతనం ఎక్కువగా వహించేది రాష్ట్రాలే. కానీ, రాష్ట్రాలకు తమ ప్రాంత ప్రజల ప్రయోజనాలను పరిరక్షించే అవకాశం జీఎస్టీ వచ్చాక తగ్గిపోయింది. జీఎస్టీ వసూళ్లల్లో కనబడుతున్న వృద్ధిని చూసి మురిసిపోవడమే తప్ప... ఎదురవుతున్న ఇబ్బందుల్ని సాధ్యమైనంత తొందరగా పరిష్కరించలేకపోవడం వైఫల్యంగానే పరిగణించాలి. పుట్టుకతోనే లోపాలు ఉన్న బిడ్డగా జీఎస్టీని కొందరు అభివర్ణించారు. మరికొందరు జీఎస్టీ వల్ల దేశానికి అసలైన ఆర్థిక స్వాతంత్య్రం లభించిందంటున్నారు. వీటి మాటెలా ఉన్నా, అంతిమంగా ప్రజలకు మేలు జరుగుతున్నదా, లేదా అన్నదే కొలమానం. డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు,కేంద్ర మాజీ మంత్రి

'కాల్'కేయులు!
సాక్షి, హైదరాబాద్: ‘నాన్నా పులి..’సామెతను గుర్తుచేస్తున్నాయి కొందరి చేష్టలు. బాంబులు పెట్టారంటూ బెదిరింపు ఫోన్‌కాల్స్, ఈ–మెయిల్స్‌తో బెదరగొట్టడం.. పోలీసులు, బాంబ్ స్క్వాడ్ ఆఘమేఘాల మీద ఉరుకులు, పరుగులు పెట్టడం ఇటీవలి కాలంలో పెరిగిపోతోంది. వీటిల్లో చాలావరకు ఆకతాయితనంతోనో, శాడిజంతోనో చేసే కాల్స్ అయినా సరే..ప్రజా భద్రత దృష్ట్యా ఈ తరహా ఏ ఒక్క ఫోన్‌కాల్‌ను కానీ, ఈ–మెయిల్‌ను కానీ పట్టించుకోకుండా వదిలేసే పరిస్థితి ఉండదు. ఒకవేళ నిజంగానే బాంబు పేలుడు లాంటివి సంభవిస్తే ప్రాణ నష్టం భారీగా జరిగేందుకు అవకాశం ఉంటుంది. ప్రధానంగా విమానాశ్రయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఈ తరహా నకిలీ బాంబు బెదిరింపు కాల్స్ పెరుగుతున్నాయి. తాజాగా మంగళవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్, పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టు, జింఖానా క్లబ్, సికింద్రాబాద్ సివిల్ కోర్టుల్లో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ–మెయిల్ రావడంతో కాసేపు గందరగోళం నెలకొంది. నిందితులు తాము చిక్కకుండా సాంకేతికతను ఉపయోగించి ఈ తరహా ఫోన్‌కాల్స్, ఈ–మెయిల్ చేస్తున్నట్టు పోలీసులు దర్యాప్తులో తేలుతోంది. ఐదేళ్లలో పెరిగిన కాల్స్, ఈ–మెయిల్స్ గత ఐదేళ్లలో (2020–2025) దేశంలో బాంబు బెదిరింపు కాల్స్ సంఖ్య గణనీయంగా పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ తరహా ఘటనల్లో ఎక్కువగా వీపీఎన్ (వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్) ఉపయోగించి విదేశాల నుంచి ఈ–మెయిల్స్ పంపుతున్నట్టు తెలుస్తోంది. గతంలో ఇలాంటి వారు ఫోన్‌కాల్స్ చేసేవారు, కానీ ఇటీవల ఈ–మెయిల్లు సోషల్ మీడియాకు మారడం, వీపీఎన్ వాడకంతో నేరస్థులను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. 2024లో దేశవ్యాప్తంగా ఇలాంటి బెదిరింపు కాల్స్ చేసిన వారిలో 13 మందిని అరెస్టు చేయగా.. అందులో తెలంగాణలో ఒకరిని అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపు కాల్స్ ఇలా.. » 2020–2021లో కోవిడ్ మహమ్మారి, లాక్డౌన్ కారణంగా ఇలాంటి కాల్స్ సంఖ్య తక్కువగా ఉంది. » 2022లో దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలకు సుమారు 100కు పైగా బాంబు బెదిరింపు కాల్స్ వచి్చనట్లు అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీటిలో చాలావరకు నకిలీవిగా గుర్తించారు. హైదరాబాద్ సహా పలు నగరాల్లోని సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలకు ఈ తరహా బెదిరింపు కాల్స్ వచ్చాయి. » 2023లో బాంబు బెదిరింపుల సంఖ్య మరింత పెరిగింది. ఢిల్లీలోని స్కూళ్లు, ఆసుపత్రులు, మెట్రో స్టేషన్లకు బెదిరింపు కాల్స్, ఈ–మెయిల్స్ వచ్చాయి. ఈ ఏడాదిలో 500కు పైగా బెదిరింపు కాల్స్, ఈ–మెయిల్స్ నమోదయ్యాయి. వీటిల్లోనూ చాలావరకు ఉత్తుత్తివిగా తేలాయి. » 2024లో 997 బాంబు బెదిరింపు కాల్స్ నమోదయ్యాయి. 2024 జూన్‌లో ఒక్క రోజులోనే ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో కలిపి 50కి పైగా విమానాశ్రయాలు, 40కి పైగా ఆసుపత్రులకు బెదిరింపు ఈ–మెయిల్స్ వచ్చాయి. అక్టోబర్‌లో రెండు వారాల్లోనే 500 విమానాలకు ఈ తరహా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. » 2025 మొదటి ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా వందలాది బెదిరింపు కాల్స్, ఈ–ఇమెయిల్స్ నమోదయ్యాయి. జనవరిలో ఢిల్లీలోని 15కి పైగా ఆసుపత్రులు, పలు విమానాశ్రయాలకు బెదిరింపు ఈ–మెయిల్స్ వచ్చాయి. తెలంగాణలో ఇలా.. » 2022లో హైదరాబాద్‌లోని కొన్ని షాపింగ్ మాల్స్, స్కూళ్లకు బెదిరింపు ఈ–మెయిల్స్ వచ్చాయి. దర్యాప్తు తర్వాత ఇవి నకిలీవిగా తేలాయి.» 2023లో హైదరాబాద్‌లోని పలు స్కూళ్లు, కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు బెదిరింపు ఈ–మెయిల్స్ వచ్చాయి. వీటిల్లో ఎక్కువగా విదేశీ సర్వర్ల నుంచి వచ్చిన ఈ–మెయిల్స్ ఉన్నాయి. » 2024లో హైదరాబాద్‌లోని స్కూళ్లు, కాలేజీలు, రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బెదిరింపు ఈ–మెయిల్స్ వచ్చాయి. అక్టోబర్ 22న హైదరాబాద్‌లోని ఒక సీఆర్పీఎఫ్ స్కూల్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అదేవిధంగా మేలో ప్రజాభవన్, నాంపల్లి కోర్టులో బాంబు పెట్టినట్టు నకిలీ బెదిరింపు కాల్ చేసిన ఒక వ్యక్తిని హైదరాబాద్ సిటీ పోలీసులు అరెస్టు చేశారు. »2025లో మంగళవారం సిటీ సివిల్ కోర్టు సహా పలు చోట్ల బాంబులు పెట్టినట్టు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది.

సబలెంకా శ్రమించి...
లండన్: ఈ ఏడాది వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరేందుకు బెలారస్ స్టార్ సబలెంకా మరో విజయం దూరంలో నిలిచింది. ఈ సంవత్సరం ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌తో సరిపెట్టుకున్న సబలెంకా... అదే జోరును వింబుల్డన్ టోర్నీలోనూ కొనసాగించి ఈ టోర్నీలో మూడోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సబలెంకా 4–6, 6–2, 6–4తో ప్రపంచ 104వ ర్యాంకర్ లౌరా సిగెముండ్ (జర్మనీ)పై కష్టపడి గెలిచింది. 2 గంటల 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకాకు 37 ఏళ్ల సిగెముండ్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. క్వార్టర్ ఫైనల్ చేరే క్రమంలో ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోని సబలెంకా ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను చేజార్చుకుంది. అయితే రెండో సెట్లో తేరుకున్న సబలెంకా మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసింది. సెట్‌ను 6–2తో దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. మూడో సెట్లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. చివరకు పదో గేమ్‌లో సిగెముండ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సబలెంకా విజయాన్ని ఖరారు చేసుకుంది.మ్యాచ్ మొత్తంలో రెండు ఏస్‌లు సంధించిన సబలెంకా నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. నెట్ వద్దకు 43 సార్లు దూసుకొచ్చి 25 సార్లు పాయింట్లు గెలిచింది. 29 విన్నర్స్ కొట్టిన ఈ బెలారస్ స్టార్ 36 అనవసర తప్పిదాలు చేసింది. తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేసింది. 2021, 2023లలో వింబుల్డన్‌లో సెమీఫైనల్ చేరి ఓడిపోయిన సబలెంకా రేపు జరిగే సెమీఫైనల్లో అనిసిమోవాతో ఆడుతుంది. తొలిసారి సెమీస్‌లో అనిసిమోవా నాలుగోసారి వింబుల్డన్ టోర్నీలో ఆడుతున్న ప్రపంచ 12వ ర్యాంకర్ అనిసిమోవా (అమెరికా) తొలిసారి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. క్వార్టర్ ఫైనల్లో అనిసిమోవా 6–1, 7–6 (11/9)తో పావ్లీచెంకోవా (రష్యా)పై నెగ్గింది. 22వసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడిన అనిసిమోవా 2019లో ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది. అల్కరాజ్ అలవోకగా... పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్) వరుసగా మూడో ఏడాది సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. కామెరాన్ నోరి (బ్రిటన్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ 6–2, 6–3, 6–3తో గెలుపొందాడు. 99 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ 13 ఏస్‌లు సంధించి ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. సెమీఫైనల్లో అమెరికా ప్లేయర్, ప్రపంచ ఐదో ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్‌తో అల్కరాజ్ తలపడతాడు. మరో క్వార్టర్ ఫైనల్లో ఫ్రిట్జ్ 6–3, 6–4, 1–6, 7–6 (7/4)తో ఖచనోవ్ (రష్యా)పై గెలిచి తన కెరీర్లో తొలిసారి వింబుల్డన్‌లో సెమీఫైనల్‌కు చేరాడు. గట్టెక్కిన సినెర్ సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ) కి అదృష్టం కలిసొచ్చింది. దిమిత్రోవ్ (బల్గేరియా) తో జరిగిన మ్యాచ్‌లో సినెర్ తొలి రెండు సెట్లను 3–6, 5–7తో కోల్పోయాడు. మూడో సెట్లో స్కోరు 2–2తో సమంగా ఉన్నపుడు దిమిత్రోవ్ గాయపడ్డాడు. దాంతో దిమిత్రోవ్ ఆటను కొనసాగించలేకపోవడంతో సినెర్‌ను విజేతగా ప్రకటించారు. గత ఐదు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో దిమిత్రోవ్ గాయాల కారణంగా వైదొలగడం గమనార్హం.

ఇదండీ బాబు సర్కారు తీరు..కిలో మామిడికి నాలుగు రూపాయలిస్తే చాలట!
ఢిల్లీః: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రైతులపై ఎంత ప్రేమో ఉందో ఈ ఒక్కటి చూస్తే అర్థమైపోతుంది. ఎప్పుడూ రైతులను పెద్దగా పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం.. మరోసారి కూడా అదే పునరావృతం చేసింది. తాజాగా ఏపీలోని మామిడి రైతులు గిట్టుబాటు ధరలేక అల్లాడిపోతుంటే.. బాబు సర్కారు మాత్రం చర్యల్లో ఫెయిల్ అయ్యింది. తాజాగా ఈరోజు(మంగళవారం. జూలై 08) ఏపీలోని మామిడి రైతుల గిట్టుబాటు ధరకు సంబంధించి ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు.. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కలిశారు. ఇక్కడ విచిత్రమేమిటంటే ఏపీలోని మామిడి రైతులకు కిలో గిట్టుబాట ధర రూ. 4 ఇస్తే చాలని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. దీనికి మళ్లీ వినతి పత్రం కూడా సమర్పించారు. ఇది ఇప్పుడు పెద్ద చర్చకే దారి తీసింది. ఈ మాత్రం దానికి కేంద్ర మంత్రిని కలవడం ఎందుకు? వినతి పత్రం ఇవ్వడం ఎందుకు? అనే విమర్శ వినిపిస్తోంది. కనీసం కర్ణాటకకు ఇచ్చిన గిట్టుబాటు ధర కూడా లేదు..ఇక్కడ ఓ విషయాన్ని గమనిస్తే.. చంద్రబాబు సర్కారుకు ఏపీలోని రైతులపై ఎంత శ్రద్ధం ఉందో అనే విషయం అవగతమవుతుంది. కనీసం కర్ణాటకలో మామిడి రైతుకు ఇచ్చే కనీస మద్దతు ధర కిలోకు రూ. 16గా ఉంది. మరి ఆ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే మద్దతు ధర కూడా ఇప్పించలేకపోయింది బాబు సర్కార్. మామిడి రైతుల ఆశలపై నీళ్లు చల్లింది, కనీసం కర్ణాటక తరహా రేటైనా ఇవ్వండని అడగలేదు బాబు ప్రభుత్వం. దాంతో రైతు సమస్యలపై బాబు నేతృత్వంలోని ప్రభుత్వానికి సీరియస్‌నెస్,సిన్సియారిటీ లేవని విషయం అర్థమైంది. మొక్కుబడిగా, హడావుడిగా..వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మామిడి రైతులకు మద్దతుగా పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మొక్కుబడిగా, హడావుడిగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిశారు. ఎంఐఎస్ స్కీం కింద కిలో నాలుగురూపాయల చొప్పున 260 కోట్లిస్తే చాలని అచ్చెన్నాయుడు వినతి పత్రం ఇచ్చారు. ఇప్పటికే మామిడికి ధర లేక రైతులు చెట్టను నరికేసుకుంటున్న నేపథ్యంలో ఈ ధరతో వారిని ఉద్ధరించాలని అనుకోవడం నిజంగా సిగ్గు చేటని విమర్శలు వస్తున్నాయి.

వ్యక్తిని లాగేసుకున్న విమానం ఇంజిన్.. ఆ తర్వాత ఏమైందంటే?
స్పెయిన్: ఇటలీలోని మిలాన్ బెర్గామో విమానాశ్రయంలో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం(జూలై 8) ఎయిర్‌పోర్టులో విమానం ఇంజిన్ ఓ వ్యక్తిని లాగేసుకుంది. ఈ ఊహించని పరిణామంలో సదరు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.వోలోటియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ A319 విమానం స్పెయిన్‌కు బయలుదేరేందుకు సిద్ధమవుతోంది. సరిగ్గా అదే సమయంలో ఓ వ్యక్తి విమానాశ్రయ టెర్మినల్‌లోకి రహస్యంగా ప్రవేశించాడు. తన వాహనాన్ని అక్కడే వదిలేసి విమానాల పార్కింగ్ జోన్లోకి ప్రవేశించాడు.అనంతరం,స్పెయిన్ బయలుదేరేందుకు సిద్ధమవుతున్న వోలోటియా ఎయిర్‌బస్ A319 విమానం పక్కకు వచ్చాడు. ఈ ఊహించని ఘటనలో, ఆ వ్యక్తి విమానం ఇంజిన్‌లో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఫలితంగా ఉదయం 10:20 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలు నిలిచిపోయాయి. 19 విమానాల సర్వీసుల్ని రద్దు చేసిన అధికారులు.. మరికొన్నింటిని దారి మళ్లించారు.

YSR Jayanthi: దైవం మానవ రూపేణ
హైదరాబాద్: దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 76వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో అభిమానుల ఆత్మీయ సమావేశం జరిగింది. మంగళవారం సాయంత్రం బుట్ట కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నేతలు, పలువురు న్యాయమూర్తులు, సీనియర్ జర్నలిస్టులు, రిటైర్డ్ ఉన్నతాధికారులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. దైవమే మానవ రూపేణ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాట్లాడిన పలువురు వక్తలు.. వైఎస్సార్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయనతో తమకు ఉన్న అనుభవాలను సభికులతో పంచుకున్నారు.ఈ కార్యక్రమానికి వైఎస్సార్ స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు వై. ఈశ్వర్ ప్రసాద్‌రెడ్డి స్వాగతోపన్యాసం ఇచ్చారు. వేదికపైన ఉన్న పెద్దలకు, వైఎస్సార్ అభిమానులకు, వైఎస్సార్ ఆత్మీయులకు, మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి.. కార్యక్రమాన్ని ప్రారంభించారు. 'ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది వైఎస్సార్ స్ఫూర్తి ఫౌండేషన్. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏమిటంటే.. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వైఎస్సార్ అభిమానుల్ని ఒక వేదికపైకి తీసుకురావడమే. ఆయనలో లక్షణాలను ఒక్కసారి గుర్తు చేసుకుని, ఆయన ఆశయాల్ని ప్రజలందరి దగ్గరకు తీసుకెళ్లి, ఆయన పేరు చిరస్థాయిలో ప్రజల గుండెల్లో ఉండేటట్లు చేయాలనే సంకల్పంతో ప్రారంభించబడిన సంస్థ ఇది..ఆయన చనిపోయి 16 ఏళ్లు అయినప్పటికీ, ఆయన్ని గుర్తుచేసుకుని ఇంత మంది పెద్దలు, ఇంతమంది అభిమానులు వచ్చారంటే వైఎస్సార్ వ్యక్తిత్వమే కారణం. ఆయన మామూలు మనిషి కాదు.. దేవుని రూపంలో మనందరి ముందు తిరిగిన మహా మనిషి. ఎందుకు మహా మనిషంటే.. ఆయనతో దగ్గరగా పని చేసిన వాళ్లని కదిలిస్తే అది అర్థమవుతుంది. ఆయనతో నాకున్న ఒక అనుభవం పంచుకుంటాను.పేదలకు నేను ఉన్నాను అనే భరోసా ఇచ్చిన మహానేత1989 నుంచి 2009 సెప్టెంబర్ వరకూ ఆయనతో అతి దగ్గరగా నడిచిన వ్యక్తిని నేను. రోజూ ఆయన్ను కలవడానికి వందలాది మంది వచ్చేవారు. అందులో సామాన్యులు, వీఐపీలు కూడా ఉండేవారు. వీఐపీలు రూమ్‌లో ఉంటే.. సామాన్యులు గ్యాలరీలో ఉండేవారు. కానీ ముందు ఆయన సామాన్యులను కలిసి వారి సమస్యలు వినేవారు. అలా ఎందుకు చేసేవారంటే.. సామాన్యులు ఇక్కడ వరకూ రావడమే కష్టం. మరి అటువంటుది వాళ్లను ముందుగా కలవకపోతే.. వారికి వసతి దగ్గర నుంచి టికెట్ల వరకూ అన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. సమస్యలతో వచ్చిన వారిని మరిన్ని సమస్యల్లోకి నెట్టకూడదనేవారు వైఎస్సార్. అలా సామాన్యుల సమస్యలు వినడమే కాదు.. అది తాను పడుకునే టైమ్‌కు ఎంతవరకూ వచ్చిందనేది రిపోర్ట్ ఇవ్వాలని కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆదేశించేవారు వైఎస్సార్. అలా అందులోంచి పుట్టుకొచ్చినవే ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్, వృద్ధులకు పెన్షన్లు అనే పథకాలు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ ఏదో చేయాలనే తపన వైఎస్సార్‌లో ఎప్పుడూ ఉండేది. ఏ రైతూ ఆత్మహత్య చేసుకోకూడదు అనే భరోసా ఇచ్చిన వ్యక్తి వైఎస్సార్’ అని కొనియాడారు.మాలాంటి వాళ్లను కూడా ఆయన అభిమానిగా మార్చుకున్నారుసీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 'వైఎస్సార్‌తో ఆరంభంలో పెద్దగా పరిచయం లేదు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు అందుకు సపోర్ట్ చేసిన వాళ్లలో నేనూ ఒకడిని. ఇక్కడ విశేషమేటంటే మాలాంటి వాళ్లను కూడా వైఎస్సార్ ఆయనవైపుకు తిప్పుకునేలా చేశారు. ఒకానొక సందర్భంలో ఆయన క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత జర్నలిస్టులతో మాట్లాడారు. ఆ సమయంలో పోలవరం, పులిచింతల ప్రాజెక్టులు పూర్తి చేస్తారా?, అని అడిగితే.. ‘ చేసి చూపిస్తాం’ అని ఒక ధృఢ సంకల్పంతో చెప్పిన మాట నన్ను ఆయనవైపుకు వెళ్లేలా చేసింది. ఆ రకంగానే పులిచెంతలను పూర్తి చేయడమే కాదు.. పోలవరానికి నిధులు తీసుకొచ్చి ఇంతవరకూ ఆ ప్రాజెక్టు రూపాంతరం చెందిందంటే అది వైఎస్సార్ ఘనతే’ అని కొనియాడారు.వైఎస్సార్‌పై ఒక్కొక్కరి అనుభవంతో ఒక్కొక్క గ్రంథం రాయొచ్చువైఎస్సార్ జయంతి వేడుకలకు హాజరైన సభికులని ఉద్దేశించి సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ.. సభలో ఉన్న ఒక్కొక్కరు వైఎస్సార్ గురించి చెబితే ఒక్కో గ్రంధం రాయొచ్చని స్పష్టం చేశారు. ఈ మేరకు వైఎస్సార్‌తో ఉన్న తనకున్న అనుభవాన్ని దేవులపల్లి అమర్ పంచుకున్నారు. ‘నేను ఈ వృత్తిలోకి వచ్చి 50 ఏళ్లు అయ్యింది. 1976లో ఈ వృత్తిలో అడుగుపెట్టా. 1978లో వైఎస్సార్ శాసనసభ్యునిగా మొదటిసారి ఎన్నికైనప్పటి నుంచి నాకు ఆయనతో పరిచయం ఉంది. అప్పట్లో బాగా దగ్గరగా లేకపోయినా, 1999లో ప్రతిపక్ష నాయకుడిగా వచ్చినదగ్గర్నుంచి నాకు అత్యంత సాన్నిహిత్యం ఏర్పడింది. వైఎస్సార్ దగ్గర్నుంచీ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఒక్కటి ఉంది. అది ‘హ్యూమన్ ఫేస్’. మానవత్వం అనేది ఆయన దగ్గర్నుంచి నేర్చుకోవాల్సిన లక్షణం. ఈరోజుల్లో రాజకీయ నాయకుల్లో బాగా లుప్తమైపోయినది కూడా అదే. రాజకీయ నాయకులకు ముఖ్యంగా ఉండాల్సిన మానవత్వం అనేది వైఎస్సార్ నుంచి రోజూ చూసేవాళ్లం. ఆయనకు మానవ్వతం ఉందనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. ఒక అనుభవం చెబుతాను. ఒక కార్మికుడ్ని, ప్రింటింగ్ పేపర్లో వేస్ట్(రద్దు)ను వేరుకునే ఒక కార్మికుడ్ని ఒక సందర్భంలో వైఎస్సార్‌కు దగ్గరకు తీసుకుపోయా. ఆ కార్మికుడికి హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. ఆ కార్మికుడి రిపోర్ట్లు చూసి వైఎస్సార్ రూ. 2 లక్షల మంజూరు చేశారు. రూ. 30 వేలు అడిగిన సందర్భంలో అది ఎక్కడ సరిపోద్ది అని రెండు లక్షలు మంజూరు చేశారు. దాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డికి అప్పగించారు. అయితే ఆ మరుసటి రోజు కిరణ్‌కుమార్‌రెడ్డి అందుబాటులో లేకపోవడంతో డబ్బులు విషయంలో జాప్యం జరిగింది. అయితే ఆ కార్మికుడు ఆపై రెండు రోజులకు చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్.. ఆ కుటుంబం ఊహించనంత పరిహారం ఇచ్చారు. ఆ కార్మికుడు ఎవరో వైఎస్సార్‌కు తెలీదు. అయినా మానవత్వంతో ఉదారత చాటుకున్నారు’ అని వైఎస్సార్‌తో తనకున్న ఒక అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. ఇలా అక్కడకు విచ్చేసిన పలువురు.. వైఎస్సార్‌తో ఉన్న ఆనాటి మరుపురాని అనుభవాలను పంచుకున్నారు. అవి ఈ వీడియోలో చూసేయండి.

YSR Jayanthi: ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ జగన్ నివాళి
సాక్షి, వైఎస్సార్ జిల్లా : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్సార్ తనయుడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఆ సమయంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో విజయమ్మ, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు, పెద్దఎత్తున అభిమానులు పాల్గొన్నారు.వైఎస్ జగన్ రాకతో ఇడుపులపాయ కోలాహలంగా మారింది. జననేతను చూసేందుకు, కరచలనం చేసేందుకు, ఫొటోలు దిగేందుకు భారీ ఎత్తున అభిమానులు ఘాట్ వద్దకు పోటెత్తారు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)మిస్ యూ డాడ్.. వైఎస్సార్ జయంతిని ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. మిస్ యూ డాడ్ అంటూ ఎక్స్ ఖాతాలో ఇవాళ ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన ఫొటోలను పంచుకున్నారు.Miss you Dad! pic.twitter.com/0jINDcR1Fj— YS Jagan Mohan Reddy (@ysjagan) July 8, 2025ఆందోళన వద్దు.. అండగా ఉంటాంకడపలోని వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిశారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (COA) అనుమతి లేకపోవడం, ADCET విడుదలపై వారం రోజులుగా స్టూడెంట్స్ ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇడుపులపాయలో వైఎస్ జగన్‌ను వాళ్లు కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. సమస్య పరిష్కారానికి తాను కృషి చేస్తానని వైఎస్ జగన్ అన్నారు. ‘‘విద్యార్ధులకు మంచి యూనివర్సిటీ కడితే ఈ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేస్తోంది. వైఎస్సార్సీపీ విద్యార్ధులకు అన్ని విధాల అండగా ఉంటుంది వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ సమయంలో వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల నేతలు విద్యార్థుల వెంట ఉన్నారు.
ముగిస్తారా... ఆఖరిదాకా లాక్కొస్తారా?
ఫరఖ్ పడింది!
ఎమర్జెన్సీని తలపించేలా పాలన
చివర్లో కొనుగోళ్లు
కార్మికుల పొట్ట కొట్టొద్దు!
రెడీ టు కుక్... ఓ నయా ట్రెండింగ్...!
సింగరేణిలో సమ్మె జరిగేనా?
బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘మినిమం’ చార్జీల ఎత్తివేత
మళ్లీ మొబైల్ బిల్లుల మోత!
వైఎస్సార్ పేరుతో అభ్యుదయ రైతులకు అవార్డులు
'కన్పప్ప'లో వాళ్లను చూస్తుంటే ఇరిటేషన్ వచ్చింది: తమ్మారెడ్డి భరద్వాజ
పెరుగుతున్న కార్మిక కొరత.. జనాభా సంక్షోభం
Telangana: ఆదివారం మద్యం, మాంసం బంద్
ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఆకస్మిక ధనలాభం
అలాగే, తనకు నోబెల్ వచ్చేటట్లు అర్జంటుగా ఏదైనా ఒక చట్టం చేయమంటున్నారు!!
సర్కారు ఇప్పుడొద్దన్నవారికీ ఇందిరమ్మ ఇళ్లు!
'ఫిష్ వెంకట్' కోసం రూ. 2 లక్షలు పంపిన సినీ హీరో
తమాషాలు చేస్తున్నారా....సరెండర్ చేస్తా
శాంతించిన వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసం డోసు కాస్త తగ్గింది..!
డేట్ ఫిక్స్?
మస్క్ అమెరికా పార్టీ అమెరికన్ల స్వేచ్ఛ కోసమేనని వ్యాఖ్యలు
ఈ రాశి వారికి వ్యాపారాలలో మార్పులు
ఉద్యోగులు పూర్తిగా మోసపోయారు
సంగీత దర్శకుడు కీరవాణి ఇంట విషాదం
క్వాడ్రపుల్ సెంచరీ (400) చేసే సువర్ణావకాశాన్ని వదిలేసిన సౌతాఫ్రికా కెప్టెన్
అయ్యో.. ఇలా ఎందుకు చేశావు గిల్?.. చిక్కుల్లో కెప్టెన్?!
రెడ్‌బుక్‌కు రెడ్ సిగ్నల్!
జిమ్‌కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది
పృథ్వీ షా సంచలన నిర్ణయం
ముగిస్తారా... ఆఖరిదాకా లాక్కొస్తారా?
ఫరఖ్ పడింది!
ఎమర్జెన్సీని తలపించేలా పాలన
చివర్లో కొనుగోళ్లు
కార్మికుల పొట్ట కొట్టొద్దు!
రెడీ టు కుక్... ఓ నయా ట్రెండింగ్...!
సింగరేణిలో సమ్మె జరిగేనా?
బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘మినిమం’ చార్జీల ఎత్తివేత
మళ్లీ మొబైల్ బిల్లుల మోత!
వైఎస్సార్ పేరుతో అభ్యుదయ రైతులకు అవార్డులు
'కన్పప్ప'లో వాళ్లను చూస్తుంటే ఇరిటేషన్ వచ్చింది: తమ్మారెడ్డి భరద్వాజ
పెరుగుతున్న కార్మిక కొరత.. జనాభా సంక్షోభం
Telangana: ఆదివారం మద్యం, మాంసం బంద్
ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఆకస్మిక ధనలాభం
అలాగే, తనకు నోబెల్ వచ్చేటట్లు అర్జంటుగా ఏదైనా ఒక చట్టం చేయమంటున్నారు!!
సర్కారు ఇప్పుడొద్దన్నవారికీ ఇందిరమ్మ ఇళ్లు!
'ఫిష్ వెంకట్' కోసం రూ. 2 లక్షలు పంపిన సినీ హీరో
తమాషాలు చేస్తున్నారా....సరెండర్ చేస్తా
శాంతించిన వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసం డోసు కాస్త తగ్గింది..!
డేట్ ఫిక్స్?
మస్క్ అమెరికా పార్టీ అమెరికన్ల స్వేచ్ఛ కోసమేనని వ్యాఖ్యలు
ఈ రాశి వారికి వ్యాపారాలలో మార్పులు
ఉద్యోగులు పూర్తిగా మోసపోయారు
సంగీత దర్శకుడు కీరవాణి ఇంట విషాదం
క్వాడ్రపుల్ సెంచరీ (400) చేసే సువర్ణావకాశాన్ని వదిలేసిన సౌతాఫ్రికా కెప్టెన్
అయ్యో.. ఇలా ఎందుకు చేశావు గిల్?.. చిక్కుల్లో కెప్టెన్?!
రెడ్‌బుక్‌కు రెడ్ సిగ్నల్!
జిమ్‌కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది
పృథ్వీ షా సంచలన నిర్ణయం
సినిమా

'ఇప్పటికే మూడో పెళ్లి చేసుకున్నా.. కానీ'.. అమిర్ ఖాన్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఇటీవలే సితారే జమీన్ పర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గతనెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. లాల్ సింగ్ చద్ధా తర్వాత అమిర్ చేసిన మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 2018లో వచ్చిన మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు బాలీవుడ్ హీరో.అయితే ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న అమిర్ ఖాన్ మరోసారి రిలేషన్లో ఉన్నారు. తన చిన్ననాటి స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌తో డేటింగ్ ప్రారంభించారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం గౌరీతో రిలేషన్లో ఉన్న అమిర్ ఖాన్.. మూడో పెళ్లిపై స్పందించారు. గౌరీని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నట్లు అమిర్ ఖాన్ తెలిపారు. మేమిద్దరం చాలా నిజాయితీ, నిబద్ధతతో ఉన్నామని అన్నారు. మీకు తెలుసా? మేము ప్రస్తుతం భాగస్వాములని.. ఇప్పటికే తన హృదయంతో ఆమెను పెళ్లాడానని అమిర్ ఖాన్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. మేము కలిసి ఉన్నామని.. అయితే అధికారికంగా పెళ్లి చేసుకోవాలా? వద్దా? అనే దానిపై రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అమిర్ ఖాన్ తెలిపారు.కాగా.. ఈ సంవత్సరం మార్చిలో తన 60వ పుట్టినరోజు సందర్భంగా తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌తో తన రిలేషన్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు. అమిర్ వయస్సు 60 ఏళ్లు కాగా.. గౌరీకి(46) అతనికి దాదాపు 14 సంవత్సరాల వయస్సు తేడా ఉంది. ఆమె ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. ఇప్పటికే అమిర్ ఖాన్ 1986లో మొదట రీనా దత్తాను పెళ్లాడారు. ఆ తర్వాత 2002లో విడిపోయారు. మరో మూడేళ్లకు డైరెక్టర్ కిరణ్ రావును వివాహమాడారు. వీరిద్దరు 2021లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం మూడో పెళ్లికి సిద్ధమయ్యారు మన బాలీవుడ్ స్టార్ హీరో.

కార్పొరేట్ జాబ్ చేయకుండా.. రూ.2 వేల జీతానికే జాయిన్ అయ్యా: హీరో సిద్ధార్థ్
కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ ఇటీవలే సరికొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆయన హీరోగా నటించిన 3బీహెచ్‌కే జూలై 4న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి శ్రీగణేశ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాకు సక్సెస్ టాక్ రావడంతో మేకర్స్ థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌కు హీరో సిద్ధార్థ్, హీరోయిన్ మీతా రఘునాథ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కేవలం రెండు వేల రూపాయలకే అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యానని వెల్లడించారు.సిద్ధార్థ్ మాట్లాడుతూ..' నేను నా లైఫ్‌ను రెండుసార్లు రీసెట్ చేశాను. ఎంబీఏ పూర్తి చేసి కార్పొరేట్ జాబ్ చేయకుండా సినిమా వైపు వచ్చా. కేవలం రెండు వేల రూపాయలకే మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాను. అప్పుడు నా పేరేంట్స్ నన్ను చూసి ఆందోళనకు గురయ్యారు. వీడేంటి సినిమా సైడ్ వెళ్తున్నాడు.. అది కూడా డైరెక్టర్ అవుతానని అంటున్నాడు. వీడు ఏమవుతాడో అని భయపడ్డారు. అక్కడి నుంచి మొదలై 25 ఏళ్ల తర్వాత ఈ రోజు ఒక సింగర్‌గా, నటుడిగా మీ ముందు నిలబడ్డా' అని పంచుకున్నారు.(ఇది చదవండి: తెలుగులో అద్భుతంగా మాట్లాడిన హీరోయిన్.. నోరెళ్లబెట్టిన హీరో సిద్దార్థ్)కాగా.. 3 బీహెచ్‌కే మూవీలో శరత్‌కుమార్, దేవయాని, చైత్ర, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ జూలై 4న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముదుకొచ్చింది. కాగా.. గతేడాది సిద్ధార్థ్ వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. హీరోయిన్ ఆదితి రావు హైదరీని ఆయన పెళ్లాడారు. తెలంగాణలోని ఓ ప్రాచీన ఆలయంలో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు.

ఇప్పుడైతే ఆ విషయం ధైర్యంగా చెప్పగలుగుతున్నా: విజయ్ దేవరకొండ
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా కొత్త విడుదల తేదీని ఇప్పటికే ప్రకటించారు. జూలై 25న రావాల్సిన కింగ్డమ్ మరో ఆలస్యంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నెలాఖర్లో బిగ్ స్క్రీన్‌పై కింగ్డమ్ రిలీజ్ కానుంది. ఓ స్పెషల్ వీడియోతో కొత్త తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్క్రిప్ట్ విషయంలో తాను చాలా కఠినంగా ఉంటున్నట్లు వెల్లడించారు.విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. 'సినీ ఇండస్ట్రీలో మనకు ఎలాంటి సపోర్ట్ లేకపోతే ఈ స్క్రిప్ట్ బాగాలేదు.. ఈ సినిమా నేను చేయను.. అని ముక్కుసూటిగా చెప్పలేం. గతంలో నాకు ఇంత ఫ్రీగా మాట్లాడే అవకాశం ఉండేది కాదు. అదే ఇండస్ట్రీలో ఫ్యామిలీ సపోర్ట్ ఉన్న నటుడికే అవకాశం వస్తే.. ఆ స్క్రిప్ట్‌ను చేయనని ముక్కుసూటిగా చెప్పేస్తాడు. ఆ తర్వాత అతని తండ్రి వచ్చి మరో మూడు, నాలుగు నెలలు ఆగండి. వీలైతే ఎక్కువమంది రైటర్లను తీసుకొస్తానని అంటాడు. నేనైతే ఇటీవల స్క్రిప్ట్‌ల విషయంలో కాస్త కఠినంగానే ఉంటున్నా. నా దగ్గరకు వచ్చిన దర్శకులతో ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే నాకు డబ్బుతో పాటు కెరీర్ చాలా ముఖ్యం. ఇప్పుడు మనం చేసేదానితో సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నా. స్క్రిప్ట్‌తో ఓకే అనిపించిన తర్వాతే ముందుకు వెళ్తున్నా' అని అన్నారు.కాగా.. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించగా.. సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కిటారు. ఈ యాక్షన్ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు.

జిమ్‌లో బిగ్‌బాస్ దివి వర్కవుట్స్.. మాల్దీవుస్‌లో హీరోయిన్ ప్రణీత!
బిగ్‌బాస్ దివి జిమ్ వర్కవుట్ పోజులు.చిన్నపిల్లలతో బిగ్‌బాస్ అశ్విని శ్రీ ..మాల్దీవుల్లో హీరోయిన్ ప్రణీత వేకేషన్..శారీలో హీరోయిన్ ప్రియమణి పోజులు..స్విమ్మింగ్‌పూల్‌లో సేదతీరుతోన్న సురేఖవాణి కూతురు సుప్రీత.. View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by HemaDayal (@hemadayal18) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by Divi (@actordivi)
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

బూమ్ బూమ్ బుమ్రా
లండన్: ఇంగ్లండ్‌తో మూడో టెస్టు కోసం భారత టాప్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సిద్ధమవుతున్నాడు. రేపటి నుంచి ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. పని భారం కారణంగా ఈ సిరీస్‌లో మూడు టెస్టులే ఆడాలని నిర్ణయించుకున్న బుమ్రా బర్మింగ్‌హామ్‌లో జరిగిన రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు తగినంత విరామం తర్వాత పూర్తి ఫిట్‌గా మ్యాచ్‌కు అతను సన్నద్ధమయ్యాడు. టెస్టుకు రెండు రోజుల ముందు మంగళవారం బుమ్రా సుదీర్ఘ సమయం పాటు నెట్స్‌లో శ్రమించాడు. విరామం లేకుండా అతను బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఆప్షనల్ ప్రాక్టీస్ రోజు కావడంతో ప్రధాన బ్యాటర్లు గిల్, రాహుల్, జైస్వాల్, పంత్‌తో పాటు సుందర్, సిరాజ్, ఆకాశ్‌దీప్ కూడా మంగళవారం సాధన చేయలేదు. దాంతో కరుణ్ నాయర్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, ధ్రువ్ జురేల్‌లకు బుమ్రా బౌలింగ్ చేశాడు. వీరందరినీ తన బౌలింగ్‌తో బుమ్రా ఇబ్బంది పెట్టాడు. ఎలాంటి అసౌకర్యం లేకుండా పూర్తి రనప్‌తో అతను బౌలింగ్ చేశాడు. నెట్స్‌కు వచ్చీ రాగానే బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌ను అడిగి తనకు కొత్త బంతి మాత్రమే కావాలని ఎంచుకున్న బుమ్రా దాంతో ప్రాక్టీస్ కొనసాగించాడు. 2021లో లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రివర్స్ స్వింగ్‌తో మూడు కీలక వికెట్లు పడగొట్టిన బుమ్రా భారత్ ఘన విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సారి లార్డ్స్ పిచ్ పేస్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుందని వినిపిస్తున్న నేపథ్యంలో అతను ఎలా చెలరేగుతాడనేది ఆసక్తికరం

పాకిస్తాన్ జట్టు ప్రకటన.. బాబర్ ఆజం, రిజ్వాన్‌లపై వేటు
బంగ్లాదేశ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ మంగళవారం ప్రకటించింది. ఈ జట్టుకు సల్మాన్ అలీ అఘా నాయకత్వం వహించనున్నాడు. అయితే స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, షాహీన్ షా అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్‌లపై సెలక్టర్లు వేటు వేశారు.ఈ జట్టులో ఈ సీనియర్ త్రయానికి చోటు దక్కలేదు. పాక్ కొత్త వైట్‌బాల్ కోచ్ మైక్ హెస్సన్ సూచన మేరకు వీరిని సెలక్టర్లు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇకపై ఈ ముగ్గురు సీనియర్ ప్లేయర్లు టెస్టులు, వన్డేల్లో మాత్రమే భాగమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.ఇక ఈ సిరీస్‌కు ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్, స్పీడ్ స్టార్ హ్యారిస్ రవూఫ్ గాయం కారణంగా దూరమయ్యాడు. అయితే వెటరన్ ఆటగాడు మొహమ్మద్ నవాజ్ మాత్రం సెలక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు. అదేవిధంగా యువ పేస్ సంచలనం సల్మాన్ మీర్జాకు సైతం ఈ జట్టులో చోటు దక్కింది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ జూలై 20 నుంచి 24 మధ్య జరగనుంది. మొత్తం మూడు మ్యాచ్‌లు కూడా ఢాకా వేదికగా జరగనున్నాయి.బంగ్లాతో టీ20 సిరీస్‌కు పాక్ జట్టుసల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, అహ్మద్ డానియాల్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ హారీస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, సాహిబ్జాదా సల్మాన్ , మొహమ్మద్ నవాజ్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా ,సుఫ్యాన్ మోకిమ్.

స్టోక్స్ ఇదొక కఠిన పరీక్ష.. గిల్ మాత్రం అద్భుతం: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌ను 336 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అదరగొట్టిన భారత జట్టు.. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో తమ తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది.దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో గిల్ సేన సమం చేసింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆదేశ మాజీ క్రికెటర్ మైఖేల్ అథర్టన్ విమర్శల వర్షం కురిపించాడు. స్టోక్స్ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడని, కెప్టెన్‌గా తన మార్క్ చూపించలేకపోతున్నాడని అథర్టన్ మండిపడ్డాడు. కాగా తొలి టెస్టులో పర్వాలేదన్పించిన స్టోక్స్.. రెండో టెస్టులో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. అటు వ్యక్తిగత ప్రదర్శన పరంగా.. ఇటు కెప్టెన్సీలోనూ విఫలమయ్యాడు."ఈ సిరీస్‌కు బెన్ స్టోక్స్‌కు కఠిన పరీక్ష వంటింది. స్టోక్స్ గత కొంత కాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా అతడి బ్యాటింగ్ ఫామ్ జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రోజు రోజుకు అతడి బ్యాటింగ్ ఫామ్ దిగజారుతూ వస్తోంది.వన్డే, టీ20లకు దూరంగా ఉంటూ స్టోక్స్ కేవలం టెస్టుల్లో ఆడుతూ వన్-ఫార్మాట్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. అతడు జట్టును ఒక ప్రణాళికపరంగా ముందుకు నడిపించలేకపోతున్నాడు. అతడి పేలవ ఫామ్ కెప్టెన్సీపై ఇంపాక్ట్ చూపుతోంది. అంతేకాకుండా స్పిన్నర్లను ఆడటానికి ఇబ్బంది పడుతున్నాడు.కానీ ప్రత్యర్ధి కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాత్రం అద్బుతంగా రాణిస్తున్నాడు. తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరిస్తునప్పటకి జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. లార్డ్స్‌లో జరగనున్న మూడో టెస్టులో కూడా భారత్ నుంచి ఇంగ్లండ్‌కు గట్టి సవాల్ ఎదురుకానుంది.ఈ మ్యాచ్‌లో స్టోక్స్ కెప్టెన్‌గా ఎలా రాణిస్తాడన్నది చాలా ముఖ్యంమని" ది టైమ్స్ కాలమ్‌లో అథర్టన్ పేర్కొన్నాడు. కాగా టెస్టుల్లో స్టోక్స్ సెంచరీ చేసి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఇక ఇంగ్లండ్-భారత్ మధ్య మూడో టెస్టు గురువారం నుంచి ప్రారంభం కానుంది.చదవండి: IND vs ENG: భారత్‌తో వన్డే సిరీస్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన! కెప్టెన్ ఈజ్ బ్యాక్

భారత్‌తో వన్డే సిరీస్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన
భారత మహిళలతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. గజ్జ గాయం కారణంగా భారత్‌తో టీ20 సిరీస్ మధ్యలోనే వైదొలిగిన ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ స్కైవర్-బ్రంట్ తిరిగి వన్డే జట్టులోకి వచ్చింది.అదేవిధంగా సోఫీ ఎకిలిస్టోన్, బౌచర్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. గత నెలలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు ఎకిలిస్టోన్ దూరమైంది. మానసిక ఒత్తిడి కారణంగా కొన్నాళ్ల పాటు క్రికెట్ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.కానీ ఈ ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని తన నిర్ణయాన్ని సోఫీ మార్చుకుంది. ఈ క్రమంలోనే వన్డే జట్టులోకి ఆమె తిరిగొచ్చింది. ఈ సిరీస్ వన్డే వరల్డ్‌కప్-2025 సన్నాహాకాల్లో భాగంగా జరగనుంది. జూలై 16 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ రెండు జట్లు టీ20 సిరీస్‌లో తలపడతున్నాయి. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-2 ఆధిక్యంలో భారత్ కొనసాగుతోంది.వన్డే సిరీస్ షెడ్యూల్:1వ వన్డే – జూలై 16, ది అగేస్ బౌల్, సౌతాంప్టన్2వ వన్డే – జూలై 19, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్, లండన్3వ వన్డే – జూలై 22, సీట్ యూనిక్ రివర్సైడ్, చెస్టర్-లె-స్ట్రీట్భారత్తో వన్డే సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టునాట్ స్కైవర్-బ్రంట్(కెప్టెన్),ఎమ్ ఆర్లాట్, టామీ బ్యూమాంట్, లారెన్ బెల్, మైయా బౌచియర్, ఆలిస్ కాప్సే, కేట్ క్రాస్, ఆలిస్ డేవిడ్సన్-రిచర్డ్స్, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, అమీ జోన్స్, ఎమ్మా లాంబ్, లిన్సే స్మిత్భారత మహిళల వన్డే జట్టుహర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్తికా భాటియా, తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చారణి, శుచి ఉపాధ్యాయ్, అరుంధతి రెడ్డి, కె. సత్ఘరేచదవండి: IND vs ENG 3rd Test: లార్డ్స్ టెస్టుకు గ్రీన్ పిచ్.. భారత జట్టులోకి యువ సంచలనం?
బిజినెస్

టాటా మోటార్స్ నుంచి మినీ ట్రక్లు.. ధర ఎంతంటే..
వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్ తాజాగా కార్గో రవాణా కోసం ఏస్ ప్రో పేరిట 4–వీల్ మినీ ట్రక్కులను ప్రవేశపెట్టింది. వీటి ధర రూ. 3.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దాదాపు 750 కేజీల పేలోడ్ సామర్థ్యంతో, పెట్రోల్, బై–ఫ్యుయెల్, ఎలక్ట్రిక్ వేరియంట్లలో ఈ వాహనాలు లభిస్తాయని సంస్థ వైస్ ప్రెసిడెంట్ పినాకి హల్దార్ తెలిపారు. ఎలక్ట్రిక్ వెర్షన్ ఒకసారి చార్జ్ చేస్తే సుమారు 125 కి.మీ. నుంచి 155 కి.మీ. వరకు మైలేజి ఇస్తుందని పేర్కొన్నారు. మారుతున్న మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో తేలికపాటి వాణిజ్య వాహనాల పరిశ్రమ వృద్ధి ప్రస్తుతం ఒక మోస్తరుగానే ఉన్నప్పటికీ మధ్యకాలికం, దీర్ఘకాలికంగా మెరుగ్గా ఉంటుందని హల్దార్ చెప్పారు.క్యూ1లో జేఎల్ఆర్ అమ్మకాలు డౌన్ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో జాగ్వార్ ల్యాండ్‌రోవర్ (జేఎల్ఆర్) హోల్‌సేల్, రిటైల్ అమ్మకాలు తగ్గాయి. డీలర్లకు సరఫరా (టోకు విక్రయాలు) వార్షికంగా 11 శాతం క్షీణించి 87,286 యూనిట్లకు పరిమితమయ్యాయి. తొలి త్రైమాసికంలో ఉత్తర అమెరికా, యూరప్, బ్రిటన్‌లో హోల్‌సేల్ అమ్మకాలు వరుసగా 12 శాతం, 14 శాతం, 25 శాతం తగ్గినట్లు జేఎల్ఆర్ ఒక ప్రకటనలో తెలిపింది.ఇదీ చదవండి: రూ.100తో చోటాసిప్!ఇక రిటైల్ అమ్మకాలు 15 శాతం క్షీణించి 94,420 యూనిట్లుగా నమోదైనట్లు వివరించింది. సమస్యాత్మక పరిస్థితులు నెలకొన్న తరుణంలో అంచనాలకు అనుగుణంగానే అమ్మకాలు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. వారసత్వంగా వస్తున్న మోడల్స్‌ను క్రమంగా నిలిపివేసి కొత్త జాగ్వార్ మోడల్సను ప్రవేశపెట్టనుండటం, అమెరికాలో దిగుమతి సుంకాల వ్యవహారం కారణగా ఏప్రిల్‌లో ఎగుమతులు తాత్కాలికంగా నిలిచిపోవడం తదితర అంశాలు విక్రయాలు తగ్గడానికి కారణమని వివరించింది.

రూ.100తో చోటాసిప్!
బజాజ్ ఫిన్సర్వ్ అస్సెట్ మేనేజ్మెంట్ చోటాసిప్ను తీసుకువచ్చే ప్రణాళికతో ఉన్నట్టు ప్రకటించింది. ఇందులో సాధ్యా సాధ్యాలను అంచనా వేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కంపెనీ ఎండీ గణేష్ మోహన్ తెలిపారు. ఈ దిశగా టెక్నాలజీ పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు.ఇదీ చదవండి: కొనుగోలుదారులను ఆడేసుకుంటున్న బంగారం..చోటాసిప్ అన్నది ఆసక్తికరమైన చొరవగా గణేష్ మోహన్ పేర్కొన్నారు. తగినంత అధ్యయనం అనంతరం దీన్ని ప్రారంభించేందుకు ఆరు నెలల సమయం తీసుకుంటుందన్నారు. ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్‌లో కనీసం రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకునేందుకు వీలుగా సెబీ ఈ ఏడాది ఆరంభంలో మైక్రోసిప్‌ను ఆవిష్కరించడం గమనార్హం. ఎస్బీఐ, కోటక్ మ్యూచువల్ ఫండ్స్ ఇప్పటికే రూ.100 సిప్‌ను అందిస్తున్నాయి. మిగిలిన మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో అయితే కనీసం రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

కొనుగోలుదారులను ఆడేసుకుంటున్న బంగారం..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఇటీవల తగ్గినట్లే తగ్గి మళ్లీ ఈ రోజు పుంజుకుంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధర పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

హైదరాబాద్‌లో ఇన్నోవేషన్ క్యాంపస్ ప్రారంభం
గ్లోబల్ స్పోర్ట్స్, గేమింగ్ లీడర్‌గా ఉన్న ఎంటైన్ సంస్థకు చెందిన టెక్నాలజీ విభాగం ఐవీ అధికారికంగా ఎంటైన్ ఇండియాగా రీబ్రాండ్ అయి హైదరాబాద్‌లో డిజిటల్ ఇన్నోవేషన్ క్యాంపస్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. కొత్త హైదరాబాద్ క్యాంపస్ ఎంటైన్ అంతర్జాతీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారనుందని కంపెనీ పేర్కొంది.ఈ సంస్థలో పని చేసేందుకు హైబ్రిడ్ రోల్స్‌లో 3,400 మంది హైస్కిల్డ్ ప్రొఫెషనల్స్‌కు చోటు కల్పించేలా ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్(జీసీసీ)ఫెసిలిటీని రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఎంటైన్ హైదరాబాద్ క్యాంపస్ ద్వారా గ్లోబల్ టెక్ సేవల్లో 85% పైగా సర్వీసులు అందించడానికి దీన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పింది. ఇందులో సేవలందించే అడ్వాన్స్డ్ డొమైన్లు కింది విధంగా ఉన్నాయి.కృత్రిమ మేధప్లాట్ ఫాం ఇంజినీరింగ్రియల్ టైమ్ ట్రేడింగ్ సిస్టమ్స్గ్లోబల్ సస్టెయినబిలిటీ లక్ష్యాలకు అనుగుణంగా హైదరాబాద్ క్యాంపస్‌లోని సదుపాయాలు..స్మార్ట్ లైటింగ్ వ్యవస్థలుఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) ఛార్జింగ్ స్టేషన్లుపర్యావరణహిత నిర్మాణ సామగ్రిఇదీ చదవండి: ట్రంప్ అదనపు డ్యూటీల ప్రస్తావన.. రూపాయి నేలచూపుఈ రీబ్రాండ్ వ్యూహాత్మక ప్రాముఖ్యతపై ఎంటైన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అంతిల్ అన్బగన్ మాట్లాడుతూ..‘ఎంటైన్ ఇండియా ద్వారా హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ సర్వీసులు అందించబోతున్నందుకు సంతోషంగా ఉంది. ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ భవిష్యత్తును ఇక్కడి నుంచి శక్తివంతం చేయడం గర్వంగా ఉంది’ అన్నారు. ఎంటైన్ చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ సాటీ బెన్స్ మాట్లాడుతూ..‘తదుపరి తరం వినోద వేదికలను నిర్మించాలనే మా ఆశయానికి భారతదేశం కేంద్రబిందువుగా మారింది. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయడం ఆ దిశగా కంపెనీ వేసిన సాహసోపేతమైన ముందడుగు’ అని అన్నారు.
ఫ్యామిలీ

వాకింగూ కాదు, రన్నింగూ కాదు అరవైలో ఇరవైలా ఫిట్‌గా : ఇవిగో టిప్స్
సాక్షి, హైదరాబాద్: వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అధిక శాతం మంది నడక లేదా స్వల్ప శరీర వ్యాయామమే సరిపోతుందనుకుంటారు. అయితే.. తాజాగా హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్య యనం ప్రకారం చూస్తే.. వయసు పైబడినవారు ఆరో గ్యంగా, ఉల్లాసంగా ఉండాలంటే కేవలం నడక సరిపో దని.. మొత్తంగా వారి ఆలోచనల్లో మార్పు రావడానికి శారీరకంగా చైతన్యంగా ఉండేందుకు కదలికలు అవసరమని వెల్లడైంది. ఈ ప్రయోగంలో శరీరానికి మాత్రమే కాక, మనసుకు కూడా ఉత్తేజం కలిగించే వ్యాయామాల ప్రాధాన్యాన్ని వివరించారు. తై చీ, ఐకిడో, వింగ్ చున్.. వంటి మార్షల్ ఆర్ట్స్ పద్ధతులు వృద్ధుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఈ అధ్యయ నంలో పేర్కొన్నారు.ఏమిటీ అధ్యయనం..?హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన డాక్టర్ పీటర్ ఎం.వె యిన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరిశీలనలో తై చీ వంటి నెమ్మదిగా, స్వల్ప కదలి కలతో సాగే మార్షల్ ఆర్ట్స్ మనుషుల శరీరంలో ‘ఫిజి యొలాజికల్ కాంప్లెక్సిటీ’ ను పెంచుతాయని వెల్లడైంది. అంటే.. వృద్ధాప్యంలో ఎదురయ్యే అడ్డంకులకు మెరుగ్గా స్పందించే సామర్థ్యం శరీరానికి పెరుగుతుందని తేలింది.ఇవి కేవలం శారీరక ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాక, జీవన నాణ్యత మెరుగుదలకు తోడ్పడుతున్నట్టు స్పష్ట మైంది. ఇప్పటిదాకా మన దగ్గర పెద్దల ఆరోగ్యంపై దృష్టి చికిత్సాపరంగా ఉండేది. కానీ తాజా అధ్యయనం సూచిస్తున్న మార్గం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, పునరావాస కేంద్రాలు, సామాజిక కార్యక్రమాల రూపంలో మార్షల్ ఆర్ట్స్ వంటి చురుకైన లేదా మృదువైన కదలికలతో కూడిన వ్యాయామాలను ప్రవే శపెట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తోంది.నడకతో పోలిస్తే ?నడక.. కేవలం కాలి కదలికలతో పరిమితమైన వ్యాయామం. తైచీ.. శరీరం, శ్వాస, మేధస్సు.. మూడింటినీ ఒకే సమయంలో సమతుల్యంగా ఉత్తేజపరిచే ప్రక్రియ. వృద్ధులకు.. మరీ ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వారికి సులభ, స్వల్ప తరహా మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగపడతాయి.ఇది వృద్ధుల్లో.. తూలిపడిపోవడం వంటి వాటిని తగ్గిస్తుందినిద్ర నాణ్యత మెరుగవుతుందిమానసిక స్థైర్యం పెరుగుతుందితెలుగు రాష్ట్రాల్లో వృద్ధుల పరిస్థితి మార్పు ఆవశ్యకత..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వృద్ధుల జనాభా అనేది 13 శాతానికి పైగా ఉందని 2011 జనగణన ద్వారా వెల్లడైంది. 2036 నాటికి ఇది 20 శాతం దాటే అవకాశం ఉంది. ఈ వయోధిక వర్గానికి సరిపడే ఆరోగ్య విధానాలు, శారీరక దృఢత్వం కలిగించే వ్యాయామాలను అందుబాటులోకి తేవడం అత్యవసరం.వృద్ధులకు ఎలాంటి మార్షల్ ఆర్ట్స్ తగినవి.. ఉపయోగాలు..తై చీ: నెమ్మదిగా జరిగే ప్రవాహ రూప కదలికలు, శ్వాస నియంత్రణ, శరీర సమతుల్యత, మానసిక ప్రశాంతతఐకిడో: శక్తిని మళ్లించే శక్తివంతమైన కాన్సెప్ట్, కణజాలానికి మెరుగైన కదలికలువింగ్ చున్: ఓ మోస్తరు క్లిష్టమైన కదలికలు, మెరుగైన ప్రతిస్పందన సామర్థ్యం, స్వీయ రక్షణఇదీ చదవండి: జిమ్‌కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గిందివృద్ధాప్యం ఓ ప్రతిబంధకం కాదు. అది మనం కొత్త విషయాలు నేర్చుకోవాలనే సంకల్పానికి తెరలేపే అవకాశంగా భావించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ అంశంపై వృద్ధుల్లోనే కాకుండా అందరి ఆలోచనా ధోరణిలోనూ మార్పు వచ్చి అవగాహన పెరిగితే సమాజానికి మంచి ప్రయోజనా లు చేకూరుతాయని స్పష్టం చేస్తున్నా రు. వృద్ధుల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడడంతో పాటు.. 60 ఏళ్ల తర్వాత జీవితానికి సంబంధించి కచ్చితమైన అవగాహన, చైతన్యం ఏర్పడతాయని వారు పేర్కొంటున్నారు.చదవండి: 300కు పైగా రైతులకు సాధికారత : తొలి ఏడాదిలోనే రూ. 8.7 కోట్లు

డోపమైన్ లోపం వణికిస్తుందా..?
పార్కిన్సన్స్ వ్యాధి కాస్త వయసు పెరిగిన వాళ్లలో అంటే 60 ఏళ్లు పైబడిన వారిలో కనిపించే వ్యాధి. ఇందులో బాధితుల వేళ్లు, చేతులు వణుకుతుంటాయి. ఈ వ్యాధిని డాక్టర్ జేమ్స్ పార్కిన్సన్ అనే వైద్యనిపుణుడు 1817లో గుర్తించి, మొదట్లో దానికి ‘షేకింగ్ పాల్సీ’ అని పేరు పెట్టినప్పటికీ... వ్యాధినిమొదట గుర్తించిన ఫిజీషియన్ పేరిట ఇది ప్రాచుర్యం పొందింది. కొందరిలో మెదడులోని డోపమైన్ అనే రసాయనం ఉత్పిత్తి తగ్గడం వల్ల, శరీర కదలికలను అదుపులో ఉంచే నాడీకణాలు తగ్గిపోతాయి. దాంతో దేహం వణకడం మొదలై పార్కిన్సన్స్ వ్యాధి మొదలువుతుంది. ఈ వ్యాధి గురించి తెలుసుకుందాం...పార్కిన్సన్ వ్యాధి ఉన్నవాళ్లలోతొలుత నడకతో మొదలై... తర్వాత అన్ని రకాల కదలికలూ ప్రభావితమవుతాయి. ఇలా ఒక వ్యక్తి కదలికలు తగ్గిపోయే గుణాన్ని ‘హైపోకైనేసియా’ అంటారు. తర్వాత చెయ్యి వణకడం మొదలవుతుంది. ఈ వణకడమనేది ఏ పనీ చేయని దశలో... అంటే ఓ వ్యక్తి ఏ పనీ చేయకుండా పూర్తిగా రెస్ట్‌లో ఉన్నప్పుడు కూడా వస్తుంది ఉంటుంది. కాబట్టి ఈ వణుకుడును ‘రెస్ట్ ట్రిమర్స్’గా చెబుతారు. ఇలాంటి వ్యక్తులు పక్కకు తిరగబోయే ప్రయత్నంలో అకస్మాత్తుగా బ్యాలెన్స్ కోల్పోయి పడిపోతూ ఉంటారు. ఇలా బ్యాలెన్స్ కోల్పోవడాన్ని పోష్చురల్ ఇన్‌స్టెబిలిటీ’ అంటారు. ఇవన్నీ ఈ జబ్బుకు ఉన్న ముఖ్యమైన లక్షణాలు. ఇవేగాక ఇంకా చాలా అనుబంధ లక్షణాలూ కనిపిస్తుంటాయి.కారణాలు... నిర్దిష్టంగా కారణం ఇదీ అని చెప్పలేనప్పటికీ కొన్ని పరిశీలనల ద్వారా పార్కిన్సన్ జబ్బు రావడానికి అనేక కారణాలు ఉన్నాయన్నది వైద్య శాస్త్రవేత్తల మాట. అందులో ముఖ్యమైనది జన్యులోపం. ఈ జన్యులోపం ఉన్నవారిలో ఒక వయసు దాటాక ఈ జబ్బు తప్పనిసరిగా బయటపడుతుంది. అలాగే కొందరిలో తీవ్రమైన ఒత్తిడి కారణంగా డోపమైన్ సరిగా వెలువడక జబ్బు వస్తుంది. మరి కొందరిలో వారు తీసుకునే పానియాల్లో లేదా పీల్చే గాలిలో కొన్ని రకాల విషపదార్థాలు (టాక్సిక్ మెటీరియల్స్) ఉన్న కారణంతో... ఆ విషాలు డోపమైన్ విడుదల చేసే కణాలను దెబ్బతీనందువల్ల డోపమైన్ సరిగా విడుదల కాకపోవడంతో ఈ జబ్బు వస్తుంది. అంతేకాకుండా మరికొందరిలో తలకు పదే పదే దెబ్బలు తగలడం వల్ల కూడా ఈ జబ్బు రావచ్చు. ఇంకొందరిలో మెదడుకు కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా ఈ జబ్బు వచ్చేందుకు అవకాశం ఉంది. ఇవన్నీ ఈ జబ్బుకు కారణమయ్యే అంశాలు. అయితే ఈ జబ్బుకు గురైన దాదాపు 50 శాతం మందిలో మాత్రం ఏ కారణం లేకుండా కూడా రావచ్చు. ఇంకా విచిత్రం ఏమిటంటే... ఈ జబ్బు ఎలాంటి చెడు అలవాట్లు (అంటే స్మోకింగ్, ఆల్కహాల్) లేకపోవడం లేదా కనీసం కాఫీ, టీలు తాగని వారిలోనూ కనిపించడమన్నది చాలామంది వైద్యశాస్త్రవేత్తలూ, అధ్యయనవేత్తల దృష్టికి వచ్చిన ఆశ్చర్యకరమైన అంశం. ఏ వయసు వారిలో... పార్కిన్సన్స్ వ్యాధికి గురైన వారిలో 98 శాతం మంది 50 ఏళ్లు పైబడిన వారే. కేవలం రెండు శాతం లోపు వారిలోనే ఇది 50 ఏళ్లలోపు వారిలో కనిపించింది. పార్కిన్సన్స్ వ్యాధి మహిళల్లో కంటే పురుషుల్లో దాదాపు ఒకటిన్నర రెట్లు ఎక్కువ. కొందరిలో మరీ యుక్తవయసులో అంటే 30 ఏళ్ల వారిలోనూ కనిపిస్తుడటంతో దీన్ని వంశపారంపర్యంగా కనిపించే పార్కిన్సనిజమ్ (హెరిడిటరీ పార్కిన్సనిజమ్) అంటున్నారు.ఎందుకు వస్తుందీ జబ్బు? మన మెదడు నిర్మాణం చాలా సంక్లిష్టంగా ఉంటుందన్నది తెలిసిందే. అందులోని ఒక చిన్న భాగం పేరు ‘సబ్‌స్ట్రాన్షియా నైగ్రా’. దీని నుంచి డోపమైన్ అనే రసాయనం (బయోకెమికల్) వెలువడుతుంది. ఇది మన దేహం కదలికలను నియంత్రిస్తుంది. సాధారణంగా 50 ఏళ్లు పైబడ్డ వ్యక్తులు కొందరిలో ఈ రసాయనం సరిగా వెలువడదు. ఆ రసాయనం లోపించడం వల్లనే కదలికల్లో లోపాలు కనిపించడం మొదలవుతుంది.వ్యాధి నిర్ధారణ ఇలా... మెదడు ఎమ్మారై పరీక్ష, అయోఫ్లుపేన్ సింగిల్ ఫొటాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (స్పెక్ట్) పరీక్ష. దీన్నే డాట్ స్కాన్ అని కూడా అంటారు ∙ఎఫ్–డోపల్–6 ఫ్లూరో –3, 4 డై హైడ్రాక్సీ ఫినైల్ అలనైన్ (18 ఎఫ్– డో΄ా) పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (పెట్) స్కాన్ పరీక్ష. కొన్ని నివారణ పద్ధతులు వ్యాయామం పార్కిన్సన్ వ్యాధిని కొంతమేరకు నివారిస్తుంది. ఫిజియోథెరపీ, రీ–హ్యాబిలిటేషన్, మింగలేని సమయాల్లో వచ్చే పాషకాహార లోపాలను అధిగమించడానికి విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడంతో పాటు పార్కిన్సన్ వ్యాధి వల్ల కుంగుబాటు (డిప్రెషన్) వంటి కొన్ని రకాల మానసిక సమస్యలు రావడంతో పాటు అవే సమస్యలు పార్కిన్సన్ వ్యాధికి దారితీసే ప్రమాదం ఉన్నందున సైకియాట్రిక్ ఇవాల్యుయేషన్ కూడా అవసరం కావచ్చు. జబ్బు గురించి కొన్ని కొత్త విషయాలు : ఈ జబ్బుతో బాధపడేవారి జీవన పరిస్థితులను (క్వాలిటీ ఆఫ్ లైఫ్) మెరుగుపరిచేందుకు ఎన్నో మందులు అందుబాటులో ఉన్నాయి. మెదడులో డోపమైన్ అనే రసాయన పదార్థం ఉత్పత్తి తగ్గడం వల్ల ఈ జబ్బు వస్తుంది కాబట్టి జబ్బు ఉన్నవారిలో ఇదే పదార్థాన్ని బయట నుంచి టాబ్లెట్ల రూపంలో ఇవ్వడం ఒక చికిత్స ప్రక్రియ.కొన్ని ప్రధాన చికిత్స ప్రక్రియలు : మెదడులో తగ్గిన డోపమైన్ ఉత్పత్తిని పెంచే మందులతో లక్షణాల్ని అదుపులోకి తేవచ్చు. అయితే పెరిగే వయసుతోపాటు డోపమైన్ ఉత్పాదన / మెదడులో దాని మోతాదు తగ్గుతూ వస్తుండటంతో మందుల మోతాదును పెంచుతూపోవాల్సి ఉంటుంది. లెవోడోపా / కార్బిడోపా అనే మందులు దేహంలోకి వెళ్లగానే డోపమైన్‌గా మారతాయి. మావో–బి ఇన్హిబిటార్స్ మందులు మరింత డోపమైన్ లభ్యమయ్యేలా చేస్తాయి. యాంటీ కొలెనెర్జిక్ మందులు లక్షణాల తీవ్రతను తగ్గించి, ఉపశమనాన్నిస్తాయి. ఎమ్మారై ఇమేజింగ్ సమయంలో ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ థెరపీతో థలామస్లో కొన్ని లీజన్స్ కల్పించడమూ ఓ చికిత్సగా చెప్పవచ్చు. ఇదొక నాన్–ఇన్వేజివ్ ప్రక్రియ. అంటే... కత్తి కోత గానీ లేదా గాటు గానీ పడకుండా చేసే చికిత్స.పై చికిత్సలతో పాటు గత పది పదిహేనేళ్ల వ్యవధిలో దీనికి అనేక కొత్త చికిత్స పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి... శస్త్రచికిత్స : మందుల మోతాదు పెరుగుతున్న కొద్దీ ఓ దశలో దుష్ప్రభావాలు మొదలవుతాయి. అందుకే మాత్రలు వేసుకున్నా ప్రయోజనం లేని సందర్భాల్లో ఇక చివరి యత్నంగా ‘డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ’ అనే శస్త్రచికిత్స అవసరం పడవచ్చు. డీబీఎస్ : డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే రూపానికి ఇంగ్లిష్ పొడి అక్షరాలే డీబీఎస్. ఇదో శస్త్రచికిత్స ప్రక్రియ. ఇందులో చాలా మోతాదులో తక్కువ కరెంట్‌ను పంపి డోపమైన్ కణాలను ఉత్తేజపరుస్తారు. జబ్బు బాగా ముదిరిపోయి, ఇక మందులు ఎలాంటి ప్రభావం చూపని దశలోనే ఈ శస్త్రచికిత్స చేస్తారు. ఈ కరెంట్ పంపే పరికరం గుండెకు అమర్చే పేస్‌మేకర్‌లా ఉంటుంది. మెదడు లోపల ‘సబ్‌స్ట్రాన్షియా నైగ్రా’ అనే ప్రాంతంలో దీని తాలూకు ఎలక్ట్రోడ్‌ను అమర్చుతారు. బయట దాన్ని అనుసంధానించడానికీ, మోతాదు నియంత్రించడానికీ ఒక బటన్‌ను అమర్చుతారు.మందుల దుష్ప్రభావాలు మొదలైతే ప్రత్యామ్నాయం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ...పార్కిన్సన్ వ్యాధిలో వాడుకునే మందులు మూడు నుంచి ఐదేళ్ల వరకు సమర్థంగా పనిచేసినా... ఆ తర్వాత రెండు రకాల దుష్ప్రభావాలు మొదలవుతాయి. కొందరిలో టాబ్లెట్ ప్రభావం కొనసాగినంతసేపు బాగానే ఉన్నా... దాని ప్రభావం తగ్గగానే లక్షణాలు బయటపడుతుంటాయి. దీన్నే ‘ఆన్ ఆర్ ఆఫ్ ఫినామెనా’ అంటారు. మరికొందరిలో మాత్ర వేసుకున్నప్పుడు వ్యాధి తీవ్రత పెరిగినట్లుగా... దేహంలో కదలికలు మరింత పెరిగి΄ోతూ ఉంటాయి. ఈ రెండు రకాల దుష్ప్రభావాలూ సుదీర్ఘకాలం మందులు వాడినవారిలో కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మందుల్ని ఆపలేక... కొనసాగించలేక బాధితులు ఇబ్బంది పడతారు. ఇలాంటివారికి ‘డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ’ అన్నది ఓ వరప్రదాయని అనుకోవచ్చు. డీబీఎస్ సర్జరీకి ముందు పరీక్ష... పార్కిన్సన్ వ్యాధి మందులతో అదుపు కావడంలేదని నిర్ధారణ చేసుకోవడం కోసం వైద్యులు ఓ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో బాధితులకు మొదట మందులు ఇవ్వకుండా వారి చేత కొన్ని పనులు చేయిస్తారు. వాటితో మందు ప్రభావమూ, దుష్ప్రభావాల తీవ్రత తెలుస్తాయి. మందులతో ఇక ఏమాత్రమూ ప్రయోజనం కనిపించని బాధితులను మాత్రమే సర్జరీకి ఎంపికచేస్తారు. అంతేకాదు... వాళ్లకు ఎలాంటి మానసిక రుగ్మతలూ ఉండకూడదు. సర్జరీ తర్వాత కొందరిలో మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి సర్జరీకి ముందు ఎలాంటి మానసిక సమస్యలూ లేవని సైకియాట్రిస్ట్ తొలుత నిర్ధారణ చేయాలి. డీబీఎస్ సర్జరీలో ఏంజరుగుతుందంటే... డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కోసం మెడిట్రానిక్స్, బోల్టన్ సైంటిఫిక్, సెయింట్ జ్యూడ్ మొదలైన కంపెనీల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే ఈ శస్త్రచికిత్సలో భాగంగా... ఎలక్ట్రోడ్లను కలిగిన లీడ్లను మెదడులో అమర్చుతారు. వాటికి విద్యుత్తును అందించే పల్స్ జనరేటర్‌ను ఛాతీలో అమర్చుతారు. ఈ రెండూ వైర్‌తో అనుసంధానమై ఉంటాయి. బ్యాటరీతో నడిచే ఈ పల్స్ జనరేటరు నిరంతరం పనిచేస్తూ, విద్యుత్ ప్రసారాన్ని వెలువరిస్తూ ఉండటం వల్ల మెదడుకు నిరంతరాయంగా కరెంట్ సరఫరా జరుగుతూ ఉంటుంది. దాంతో లక్షణాలు అదుపులోకి వస్తాయి. బ్యాటరీతో పనిచేసే ఈ పల్స్ జనరేటర్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. వీటిలో రీచార్జ్, సింగిల్ యూజ్ అనే రెండు రకాల బ్యాటరీలు ఉంటాయి. సింగిల్ యూజ్ బ్యాటరీలు ఏకంగా మూడు నుంచి ఐదేళ్ల వరకు పనిచేస్తాయి. కాలం చెల్లిన తర్వాత చిన్న సర్జరీతో బ్యాటరీని మార్చుకోవాల్సి ఉంటుంది. అదే రీచార్జ్ బ్యాటరీ అయితే 15 నుంచి 20 ఏళ్ల వరకు పనిచేస్తాయి. వీటిని ఫోన్ ఛార్జ్ చేసుకున్నట్లుగా, ఓ వైర్లెస్ ఛార్జర్‌ను ఛాతీకి కట్టుకుని బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అంటే..? డోపమైన్‌ను బయటి నుంచి అందించకుండానే... ఆ న్యూరోట్రాన్స్మిటర్ శరీరంలో ఉందనే భావనను మెదడుకు కలిగించేలా చేసే సర్జరీ ఇది. ఇందుకోసం... మెదడులో శరీర కదలికలను నియంత్రించే ‘న్యూక్లియస్’లలోకి ఓ లీడ్‌ను అమర్చుతారు. దాన్ని బ్యాటరీకి అనుసంధానిస్తారు. శస్త్రచికిత్స ద్వారా ఆ బ్యాటరీని ఛాతీలో ఉంచుతారు. ఆ బ్యాటరీ నుంచి వెలువడే ‘ఎలక్ట్రిక్ ఇంపల్స్’ మెదడును ప్రేరేపిస్తాయి. దాంతో న్యూక్లియస్లన్నీ గాడిలో పడి, డోపమైన్ ఉన్నట్లుగా మెదడుకు భ్రమ కలిగిస్తాయి. ఫలితంగా పార్కిన్సన్ వ్యాధి అదుపులోకి వస్తుంది. అంతేకాదు... మందుల తాలూకు దుష్ప్రభావాలలో కనిపించే ‘ఆన్ అండ్ ఆఫ్ ఫినామినా’ కండిషన్ తొలగిపోతుంది. బ్యాటరీ నుంచి విద్యుత్తు నిరంతరాయంగా మెదడుకు ప్రసరిస్తూ ఉండటం వల్ల లక్షణాలు పెరగడం / తగ్గడం లాంటివి కూడా ఉండవు. అలాగే సర్జరీ తర్వాత మందుల మోతాదు కూడా తగ్గిస్తారు. దాంతో అదనపు కదలికలూ తగ్గుతాయి. డీబీఎస్ సర్జరీ ఫలితం ఇలా...ఈ శస్త్రచికిత్సతో పార్కిన్సన్ వ్యాధిని మరింత పెరగకుండా అక్కడికి అదుపుచేయవచ్చు. అయితే గతంలో జరిగి΄ోయిన నష్టాన్ని మాత్రం భర్తీ చేయడం సాధ్యం కాదు. బాధితులు ఒకింత నాణ్యమైన జీవితం గడపడం కోసమే ‘డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్’ చికిత్స ఉపయోగపడుతుంది తప్ప... ఇది పూర్తిగా వ్యాధిని నయం చేయలేదని గ్రహించాలి. సర్జరీ సమయానికి రోగి శారీరక స్థితి ఎలా ఉందో, అదే పరిస్థితి కొనసాగడం లేదా అంతకంటే దిగజారకుండా ఉండటానికి మాత్రమే డీబీఎస్ ఉపయోగపడుతుంది.స్టెమ్‌సెల్ థెరపీ: పార్కిన్సన్ డిసీజ్‌కు శాశ్వత చికిత్స అందించే ప్రయత్నాల్లో ఈ చికిత్స ప్రక్రియను మొదటిదిగా పేర్కొనవచ్చు. మన శరీరంలోని వేర్వేరు అవయవాల్లో ఉండే కణాలు వేర్వేరుగా ఉంటాయి. ఉదా: మెదడు కణాలను న్యూరాన్లుగా, రక్తకణాల్లో ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్‌లెట్స్‌గా, కాలేయకణాలు హెపటోసైట్స్, కండరకణాలు మయోసైట్స్గా, ఎముకకణాలు ఆస్టియోసైట్స్గా ఉంటాయి. అయితే ఈ కణాలన్నీ ఉత్పత్తి అయ్యే మూల (ప్రిమిటివ్) కణాన్ని ఇంగ్లిష్‌లో ‘స్టెమ్‌సెల్’ అంటారు. ప్రస్తుతం బొడ్డుతాడునుంచి సేకరించిన కణాలను కొన్ని ప్రక్రియలు, దశల తర్వాత స్టెమ్సెల్గా మార్చి అమర్చితే... అది అమర్చిన ప్రదేశాన్ని బట్టి... అది సదరు అవయవానికి సంబంధించిన కణంగా మారి΄ోతుంది. ఈ తరహా చికిత్సనే స్టెమ్‌సెల్ థెరపీ అంటారు. ఈ చికిత్సలో భాగంగా స్టెమ్‌సెల్స్‌ను మెదడులో సబ్‌స్ట్రాన్షియా నైగ్రా (ఎస్.ఎన్.) ఉన్న ప్రాంతంలో ప్రవేశపెడతారు. అక్కడ అవి కొత్త ఎస్.ఎన్. కణాలుగా తయారవుతాయి. దాంతో ఆ కొత్త కణాలనుంచి మళ్లీ శరీరానికి కావాల్సిన డోపమైన ఉత్పత్తి అవుతుంటుంది. కాబట్టి ఈ జబ్బు లక్షణాలన్నీ పూర్తిగా తగ్గి΄ోయేందుకు అవకాశముంది. స్టెమ్‌సెల్స్ ఉత్పత్తి ఇలా : మన శరీరంలో ఏదో ఒక శాంపుల్ నుంచి కణాలను సేకరిస్తారు. (ప్రధానంగా రక్తం లేదా బొడ్డు తాడులో ఉన్న రక్తంలో స్టెమ్‌సెల్స్ ఎక్కువగా ఉంటాయి). ఈ శాంపుల్‌ను ఒక యంత్రంలో ఉంచి మరిన్ని కణాలు ఉత్పత్తి అయి వాటి సంఖ్య పెరిగేలా ఇంక్యుబేట్ చేస్తారు. ఇలా ఒక మూలకణం... కణవిభజన ప్రక్రియ ద్వారా మరెన్నో కణాలుగా విభజన అయి చాలా కణాలు తయారవుతాయి. వాటినే మనం మూలకణాలుగా అవసరమైన చోట ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ప్రక్రియ గురించి విస్తృతంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుత పురోగతిని బట్టి ఈ ప్రక్రియ ద్వారా రానున్న కొన్నేళ్లలో ఇవి కచ్చితంగా మంచి ఫలితాలే వస్తాయని తప్పక చెప్పవచ్చు. ఫీటల్ సెల్ట్రాన్స్ప్లాంటేషన్ : ఈ ప్రక్రియలోనూ అనుసరించే విధానం ఇంచుమించు పైన పేర్కొన్నట్లుగానే ఉంటుంది. బిడ్డ పుట్టగానే ఆ చిన్నారి బొడ్డుతాడును, దాంతోపాటు కొద్దిగా రక్తాన్ని (ఫీటల్ బ్లడ్)ను సేకరించి, ప్రత్యేకమైన ల్యాబ్‌లో ప్రాసెస్ చేసి, మూలకణాలను తయారు చేస్తారు. వాటిని అవసరమైనప్పుడు కావాల్సిన చోట వాడుకుంటారు. అప్పుడు ఆ ప్రదేశంలో కొన్ని మూలకణాలను అమర్చగానే అది పూర్తి అవయవంగా రూపుదిద్దుకోవాలన్నదే ఈ ప్రక్రియ లక్ష్యం. జీన్ థెరపీ : ఈ ప్రక్రియపై గత 15–20 ఏళ్లుగా ఎన్నో ప్రయత్నాలు, ప్రయోగాలు జరుగుతున్నాయి. పార్కిన్సన్స్ డిసీజ్ అనే ఈ జబ్బు... పార్క్’ అనే ఒక జన్యువు లోపం కారణంగా వస్తుంది. కాబట్టి ఈ జన్యువులో వచ్చే లోపాలను నివారిస్తే అసలు జబ్బు రాకుండానే నివారించే అవకాశం ఉంది. ఇలా అరికట్టడం అనే ప్రక్రియ రాబోయే దశాబ్దకాలంలో అందరికీ అందుబాటులోకి రావచ్చని ప్రస్తుతం ఉన్న పురోగతిని బట్టి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రాసావిన్ చికిత్స : ప్రాసావిన్ అనే పదార్థాన్ని మెదడుభాగంలోకి ఇంజెక్ట్ చేయడం వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయని తేలింది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోని ఆక్స్ఫర్డ్ బయోమెడికా సంస్థలో ఈ చికిత్స ప్రక్రియపై పరిశోధనలు జరుగుతున్నాయి. బ్రైట్‌లైట్ : ఒక ఫ్రీక్వెన్సీలో ఉండే కాంతి తరంగాలను ప్రసరింపజేయడం వల్ల మెదడులో ఉండే మెలటోనిన్‌ను తగ్గించి డోపమైన్ ఉత్పత్తిని ఎక్కువ చేయవచ్చనే అంశం ఆధారంగా జరిగే చికిత్స ఇది. ట్రాన్స్ క్రేనియల్ ఆల్టర్నేట్ కరెంట్ స్టిమ్యులేషన్స్: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కరెంట్ ఇచ్చి, నైగ్రల్ సెల్స్‌ను ఉత్తేజపరచి, డోపమైన్ ఉత్పత్తి జరిగేలా తమ ప్రయోగాలను కొనసాగిస్తున్నారు. పైన పేర్కొన్న చికిత్స ప్రక్రియలతో పాటు న్యూరల్ గ్రోత్ ఫ్యాక్టర్, జీడీఎన్‌ఎఫ్ (గ్లయల్ డిరైవ్డ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్) వంటి కొన్ని అంశాలను రక్తంలోకి ప్రవేశింపజేయడం వల్ల అవి మళ్లీ మెదడులోకి ప్రవేశించి అక్కడ నైగ్రల్ సెల్స్‌ను అభివృధ్ధి చేసేలా చూస్తే ప్రక్రియలపైన చాలా విస్తృతమైన అధ్యయనం జరుగుతోంది. మునుపటితో పోలిస్తే ప్రస్తుతం పార్కిన్సన్స్ డిసీజ్‌ను తగ్గించేందుకు కొంతమేర మంచి చికిత్స ప్రక్రియలే అందుబాటులో ఉన్నాయని, కొన్నాళ్లలో ఇంకా మెరుగైన చికిత్సలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని నమ్మకంగా చెప్పవచ్చు. డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ అండ్ న్యూరో సర్జన్(చదవండి: హీరో సల్మాన్‌ఖాన్ సైతం విలవిలలాడిన సమస్య..! ఏంటి ట్రెజెమినల్ న్యూరాల్జియా..)

కుబేర : ఆర్కిటెక్చర్ టు అసిసెంట్ ఆర్ట్ డైరెక్టర్
ఇంద్రాణి పూర్తి పేరు అక్కరాజు వెంకట నాగ ఇంద్రాణి. పుట్టింది గుంటూరు సిటీ మధ్యతరగతి కుటుంబం. నాన్న శ్రీనివాస్ అమ్మా పద్మావతి. తండ్రి హిందీ టీచర్‌గా పనిచేస్తుండేవారు. కన్హా కాన్సెప్ట్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. అక్కడే ఇంటర్ కూడా పూర్తి చేశారు. తల్లికి కర్ణాటక సంగీతం, కూచిపూడి పట్ల ఆసక్తి ఉన్నా.. కలగా మిగిలిపోయింది. ఆ కలను కూతురుగా తను నేర్చుకుని పాఠశాల స్థాయి నుండి జిల్లాస్థాయి వరకూ ప్రదర్శనలిచ్చారు. అన్న ప్రసాద్‌తోపాటు బొమ్మలు గీయటం అలవర్చుకుంది. చిన్ననాటి అభిరుచి సినిమాలవైపు నడిపించింది.. ఆర్కిటెక్చర్ స్టూడెంట్ నుంచి ఆర్ట్ ఆసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎదిగి వెండి తెరపై తన పేరును లిఖించుకుంటోంది.. ఓ వైపు తోట తరణి.. మరోవైపు శేఖర్ కమ్ముల దిశానిర్దేశంలో తన భవితకు బాటలు వేసుకున్నారు ఇంద్రాణి. ప్రస్తుతం ఫిలింనగర్లో ఉంటూ అనేక ప్రాజెక్టుల్లో భాగస్వామ్యమవుతున్నారు. – బంజారాహిల్స్ నగరానికి ప్రయాణం.. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోసం జెఎన్ఎఫ్యులో చేరడం.. సినిమా సెట్స్ డిజైనింగ్ పట్ల ప్రత్యేక శ్రద్ధతో వాటిని స్టడీ చేయడం.. నెమ్మదిగా స్క్రిప్ట్ రైటింగ్ పట్ల వీకెండ్ కోర్స్ చేయడం.. చకచకా జరిగిపోయాయి. మొదల్లో సినిమాల్లోకి కుటుంబ సభ్యులు నిరాకరించినా తర్వాత ఒప్పించారు. ‘కుబేర’లో లాస్ట్ ఆర్ట్ అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యారు. బిల్స్, రిఫరెన్సులు, ఫొటోషాప్ డిజైనింగ్‌లు చేశారు. చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ అరవింద్ ఏవి, ఈ.పి నాగేశ్వరరావు వల్ల తోట తరణి, శేఖర్ కమ్ముల మరల చేర్చుకున్నారు. అనేక సవాళ్లను అధిగమిస్తూ హైదరాబాద్, ముంబయి వంటి నగరాల్లో లైవ్ లొకేషన్స్‌లో పని నేర్చుకుంటూ పోయారు. సినిమాల పట్ల ఆసక్తి.. ఇంట్లో మామయ్య నాటకాలకు దర్శకత్వం వహించడం, మరోవైపు నటిస్తుండడంతో ఎప్పుడూ సందడిగా వుండేది. తండ్రి సాయంతో హిందీ నేర్చుకుంటూ బాలీవుడ్ కథల పట్ల, సంగీతం పట్ల మక్కువ పెరిగింది. షూటింగ్ సమయాల్లో కెమెరా వెనుక జరిగే విషయాల పట్ల ఆసక్తి పెరిగేలా చేశాయి. అనంతరం మసూద సినిమాకు ఆర్ట్ డిపార్ట్మెంట్లో చేరడం.. ఆర్ట్ డైరెక్టర్ ప్రియం క్రాంతి ప్రోత్సాహంతో డైరెక్షన్ పట్ల ఇష్టంతో కన్యాశుల్కం వెబ్ సిరీస్‌లో, హరిహర వీర మల్లు సినిమాలో డైరెక్షన్ టీంలో ఆర్ట్ పనులను సమన్వయం చేసే బాధ్యతను నిర్వహించింది. డైరెక్టర్ క్రిష్ కుటుంబ సభ్యులు సుహాసిని, రాజు మద్దతుతో, ఆర్ట్ అసిస్టెంట్ అక్బర్ సహకారంతో మెంబర్‌గా అయ్యారు. ఈ క్రమంలో స్నేహితురాలు భార్గవి, ప్రమీల, కష్ణ శశాంక్ అండగా నిలిచారు. (300కు పైగా రైతులకు సాధికారత : తొలి ఏడాదిలోనే రూ. 8.7 కోట్లు)లెజండరీ మనుషులతో.. చిన్నప్పుడు విడుదలైన అంజలి నుంచి పొన్నియన్ సెల్వన్ వరకూ పద్మశ్రీ తోట తరణి వర్క్ ఎంతగానో ఇష్టపడడం, ఆయన నీడలో నిలబడటం ఎప్పుడూ ఆశ్చర్యపరిచే విషయమే. ఆయన స్కెచ్ వేస్తుంటే ప్రతిసారీ విస్మయానికి గురవ్వడం.. ఆర్డినరీ వస్తువులతో అద్భుతాలు సృష్టిస్తుండడం నేర్చుకున్నా.. ఆనంద్, గోదావరి సినిమాలు చూస్తూ పెరిగా. కట్‌చేస్తే శేఖర్ కమ్ముల సెట్లో ప్రతిరోజు పేరు పెట్టి పలకరించడం ఆనందం అనిపించింది. కుబేర గొప్ప అవకాశం కల్పించింది. – ఇంద్రాణి, అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్

షాకింగ్.. హైదరాబాద్‌లో రోజుకి 8 వేల టన్నుల వ్యర్థాలు!
హైదరాబాద్ ఒక అందమైన నగరం.. ఆధునిక జీవనశైలి, అంతర్జాతీయ కంపెనీలు, గ్లోబల్ సంస్థలు, సినిమాలు మొదలు క్రీడల వరకూ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించింది భాగ్యనగరం.. వెరసి టాప్ వరల్డ్ సీటీస్లో స్థానం సంపాదించుకుంది. ఐతే ఇదంతా నగరానికి ఒక వైపు మాత్రమే.. మరోవైపు నగరం ప్రస్తుతం ప్లాస్టిక్ భూతం గుప్పిట్లో చిక్కుకుపోతోంది. ఆధునిక జీవనశైలిపై వ్యామోహంతో పాటు సౌలభ్యం కోసం ప్లాస్టిక్‌పై అతిగా ఆధారపడే మోడ్రన్ కల్చర్ నగరాన్ని ప్లాస్టిక్ వ్యర్థాల సుడిగుండంలోకి తోసేస్తుంది. ఇది కేవలం నగర పరిశుభ్రత సమస్య మాత్రమే కాదు.. నగరవాసుల ఆరోగ్యం, జీవవైవిధ్యం, జల వనరుల భద్రత పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని ఇటీవలి పలు పరిశోధనల అత్యవసర హెచ్చరిక. ప్లాస్టిక్ నియంత్రించకపోతే మనం మన నగరంలోనే శ్వాస తీసుకోడానికి ప్రాణం ఫణంగా పెట్టాల్సిన పరిస్థితి. ఇది కేవలం భవిష్యత్తు హెచ్చరిక కాదు.. ఇప్పటికే మొదలైన సంక్షోభం. – సాక్షి, సిటీబ్యూరోనగరంలో ప్రతి రోజూ 8,000 టన్నుల వ్యర్థాలు ప్రతిరోజూ హైదరాబాద్ నగరం సుమారు 8,000 టన్నుల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తోందని అంచనా. ఈ వ్యర్థాల్లో 14 శాతం పైగా ప్లాస్టిక్ ఉండటం శోచనీయం. అంటే రోజుకు సుమారు 1,120 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు. ఈ ఏడాది ముగింపునాటికి ఇది 9,000 టన్నులకు చేరనుందని అంచనా. ఇదే పరిస్థితి కొనసాగితే రెసిడెన్షియల్ ప్రాంతాల్లో మాత్రమే రోజుకు 495 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు వచ్చే ప్రమాదం ఉందని ఐసీఎల్ఈఐ– దక్షణాసియా సూచించింది. ప్రతి ఇంట్లోనూ ప్లాస్టిక్ అంతర్భాగమవుతుండగా, దాని ప్రభావాలు బయటి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. జీవరాశులకు పెనుముప్పు.. హుసేన్ సాగర్, దుర్గం చెరువు వంటి నగర సరస్సులు ఇప్పుడు సింగిల్–యూజ్ ప్లాస్టిక్‌తో నిండిపోయాయి. ఇందులో సుమారు 70 శాతం వ్యర్థాలు ప్లాస్టిక్ ఉండటం విషాదకర పరిణామం. దీంతో సరస్సుల ఇన్లెట్లు, అవుట్లెట్లు పూర్తిగా ప్లాస్టిక్‌తో నిండిపోతున్నాయి. నీటి ప్రవాహం ఆగిపోవడం, ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం, చేపల మరణం, గాలి, నీరు రసాయనాలతో కలుషితమవ్వడం వంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చేపలు, తాబేళ్లు, సరీసృపాలు, క్షీరదాలతో పాటు ఇతర చిన్న కీటకాల వినాశనానికి దారితీస్తోంది. జీవవైవిధ్యంపై పెను ప్రభావం.. వానాకాలం వచి్చందంటే సరస్సుల దగ్గర ఎగ్రెట్లు, హెరాన్లు, కార్మోరెంట్లు వంటి పక్షులు కనిపించేవి. కానీ ఇప్పుడు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు, కవర్లు ఆ జీవుల మనుగడకు పెను ప్రమాదంగా మారాయి. ఆహారంతో పాటు జీర్ణాశయంలోకి చేరి అరగించలేక మృత్యువాత పడుతున్నాయి. కొన్ని పక్షులు గూళ్లు నిర్మించేందుకు ప్లాస్టిక్ వినియోగించడంతో ఆ గూటిలోని పిల్ల పక్షులు ఈ వ్యర్థాలను తిని ప్రాణాలు కోల్పోతున్నాయి. మరోవైపు నగరంలోని కేబీఆర్ పార్కు, నెక్లెస్ రోడ్, మాదాపూర్ వాకింగ్ ట్రాక్‌ల వద్ద ప్లాస్టిక్ మింగిన పెంపుడు కుక్కలు, పిల్లుల గ్యాస్ట్రో బ్లాకేజ్, ఊపిరితిత్తుల ఇబ్బందులతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాయని వెటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొంతమంది నివాసితులు స్వయంగా క్లీనప్ డ్రైవ్స్ నిర్వహించాల్సి వస్తోంది.మానవ దేహాల్లో నానో ప్లాస్టిక్.. నగరవాసులకు పెట్ బాటిళ్లు, ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ‘సేఫ్’ అనిపించవచ్చు. కానీ, వాటి నుంచి వెలువడే పాలీకార్బొనేట్స్, బిస్ఫినాల్ ఏ, యాంటిమోనీ వంటి రసాయనాలు మన హార్మోన్లను దెబ్బతీస్తాయి. పిల్లల ఎదుగుదలకు అడ్డుపడతాయని ఐఐటీఆర్, సీడీఎస్సీఓ, ఎన్‌టీహెచ్ వంటి పరిశోధనలు ఇప్పటికే వెల్లడించాయి. అంతేకాకుండా నగరవాసుల శవ పరీక్షల్లో నానోప్లాస్టిక్.. మెదడు, కాలేయం, మూత్రపిండాల్లో కనిపించడం మరింత ఆందోళనకు గురిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా నానోప్లాస్టిక్ పరిమాణం మెదడులో సగటున 171 నానోమీటర్ల వరకూ ఉండడం పరిశోధకులను సైతం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. పాలిథిలిన్, పాలీప్రొపైలిన్ వంటివి మానవ కణజాలాలను దాటి మన శరీర వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఏం చేయాలి? హైదరాబాద్ నగర వాసులు ప్లాస్టిక్‌ను తిరస్కరించడం ఒక ప్యాషన్‌గా, బాధ్యతగా మార్చుకోవాలి. మట్టితో, కర్రతో, దారంతో చేసిన సహజ ఉత్పత్తులను ప్రోత్సహించాలి. జీహెచ్ఎంసీ విధించే సింగిల్–యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలి. ప్లాస్టిక్ బహిష్కరణ కార్యక్రమాలను పాఠశాలలు, కళాశాలల స్థాయిలో పెంపొందించాలి. ప్రతి ప్రాంతంలో స్థానికులు వారం వారం లేక్ క్లీనప్ డ్రైవ్స్ చేపట్టాలి. దైనందిన జీవితంలో ప్యాకేజింగ్ ఉత్పత్తులను నివారించాలి. ప్లాస్టిక్ సంచులను, బాటిళ్ల వినియోగాన్ని తగ్గించాలి. ఇదీ చదవండి : జిమ్‌కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది
ఫొటోలు
అంతర్జాతీయం

‘బ్రిక్స్’లో చేరిన ఇండోనేషియా.. ఎన్నిదేశాల భాగస్వామ్యం?
రియో డీ జనీరో: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా అనే ఐదు జాతీయ ఆర్థిక వ్యవస్థల భాగస్వామ్య కూటమి(బ్రిక్స్) ఇప్పుడు మరోదేశాన్ని తన భాగస్వామ్యంలో చేర్చుకుంది. తాజాగా ఇండోనేషియాను కొత్త సభ్యునిగా ‘బ్రిక్స్’ స్వాగతించింది. ఈ నేపధ్యంలో కాలానుగుణంగా బ్రిక్స్ ఎలా విస్తరించిందో ఇప్పుడు తెలుసుకుందాం.2010లో న్యూయార్క్‌లో జరిగిన ‘బ్రిక్స్’ విదేశాంగ మంత్రుల సమావేశంలో దక్షిణాఫ్రికాను తమ కూటమిలో చేర్చుకునేందుకు అంగీకరించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 2011లో సన్యాలో జరిగిన మూడవ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి దక్షిణాఫ్రికా హాజరైంది. తాజాగా జరిగిన బ్రిక్స్ దేశాధి నేతల సమావేశంలో ఇండోనేషియాను గ్రూప్‌లో సభ్యునిగా స్వాగతించడంతో, ఇప్పుడు బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, నైజీరియా, మలేషియా, థాయిలాండ్, క్యూబా, వియత్నాం, ఉగాండా, ఉజ్బెకిస్తాన్ సహా 10 దేశాలు బ్రిక్స్‌లో భాగస్వామ్య దేశాలుగా అవతరించాయి.బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగిన 17వ బ్రిక్స్ సమ్మిట్ ఉమ్మడి ప్రకటనలో ‘బ్రిక్స్ సభ్యదేశంగా ఇండోనేషియా రిపబ్లిక్‌ను, బెలారస్ రిపబ్లిక్, బొలీవియా ప్లూరినేషనల్ స్టేట్, కజకిస్తాన్ రిపబ్లిక్, క్యూబా రిపబ్లిక్, ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ నైజీరియా, మలేషియా, థాయిలాండ్ , సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం, ఉగాండా రిపబ్లిక్, ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్లను బ్రిక్స్ భాగస్వామ్య దేశాలుగా స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఆదివారం జరిగిన బ్రిక్స్ సమావేశంలో బ్రిక్స్ విస్తరణలో భాగంగా కొత్త భాగస్వాములను చేర్చుకోవడం అనేది కూటమి దేశాల సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. BRICS welcomes Indonesia as member, and 10 partner countries, including Belarus, MalaysiaRead @ANI Story | https://t.co/amBamKwFtb#BRICS #Indonesia #Belarus #BRICS2025 #Thailand pic.twitter.com/H9vPhodQlH— ANI Digital (@ani_digital) July 7, 20252006లో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన జీ8 సమ్మిట్‌లో రష్యా, భారత్, చైనా నేతల సమావేశం అనంతరం సమూహంగా బ్రిక్స్ ఏర్పాటయ్యింది. 2006లో న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో బ్రిక్స్‌కు అధికారిక గుర్తింపు వచ్చింది. మొదటి బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం 2009లో రష్యాలో జరిగింది. 2010లో న్యూయార్క్‌లో జరిగిన బ్రిక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో దక్షిణాఫ్రికాను చేర్చడంతో అది బ్రిక్స్‌గా మారింది.ఇది కూడా చదవండి: ‘నిధుల్లేవ్.. నేనేమి మంత్రినీ కాను’.. వరద సాయంపై ఎంపీ కంగనా

బ్రిక్స్‌కు మద్దతిచ్చే దేశాలపై 10% అదనపు సుంకాలు: ట్రంప్
వాషింగ్టన్/బీజింగ్: బ్రిక్స్ కూటమివి అమెరికా వ్యతిరేక విధానాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఆ కూటమికి మద్దతిచ్చే ఏ దేశమైనా తమనుంచి 10 శాతం అదనపు సుంకాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని సోమవారం హెచ్చరించారు. ‘‘బ్రిక్స్ అమెరికా వ్యతిరేక విధానాలతో జతకట్టే ఏ దేశం మీదైనా అదనంగా 10% సుంకం విధిస్తాం. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులూ ఉండవు’’ అని ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. కొత్త టారిఫ్ నియమాలు, సవరించిన వాణిజ్య ఒప్పంద నిబంధనలను వివరిస్తూ ఆయా దేశాలకు తక్షణం అధికారిక లేఖలు పంపుతున్నట్టు ప్రత్యేక పోస్టులో తెలిపారు. ట్రంప్ ప్రకటనను చైనా తీవ్రంగా ఖండించింది. ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఇలా సుంకాలను ఆయుధంగా వాడటం దారుణమని మండిపడింది. ఇది ఎవరికీ లాభం చేయబోదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ అన్నారు. ‘‘అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారానికి బ్రిక్స్ ఒక వేదిక. అది ఏ దేశానికీ వ్యతిరేకంగానో, లక్ష్యంగానో లేదు’’ అని స్పష్టం చేశారు.ఖండించిన రియో డిక్లరేషన్బ్రెజిల్లోని రియోడి జనీరోలో జరిగిన బ్రిక్స్ తాజా శిఖరాగ్ర సమావేశం అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారింది. ట్రంప్ సుంకాల విధానాలను బ్రిక్స్ దేశాధినేతలు తీవ్రంగా విమర్శించారు. ‘రియో డి జనీరో డిక్లరేషన్’లో ఈ మేరకు స్పష్టంగా పేర్కొన్నారు. ‘‘సుంకాలను విచక్షణారహితంగా పెంచడం ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీసి మరింత తగ్గించే ప్రమాదముంది. ప్రపంచ సరఫరా గొలుసులను దెబ్బతీస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాల్లో అనిశ్చితికి కారణమవుతుంది’’ అని పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నియమాల ఆధారిత, బహిరంగ, పారదర్శక, న్యాయమైన, సమానమైన బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థకు తమ మద్దతును పునరుద్ఘాటించారు. అనంతరం దీనిపై ట్రంప్ మరోసారి తీవ్రంగా ప్రతిస్పందించారు. అమెరికా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న దేశాలపై 10% అదనపు సుంకాలు తప్పవని పునరుద్ఘాటించారు. భారత్‌తో సహా అనేక దేశాల దిగుమతులపై అదనపు సుంకాలను ప్రకటించిన ట్రంప్ తర్వాత వాటి అమలును 90 రోజుల పాటు నిలిపేయడం తెలిసిందే. ఆ గడువు జూలై 9తో ముగుస్తుంది. తదనంతరం అమెరికా మార్కెట్లోకి ప్రవేశించే భారత వస్తువులపై అదనంగా 26 శాతం దిగుమతి సుంకం పడుతుంది. ప్రస్తుత సుంకాల బెదిరింపులతో ఆ భారాన్ని మరింత పెంచనుంది.

మస్క్‌ను చూస్తే జాలేస్తోంది.. అమెరికా అధ్యక్షుడి సంచలన ఆరోపణలు
అమెరికాలో రాజకీయంగా మరో సంచలనం రేగింది. ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ రాజకీయ పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా పార్టీ ఏర్పాటుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. మస్క్ పార్టీని అసంబద్ధమైనదిగా ఆయన అభివర్ణిస్తూ.. తీవ్ర ఆరోపణలే చేశారాయన. అమెరికాలో రిపబ్లికన్ పార్టీ ఘన విజయం సాధించింది. పరిపాలన సజావుగా సాగిపోతోంది. మరోవైపు డెమొక్రట్లు తమ ప్రాబల్యం కోల్పోతున్నారు. అయినప్పటికీ అమెరికా రాజకీయ వ్యవస్థ ఈ రెండు పార్టీలకు అనుకూలంగా ఉంది. ఈ తరుణంలో మూడో పార్టీ ఏర్పాటు అనేది అసంబద్దమైన చర్య. మూడో పార్టీ అమెరికా చరిత్రలో ఎప్పుడూ విజయవంతం కాలేదు అని ట్రంప్ అన్నారు. మూడో పార్టీని ఎవరు ఏర్పాటు చేసుకున్నా(మస్క్‌ను ఉద్దేశిస్తూ..) తమకేం ఫరక్ పడదని, అయితే ఆ పార్టీ వల్ల అమెరికా రాజకీయాల్లో గందరగోళం నెలకొంటుంది. దేశంలో అస్తవ్యస్తత నెలకొని కలహాలు చెలరేగే అవకాశమూ ఉంది అని ట్రంప్ హెచ్చరించారు. మస్క్ గతంలో తనకు మద్దతు ఇచ్చినా.. ఇప్పుడు పూర్తిగా మారిపోయారని ట్రంప్ అంటున్నారు. ‘‘మస్క్‌ను చూస్తే జాలేస్తోంది. గత ఐదువారాలుగా ఆయన అదుపు లేకుండా వ్యవహరిస్తున్నారు అని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఓ పోస్ట్ చేశారు. నేను ప్రవేశపెట్టిన బిల్లులో Electric Vehicle (EV) Mandate రద్దు చేయడం ముఖ్యాంశంగా ఉంది. దీని వల్ల ప్రజలు ఇకపై గ్యాస్, హైబ్రిడ్ లేదా కొత్త టెక్నాలజీ వాహనాలను స్వేచ్ఛగా కొనుగోలు చేయవచ్చు. అయితే మస్క్ గతంలో ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చి.. ఇప్పుడు వ్యతిరేకంగా వ్యవహరించడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అంతేకాదు.. మస్క్ తన సన్నిహితులను NASA చీఫ్‌గా నియమించాలనుకున్నారు. కానీ ఆ వ్యక్తి రిపబ్లికన్ పార్టీకి మద్దతు లేని డెమొక్రాట్ కావడం వల్లే అలా నియమించడం అనుచితమని భావించా. అమెరికా ప్రజలను రక్షించడమే నా ముందుకు ప్రధాన కర్తవ్యం’’ అంటూ ట్రంప్ పోస్టులో ప్రస్తావించారు.ఇదిలా ఉంటే.. బిగ్ బ్యూటీఫుల్ బిల్లును వ్యతిరేకిస్తూ ట్రంప్ పాలనా విభాగం డోజ్ నుంచి బయటకు వచ్చేసిన ఎలాన్ మస్క్ విమర్శలను తీవ్రతరం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో బిల్లు ఆమోదం గనుక పొందితే మూడో పార్టీ పెడతానంటూ చెబుతూ వచ్చారు. తాజాగా అదీ జరగడంతో శనివారం రాత్రి తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్(పూర్వపు ట్విటర్)లో ‘అమెరికా పార్టీ’ని ప్రకటించారు. అమెరికాలో రెండు ప్రధాన పార్టీలు.. ఒకే పార్టీ వ్యవస్థగా మారిందని, ప్రజలకు తిరిగి స్వేచ్ఛ ఇవ్వడమే తన లక్ష్యమని చెబుతూ అమెరికా పార్టీ పేరును ప్రకటించారు. అలాగే.. ప్రజలలో 65% మంది మూడవ పార్టీకి మద్దతు ఇస్తున్నారని ఓ పోల్‌ను చూపించారు. ఈ క్రమంలో ట్రంప్ ప్రవేశపెట్టిన భారీ ఖర్చుల బిల్లును(బిగ్ బ్యూటీఫుల్ బిల్)ను మరోసారి తీవ్రంగా విమర్శించారు.

భారత్-పాక్‌లను ఒకేలా తూచలేం: ‘బ్రిక్స్’లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి మద్దతు ఇస్తూ, దానిని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌పై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని ఖండించడంలో భారతదేశానికి మద్దతుగా నిలిచిన దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. పాక్ ఉగ్రవాద మద్దతుదారని, భారత్ ఉగ్రవాద బాధిత దేశమని.. ఈ రెండింటినీ ఒకే త్రాసులో తూకం వేయలేమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.ఉగ్రవాదులకు నిశ్శబ్దంగా అనుమతి ఇవ్వడం కూడా ఆమోదయోగ్యం కాదని ప్రధాని పేర్కొన్నారు. పాకిస్తాన్ తన గడ్డపై ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ద్వారా ఉగ్రవాదాన్ని ఎలా విస్తరిస్తున్నదో స్పష్టమైన ఆధారాలతో భారత్ పదేళ్లుగా చూపిస్తున్నదన్నారు. కాగా ‘రియో డి జనీరో డిక్లరేషన్’లో బ్రిక్స్ గ్రూపు నేతలు ఉగ్రవాద చర్యలను నేరపూరితమైనంటూ తీవ్రంగా ఖండించారు. జమ్ముకశ్మీర్‌లో 2025, ఏప్రిల్ 22న జరిగిన ఉగ్ర దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో తమ నిబద్ధతను మేము పునరుద్ఘాటిస్తున్నామని పేర్కొన్నారు.ఉగ్రవాదంపై జరుగుతున్న పోరాటానికి సహకారం మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నామని, అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేసి ఆమోదించాలని పిలుపునిస్తున్నామని బ్రిక్స్ నేతలు పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ఉగ్రవాద సంస్థలపై సమిష్టి చర్యలు తీసుకోవాలని అన్ని దేశాలకు పిలుపునిస్తున్నామని రియో డి జనీరో డిక్లరేషన్ పేర్కొంది. కాగా పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించి, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను, వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది.
జాతీయం

‘మాతృభాష తప్పనిసరి’.. ఆ రాష్ట్రాలకు ఆర్ఎస్ఎస్ మద్దతు?
న్యూఢిల్లీ: ప్రాథమిక పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ, పలు రాష్ట్రాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)2020 కింద కేంద్ర ప్రభుత్వం త్రిభాషా విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఈ తరహా భాషా వివాదం తలెత్తింది. అయితే ఈ త్రిభాషా విధానాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కూడా వ్యతిరేకిస్తోంది. బీజేపీ విధానాలకు మద్దతు పలికే ఆర్ఎస్ఎస్ ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలని వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.తాజాగా ఆర్ఎస్ఎస్ స్థానిక భాషలలో ప్రాథమిక విద్యను కొనసాగించాలన్న వాదనను సమర్థిస్తూ, ఈ అంశంలో తన వైఖరిని వెల్లడించింది. రాజధాని ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ మాట్లాడుతూ అన్ని భారతీయ భాషలు జాతీయ భాషలే అంటూ, ఇదే సంఘ్ వైఖరని పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు తమ ప్రాంతంలో సొంత భాషలోనే మాట్లాడుతుంటారు. అందుకే ప్రాథమిక విద్యను అదే భాషలో కొనసాగించాలని ఆయన అన్నారు. #WATCH | Delhi: On the recent language controversy, RSS Akhil Bharatiya Prachar Pramukh, Sunil Ambekar says, "Sangh has always had the stand that all languages of India are national languages. People speak their own languages in their own places. Primary education should be… pic.twitter.com/PUZhWyv19p— ANI (@ANI) July 7, 2025జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 కింద త్రిభాషా విధానం కింద విద్యార్థులు తమ పాఠశాల విద్యలో మూడు భాషలు నేర్చుకోవాలి. జాతీయ ఐక్యతను సమతుల్యం చేస్తూ బహుభాషావాదాన్ని పెంపొందించడమే దీని లక్ష్యం. అయితే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలు ఈ త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించాయి. ప్రాథమిక విద్యలో స్థానిక భాషలకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ అవి పట్టుబట్టాయి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఇదే ధోరణి ప్రదర్శించింది. అయితే ఈ తరహా భాషా సమస్యను పరిష్కరించడానికి కొంత సమయం పడుతుందని, రాత్రికి రాత్రే జరగదని సునీల్ అంబేకర్ పేర్కొన్నారు.

ఎన్నికల వేళ.. బీహార్‌కు కనీవినీ ఎరుగని వరాలు
పట్నా: ఈ ఏడాది చివరిలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే రాజకీయ సందడి మొదలయ్యింది. వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాల్లో తలమునకలై ఉన్నాయి. ఇదే సమయంలో కేంద్ర రైల్వే మంత్రి బీహార్‌లో కొత్తగా ప్రారంభమయ్యే రైళ్లు, రైలు ప్రాజెక్టులు, టెక్ పార్కుల గురించిన వివరాలను వెల్లడించారు.బీహార్‌లో పర్యటించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీని పెంచే లక్ష్యంతో చేపట్టబోయే కార్యక్రమాలను మీడియాకు తెలిపారు. బీహార్‌ను దేశంలోని పలు నగరాలతో అనుసంధానించే బహుళ రైలు సర్వీసుల ప్రణాళికలను ఆవిష్కరించారు.కొత్త రైళ్లుపట్నా నుండి ఢిల్లీ: పట్నా-ఢిల్లీ కారిడార్‌ను బలోపేతం చేస్తూ, కొత్తగా రోజూ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడపనున్నట్లు మంత్రి తెలిపారు.దర్భంగా నుండి లక్నో (గోమతి నగర్): వారంలో ఒక్కరోజు నడిచే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ప్రారంభం కానుంది.మాల్డా టౌన్ నుండి లక్నో (గోమతి నగర్): పశ్చిమ బెంగాల్- ఉత్తరప్రదేశ్‌లను బీహార్ ద్వారా కలుపుతూ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపనున్నారు.జోగ్బాని నుండి ఈరోడ్ (తమిళనాడు): బీహార్‌ను దక్షిణ భారతానికి అనుసంధానించే రోజువారీ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలపైకి ఎక్కనుంది.సహర్సా నుండి అమృత్సర్: పంజాబ్‌కు కనెక్టివిటీని పెంచేందుకు కొత్తగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టనున్నారు.మౌలిక సదుపాయాలుభాగల్పూర్-జమాల్పూర్ మూడవ లైన్: రూ. 1,156 కోట్ల అంచనా వ్యయంతో 53 కి.మీ. మేరకు కొత్త మూడవ రైల్వే లైన్ త్వరలో మంజూరు కానుంది.భక్తియార్పూర్-రాజ్‌గిర్-తిలైయా డబ్లింగ్: రూ. 2,017 కోట్ల అంచనా వ్యయంతో 104 కి.మీ. కంటే ఎక్కువ ట్రాక్‌ల డబ్లింగ్ ఏర్పాటు కానుంది.రాంపూర్హాట్-భాగల్పూర్ డబ్లింగ్: రూ. 3,000 కోట్ల అంచనా వ్యయంతో 177 కి.మీ. మేరకు మరో డబ్లింగ్ ప్రాజెక్ట్ మంజూరు కానుంది.సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులురైల్వే మౌలిక సదుపాయాలతో పాటు, బీహార్‌లో సాంకేతిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి వైష్ణవ్ తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా రెండు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

యూపీలో దారుణం.. అనురాధతో తాంత్రికుడి పైశాచిక ఆనందం!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. తనకు పిల్లలు పుట్టడం లేదని ఓ మహిళ.. స్థానికంగా ఉన్న తాంత్రికుడిని ఆశ్రయించింది. అదే అదునుగా సదరు తాంత్రికుడు.. ఆమెతో అనుచితంగా ప్రవర్తించడం, మంత్రాల నెపంతో దాడి చేయడం, టాయిలెట్ నీళ్లు తాగించడం వంటివి చేశాడు. దీంతో, ఆమె ఆరోగ్యం క్షీణించి బాధితురాలు మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ జిల్లాలోని కంధారపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పహల్వాన్పూర్ గ్రామానికి చెందిన అనురాధ(35)కు పదేళ్ల క్రితమే వివాహం జరిగింది. పదేళ్లు అయిన పిల్లలు పుట్టకపోవడంతో బాధితురాలు వైద్యులను ఆశ్రయించింది. అయినప్పటికీ పిల్లలు పుట్టలేదు. ఈ నేపథ్యంలో ఇరుపొరుగు వారు ఆమెకు ఓ సలహా ఇచ్చారు. స్థానికంగా ఉన్న తాంత్రికుడి చందు వద్దకు వెళ్లాలని సూచించారు. వారి మాటలు నమ్మిన అనురాధ.. అతడి వద్దకు వెళ్లింది.ఈ క్రమంలో రెచ్చిపోయిన తాంత్రికుడు చందు.. అనురాధతో అనుచితంగా ప్రవర్తించాడు. తాకరాని చోట తాకుతూ ఇబ్బందులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా.. అనురాధకు దుష్టాత్మ పట్టిందని నమ్మించాడు. కొన్ని పూజలు చేయాలని చెప్పి.. అతని సహాయకులు ఆమె జుట్టును లాగి, ఆమె మెడ, నోటిని బలవంతంగా నొక్కారు. మురుగు కాలువ, టాయిలెట్ నుండి మురికి నీటిని కూడా తాగించారు. అనంతరం, అనురాధ ఆరోగ్యం క్షీణించింది. దీంతో, సదరు తాంత్రికుడు, బాధితురాలు తల్లి కలిసి అనురాధను ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకున్న కాసేపటికే అనురాధ చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఆ తర్వాత మృతదేహాన్ని అక్కడే వదిలేసి తాంత్రికుడి బృందం ఆసుపత్రి నుండి పారిపోయింది. అనురాధ చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.ఈ సందర్బంగా బాధితురాలి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ఏదో పూజల పేరుతో అనురాధను చందు చిత్రహింసలకు గురి చేశారు. మురుగు నీటిని తాగించ వద్దని మేము వారించినప్పటికీ మా మాట వినలేదు. మా బిడ్డను అన్యాయం చంపేశారు. పూజలు చేయాలని అతడు మా వద్ద నుంచి 22వేలు తీసుకున్నాడు. ఇంకా డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో తాంత్రికుడు చందు పోలీస్ స్టేషన్లో లొంగిపోగా.. అతడి సహచరులు పరారీలో ఉన్నారు.

రేపటి భారత్ బంద్‌లో 25 కోట్ల కార్మికులు? ప్రజా సేవలకు తీవ్ర అంతరాయం?
న్యూఢిల్లీ: దేశంలోని బ్యాంకింగ్, భీమా, పోస్టల్ సేవలు మొదలుకొని, బొగ్గు గనుల వరకు వివిధ రంగాలకు చెందిన కార్మికులు బుధవారం(జూలై 9) జరిగే భారత్ బంద్‌లో పాల్గొంటారని ఆయా కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. జూలై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు 10 కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక పిలుపునిచ్చింది.కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, జాతి వ్యతిరేక ప్రభుత్వ విధానాలకు నిరసనగా చేస్తున్న ‘భారత్ బంద్'గా కార్మిక సంఘాలు దీనిని పేర్కొన్నాయి. ఈ సమ్మెను విజయవంతం చేయాలని దేశంలోని కార్మికులకు కార్మిక సంఘాలన్నీ పిలుపునిచ్చాయి. 25 కోట్లకు పైగా కార్మికులు సమ్మెలో పాల్గొంటారని భావిస్తున్నామని, దేశవ్యాప్తంగా రైతులు, గ్రామీణ కార్మికులు కూడా నిరసనలో పాల్గొంటారని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) నేత అమర్జీత్ కౌర్ మీడియాకు తెలిపారు.‘భారత్ బంద్’ కారణంగా బ్యాంకింగ్, పోస్టల్, బొగ్గు గనులు, కర్మాగారాలు, రాష్ట్ర రవాణా సేవలు ప్రభావితం కానున్నాయని హింద్ మజ్దూర్ సభకు చెందిన హర్భజన్ సింగ్ సిద్ధూ తెలిపారు. గత ఏడాది కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయకు వివిధ యూనియన్లు సమర్పించిన 17 డిమాండ్లను నెరవేర్చాలంటూ భారత్ బంద్ చేపడుతున్నారు. ప్రభుత్వం ఈ డిమాండ్లను విస్మరించిందని, గత దశాబ్ద కాలంగా వార్షిక కార్మిక సదస్సును నిర్వహించడంలో విఫలమైందని పలు యూనియన్లు ఆరోపిస్తున్నాయి.ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నాలుగు కార్మిక కోడ్లు వారి హక్కులను హరించడానికి రూపొందించారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ కోడ్లు యూనియన్ కార్యకలాపాలను బలహీనపరచడం, పని గంటలను పెంచడం , కార్మిక చట్టాల ప్రకారం యజమానులను జవాబుదారీతనం నుండి రక్షించడం లక్ష్యంగా పెట్టుకున్నాయని కార్మిక సంఘాలు వాదిస్తున్నాయి. కాగా కార్మిక సంఘాలు గతంలో 2020, నవంబర్ 26న, 2022,మార్చి 28, 29 తేదీలలో, గత ఏడాది ఫిబ్రవరి 16న ఇదేవిధమైన దేశవ్యాప్త సమ్మెలను నిర్వహించాయి.
ఎన్ఆర్ఐ

మోదీకి 'హలో' చెప్పేందుకు వచ్చా..! భారత సంతతి వ్యక్తి
పధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటనలో ఉన్న సంగతి తెలిసింది. అందులో భాగంగా ఈ రోజు (శనివారం) ఉదయం అర్జెంటినాకు చేరుకున్నారు. ఆయనకు బ్యూనస్ ఎయర్‌లోని భారత సంతతి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అక్కడ ఆయన అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీతో చర్చలు జరపనున్నారు. ఈ నేపథ్యంలో విజయగుప్తా అనే భారత సంతతి వ్యక్తి మోదీని కలిసినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. తాను ప్రధాని మోదీకి హలో చెప్పేందుకే 400 కి.మీ ప్రయాణించి మరి వచ్చానని అన్నారు. ఆయనకు జస్ట్ హలో చెప్పాలనుకున్నా..కానీ నాకు మోదీకే కరచలనం(షేక్‌హ్యాండ్) ఇచ్చే అవకాశం లభించిందంటూ ఉబ్బితబ్బిబవుతున్నాడు. ఇదిలా ఉండగా మోదీ ఒక ట్వీట్లో అర్జెంటీనా పర్యటన గురించి పంచుకున్నారు. "నేను ఈరోజు అర్జెంటీనాతో సంబంధాలను పెంపొందించుకోవడంపై దృష్టి సారించే ద్వైపాక్షిక పర్యటన కోసం బ్యూనస్ ఎయిర్స్లో అడుగుపెట్టాను. ప్రస్తుతం అర్జెంటినా అధ్యక్షుడు జేవియర్ మిలీని కలిసి చర్చలు జరిపేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాను" అని ట్వీట్ చేశారు.అలాగే విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కూడా ఈ 57 ఏళ్లలో భారత ప్రధాని అర్జెంటీనాలో చేసిన తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదే అని ట్వీట్ చేశారు. కాగా, మోదీ బ్యూనస్ ఎయిర్స్‌లోని హోటల్‌కు చేరుకోగానే 'భారత్ మాతా కీ జై', 'జై శ్రీ రామ్' అనే నినాదాలతో ఘన స్వాగతం పలికారు ప్రవాస భారతీయులు. ఆయన ఇప్పటికే ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగోలను సందర్శించారు. ఇక ఈ అర్జెంటీనా పర్యటన తదనంతరం బ్రెజిల్, నమీబియాలను సందర్శించనున్నారు.#WATCH | Buenos Aires, Argentina: Vijay Kumar Gupta, a member of the Indian diaspora, says, "I have come here from Rosario, which is 400 kilometres from here, just to say hello to Prime Minister Narendra Modi. I got the opportunity to shake hands with him..." https://t.co/7yZBOqwXFT pic.twitter.com/jS0uoHPGUn— ANI (@ANI) July 5, 2025 (చదవండి: ఎవరా 'బీహార్ కీ భేటీ'?.. మోదీ మనసులో కరేబియన్ ప్రధానికి ప్రత్యేక స్థానం)

ట్రంప్ మెగా బిల్లు: ఎన్నారైలకు బిగ్ అలర్ట్
ట్రంప్ కలల బిల్లు.. బిగ్ బ్యూటిఫుల్ బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. గురువారం సుదీర్ఘ చర్చ అనంతరం జరిగిన ఓటింగులో బిల్లు ఆమోదం పొందింది. అంతకుముందు ఈ బిల్లుకు సెనెట్‌లో ఆమోదం లభించింది. ట్రంప్ సంతకం తర్వాతనీ ఈ బిల్లు చట్టంగా మారనుంది. అటు అమెరికా రాజకీయాల్లో, ఇటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అంశంగా నిపుణులు ఈ బిల్లును భావిస్తున్నారు. అయితే ఇది ఎన్నారైలపై ఎంతంగా ప్రభావం చూపించనుందో ఓ లుక్కేద్దాం.. నగదు బదిలీలపై 1% రెమిటెన్స్ పన్ను2026 జనవరి 1 నుంచి, అమెరికా నుంచి భారత్‌కు పంపే నగదు ఆధారిత బదిలీలపై 1% పన్ను విధించనున్నారు.నగదు, మనీ ఆర్డర్, చెక్కుల రూపేణా పంపేవాటికి ఇది వర్తిస్తుంది. మొదట ఇది 5%గా ప్రతిపాదించబడింది. తర్వాత 3.5%కి తగ్గించి చివరకు 1 శాతంగా నిర్ణయించారు. ఇది చిన్న మొత్తంగా అనిపించినా.. తరచూ డబ్బు పంపే కుటుంబాలకు ఇది లక్షల్లో అదనపు భారం కానుంది.అయితే డిజిటల్ మార్గాలు ఉపయోగించే వారు పన్ను నుంచి తప్పించుకోవచ్చు. అయితే.. భారత్‌లో గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే వయసు పైబడినవాళ్లు ఇంకా నగదు మార్గాన్నే నమ్ముకుంటున్నారనేది గుర్తించాల్సిన విషయం. ఉదాహరణకు.. నెలకు $500 పంపే వ్యక్తి.. ఏడాదికి $6,000 పంపుతాడు. బిగ్ బ్యూటీఫుల్ బిల్లు అమల్లోకి వస్తే.. $60 అదనపు పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇది చిన్న మొత్తంగా అనిపించినా.. గణనీయమైన భారంగానే మారనుంది.భారత్‌కు వచ్చే రెమిటెన్స్‌లో తగ్గుదలబిగ్ బ్యూటిఫుల్ బిల్ (Big Beautiful Bill) ద్వారా అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 1% రెమిటెన్స్ పన్ను ప్రభావం కేవలం ప్రవాస భారతీయులకే కాదు, భారత ఆర్థిక వ్యవస్థ మొత్తానికే గణనీయంగా ఉండనుంది. రెమిటెన్స్ (Remittance) అంటే ఒక వ్యక్తి విదేశంలో పని చేసి, అక్కడి నుంచీ తన స్వదేశంలోని కుటుంబానికి లేదా ఖాతాకు డబ్బు పంపడం.2023–24లో భారత్‌కు వచ్చిన మొత్తం రెమిటెన్స్ 135.46 బిలియన్ డాలర్లు. అందులో 32 బిలియన్ డాలర్లు అమెరికా నుంచే వచ్చింది. అయితే1% పన్ను విధానం వల్ల 10–15% తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉంది. అంటే.. 12–18 బిలియన్ డాలర్ల వరకు నష్టం జరగవచ్చు. రెమిటెన్స్‌లు భారతదేశానికి విదేశీ కరెన్సీ ప్రవాహంలో ప్రధాన భాగం. కాబట్టి ఈ తగ్గుదల వల్ల విదేశీ మారక నిల్వలపై ప్రభావం పడుతుంది. డాలర్ నిల్వలు తగ్గి, రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ద్రవ్యోల్బణం (inflation) పెరగడానికి దారితీయవచ్చు. అదే సమయంలో..రెమిటెన్స్‌లు అనేక కుటుంబాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ముఖ్యంగా కేరళ, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో అనేక కుటుంబాలకు. అయితే.. డబ్బు తక్కువగా రావడం వల్ల విద్య, వైద్యం, పెళ్లిళ్లు, గృహ నిర్మాణం వంటి అవసరాలపై ప్రభావం పడుతుంది.ఇంకోవైపు.. బ్యాంకింగ్ వ్యవస్థపై ఇది ప్రభావం చూపించనుంది. రెమిటెన్స్ తగ్గితే బ్యాంకుల డిపాజిట్లు తగ్గుతాయి, ఇది వడ్డీ రేట్ల పెరుగుదలకు దారితీయవచ్చు.మరీ ముఖ్యంగా గ్రామీణ బ్యాంకింగ్ సేవలపై ప్రభావం ఉండే అవకాశం ఉంది. వలసలకు ఇక గడ్డు కాలమే?ఈ బిల్లుతో వలస నియంత్రణ మరింత కఠినతరం కాబోతోంది. వీసా ఫీజులు పెరిగాయి. H-1B, L-1 వీసాలతో పాటు ఆశ్రయం దరఖాస్తులకు(Asylum Applications) భారీ రుసుములు విధించబడ్డాయి. అక్రమంగా వచ్చినవారిపై ఓ రేంజ్లో జరిమానాలు విధించాలని నిర్ణయించారు. డిపోర్టేషన్ బలగాల విస్తరణ వంటి చర్యలు ప్రవేశపెట్టబడ్డాయి. అక్రమ వలసదారులను తనిఖీలు చేయడం.. అవసరమైతే అక్కడికక్కడే అరెస్టులు చేసే అవకాశాలు ఉంటాయి. ఇది అమెరికాలో ఉన్న ఎన్నారైలకు మాత్రమే కాదు.. అక్కడ చదువుతున్న విద్యార్థులకు, ఉద్యోగార్థుల్లో కూడా భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా.. అమెరికాలో శాశ్వత నివాసం అనే కలకు బిగ్ బ్యూటీఫుల్ బిల్ ఒక శరాఘాతంగా పరిణమించబోతోందనే చెప్పొచ్చు.పెట్టుబడి ప్రణాళికల్లో మలుపులు!కార్పొరేట్ సంస్థలు, పెద్ద స్థాయి పెట్టుబడిదారులకు ఈ బిల్లుతో పన్ను మినహాయింపులు ఉన్నా.. ఎన్నారైల వాస్తవ ప్రయోజనాలు మాత్రం పరిమితంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా పన్ను రీఫండ్లు U.S. పౌరులకు మాత్రమే వర్తించడంతో, ఎన్నారైల ఆసరా మరింత దెబ్బతినే అవకాశమే కనిపిస్తోంది.సాధారణంగా రియల్ ఎస్టేట్ అనేది ప్రవాస భారతీయులకు కేవలం పెట్టుబడి కాదు.. భారత్‌తో అనుబంధానికి ఆధారం కూడా. ఈ పన్ను వల్ల భారత్‌లో ఆస్తుల కొనుగోలు లేదా అమ్మకానికి సంబంధించిన పెద్ద మొత్తాల బదిలీలపై అదనపు ఖర్చు వస్తుంది. అలాంటి సందర్భంలో ఈ పన్ను వారి ఆర్థిక ప్రయోజనాలపై కాదు, భావోద్వేగాలపై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.ఈ క్రమంలో.. దీర్ఘకాలికంగా ఆస్తులు కొనాలని భావించిన వారు, ఇప్పుడు పన్ను అమలుకు ముందు ముందుగా డబ్బు పంపించి కొనుగోలు పూర్తిచేయాలని చూస్తున్నారు. ఇది ఒక రకంగా బిల్లు అమలుకు ముందు ఆస్తి రద్దీ(Rush) అనే పరిస్థితిని తెచ్చింది. దీంతో పన్ను అమలుకు ముందు తాత్కాలికంగా బదిలీల పెరుగుదల జరిగే అవకాశం నిపుణులు అంచనా వేస్తున్నారు. రియల్ ఎస్టేట్‌తో పాటు విద్య, ఆరోగ్య ఖర్చులపై కూడా ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. కంప్లయన్స్ భారముఎన్నారైలు బిగ్ బ్యూటీఫుల్ బిల్లును క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్నారైలు తమ ఆర్థిక ప్రణాళికలను మరింత జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరాన్ని తెచ్చి పెట్టింది. ఎటువంటి మార్గంలో డబ్బు పంపుతున్నారో జాగ్రత్తగా గమనించాలి. లేకపోతే అనవసర పన్నులు పడే అవకాశం ఉంది. కఠినమైన KYC నిబంధనలతో పాటు NRE/NRO ఖాతాలపై నియంత్రణ ఉంటుంది. తద్వారా పాస్‌పోర్ట్, వీసా, నివాస ధృవీకరణ వంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం పెరుగుతుంది. డబ్బు ఎలా అమెరికా దాటి పోతుంది అనే దానిపై మరింత పర్యవేక్షణ ఉంటుంది. పన్ను రీఫండ్లు కేవలం అమెరికా పౌరులకు మాత్రమే వర్తిస్తాయి — NRIs కు కాదు. అంటే, గ్రీన్ కార్డు హోల్డర్లు, H-1B వీసాదారులు, ఇతర ఎన్నారైలు ఈ ప్రయోజనాలను పొందలేరు.కాబట్టి ఈ బిల్లు ప్రవాస భారతీయులపై (NRIs) కేవలం పన్ను భారం మాత్రమే కాదు, నియంత్రణ (compliance) భారాన్ని కూడా పెంచుతోంది. ఇది పెద్ద మొత్తంలో డబ్బు పంపే వారికి మాత్రమే కాదు, చిన్న మొత్తాల్లో తరచూ పంపే వారికి కూడా అదనపు కాగితాలు, సమయం, ఖర్చు పెరుగుతాయి.ఎన్నారైలు డబ్బు పంపడాన్ని తగ్గిస్తే, భారత్‌లోని కుటుంబాల ఆదాయం తగ్గుతుంది. ఇది వారి వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలతో పాటు కుటుంబాలపై, చివరికి భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపేలా ఉంది. ఏంటీ బిగ్ బ్యూటీఫుల్ బిల్లు?అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఒక విస్తృత ఆర్థిక, పన్ను, వలస విధానాల చట్టం. పన్నుల్లో కోతలు, వ్యయ నియంత్రణే లక్ష్యంగా తెస్తున్నట్లు చెబుతున్నారాయన.పన్ను కోతలు2017లో అమలైన పన్ను కోతలను శాశ్వతం చేస్తుంది.కార్పొరేట్ కంపెనీలు, ఉన్నత ఆదాయ వర్గాలకు పన్ను మినహాయింపులు కల్పిస్తుంది.టిప్పులు, ఓవర్‌టైమ్‌పై పన్ను మినహాయింపుటిప్ ఆదాయం పై పన్ను రద్దు, ఓవర్‌టైమ్ ఆదాయంపై $12,500 వరకు మినహాయింపు.చైల్డ్ టాక్స్ క్రెడిట్ పెంపుపిల్లలపై టాక్స్ క్రెడిట్ $2,000 నుంచి $2,200కి పెంపు.కానీ తక్కువ ఆదాయ కుటుంబాలకు ఇది పూర్తిగా వర్తించదు.1% రెమిటెన్స్ పన్నుఅమెరికా నుంచి భారత్ వంటి దేశాలకు నగదు బదిలీలపై 1% పన్ను విధించబడుతుంది.బ్యాంక్, డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా(డిజిటల్ లావాదేవీలు) పంపిన డబ్బుకు మినహాయింపు ఉంది.వలస నియంత్రణ కఠినతరంICE అధికారుల నియామకం, డిపోర్టేషన్ కేంద్రాల విస్తరణ, వీసా ఫీజుల పెంపు వంటి చర్యలు ఉన్నాయి.మెడికేడ్, ఫుడ్ స్టాంపులపై కోతలుతక్కువ ఆదాయ గల అమెరికన్లకు ఆరోగ్య, ఆహార సహాయ కార్యక్రమాల్లో కోతలు విధించబడ్డాయి.పునరుత్పాదక శక్తికి ఎదురుదెబ్బసౌర, గాలి శక్తి పథకాలపై పన్ను రాయితీలు తగ్గించబడ్డాయి, ఇది గ్రీన్ ఎనర్జీ రంగానికి నష్టంగా మారుతుంది.లాభాలు ఎవరికీ?కార్పొరేట్ కంపెనీలు, ఉన్నత ఆదాయ వర్గాలు, టిప్/ఓవర్‌టైమ్ వేతనదారులు లాభపడతారు. కానీ తక్కువ ఆదాయ గల కుటుంబాలు, వలసదారులు, పునరుత్పాదక శక్తి రంగం నష్టపోతాయి.ప్రతిపక్షాల అభ్యంతరాలుడెమొక్రాట్లు, సామాజిక కార్యకర్తలు ఈ బిల్లును "సంపన్నులకు లాభం, సామాన్యులకు నష్టం" అని విమర్శిస్తున్నారు. హకీం జెఫ్రీస్ అనే నేత 8 గంటల పాటు బిల్లుకు వ్యతిరేకంగా ప్రసంగించారు.

ఎవరా 'బీహార్ కీ భేటీ'?.. మోదీ మనసులో కరేబియన్ ప్రధానికి ప్రత్యేక స్థానం
ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ట్రినిడాడ్ అండ్ టొబాగోకి చేరుకున్నారు. అక్కడ పోర్ట్ ఆప్ స్పెయిన్‌లోని పియార్కో అంతర్జాతీయ విమానశ్రయంలో ఆయనకు ఆ దేశ మిలటరీ సైనికులచే గౌరవ వందనం లభించింది. అంతేగాదు కరేబియన్ దేశ ప్రధాన మంత్రి కమలా పెర్సాద్-బిస్సేసర్(Kamla Persad-Bissessar)తో సహా 38 మంత్రులు, నలుగురు పార్లమెంట్ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ స్వాగత సమయంలో ట్రినిడాడ్ అండ్ టొబాగొ మంత్రి కమలా పెర్సాద్ భారతీయ దుస్తుల్లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. కానీ మన మోదీ ఆ దేశ ప్రధాని కమ్లా పెర్సాద్‌ను 'బిహారీకా బేటి' అని పిలవడం విశేషం. అంతేగాదు ఆ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ..భారత్‌కి ట్రినిడాడ్ అండ్ టొబాగోకి ఉన్న సంబంధబాంధవ్యాలతో సహా ఆ దేశ ప్రధాని భారత మూలాలకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మరి ఆ విశేషంలేంటో సవివరంగా చూద్దామా..!.ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. ఈ కరేబియన్ దేశ ప్రధాని కమలా పెర్సాద్- మా బిహార్ కా భేటి అని సగర్వంగా చెప్పారు. ఆ ప్రధాని పూర్వీకులు బిహార్‌లోని బక్సర్‌కు చెందినవారని, ఆమె కూడా భారతదేశంలోని ఆ ప్రాంతాన్ని సందర్శించారని తెలిపారు. మాకు ఈ దేశంతో కేవలం రక్త సంబంధం లేదా ఇంటి పేరుతోనో బంధం ఏర్పడలేదని అంతకుమించిన బాంధవ్యం ఇరు దేశాల నడుమ ఉందని అన్నారు. స్నేహం చిగురించింది ఇలా..అలాగే ఇరు దేశాల మధ్య స్నేహం ఎలా చిగురించిందో కూడా గుర్తు చేసుకున్నారు. బనారస్, పాట్నా, కోల్‌కతా, ఢిల్లీ వంటి నగరాలు భారతదేశంలోనే కాకుండా ట్రినిడాడ్‌లో వీధి పేర్లుగా కూడా ఉన్నాయని చెప్పారు. అలా ఈ రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు అత్యంత బలంగా ఉన్నాయన్నారు. అందుకు నిదర్శనం ఇక్కడ జరుపుకునే నవరాత్రులు, మహాశివరాత్రి, జన్మాష్టమి వంటి పండుగలేనని అన్నారు. ఈ దేశ పురాతన చౌతల్(సంగీతం), భైతక్(వ్యాయామం) ఎంత ప్రాచుర్యం పొందాయో తెలుసనని అన్నారు. ఇక ఇక్కడ సుమారు 5 లక్షల మందికి పైనే భారత సంతతికి చెందినవారు నివసిస్తున్నారని, వారిలో దాదాపు 1800 మంది ప్రవాస భారతీయులని, మిగిలినివారు 1845, 1917ల మధ్య భారతదేశం నుంచి ఒప్పంద కార్మికులుగా వలస వచ్చిన స్థానిక పౌరులేనని గుర్తుచేశారు. అందువల్ల మిమ్మల్ని భారత్ జాగ్రత్తగా చూసుకుంటుందని హామీ ఇచ్చారు. అంతేగాదు మా దేశం మీకు సదా ఆహ్వానం పలుకుతుందని చెప్పారు. అలాగే బిహార్ కూడా శతాబ్దాలుగా వివిధ రంగాలలో ప్రపంచానికి మార్గం చూపించదని చెప్పారు. 21వ శతాబ్దంలో కూడా బీహార్ నుంచి కొత్త అవకాశాలు ఉద్భవిస్తాయని అన్నారు.ఎవరీ కమలా పెర్సాద్..కమలా పెర్సాద్ బిస్సేసర్ 1987లో రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. అనేక చారిత్రక నిర్ణయాలతో పేరుతెచ్చుకున్న మంత్రి. అంతేగాదు ఆమె కరేబియన్ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి, అటార్నీ జనరల్, ప్రతిపక్ష నాయకురాలు కూడా. అలాగే కామన్వెల్త్ దేశాలకు అధ్యక్షత వహించిన తొలి మహిళ. అదీగాక తొలి భారత సంతతి మహిళా ప్రధానిగా కూడా ఘనత దక్కించుకున్నారామె.ఇక ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగో భారతదేశంలోని జోధ్‌పూర్ కంటే చిన్నదేశమే అయినా..మాన భారతదేశ సంస్కృతి, ఆర్థికవ్యవస్థలో కీలక పాత్ర పోషించడం విశేషం. కాగా, ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని నివశిస్తున్న ఆరవతరం భారతీయ ప్రవాసులకు ఓసీఐ(ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా(OCI)) కార్డులు అదిస్తామని ప్రకటించారు మోదీ.#WATCH | Trinidad and Tobago | Addressing the Indian community, PM Modi says, "OCI cards will now be given to the 6th generation of the Indian diaspora in Trinidad and Tobago... We are not just connected by blood or surname, we are connected by belonging. India looks out to you… pic.twitter.com/hBU8tqCb9c— ANI (@ANI) July 4, 2025 (చదవండి: అమెరికా ఆఫీసులో భారతీయ మహిళ ఆకలి తిప్పలు..! పాపం ఆ రీజన్‌తో..)

గాల్లో ఉన్న విమానంలో టెన్షన్.. ప్రయాణికుడిపై ఇషాన్ శర్మ దాడి
వాషింగ్టన్: భారత సంతతి ఇషాన్ శర్మ విమానంలో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడి మధ్య వాగ్వాదం జరిగింది. మాటా మాట పెరిగి చివరకు తన్నుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఇషాన్ తీవ్రంగా గాయపడ్డాడు. విమానం ల్యాండింగ్ అయిన తర్వాత ఇషాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. భారత సంతతి వ్యక్తి ఇషాన్ శర్మ(21) అమెరికాలోని న్యూవార్క్లో నివసిస్తున్నాడు. జూలై 1న ఫిలడెల్ఫియా నుంచి ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించాడు. ఆ విమానం గాలిలో ఉన్న సమయంలో ఇషాన్ శర్మ నవ్వడం, ఏదో మాట్లాడటంపై ముందు సీటులో కూర్చొన్న కీన్ ఎవాన్స్ ఆందోళన చెందాడు. అనంతరం, క్యాబిన్ సిబ్బంది సహాయం కోరే బటన్ నొక్కాడు. అది గమనించిన ఇషాన్ శర్మ.. ఎవాన్స్‌ను అడ్డుకుని అతడి గొంతుపట్టుకుని కొట్టాడు. దీంతో, వారి మధ్య వాగ్వాదం పీక్ స్టేజ్‌కు చేరుకుంది.ఆగ్రహంతో ఎవాన్స్ కూడా తిరిగి శర్మను కొట్టడంతో అతడి కంటికి గాయమైంది. గొడవ పెద్దది కావడంతో విమాన సిబ్బంది వారిద్దరిని నిలువరించారు. ఆ విమానం మయామిలో ల్యాండ్ కాగానే భారత సంతతి వ్యక్తి ఇషాన్ శర్మను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇషాన్ శర్మ తనపై దాడికి ముందు ‘హా హ హ హ హ హ’ అంటూ నవ్వాడని, తనను కించపర్చడంతోపాటు చస్తావని బెదిరించినట్లు ఎవాన్స్ ఆరోపించాడు. అనంతరం, ఇషాన్ తరుఫు న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ.. ఇషాన్ శర్మ విమానంలో ధ్యానం చేస్తున్నాడని తెలిపారు. అయితే తనను ఎగతాళి చేస్తున్నట్లు, బెదిరిస్తున్నట్లుగా ఎవాన్స్ భావించడంతో వారిద్దరి మధ్య ఘర్షణ జరిగిందని చెప్పారు. అంతేగానీ, ఉద్దేశపూర్వకంగా ఎవాన్స్‌ను కొట్టలేదని క్లారిటీ ఇచ్చాడు. No more vacation…🫣| #ONLYinDADE * Man gets kicked off of Frontier flight after getting into altercation pic.twitter.com/us6ipoW5E7— ONLY in DADE (@ONLYinDADE) July 1, 2025
క్రైమ్

డీఎస్పీ వివాహేతర సంబంధం.. కేసు నమోదు
కర్ణాటక: ప్రజలకు భద్రత కల్పించాల్సిన ఉన్నతమైన ఉద్యోగంలో ఉండి ఇంట్లో భార్యను వేధింపులకు గురిచేశాడో డీఎస్పీ. బెంగళూరులో డీఎస్పీ శంకరప్ప పై కేసు నమోదైంది. కాలేజీకి వెళ్లే కుమారుడు ఉన్నప్పటికీ మరో మహిళతో శంకరప్ప అక్రమ సంబంధం పెట్టుకుని భార్యను నిర్లక్ష్యం చేయసాగాడు. భార్య ప్రశ్నించడంతో ఆమెను కొట్టి వేధించేవాడు. మరింత కట్నం తేవాలని బెదిరించడంతో పాటు మరో మహిళను వివాహం చేసుకున్నాడు. తనకు న్యాయం చేయాలని భార్య డీజీపీకి ఫిర్యాదు చేసింది. ఈశాన్య విభాగం మహిళా పోలీస్టేషన్లో శంకరప్ప పై కేసు నమోదైంది.

వావివరుసలు మరిచి మామతో వివాహేతర సంబంధం
ఖమ్మం: వావివరుసలు మరిచి భర్త తండ్రితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ.. తమ వ్యవహారాన్ని కుమార్తె గమనించిందని హత్య చేసింది. ఆపై అనారోగ్యంతో మృతి చెందినట్లు చిత్రీకరించినా భర్త అనుమానంతో విషయం బయటపడింది. ఈ కేసులో నిందితులిద్దరికీ జీవితఖైదు విధిస్తూ సత్తుపల్లి ఆరో అదనపు జిల్లా జడ్జి మారగాని శ్రీని వాస్ సోమవారం తీర్పు వెలువరించారు. బోనకల్ కు చెందిన పాలెపు సునీత తన మామ(భర్త తండ్రి) నర్సింహారావుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ట్రాలీ డ్రైవర్‌గా పనిచేస్తున్న భర్త హరికృష్ణ 2022 ఫిబ్రవరి 9న బయటకు వెళ్లగా ఆయన భార్య సునీత, తండ్రి నర్సింహారావు కలిశారు. ఈ విషయాన్ని అప్పుడు 11ఏళ్ల సునీత పెద్దకుమార్తె చూడడంతో ఆమె మెడకు వైరు బిగించి హతమార్చారు. ఆపై భర్త హరికృష్ణకు ఫోన్ చేసి కుమార్తె ఆరోగ్యం బాగా లేదని చెబుతూ 108లో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా ఆమె చనిపోయిందని వైద్యులు ధ్రు వీకరించారు. అయితే, హరికృష్ణ కూతురు మెడపై కమిలినట్లు ఉండడంతో బోనకల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమాన దర్యాప్తు చేపట్టిన పోలీ సులు సునీత, నర్సింహారావును విచారించగా అసలు విషయం బయటపడడంతో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో వీరిద్దరిపై నేరం రుజువు కాగా జీవితఖైదు విధిస్తూ న్యాయమూర్తి శ్రీనివాస్ తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరఫున అదనపు ప్రాసిక్యూటర్ అబ్దుల్‌బాషా వాదించగా, కేసు విచారణలో కీలకంగా వ్యహరించిన సీఐ మురళి, ఎస్సై కవిత, సిబ్బంది బి.అరవింద్, శ్రీకాంత్‌ను పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ అభినందించారు.

జైలు నుంచే స్కెచ్ గీసి.. గోపాల్ ఖేమ్కా కేసులో షాకింగ్ విషయాలు
ఎన్నికల వేళ.. బీహార్‌లో రాజకీయంగానూ కలకలం రేపిన గోపాల్ ఖేమ్కా హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో నిందితుడు వికాస్ అలియాస్ రాజా పోలీస్ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. మరోవైపు.. గోపాల్ హత్యకు జైలు నుంచే కుట్ర జరిగిందన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందక్కడ. గోపాల్ ఖేమ్కా హత్య (Businessman Murder in Bihar) కేసులో దర్యాప్తు చేపట్టిన సిట్ బృందం.. కీలక నిందితుడైన వికాస్ (ఆయుధం సరఫరా చేసింది ఇతనే) కోసం గాలింపు చేపట్టింది. ఈ క్రమంలోనే పాట్నాలోని ఓ ప్రాంతంలో సోదాలు జరుపుతుండగా.. పోలీసులను చూసి కాల్పులు జరిపాడతను. ఈ క్రమంలో ఎదురుకాల్పులు జరపడంతో నిందితుడు మరణించినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ ఆయుధాల తయారీ, విక్రయాలతో నిందితుడికి సంబంధాలున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గోపాల్ ఖేమ్కా హత్య కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.గోపాల్ ఖేమ్కా.. బీహార్లోనే అతి పురాతన ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒకటైన మగధ హాస్పిటల్ యజమాని. పాట్నా గాంధీ మైదాన్ పీఎస్ పరిధిలోని రాంగులాం చౌక్ పనాష్ హోటల్ సమీపంలో శుక్రవారం రాత్రి ఆయన దారుణ హత్యకు గురయ్యారు. హోటల్ నుంచి బయటకు వస్తుండగా నిందితులు బైక్ మీద వచ్చి అతి సమీపం నుంచి గోపాల్‌పై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారాయన. 2018లో ఆయన తనయుడు గుంజన్ ఖేమ్కా కూడా ఇదే తరహాలో బైకర్ల కాల్పులలో మరణించడం గమనార్హం. అయితే ఆ కేసులో నిందితులను ఇప్పటిదాకా పోలీసులు పట్టుకోలేకపోయారు.గోపాల్ ఖేమ్కా కేసులో.. అశోక్ కుమార్ సాఫ్ అనే వ్యాపారవేత్త ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హత్య కోసం సుపారీ గ్యాంగ్‌కు 3.5 లక్షల రూపాయలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఉమేష్‌యాదవ్ అనే షూటర్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. గోపాల్ అంత్యక్రియలకు హాజరైన రోషన్ కుమార్ అనే మరో నిందితుడు పట్టుబడ్డాడు. ఇక వికాస్ ఎన్కౌంటర్లో మరణించాడు. పాట్నాలోని బీర్ సెంట్రల్ జైలు నుంచే గోపాల్ ఖేమ్కా హత్యకు కుట్ర జరిగినట్లు భావిస్తున్నామని బీహార్ డీజీపీ వినయ్ కుమార్ తెలియజేశారు. ఇప్పటికే జైలు నుంచి మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారాయన. జైల్లోని నిందితులు.. బయట ఉన్నవాళ్ల సాయంతో ప్లాన్ అమలు చేశారని అన్నారాయన. ఈ సంచలన కేసుకు సంబంధించిన మిగతా వివరాలను మీడియా సమక్షంలో వెల్లడిస్తామని స్థానికంగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలియజేశారు.గోపాల్ ఖేమ్కాకు బీజేపీతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరికొన్ని నెలల్లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ హత్య రాష్ట్రంలో రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. నీతీశ్‌కుమార్ పాలనలో బిహార్ నేర రాజధానిగా మారిందని లోక్‌సభలో విపక్ష నేత, పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో వ్యాపారవేత్తలకు, ప్రజలకు రక్షణ లేకుండా పోతుందని.. హత్యలు, దోపిడీలు సర్వసాధారణంగా మారాయని ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ దుయ్యబట్టారు.

తిరుపతి నగరంలో సైకో వీరంగం
తిరుపతి క్రైమ్: తిరుపతి నగరంలో సోమవారం ఓ సైకో కర్రతో దాడిచేశాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అలిపిరి ఎస్ఐ లోకేశ్ వివరాల మేరకు..తిరుపతి కపిలతీర్థం రోడ్డులోని అలిపిరి పోలీస్ స్టేషన్ సమీపంలో సోమవారం ఓ వ్యక్తి సైకోలా ప్రవర్తించి తనకు ఎదురుపడినవారిపై విరుచుకుపడ్డాడు. శేఖర్ (55) అనే యాచకుడిపై, కపిల తీర్థం సమీపంలోని వాహనాల పార్కింగ్ స్థలంలో పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం, కల్పనపై కర్రతో విచక్షణారహితంగా దాడిచేశాడు. స్థానికులు వెంటనే గాయపడ్డ వ్యక్తులను రుయా ఆసుపత్రికి తరలించారు. వీరిలో శేఖర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. వలలో బంధించి.. ఘటనకు మూలకారకుడైన సైకో గంటపాటు పోలీసులకు, స్థానికులకు చుక్కలు చూపించాడు.రోడ్లపై వీరవిహారం చేస్తూ అందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు. మొదట అతను కపిలతీర్థం నుంచి మున్సిపల్ పార్క్ వరకు కర్రతో వీరంగం చేశాడు. అతన్ని చూసి స్థానికులంతా పరుగులు తీశారు. సైకో దృఢంగా ఉండటంతో అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ఎవరూ సాహసించలేకపోయారు. చివరికి మున్సిపల్ సిబ్బందితో కలసి ఎస్ఐ లోకేశ్, కానిస్టేబుల్ స్వయంప్రకాశ్ వలవిసిరి చాకచక్యంగా బంధించారు. సైకో వద్ద ఓ కత్తి కూడా ఉంది. అతను తమిళనాడుకు చెందిన వ్యక్తిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. View this post on Instagram A post shared by colours of Tirupati ™ (@coloursoftirupati)