
చలి పెరగడం..వాతావరణంలో మార్పులు సంభవిస్తుండడంతో గ్రేటర్‌లో వ్యాధులు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా విష జ్వరాలు, టైఫాయిడ్, డెంగీతో పాటు చికున్ గున్యా కేసులు పెరుగుతున్నాయి.

దీంతో నగరంలోని ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఉస్మానియా, గాందీ, ఫీవర్, నిలోఫర్ ఆస్పత్రుల్లో ఓపీకి వచ్చే వారి సంఖ్య రెట్టింపయింది

వీరిలో అధికశాతం వైరల్ జ్వరపీడితులే ఉంటున్నారు. ఏ ఆస్పత్రికి వెళ్లినా భారీ క్యూలు కని్పస్తున్నాయి. సరైన వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు.



























