Chikungunya
-
చికెన్‌గున్యాతో బాధపడుతున్న సమంత.. ఒళ్లునొప్పులున్నా..!
కాస్త ఆరోగ్యం బాగోలేకపోతే చాలు చాలామంది ముసుగు తన్నిపడుకుంటారు. కానీ సమంత మాత్రం అనారోగ్యంతో బాధపడుతున్నా సరే ఫిట్‌నెస్‌పై ఫోకస్ పక్కన పెట్టలేదు. చికెన్ గున్యాతో సతమతమవుతున్న ఆమె ఒళ్లు నొప్పులున్నా సరే జిమ్‌లో చెమటలు చిందిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. చికెన్‌గున్యా నుంచి కోలుకోవడం భలే సరదాగా ఉంది అంటూ జిమ్‌లో వర్కవుట్స్ చేస్తోంది.చికెన్ గున్యాతో బాధపడుతున్న సామ్శరీరం సహకరించకపోయినా తను పట్టుదలతో వ్యాయామం చేస్తుండటం చూసి ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. సామ్ త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే సమంత (Samantha) చివరగా సిటాడెల్: హనీ బన్నీ అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. ఈ సిరీస్ షూటింగ్లో ఓ రోజు సామ్ ఉన్నట్లుండి స్పృహ తప్పి పడిపోయింది. దీని గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను సడన్‌గా స్పృహ తప్పి కింద పడిపోయాను. ఆస్పత్రికి తీసుకెళ్లలేదుకళ్లు తెరిచేసరికి నాకు ఎవరి పేర్లూ గుర్తు రావడం లేదు. కొద్ది క్షణాలపాటు బ్లాంక్ అయిపోయాను. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తుంటే నన్ను ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లలేదు అనిపిస్తోంది. ఏ ఒక్కరూ హాస్పిటల్‌కు వెళ్దామనలేదు అని చెప్పుకొచ్చింది. కాగా సమంత కొన్నేళ్లుగా మయోసైటిస్‌తో బాధపడుతోంది. తను ఈ వ్యాధి బారిన పడిన విషయాన్ని 2022లో వెల్లడించింది. అది కూడా నిర్మాతల బలవంతం వల్లే చెప్పింది. (చదవండి: అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టులో ఊరట)బలవంతం వల్లే..2022లో శాకుంతలం సినిమా రిలీజైంది. ఆ సమయంలో సమంత ఆరోగ్యం అస్సలు బాగోలేదు. మయోసైటిస్ తనను శారీరకంగా కుంగదీసింది. మరోవైపు సినిమా ప్రమోషన్స్ చేయాలి. నీకున్న బాధ బయటపెడితే తప్పేంటని నిర్మాతలు ఒత్తిడి తేవడంతో సామ్ మయోసైటిస్‌తో సతమతమవుతున్న విషయాన్ని బయటకు చెప్పింది. వారి ఒత్తిడి వల్లే నాకు మయోసైటిస్ ఉందని అందరికీ చెప్పానని, లేదంటే నిశ్శబ్ధంగానే ఆ వ్యాధితో పోరాటం చేసేదాన్ని అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.సినిమాఏ మాయ చేసావె సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది సమంత. దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలతో సెన్సేషన్ హీరోయిన్గా మారింది. బృందావనం, ఎటో వెళ్లిపోయింది మనసు, జబర్దస్త్, అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా, మనం, అల్లుడు శీను, రభస, సన్నాఫ్ సత్యమూర్తి, అఆ, జనతా గ్యారేజ్, బ్రహ్మోత్సవం, రంగస్థలం, ఓ బేబీ, మజిలి, యశో, శాకుంతలం, ఖుషి.. ఇలా ఎన్నో చిత్రాలతో మెప్పించింది. పుష్ప:ద రైజ్ మూవీలో ఊ అంటావా మామా.. ఉఊ అంటావా మామా అనే ఐటం సాంగ్‌తో పాన్ ఇండియాను ఊపేసింది.సిటాడెల్ సిరీస్ఓటీటీలో ద ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో అలరించిన ఆమె చివరగా సిటాడెల్: హనీ బన్నీ సిరీస్‌లో యాక్షన్ అవతార్‌లో కనిపించింది. సిటాడెల్ సిరీస్ విషయానికి వస్తే.. ఇందులో సమంత ఏజెంట్‌గా నటించింది. సీతా ఆర్ మీనన్ కథ అందించగా రాజ్ అండ్ డీకే (Raj Nidimoru and Krishna DK) డైరెక్ట్ చేశారు. గతేడాది నవంబర్ 7న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో వరుణ్ ధావన్, కేకే మీనన్, సాఖిబ్ సలీమ్, సికిందర్ ఖేర్ ప్రముఖ పాత్రలు పోషించారు. "Recovering from Chikungunya is so fun 😌 😌 😌 The joint pains and ALL"~Queen @Samanthaprabhu2 💛#SamanthaRuthPrabhu𓃵#Samantha #SamanthaRuthPrabhu#CitadelHoneyBunny #RaktBramhand#MaaIntiBangaram pic.twitter.com/m94S1yMV8R— Samcults (@Samcults) January 10, 2025 చదవండి: తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన దిల్ రాజు -
హైదరాబాద్‌లో చికున్ గున్యా ,డెంగీ జ్వరాల విజృంభణ.. (ఫొటోలు)
-
రాష్ట్రానికి చలిజ్వరం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చలిజ్వరం పట్టుకుంది. విషజ్వరాలతోపాటు దగ్గు, జలుబు, ఇతర శ్వాస సంబంధ సమస్యలతో జనం సతమతం అవుతున్నారు. వాతావరణంలో మార్పులు, ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. హైదరాబాద్ మొదలు ఏజెన్సీ ప్రాంతాల దాకా ఇదే పరిస్థితి. ఏ ఆస్పత్రిలో చూసినా పెద్ద సంఖ్యలో ఔట్ పేషెంట్లు కనిపిస్తున్నారు. ఇన్ పేషెంట్లుగా చేరి చికిత్స పొందాల్సిన వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. కిక్కిరిసిపోతున్న పెద్దాస్పత్రులు ⇒ హైదరాబాద్‌లోని ఒక్క ఫీవర్ ఆస్పత్రికి ఈ నెలలో ఇప్పటివరకు వచ్చిన జ్వరాల బాధితులు 12,080 మందికావడం ఆందోళనకరం. నాలుగైదు రోజులుగా రోజూ 800 వరకు ఔట్ పేషెంట్లుగా నమోదవుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వివిధ జ్వర సంబంధ సమస్యలతో సుమారు 700 మంది ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. ⇒ ఇక చిన్నపిల్లల ఆస్పత్రి నిలోఫర్‌కు సోమవారం 1,600 మంది ఔట్ పేషెంట్లుగా నమోదుకాగా.. ఇందులో చలి కారణంగా ‘న్యుమోనియా’వంటి శ్వాస సంబంధ సమస్యలతో వచ్చిన పిల్లలే ఎక్కువగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ ఇన్ పేషెంట్లుగా 1,300 మంది వరకు చికిత్స పొందుతున్నారు. ⇒ ఉస్మానియా ఆస్పత్రిలో సోమవారం జనరల్ మెడిసిన్ కింద వైద్యం కోసం వచ్చిన ఔట్పేషెంట్లు 290, ఇక గాంధీ ఆస్పత్రిలో ఈ నెలలో సోమవారం నాటికి వచ్చిన ఔట్ పేషెంట్ల సంఖ్య 35,547. అంటే సగటున ప్రతీరోజు 1,500 మంది వస్తున్నారు. ఇందులో జ్వర సంబంధిత సమస్యలతో వచ్చేవారు ప్రతీరోజు 300 నుంచి 500 మంది వరకు ఉంటారని సిబ్బంది చెబుతున్నారు. ⇒ ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని పిల్లల వార్డులో ప్రతీరోజు 50కి తక్కువ కాకుండా విషజ్వరాల కేసులు నమోదవుతున్నట్లు ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఉట్నూరు ఐటీడీఏ, ములుగు, భూపాలపల్లి, అచ్చంపేట మన్ననూరు, కొత్తగూడెం పరిధిలోని పలు ఏజెన్సీ మండలాల్లో కూడా జ్వరాల బాధితుల సంఖ్య పెరుగుతోంది. కానీ చాలా మంది గిరిజనులు ఆస్పత్రులకు వెళ్లకుండా ఇళ్ల దగ్గరే సొంత వైద్యం చేసుకుంటున్నట్టు ఆయా ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. తగ్గిన డెంగీ, చికున్‌గున్యా... ఈ ఏడాది ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు రాష్ట్రాన్ని వణికించిన డెంగీ, మలేరియా, చికున్‌గున్యా కేసులు.. నవంబర్ నెలలో తగ్గుముఖం పట్టినట్లు వైద్యారోగ్యశాఖ చెబుతోంది. డెంగ్యూ కేసులు సెప్టెంబర్, అక్టోబర్‌లతో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. జనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,500కు పైగా డెంగీ కేసులు నమోదవగా..సెపె్టంబర్లో 1,542, అక్టోబర్‌లో 854 కేసులు ఉన్నాయి. ఈ నెలలో 22వ తేదీ వరకు 168 కేసులే వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఇక చికున్‌గున్యా కేసులు సెప్టెంబర్‌లో 183, అక్టోబర్‌లో 13 నమోదవగా, ఈనెలలో ఇప్పటివరకు 13 కేసులే వచ్చాయని వివరిస్తున్నారు. మలేరియా కేసులు కూడా తగ్గాయని అంటున్నారు. పెరిగిన శ్వాస సంబంధ సమస్యలు ఈ నెల మొదటి వారం నుంచి పెరుగుతూ వచ్చిన చలి... కార్తీక పౌర్ణమి మరింత తీవ్రమైంది. దీని కారణంగా న్యుమోనియా వంటి శ్వాస సంబంధ సమస్యలు పెరిగి జనం తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో తీవ్ర చలి కారణంగా ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరి ఇబ్బందిపడుతున్న వారు అధికంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది కూడా. చలితో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు, గొంతు నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయని అందులో పేర్కొన్నట్టు తెలిసింది.ఈ చిత్రంలోని తల్లీకొడుకులు ములుగు జిల్లా మంగపేట మండలం బాలన్న గూడెం గ్రామానికి చెందినవారు. తల్లి మిరియాల రాజమ్మకు వారం రోజుల నుంచి తీవ్ర జ్వరం, కుమారుడు అనుపాల్కు టైఫాయిడ్. ఇద్దరూ ఇప్పుడు ఏటూరు నాగారం సామాజిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చలి పెరగడంతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.చలిజ్వరంతో బాధపడుతున్నా..చలి, తీవ్ర జ్వరం, కడుపునొప్పి రావడంతో రెండు రోజుల క్రితం జిల్లా దవాఖానాకు వచ్చిన. డాక్టర్లు పరీక్షించి వార్డులో చేర్చుకున్నారు. పొద్దున, సాయంత్రం వచ్చి చూస్తున్నారు. కొంచెం నయమైంది. – తూడి సోమక్క, వనపర్తి, లింగాల గణపురంశ్వాసకోశ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి కొన్నిరోజులుగా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. వారం రోజుల్లో వివిధ ఆరోగ్య సమస్యలతో 2,350 మంది ఔట్ పేషెంట్ (ఓపీ) విభాగానికి వచ్చారు. అందులో 80 మంది జ్వరాలతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆస్తమా, గుండె సంబంధిత వ్యాధుల టెస్టులు చేయడానికి ఎక్స్‌రే, ఈసీజీ, ట్రెడ్మిల్, టూడీ ఈకో టెస్టులు అందుబాటులో ఉన్నాయి. సరిపడా టెక్నీíÙయన్స్ లేక అన్ని టెస్టులు ఒక్కరే చేస్తున్నారు. సరిపడా మందులు ఉన్నాయి. ఎమ్మారై, సీటీ స్కాన్లు తీయడం లేదు. – డాక్టర్ గోపాలరావు, జిల్లా వైద్యాధికారి, ములుగుసీజనల్ వ్యాధులతో జాగ్రత్త శీతాకాలం ప్రారంభం కావడంతో వాతావరణంలో మార్పులు వచ్చి, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. జ్వరం, జలుబు, దగ్గు, ఆస్తమా సమస్యలు తలెత్తుతాయి. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తే సీజనల్ వ్యాధుల బారినపడకుండా ఉండొచ్చు. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో చలి గాలిలో తిరగవద్దు. బయటికి వెళ్లినప్పుడు మాసు్కలు ధరించడం మంచిది. వెచ్చగా ఉండే దుస్తులను ధరించాలి. రోగ నిరోధక శక్తి పెరిగే ఆహారం తీసుకోవాలి. – డాక్టర్ మధుసూదన్,జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి, జయశంకర్ భూపాలపల్లి -
బుల్లితెర నటికి చికెన్ గున్యా
బుల్లితెర నటి మహి వీజ్ అనారోగ్యం పాలైంది. గత కొద్ది రోజులుగా తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న ఆమెకు చికెన్ గున్యా సోకింది. ప్రస్తుతం ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఈమేరకు హాస్పిటల్ బెడ్‌పై ఉన్న ఫోటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.లైఫ్‌లోనే కఠినమైన రోజులు..కాగా కొద్ది రోజుల క్రితం నటి.. తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని పేర్కొంది. ఈమేరకు ఓ వీడియోను తన అభిమానులతో పంచుకుంది. ఈ పది రోజులు నా జీవితంలోనే ఎంతో కఠినతరమైనవి. నాకన్నీ చేసిపెట్టే నాన్న ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. వీలైనంతవరకు నేను తనతోనే ఉంటున్నాను. అతడు తిరిగి మామూలుగా నడిచేందుకు ఎంకరేజ్ చేస్తున్నాను. తెలుగులో హీరోయిన్గా..పేరెంట్స్‌కు పిల్లలను చూస్తేనే సగం జబ్బు నయమైపోతుంది. నా తండ్రి కోసం నెలల తరబడి ఆయన వెన్నంటే ఉంటున్నందుకు గర్వంగా ఉంది. నీ వెంట నేనున్నాను నాన్నా.. లవ్యూ అని రాసుకొచ్చింది. మహి వీజ్.. తెలుగులో తపన అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. బాలికా వధు, లాగి తుజ్సే సీరియల్స్ ద్వారా గుర్తింపు పొందింది. 2011లో జై భానుషాలిని పెళ్లాడింది. వీరికి తారా అనే కూతురు పుట్టింది. అలాగే రాజ్వీర్ అనే బాబును పెంచుకుంటున్నారు. View this post on Instagram A post shared by Mahhi Vinod Vij (@mahhivij) చదవండి: ఆదిత్య రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? వాళ్ల కంటే ఎక్కువే! -
Telangana: రాష్ట్రవ్యాప్తంగా 'జోరు వాన'
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీగా వానలు పడుతున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి, చెరువులు అలుగుపోస్తున్నాయి. రహదారులపై నీరు చేరడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని.. ఆదివారం విశాఖపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈ మేరకు 14 జిల్లాలకు రెడ్ అలర్ట్, పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎర్రుపాలెంలో 18.83 సెంటీమీటర్లు శనివారం రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో 18.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మధిరలో 16.38, బోమన్‌దేవిపల్లిలో 13.75, వరంగల్ జిల్లా రెడ్లవాడలో 12.35, యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో 10.43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్ర ప్రణాళిక విభాగం గణాంకాల మేరకు.. రాష్ట్రవ్యాప్తంగా 45 చోట్ల 5 సెం.మీ. కంటే ఎక్కువ వర్షాలు కురిశాయి. మొత్తంగా శనివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 2.33 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. సీజన్ సగటులో అధిక వర్షపాతం నైరుతి సీజన్లో ఆగస్టు చివరినాటికి రాష్ట్రంలో 57.59 సెం.మీ. సగటు వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. ఈసారి 66.37 సెం.మీ. కురిసింది. మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట్ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం.. జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, వికారాబాద్, నాగర్‌కర్నూల్, ఖమ్మం, ములుగు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మిగతా జిల్లాలన్నీ సాధారణ వర్షపాతానికి కాస్త అటు ఇటుగా ఉన్నాయి. పలు జిల్లాల్లో విస్తారంగా వానలు.. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్లలోని పలు ప్రాంతాల్లో చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. ఏకబిగిన వర్షాలతో రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు నీట మునిగాయి. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం నార్లాపూర్‌కు చెందిన పుట్ట మహేశ్ (17) పశువులను మేపడానికి వెళ్లి పిడుగుపాటుతో మృతి చెందాడు. ⇒ ములుగు జిల్లా జగ్గన్నగూడెం సమీపంలోని బొగ్గులవాగు, పస్రా–ఎస్ఎస్ తాడ్వాయి మండలాల మధ్య జలగలంచవాగు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పస్రా– తాడ్వాయి మధ్య కొండపర్తి సమీపంలో జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారులోని మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో పాకాల వాగు ఉప్పొంగడంతో.. వందల ఎకరాల్లో పొలాలు నీటమునిగాయి. ⇒ ఖమ్మం జిల్లా మధిర పట్టణం జలదిగ్బంధమైంది. బస్సులు, వాహనాల్లో ఉన్న ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయి ఆందోళనలో పడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి.. భారీ వర్షాల నేపథ్యంలో హుటాహుటిన మధిరకు బయలుదేరారు. అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ఎర్రుపాలెం మండలం మీనవోలు–పెగళ్లపాడు మధ్య రహదారిపై చేరిన వరదలో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. పోలీసులు స్థానికుల సాయంతో ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఇక్కడి నక్కలవాగులో భవానిపురానికి చెందిన మలిశెట్టి సాంబశివరావు(19) గల్లంతయ్యాడు. ⇒ కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్లో భారీ వర్షం కురిసింది. పట్టణంలో ప్రధాన రహదారిపై నీరు చేరి వాహనాలు నీట మునిగాయి. ⇒ ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. యాదాద్రి జిల్లా రాజాపేటలో, అడ్డ గూడూరు మండలం చౌళ్లరామారంలో పెద్ద సంఖ్యలో చెట్లు నేలకూలాయి. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో పొలాలు నీటమునిగాయి. ⇒ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. నారాయణపేట జిల్లా బండగొండలో ఇద్దరు యువకులు వాగులో పడి కొట్టుకుపోగా.. స్థానికులు గమనించి కాపాడారు. మహబూబ్‌నగర్ జిల్లాలో దుందుభి, వర్నె వాగు ఉధృతంగా పారుతున్నాయి. జడ్చర్లలో ఏరియా ఆస్పత్రి జలదిగ్బంధమైంది వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం దావాజీపల్లి సమీపంలో కేఎల్ఐ కాల్వకు గండిపడటంతో పొలాలు నీటమునిగాయి. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వెనచర్లలో ఓ ఇంటి పైకప్పు కూలింది. ⇒ జగిత్యాల జిల్లా కేంద్రంలోని వెంకటాద్రినగర్ వద్ద బ్రిడ్జిపై నుంచి వరద పారుతోంది. అధికారులు ప్రజలను జేసీబీ సహాయంతో వాగును దాటిస్తున్నారు. గ్రేటర్ సిటీకి ముసురు హైదరాబాద్ మహానగరానికి ముసురు పట్టింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీనితో రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. ట్రాఫిక్ చాలా నెమ్మదిగా సాగింది. లో తట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయం అయ్యాయి. భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో.. హై దరాబాద్ జిల్లా పరిధిలో పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. విస్తారంగా వానలతో హిమాయత్‌నగర్, గండిపేట జంట జలాశయాల్లోకి వరద పెరిగింది. దీ నితో మూసీ పరీవాహక ప్రాంతాల వారిని అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. 59 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా తరలించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని ప్రభుత్వ సీఎస్ శాంతికుమారిని సీఎం ఎ.రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రానికి భారీ వర్ష సూచన నేపథ్యంలో శనివారం ఆయన సీఎస్‌తో సమీక్షించారు. రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్యారోగ్య, పోలీసు శాఖలు అప్రమత్తంగా ఉండేలా చూడాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలని ఆదేశించారు. జలాశయాల గేట్లు ఎత్తేసే నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. అన్ని జిల్లా కలెక్టరేట్లు, జీహెచ్ఎంసీ, సచివాలయంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె డీజీపీ జితేందర్, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించిందని.. ఎలాంటి ఆకస్మిక విపత్తు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. వాగులు, వంకలు, చెరువులు పొంగుతున్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా అధికారిని నియమించి.. జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. వర్షాల పరిస్థితికి అనుగుణంగా జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించే విషయంపై కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని సూచించారు.బొగత జలపాతం సందర్శన నిలిపివేత వాజేడు: ఎగువన కురుస్తున్న వర్షాలతో ములుగు జిల్లా వాజేడు మండలం పరిధిలోని బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం నుంచి జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రేంజర్ శ్రీనివాస్ శనివారం తెలిపారు. మళ్లీ ఎప్పుడు అనుమతిస్తారనేది మీడియా ద్వారా తెలియజేయనున్నట్లు వెల్లడించారు.సీజనల్ వ్యాధులపై జాగ్రత్తవైద్య సిబ్బందికి మంత్రి దామోదర సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.. తమ శాఖ ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. వర్షాలు తగ్గే వరకు డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అంతా హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని ఆదేశించారు. ఎవరికీ సెలవులు మంజూరు చేయొద్దని డీఎంఈ వాణి, టీవీవీపీ కమిషనర్ రవీందర్ నాయక్‌ను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, బాధితులకు అండగా నిలవాలని కోరారు. డెంగీ, చికున్ గున్యా, మలేరియా తదితర వ్యాధుల కట్టడిపై శనివారం ఆయన అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. కాగా, రాష్ట్రంలో డెంగీ, చికున్ గున్యా, మలేరియా కేసులు నియంత్రణలోనే ఉన్నాయని అధికారులు మంత్రికి నివేదించారు.డెంగీ: రాష్ట్రంలో జనవరి 1 నుంచి ఆగస్టు 30 వరకు పరీక్షించిన మొత్తం 1,06,356 నమూనాలలో రిపోర్ట్ అయిన డెంగీ కేసులు 6,242 అని అధికారులు తేల్చారు. డెంగీ హైరిస్క్ తొలి పది జిల్లాల్లో హైదరాబాద్‌లో (2,073), సూర్యాపేట (506), మేడ్చల్ మల్కాజ్గిరి (475), ఖమ్మం (407), నిజామాబాద్ (362), నల్లగొండ (351), రంగారెడ్డి (260), జగిత్యాల (209), సంగారెడ్డి (198), వరంగల్ (128) కేసులు నమోదయ్యాయి.చికున్ గున్యా: ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పరీక్షించిన 3,127 నమూనాలలో రిపోర్ట్ అయిన వాటిలో చికున్ గున్యా కేసులు 167. చికున్ గున్యా హైరిస్క్ జిల్లాల్లో హైదరాబాద్ (74), మహబూబ్‌నగర్ (20), వనపర్తి (17), రంగారెడ్డి (16), మేడ్చల్ (11) కేసులు నమోదయ్యాయి.మలేరియా: జనవరి 1 నుంచి ఆగస్టు 30 వరకు మొత్తం 22,80,500 నమూనాలు పరీక్షిస్తే మలేరియా పాజిటివ్‌గా 197 కేసులు నమోదయ్యాయి. -
జ్వర భద్రం
డెంగీ రాష్ట్రాన్ని వణికిస్తోంది. ఇంతకుముందులా కాకుండా ‘మిక్స్డ్ ఇన్ఫెక్షన్ల’తో జనాల ఆరోగ్యాన్ని నిలువునా పీలి్చపిప్పిచేస్తోంది. రెండు, మూడు రకాల వైరస్లు సోకుతుండటం ప్రమాదకరంగా మారుతోంది. జ్వరంతోపాటు తీవ్ర నీరసం, ఒళ్లంతా నొప్పులతో.. కనీసం బెడ్‌పై నుంచి లేచి నడవలేనంతగా బాధపెడుతోంది. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే తగిన వైద్యం అందక.. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ‘నిలువు దోపిడీ’ సమరి్పంచుకోలేక.. శారీరకంగానే కాదు, మానసికంగానూ జనం అల్లాడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. విషజ్వరాలతో పరిస్థితి దారుణంగా మారుతున్నా, ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ కళ్లముందే కనిపిస్తున్నా.. ప్రభుత్వం నుంచి తగిన స్పందన లేదనే ఆగ్రహం వ్యక్తమవుతోంది.సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం జ్వరాలతో మంచాన పడింది. డెంగీ, చికున్‌గున్యా, మలేరియా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా జనం విష జ్వరాలతో అల్లాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత, మౌలిక సదుపాయాలు లేకపోవడం, వైద్య సిబ్బంది కొరతతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే అడ్డగోలుగా వసూలు చేస్తున్న ఫీజులు చూసి కళ్లు తేలేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన కనిపించడం లేదని బాధితులు వాపోతున్నారు. పెరుగుతున్న డెంగీ తీవ్రత రాష్ట్రంలో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో జ్వర సర్వే జరుగుతోంది. గ్రామాల్లో ఆశ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తున్నారు. వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 6,051 డెంగీ కేసులు, 164 చికున్‌గున్యా కేసులు, 197 మలేరియా కేసులు నమోదయ్యాయి. కానీ లెక్కలోకి రాని కేసులు భారీ స్థాయిలో ఉన్నాయనే అంచనా. ముఖ్యంగా డెంగీ దడ పుట్టిస్తోంది. జూలై, ఆగస్టు రెండు నెలల్లోనే ఏకంగా 3,317 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇందులో హైదరాబాద్‌లో అత్యధికంగా 1,267 కేసులు, నల్లగొండ జిల్లాలో 276 కేసులు, ఖమ్మం జిల్లాలో 181 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లోనూ విష జ్వరాల కేసులు పెరిగినా.. అధికారికంగా నమోదవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన మందులు లేకపోవడం, టెస్టింగ్ కిట్ల కొరత ఇబ్బందికరంగా మారింది. రూ.50 వేల నుంచి రూ.2 లక్షలదాకా వసూళ్లు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే వేలకు వేలు వసూలు చేస్తున్నాయని డెంగీ, ఇతర విష జ్వరాల బాధితులు వాపోతున్నా రు. ముఖ్యంగా డెంగీ వచ్చి ఆస్పత్రిలో చేరితే చాలు.. పరిస్థితిని బట్టి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు చికిత్సల కోసం వసూలు చేస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితిని చక్కదిక్కడంలో వైద్యశాఖ యంత్రాంగం విఫలమవుతోందన్న ఆరోపణ లు వినిపిస్తున్నాయి. డెంగీ, ఇతర విష జ్వరాల నియంత్రణ, బాధితులకు చికిత్స అందించడంపై దృష్టిపెట్టాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించినా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఉన్నతాధికారులు ప్రభుత్వ ఆస్పత్రులను తనిఖీ చేస్తూ, పరిస్థితిని చక్కదిద్దడంపై ఫోకస్ చేస్తున్నా.. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి రికార్డు స్థాయిలో రోగులు శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి రాష్ట్రంలోనే అత్యధికంగా 2,680 మంది ఔట్ పేషెంట్లు వచ్చారు. హైదరాబాద్‌లోని ఉస్మానియాకు 2,566 మంది, గాం«దీకి 2,192 మంది, వరంగల్ ఎంజీఎంకు 2,385 మంది ఔట్ పేషెంట్లు వచ్చారు. ఓపీ నమోదైంది. సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండడంతో ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరుగుతోంది.ప్లేట్లెట్స్ టెస్టు కోసం బయటికి.. నాలుగు రోజుల నుంచి జ్వరం వస్తోంది. ఆస్పత్రిలో మూడు రోజులుగా వైద్యం తీసుకుంటున్నా. నా భర్తకు కూడా జ్వరమే. ఆస్పత్రిలో ప్లేట్లెట్ టెస్ట్ చేసే సదుపాయం లేదని టెస్టుల కోసం బయటికి పంపించారు. – కె.లక్ష్మీతిరుపతమ్మ, సత్తుపల్లి మందులు సరిగా ఇవ్వడం లేదు నేను నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే.. వైద్యులు పారాసెటమాల్ 650 ఎంజీ మాత్రలు రాశారు. కానీ సిబ్బంది 500 ఎంజీ మాత్రలు, అదీ రెండు రోజులకు సరిపడానే ఇచ్చారు. 650 ఎంజీ మాత్రలు బయట కొనుక్కోవాలని చెప్పారు. – మశమ్మ, నాగర్కర్నూల్మిక్స్డ్ ఇన్ఫెక్షన్లతో తీవ్ర ప్రభావంసీరో టైప్–1, 2 డెంగీ వేరియంట్లతో ఆరోగ్యం సీరియస్.. కోవిడ్ వచ్చి తగ్గినవారిలో నీరసం మరింత ఎక్కువఅడిషనల్ డీఎంఈ రాజారావు వెల్లడి ‘‘ఏ వైరల్ జ్వరం అయినా వీక్నెస్ ఉంటుంది. కోవిడ్ వచి్చపోయిన వారిలో నీరసం మరింత ఎక్కువగా ఉంటోంది. వైరల్ జ్వరం వచ్చిన వారు విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలి. లేకుంటే సాధారణ స్థితికి రావడానికి ఎక్కువ రోజులు పడుతుంది. డెంగీలో సీరో టైప్–2 అనేది మన వద్ద ఎక్కువగా వ్యాపిస్తోంది. మిగతా డెంగీ వేరియంట్ల కంటే దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అదే మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్ ఉంటే తీవ్రత మరింత పెరుగుతుంది. ఎవరికైనా సీరో టైప్–1 డెంగీ ఒకసారి వచి్చ, రెండోసారి సీరో టైప్–2 వస్తే.. మొదటిదాని యాంటీబాడీస్, రెండో టైప్ ఇన్ఫెక్షన్ క్రాస్ రియాక్షన్ వల్ల ఆరోగ్య పరిస్థితి మరింత సీరియస్ అవుతుంది. ఇక డెంగీలో ప్లేట్లెట్లు పడిపోవడం కంటే.. ప్లాస్మా లీకేజీ చాలా ప్రమాదకరం. రక్తంలోని నీరు రక్తనాళాల నుంచి లీక్ అవడమే ప్లాస్మా లీకేజీ. దీనివల్ల పల్స్, బీపీ పడిపోవడం, తర్వాత తీవ్ర కడుపునొప్పి, వాంతులు రావడం, చెమటలు పట్టడం, అపస్మారక స్థితిలోకి వెళ్లడం, అవయవాలు విఫలమయ్యే కూడా వెళ్తుంది. అయితే వంద మందికి డెంగీ వస్తే.. అందులో ఐదుగురికి మాత్రమే ప్లాస్మా లీకేజీ వరకు వెళ్లే ప్రమాదం ఉంటుంది. డెంగీలో ప్లేట్లెట్లు పడిపోవడం సాధారణ లక్షణమే. చాలా మందిలో వాటంతట అవే పెరుగుతాయి. ఒకవేళ రక్తస్రావం జరుగుతున్నా, 20 వేలకన్నా తక్కువకు ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోయినా.. ప్లేట్లెట్లు ఎక్కించాల్సి వస్తుంది. ప్లేట్లెట్ టెస్టులను పెథాలజిస్ట్ చూసి నిర్ధారించాలి. మిషన్‌లో లెక్కిస్తే.. ఉన్నదానికంటే తక్కువగా చూపించే చాన్స్ ఉంటుంది. – ప్రొఫెసర్ ఎం.రాజారావు, అడిషనల్ డీఎంఈఏ ఆస్పత్రిలో చూసినా అవే సమస్యలు.. ⇒ మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రితోపాటు పీహెచ్సీలలో మందుల కొరత ఉంది. అన్ని రకాల యాంటీ బయాటిక్స్ అందుబాటులో లేవు. జలుబు సిరప్, కంటి చుక్కల మందులు, క్లేవమ్ వంటి మందులు కూడా లేవు. ఇంజక్షన్లు అందుబాటులో లేవు. వైద్యులు ఐదారు రకాల మందులు రాస్తే వాటిలో రెండు, మూడు రకాలు మాత్రమే ఉంటున్నాయి. మిగతావి బయట కొనుక్కోవాల్సి వస్తోంది. ⇒ నాగర్‌కర్నూల్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో జ్వరం, ఇతర జబ్బులకు కేవలం రెండు రోజులకు మాత్రమే మందులు ఇస్తున్నారు. ⇒నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మందుల కొరత తీవ్రంగా ఉంది. వారం రోజులకు మందులు రాస్తే.. మూడు రోజుల మందులే ఇస్తున్నారు. కొన్ని రకాల మందులు లేకపోవడంతో బయట కొనాల్సిన పరిస్థితి నెలకొంది. ⇒బోధన్ ఆస్పత్రిలో రోగుల సంఖ్య పెరగడంతో వరండాలో బెడ్స్ వేసి వైద్యం అందిస్తున్నారు.డెంగీతో ఇద్దరి మృతిపాపన్నపేట(మెదక్)/సిద్దిపేట అర్బన్: వేర్వేరు జిల్లాల్లో డెంగీతో బాధపడుతూ ఇద్దరు మృతి చెందారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని చీకోడ్‌కు చెందిన వడ్ల రాజుకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు హర్షిత్చారి (11)కి వారం రోజుల క్రితం డెంగీ సోక గా.. కుటుంబ సభ్యులు మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి లో చేర్పించారు. అక్కడ నయం కాకపోవడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రి కి తరలించారు. అక్కడ డబ్బులు కట్టలేక, నిలోఫర్‌కు తరలించగా.. హర్షిత్ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించాడు. సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లికి చెందిన సుతారి కనకలక్ష్మి జ్వరంతో బాధ పడుతుండటంతో సిద్దిపేటలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించినా తగ్గకపోవడంతో.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడా నయం కాకపోవడంతో నిమ్స్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.ప్రైవేట్ ఆస్పత్రులపై ఉక్కుపాదం మోపుతాం ‘సాక్షి’తో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహఅడ్డగోలు వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తప్పవు బాధితులు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఆఫీసు కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయొచ్చు ‘సాక్షి’తో వైద్యారోగ్యశాఖ మంత్రి రాజనర్సింహసాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగీ పేరుతో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారన్న విషయం తన దృష్టికి వచి్చందని.. అలాంటి వాటిపై ఉక్కుపాదం మోపుతామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. ఈ అంశంపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులను పర్యవేక్షించేందుకు టాస్‌్కఫోర్స్ పనిచేస్తోందని.. ఇప్పటికే చాలా ప్రైవేట్ ఆస్పత్రులను పరిశీలించిందని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై శనివారం సమావేశం నిర్వహించనున్నామని చెప్పారు. డెంగీని గుర్తించేప్పుడు టెస్టు రిపోర్టులు సరిగా ఉంటున్నాయా లేదా పరిశీలిస్తామని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో చర్యలు ప్రారంభం అవుతాయన్నారు. ఆస్పత్రులు డెంగీ పరీక్షలు చేసిన, నిర్ధారణ అయిన వివరాలను ప్రభుత్వానికి ఇవ్వాలన్నారు. కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయండి: ప్రైవేట్ ఆస్పత్రులు అవసరం ఉన్నా, లేకున్నా టెస్టులు చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. ఈ పరిస్థితిని నియంత్రించాలంటే క్లినికల్ ఎస్టాబ్లి‹Ùమెంట్ యాక్ట్‌ను కఠినంగా అమలు చేయాల్సి ఉందన్నారు. ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో కంట్రోల్ రూం నడుస్తోందని.. విషజ్వరాల బాధితులు తమ సమస్యలపై దానికి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ‘‘సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు, క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారులంతా ఆస్పత్రుల పర్యటనకు వెళ్లాలని ఆదేశించాం. జిల్లాలో కలెక్టర్, వైద్యాధికారులు, మున్సిపల్, పంచాయతీరాజ్‌శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి.. పరిస్థితులను చక్కదిద్దాలని ఆదేశించాం. మందుల కొరత ఉండకూడదని చెప్పాం..’’ అని మంత్రి వెల్లడించారు. కోఠి ఆస్పత్రిలోని వెక్టార్ బార్న్ డిసీజెస్ విభాగం కంట్రోల్ రూం నంబర్ 94404 90716 -
చికున్ గున్యాకు తొలి వ్యాక్సిన్
న్యూఢిల్లీ: చికున్ గున్యాకు తొలిసారిగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచి్చంది. ఇక్స్చిక్ పేరిట రూపొందిన ఈ వ్యాక్సిన్‌కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతించింది. 18 ఏళ్లు, ఆ పైబడిన వారికి దీన్ని ఇచ్చేందుకు అనుమతిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘చికున్ గున్యా తీవ్ర వ్యాధికి, దీర్గకాలిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా వృద్ధులకు, అప్పటికే ఆరోగ్య సమస్యలున్న వారికి ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తుంది. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన తక్షణావసరాన్ని ఈ వ్యాక్సిన్ తీరుస్తుందని నమ్ముతున్నాం’’ అని వివరించింది. ‘‘ఇక్స్చిక్ వ్యాక్సిన్‌ను ఇప్పటికే 266 మంది రోగులపై ప్రయోగాత్మకంగా పరీక్షించగా మంచి ఫలితాలొచ్చాయి. ఉత్తర అమెరికాలో 3,500 మందికి వ్యాక్సిన్ ఇవ్వగా చక్కని గుణం కనిపించింది. 1.6 శాతం మందిలో మాత్రం తీవ్రమైన తలనొప్పి తదితర గున్యా తాలూకు లక్షణాలు కనిపించాయి. ఇద్దరిని ఆస్పత్రిలో చేర్చాల్సి వచి్చంది’’ అని ఎఫ్‌డీఏ సెంటర్ ఫర్ బయోలాజిక్స్ ఎవాల్యుయేషన్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ పీటర్ మార్క్స్ చెప్పారు. బయోటెక్ కంపెనీ ‘వాల్వెవా ఆ్రస్టియా’ ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. -
దడ పుట్టిస్తున్న డెంగీ
బనశంకరి: రాష్ట్రంలో అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలతో రోగకారకమైన ఈడీస్ దోమల ఉత్పత్తి పెరిగింది. దీంతో రాష్ట్రంలో డెంగీ, చికెన్‌గున్యా కేసులు హెచ్చుమీరుతున్నాయి. జ్వరాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. బాధితులతో ఆస్పత్రులు కిక్కిరిస్తున్నాయి. డెంగీ కేసుల సంఖ్య 10 వేలకు సమీపిస్తుండగా చికెన్‌గున్యా కేసులు వెయ్యికి దగ్గరలో ఉంది. ఇప్పటివరకు 68 వేల మందికిపైగా డెంగీ అనుమానితుల రక్త నమూనాలు సేకరించగా 9,559 మందిలో డెంగీ కేసులు వెలుగుచూశాయి. 22 వేల మందికి పైగా చికెన్‌గున్యా అనుమానితుల రక్త నమూనా సేకరించి పరీక్షించగా 982 మంది వ్యాధి బారినపడినట్లు తెలిసింది. డెంగీ లక్షణాలు విపరీతమైన జ్వరం, కంటి కిం నొప్పి, తీవ్రమైన తలనొప్పి, చేతులు కాళ్లు, కీళ్లు నొప్పులు, వాంతులు, తీవ్రమైన కడుపునొప్పి, నోరు, ముక్కులో రక్తస్రావం, చర్మంపై ఎరుపురంగులో గుల్లలు ఏర్పడటం, రక్తస్రావం గుర్తులు, ఎరువు రంగులో మలవిసర్జన, విపరీతమైన దాహం, స్పృహకోల్పోవడం, బీపీ పెరగడం. డెంగీ తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలు బెంగళూరు నగరంలో 5,511, మైసూరులో 454, ఉడుపిలో 429 డెంగీ కేసులు నమోదయ్యాయి. శివమొగ్గ 232, కలబురిగి 219, దక్షిణకన్నడ 210, విజయపుర 188, చిత్రదుర్గ 167, బెళగావి 154, దావణగెరె 152, హాసన 145, చిక్కమగళూరు 143, తుమకూరు 136, కొడగు 119, ధారవాడ 115, చామరాజనగర 113, మండ్య 108, కోలారులో 106 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఉచిత చికిత్స... ఎలాంటి జ్వరం బారినపడినప్పటికీ సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిస్థాయిలో చికిత్స లభిస్తుంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితరక్తపరీక్షలు, చికిత్స పొందవచ్చు. ఆరోగ్యశాఖ సూచన కేంద్రమార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన ముందుజాగ్రత్తచర్యలు తీసుకోవడం, ప్రజల్లో డెంగీ, చికెన్‌గున్యా గురించి అవగాహన కల్పించాలని ఆరోగ్యశాఖఅధికారులకు సూచిస్తూ ఆరోగ్యశాఖ కమిషనర్ డీ.రందీప్ ఆదేశాలు జారీచేశారు. చికెన్‌గున్యా లక్షణాలు ఇది కూడా ఈడీస్ జాతీయ దోమ కాటుతో ఒకరినుంచి మరొకరికి ప్రభలుతుంది. దీనికి నిర్దిష్టమైన చికిత్స లేదు. కానీ ఇది మరణాంతకం కాదు. జ్వరం, కీళ్లలో తీవ్రమైన నొప్పులు, వాపు కనబడుతుంది. రోగలక్షణాలు కనబడిన తక్షణమే డాక్టర్లును సంప్రదించాలి. -
సీజన్ వచ్చేసింది.. వణికించే వ్యాధుల జాబితా! లక్షణాలు, ముందు జాగ్రత్తలు
తొలకరి మొదలైంది.. రోజూ వర్షాలు కురుస్తుండడంతో వీధుల్లో నీరు నిల్వ చేరుతోంది. దోమలు వ్యాప్తి చెందుతుండడంతో సీజనల్ వ్యాధుల విజృంభణ ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచిస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వెల్లడిస్తున్నారు. జ్వరం.. జలుబు వచ్చిన వెంటనే చికిత్స పొందాలని కోరుతున్నారు. ప్రాణాంతకం కాకముందే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తున్నారు. చిత్తూరు రూరల్ : వర్షాకాలంలో ప్రజలు అధికంగా సీజనల్ వ్యాధుల బారిన పడుతుంటారు. వాతావరణ మార్పులతో తరచుగా జ్వరం, జలుబుతో బాధపడుతుంటారు. రోగాల వ్యాప్తికి ప్రధానంగా దోమలే కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇళ్ల వద్ద, వీధుల్లో నీరు నిల్వ చేరడంతో దోమలు విపరీతంగా పెరిగి వ్యాధుల వ్యాప్తికి కారకాలుగా మారుతున్నాయని వివరిస్తున్నారు. వైరల్ జ్వరాలను ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. ► తేలికపాటి జ్వరం.. జలుబు: సీజన్ మార్పుతో పెరిగే సూక్ష్మక్రిముల వల్ల వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందుతాయి. ఇవి గాలి, నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి . ఈ వైరల్ ఫీవర్ 3 నుంచి 7 రోజుల వరకు ఉంటుంది. జాగ్రత్తలు: భోజనం చేసే ముందు తప్పనిసరిగా చేతులు శుభ్ర పరుచుకోవాలి. నిల్వ పదార్థాలు తినకూడదుౖ తాజా పండ్లు తీసుకోవాలి . వర్షంలో తడవకూడదు . తడిచిన బట్టలలో ఎక్కువ సేపు ఉండ కూడదు. మాస్క్ తప్పనసరిగా ధరించాలి. ► చికెన్ గున్యా: దోమ కాటు వల్ల చికెన్ గున్యా వస్తుంది. తీవ్రమైన జ్వరం , కీళ్ల నొప్పులు చికెన్ గున్యా లక్ష ణాలు , ఇది సోకితే మొదటి రెండు , మూడు రోజులు జ్వరం ఎక్కువగా ఉంటుంది . జాగ్రత్తలు: ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి . కూలర్లు, టైర్లు మొదలైన వాటిలో నీరు నిల్వ చేరకుండా చూసుకోవాలి. శరీరం మొత్తం కప్పేలా దుస్తులు ధరించాలి . ► మలేరియా: తీవ్రమైన తలనొప్పి, వణుకుతో కూడిన అధిక జ్వరం మలేరియా లక్షణాలు . జ్వరం తగ్గి మళ్లీ వస్తుంది . ఆడ దోమ కాటుతో మలేరియా జిరమ్స్ శరీరంలో లోపలికి వెళ్తాయి . 14 రోజుల తర్వాత అధిక జ్వరం వస్తుంది . ఈ దోమలు నిల్వ ఉన్న వర్షపు నీటిలో వృద్ధి చెందుతాయి. జాగ్రత్తలు: దోమతెరలు వినియోగించాలి. ఇంటి చుట్టూ నీరు నిల్వ చేరకుండా చూసుకోవాలి. ఒకవేళ నీరు నిల్వ చేరితే అందులో కిరోసిన్ గాని పురుగు మందుగాని పిచికారీ చేయించాలి. ► డెంగీ: వైరల్ జ్వరం మాదిరి అకస్మాత్తుగా జ్వరం వస్తుంది. తీవ్రమైన ఒళ్లు నొప్పులు వస్తాయి. ఎముకలు విరిగిపోతున్నంత బాధ కలుగుతుంది . ఒక్కోసారి శరీర అంతర్భాగాల్లో రక్తస్రావం జరుగుతుంది. పొట్ట, కాళ్లు , చేతులు , ముఖం , వీపు భాగాల చర్మంపై ఎరగ్రా కందినట్టు చిన్నచిన్న గుల్లలు కనిపిస్తాయి . ఒక్కోసారి ప్లేట్లెట్స్ తగ్గిపోయి రోగి పరిస్థితి విషమంగా మారుతుంది . ఈడిస్ ఈజిప్టు అనే దోమ కాటుతో డెంగీ వ్యాప్తి చెందుతుంది. ఇళ్లలోని కుండీలు , ఓవర్ హెడ్ ట్యాంక్‌లు , ఎయిర్ కూలర్లు , పరిసరాల్లో నిర్లక్ష్యంగా పడేసిన కొబ్బరి బొండాలు , ప్లాస్టిక్ కప్పులు , పగిలిన సీసాలు , టైర్లు వంటి వాటిల్లో చేరిన వర్షపు నీటిలో గుడ్లు పెట్టి ఈడిస్ దోమలు వృద్ధి చెందుతాయి. జాగ్రత్తలు: ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి . చెత్తాచెదారం సమీపంలో ఉండకూడదు. ఇంట్లో దోమల మందు చల్లించుకోవాలి . దోమ తెరలు వాడడం శ్రేయస్కరం . వారంలో ఒక రోజు డ్రైడే పాటించాలి . ఇంటి పరిసరాల్లో కొబ్బరి బొండాలు , పాత టైర్లు , ఖాళీ డబ్బాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి . ఎయిర్ కూలర్లు , ఎయిర్ కండిషన్లు , పూలకుండీల్లో నీటిని తరచూ మార్చాలి. నీళ్ల ట్యాంకులపై సరైన మూతలను అమర్చాలి. శరీరమంతా కప్పి ఉంచుకునేలా దుస్తులు వేసుకోవాలి. ► హెపటైటిస్–ఏ: వర్షాకాలంలో హెపటైటిస్– ఎ ( కామెర్లు) వ్యాధి వచ్చే అవకాశం ఉంది . ఇది కాలేయ కణాలలో సంక్రమణ వల్ల కలుగుతుంది. కలుషితమైన ఆహార పదార్థాల నుంచి , తాగునీటి నుంచి రోగ కారకక్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి . కాలేయ వ్యాధి కారణం గా రక్తంలో బిలిరుబిన్ పరిమాణం పెరుగుతుంది. దీంతో శరీర భాగాలు పసుపు రంగులోకి మారిపోతాయి. జాగ్రత్తలు: శుభ్రమైన ఆహారం తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీటినే తాగాలి. బయట ఆహారం తినకూడదు. వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగించాలి. ► టైఫాయిడ్: వర్షాకాలంలో టైఫాయిడ్ కేసులు పెరిగే అవకాశం ఉంది . ఇది సాల్మొనెల్లా టైఫీ బ్యాక్టీరియా వల్ల వస్తుంది . కలుషిత నీరు తాగడం, ఆహారం తినడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. జాగ్రత్తలు: కాచి చల్లార్చిన నీటిని తాగాలి. బయట ఆహారం తినకూడదు. రోజూ కనీసం 3 నుంచి 4 లీటర్ల నీటిని సేవించాలి. ముఖ్యంగా పండ్ల రసం, కొబ్బరి నీరు, సూప్ వంటివి తీసుకోవడం మంచిది. అప్రమత్తత తప్పనిసరి వర్షాల కారణంగా ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి. తగు జాగ్రత్తలు తీసుకుంటే రోగాలు రాకుండా రక్షణ పొందవచ్చు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలి. ఏమాత్ర జ్వరం, జలుబు వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదు. వర్షంలో తడవకుండా చూసుకోవాలి. – శ్రీనివాసులు, డీఎంఓ -
డెంగీ, చికున్‌గున్యా వ్యాధులకు చెక్.. ఐసీఎంఆర్ శుభవార్త
పుదుచ్చేరి: డెంగీ, చికున్‌గున్యా వ్యాధులతో సతమతమవుతున్న భారతీయులకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) కొత్త శుభవార్త తెచ్చింది. ఈ రెండు వ్యాధుల వ్యాప్తికి కారణమయ్యే వైరస్లులేని లార్వాలను మాత్రమే ఉత్పత్తిచేసే ఆడ ఎడీస్ ఈజిప్టీ జాతి దోమలను ఐసీఎంఆర్, వెక్టర్ కంట్రోల్ రీసెర్చ్ సెంటర్(వీసీఆర్సీ–పుదుచ్చేరి)లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. వ్యాధికారక వైరస్లు ఉన్న మగ దోమలు ఈ ఆడదోమలతో కలిస్తే వైరస్‌రహిత లార్వాలు ఉత్పత్తి అవుతాయి. వీటిల్లో వైరస్లు ఉండవుకనుక వాటి నుంచి వచ్చే దోమలు డెంగీ, చికున్‌గున్యాలను వ్యాపింపచేయడం అసాధ్యం. డబ్ల్యూమేల్, డబ్ల్యూఅల్బీ వోల్బాకియా అనే రెండు కొత్త జాతుల ఆడ ఎడీస్ ఈజిప్టీ దోమలను శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. ఇందుకోసం వీరు గత నాలుగు సంవత్సరాలుగా పరిశోధనలో మునిగిపోయారు. అయితే, ఈ ప్రయోగానికి జనబాహుళ్యంలోకి తేవడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. డెంగీ, చికున్‌గున్యా వ్యాధుల వ్యాప్తి అధికంగా ఉన్న జనావాసాల్లో ప్రతీ వారం ఈ రకం ఆడదోమలను వదలాల్సి ఉంటుందని ఐసీఎంఆర్, వెక్టర్ కంట్రోల్ రీసెర్చ్ సెంటర్(వీసీఆర్సీ–పుదుచ్చేరి) డైరెక్టర్ డాక్టర్ అశ్వనీ కుమార్ చెప్పారు. చదవండి: దేశంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్.. ప్రపంచవ్యాప్తంగా 2వారాల్లో.. -
దోమకాటు: బోదకాలు, చికున్ గున్యా, కాలా అజర్.. ఇంకా
వానాకాలం వచ్చిందంటే వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. కానీ ఇదే సమయంలో మనిషికి ప్రమాదకరమైన దోమల్లాంటి కీటకాల విజృంభణ పెరుగుతుంది. అనాది కాలంగా దోమకాటు మనిషికి ప్రాణాంతకంగా ఉంటోంది. ఆధునిక యుగంలో వైద్య విజ్ఞానం పెరిగిన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. అందుకే దోమలే కదా, అని తీసిపారేయకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. భారత్ లాంటి ఉష్ణమండల దేశాల్లో, జనాభా అధికంగా ఉండే దేశాల్లో దోమలు పలురకాలుగా చెలరేగుతుంటాయి. వీటివల్ల రకరకాల వ్యాధులు సంభవించడమే కాకుండా, వీటిలో కొన్ని వ్యాధులు ప్రాణాంతకాలు కూడా! ప్రపంచ ఆరోగ్యసంస్థ లెక్కల ప్రకారం దోమకాటుకు భారత్‌తో సహా దక్షిణాసియాలో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. సో.. అజాగ్రత్త అస్సలు పనికిరాదు. దోమలు.. వ్యాధులు మనిషి రక్తాన్ని నేరుగా పీల్చే దోమలు అదే రక్తంలోకి పలురకాల సూక్ష్మ క్రిములను ప్రవేశపెడతాయి. దీంతో మనిషిలో పలు రకాల వ్యాధులు ప్రబలుతుంటాయి. భారత్‌లో దోమల ద్వారా వ్యాపించే కొన్ని ప్రమాదకరవ్యాధుల వివరాలు ఇలా ఉన్నాయి.. మలేరియా ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల వ్యాపిస్తుంది. ఉదయం, సాయంత్ర వేళ్లలో అనాఫిలస్ దోమకాటు వల్ల ప్లాస్మోడియం సోకుతుంటుంది. సోకిన తర్వాత అధిక జ్వరం, విపరీతమైన చలి, తలనొప్పి, విపరీతమైన చెమటలు, కండరాల నొప్పి లాంటి లక్షణాలు బయటపడతాయి. పిల్లలు, గర్భిణులు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారు, తరచూ ప్రయాణాలు చేసేవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం అతం్యంత ప్రాణాంతక వ్యాధిగా పరిగణించేవారు. ప్రస్తుతం చికిత్స అందుబాటులో ఉంది. తగ్గడానికి క్లోరోక్వినాన్ మందును వాడతారు. బోదకాలు ఒకప్పుడు భారత్‌లో పలు ప్రాంతాల్లో విపరీతంగా కనిపించేది. వుచరేరియా అనే పరాన్నజీవి వల్ల, క్యూలెక్స్ దోమ కాటుతో సంక్రమిస్తుంది. మనిషి లింఫాటిక్ వ్యవస్థలో పరాన్న జీవి చేరుకొని రక్తం నిండా దాని లార్వాని కోట్ల సంఖ్యలో విడుదల చేస్తుంది. దీనివల్ల లింఫ్ వ్యవస్థ దెబ్బతిని కణజాలాలు వాయడం, చర్మం బిరుసెక్కడం, అవయవాల్లో అనవసర ద్రవాలు చేరడం సంభవిస్తుంది. దీనివల్ల క్రమంగా వైకల్యం వస్తుంది. చికున్ గున్యా ఇది కూడా వైరస్ ద్వారా సోకుతుంది. ఏడిస్ దోమ కాటుతో సంక్రమిస్తుంది. తలనొప్పి, కీళ్లనొప్పులు, వెన్నునొప్పి, దద్దుర్లు కనిపిస్తాయి. లక్షణాలు వారం పాటు ఉండి తగ్గినా, నొప్పులు మాత్రం నెలల పాటు కొనసాగుతాయి. డెంగ్యూతో ఈ వ్యాధి లక్షణాలకు పోలిక ఉంటుంది. రక్తపరీక్షద్వారా నిర్ధారిస్తారు. కాలా అజర్ లెస్మోనియాసిస్ పరాన్నజీవి వల్ల సాండ్‌ఫ్లై కాటుతో సంక్రమిస్తుంది. వారాల పాటు తగ్గని జ్వరం, ప్లీహం ఉబ్బడం, రక్తహీనత, బరువు తగ్గడం వంటి లక్షణాలుంటాయి. తొందరగా చికిత్స అందకపోతే రెండేళ్లలో మరణించే ప్రమాదం ఉంటుంది. ఈ జ్వరం తగ్గిన తర్వాత చర్మం మీద దద్దుర్లు వస్తుంటాయి. జపనీస్ ఎన్సెఫలైటిస్ ఇది వైరస్ ద్వారా క్యూలెక్స్ దోమ కాటు వల్ల వస్తుంది. జ్వరం, వాంతులు వస్తాయి. ముదిరినప్పుడు మెదడుపై ప్రభావం చూపుతుంది. దీంతో మూర్చరోగం కూడా రావచ్చు. చిన్నపిల్లల్లో ప్రాణాంతకంగా మారుతుంది. డెంగ్యూ దోమల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటి. డెంగ్యూ వైరస్ ద్వారా సోకుతుంది. సోకిన 3–14 రోజుల్లో అధిక జ్వరం, వాంతులు, కీళ్లనొప్పులు, దద్దుర్లు లాంటి లక్షణాలు బయటపడతాయి. తగ్గడానికి నిర్దిష్టమైన మందులు లేవు. లక్షణాలను బట్టి మందులు వాడతారు. దాదాపు వారంలో తగ్గుతుంది. కానీ ఒక్కోసారి జ్వరం చాలా ఎక్కువైతే చర్మం కింద రక్తనాళాలు చిట్లడం లాంటి ప్రమాదాలు జరుగుతాయి. ఇలాంటప్పుడు ఆస్పత్రిలో చేరాల్సిఉంటుంది. దోమల ద్వారా వచ్చే వ్యాధులను తేలిగ్గా తీసుకోకూడదు. ఉదాహరణకు మలేరియా దాదాపు 90కిపైగా దేశాల్లో కనిపిస్తుంది. ఏటా దాదాపు 50 కోట్లమంది దీని బారిన పడుతుంటే, వీరిలో 27 లక్షల మంది మరణిస్తుంటారు. దోమల ద్వారా ఏటా 250 కోట్ల మంది పలు వ్యాధులబారిన పడుతున్నట్లు అంచనా. అందువల్ల ఇవి సోకిన తర్వాత చికిత్స కన్నా నివారణే మంచి మార్గమని నిపుణుల సలహా. చదవండి: National Nutrition Week: ఆరోగ్యానికి 5 చిట్కాలు.. అన్నీ తెలిసినవే! -
మరింత తగ్గిన దోమకాటు జ్వరాలు
సాక్షి, అమరావతి: ఈ ఏడాది దోమకాటు జ్వరాలు మరింతగా తగ్గాయి. జ్వరాల తీవ్రత లేకపోవడంతో పెద్ద ఉపశమనం లభించినట్లయింది. 2019–20తో పోలిస్తే 2020–21లో మలేరియా, డెంగీ, చికున్‌గున్యా కేసులు భారీగా తగ్గాయి. 2019తో పోలిస్తే 2020లోను, 2020తో పోలిస్తే 2021 రెండు నెలల్లోను ఈ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది అంటే జనవరి నుంచి ఫిబ్రవరి 21 వరకు ఏడు వారాల్లో లెక్కిస్తే చికున్‌గున్యా కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు. ఫిబ్రవరి చివరికి వేసవిలోకి వచ్చినట్లే. దీంతో దోమకాటు జ్వరాల ప్రమాదం తక్కువే. ఇక చూసుకోవాల్సిందల్లా కలుషిత నీటివల్ల వచ్చే డయేరియా, టైఫాయిడ్ వంటి కేసులను నియంత్రించుకోవడమే. కొద్దినెలలుగా కోవిడ్ కారణంగా ప్రభుత్వ యంత్రాంగం తీవ్ర ఒత్తిడిలో ఉన్నా దోమకాటు వ్యాధుల నియంత్రణపై పైచేయి సాధించింది. కలుషిత నీటి నియంత్రణకు కార్యాచరణ సాధారణంగా వేసవి కాలంలో కలుషిత నీరు తాగడం వల్ల డయేరియా, టైఫాయిడ్ వంటి కేసులు వస్తుంటాయి. వీటి నియంత్రణకు వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్‌శాఖ సంయుక్త కార్యాచరణతో ముందుకెళుతున్నాయి. పల్లెటూరి నుంచి పట్టణాల వరకు తాగునీరు పరిశుభ్రంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయా శాఖల అధికారులు దృష్టి సారించారు. 26 లక్షల దోమతెరల పంపిణీ లక్ష్యం రాష్ట్రంలో ఏజెన్సీతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా దోమల ప్రభావం ఎక్కువగా ఉన్న చోట దోమతెరల పంపిణీ సత్ఫలితాలు ఇస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి 25.94 లక్షల దోమతెరలు పంపిణీ చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 1.14 లక్షల దోమతెరలు పంపిణీ చేశారు. ఎల్ఎల్ఐఎన్ (లాంగ్ లాస్టింగ్ ఇన్సెక్టిసైడల్ నెట్స్) పేరుతో ఇచ్చే ఈ దోమతెరలు దోమల నుంచి ఊరటనివ్వగలవు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇవి మంచి ఫలితాలిచ్చాయి. వచ్చే సీజన్ నాటికి వీలైనంత వరకు దోమతెరలు పంపిణీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. తగ్గిన కేసుల తీవ్రత గతంతో పోలిస్తే దోమకాటు జ్వరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. మా ముందున్న లక్ష్యం సురక్షిత మంచినీరు అందించి డయేరియా, టైఫాయిడ్ వంటి జబ్బులు రాకుండా నియంత్రించడమే. దీనికోసం కార్యాచరణ రూపొందించాం. మిగతా శాఖలతో సమన్వయం చేసుకుంటున్నాం. – డాక్టర్ గీతాప్రసాదిని, ప్రజారోగ్య సంచాలకులు -
విజృంభిస్తున్న చికెన్‌గున్యా
మాగనూర్ (మక్తల్) : మండల కేంద్రంలో చికెన్‌గున్యా వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురై ప్రజలు మంచానపడ్డారు. ఈ వ్యాధికి గురైన పిల్లలు, వృద్ధుల పరిస్థితిని చూడలేకపోతున్నారు. వ్యాధిగ్రస్తులు పూర్తిగా నడవలేకపోవడంతోపాటు కీళ్లు పట్టేస్తుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ఉన్న సమయంలో ఈ వ్యాధి సోకడంతో రైతులు, రైతు కూలీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రికి వెళ్లి రూ.వేలు ఖర్చు చేస్తున్నా వ్యాధి నయం కావడం లేదు. ఇటు చేతిలో ఉన్న డబ్బులు అయిపోయి.. అటు వ్యవసాయ పనులు నిలిచిపోతుండడంతో తీవ్ర మానసిక ఆందోళనకు లోనవుతున్నారు. గత వారం రోజులుగా ఈ వ్యాధి గ్రామంలో అంతటా విజృంభిస్తుండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. గ్రామంలో మురుగు కాల్వల్లో నీరు నిల్వ ఉండడంతోపాటు అపరిశుభ్రత కారణంగా దోమ లు విపరీతంగా పెరుగుతున్నాయని, ఈ దోమల కాటు మూలంగానే వ్యాధి వ్యాపిస్తోందని వాపోతున్నారు. వారం పది రోజులుగా ప్రజలు మంచం పట్టినా ఇటు వైద్యశాఖ గాని.. అటు పంచాయతీ పాలకులు గాని ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శిబిరం ఏర్పాటు చేయాలి గ్రామంలో ఈ వ్యాధి తీవ్రస్థాయిలో ఉండడం మూలంగా ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించాలి. అలాగే ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న సిబ్బంది కూడా ఈ విషయమై పెద్దగా స్పందించడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలి. – సత్యమ్మ, బాధితురాలు -
ఇషాంత్‌కు చికున్‌గున్యా
తొలి టెస్టుకు దూరం కాన్పూర్: భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ ప్రస్తుతం చికున్‌గున్యాతో బాధపడుతున్నాడు. దీంతో తను రేపటి (గురువారం) నుంచి న్యూజిలాండ్‌తో జరిగే తొలి టెస్టుకు దూరం కానున్నాడు. అరుుతే ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్టు చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే తెలిపారు. ‘ఇషాంత్ చికున్‌గున్యా కారణంగా తొలి టెస్టు ఆడడం లేదు. అతడి స్థానంలో మరో ఆటగాడిని కూడా మేం కోరలేదు. మిగతా 14 మంది ఆటగాళ్ల నుంచే తుది జట్టును ఎన్నుకుంటాం’ అని కుంబ్లే వివరించారు. ఒకవేళ జట్టు ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగితే షమీ, భువనేశ్వర్ ఆడే అవకాశం ఉంది. -
ఇషాంత్ శర్మ బ్యాడ్ లక్
కాన్పూర్: టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ అనారోగ్యం కారణంగా న్యూజిలాండ్ తో జరగనున్న తొలి టెస్టుకు దూరమయ్యాడు. చికెన్ గున్యా బారిన పడడంతో అతడు చరిత్రాక టెస్టులో ఆడే అవకాశం కోల్పోయాడు. అతడి స్థానంలో మరో బౌలర్ కావాలని కోచ్ అనిల్ కుంబ్లే అడగలేదు. భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్ జట్టులో ఉన్నారు. న్యూజిలాండ్ జట్టులోనూ ఆల్ రౌండర్ జేమ్స్ నిషామ్ పక్క ఎముక గాయం కారణంగా కాన్పూర్ టెస్టుకు దూరమయ్యాడు. ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌతీ గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. స్వదేశానికి తిరిగి వెళ్లిపోయిన సౌతీ వన్డే సిరీస్ లో బరిలో దిగే అవకాశముంది. 72 టెస్టులు ఆడిన ఇషాంత్ శర్మ 36.71 సగటుతో 209 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ లో అతడు 8 వికెట్లు తీశాడు. ఈ నెల 22నుంచి న్యూజిలాండ్‌తో కాన్పూర్‌లో జరిగే టెస్టు టీమిండియాకు 500వ మ్యాచ్ కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. -
చాపకింద నీరులా విస్తరిస్తున్న చికున్ గున్యా
-
ఢిల్లీలో విజృంభిస్తున్న చికెన్ గున్యా
-
డెంగ్యూ ఎఫెక్ట్: డాక్టర్లకు సెలవులు రద్దు
రాష్ట్రంలో డెంగ్యూ, చికన్ గున్యాలతో పాటు వైరల్ జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైద్యుల సెలవులు రద్దుచేయాలని, వారి బదిలీలపై కూడా నెల రోజుల పాటు నిషేధం విధించాలని రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వాస్పత్రులకు వైరల్ జ్వరాలు, డెంగ్యూ, చికన్ గున్యాలతో చాలామంది వస్తున్నారని, ఇలాంటి సమయంలో తాము ఎక్కువగా రిస్క్ తీసుకోలేమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖాధికారి ఒకరు తెలిపారు. అందుకే వైద్యుల సెలవులు రద్దుచేశామని, అక్టోబర్ 14 వరకు వాళ్లకు బదిలీలు కూడా ఉండవని అన్నారు. మలేరియా, డెంగ్యూ, చికన్ గున్యా లక్షణాలతో వచ్చే పేషెంట్లకు వీలైనంత వెంటనే రక్త పరీక్షలు, ఇతర వైద్య పరీక్షలు చేయాలని సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. పేషెంట్లకు తాము ఈ పరీక్షలన్నీ ఉచితంగా చేస్తున్నామన్నారు. ఈ వ్యాధులకు సంబంధించిన మందులన్నీ ప్రభుత్వాస్పత్రులలో తగిన స్థాయిలో సిద్ధంగా ఉంచామని వివరించారు. రాష్ట్రంలోని జైపూర్, కోట, అల్వార్, భరత్పూర్ జిల్లాల్లో డెంగ్యూ తీవ్రత ఎక్కువగా ఉంది. -
మంత్రిగారు గూగుల్ చూసి చెప్పారట!!
వైద్య ప్రముఖులు చెప్పేదాని కంటే గూగులమ్మ చెప్పే విషయాల మీదే ఆరోగ్య మంత్రికి నమ్మకం ఎక్కువట. చికన్‌గున్యా వల్ల మరణాలు సంభవించవని, అలాగని గూగుల్ తనకు చెప్పిందని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ చెబుతున్నారు. అందుకే ఢిల్లీవాసులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఆ లక్షణాలు కనపడితే జాగ్రత్తలు తీసుకుని, ఆస్పత్రికి వెళ్తే చాలని చెప్పారు. అక్కడ వైద్యులు చెబితేనే ఆస్పత్రిలో చేరాలి తప్ప లేకపోతే అక్కర్లేదన్నారు. ఢిల్లీలో ఒకే ఆస్పత్రిలో నలుగురు పేషెంట్లు చికన్ గున్యాతో చనిపోయారని.. మరి దానిగురించి ఏమంటారని ప్రశ్నిస్తే, ప్రపంచంలో ఎక్కడా చికన్ గున్యా మరణాలు లేవని.. కేవలం ఢిల్లీలో ఒక ఆస్పత్రిలోనే ఎందుకు ఉంటున్నాయని ఎదురు ప్రశ్నించడంతో పాటు వాళ్లు అప్పటికే వయసుమీరి, రకరకాల సమస్యలతో బాధపడుతున్నట్లు తన విచారణలో తేలిందని చెప్పుకొచ్చారు. -
చికెన్ గున్యాపై కేంద్రమంత్రి సమీక్ష
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్న చికెన్ గున్యా తీవ్రతపై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జయప్రకాష్ నడ్డా సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ ప్రభుత్వానికి అవసరమైన సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. కానీ ఢిల్లీ ప్రభుత్వమే ప్రజల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ సరిగా స్పందించడం లేదని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా చికెన్‌గున్యాకు అవసరమైన మందుల కొరత ఎక్కడా లేదని వెల్లడించారు. ఇప్పటివరకు ఈ వ్యాధి బారిన పడి ఏడుగురు మరణించారు. మరోవైపు మలేరియా కేసులు కూడా ఢిల్లీలో అధికమవుతున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ఈ విషయాన్ని ప్రధానినే అడగండి.. తమ ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు లేవనే ధోరణిని ప్రదర్శిస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్, ప్రధాని అన్ని అధికారులు తమ గుప్పిట్లో పెట్టుకున్నారని, వ్యాధుల విజృంభణ గురించి వారినే నిలదీయండంటూ విస్తుపోయే ట్వీట్‌ను కేజ్రీవాల్ చేసిన సంగతి తెలిసిందే. మెడికల్‌గా ఈ వ్యాధి బారిన పడి ఎవరు మరణించడం లేదని, మీడియా మాత్రమే చికెన్ గున్యాతో మరణాలు సంభవిస్తున్నాయని ప్రచారం చేస్తుందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తప్పించుకుంటున్నారు. చికెన్ గున్యా కేసులపై విచారణకు ఆదేశించినట్టు పేర్కొంటున్నారు. -
వణికిస్తున్న చికున్‌గున్యా...
కొత్తపెంటలో వందమందికి పైగా రోగులు గ్రామంలో ఏర్పాటైన వైద్యశిబిరం మందుల పంపిణీ కొత్తపెంట(బొబ్బిలి రూరల్): మండలంలో కొత్తపెంట గ్రామాన్ని చికున్‌గున్యా కుదిపేస్తోంది. గ్రామంలో సుమారు 100మందికిపైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. గ్రామంలో సుమారు వారం రోజులుగా ఇక్కడి ప్రజలు జ్వరాలతో సతమతమవుతున్నారు. పెద్దింటి లక్ష్మి, లచ్చుపతుల పైడితల్లి, చోడవరపు ఎల్లమ్మ, సింహాచలం, బోడంగి పార్వతి, గడుతూరి నరసమ్మ, బేతనపల్లి లక్ష్మి, ఎల్.సూరమ్మ తదితరులు జ్వరం, ఒళ్లునొప్పులతో బాధపడుతున్నారు. ఇలా ఇంటికి ఇద్దరేసివంతున జ్వరాలబారిన పడి అవస్థలు పడుతున్నారు. విషయం తెలుసుకున్న వైద్యాధికారులు బుధవారం వైద్యశిబిరం ఏర్పాటుచేశారు. 46మందికి వైద్యసేవలు పిరిడి పీహెచ్సీ వైద్యసిబ్బంది డాక్టర్ కె.కె.వి.శోభారాణి ఆధ్వర్యంలో స్థానిక రామమందిరం వద్ద బుధవారం వైద్యశిబిరం ఏర్పాటుచేశారు. డాక్టర్ మణిమౌనిక, డాక్టర్ షేక్హలా వైద్యసేవలు అందించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. బుధవారం ఒక్కరోజే దాదాపు 46మందికి వైద్యసేవలు అందించారు. వైద్యసిబ్బంది గ్రామంలో కలియతిరిగి గ్రామస్థులకు పారిశుద్ధ్యం, నిల్వనీటిపై అవగాహన కల్పించారు. గ్రామసర్పంచ్ బేతనపల్లి బి.జయలక్ష్మి, వైఎస్ఆర్సీపీ నాయకుడు బేతనపల్లి శ్రీరాములునాయుడు గ్రామంలో కాలువల్లో బ్లీచింగ్ చల్లించి, గ్రామస్తులకు అవగాహన కల్పించి, వైద్యసహాయం అందేలా చర్యలు చేపట్టారు. ఎంపీడీఓ పి.చంద్రయ్య, పంచాయతీ కార్యదర్శి అల్లుభాస్కరరావు సేవలను పర్యవేక్షించారు. -
మశకం మశకేన ఔషధం!
‘ఉష్ణం ఉష్ణేన శీతలం’ అనే ఆర్యోక్తి తెలిసిందే. బ్రిటిష్ బయోటెక్ కంపెనీ ‘ఆక్సిటెక్’కు చెందిన వైద్య పరిశోధకులు మాత్రం ‘మశకం మశకేన ఔషధం’ అంటున్నారు. మలేరియా, చికున్ గున్యా, డెంగ్యూ వంటి నానా వ్యాధులను వ్యాపింపజేస్తూ, జనాలను వణికిస్తున్న దోమలకు విరుగుడుగా దోమల దండునే ప్రయోగించేందుకు వారు సమాయత్తమవుతున్నారు. వ్యాధికారక దోమలను అంతం చేసే మేలిరకం దోమల దండును వారు ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. అధికారికమైన అనుమతులు లభించినట్లయితే, ఈ ఏడాది అమెరికాలోని ఫ్లోరిడా కీస్ మస్కిటో కంట్రోల్ డిస్ట్రిక్ట్‌లో ప్రయోగాత్మకంగా ఈ దోమల దండును విడిచి పెట్టాలని భావిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే, త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా దోమల నివారణకు ఇదే పద్ధతిని పాటించే అవకాశాలు లేకపోలేదు. ఇదెలా సాధ్యం? దోమలకు దోమలతో విరుగుడు ఎలా సాధ్యమని ఎవరికైనా సందేహం కలగడం అసహజమేమీ కాదు. అయితే, జన్యుమార్పిడి పద్ధతి ద్వారా శాస్త్రవేత్తలు దీనిని సుసాధ్యం చేశారు. లేబొరేటరీలో రూపొందించిన డీఎన్ఏను దోమ గుడ్లకు ఇంజెక్ట్ చేశారు. వాటి నుంచి బయటకు వచ్చిన ఆడ, మగ దోమలకు, వాటి ద్వారా పుట్టిన తర్వాతి తరం దోమలకు ఇదే డీఎన్ఏ పాకేలా చేశారు. వీటి ద్వారా వ్యాధుల నియంత్రణ ఎలా సాధ్యమవుతుందంటే, వీటిని బయటకు విడిచిపెడితే, ఇవి సాధారణమైన దోమలతో కలిసిపోతాయి. జన్యుపరివర్తనం చెందిన మగదోమలు వ్యాధుల వ్యాప్తికి కారణమయ్యే ఆడదోమలతో జతకట్టే ప్రక్రియలో సాధారణ మగ దోమలను సునాయాసంగా జయిస్తాయి. జన్యుపరివర్తనం చెందిన మగదోమలతో జతకట్టిన వ్యాధికారక ఆడదోమలు పునరుత్పత్తి చేయలేవు. ఫలితంగా దోమల జనాభా క్రమంగా అంతరించి, వ్యాధుల వ్యాప్తి నిలిచిపోతుందని ‘ఆక్సిటెక్’ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జన్యుపరివర్తనం చేసిన ఈ దోమలను బయటకు విడిచిపెడితే ప్రాణాంతకమైన నాలుగు రకాల డెంగ్యూ వైరస్ సహా పలు రకాల వ్యాధుల వ్యాప్తి నిలిచిపోతుందని అంటున్నారు. ‘ఆక్సిటెక్’ కంపెనీ దోమలపై జన్యుపరివర్తన ప్రయోగాలు చాలాకాలంగానే చేస్తోంది. ఐదేళ్ల కిందట మలేసియా, బ్రెజిల్‌లలో కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో జన్యుపరివర్తనం చేసిన దోమలను విడిచిపెడితే, ఆ ప్రాంతాల్లో దోమల జనాభా ఏకంగా 80 శాతం మేరకు తగ్గింది. ‘ఆక్సిటెక్’ ప్రయోగం ప్రస్తుతం ఎఫ్‌డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) పరిశీలనలో ఉంది. ఎఫ్‌డీఏ అనుమతి లభిస్తే, మొదటగా ఎంపిక చేసిన ఫ్లోరిడా కీస్ డిస్ట్రిక్ట్‌లో ఈ దోమలను విడిచిపెడతారు. అక్కడి ఫలితాలు ఆశాజనకంగా ఉంటే, మిగిలిన ప్రాంతాలకూ విస్తరిస్తారు. -
నకిలీల ఖిల్లా
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో డెంగీ, చికున్‌గున్యా వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతుండగా ఈ పరిస్థితిని నకిలీ వైద్యులు సొమ్ము చేసుకుంటున్నారు. విరుదునగర్ జిల్లా నకిలీ వైద్యుల ఖిల్లాగా మారిపోవడంతో వీరివద్ద వైద్యం చేయించుకున్న 19 మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు. వారికి వైద్యం చేసిన 25 మంది నకిలీ వైద్యులు కటకటాల పాలయ్యారు. పగలు మాత్రమే కుట్టి, డెంగీ జ్వరానికి కారణమయ్యే దోమలు విరుదునగర్‌లో ఇటీవల విరుచుకుపడ్డాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారు డెంగీ జ్వరాల బారిన పడ్డారు. అక్షరాస్యత అంతగా లేని అమాయక పేద ప్రజలు ఆందోళనతో సమీపంలోని వైద్యుల వద్ద చికిత్స చేయించుకున్నారు. వైద్యం వికటించగా వారంరోజుల్లోనే 19 మంది మృత్యువాత పడ్డారు. స్వల్ప వ్యవధిలో డెంగీ మృతులు భారీగా పెరడంతో ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, పోలీసు యంత్రాంగం వేర్వేరుగా విచారణలు చేపట్టారు. ఆస్పత్రులను, జిల్లాలో పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. 50 ప్రొక్లయిన్ల ద్వారా పంటకాల్వల్లో పూడికలు తీయించి దోమల నివారణ చర్యలు చేపట్టారు. నివాస ప్రాంతాల్లో పందుల పెంపకం సాగిస్తున్న 20 మందిని అరెస్ట్ చేసి 150 పందులను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ వైద్యుల గుట్టురట్టు మృతుల కుటుంబాలను పరామర్శించిన సందర్భంలో చికిత్స చేసిన వైద్యుల వివరాలను అధికారులు కోరారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పరిశీలించడంతో జిల్లాలో పెద్ద సంఖ్యలో నకిలీ ైవె ద్యులు రాజ్యమేలుతున్నట్లు తేలింది. నకిలీ వైద్యులు అందించే వైద్యం వల్ల రోగం తగ్గకపోగా మరింత ముదిరి ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీ మహేశ్వరన్ నేతృత్వంలో పోలీసు అధికారుల బృందం అనుమానం ఉన్నచోట్ల తనిఖీలు చేపట్టింది. 8వ తరగతి వరకు చదివిన ఒకవ్యక్తి కొన్నాళ్లు ఆస్పత్రిలో వార్డుబాయ్‌గా పనిచేసిన అనుభవంతో వైద్యుడిగా అవతారం ఎత్తాడు. మరొక వ్యక్తి మందుల దుకాణంలో పొందిన అనుభవంతో వైద్యం ప్రారంభించాడు. సాత్తూరులో ఒక పెట్టెల వ్యాపారి తన ఇంటిలో ఫలసరుకులతోపాటూ ఫార్మసీ మందులను సైతం విక్రయించడాన్ని కనుగొన్నారు. అంతేకాదు తన వద్దకు వచ్చిన వినియోగదారుల యోగక్షేమాలు అడిగి కోరినవారికి ఇంజక్షన్లు సైతం ఇచ్చేవాడని తెలుసుకుని పోలీసులు నిర్ఘాంత పోయారు. మరికొందరు ప్రబుద్దులు మోటార్‌బైక్‌పై గ్రామగ్రామాన తిరుగుతూ వైద్య సేవలు అందిస్తున్నారని తెలుసుకున్నారు. అనేక రకాలైన 25 మంది నకిలీ వైద్యులను పోలీసులు అరెస్ట్ చేసి జైళ్లలోకి నెట్టారు. సంచార వైద్యులుగా చలామణి అవుతున్న వారి కోసం గాలిస్తున్నారు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం ప్రకారం నకిలీ వైద్యులపై కేసులు బనాయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షులు బాలకృష్ణన్ మాట్లాడుతూ, డెంగీ, చికున్ గున్యా వంటి తీవ్రస్థాయి వ్యాధులను నకలీ వైద్యులు సాధారణంగా తీసుకుని వైద్యం చేయడం వల్లనే మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు. నకిలీ వైద్యం కల్తీ కల్లు అంతటి ప్రమాదకరమన్నారు. న కిలీలపై అధికారులు నిఘాపెట్టి ఆగడాలను అరికట్టాలని ఆయన కోరాడు. -
‘బంగారు’ భూమిలోనూ విషాదమేనా!
ప్రభుత్వం కేవలం కోటి రూపాయలు మంజూరు చేస్తే 20 వేల మంది ఆదివాసీలు, అల్పాదాయ వర్గాల వారి ప్రాణాలను కాపాడవచ్చు. ఆత్మహత్యల పాలైన అన్నదాతల కుటుంబాలను ఆదుకోవచ్చు. బంగారు తెలంగాణలో మనసున్న మారాజులు ఇకనైనా స్పందిస్తారా? మంచం పట్టిన గోండు గూడెం... రక్తహీనతతో గర్భిణుల మృతి, పోషకాహార లోపంతో బాలికల మృతి, ఏజెన్సీలోని అన్ని గ్రామాల్లో ప్రాణాలు తీస్తున్న డెంగ్యూ, వణికిస్తున్న విష జ్వరాలు, ఆగని మరణాలు, ఇంటింటా జ్వరపీడితులు, వంద మంది మరణించినా పత్తాలేని అధికారులు, ఏజెన్సీ ఒక మృ త్యుశకటం, ఈ ఆదివాసీ మరణాలు బంగా రు తెలంగాణలో భాగమౌతాయా? ఇవి ఆదిలాబాద్ జిల్లాలో అన్ని పత్రికల్లో నిత్యం ప్రచురితమయ్యే వార్తలు. ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో, టైఫా యిడ్ పాజిటివ్ లేని తాండాలు, గూడేలు లేనే లేవు. జిల్లా వ్యాప్తంగా 200 మంది ఉన్న ప్రతి గూడెంలో 150 మంది టైఫా యిడ్, మలేరియా, డయేరియా, డెంగ్యూ, చికున్‌గున్యాలతో బాధపడుతున్నారు. ఆది వాసులు మరణించడానికి మహాయుద్ధమే అవసరంలేదు. వ్యాధులు ప్రబలితే, వారిని అలా వదిలివేస్తే చాలు. 2008-09 మధ్యకాలంలో మూడువేల మంది ఆదివా సీలు పోషకాహార లోపంతో, తీవ్ర అనారోగ్యంతో మరణిం చారు. నాటి నుంచి ప్రతి ఏటా 200, 150 మంది చనిపోతూనే ఉన్నారు. ఈ వర్షాకాలం తర్వాత వార్తాపత్రికల ప్రకారమే 100 మందికి పైగా ప్రజల ప్రాణాలు గాల్లో కలిశాయి. వీరి ప్రతి ప్రా ణాన్ని నిలబెట్టడం నుండే బంగారు తెలంగాణ పునర్ నిర్మాణం ప్రారంభం కావాలి. ఏటేటా జరుగుతున్న ఆదివాసీల చావు లకు స్పందించేవారు కరువై, మరణాలు సహజమైపోయాయి. ఆదివాసీ జీవితాలలో మరణాలకు బదులు ప్రాణాలను నిల బెట్టే వెలుగులను ఇన్నేళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా ఎందుకు నింపలేకపోతున్నారు? ఆదివాసీ గూడేలూ, దళితుల కాలనీ ల్లో, నేడు ఏ ఉత్సవాలూ లేవు. రోగాలతో మంచాలు పట్టిన ప్రజలు, మరణాల బారిన పడ్డ అనారోగ్యపు దుంఖఃసాగరాలు తప్ప. జిల్లాలో డెంగ్యూ, చికున్‌గున్యా లాంటి జబ్బులతో 100 మంది మరణిస్తే అందులో ఒక్కరి ప్రాణాలు కాపాడటానికి వీస మంత ప్రయత్నమైనా వివక్ష లేకుండా ఎందుకు జరగలేదు? స్వాతంత్య్రం సిద్ధించిన 68 ఏళ్ల తర్వాత నేటికీ ఆదివాసీ లకు రహదారులు లేవు. ఎక్కడైతే రోడ్డు, 108, 104 సౌకర్యం ఉండాలో అక్కడే వాటిని కల్పించలేదు. ఆదివాసీలకు అత్య వసర సమయాల్లో చికిత్స కోసం హెలికాప్టర్ ద్వారా అంబు లెన్స్ సౌకర్యం కల్పిస్తామని ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు హామీలు గుప్పించాయి కానీ, ఎన్నికలయ్యాక ఆ అంబులెన్స్ జాడ లేదు. హెలికాప్టర్ అంబులెన్స్ ఎటుపోయిం దోగానీ గూడేల్లో ఎడ్లబండ్లు నడవకపోతే అనారోగ్యంతో మనిషి పడుకున్న మంచమే నేటికీ పాడె అవుతోంది. అన్నదాతల ఆత్మహత్యల సరికొత్త కేంద్రం ఆదిలాబాద్ జిల్లా. ఇది అపారమైన సహజ వనరులు, ఖనిజ సంపదలున్న జిల్లా. ఒక రాష్ట్రంగా కాదు, దేశంగా మనగలిగే సకల వనరు లున్న జిల్లా. చిరపుంజి తదితర ప్రాంతాల సరసన వర్షం అధి కంగా పడే దేశంలోని 10 జిల్లాల్లో ఆదిలాబాద్ ఒకటి. 2013 సంవత్సరంలో కేవలం మూడు నెలల్లోపే 1500 టీఎంసీలకు పైగా నీరు జిల్లాలోని ప్రాణహిత, పెన్‌గంగా, గోదావరి నదుల నుంచి సముద్రంలో కలిసింది. కట్టిన పదుల ప్రాజెక్టులు, వందల చెరువులన్నీ పెద్దల పంపకాల పరమయ్యాయి. ఇక్కడ అతివృష్టి అయినా, అనావృష్టి అయినా, పెట్టుబడులు ఎక్కు వైనా, గిట్టుబాటు ధరలు లభించకున్నా అన్నదాతల ఆత్మహ త్యలు తప్పవు. గతేడాది 130 మంది రైతులు బలవన్మరణం పాలయ్యారు. తెలంగాణ స్వరాష్ట్రంలోనూ అన్నదాతలకు మేమున్నాం అనే భరోసా కల్పించకపోవడం వల్ల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఇది అత్యంత దురదృష్టకరం. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే ప్రతి కోటి రూపా యలతో 20 వేల మంది ఆదివాసీలు, అల్పాదాయ వర్గాల వారి ప్రాణాలను కాపాడవచ్చు. ఆత్మహత్యలు చేసుకుని దిక్కు లేక జీవిస్తున్న వందలాది మంది అన్నదాతల కుటుంబాలను ఆదుకోవచ్చు. ఆదివాసీల ప్రాణాలు నిలవాలంటే పక్కా రోడ్లు వేయాలి. జిల్లాలో ఆరోగ్య అత్యవసర స్థితిని ప్రకటించాలి. అంతవరకు ప్రత్యామ్నాయ అంబులెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఉచిత వైద్యం అందించాలి. కనీస కొనుగోలు శక్తిలేని ఆదివాసీలకు పౌష్టికాహార దినుసులన్నీ ఉచితంగా అందిం చాలి. ఆదివాసీల మరణాలు, అన్నదాతల ఆత్మహత్యలు ఆప డానికి మనసున్న మానవతా మూర్తులు ఇకనైనా కదలి స్పందించాలి. (వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు) -
చికన్‌గున్యా నిరోధానికి ఓ టీకా!
వైద్య పరిశోధనల్లో ఇదో మేలి మలుపు. ప్రమాదరహితమైన వైరస్ లాంటి కణాలు (వీఎల్పీ)లను ఉపయోగించి చికన్గున్యాను నిరోధించడానికి ఓ టీకా కనుగొన్నారు. తొలిదశలో 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న 25 మంది ఆరోగ్యవంతులైన వలంటీర్ల మీద ఈ టీకాను ప్రయోగించారు. ప్రతి వాలంటీర్‌కు మూడు డోసుల్లో ఈ టీకాలు ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ల రక్తంలో చికన్గున్యాను న్యూట్రలైజ్ చేసే యాంటీబాడీలను పరీక్షించారు. ఈ టీకాలు ఇచ్చిన వారికి ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదు. ఈ విషయాన్ని ప్రఖ్యాత జర్నల్ లాన్సెట్‌లో ప్రచురించారు. తొలిసారి టీకా ఇవ్వగానే తీసుకున్న వరిలో న్యూట్రలైజింగ్ యాంటీబాడీల రూపంలో ఒక రోగనిరోధక లక్షణం కనిపించింది. టీకాను అతి తక్కువ డోసులో ఇచ్చినా కూడా ప్రభావం ఉంది. రెండో డోస్ టీకా ఇచ్చేసారికి గ్రహీతలందరికీ పూర్తిస్థాయిలో యాంటీబాడీలు రూపొందాయి. ఇవి ఎక్కువ కాలం పాటు శరీరంలో ఉండటం, టీకా వేసిన ఆరు నెలల తర్వాత కూడా గ్రహీతలందరిలో కనిపించడం సానుకూల లక్షణమని పరిశోధనలకు నేతృత్వం వహించిన జూలీ లెడ్జర్వుడ్ తెలిపారు. ఆమె యూఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్‌లో పనిచేస్తున్నారు.