మండలంలో కొత్తపెంట గ్రామాన్ని చికున్‌గున్యా కుదిపేస్తోంది. గ్రామంలో సుమారు 100మందికిపైగా
కొత్తపెంటలో వందమందికి పైగా రోగులు
గ్రామంలో ఏర్పాటైన వైద్యశిబిరం మందుల పంపిణీ
కొత్తపెంట(బొబ్బిలి రూరల్): మండలంలో కొత్తపెంట గ్రామాన్ని చికున్‌గున్యా కుదిపేస్తోంది. గ్రామంలో సుమారు 100మందికిపైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. గ్రామంలో సుమారు వారం రోజులుగా ఇక్కడి ప్రజలు జ్వరాలతో సతమతమవుతున్నారు. పెద్దింటి లక్ష్మి, లచ్చుపతుల పైడితల్లి, చోడవరపు ఎల్లమ్మ, సింహాచలం, బోడంగి పార్వతి, గడుతూరి నరసమ్మ, బేతనపల్లి లక్ష్మి, ఎల్.సూరమ్మ తదితరులు జ్వరం, ఒళ్లునొప్పులతో బాధపడుతున్నారు. ఇలా ఇంటికి ఇద్దరేసివంతున జ్వరాలబారిన పడి అవస్థలు పడుతున్నారు. విషయం తెలుసుకున్న వైద్యాధికారులు బుధవారం వైద్యశిబిరం ఏర్పాటుచేశారు.
46మందికి వైద్యసేవలు
పిరిడి పీహెచ్‌సీ వైద్యసిబ్బంది డాక్టర్ కె.కె.వి.శోభారాణి ఆధ్వర్యంలో స్థానిక రామమందిరం వద్ద బుధవారం వైద్యశిబిరం ఏర్పాటుచేశారు. డాక్టర్ మణిమౌనిక, డాక్టర్ షేక్‌హలా వైద్యసేవలు అందించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. బుధవారం ఒక్కరోజే దాదాపు 46మందికి వైద్యసేవలు అందించారు. వైద్యసిబ్బంది గ్రామంలో కలియతిరిగి గ్రామస్థులకు పారిశుద్ధ్యం, నిల్వనీటిపై అవగాహన కల్పించారు. గ్రామసర్పంచ్ బేతనపల్లి బి.జయలక్ష్మి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు బేతనపల్లి శ్రీరాములునాయుడు గ్రామంలో కాలువల్లో బ్లీచింగ్ చల్లించి, గ్రామస్తులకు అవగాహన కల్పించి, వైద్యసహాయం అందేలా చర్యలు చేపట్టారు. ఎంపీడీఓ పి.చంద్రయ్య, పంచాయతీ కార్యదర్శి అల్లుభాస్కరరావు సేవలను పర్యవేక్షించారు.